2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
8 - ఋషివంశము - అత్రి -వశిష్ఠుఁడు
ఋషయ ఊచుః :-
ఏవం ప్రజాసు సృష్టాసు కశ్యపేన మహాత్మనా ।
ప్రతిష్ఠితాసు సర్వాసు చరాసు స్థావరాసు చ ॥
అభిషిచ్యాధిపత్యేషు తేషాం ముఖ్యాన్ ప్రజాపతిః ।
తతః క్రమేణ రాజ్యాని ఆదేష్టుముపచక్రమే ॥
ద్విజానాం వీరుధాం చైవ నక్షత్రాణాం గ్రహైః సహ ।
యజ్ఞానాం తపసాం చైవ సోమం రాజ్యేనిభ్యషేచయత్ ॥
బృహస్పతిం తు విశ్వేషాం దదావంగిరసాం పతిమ్ ।
భృగూణామధిపం చైవ కావ్యం రాజ్యేవిథ్యషేచయత్ ॥
ఆదిత్యానాం పునర్విష్ణుం వసూనామథపావకమ్ ।
ప్రజాపతీనాం దక్షం చ మరుతోమథవాసవమ్ ॥
దైత్యానామథ రాజానం ప్రహ్లాదం దితీనందనమ్ ।
నారాయణం తు సాధ్యానాం రుద్రాణాం చ వృషధ్వజమ్ ॥
విప్రచిత్తిం చ రాజానం దానవాసాంయథాదిశత్ ।
అపాం చ వరుణం రాజ్యే రాజ్ఞాం వైశ్రవణం తథా ॥
యక్షాణాం రాక్షసానాం చ పార్థివానాం ధనస్య చ ।
వైవస్వతం పితృణాం చ యమం రాజ్యేఎ_భ్యāచయత్ ॥
సర్వభూతపిశాచానాం గిరీశం శూలపాణీనం ।
శైలాసాం హిమవంతం చ నదీనామథ సాగరమ్ ॥
గంధర్వాణామధిపతిం చక్రే చిత్రరథం తదా ।
ఉచ్చైశ్శవసమశ్వానాం రాజానం చాభ్యāచయత్ ॥
మృగాణామథ శార్దూలం గోవృషం చ కకుద్మినామ్ ।
పక్షిణామథ సర్వేషాం గరుడం పఠతాం వరమ్ ॥
గంథానాం మరుతాం చైవ భూతానామశరీరిణామ్ ।
సమకాలబలానాం చ వాయుధ బలవతాం వరమ్ ॥
సర్వేషాం దంషీణాం శేషం నాగానామథ వాసుకిమ్ ।
సరీసృపాణాం సరాణాం పన్నగానాం చ తక్షకమ్ ॥
సాగరాణాం నదీనాం చ మేఘాసం వర్షితస్య చ ।
ఆదిత్యానామన్యతమం పర్జన్యమభిషిక్తవాన్ ॥
సర్వాపురోగణానాం చ కామదేవం తథా ప్రభుమ్ ।
ఋతుసామథ మాసానామార్తవానాం తథైవ చ ॥
యక్షాణాం చ విపక్షాణాం ముహూర్తానాం చ పర్వణామ్ ।
కాలాకాష్ఠా ప్రమాణానాం గతేరయనయోస్తథా ॥
సూతుఁడు చెప్పెను :
మహాత్ముఁడైన కశ్యపమహర్షి చరాచరమగు సమస్త సృష్టిని కల్గించి ప్రతిష్టించిన తరువాత, వారలలో ముఖ్యులను ఆధిపత్యముల యందభిషేకించి తరువాత వారీవారి రాజ్యములను క్రమముగా నాదేశింప మొదలిడెను. బ్రాహ్మణులకు, లతలకు గ్రహములతో సహా నక్షత్రములకు, యజ్ఞములకు తపస్సులకు, సోముని రాజుగా కశ్యపుండభిషేకించెను. సర్వాంగిరసుల యొక్క ఆధిపత్యము బృహస్పతి కొసంగెను. ఆతఁడు భృగువులకు అధిపతిగా రాజ్యము నందు శుక్రునభిషేకించెను. (4) ఆదిత్యులకు విష్ణువును, వసువులకు పావకుని, ప్రజాపతులకు, దక్షుని, వాసవుని మరుత్తులకు ఆతఁడధిపతులనుగాఁ జేసెను. (5) దీతీ యొక్క ఆనంద వర్ధనుఁడయిన (దితినందనుని) ప్రహ్లాదుని దైత్యులకును,నారాయణునీ సాధ్యులకును, వృషధ్వజుని రుద్రులకును రాజుగా జేసెను. అతఁడు విప్రచిత్తినీ దానవులకు రాజు కమ్మని ఆదేశించెను. నీటిని పాలించుటకు వరుణుని, వైశ్రవణుని రాజులకు రాజుగా ఆతఁడు చేసెను. రాక్షసులకు, యక్షులకు ధనమునకు వైశ్రవణునే రాజు చేసెను. వివస్వంతుని కుమారుఁడయిన యముని పితరుల రాజ్యము నందభిషకేకించెను, (8) సర్వభూతములకు, పిశాచములకు శూలపాణియైన గిరీశుని, శైలములకు హిమవంతుని, నదులకెల్లను సాగరుని, గంధర్వులకు చిత్రరథుని అశ్వములకెల్లను ఉచ్చైశ్రవమును రాజుగా నభిషేకించెను. మృగములకు శార్దూలమును, మూపురములు కల జంతువుల కెల్లను అబోతును (గోవృషభమును) ఆకాశమున నేగురు వానియందు శ్రేష్ఠమయిన గరుడుని సర్వపక్షులకును అధిపతిగా జేసెను. కశ్యపుడు, మనోజ్ఞములయిన గంధములకు మరుత్తులకు, అశరీరులయిన భూతములకు సమకాలబలులకు బలవంతుఁడయిన వాయువు నధిపతిని చేసెను. (12) దంష్టలు (కోరలుగల) గల సర్వజంతువులకు శేషుని, వాసుకినీ, పన్నగులకు నేలమీద ప్రాకునట్టి అఖిల సరీసృపములకు సర్పములకు పన్నగములకు, తక్షకుని రాజుగా చేసెను. ఆదిత్యులలో నొకఁడయిన పర్జన్యునీ, సాగరములకు, నదులకు, మేఘములకు సామాన్య వర్షములకు రాజుగా కశ్యపుఁడభీషేకించెను. సమస్తాపురోగణములకు కామదేవుని ప్రభువుగా నొనర్చెను. ఋతువులకు, మాసములకు, ఆర్తవములకు (ఋతుసంబంధములకు) పక్షములకు, విపక్షములకు, ముహూర్తములకు, పర్వములకు, కాలములకు, కాష్ఠ ప్రమాణాదులకు, అయనములకు గ్రహగణితములకు, యోగములకు అధిపతిగా సంవత్సరమును కశ్యపుఁడు చేసెను. కాల, కాష్ట్రములు, కాల ప్రమాణములు, నక్షత్రమునకు సంబంధించినది యోగము.
