2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

28వ అధ్యాయము

వసిష్ఠ ఉవాచ :-

స్వపంతమేత్య రాజానం సూతమాగధపందినః ।

ప్రబోధయితుమవ్యగ్రా జగురుచ్చైర్నిశోత్యయే ॥

వీణావేణురవోన్మిశ్రకలశాలతతానుగమ్ ।

సమస్తశ్రుతిసుశ్రావ్యప్రశస్తమధురస్వరమ్ ॥

స్నిగ్ధకంఠాః సువిస్పష్టమూర్ఛనాగ్రామసూచితమ్ ।

జగుర్గేయం మనోహారి వారమంద్రలయాన్వితమ్ ॥

ఊచుశ్చ తం మహాత్మానం రాజానం సూతమాగధాః ।

స్వపంతం వివిధ పాచో బుబోధయిషవః శనైః ॥

పశ్యాయమస్తమభ్యేతి రాజేంద్రేందుః పరాజితః ।

వివర్థమానయా నూనం తవ వక్త్రాంబుజియా ॥

ద్రష్టుం త్వదాననాంభోజం సముత్సుక ఇవాధునా ।

తమాంసి భిందన్నాదీత్యః సంప్రాప్తో హ్యుదయం విభో ॥

రాజన్నఖిల శీతాంశువంశమౌలిశిఖామణీ ।

నిద్రయాలం మహాబుద్దే ప్రతిబుద్ధ్యస్వ సాంప్రతమ్ ॥

ఇతి తేషాం వచః శృణ్వన్నబుద్యత మహీపతిః ।

క్షీరాబ్ధా శేషశయనాద్యథా పంకజలోచనః ॥

వినిద్రాక్షః సముత్థాయ కర్మ నైత్యక్రమాదరాత్ ।

చకారానహితః సమ్యగ్జయాదికమశేషతః ॥

దేవతామభివంద్యేష్టాం గాం దివ్య సగ్గంధభూషణః ।

కృత్వా దుర్వాంజనాదర్శమంగల్యాలంబనాని చ ॥

దత్త్వా దానాని చార్థిభ్యో నత్వా గోబ్రాహ్మణానపి ।

నిష్క్రమ్య చ పురాత్తస్మాదుపతస్థేచ భాస్కరమ్ ॥

తావదభ్యాయయుః సర్వే మంత్రిసామంతనాయకాః ।

రచితాంజలయో రాజన్నేముశ్చ నృపసత్తమమ్ ॥

తతః స తైః పరివృతః సముపేత్య తపోనిధిమ్ ।

ననామ పాదయోస్తస్య కిరీటేనార్కవర్చసా ॥

 వసిష్ఠుఁడిట్లనేను :-

 రాత్రి గడచెను. సూతులు వంది మాగధులు నిద్రించుచున్న రాజు సమీపమునకు అవ్యగులైచనిరి. రాజును ప్రబోధించుటకు (మేలు కోలుపుటకు) ఉచ్చైస్వరమున గోనమాలపించిరి, పొరీ కంఠ స్వరము వీణావేణు ధ్వనులతో సమ్మిశ్రము, మనోహరకరతాలములతో నను గతమయి, సమస్త శ్రుతియుతమై (యా మధుర