2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
19 - బ్రాహ్మణ పరీక్ష - శ్రాద్ధ దానము గ్రహించుటకు బ్రాహ్మణార్హతలు - పవిత్ర ప్రదేశములలో శ్రాద్ధము నాచరించుట వలన కలుగు ప్రయోజనములు
శంయురువాచ :-
కిం స్విద్దత్తం పితృణాం తు తృప్తిదం వదతాం వర ।
కింస్విత్స్యాచ్చిరరాత్రాయ కిం వానంత్యాయ కల్పతే ॥
బృహస్పతి రువాచ :-
హవీంషి శ్రాద్ధ కల్పే తు యాని శ్రాద్ధవిదో విదుః ।
తానీ మే శృణు సర్వాణి ఫలం చైషాం యథాతథమ్ ॥
తిలైర్ర్విహియవైర్మాషైరద్భిర్మూలపలైస్తథా ।
దత్తేన మాసం ప్రీయంతే శ్రాద్ధేన పా పితామహాః ॥
మత్యై: ప్రీణంతీ ద్వౌ మాసౌ తీన్మాసాన్హారిణేన తు ।
శాశేన చతురో మాసాన్పం చ ప్రీణాతి శాకునైః ॥
వారాహేణ తు షణ్మాసాఞ్చాగలం సప్తమాసికమ్ ।
అష్టమాసికమిత్యుక్తం యచ్చ పార్వతకం భవేత్ ॥
రౌరమేణ తు ప్రీయంతే నవమాసాన్పితామహాః ।
గవయస్య తు మాం సేన తృప్తిః స్యాద్దశమాసికీ ॥
ఔరభ్రేణ చ మాంసేన మాసానేకాదశైవ తు ।
శ్రాద్దే చ తృప్తిదం గవ్యం పయః సంవత్సరం ద్వీజాః ॥
ఆనంత్యాయ భవేత్తద్వత్ ఖడ్గమాంసం పితృక్షమే ॥
పాయసం మధు సర్పిర్భ్యాం ఛాయాయాం కుంజరస్య చ ।
కృష్ణచ్ఛాగస్య మాంసేన తృప్తిర్భవతి శాశ్వతీ ॥
అత్ర గాథాః పితృగీతాః కీర్తయంతి పురా విదః ।
తాస్తేఽహం కీర్తయిష్యామి యథావత్సన్నిబోధ మే ॥
అపి నః స కులే యాయాద్యో నో దద్యా త్త్రయోదశీమ్ ।
ఆజేన సర్వలోహేన వర్షాసుచ మఘాసు చ ।
ఏష్టవ్యా బహవః పు త్త్రా యద్యేకోఽపి గయాం వ్రజేత్ ।
గౌరీం వాప్యుద్వహేద్భార్యం నాలం వా వృషముత్సృజేత్ ॥
శంయువు ఇట్లు చెప్పెను.
"ప్రవక్తలలో శ్రేష్ఠుఁడో ! పితరులకు శ్రాద్ధ కాలమున ఈయబడినది (పెట్టఁబడినది) ఏ పదార్ధము తృప్తి నొసంగును? ఏయధి యొసంగిన చిరకాలము తృప్తి ఘటించును? ఏయది యనంతమైన ఆనందమును సమకూర్చుటకుపకరించును? బృహస్పతి ఇట్లు చెప్పెను.
