2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
35 - పరశురాముడు అగస్త్యాశ్రమము చేరుట
సగర ఉవాచ :-
మునే పరమతత్త్వజ్ఞ ధ్యానజ్ఞానార్థకోవిద । ।
భగవద్భక్తిసంలీనమానసానుగ్రహః కృతః ॥
త్వయాపి హి మహాభాగ యతః శంససి సత్కథాః ।
శ్రుత్వా మృగముఖాత్సర్వం భార్గవస్య విచేష్టితమ్ ॥
భూతం భవద్భవిష్యం చ నారాయణకథాన్వితమ్ ।
పునః ప్రప్రచ్ఛ కిం నాథ తన్మే వద సవిస్తరమ్ ॥
వసిష్ఠ ఉవాచ :-
శ్రుణు రాజన్ ప్రవక్ష్యామి మృగస్య చరితం మహత్ ।
యథా పృష్టం తయా సోఽస్యై పర్ణయామాస తత్త్వవిత్ ॥
శ్రుత్వా తు చరితం తస్య భార్గవస్య మహాత్మనః ।
భూయః ప్రప్రచ్ఛ తం కాంతం జ్ఞానతత్త్వార్థమాదరాత్ ॥
మృగ్యువాచ :-
సాధు సాధు మహాభాగ కృతార్ధస్త్యం న సంశయః ।
యదస్య దర్శనాత్తేఽద్య జాతం జ్ఞానమతీంద్రియమ్ ॥
అధాతశ్చాత్మనః సర్వం మమాపి వద కారణమ్ ।
కర్మణా యేన సంప్రాప్తావావాo తిర్యక్ జనిం ప్రభో ॥
ఇతి వాక్యం సమాకర్ణ్య ప్రియాయాః న మృగః స్వయమ్ ।
వర్ణయామాస చరితం మృగ్యాశ్చైవాత్మనస్తదా ॥
మృగ ఉవాచ :-
శృణు ప్రియే । మహాభాగే యథాఽఽవాం మృగతాం గతౌ ।
సంసారేఽస్మిన్మహాభాగే భావోఽస్య భవకారణమ్ ॥
జీవస్య సదసద్భ్యాం హి కర్మభ్యామాగతః స్మృతిమ్ ।
పురా ద్రవిడదేశే తు నానాబుద్ధి సమాకులే ॥
బ్రాహ్మణానాం కులే వాఽహం జాతః కౌశికగోత్రిణామ్ ।
పితా మే శివదత్తోఽభూన్నామ్నా శాస్త్రవిశారదః ॥
తస్య పుత్రా వయం జాతాశ్చత్వారో ద్విజసత్తమాః ।
జ్యేష్ఠో రామోఽనుజస్తస్య ధమస్తస్యానుజః పృథుః ॥
చతుర్థోఽహం ప్రియే జాతో సూరీరిత్యభివిశ్రుతః ।
ఉపనీయ క్రమాత్సర్వాఞ్చవదత్తో మహాయశాః ॥
వేదానధ్యాపయామాస సాంగాంశ్చ సరహస్యకాన్ ।
చత్వారోఽపి వయం తత్ర వేదాధ్యయనతత్పరాః ॥
సగరుఁడిట్లడిగెను.
ఓ మునీ పరమ తత్వజ్ఞా ! ధ్యానజ్ఞానములయర్థములందు పండితా ! ఓ మహాభాగ ! నీవు చెప్పిన కథలచే భగవంతుని యందు సంలగ్నమయినవాడా మనస్సుతో దయకలిగి అనుగ్రహించితివి. పరశురాముని విచేష్టితములను, మృగముఖము నుండి భూతభవిష్య ద్వర్తమానమును నారాయణ కథాన్వితములను విని కూడ మరల ఏల ప్రశ్నించెను,
వసిష్ఠుఁడిట్లనెను.