గణితస్యాథ యోగస్య చక్రే సంవత్సరం ప్రభుమ్ ।
ప్రజాపతేర్విరజసః పూర్వస్యాం దిశి విశ్రుతమ్ ॥
పుత్రం నామ్నా సుధన్వానం రాజానం సోభ్య షేచయత్ ।
దక్షిణస్యాం దిశి తథా కర్దమస్య ప్రజాపతేః ॥
పుత్తం శంఖపదం నామ రాజానం సోథ్యషేచయత్ ।
పశ్చిమస్యాం దిశి తథా రజసః పుత్రమచ్యుతమ్ ॥
కేతుమంతం మహాత్మానం రాజానం చాభ్య షేచయత్ ।
తథా హిరణ్యరోమాణం పర్జన్యస ప్రజాపతేః ॥
ఉదీచ్యాం దిశి దుర్ధర్షపుత్రం రాజేభ్యషేచయత్ ।
మనుష్యాణామధిపతిం చక్రే వైవస్వతం మనుమ్ ॥
తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా ।
యథాప్రదేశమద్యాపి ధర్మేణ పరిపాల్యతే ॥
స్వాయంభువేంత పూర్వం బ్రహ్మణా లేఖభిషేచితాః ।
నృపాలైతే_భీషిష్యంతే మనవో యే భవంతి వై ॥
మన్వంతరేష్వతీతేషు గతా హ్యేతేషు పార్ధివాః ।
ఏవమన్యేభీషిచ్యంతే ప్రాప్డేమన్వంతరే పునః ॥
అతీతారాగతాస్సర్వే స్కృతా మన్వంతరేశ్వరాః।
రాజసూయేభిషిక్తశ్చ పృథురేభిర్నరోత్తమః ॥
వేదదృషైన విధినా హ్యధిరాజః ప్రతాపవాస్ ।
ఏతానుత్పాద్య పుత్రాంస్తు ప్రజాసంతానకారణాత్ ॥
పునరేవ మహాభాగః ప్రజానాం పతిరీశ్వరః ।
కశ్యపో గోత్రకామస్తు చచార పరమం తపః ॥
పుత్రా గోత్రకరౌ మహ్యం భవేతామితి చింతయన్ ।
తస్య ప్రధ్యాయమానస్య కశ్యపస్య మహాత్మనః ॥
బ్రహ్మణాంశౌ సుతా పశ్చాత్ ప్రాదుర్భూతా మహౌజసౌ ।
వత్సారశ్చాసితశ్చైవ తావుభౌ బ్రహ్మవాదినా ॥
వత్సారాన్నిధ్రువో జడ్డే రేభ్యశ్చ సుమహాయశాః ।
రేభ్యస్య రైభ్యో విషైయో నిధ్రువస్య నిబోధత ॥
చ్యవనస్య సుకన్యాయాం సుమేధాః సమపద్యత ।
నిధ్రువస్య తు యా పత్నీ మాతా వై కుండపాయినామ్ ॥
అసితస్యైకపర్ణాయాం బ్రహ్మిష్ఠః సమపద్యత ।
శాండిల్యానాం వరః శ్రీమాన్ దేవలః సుమహాయశాః ॥
ప్రజాపతియయిన విరజసుని కుమారుఁడు, సర్వవిశ్రుతుఁడు, నయిన సుధనుని పూర్వ దిగ్భాగమునకు రాజుగా చేసెను. కర్దమ ప్రజాపతి కుమారుఁడయిన శంఖపాదునీ దక్షిణ దిగ్భాగమున కధిపతిగా ప్రతిష్టించెను. (18) అట్లే మహాత్ముఁడు, అచ్యుతుఁడు, రజసుని కుమారుఁడును నయిన కేతుమంతుని పశ్చిమ దిగ్భగమునకు అధిపతిగా (నతఁడు) అభిషేకించెను. పర్జన్య ప్రజాపతి యొక్క కుమారుఁడు దుర్గరుండు నైన హిరణ్యరోముని ఉత్తర దిగ్భాగమున నభిషేకించేను. వివస్వతుని కుమారుఁడయిన మనువును మానవుల కందరికి నధిపతిగా కశ్యపుఁడభిషేకించేను. (21) సప్త ద్వీపములతో, సర్వ పత్తనములతో గూడిన యీ పృథివి సర్వస్వము, వారందరిచే, తమ తమ ప్రదేశములయందు పరిమితమై ఇప్పటికిని ధర్మముగా పరిపాలింపఁబడుచున్నది. (22) వారంతకు పూర్వము స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మచే ప్రతిష్టింపం బడిరి. మనువులైనవారే రాజులుగా అభిషేకింపబడిరి. మన్వంతరము లేగినవి. ఆ రాజులు పరిపాలించినారు. గతించినారు. ఇల్లే ఇంకొక మన్వంతరమురాగా ఇతరులు పట్టాభిషిక్తులగుదురు. మన్వంతరములు గడచినవి కానీండు, జరుగనున్నవికానిండు, ఆ మన్వంతరప్రభువులు ప్రభువులుగా నిర్ధారింపఁబడిరి. వారిలో శ్రేష్ఠుఁడయిన పృథువు, రాజసూయాధ్వరము