శ్రాద్ద వీదులెతీంగిన శ్రాద్దమున నొసంగ వలసినవానిని నా వలన వినుము. అంతియేకాక వాని వలన గలుగు ఫలితములను యథాతధముగా వినుము. శ్రాద్దమున తిలలు, ప్లీహి, యవలు, మాషములు (మినుములు) జలతర్పణములు, ఫలములు, మూలములును ఒసంగఁబడిన పితృదేవతలోకమాసకాలము తృప్తినొందుదురు. (3) మత్స్యములతో శ్రాద్ద మాచరించిన పితృదేవతలు రెండు మాసములు తృప్తి పొందుదురు. హరీణమాంసముతో శ్రాద్ద మాచరించిన పితరులు మూఁడు మాసములు తృప్తి పొందుదురు. కుందేలు మాంసముతో శ్రాద్ధము పెట్టిన పీత దేవతలు నాలుగు మాసములు తృప్తి పొందుదురు. శ్రాద్ధమున పక్షి మాంసము పెట్టిన పీతరులు ఐదు మాసములు తృప్తి వహింతురు. (4) అడవి పంది మాంసముతో పెట్టిన పితరులు ఆరుమాసములును, మేక మాంసముతో పెట్టిన ఏడు మాసములును, అదియే కొండమేక మాంసమయిన ఎనిమిదిమాసములు, రురు మాంసము (ఒక విధమయిన లేడీ)తో శ్రాద్ధము పెట్టిన పితరులు తొమ్మిది మాసములు తృప్తిని, గవయ మృగమాంసముతో శ్రాద్ధము పెట్టిన పదమాసములు తృప్తిని పీతరులు పొందెదరు. [6] ఔరభ్రమాంసము శ్రాద్దమున పెట్టిన పీతరులు పదీ యొకండు మాసములు తృప్తిని పొందుదురు. ఓ బ్రాహ్మణులారా ! గోమాంసముతో శ్రాద్ధము పెట్టిన పితరులు ఒక సంవత్సర కాలము తృప్తి నొందుదురు. (7) ఖడ్గ మృగ మాంసముతో శ్రాద్ధము పెట్టిన అనంతమయిన ఆనందము కలుగును. (పితృ లోకమున) కుంజర చ్ఛాయా పర్వమున తేనెతో, నేతితో, పాయ సముతో శ్రాద్దమును పెట్టిన శాశ్వతానందమొసంగును. (చంద్రుఁడు మఖా నక్షత్రమున నున్నను, సూర్యుఁడు హస్తా నక్షత్రమున నున్నను, తిథి త్రయోదశియైన - ఆ పర్వకాలము గజచ్ఛాయా పర్వమందురు). నల్లమేక మాంసము నర్పించిన శాశ్వతమయిన తృప్తి పితరులకు కలుగును. ఏతద్విషయమున కొన్ని గాథలున్నవి. ప్రాచీన ధర్మముల నెటింగినవారు ఆ శ్లోకములను కీర్తింతురు. అవి పితృగీతలు. నేను వానిని కీర్తించేదను. వానిని సొ వలన నేఱుంగుఁడు. త్రయోదశి నాడు శ్రాద్దము నాచరించు వాఁడు (వ్యక్తి) మన వంశములో రాకుండునా?(10)
శంయురువాచ :-
గయాదీనాం ఫలం తాత బ్రూహి మే పరిపృచ్ఛతః ।
దాతృణాం చైవ యత్పుణ్యం నిఖిలేన బ్రవీహి మే ॥
బృహస్పతి రువాచ : -
గయాయామక్షయం శ్రాద్ధం జపహోమతపాంసి చ ।
పితృక్షయే హి తత్పుత్త్ర తస్మాత్తత్రాక్షయం స్మృతమ్ ॥
పూర్ణాయామేకవింశం తు గౌర్యాముత్పాదితః సుతః ।
మహామహాంశ్చ జుహుయాదితి తస్యఫలం స్మృతమ్ ।
ఫలం వృషస్య వక్ష్యామి గదతో మే నీబోధత ॥
వృషోత్ర్సష్టా పునాత్యేవ దశాతీతాన్దశావరాన్ ॥
యత్కించిత్స్పృశతే తోయమవతీర్ణో నదీజలే ।
వృషోత్సర్గాత్పతౄణాం తు హృక్షయం సముదాహృతమ్ ॥
యేన యేన స్పృశేత్తోయం లాంగూలాదిభిరంగశః ।
సర్వం తదక్షయం తస్య పితృణాం నాత్రసంశయః ॥
శృంగైః ఖురైర్వా భూమీం యాముల్లిఖత్యనిశం వృషః ।
మధుకుల్యాః పితౄంస్తస్య హ్యక్షయాశ్చ భవంతి వై ॥
సహస్రనల్వమాత్రేణ తడాగేన యథాస్రుతిః ।
తృప్తిస్తు యా పితృణాం వైసా వృషేణేహ కల్పతే ॥
యో దదాతి గుడోన్మిశ్రతిలాని శ్రాద్ధకర్మణి ।
మధువా మధుమిశ్రం వా సర్వమేహక్షయం భవేత్ ॥
న బ్రాహ్మణం పరీక్షేత సదా దేయం హి మానవైః ।
దేవకర్మణి పిత్ర్యే చ శ్రూయతే వై పరీక్షణమ్ ॥
శ్రాద్ధమును వర్గాకాలములోగాని, మఘానక్షత్ర సంయోగమునఁగాని అరుణ వర్ణము పూర్తిగా గలిగిన మేక మాంసముతో నాచరించు వంశ వర్ధనుఁడు మన వంశమున నుండ కుండునా? ఎక్కువ మంది పుత్రులను పొందవలయును. వారిలో అధమము ఒక్కడయినను గయకు వెళ్లును. ఒక్కడయినను గౌరీ వయస్సు గలిగిన ఎనిమిదేండ్ల ప్రాయమును గలిగిన కన్నెను వివాహమాడును లేదా ఒకడయినను వృషభోత్సర్జనము చేయును (?)