ఓ రాజా ఆలకింపుము. ఆ మృగము యొక్క మహత్తర చరితము చేప్పెదను. ఆ మృగము తత్త్వవేత్తయట మృగీ యడిగిన సర్వమును తాను వివరించెను. మహాత్ముని యొక్క విశిష్టమయిన చరితమును విని జ్ఞానతత్త్వము తెలిసికొనుటకు ఆదరముతో మరల తన భర్తను మృగి యడిగేను.
ఆడలేడి (మృగి) ఇట్లడిగెను.
సాధు ! సాధు ! మహాభాగ ! నీవు నిజముగా కృతార్థుఁడవు. ఆ భార్గవుని దర్శించినంత మాత్రమున నీకు అతీంద్రియమయిన జ్ఞానము ఇప్పుడు కలిగినది. ఇక ఇప్పుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి సర్వము వివరింపుము. మనకీ తిర్యగ్టన్మ ఏ కర్మవలన కలిగినదో కారణము తెల్పుము”. అను వాక్యమును ప్రియురాలి వలన విని స్వయముగా ఆ మృగము తనయొక్కయు తన భార్యయొక్కయు చరిత్రము వర్ణించెను.
మృగమిట్లు చెప్పెను.
ఓ ప్రియురాలా ! మన మిర్వురమెట్లు మృగత్వమును పొందితిమో వినుము. ఓ పూజ్యురాలా ! ఈ జనన మరణాత్మక సంసారము నందు, జననమునకు కారణము భావము. (మన యొక్క ఆంతరభావము). ప్రపంచ సంబంధమయిన జీవితమున కిదియే కారణము. మనమాచరించు సదసత్కర్మల వలన జన్మ కలుగును. పూర్వమందు ద్రవిడదేశమున నానా సంపద్విభవములతో గూడిన బ్రాహ్మణుల కులమున నేను పుట్టితిని. ఆ బ్రాహ్మణులది కౌశిక గోత్రము. నాకు శివదత్తుఁడు తండ్రి. అతఁడో నానాశాస్త్ర కోవిదుఁడు. ఆతనికి మేము నల్వురము కుమారులము పుట్టితిమి. మేము ద్విజ సత్తములము, జ్యేష్ఠుఁడు రాముఁడు, అతని అనుజుఁడు ధముఁడు. అతని సోదరుడు పృథువు. ఇంక నాలుగవ వాఁడను. లోకమున ‘సూరీ’ అని విశ్రుతఁడను నేను. మహా యశస్వి శివదత్తుడు మాతండ్రి క్రమముగా మాకుపనయనమాచరించెను. వేదాంగ సపోతము, రహస్యయుతము వేదములను మాకు అధ్యాపనము గావించెను. మేము నల్వురము వేదాధ్యయన తత్పరులము.
గురుశుశ్రూషణే యుక్తా జాతా జ్ఞానపరాయణాః ।
గత్వారణ్యం ఫలాన్యంబుసమిత్కుశమృదోఽన్వహమ్ ॥
ఆనీయ పిత్రే దత్త్వాథ కుర్మోఽధ్యయనమేవ హి ।
ఏకదా తు వయం సర్వే సంప్రాప్తాః పర్వతే వనే ॥
ఔద్భిదం నామ లోలాక్షి కృతమాలాతటే స్థితమ్ ।
సర్వే స్నాత్వా మహానద్యాముషసి ప్రీతమానసాః ॥
దత్తార్ఘాః కృతజప్యాశ్చ సమారూఢా నగోత్తమమ్ ।
శాలస్తమాలైః ప్రియకైః పనసైః కోవిదారకైః ॥
సరళార్జునపూగైశ్చ ఖర్జూరైర్నారికేలకైః ।
జంబూభిః సహకారైశ్చ కట్ఫలైర్బృహతీద్రుమైః ॥
అన్యైర్నానావిధై ర్వృక్షైః పరార్థప్రతిపాద కైః ।