నందు వేదదృష్ట విధి ననుసరించి అభిషిక్తుఁడయ్యెను. ఆ పృథువు రాజాధిరాజు. ప్రతాపవంతుఁడు. (26) ప్రజా సంతతి కోణంకు పుత్రుల నుత్పాదించి, మహాపవిత్రుఁడు, ప్రజాధిపతీ, ఈశ్వరుఁడునయిన కశ్యపుఁడు స్వగోత్రాభివృద్ధిని వాంఛించి గొప్ప తపమాచరించెను. (27) గోత్రవృద్ధికరులగు పుత్రులు నాకు కలుగుదురుగాక అనీ యాలోచించి, ధ్యానమాచరించు మహాత్ముడయిన కశ్యపమహర్షికి బ్రాహ్మణాంశకలితులు ఇద్దరు కుమారులు ప్రాదుర్భవించిరి. వారు మహాశక్తిమంతులు. వారిద్దరు వత్సారుఁడు, అసితుఁడు. వారిద్దరు బ్రహ్మవాదులు. (29) వత్సారునకు నీధ్రువుడు జన్మించెను. సుమహాయశస్వియయిన రేభ్యుం డును నతనికి కలిగేను. నిధ్రువుని కుమారుఁడయిన రేభ్యుని రైభ్యునిగా నెఱుంగుము. చ్యవనునికి సుకన్యయందు సుమేధ కలిగెను. ఆమెయే నిధ్రువుని పత్నీ. కుండపాయులకు తల్లీ. (కుండపాయులు ఒక విధమయిన యతులు). దేవలుఁడు మహా యశస్వి, ఆతఁడు ఏకపర్ణయందు అసీత కుమారుఁడుగా జన్మించెను. ఆతఁడు శాండిల్యులలో శ్రేష్ఠుఁడు. అతఁడు బ్రహ్మిష్టుడు. (32)
నిధ్రువాః శాండిలా రైభ్యాస్త్రయః పక్షాస్తు కాశ్యపాః ।
వజ్రప్రభృతమో దేవా దేవాస్తస్య ప్రజాస్వామాః ॥
చతుర్యుగే త్వతీర్రాంతే మనోర్యేకాదశే ప్రభోః ।
అథావశిష్ట తస్మింస్తు ద్వాపడే సంప్రవర్తితే ॥
మరుత్తస్య నరిష్యంతస్తస్య పుత్రో దమః కిల ।
రాజ్యవర్ధనకస్తస్య సుధృతిస్తత్సుతో నరః ॥
కేవలస్య తతస్తస్య ఐంధుమాస్ వేగవాన్ తతః ।
బుధస్తస్యాభపద్యస్య తృణబిందుర్మహీపతిః ॥
త్రేతాయుగముభే రాజా తృతీయ స బభూవ హ ।
తస్య చేలవిలా కన్యాలంబుషాగర్భసంభవా ॥
తస్యాం జాతో విశ్రవాస్తు పౌలస్త్యకులవర్ధనః ।
బృహస్పతిర్బృహతీర్షీర్దేవాచార్యస్తు కీర్తితః ॥
కన్యాం తస్యోపయేమే స నామ్నా వై దేవవర్ణినీమ్ ।
పుష్పోత్కటాం చ వాకాం చ సుతే మాల్యవతస్తథా ॥
కైకసీం మాలినః కన్యాం తాసాం తు శ్రుణుత ప్రజాః ।
జ్యేష్ఠం వైశ్రవణం తస్య సుషువే దేవవర్ణినీ ॥
దివ్యన విధినా యుక్తమారేణ చ శ్రుతేన చ ।
రాక్షసేన చ రూపేణ ఆసురేణ బలేన చ ॥
త్రిపాదం సుమహాకాయం స్థూలశీర్షం మహాహనుమ్ ।
అష్టదంష్ట్రం హరీశ్మశ్రుం శంకుకర్ణం విలోహితమ్ ॥
హ్రస్వబాహుం ప్రబాహుం చ పింగళం సుద్విభీషణం ।
వైవర్తజ్ఞానసంపన్నం సంబుద్ధం చైవ సంభవాత్ ॥
పితా దృష్ట్వాణ బ్రవీత్తం తు కుబేరోలియమితి స్వయమ్ ।
కుత్సాయాం క్వితి శబ్లోయం శరీరం బేరముచ్యతే ॥
కుబేరః కుశరీరత్వా స్నోమ్నా వై తేన సోంకితః ।
యస్మాద్విశ్రవసోపత్యం సాదృశ్యాద్విశవా ఇవ ॥
తస్మాద్యైశ్రవణో నామ నామ్నా తేన భవిష్యతి ।
ఋద్యాం కుబేరోః జనయద్విశ్రుతం నలకూబరమ్ ॥
రావణం కుంభకర్ణం చ కన్యాం శూర్పణఖీం తథా ।
విభీషణచతుర్థాంస్తు కైకస్య జనయత్సుతాన్ ॥
శంకుకర్ణో దశగ్రీవః పింగళో రక్తమూర్ధజ: ।
చతుష్పాత్ వింశతిభుజో మహాకాయో మహాబలః ॥
జాత్యంజననిభో దంస్త్రీ లోహితగ్రీవ ఏవ చ ।
రాక్షసేనౌజసాయుక్తో రూపేణ చ బలేన చ ॥
సత్త్వబుద్ధిజితైర్యక్షరాక్షసైరేవ రావణః ।