శంయువు ఇట్లనెను.
తండ్రీ ! అడుగుచున్న నాకు గయాదుల యొక్క ఫలమును చెప్పుము. దాతల కేపుణ్యము కలదో దానిని సమస్తము నాకు చెప్పుము. బృహస్పతి ఇట్లు సమాధానమిడెను. గయ యందాచరించిన శ్రాద్దము అక్షయము. అట్లే గయ యందాచరించిన జపములు హోమములు, తపములును. అయ్యది పితరుల యొక్క నివాసము, అందుచే ఓ తనయా ! అందరి ఫలమక్షయముగా స్మరింపఁబడినది. (18) 'గౌరీ' జాతి స్త్రీ రజస్వకానీ స్త్రీ యందు ఆమే 21వ ఏట ఉత్పాదింపఁబడిన సుతుండు గొప్ప యాగములను చేయును (?) ఇదీ దాని యొక్క ఫలితముగా స్మరింపఁబడుచున్నది.(14) వృషోత్సర్జనము యొక్క ఫలితమును చెప్పెద నేుంగుము, వృషోత్సష్ట పదితరము లీటు పదితరములటు పీతరుల పవిత్రీకరించును. వృషోత్సర్జనము తరువాత, ఆ వ్యక్తి నదీజలములలో దిగి స్పృశించిన నీరములు పితరులకు అక్షయ ఫలితముల నొసంగునని యుదాహరింపఁబడినది, ఆ వృషభము తన యవయవములయిన తోక మొదలగు వానీతో నేదానిచేత నయినను నీటిని స్పృశించిన ఆ నీరు శాశ్వత ఫలితమును పితరుల కొసంగు ననుటలో నేట్టి సంశయము లేదు. ఆ వృషభము తన కొమ్ములతో గానీ, డెక్కలతోగాని, భూమి యొక్క భాగమును గీకినచో (పెల్ల గించినచో) ఎడతెగకుండ, అయ్యది పితరులకు మధుకుల్యమును (తేనే కాలువను) నిర్మించును. అది అక్షయము . కూడనగును.(18) వృషోత్సర్జనము వలన, (నల్వ = 400 ఘనపుటడుగులు) శ్రుతి ననుసరించి, పితరులకు, ఒక వెయ్యి నల్వల పొడవు గల తడాగమును త్రవ్వినట్టి, తృప్తి ఘటిల్లును. (19) శ్రాద్ధ సమయమున గుడోన్మిశ్రమయిన నువ్వులను గాని, తేనెనుగాని, తేనెతో కలిసిన దానినిగాని యిచ్చినను, దానమున నొసంగునది యేదియయినను అక్షయమగును. దానముగా నీయబడువానినీ మనుష్యులు నిరంతర మొసంగవలయును. బ్రాహ్మణుని ఎవ్వరును పరీక్షింపరాదు. ఎల్లప్పుడు దానమీయవలె. (కాని) వేదములందు బ్రాహ్మణులు దేవ పితృకర్మలందు పరీక్షింపఁబడవలెనని చెప్పఁబడినది. - (20)
సర్వవేదవ్రతస్నాతాః పంక్తీనాం పావనా ద్విజాః ।
యే చ భాషావీదః కేచిద్యే చ వ్యాకరణీ రతాః ॥
అధీయతే పురాణం వై ధర్మశాస్త్రమథాపి చ ।
త్రిణాచికేతః పంచాగ్నీః స సౌపర్ణః షడంగవీత్ ॥
బ్రహ్మదేవసుతశ్చైవ ఛందోగో జ్యేష్ఠసామగః ।
పుణ్యేషు యశ్చ తీర్ధేషు కృతస్నాతః కృతవ్రతః ॥
మఖేషు యే చ సర్వేషు భవంతృవభృథప్లుతాః ।
యే చ సత్యవ్రతా నిత్యం స్వధర్మనిరతాశ్చ యే ॥