స్నిగ్ధచ్ఛాయైః సమాహృష్టనానాపక్షినీనాదితైః ॥
శార్దూలహరిభిర్భల్లైర్గండకైర్మృగనాభిభిః ।
గజేంద్రైశ్శరభాద్యైశ్చ సేవితం కందరాగతైః ॥
మల్లికాపాటలాకుందకర్ణికారకదంబకైః ।
సుగంధిభిర్వృతం చెన్యైర్వాతోద్ధూతపరాగిభిః ॥
నానామణిగణాకీర్ణైర్నీలపీతసితారుణైః ।
శృంగై స్సముల్లిఖంతం చ వ్యోమ కౌతుక సంయుతమ్ ॥
అత్చుచ్చపాతధ్వనిభిర్నర్ఘరైః కందరోద్గతైః ।
గర్ణంతమివ సంసక్తం వ్యాలాద్యైర్మృగపక్షిభిః ॥
తత్రాతికౌతుకా హృష్టదృష్టయో భ్రాతరో వయమ్ ।
నాస్మార్ష్మ చాత్మనాఽత్మానం విముక్తాశ్చ పరస్పరమ్ ॥
ఏతస్మిన్నంతరే చైకా మృగీ హ్యాగాత్పిపాసితా । నిర్ఘరాపాతశిరసీ పాతుకామా జలం ప్రీయే ॥
తస్యాః పిబంత్యాస్తు జలం శార్దూలోఽతిభయంకరః ।
తత్ర ప్రాప్తో యదృచ్ఛాతో జగృహే తాం భయార్దితామ్ ॥
అహం తధ్గ్రహణం పశ్యన్ భయేన ప్రపలాయితః ।
అత్యుచ్ఛవత్త్వాత్పతితో మృతశ్చైణీమనుస్మరన్ ॥
సా మృతా త్వం మృగీ జాతా మృగస్త్వాహమనుస్మరన్ ।
జాతో భద్రే న జానే వై క్వ గతా భ్రాతరోఽగ్రజాః ॥
ఏతన్మే స్మృతిమాపన్నం చరితం తవ చాత్మనః ।
భూతం భవిష్యం చ తథా శృణు భద్రే వదామ్యహమ్ ॥
గురు శిశ్రూషాయుక్తులము. జ్ఞాన పరాయణులమతిమి. ప్రతి దినము మేము అరణ్యమునకు పోయి ఫలములను, జలమును, సమిధలను, కుశలను, మృత్తును తీసికొని వచ్చి తండ్రికి సమర్పించెదము. తరువాత వేదాధ్యయనము చేయుదుము. ఒకనాఁడు మేమందరము “ఔద్భిదమనంబడు” పర్వతమును ఒక అడవిలో చేరితిమి. ఆ వనము కృతమాల అనెడు నదియొక్క తటమున నుండెను. ఉషఃకాలమందు మేమందరము ప్రీత మనసులమై ఆ నది యందు స్నానమాడితిమి. భగవంతున కర్యము లొసంగితిమి. జప మాచరించితిమి. ఆ పర్వతము నధిరోహించితిమి. అందు సరళ వృక్షములు, శాలతరువులు, తమాలములు ప్రియకములు, కోవిదారకములు, అర్జున తరువులు, పోకమానులు, ఖర్జూరములు, నారికేలములు, నేరేడు తరువులు, సహకార తరువులు, కట్ఫల వృక్షములు బృహతీ ద్రుమములు మరియు ఇతరములయిన నానా విధ వృక్షములు, పరప్రయోజనా పాదకములయినవి, దట్టమయిన నీడలతో కూడినవి కలవు. వానిఁజూచి సంహృష్ణులమైతిమీ. చేరిన నానా పక్షి నినాదములతో, పులులు, సింహములు, భల్ల మృగములు, గండకములు, కస్తూరి మృగములు, మదగజములు, శరభములు మొదలగు మృగములతో నొప్పిన కందరములు కలవు. మల్లిక, పాటల, కుంద, కర్ణికార, కదంబక, లతల పుష్ప సుగంధములతో గూడిన ఇతరములయిన పుష్పపరాగములు వాతోదూతములై