స్వరము) ప్రశస్తమై సు(శ్రావ్యమై యొప్పెను. వారి కంఠములు మధురస్వరయుతములు, మిక్కిలి స్పష్టముగా నుండెను. సంగీత జ్ఞాన సంభరితములయిన మూర్చనా గ్రామ సూచితములు. వారు తారమంద్రలయాన్వితముగా మనోహ్లాదకరముగా గేయమును గానము చేసిరి. నిద్రపోవుచున్న మహాత్ముఁడయిన రాజునే మేలుకోల్పుటకు మెల్లగా మృదువుగా సూత మాగధులు వివిధ వచస్సులతో నిట్లు పలికిరి. “ఓ రాజేంద్ర ! చూడుము. ఇప్పుడు చంద్రుఁడస్తమించుచున్నాఁడు. ఏలయన, నిజముగా నీయొక్క ముఖ పద్మకాంతిచే వివృద్ధి పొందు నీ తేజస్సుచే చంద్రుఁడు పరాజితుఁడు. “ఓ విభూ ! ఇప్పుడు నీ ఆననాంభోజమును చూచు సముత్సుకముతో చీకట్లను పారద్రోలి సూర్యుం డుదయమును సంప్రాపుఁడైనాఁడు. ఓ రాజా ! చంద్రవంశమౌళి శిఖామణీ ! నిద్దుర చాలును. మహామతీ! ఇప్పుడు మేల్కొనుము'. అను వంది మాగధుల స్తోత్రపాఠములు విని క్షీరాబ్దియందలి శేషశయనమునుండీ పంకజ లోచనుఁడయిన విష్ణువు మేల్కొనునట్లు మహారాజు మేల్కొనెను, నేత్రములు నిద్ర నుండి విడివడ సముత్తితుఁడై మహారాజు ఆదరముతో నిత్యకర్మలను జయాదికములను అశేషముగ స్వస్థచిత్తుఁడై యాచరించెను, దివ్యములయిన మాలలతో గంధాదులతో అలంకరించుకొని, అభీష్ట దేవతలకు నమస్కరించీ ధేనువు నర్చించి, మాంగళ్యాలంబములయి దూర్వాంకురములను అంజనాదులను అద్దములను, మంగలద్రవ్యములను రాజు దర్శించెను. అర్హులకు దానము లొసంగేను. గో బ్రాహ్మణులకు నమస్కరించేను. నగరము నుండి నిష్క్రమించి భాస్కర్టోపస్థానమును ఆచరించెను. అంతలో మంత్రులు సామంతులు; సోయకులు రాజును సమీపీంచి దర్శించిరి. చేతులు కట్టుకొని సొంజలులై వారు రాజునకు నమస్కరించిరి, అంత రాజు స్వ పరి వారముతో పరివృతుఁడై తపోనిధిని సమీపించెను. సూర్యకాంతిని తిరస్కరించు కిరీటముతో రోజు ఆ మహాముని పాదములకు నమస్కరించెను.