నీసర్గదారుణః క్రూరో రావణో ద్రావణస్తు సః ॥
నీధ్రువులు, శాండిలులు, రైభ్యులు - వీరు కశ్యపుని మూడు శాఖలు. (కశ్యపుని వలనఁ గలిగిన మూఁడు శాఖలు). వజ్రమును విదల్చు ఇంద్రుఁడు మొదలయిన దేవతలు కాశ్యపుని సంతానములోని వారే. (33) మనువు యొక్క చతుర్యుగముల యొక్క 11 ఆవృత్తులు జరిగిన తరువాత ద్వాపరయుగము జరుగుచుండగా, మన్వంతరముల యధిపతి గతించెను. నరిష్యంతుఁడు మరుత్తుని కుమారుఁడు. ఆతని కుమారుం డు దముఁడు. అతని కుమారుఁడు రాజ్య వర్థనకుఁడు. ఆ రాజ్య వర్ధనకుని కుమారులు సుధృతి, నరుడు, కేవలుఁడును ! కేవలుని కుమారులు బంధుమంతుఁడు, వేగవంతుఁడు, బుధుఁడు వేగవంతుని కొడుకు (?) ఆతని కుమారుఁడు (బుధస్య) తృణబిందువను రాజు, (56) ఆతఁడు తృతీయ త్రేతాయుగము యొక్క ఆరంభమున రాజయ్యను, ఆలంబుషా గర్బ జాతయయిన “ఇలవిల” ఆతని కూతురు. పులస్త్య వంశవర్థనుడయిన విశ్రవుఁడు (విశ్రవాః) ఆమెకు 'ఇలవిల'కు జన్మించెను. బృహత్కీర్తిమంతుఁడయిన బృహస్పతి దేవాచార్యునిగా కీర్తింపఁబడెను. విశ్రవుఁడు - బృహస్పతి కూతురయిన దేవవర్ణినీ, మాల్యవంతుని కైకసి కూతులయిన పుష్పోత్కటను, వాకను, పెండ్లాడెను (కైకసి మాలినీ కూతురు) వీరి వలనఁగ లిగిన సంతానమును వినుఁడు. (39) దేవవర్ణినీ జ్యేష్ఠకుమారుఁడయిన వైశ్రవణుని కనెను. (40) వైశ్రవణుఁడు దివ్యమైన విధి యుక్తుఁడు, ఆర్ష సంబంధ శ్రుతిమంతుఁడు. రూపముచేత రాక్షసుఁడు, బలముచే ఆసురుఁడు; ఆతనికి మూఁడు పాదములు; సుమహాకాయము; స్థూలమైన శీరము; పెద్ద గెడ్డము; వంకర తిరిగిన ఎనిమిది దంతములు, పచ్చని మీసములు, (శంఖముల వంటి) (నిక్కపొడుచుకొని యున్న శంకువుల వంటి కర్ణములు; వర్ణమున లోహిత వర్ణుఁడు : ఆతని ముంజేతులు, చేతులు పొట్టివి; పింగళ వర్ణుఁడు; మిక్కిలి భయంకరుఁడు; వైవర్త జ్ఞానసంపన్నుఁడు. ప్రపంచ మిథ్యా స్వరూప జ్ఞానము), పుట్టుక నుండి ఆతఁడు విజ్ఞాన వంతుఁడు. (43) ఆతని చూచి, యతని తండ్రి “ఇతఁడు కుభేరుండు” అనెను. (కుబేరుడన కుత్సితమయిన శరీరము కలవాఁడు). 'కు' అను అక్షరము అసహ్యకరమయిన దానిని ప్రకటించుట కుపయోగింపఁబడును. శరీరమునకు 'భేరి మనునది పర్యాయపదము. కుబేరుఁడు - కుత్సీత శరీరము వలన అందుచే ఈ నామముచే నతఁడు చిహ్నతుఁడు. ఈతఁడు విశ్రవసుని అపత్యమగుటచే, విశ్రవస సాదృశ్యముచే ఆతఁడు వైశ్రవణుఁడను నామమును వహించును. ఋద్ధి వలన కుబేరుడు ప్రసిద్ధుఁడయిన 'నలకూబరునీ” కనేను. (46) కైకసి రావణుని, కుంభకర్ణుని, కుమార్తెను శూర్పుణఖను కనెను. ఆమె సంతానములలో విభీషణుఁడు నాలుగవవాడు. రావణుఁడు,శంకుకర్ణుఁడు, దశగ్రీవుఁడు; పింగళవర్ణుఁడు, ఎఱ్ఱనీ తలవెంట్రుకలు కలవాఁడు. నాలుగు పాదములు, ఇరువది భుజములు, మహాకాయము, మహాబలుఁడు, మంచి కాటుకఁబోలినవాఁడు; దంష్టలు కలవాఁడు, ఆతని కంఠము లోహిత వర్ణము, రాక్షస సంబంధమయిన ఆకారము, బలము, రూపము, శక్తి కలవాఁడు. తన భౌతిక బలముచే యక్ష రాక్షసులను జయించినవాఁడు. సహజముగా దారుణుఁడు, రావణుఁడు; క్రూరుఁడు, శత్రువులను పలాయనము చేయించగలవాఁడు.