ఆక్రోధనా లోభపరాస్తాన్ శ్రాద్ధేషు నియంత్రయేత్ ।
ఏతేభ్యో దత్తమక్షయ్యమేతే వై పంక్తిపావనాః ॥
శ్రాద్దీయా బ్రాహ్మణా యే తు యోగవ్రతసునిష్ఠితః ।
త్రయోఽపి పూజిస్తేన బ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥
పితృభిః సహ లోకాశ్చ యో హ్యేతాన్పూజయేన్నరః ।
పవిత్రాణాం పవిత్రం చ మంగళానాం చ మంగళమ్ ॥
ప్రథమః సర్వధర్మాణాం యోగధర్మో నీగద్యతే ।
అపాం క్తేయాన్ ప్రవక్ష్యామి గదతో మే నిబోధత ॥
కితవో మద్యపో యశ్చ పశుపాలో నిరాకృతః ।
గ్రామప్రేష్యో వార్థుషికో హ్యాపతో వణిజస్తథా ॥
ఆగారదాహి గరదో వృషలో గ్రామయాజకః ।
కాండపుష్టోఽథ కుండాశీ మధుపః సోమవిక్రయీ ॥
సముద్రాంతరితో భృత్యః పిశునః కూటసాక్షికః ।
పిత్రా వివదమానశ్చ యస్య చోపపతిర్గృహే ॥
అభిశస్తస్తథా స్తేనః శిల్పం యశ్చోపజీవతి ।
స్తవకః సూపకారశ్చ యశ్చ మిత్రాణి నిందతి ॥
కాణశ్చ ఖంజకశ్చైవ నాస్తికో వేదవర్జితః ।
ఉన్మత్తోఽప్యథ షండశ్చ బ్రూణహా గురుతల్పగః ॥
వేదముల నధ్యయనము చేసి తదనంతరము పవిత్రులయిన (వేద వ్రత స్నాతులు) బ్రాహ్మణులు పంక్తినీ పవిత్రీకరించుకోరు. భాషా విదులయినవారు, వ్యాకరణము నందాసక్తులయినవారు, పురాణములఁ జదివినవారు, ధర్మశాస్త్రములు పఠించినవారు, శ్రీనాచికేతమయిన పంచాగ్నులను పాటించువారు, సౌపర్ణ మంత్రముల నభ్యసించినవారు, షడంగవిదులు, బ్రహ్మదేవసుతుఁడు (బ్రహ్మను దేవునిగా భజించువాండు). వేదచ్ఛందస్సును నెఱింగినవాఁడు, సహజముగా జ్యేష్ఠ సామమును గానము చేయువాఁడు, పవిత్రములయిన తీర్థముల స్నానమాడినవాం డు పవిత్ర ధర్మ వ్రతముల నాచరించువాఁడు, యజ్ఞముల నాచరించి, తుదిని అవబ్బథ స్నానముల చేసినవారు, సత్య ప్రతులైనవారు, స్వధర్మ నిరతులు, అక్రోధనులు, లోభపరులు కానీ వారు, ఇట్టి వారిని శ్రాద్దమునకు ఆహ్వానింపవలయును. వారి కోసంగఁబడినది అక్షయమయిన ఫలితము నొసంగును, వీరే నీజముగా పంక్తి పావనులు. (26) యోగ వ్రతమందు సునీషితులయిన వారినీ, శ్రాద్ధ యోగ్యులయిన బ్రాహ్మణులను యజమానీ పూజించినచో, ఆతనిచే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు పూజింపఁబడిన వారగుదురు. ఇట్టి బ్రాహ్మణులను పూజించినవారు, పితరులు పొందిన లోకములనే పొందుదురు. యోగ ధర్మము పవిత్రములయిన వానిలో పవిత్రమయినదిగను, మంగళకరములయిన పోనీలో మంగళమయినదిగాను