ఆశీర్భిరభినంద్యాథ రాజానం మునిపుంగవః ।

ప్రశ్రయావనతం సామ్నా తమువాచాస్యతామితి ॥

తమాసీనం నరపతిం మహర్షి: ప్రీతమానసః ।

ఉవాచ రజనీ వ్యష్టా సుఖేన తవ కిం నృప ॥

అస్మాకమేవ రాజేంద్ర వనే వన్యేన జీవతామ్ ।

శక్యం మృగసధర్మాణాం యేన కేనాపి వర్తితుమ్ ॥

అరణ్యే నాగరాణాం తు స్థితిగత్యంతదుస్సహా ।

అనభ్యస్తంహి రాజేంద్ర నను సర్వం హి దుష్కరమ్ ॥

వనవాసపరిక్లేశం భవాన్యత్సానుగోఽసకృత్ ।

ఆప్తస్తు భవతో నూనం సా గౌరవసమున్నతిః ॥

ఇత్యుక్షస్తేన మునీనా స రాజా ప్రీతిపూర్వకమ్ ।

ప్రహసన్నివ తం భూయో వచనం ప్రత్యభాషత ॥

బ్రహ్మన్కీమనయా హ్యుక్త్యా దృష్టస్తే యాదృశో మహాన్ ।

అస్మాభిర్మహీమా యేన ఏస్మితం సకలం జగత్ ॥

భవత్ప్రభావసంజాతవిభవాహతచేతసః ।

ఇతో న గంతుమిచ్ఛంతి సైనికా మే మహామునే ॥

త్వాదృశానాం జగంతీహ ప్రభవైస్తపసాం విభో । ।

ధ్రియంతే సర్వదా నూనమచింత్యం బ్రహ్మవర్చసమ్ ॥

నైవ చిత్రం తవ విభో శక్నోతి తపసా భవాన్ ।

ధ్రువం కర్తుం హి లోకానామవస్థాత్రితయం క్రమాత్ ॥

సుదృష్టాతే తపస్సిద్ధిర్మహతీ లోకపూజితా ।

గమిష్యామి పురీం బ్రహ్మన్ననుజానాతు మాం భవాన్ ॥

 వసిష్ఠ ఉవాచ :-

ఇత్యుక్తస్తేన స మునిః కార్తవీర్యేణ సాదరమ్ ।

సంభావయిత్వా నితరాం తథ్తి ప్రత్యభాషత ॥

మునిపుంగవుఁడు వినయపూర్వముగా వంగిన రాజును ఆశీస్సులతో నభినందించెను. మధుర వాక్కులతో కూర్చుండుడని ముని పలికెను.. ఆసీనుఁడయిన నరపతిని గూర్చి, ప్రీతమానసుఁడై మహర్షి, “ఓ రాజా ! రాత్రి సుఖముగా గడచినదా? ఓ రాజేంద్ర ! మాకు వనమున లభించు వస్తువులతో వనమున జీవీతము, మృగధర్మములతో తుల్యముగా ఎట్లో దానితో నొకదానితో వర్తించుటయే శక్యము. అరణ్యమున నాగరిక జనులకుండుట అత్యంత దుస్సహము. ఓ రాజేంద్ర! అభ్యాస రహితమయినది వహించుట సర్వము దుష్కరము. మహారాజు అనుచర జనముతో పెక్కుమార్లు వనవాస క్షేశముననుభవించి యుండుట భవత్సమున్నతిని ఉగ్గడించెను.” అని ఆ మునివర్యునిచే ప్రీతి పూర్వకముగా చెప్పబడి, రాజు నవ్వుచు మరల నిట్లుత్తర మొసంగెను. “బ్రహ్మర్షి ! పలుకులతో నేమి ప్రయోజనము. మీ గొప్పతనము మాచే చూడఁబడినది. మేము విస్మయ మొందుటెంత? భవన్మహిమచే సర్వలోకము విస్మితావహ మయినది. భవత్రతాపముచే సంజాతమయిన మహా విభవముచే ఆశ్చర్య చకీతులయి, ఆహూతులయి, ఓ మహామునీ ! ఈ నా సైనికులు ఇచ్చటి నుండి నగరమునకు పోవనిచ్చగీంపకున్నారు.(21) త్వత్సదృశుల అచింత్యమయిన బ్రహ్మవర్చస్సు సర్వజగత్తున కాధార భూతమయినది. ఓ పరమపూజ్య ! సర్వ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు మీ తపః ప్రభావముచే ధ్రువీకరించుటకు మీరు సమర్గులరు, ఇదీ (మీరు చేసినది) యొక చిత్రము కాదు. లోక పూజితమయిన భవన్మహా తపస్సిద్ధీని చక్కగా దర్శించితిమీ ఇఁక పురమునకు పోవుదుము. నా కనుజ్ఞ దయచేయుఁడ.

 వసిష్ఠుఁడిట్లనెను :-

కార్తవీర్యునిచే నీట్లు చెప్పఁబడి మహాముని రాజును సాదరముగా గౌరవించేను. ‘అట్లే’ యని రాజునకు ప్రత్యుత్తర మిచ్చెను.