హిరణ్యకశిపుర్ష్యాసీద్రావణః పూర్వజన్మని ।
చతుర్యుగానీ రాజాభూత్రయోదశ స రావణః ॥
తాః పంచకోబ్యో వర్షాణాం సంఖ్యాతాః సంఖ్యలో ద్విజాః ।
నియుతాన్యేకపుష్టిం చ శరదాం గణితాని వై ॥
షష్టిం చైవ సహస్రాణి వర్షాణాం వై సరావణః ।
దేవతానామృషీణాం చ ఘోరం కృత్వా ప్రజాగరమ్ ॥
త్రేతాయుగే చతుర్వింశ రావణః తపసః క్షయాత్ ।
రామం దాశరథిం ప్రాప్య సగణః క్షయమీయివాస్ ॥
మహోదరః ప్రహస్తస్య మహాపార్వః ఖరస్తథా ।
పుష్పోత్కటాయాః పుత్రాస్తే కన్యా కుంభీనసీ తథా ॥
త్రిశిరా దూషణశైవ విద్యుజ్జిహ్వః సరాక్షసః ।
కన్యానుపాలీకా చైవ వాకాయాః ప్రసవః స్మృతః ॥
ఇత్యేతే క్రూరకర్మాణః పౌలస్యా రాక్షసా దశ ।
దారుణాభిజనాః సర్వే దేవైరపిదురాసదాః ॥
సర్వే లబ్ధవరాః శూరాః పుత్రపౌత్రైః సమన్వితాః।
యక్షాణాం చైవ సర్వేషాం పౌలస్యా యే చ రాక్షసాః ॥
ఆగస్త్యవైశ్వామిత్రాణాం క్రూరాణాం బ్రహ్మరక్షసాం ।
వేదాధ్యయనశీలానాం తపోవ్రతనిషేవితామ్ ॥
తేషామైడవిడో రాజా పౌలస్త్యః సవ్యపింగళః ।
ఇతరే యే యజ్ఞజుషస్తే వై రక్షోగణాస్త్రయః ॥
యాతుధానా బ్రహ్మధానా వార్తాశ్చైవ దివాచరాః ।
నిశాచరగణాస్తేషాం చత్వారః కవిభిః స్మృతాః ॥
పౌలస్యా నైఋతాశ్చైవ ఆగస్యాః కౌశికాస్తథా ।
ఇత్యేతాః సప్త తేషాం వై జాతయో రాక్షసాః స్మృతాః ॥
తేషాం రూపం ప్రవక్ష్యామి స్వాభావ్యేన వ్యవస్థితమ్ ।
వృత్తాక్షాః పింగళాశ్చైవ మహాకాయా మహోదరాః ॥
అష్టదంష్ట్రా: శంకుకర్ణా ఊర్ధ్వరోమాణ ఏవ చ ।
ఆకర్గా హారితాస్యాశ్చ ముంజధూమ్రోర్ధ్వమూర్ధజాః ॥
స్థూలశీర్షా: సితాభాశ్చ హ్రస్వసశిప్రబాహవః ।
తామ్రస్యా లంబజిహ్వాషా లంబభూస్థూలనాసికాః ॥
నీలాంగా లోహితగ్రీవా గంభీరాక్షా విభీషణాః ।
మహారస్వరాశ్చైవ వికటోద్బద్ధపిండికాకి ॥
స్థూలాశ్చ తుంగనాసాశ్చ శిలాసంహననా దృఢాః ।
దారుణాభిజనాః క్రూరాః ప్రాయశః క్లిష్టకర్మిణః ॥
పూర్వజన్మయందు రావణుఁడు హిరణ్యకశిపుఁడు. ఆ రావణుఁడు (రాక్షసుఁడు) 13 చతుర్యుగముల కాలము రాజుగా పాలీంచెను. ఆతని రాజ్యకాలము మానవ సంవత్సరములలో గుణించినచో అయ్యది ఏబది ఆరు మిలియనుల ఒక వంద అరువది వేలయేండ్లగును. ఆతఁడు బ్రాహ్మణులకు దేవతలకు భయంకర నిద్రా రహిత రాత్రులను కల్పించెను. ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణుని యొక్క తపస్సు క్షీణించుట వలన దాశరధియైన రామునితో పోరి సగణముగా క్షీణించెను. నాశనము పొందెను. మహోదరుఁడు, ప్రహస్తురడు, మహాపార్వుం డు, ఖరుఁడు - వీరు పుష్పోత్కట యొక్క కుమారులు. ఆమెకు కుంభీనస యనెడు కూతురు కూడ కలదు. త్రిశీర దూషణుఁడు, రాక్షసుఁడయిన విద్యుత్ జిహ్వుఁడు 'వాక యొక్క బిడ్డలుగా జ్ఞప్తి యందుంచుకొనవలెను. ఆమె కొక కూతురు కూడ కలదు. ఆమె పేరు అనుపాతీక. ఈ పదిమంది రాక్షసులు పౌలస్త్యుని వంశీయులు. వారందరు క్రూరకర్ములు. పుట్టిన దాది దారుణ క్రీయాచణులు. వారందరు దేవతలకు అజయ్యులు. - వారందరు శూరులు వరములు పొందనివారు: పుత్రులతో పౌత్రులతో కూడి యున్నవారు. పులస్త్యుని యొక్క వంశీయుఁడయిన ‘ఐడవీడు' డనువాడు సర్వ పింగళుఁడు. (ఎడమ పార్వమున పింగళ వర్ణము కలవాఁడు). యక్షుల కెల్లరకు, పులస్త్యుని వంశీయులయిన రాక్షసులెల్లరకు రాజు అయ్యెను. అగస్త్యుని యొక్క విశ్వామిత్రుని యొక్క సంబంధించిన క్రూరులయ్యు వేదాధ్యయనమును, తపస్సును, పవిత్ర కర్మలను జరుపు బ్రహ్మ రాక్షసులకును రాజు. ఇతరులైన మూఁడు వర్గముల రాక్షసులు యజుర్వేద క్రియ లాచరించువారు. వారు యాతుధానులు, బ్రహ్మ ధానులు, వార్డులు (?). వారు దివాచరులు, రాక్షసుల వలే వారు రాత్రించరులు కారు. వారు నాలుగు వర్గములు. ఆవర్గ చతుష్టయమును బుద్ధిమంతులు జ్ఞాపక ముంచుకొందురు. (61) వారు