చెప్పఁ బడినది. (28) సర్వ ధర్మములలో ప్రథమముగా యోగధర్మము చెప్పఁబడినది. ఇక అపాంకేయులను (పంక్తి బాహ్యులను) గూర్చి చెప్పెదను ఎఱుంగుము. (29) కితవుఁడు (మాయావి) మద్యమును త్రాగువాఁడు, పశుపాలకుఁడు (పశువులను పెంచువారు), వెలివేయఁబడినవాఁడు, గ్రామ మంతటికి సేవకుఁడయినవాఁడు, వడ్డీ వ్యాపారమున బ్రతుకువాఁడు, అంగడిలో వస్తువునమ్మడు వ్యాపారముచేయువాఁడు (50) ఇండ్లను తగుల బెట్టువాఁడు, భీషమును పెట్టువాఁడు, శూద్రుఁడు, (వృషలుఁడు), గ్రామ యాజకుఁడు (గ్రామ పురోహితుఁడు), తీరములు, ఇతర ఆయుధములు చేయునట్టి బ్రాహ్మణుఁడు, కుండాశి (నర్మ సచివుఁడు), సారా సేవించువాఁడు, సోమ రసమును (మద్యమును) విక్రయించువాఁడు. (31) సముద్ర ప్రయాణము చేసినవాఁడు, భృత్యుడైనవాఁడు (పిశునుఁడు)చాడీలు చెప్పువాఁడు, కూట సాక్ష్యములు చెప్పువాఁడు, తండ్రితో వాదులాడు వాఁడు, భార్య యొక్క ఉపపతినీ తన ఇంటిలో వుంచుకొనువాఁడు (32) అభిశస్తుండు (క్రూరుఁడు) దొంగ, ఎవని జీవిత శిల్పముపై ఆధారపడియుండునో వాఁడు, స్తోత్ర పాఠకుండు, పాచకుఁడు, తన మీత్రుల నిందించువాఁడు కాణుఁడు (ఏక నేత్రుఁడు) కుంటివాఁడు, నాస్తికుఁడు, వేదవర్జితుఁడు, ఉన్మత్తుఁడు (మదించినవాఁడు, పిచ్చివాఁడు) షండుడు, బ్రూణ హత్య చేసినవాఁడు, గురు తల్పగుఁడు. (34)
భీషగ్జీవీ ప్రాశనికః పరస్త్రీం యశ్చ సేవతే ।
విక్రీణాతీ చ యో బ్రహ్మ ప్రతాని నీయమాంస్తథా ॥
నష్టం స్యాన్నాస్తికే దత్తం ప్రతఘ్నే చాపవర్జితమ్ ।
యచ్చ వాణిజకే దత్తం నేహ నాముత్ర సంభవేత్
నిక్షేపహారకే చైవ కృతఘ్నే వేదవర్జితే ।
తథా పాణవికే వై చ కొరుకే ధర్మవర్జితే ॥
క్రీణాతి యో హ్యపణ్యాని విక్రీణాతీ ప్రశంసతి ।
అన్యత్రాస్య సమాధానం న వణిక్ శ్రాద్ధ మర్హతి ॥
భస్మనీవ హుతం హవ్యం దత్తం పౌనర్భవే ద్విజః ।
షష్టిం కాణః శతం షండః శ్విత్రీ పంచశతాస్యపీ ॥
పాపరోగే సహస్రం వై దాతుర్నాశయతే ఫలమ్ ।
భశ్యేద్ధీ స ఫలాత్తస్మాత్ ప్రదాతా యస్తు బాలీశః ॥
యద్వేష్టితశిరా భుంక్తే యద్భుంక్తే దక్షిణాముఖః ।
సోపానత్కశ్చ యద్భుంక్తే యచ్చ దత్తమసత్కృతమ్ ॥
సర్వం తదసురేంద్రాయ బ్రహ్మా భాగమకల్పయత్ ।
శ్వ చైవ బ్రహ్మహా చైవ నావేక్షేత కథంచన ॥
తస్మాత్పరివృతైర్దద్యాత్తిలైశ్చాన్నం వికీర్య చ ।
రాక్షసానాం తీలాః ప్రోక్తాః శునాం పరివృతాస్తథా ॥