మునినా సమనుజ్ఞాతో వినీ ష్క్రమ్య తదాశ్రమాత్ ।

సైన్యైః పరివృతః సర్వైః సంప్రతస్థే పురీం ప్రతి ॥

స గచ్ఛంశ్చింతయామాస మనసా పథి పార్థివః ।

అహోఽస్య తపసః సిద్ధిర్లోకవిస్మయదాయినీ ॥

యయా లబ్ధే దృశీ ధేనుః సర్వకామదుహాం వరా ।

కింమే సకలరాజ్యేన యోగర్ద్యా వాప్యనల్పయా ॥

గోరత్నభూతా యదియం ధేనుర్మునివరే స్థితా అనయోత్పాదితా నూనం సంపత్స్వర్గసదామపి ॥

ఋద్ధమైంద్ర మపి వ్యక్తం పదం త్రైలోక్యపూజితమ్ ।

అస్యా ధేనోరహం మన్యే కలాం నార్హతి షోడశీమ్ ॥

ఇత్యేవం చింతయానం తం పశ్చాదభ్యేత్య పార్థివమ్ ।

చంద్రగుప్తో ఽబ్రవీన్మంత్రీ కృతాంజలిపుటస్తథా ॥

కీమర్థం రాశార్దూల పురీం ప్రతి గమిష్యసి ।

రక్షితేన చ రాజ్యేన పుర్యా వా కిం ఫలం తవ ॥

గోరత్నభూతా నృపతేర్యావధేనుర్నచాలయే ।

వర్తతే నార్థమపి తే రాజ్యం శూన్యం తవ ప్రభో । ॥

అన్యచ్చ దృష్టమాశ్చర్యం మయా రాజన్ శ్రుణుష్వ తత్ ।

భవనాని మనోజ్ఞాని మనోజ్ఞశ్చ తథా స్త్రియః ॥

ప్రాసాదా వివిధాకారా ధనం చాదృష్టసంక్షయమ్ ।

ధేనౌ తస్యాం క్షణేనైవ విలీనం పశ్యతో మమ ॥

తతపోవనమేవానీదీదానీం రాజసత్తమ । ।

ఏవం ప్రభావా సా యస్య తస్య కిం దుర్లభం భవేత్ ॥

తస్మాద్రత్నార్హ సత్వేన స్వీకర్తవ్యా హి గౌస్వయా ।

యది తేనుమతం కృత్యమాఖ్యేయమనుజీవిభిః ॥

రాజోవాచ :-

రాజు మునీవర్యునిచో సమనుజ్ఞాతుఁడై ఆ యాశ్రమము నుండి సర్వ సైన్య పరివృతుఁడై స్వనగరమునకు బయలుదేరెను. (26) పోపుచు మార్గములో రాజిట్లు ఆలోచించెను. ఈ మహాముని తపస్సు యొక్క సిద్ది లోక విస్మయ కారిణి. తపః ప్రభావము చేతనే, శ్రేష్ట మయినది, సర్వ కామములను సమకూర్చునదియు నయిన యీ ధేనువు లబ్దమయినది. నా యీ సమస్త రాజ్యముతో నేమి ప్రయోజనము? అనల్పమయిన యోగముచే పొందిన సంపదతో నేమి ప్రయోజనము? గోవులలో రత్న భూతమయిన ఈ ధేనువు మునివర్యునకున్నది. ఈ గోవు చేతనే స్వర్గ సంపదయంతయు నిజముగా ఉత్పాదింపఁబడినదే ! త్రైలోక్య పూజితమయిన ఇంద్రుని యొక్కయైశ్వర్యపదమంతయు ఈ ధేనువులోని పదియారవ భాగముతో సరితూగదని నేను తలంతును. ఈ విధముగా నాలోచించు రాజును తరువాత మంత్రియైన చంద్రగుప్తుడు సమీపించి, కృతాంజలి పుటుఁడై “ఓ రాజశార్దూల ! పట్టణమునకు ఎందుకు తిరిగి పోవుచున్నారని రాజ్యమును రక్షించుటచేగాని, పట్టణమును రక్షించుటచేగాని నీకేమి ప్రయోజనము? ఓ రాజా ! గోవులలో రత్నము వంటిదయిన యీ గోవు ఎంతకాలము ఇచ్చటి నుండి కదలింపఁబడి నీ గృహమును చేరదో అంతవరకు నీ రాజ్యము ఐశ్వర్య రహితము. శూన్య సదృశము. ఓ రాజ ! వేడొక ఆశ్చర్య జనకమయిన విషయము నాచే దర్శింపఁబడినది. దానిని వినుము. మనోజ్ఞములు భవనములు, స్త్రీలు మనోజ్ఞలు. ప్రాసాదములు వివిధాకారవంతములు.. ధనమే సంక్షయ రహితము. నేను చూచుచుండగనే అవి ఆ మహర్షి ధేనువు నందు క్షణములో విలీనములు. ఓ రాజా ! ఆ ధేనువు వలన క్షణములలోనవి పూర్వ తపోవనముగా నయినవి. అట్టి అద్భుత ప్రభావము గల ధేనువు కలవానికి ఏది దుర్లభము! రత్నహారి సామ్రాట్టగుట, రత్నమును పొంద నర్హతగల వాడవగుట, ఆ ధేనువు నీచే స్వీకరింపఁ దగినది. ఈ కార్యము మీ కంగీకృతమయినచో మీ అనుజీవులచే విషయము మునికి ఎటింపం దగినది”. అనెను. రాజు ఇట్లనెను.