నిశాచరులు - వారు పౌలస్త్యులు, నైఋతులు, ఆగస్త్యులు, కౌశికులును. ఈ విధముగా వారు ఏడు జాతుల రాక్షసులని తెలియవలయును. వారి యొక్క రూపములను, సహజ సిద్ధ స్వభావములను, వివరించెదను. (63) వారు గుండ్రని నేత్రములు కలవారు; పింగళ వర్ణులు; మహాకాయులు; మహోదరులు; ఎనిమిది దంష్ఠలు కలవారు; శంకుకర్ణులు; పైకి నిగడ పొడుచుకొన్న శీర్ష రోమములు కలవారు; కర్ణములు లేనివారు; పచ్చని ముఖములు కలవారు; ముంజ (దర్భ) గడ్డివలె నుండి, ధూమ్ర వర్ణము కలిగిన శిరోజములు కలవారు; స్థూల. శీర్షములు కలవారు; అయ్యవి తెల్లని వెల్లును వెదజల్లును. హ్రస్వములయిన తొడలు ముంజేతులు కలవారు; రాగి రంగు మొగములు కలవారు; వ్రేలాడు జిహ్వలు, పెదవులు కలవారు; వ్రేలాడు కనుబొమలవారు; మొద్దు ముక్కులవారు; మహాఘోరమైన కంఠ స్వరము కలవారు; నీలాంగులు; లోహిత గ్రీవులు, గంభీరములయిన నేత్రముల వారు, విభీషణాకృతులు, వారి కాలిపిక్కలు వికృతములు, పైకి వంపు తిరిగినట్టివి, ముక్కులు స్థూలములు తుంగములును. రాతివలె దృఢములయిన శరీరములు కలవారు, పుట్టినప్పటి నుండి వారు క్రూరులు, దారుణులు సాధారణముగా వారు క్లిష్టకర్ములు. (67)
సకుండలాంగదాసీదా ముకుటోష్ణీషధారిణః ।
విచిత్రాభరణాశ్చితమాల్యగంధానులేపసాః ॥
అన్నదాః పిశితాదాశ్చ పురుషాదాశ్చ తే స్మృతాః ।
ఇత్యేతద్రూపసాధర్మ్యం రాక్షసానాం స్కృతం బుధైః ॥
న సమాస్తే బలే బుద్ధే యుద్ధే మాయాకృతే తథా ।
పులహస్య మృగాః పుత్రా: సర్వే వ్యాలాశ్చ దంష్ట్రిణః ॥
భూతాః సర్పాః పిశాచాశ్చ సృమరా హస్తినస్తథా ।
వానరాః కిన్నరాశ్చైవ మాయుః కింపురుషాస్తథా ॥
ప్రాగప్యేతే పరిక్రాంతి మయా క్రోధవశాన్వయాః ।
అనపత్యః క్రతుర్వస్మినృతో వైవస్వతేఅంతరే ॥
న తస్య పత్మ్యః పుత్రా వా తేజకి సంక్షిప్య చ స్థితః ।
అతైర్వంశం ప్రవక్ష్యామి తృతీయస్య ప్రజాపతేః ॥
తస్య పతన్యస్తు సుందర్యో దశైవాసనతీవ్రతాః ।
భద్రాశ్వస్య ఘృతాచ్యాం వై దశాప్సరసి సూనవః ॥
భద్రా శూద్రా చ మద్రా చ శలభా మలదా తథా ।
బలో హలా చ సప్తతా యా చ గోచపలాః స్మృతాః॥
తథా తామరసా చైవ రత్నకూటా చ తాదృశః ।
తత్ర యో వంశకృచ్చాసౌ తస్య సోమ ప్రభాకరః ॥
మద్రాయాం జనయామాస సోమం పుత్రం యశస్వినమ్ ।
స్వర్భానుసా హతే సూర్యే పతమానే దివో మహీమ్ ॥
తమోభిభూతే లోకేబిస్మిన్నభా యేన ప్రవర్తితా ।
స్వస్తి చేస్తితి చోట్తో వై పతన్నిహ దివాకరః ॥
బ్రహ్మయేర్వచనాత్తస్య న పపాత దివో మహీమ్ ।
అతిశ్రేషాని గోత్రాణి యశ్చకార మహాతపాః ॥
యజ్ఞేష్వనీధనం చైవ సురైర్యస్య ప్రవర్తితమ్ ।
స తాసు జనయామాస పుత్రానాత్మసమానకాన్ ॥
దశ తానై సుమహతా తపసా భావితః ప్రభుః ।
స్వస్త్యాశ్రేయా ఇతిఖ్యాతా ఋషయో వేదపారగాః ॥
తేషాం ద్వౌ ఖ్యాతయశసౌ బ్రహ్మజ్ఞా సుమహజసౌ ।
దతో హనుమతో జ్యేష్ణో దుర్వాసాస్తస్య చానుజః ॥
యవీయసీ సుతా తేషామబలా బ్రహ్మవాదినీ ।
అత్రాప్యుదాహరంతీమణ శ్లోకం పౌరాణికాః పురా ॥
వారు కుండలములు, అంగదములు మొదలయిన ఆభరణముల దాల్చినవారు. శీరమున ఉషీషముల ధరించువారు. విచిత్రాభరణులు, చిత్రములయిన పూలమాలలను, గంధానులేపములను వహించెడివారు. (68) వారు వండిన అన్నమును తినువారు; మాంసమును, అందును మానవ మాంసమును మెసవువారు. ఈ విధముగా రాక్షసులతోడి సాధర్యము పొందిన వ్యక్తులుగా పెద్దలు స్మరింతురు. వారు బలమున అసమానులు, బుద్ధియందు, యుద్దము నందు, మాయా కార్యాలయందు సాటి లేనివారు, సర్వ మృగములు, అన్నీ విధములయిన క్రూర దంష్ట్రాలు కలిగిన వ్యాఘములు, భూతములు, సర్పములు, పిశాచములు, కిన్నరులు, సరీసృపములు, లేళ్లు, ఏనుగులు, కోతులు, కింపురుషులు, మాయులు (ఒక విధమైన కోతి)- అన్నియును పులహుని