పరీమళముల వెదజల్లుచుండెను. అందు నానామణులతో ఆకీర్ణములైన నీలపీత సితారుణ వర్ణములతో గూడిన పర్వత శిఖరములు ఆకాశమును నోరయుచుండెను. అధిక కౌతుకముతో నొప్పి యుండెను, కందరముల నుండియు, అత్యుచ్చ స్థానము నుండియు పడు కొండ సెలయేళ్లధ్వనులు వ్యాలాది మృగపక్షులు గర్జించు చున్నట్లుండెను. అట్టి పర్వత వాతావరణములో అత్యంత కౌతకముచే ఆకర్షింపఁబడిన నేత్రములతో సోదరులమయిన మేము ఒండొరులము మరచిపోయితిమీ. ఆ దృశ్యానంద పారవశ్యమున మేము పరస్పరము వీడిపోయితిమి. ఇంతలో ఒక ఆడలేడి (మృగి) దాహ పీడితయై ఆ నిర్ఝరము యొక్క పాతము యొక్క ఉపరిభాగమున నీరు త్రాగవలయునను కోరికతో వచ్చిచేరెను. ఆ మృగి నీటిని త్రాగుచుండ ఆకస్మికముగా ఒక భయంకరమైన శార్దూలమచ్చటకు యాదృచ్ఛికముగా వచ్చి, భయార్దితమయిన యాడ. లేడీని (మృగిని) పట్టుకొనెను. ఆ శార్దూలము దానిని పట్టుకొనుట చూచితిని. భయమున పలాయతుఁడనయితిని. ఆ ప్రదేశము మిట్ట పల్లములతో నుండుటచే ఆ మృగిని మనస్సున తలంచుకొనుచునే పడి మృతి చెందితినీ, ఆ మృగియు మరణించెను. అది మరణించి నీవుగా పుట్టినది. ప్రియురాలా ! నిన్నే తలపోయుచు నేను మృగముగా పుట్టితిని. నా అగ్రజులెందేగిరో నాకు తెలియదు. నిన్ను నన్ను గూర్చిన యీ కథ నా స్మృతి పథమునకు వచ్చినది. భూత భవిష్యద్వీషయములను వినుము. నేను వివరించెదను.
యోఽయం వా పృష్టసంలగ్నో వ్యాఘ్రో దూరస్థితోఽభవత్ ।
రామస్యాస్య భయాత్సోఽపి భక్షితో హరిణాధునా ॥
ప్రాణాంస్త్యక్త్వా విధానేన స్వర్గలోకం గమిష్యతి ।
ఆవాభ్యాం తు జలం పీతం మధ్యమే పుష్కరే త్విహ ॥
సందృష్టో భార్గవశ్చాయం సాక్షాద్విష్ణుస్వరూపదృక్ ।
తేనానేకభవోత్పన్నం పాతకం నాశమాగతమ్ ॥
అగస్త్యదర్శనం లబ్ధ్వా శ్రుత్వా స్తోత్రం గతిప్రదమ్ ।
గమిష్యామః శుభాంల్లోకాన్యేషు గత్వా న శోచతి ॥
ఇత్యేవముక్త్వా స మృగః ప్రియాయై ప్రియదర్శనః ।
వీరరామ ప్రసన్నాత్మా పశ్యన్ రామమనాతురః ॥
భార్గవః శ్రుతవాంశ్చైవ మృగోక్తం శిష్యసంయుతః ।
విస్మితోఽభూచ్చ రాజేంద్ర గంతుం కృతమతిస్తథా ॥
అకృతవ్రణసంయుక్తో హ్యగస్త్యస్యాశ్రమం ప్రతి ।
స్నాత్వా నిత్యక్రియాం కృత్వా ప్రతస్థే హర్షితో భృశమ్ ॥
రామేణ గచ్ఛతా మార్గే దృష్టో వ్యాధో మృతస్తదా ।
సింహస్య సంప్రహారేణ విస్మితేన మహాత్మనా ॥
అధ్యర్థయోజనం గత్వా కనిష్ఠం పుష్కరం ప్రతీ ।