ఏవమేవాహమప్యేనాం న ఇనామీత్యసాంప్రతమ్ ।

బ్రహ్మస్వం ఇపహర్తవ్యమితి మే శంకతే మనః ॥

ఏషం బ్రువంతం గాజావమిదమాహ పురోహితః ।

గర్గో మతిమతాం శ్రేష్ఠో గర్హయన్నివ భూపతే ॥

బ్రహ్మస్వం నాపహర్తవ్యమాపద్యపి కథంచన ।

బ్రహ్మస్వసదృశం లోకే దుర్జరం నేహ విద్యతే ॥

విషం హంత్యుపయోక్తారం లక్ష్యభూతం తు హైహయ ।

కులం సమూలం దహతి బ్రహ్మస్వరణిపావకః ॥

అనివార్యమిదం లోకే బ్రహ్మస్వం దుర్జరం విషమ్ ।

పుత్త్రపౌత్రాంతఫలదం విపాకకటు పార్థివ ॥

ఐశ్వర్యమూఢం హి మనః ప్రభూణామసదాత్మనామ్ ।

కిన్నామాసన్న కురుతే నేత్రాసద్వీప్రలోభితమ్ ॥

వేదాన్యస్త్వామృతే కోఽన్యో వినా దానాన్నృపోత్తమ । ।

ఆదానం చింతయానో హి బ్రాహ్మణీష్వభివాంఛతి ॥

ఈదృశస్త్వం మహాబాహో । కర్మ సజ్జననిందితమ్ ।

మాకృథాస్త్రృద్ధి లోకేషు యశోహానికరం తవ ॥

వంశే షుషోతీ జాతస్త్వం వదావ్యావాం, మహీభుజామ్ ।

యశాంసి కర్మణానేన సాంప్రతం మావ్యనీవవశః ॥

అహోఽసుజీవినః కించిద్భర్తారం వ్యసనార్ణమే।

శత్ప్రసాదసమున్నదా మజ్జయంత్యనయోన్ముఖాః ॥

శ్రీయా వికుర్వన్ పురుషకృత్యచింతే విచేతనః ।

తన్మతాసుప్రవృత్తిశ్చ, రాజా సద్యో విషీదతి ॥

అజ్ఞాతమునయో మంత్రి రాజాసమసయాoబుధౌ ।

అమ్మవా సహ దుర్బుద్ధిర్లోపానౌరీవ మజ్జయేత్ ॥

తస్మాత్వం రాశార్దూల మూఢస్య సయవరవి ।

మతమస్య సురద్భుద్ధేనువర్తితుమర్హసి ॥

ఏవం హి వదతస్తస్య స్వామీశ్రేయస్కరం వచః ।

ఆక్షిప్య మంత్రి రాజావమిదం భూయో హ్యభాషత । ॥

 ఇయ్యది ఈ విధముగా నేనాలోచింషను, ఏలయన. ఇది. అసాంప్రతము. ఆయోగ్యము అగుటవలన బ్రాహ్మణ ధనమపహరింపం బడరాది ఆది నా మనసు శంకించుచున్నది. అని యీ విధముగా పలుకు రాజుతో పురోహితుఁడిట్లనేమ ! ఆ పురోహితుఁడు. గర్గుఁడు. మతి. మంతులలో శ్రేష్ఠుఁడు. ఇతఁడు ధాజును గరించునట్లుండెను. బ్రాహ్మణస్వమును ఆపదయందు కూడ వెన్నడును హరింపరాదు. బ్రాహ్మణ స్వముతో సమముగా దుర్ధరఘునది