యొక్క సంతానము క్రోధావశాన్వయమునకు చెందిన యీ సృష్టిని గూర్చి యింతకుం బూర్వము చెప్పబడినది. వైవస్వత మన్వంతరమున క్రతువు అనపత్యముగా స్మరింపఁబడెను. (72) ఆతనికి బిడ్డలు కానీ భార్యలు కాని లేరు. ఆతఁడు తన యింద్రియతేజమును నిగ్రహించుకోని, సంక్షిప్తము చేసికొని యుండెను. మూడవ ప్రజాపతియైన అత్రియొక్క వంశమును గూర్చి చెప్పెదను. అత్రికి పది మంది భార్యలు. వారందకత్తెలు. సత్పతివ్రతలు. వారు భద్రాశ్వునకు ఘృతాచియైన దేవతాపురసయందు కలిగిరి. వారు భద్ర, శూద్ర, మద్ర, శలభ, మలద, బల, హల - ఈ యేడుగురు ముఖ్యులు. ఇతరులు గోచపల, తామరస, రత్నకూట-లు; వీరును అట్టివారే. వారన్న ఇష్టపడుదురు వారి వంశమును అవిచ్చిన్నము చేసిన వానీ పేరు ప్రభాకరుఁడు. ఆ ప్రభాకరుఁడు మద్ర యందు, యశస్వియైన సోముడను పుత్రుని కనెను, సూర్యుఁడు స్వర్భానుఁడైన రాహువుచే కొట్టబడి క్రిందకు దివి నుండీ పడుచుండ, లోకము లన్నియు తమో మయము లగుచుండ, అత్రియొక్క కాంతీయే ఆ చీకటిని తొలగించినది. (ప్రవర్తిల్లనీయలేదు). (ఆతఁడే అత్రి). దివాకరుండు నేలకు పడుచుండ ఆతఁడే (అత్రి) “స్వస్తితే” నీకు శుభమగుగాక అని చెప్పెను. ఆ బ్రహ్మర్షి యొక్క ఆశీర్వచనముచే, ఆకాశము నుండి సూర్యుఁడు నేలకు పడిపోలేదు. మహా తపస్వియైన అత్రి శ్రేష్టములయిన అత్రి గోత్రములను ప్రచోదించెను, ఆతఁడే యజ్ఞాచరణముల యందు సురల యొక్క మరణమును నివారించేను. ఆతఁడే ఆ పదిమంది అప్సరసలయందు తనతో తుల్యులయిన పుత్రులను కనెను. (80) సుమహాతపస్సుచే అత్రి ప్రభువు, ఆ పది మంది కుమారులను కనెను. వారందరు 'స్వస్యాతేయులు'గా ప్రసిద్ధులు. ఆ మహరులు వేదపారగులు. చారలలో ఇద్దరు ప్రసిద్ధ యశస్వులు. వారు బ్రహ్మిష్ఠులు, మహౌజసులు. దత్తుఁడు పెద్దవాఁడు. దుర్వాసుడు చిన్నపొఁడు. అందరిలో చిన్నది యొక అబల. ఆమె బ్రహ్మవాదిని. ఈ సందర్భములో పురాణములందు ప్రసిద్ధులైనవారీశ్లోకమునుదాహరింతురు.
అత్రేః పుత్త్రం మహాత్మానం శాంతాత్మానమకల్మషమ్ ।
దత్తాత్రేయం తనుం విష్ణోః పురాణజ్ఞాః ప్రచక్షతే ॥
తస్య గోత్రాన్వయాజ్జాతాశ్చత్వరః ప్రథితాః భువి ।
శ్యావాశ్వా ముద్దలాశ్చైవ వాగ్భూతకగవిస్థీరాః ॥
ఏతే త్రీణాం తు చత్వారః స్మృతాః పక్షా మహౌజసః ।
కాశ్యపో నారదశ్చైవ పర్వతోరుంధతీ తథా ॥
జజ్ఞిరే మానసా హ్యేశేఖరుంధత్యాస్తన్నిబోధత ।
నారదస్తు వశిష్టాయారుంధతీం ప్రత్యపాదయత్ ॥
ఊర్ధ్వరేతా మహాతేజా దక్షశాపాతు నారదః ।
పురా దేవాసురే తస్మిన్సంగ్రామే తారకామయే ॥
అనావృష్ట్యా హతే లోకే వ్యథే శస్తే సురైస్సహ ।
వసిష్ఠస్తపసా ధీమాన్ జీవయామాస వై ప్రజాః ॥
అనేకఫలమూలిన్య ఔషధీశ్చ ప్రవర్తయన్ ।
తాస్తేన జీవయామాస కారుణ్యాదౌషధేన సః ॥
అరుంధత్యాం వశిష్ఠస్తు శక్తిముత్పాదయత్సుతమ్ ।
స్వాంగజం జనయచ్ఛక్తిరదృశ్యంత్యాం పరాశరమ్ ॥
కాల్యాం పరాశరాజైజై కృష్ణద్యైపాయనః ప్రభుః ।
ద్వైపాయనాదరణ్యాం వై శుకో జడ్డే గుణాన్వితః ॥
ఉదపద్యంత షడిమే పీవర్యాం శుకసూనమః ।
భూరిశ్రవాః ప్రభుః శంభుః కృష్ణో గౌరశ్చ పంచమః ॥
కన్యా కీర్తిమతీ చైవ యోగమాతా ధృతవ్రతా ।
జననీ బ్రహ్మదత్తస్య పత్నీ సా త్వణుహస్య చ ॥
శ్వేతాః కృష్ణోశ్చ పౌరాశ్చ శ్యామధూమాశ్చ చండినః ।
ఊష్మదా దారికాశ్చైవ నీలాశ్చైవ పరాశరాః ॥
పరాశరాణామష్ణా తే పక్షాః ప్రోక్తా మహాత్మనామ్ ।
అత ఊర్ధ్వం నిబోధ త్వమింద్రప్రమతిసంభవమ్ ॥
వసిష్ఠస్య కపింజల్యాం ఘృతాచ్యాముదపద్యత ।
కుణీతి యః సమాఖ్యాత ఇంద్రప్రమతిరుచ్యతే ॥
పృథోః సుతాయాం సంభూతః పుత్రస్తస్యాభవద్వసుః ।
ఉపమన్యుః సుతస్తస్య యస్యేమే హ్యపమన్యవః ॥
మిత్రావరుణయోశ్చైవ కుండినేయాః పరిశ్రుతః ।
ఏకాగ్గేయా స్తథాచాన్యే వసిషా నామ విశ్రుతాః ॥