స్నాత్వా మాధ్యాహ్నికీం సంధ్యాం చకారాతిముదాన్వితః ॥
హితం తదాత్మనః ప్రోక్తం మృగేణ స విచారయన్ ।
తావత్తత్పృష్ణసంలగ్నం మృగయుగ్మముపాగతమ్ ॥
పుష్కరే తు జలం పీత్వాభిషివ్యాత్మతనుం జలైః ।
పశ్యతో భార్గవస్యాగాద గస్త్యాశ్రమసంముఖమ్ ॥
రామోఽపి సంధ్యాం నిర్వర్త్య కుంభజస్యాశ్రమం యయౌ ।
విపద్గతం పుష్కరం తు పశ్యమానో మహామనాః ॥
విష్ణోః పదానీ నాగానాం కుండం సప్తర్షిసంస్థితమ్ ।
గత్వోపస్పృశ్య శుచ్యంభో జగామాగస్త్యసంశ్రయమ్ ॥
యచ్చ బ్రహ్మసుతా రాజన్ సమాయాతా సరస్వతీ ।
త్రిన్సంపూరయితుం కుండానగ్నిహోత్రస్స వై విధేః ॥
తత్ర తీరే శుభం పుణ్యం నానామునినిషేవితమ్ ।
దదర్శ మహదాశ్చర్యం భార్గవః కుంభజాశ్రమమ్ ॥
మృగేః సింహైః సహ గతైః సేవితం శాంతమానసైః ।
కుటరైలర్జునైర్నింబైః పారిభద్రధవేంగుదైః ॥
మనలను సన్నిహితముగా వెంటాడిన వ్యాధుఁడు రాముని వలన భయముచే వెనుకబడెను. ఆతనినిప్పుడొక సింహము చంపి భక్షించెను. (31) ఆ వ్యాధుడు ప్రాణములుబొసి, మనలను చంపని కారణమున, స్వర్గమున కరుగును. పుష్కర మధ్యమున మన మిర్వురము జలము త్రాగితీమి. భార్ణవ వంశీయుఁడు సాక్షాద్రూపము ధరించిన విష్ణువు అయిన రాముని మనము చూచితిమి. అందుచే అనేక జన్మల యందాచరించిన పాపము నాశనమయినది. (33) మనము అగస్త్యర్జీ దర్శనము చేసి, మోక్ష ప్రదమయిన స్తోత్రమును ఆలకించి శుభవంతములయిన లోకములను చేరగలము. ఆ లోకముల చేరిన పిమ్మట ఎవ్వరును విచారింపరు. దుఃఖమొందరు, అని ప్రియురాలి కొఱకు ఇట్లు చెప్పి, ఆ మృగము. చెప్పుట విరమించెను. అయ్యది ఎట్టి ఆత్రము లేక రాముని దర్శించుట వలన ప్రసన్నాత్ముఁడయ్యెను. (35) భార్గవ రాముఁడు మృగము చెప్పిన దెల్ల శిష్య సంయుక్తుఁడై వినెను. ఆశ్చర్య చకితుఁడయ్యెను. ఓ రాజా ! రాముఁడు అకృతవ్రణ ద్వితీయుఁడై అగస్త్యాశ్రమమునకుఁబోవ కృతమతియయ్యెను. రాముఁడు స్నానమాచరించి, నిత్యక్రియలు నిర్వర్తించి, మిక్కిలిగా సంతుష్టుఁడై బయలు దేరెను. రాముఁడు ప్రయాణించుచు, మార్గమునందు సింహ ప్రహారముచే మరణించిన వ్యాధుని చూచెను. ఆ మహాత్ముఁడా శ్చర్యపడెను. దిగువనున్న పుష్కరమునకు అర్ధయోజనము దూరముపోయి స్నానమాచరించి మాధ్యాహ్నిక సంధ్యను సంతోషముగా ఆచరించేను, రాముఁడు తనకు హితమయిన విషయమును మృగము చెప్పిన దానిని గూర్చి ఆలోచించుచుండ, తన వెనుక వచ్చుచున్న ఆ మృగద్వయము సమీపమునకు చేరెను. ఆ మృగద్వంద్వము