జీరముకానిది ! ప్రపంచమున వేకటి లేదు. విషమ తన్ను ఉపయోగించిన వానినే చంపును. ఓ హైహయ ప్రభూ ! కాని బ్రాహ్మణ ధషమనెడ అరణినుండి కలిగిన అగ్నిహోత్రము కులమును సమూలముగా దహించును, ఇది అనివార్యమైనది. బ్రాహ్మణన్వము లోకమున దుర్జరము. జీర్ణించుకోవడానిది. ఇయ్యది పుత్త్రపౌత్ర - మరణాంతపటమయిషది. దాని వలని విపాకము. చాల దుర్భరమైనదీ అసదాత్యులు ప్రభష ముపస్తూ అశ్వర్యముచే మీమూతమయినది. ప్రలోభితమయిన క్షేత్రముచే దూరముగా వికర్షింపబడిన షేత్రము. గల. ఐశ్వర్య వడ మనస్సు. మీ రుష్కార్యము, వాచరింపదు? సీ రుష్ట మనస్సు యొక్క దుష్కర్మల ఫలములను వీవు కాక వేడొక్కడెవ్వఁడెలుంగును? ఓ రాజా ! నీవు బ్రాహ్మణుల నుండి, ఆదాషమును తీసికొని పోవుటను గూరి) ఆలోచించు చుంటివి. కానీ 'దాని మొసంగుటను కూర్చీ కాదు. నీవుదక్క వేటోక్కడైవ్వడిట్టిది యొనర్చును ఓ మహాబాహో ! ఉత్తముఁడవయిన నీవు (ఈదృశ్యుడవయిన నీవు) సజ్జన నిందీతమయిన కర్న ఆచరింపకుము. నిజముగా ఇట్టి కర్నీ లోకము లందలి నీ యశస్సునకు హానీకరము. నీవో, మహావంశమున నుద్భవించితిమి నీ వంశ రాజులందరు వదాన్యులు దాతలు. ఈ నిందితమరణన్న కర్మ నాచరించి నీ యశస్సును నాశము చేసికొనకుము. కొందరనుజీవకులున్నారు. వారు సహజమ దుష్మచరణానరులు, రాజు యొక్క ప్రషనత్వము షషేక్షించి ఆ ధుష్ట పరివారము 2జము దుఃఖ సముద్రము ముంచెదరు. ఐశ్వర్య మదమతుండైయెవడు స్వకృత్య విషయమున విచేతనుఁడై యుండునో, ఎవని యొక్క ప్రవర్తనము అనుయాయుల సలహాలననుసరించునో యతఁడు వెంటనే వినాశవము నొందును. ఇనుముతో చేయబడిన నావ వలె, దుష్ట బుద్దీయైన మంత్రి (అజ్ఞాతముని స్వభావుఁడు) దుర్బుద్ధి సముద్రములో తనతో సహా నిమజ్జనము చేయును. అందుచే రాజశార్దూల ! మూడుఁడయిన మంత్రి యొక్క మతమును అనుసరించుట తగదు.. అని యీ విధముగా స్వామికి శ్రేయస్కరముగా పలుకు వచస్సును త్రోసిపుచ్చి మంత్రి రాజుతో మరల నిట్లనియెను.