ఏతే పక్షా వసిష్టానాం స్మృతా హ్యేకాదశైవ తు ।
ఇత్యేతే బ్రహ్మణః పుత్రాః మానసా అష్ట విశ్రుతాః ॥
భ్రాతరః సుమహాభాగా యేషాం వంశాః ప్రతిష్ఠితాః ।
త్రీంల్లోకానార్థారయంతీమాన్ దేవర్షిగణసంకులాన్ ॥
“పురాణజులిట్లు చెప్పుదురు. మహాత్ముఁడు, శాంతాత్ముఁడు, అకల్మషుఁడు అయిన దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అవతారము. విష్ణువు యొక్క తనువు” అని. అత్రి అన్వయ సంజాతులలో నలుగురు చాల ప్రసిద్ధులు - (1) శ్యావాశ్వుఁడు, (2) ముద్దలుఁడు, (3) వాగ్భూతకుఁడు (4) గవిష్ఠిరుడు. (85) ఈ నలుగురు అత్రి యొక్క పక్షమునకు చెందిన మహాశక్తి మంతులుగా స్మరింపఁబడుచున్నారు - వారు కాశ్యపుండు, నారదుఁడు, పర్వతుడు మరియు అరుంధతి. నారదుఁడు అరుంధతిని వసిషునకొసంగెను. ఆనలుగురు అరుంధతి వలన మానవ జన్మ నొందిరని యెఱుంగుము. దక్షుని శాపము వలన నారదుఁడు ఊర్థ్వరేతస్కుఁడు, మహాతేజుఁడు అయ్యెను. పూర్వము దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధమునందు, తారకుని యొక్కదుష్టత్వముచే ప్రపంచ మంతయును అనావృష్టిచే ఆహతమయ్యెను. ప్రపంచ మంతయును వ్యగ్రమయ్యెను. ఉద్రిక్త స్టీలో నుండెను. దేవతలు కూడా క్లేశపడిరి. ధీమంతుఁడయిన వసిష్ణుఁడు తన తపస్సుచే అనేకములయిన ఫలములను మూలికలను ఔషధములను కారుణ్యముచే ప్రవర్తింపఁజేసి, ప్రజలను జీవింపఁజేసెను. (89) వసిష్ఠుఁడు ఆరుంధుతీ వలన శక్తియను పుత్రుని కనెను, శక్తి అదృశ్యంతివలన తన యంగము నుండి పరాశరుని పుట్టించెను. (91) కాలి' యందు పరాశరుని వలన మహాత్ముఁడయిన కృష్ణద్వైపాయను డుద్భవించెను. ద్వైపాయనునివలన అరణియందు గుణాన్వితుఁడయిన శుకుని కనెను. (92) పీవరీ యందు ఈ యారుగురు శుకుని పుత్రులు పుట్టిరి. వారు - భూరిశ్రపుఁడు, ప్రభువు, శంభుఁడు, కృష్ణుఁడు, గౌరుఁడు. ఆరవది కన్య ఆమెపేరు కీర్తిమతీ, ఆమె యోగ శక్తులకు జనని యోగమాత. ఆమే ధృతవ్రత. అన్ని పవిత్ర వ్రతముల నాచరించెను. ఆమె “అణుహు'ని యొక్క పత్ని. బ్రహ్మదత్తుని యొక్క జనని. ఈ క్రింద చెప్పఁబడు ఎనమండ్రును పరాశరునియొక్క వంశ జులు - శ్వేతులు, కృష్ణులు, పౌరులు, శ్యామ ధూములు, చండులు, ఊష్మదులు, దారికులు, నీలులు (నీలా?) (95) మహాత్ముఁడయిన పరాశరుని యొక్క అష్ణ పక్షములు చెప్పఁబడినవి. ఇక ఇంద్ర ప్రమతీ యొక్క సంతానమును గూర్చి యెఱుంగుఁడు. (96) కపింజలీ యైన ఘృతాచి యందు 'కుణి' అను కుమారుఁడు పుట్టెను. ఆతనినే ఇంద్ర ప్రమతి యందురు. (97) పృథుని యొక్క కుమార్తె యందు పుత్రుడు, అతనికి వస్తువుపుట్టెను, అతని కుమారుడు ఉపమన్యువు, ఆతని నుండీ ఔపమన్యువులు కలిగిరి. మిశ్రా వరుణుల నుండి పుట్టినవారు కుండినేయులుగా పరిశ్రుతులు. ఏకాగ్గేయులు ఇతరులు వాసిష్ఠులుగా ప్రఖ్యాతులు. ఈ విధముగా ఏకాదశ పక్షములుగా (వర్గములుగా) వాసిష్ఠులుసంస్కృతులు. ఈ విధముగా బ్రహ్మయొక్క ప్రసిద్ధులయిన మానసిక పుత్రులు చెప్పఁబడిరి. వారందరు భ్రాతలు. మహాభాగులు. వంశప్రతిష్ఠితులు, వారీ దేవర్షిగణసంకులమైన, మూడు లోకములను రక్షించుచున్నారు.
తేషాం పుత్త్రాశ్చ పౌత్త్రాశ్చ శతశోథ సహస్రశః ।
వ్యాప్తా యైస్తు త్రయో లోకాః సూర్యన్యేష గభస్తిభిః ।
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
ఋషివంశవర్ణనం నామాష్టమోధ్యాయః ॥
వారీ పుత్రులు, పౌత్రులు వందలు వేలుగా నున్నారు. సూర్యకిరణములు ప్రపంచమును వ్యాపించియున్న విధమున వారు మూఁడు లోకములను వ్యాపించి యుండిరి.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యభాగమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున ఋషివంశవర్ణనమను అష్టమో ధ్యాయము.