పుష్కరోదకమును త్రాగి, నీటిని తమ శీరముల చల్లుకొనుట రాముఁడు చూచీ ఆశ్చర్యపడుచుండ ఆగస్త్యముని ఆశ్రమ పురోభాగమునకు ఆతడు వచ్చెను. విపద్దతమై యున్న (చెడియున్న?) పుష్కరమును చూచుచునే మహామతిమంతుఁడు రాముఁడు సంధ్యా క్రియాకలాపములను నిర్వర్తించి అగస్త్యాశ్రమమునకు పురోగమించెను. “విష్ణుపదములు”, నాగకుండము, (“సప్తర్షి సంస్థీతము”) అను పవిత్రస్థానములకు పోయి, పవిత్రోదకముల ఆచమాసము చేసి, అగస్త్యాశ్రమమునకు రాముఁడు వెళ్లెను. ఓ రాజా ! అందు, సరస్వతి బ్రహ్మ యొక్క అగ్నిహోత్రములకు కుండత్రయమును నింపుటకు వచ్చియుండెను. అచ్చట, ఆ పుష్కర తీరమున, బహుముని నిషేవితము శుభము పుణ్యము బహుధాఆశ్చర్యకరమునైన అగస్త్యుని ఆశ్రమమును రాముఁడు దర్శించెను. సహజ వైరమును వీడి సింహములు లేళ్లు కలిసి మెలసి శాంతమానసములతో ఆశ్రమమును సేవించుచుండెను. ఆశ్రమమున కుటరములు, అర్జున తరువులు, నింబములు, పారిభద్రములు, ధనములు, ఇంగుదములు.
ఖదీరాసనఖర్జూరైః సంకులం బదరీద్రుమైః ।
తత్ర ప్రవీశ్య వై రామో హ్యకృతవ్రణసంయుతః ॥
దదర్శ మునిమాసీనం కుంభజం శాంతమానసమ్ ।
స్తిమితోదసరఃప్రఖ్యం ధ్యాయంతం బ్రహ్మ శాశ్వతమ్ ॥
కౌశ్యాం వృష్యాం మార్గకృత్తిం వసానం పల్లవోటజే ।
ననామ స మహారాజ । స్వాభిధానం సముచ్చరన్ ॥
రామోఽస్మి జమదగ్న్యోఽహం భవంతం ద్రష్టుమాగతః ।
తద్విద్ధి ప్రణిపాతేన నమస్తే లోకభావన । ॥
ఇత్యుక్తవంతం రామం తు ఉన్మీల్య నయనే శనైః ।
దృష్ట్వా స్వాగతముచ్చార్య తస్మాయాసనమామీశత్ ॥
మధుపర్కం సమానీయ శిష్యేణ మునిపుంగవః ।
దదౌ ప్రప్రచ్ఛ కుశలం తపసశ్చ కులస్య చ ॥
స పృష్టస్తేన వై రామో ఘటోద్భవమువాచ హ ।
భవత్సందర్శనాదీశ కుశలం మమ సర్వతః ॥
కిం త్వేకం సంశయం జాతం ఛింధి స్వవచనామృతైః ।
మృగశ్చైకో మయా దృష్టో మధ్యమే పుష్కరే విభో ॥
తేనోక్తమఖిలం వృత్తం మమ భూతమనాగతమ్ ।
తచ్ఛృత్వా విస్మయావిష్టో భవచ్ఛరణమాగతః ॥
పాహి మాం కృపయా నాథ సాధయంతం మహామనుమ్ ।
శివేన దత్తం కవచం మమ సాధయతో గురో ॥
కృష్ణస్య సమతీతం తు సాధికం హి శరచ్ఛతమ్ ।
న చ సిద్ధిమవాప్తోఽహం తన్మే త్వం కృపయా వద ॥
వసిష్ఠ ఉవాచ :-
ఏవం ప్రశ్నం సమాకర్ణ్య రామస్య సుమహాత్మనః ।
క్షణం ధ్యాత్వా మహారాజ మృగోక్తం జ్ఞాతవాన్ హృదా ॥
మృగం చాపి సమాయాతం మృగ్యా సహ నిజాశ్రమే ।
శ్రోతుం కృష్ణామృతం స్తోత్రం సర్వం తత్కారణం మునిః ॥