బ్రాహ్మణోఽయం స్వజాతీయహితమేవ సమీక్షతే ।

మహాంతి రాజ కార్యాణి ద్విజైర్వేత్తుం న శక్యతే ॥

రాజ్ఞైవ రాజకార్యాణి వేద్యాన్ని స్వమనీషయా ।

వినా వైభోజనాదానే కార్యం. విప్రో న విందతి ॥

బ్రాహ్మణో నామమంతవ్యో వందనీయశ్చ నిత్యశః ।

ప్రతిసంగ్రాహణీయశ్చ నాధికం సాధితం క్వచిత్ ॥

తస్మాత్ స్వీకృత్య తాం ధేనుం ప్రయాహి స్వపురం నృప ।

నోచేద్రాజ్యం పరిత్యజ్య గచ్ఛస్వ తవసే వనమ్ ॥

క్షమావత్వం బ్రాహ్మణానాం దండః క్షత్రస్య పార్థివ । ।

ప్రసహ్య హరణే వాపీ నాధర్మస్తే భవిష్యతి ॥

ప్రసహ్య హరణే దోషం యది సంపశ్యసే నృప ।

దత్త్వా మూల్యం గవాశ్వాద్యమృషేర్ధేను: ప్రగృహ్యతామ్ ॥

స్వీకర్తవ్యా హి సా ధేనుస్త్వయా త్వం రత్నభాగ్యతః ।

తపోధనాం హి కుతో రత్నసంగ్రహణాదరః ॥

తపోధనబలః శాంతః ప్రీతిమాన్స నృప త్వయి ।

తస్మాత్తే సర్వధా ధేనుం యాచీతః సంప్రదాస్యతి ॥

అథవా గోహిరణ్యాద్యం యదన్యదభివాంచిమ్ ।

సంగృహ్య విత్తం విపులం ధేనుం తాం ప్రతిదాస్యతి ॥

అను పేక్ష్యం మహద్రత్నం రాజ్ఞా వై భూతిమిచ్ఛతా ।

ఇతి మే వర్తతే బుద్ధిః కథం వా మన్యతే భవాన్

 రాజోవాచ :-

గత్వా త్వమేవ తం విప్రం ప్రసాద్య చ విశేషతః ।

దత్త్వా చాభీప్సితం తస్మై తాం గామానయ మంత్రిక ॥

 వసిష్ఠ ఉవాచ :-

ఏవముక్తస్తతో రాజ్ఞా స మంత్రీ విధిచోదితః ।

నివృత్య ప్రయయౌ శీఘ్రం జమదగ్నేరథాశ్రమమ్ ॥

గతే తు నృపతీ తస్మిన్నకృతవ్రణసంయుతః ।

సమిదాహరణార్థాయ రామోఽపి ప్రయణా వనమ్ ॥

 “ఇతఁడో బ్రాహ్మణుఁడు. స్వజాతి యొక్క హితమునే ఆకాంక్షించును. మహారాజకార్యములను బ్రాహ్మణులు తెలిసికొన శక్తులు కారు. రాజే, రాజ కార్యములను, స్వమనీషతో నేర్వవలయును. తెలిసికొన వలయును. బ్రాహ్మణుఁడు భోజనమును గ్రహించుట తక్క ఇతర కార్యములను నెఱుంగఁడు. బ్రాహ్మణుఁడు నిందింపబడ తగఁడు. నిత్యమును నతఁడు వందనీయుఁడు. బ్రాహ్మణులకేప్పుడు ధన మొసంగవలయును. దానము లాసంగవలయును. అంతకంటే నెప్పుడును అధికము వారి వలన సాధింపబడరాదు. అందుచే ఓ నృప ! ఆ ధేనువును స్వీకరించి, స్వపురమున కరుగుము. అట్లు కానిచో, రాజ్యమును పరిత్యజించి, అడవికి తపస్సాచరింప చనుము. ఓ రాజా ! బ్రాహ్మణులకు క్షమావత్త్వము. క్షత్రియునకో దండనము ధర్మము కావున బలాత్కరించి హరించుటలో ఎట్టి దోషము కానరాదు, గోవులు, అశ్వాదులు మొదలయిన వానిని మూల్యముగా నొసంగి, ఋషీశ్వరుని గోవును నీవు ప్రగ్రహించుము. ఆ ధేనువు నీచే స్వీకరింపఁదగినది. నీవు రత్న గ్రహణమున కరుఁడవు, తపోధనులకు రత్న సంగ్రహణము నందలి ఆదరణ మెక్కడ?  తపోధనుల బలము శాంతము. ఆతఁడు నీయెడల ప్రీతిగలవాఁడు. నీ యందు ప్రీతియుతుఁడు.. అందుచే, నీచే యాచితుఁడై తప్పక ధేనువు నొసంగును. లేదా, గోహిరణ్యాకములనో, అభివాంఛితమయిన వేకదానినో విపులమయిన విత్తమునో గ్రహించి యాతఁడు ఆ ధేనువును నీకొసంగగలఁడు. ఐశ్వర్యము నపేక్షించు రాజు మహారత్నమును నిర్లక్ష్యము చేయరాదు ఇట్లు నాకు తోచుచున్నది. ప్రభూ ! మీరెట్లు తలంతురు? అనెను, రాజిట్లు పలికెను. నీవే వెళ్లుము. ఆ విప్రుని విశేషముగా ప్రసన్నుని చేసికొనుము, ఆతని అభీప్సితము నొసంగుము. ఓ మంత్రి, ఆ గోవును తీసికొనిరమ్ము, అంత వసిష్ఠుఁడిట్లనెను. రాజుచే నీట్లు చెప్పఁబడి మంత్రి వీధిచోదితుఁడై వెనుకకు తిరిగి, జమదగ్ని యొక్క ఆశ్రమమునకు శీఘ్రముగా నరిగెను. రాజు నగరమునకు తిరిగి పోవగా, అకృతవణునితో కూడికొని, యజ్ఞ సమిధలను తెచ్చుట కొఱకు రాముఁడును వనమున కరిగెను.