విచార్యాశ్వాసయామాస భార్గవం స్వవచోఽమృతైః ।
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే పంచత్రింశత్తమోఽధ్యాయః ॥
ఖదిరములు, ఆసనములు, ఖర్జూరవృక్షములు, బదరీ వృక్షములు, దట్టముగా నుండెను. అకృతవ్రణ సంయుతుఁడై రాముఁడందు ప్రవేశించెను. అందు శాంత మానసుడు అయిన అగస్త్యుని నాసీనుడై యున్న వానిని చూచెను. ఆ మహర్షి శాశ్వత బ్రహ్మ వస్తువును గూర్చి తరంగచలనములు లేని సరస్సువలె అచంచలుడై ధ్యానించుచుండెను. ఆ మునీ పల్లవోటజము నందు కౌశ్యమును వృష్యమును పైన లేడి చర్మమును ధరించి, ఆసీనుఁడై యుండెను. తన నామము నుచ్చరించుచు జమదగ్యుడను, రాముఁడను, మీ దర్శనార్థము వచ్చితినీ, మత్ర్పణిపాతమున తద్విషయ మెఱుంగుఁడు. ఓ లోకభావన ! నమస్కారము అని నమస్కరించెను. ఇట్లు చెప్పుచున్న రాముని, నెమ్మదిగా నేత్రములనున్మీలించి, చూచి, స్వాగతము పలికెను. ఆతనీ కాసన మొసంగుమని మునీ ఆదేశించెను. శిష్యుఁడు మధుపర్కమును తీసికొని వచ్చెను. మునిపుంగవుఁడు రాముని కొసంగెను. రాముని యొక్క కుశలము గూర్చి, తపస్సు గూర్చి, ఇట్లు ప్రశ్నింపఁబడి రాముఁడు ఘటోద్భవునకిట్లు సమాధాన మొసంగెను. భవత్సందర్శన ప్రభావమున ఓ భగవాన్ నాకు సర్వత్ర కుశలము. అయినను ఒక్క సంశయమున్నది. భవద్వచనామృతముచే దానిని తీర్పుము. ఓ విభో ! పుష్కర మధ్యమున నొక మృగము నాచే చూడఁబడినది. నా భూత భవిష్యద్వృత్తాంతము నంతటినదీ చెప్పెను. దాని పలుకులు భవిష్యత్ జ్ఞానమును విని నేను విస్మయావిష్ణుఁడను. భవచ్చరణమునకు వచ్చితిని. ఓ మునినాథ ! ‘కృపయా మాం పాహి. సా మహామంత్రమును సిద్ధిమంతము చేయుము. శ్రీవుఁడొసంగీన మంత్రమును కృష్ణ కవచమును సాధించుచున్నాను. ‘ఓ గురూ ! నూరుకు మించిన సంవత్సరములు జపము సాగినది. తన్మూలమున సిద్ధిని పొందలేకుంటిని. దయతో కారణము చెప్పగోరెదను అనెను.
వసిష్ణుఁడిట్లు పలికెను.
మహాత్ముఁడయిన రాముని ఈ ప్రశ్నను విని అగస్త్యుండు క్షణకాలము ధ్యానించెను. మనస్సులో మృగము చెప్పిన దానినేజింగెను. తన యాశ్రమమునకు మృగీతో వచ్చిన మృగము నెఱింగెను. కృష్ణామృతమయిన స్తోత్రమును వినుటకు తత్కారణ మెలుంగుటకు ముని ఆలోచించెను. భార్గవుని స్వవచోమృతము ఆశ్వాసించెను.
ఇది వాయుప్రోక్తము మహాపురాణము ఆయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరిత్రమున ముప్పదియైదవ అధ్యాయము.