తతః స మంత్రీ సబలః సమాసాద్య తదాశ్రయమ్ ।

ప్రణమ్య మునీశార్దూలమీదం వచనమబ్రవీత్ ॥

 చంద్రగుప్త ఉవాచ :-

బ్రహ్మన్ నృపతినాఽజ్ఞప్తం రాజా తు భువి రత్నభాక్ ।

రత్నభూతా చ ధేను: సా భువీ దోగ్ధ్రీష్వనుత్తమా ॥

తస్మాత్ రత్నం సువర్ణం వా మూల్యముక్త్వా యధోచితమ్ ।

ఆదాయ గోరత్న భూతాం ధేనుం మే దాతుమర్హసి ॥

జమదగ్ని రువాచ :-

హోమధేనురీయం మహ్యం న దాతవ్యా హి కస్య చిత్ ।

రాజా వదాన్యః స కథం బ్రహ్మస్వమభివాంఛతి ॥

మంత్ర్యువాచ :-

రత్నభార్డ్వేన నృపతిర్దేనుం తే ప్రతికాంక్షతి ।

గవా యుతేన తస్మాత్వం తస్మై తాం దాతుమర్హసి ॥

 జమదగ్నిరువాచ :-

క్రయవిక్రయయోర్నాహం కర్తా జాతు కథంచన ।

హవిర్ధానీం చ వై తస్మాన్నోత్సహే దాతుమంజసా ॥

మంత్ర్యువాచ :-

రాజార్ధేనాథ వా బ్రహ్మన్ సకలేనాపి భూభృతః ।

దేహి ధేనుమీమామేకాం తత్తే శ్రేయో భవిష్యతి ॥

జమదగ్నిరువాచ :-

జీవన్నాహం తు దాస్యామి వాసవస్యాపి దుర్మతే ।

గురుణా యాచితం కిం తే వచసా నృపతేః పునః ॥

మంత్ర్యువాచ :-

త్వమేవ స్వేచ్ఛయా రాజ్ఞే దేహి ధేనుం సుహృత్తయా ।

యథా బలేన నీతాయాం తస్యాం త్వం కిం కరిష్యసి ॥

 జమదగ్నిరువాచ :-

దాతా ద్విజానాం నృపతిః స యద్యప్యాహరిష్యతి ।

విప్రోఽహం కిం కరిష్యామి స్వేచ్ఛా వితరణం వీనా ॥

వసిష్ఠ ఉవాచ :-

ఇత్యేవముక్తః సంక్రుద్దః స మంత్రీ పాపచేతనః ।

ప్రసహ్య నేతుమారేభే మునేస్తస్య పయస్వినీమ్ ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదేఽష్టావింశతితమోఽధ్యాయః

తరువాత మంత్రి స్వబలగముతో గూడికొని ఆ ముని ఆశ్రమమును చేరెను. ముని శార్దూలునకు నమస్కరించి యిట్లు పలికెను.

చంద్రగుప్తుఁడిట్లు పలికెను.

ఓ బ్రహ్మన్ ! నృపతి యిట్లు ఆజ్ఞాపించెను. “రాజు రత్నభాజనుఁడు. ఈ ధేనువో రత్న తుల్యమయినది. అయ్యది భూమిలో గోవులయందు అత్యుత్తమమైనది. అందుచే, రత్నములనుగాని, సువర్ణమునుగానీ, యథోచితముగ మూల్యముగా చెప్పి, గోరత్న భూతమయిన ధేనువును, తీసికొనివచ్చి నాకీయ నరుఁడవు” అనీ. జమదగ్ని ఇట్లు ప్రత్యుత్తర మొసంగెను.

ఇది నా హోమధేనువు. ఇతరున కెవ్వనికి ఈయ దగినది కాదు, రాజు మహోవదాన్యుఁడు గౌత. బ్రాహ్మణస్వము నతఁడెట్లు కోరును అనెను.

మంత్రి ఇట్లనెను :

తాను రత్నభాకగుట రాజు నీ ధేనువు కాంక్షించెను, పదివేల గోవులకు ప్రతిగా రాజు నీ వలనంగోరెను. అందుచే నీవు రాజునకు ఈ గోవు నీయ నరుఁడవు.

జమదగ్ని ఇట్లనెను :

దీనిని అమ్ముటకు కానీ కోనుటకు కాని నేనెన్నడును కర్తను గాను. అయ్యది హవిరానీ (హవిస్సు ధరించునది) అందుచే నేనీ గోవు నీయంగోరను. (70)

మంత్రీ ఇట్లనెను :

ఓ బ్రాహ్మణా ! రాజ్యార్ధముగాని సకలరాజ్యముగాని స్వీకరించి రాజునకే గోవు నిమ్ము. ఈ ఒక్క ధేను నొసంగుటవలన నీకు శ్రేయస్సు కలుగును.

జమదగ్నీ ఇట్లనెను :

ఓ దుర్మతీ ! బ్రతికి యుండఁగా నా బొందిలో జీవముండఁగా ఇంద్రునికైనను బృహస్పతి వచ్చి యాచించినను దీని నీయను. అట్టీండను నీవు వచ్చి యడిగి నంత మాత్రాన, రాజున కేట్లో సంగుదును!

మంత్రీ ఇట్లనెను ;

స్నేహ భావ పురస్సరముగా నీవే స్వయముగా స్వేచ్ఛగా రాజునకు గోవునిమ్ము. బలాత్కారముగా తీసికొని పోయినచో అప్పుడు నీవేమి చేయగలవు!

జమదగ్ని ఇట్లనెను :

బ్రాహ్మణులకు దాత రాజు. ఆతఁడే అపహరించిన, నేనో విప్రుడను. ఏమీ చేయఁగలను ! స్వేచ్ఛా వితరణముగాక -వసిష్ణుఁడనెను.

ఇట్లు చెప్పఁబడి పాప చేతనుడయిన ఆ మంత్రి క్రుద్ధుఁడై ఆ మునీశ్వరుని యొక్క ధేనువును బలాత్కారముగా తీసికొనిపోవ ఆరంభించెను.

ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువది యెనిమిదవ అధ్యాయము.