దర్శనాత్సూకరో హంతి పక్షవాతేన కుక్కుటః ।
రజస్వలాయాః స్పర్శేన కుదో యశ్చ ప్రయచ్ఛతి ॥
నదీతీరేషు రమ్యేషు సరిత్సు చ సరస్సు చ ।
వివిస్తేషు చ ప్రీయంతే దత్తేనేహ పితామహాః ॥
నాసవ్యం పాతయేజ్జాను న యుక్తో వాచమీరయేత్ ।
తస్మాత్పరివృతేనేహ విధివద్దర్భపాణీనా ॥
పిత్రోరారాధనం కార్యమేవం ప్రీణయతే పితృన్ ।
అనుమాన్య ద్విజాన్పూర్వమగ్నౌ కుర్యాద్యథావిధి ॥
భీషర్జీవి, తిండిపోతు, పరస్త్రీని సేవించువాఁడు, ఎవఁడు బ్రహ్మ ప్రతములను, నియమములను విక్రయించునో యతఁడు, వీరందరు పంక్తిబిహ్యులు. నాస్తికున కొసంగబడినది నష్టమయినదే. బ్రహ్మవ్రతములను వదలినవాని తీయబడినది, వర్తకము చేయువాని కొసంగం బడినది, ఇహమందు కాని పరమందుగాని యుపయోగపడునది కాదు, (36) నిక్షేపహారకున తీయబడినది, చేసిన మేలు మరచిన వాని కీయం బడినది, వేదమును విసర్జించిన వాని కీయబడినది, పాణవిక మనఁబడు సంగీత యంత్రముపై పాడువాని కీయబడినది, కారుకునికి (శిల్పపుం బనివానికి) ధర్మ వర్జితునకీయబడినది ఇహలోకమున కానీ పరలోకమున గానీ వ్యర్థములు, నిష్ప్రయోజనములు. నీ షేధింపఁబడిన వానినీ కొనువాడు కాని అమ్మువాఁడు కాని, యట్టి క్రియలను ప్రోత్సహించువాడు కాని శ్రాద్దమున కనరుఁడు. వర్తకుఁడు శ్రాద్ధమునకరుఁడుకొఁడు. (38) విధవ యొక్క కుమారున కొసంగబడిన శ్రాద్ధ వస్తువు భస్మకృత హోమక్రియవలె వ్యర్థము. ఒకే కన్ను కలిగినవాఁడు శ్రాద్దమునకు బిలువఁబడిన దాతల యొక్క అరువది గుణములను పాడుచేయును. షండుడు నూరు గుణములను, పాడుచేయును. శిక్షత్రముచే బాధపడు వానినీ (బొల్లీవానిని) శ్రాద్ధమునకుఁ బిలిచిన యాతఁడు దాతయొక్క యైదువందల సుకృతములను పాడుచేయును. (39) పాప ఫలితములయిన రోగములచే బాధపడు వానిని శ్రాద్ధమునకుఁ బీలిచిన దాతల యొక్క యొక సహస్ర సుకృత ఫలములను నాశనము చేయును. బాలీశుఁడు (మూర్ఖుడైన దాత తన దాన ఫలితముల నుండి భ్రష్ఠుఁడగును. (40) శిరస్సును వస్త్రముతో కప్పుకొని యన్నము తినువాఁడు దక్షిణాభిముఖముగా భోజనము చేయువాఁడు, చెప్పులు తొడుగుకొని భోజనము చేయువాఁడు, అవీధిగా దానము చేయువాఁడు శ్రాద్ధమున భోజనమునకుఁ బిలువం బడిన, తత్పలితము అసురేంద్రునకు దక్కునని బ్రహ్మ వీధించెను. కుక్కకాని, బ్రాహ్మణ హంతకుఁడుగాని, శ్రాద్ధ ద్రవ్యములను నెన్నడును. చూడరాదు. అందుచే వండిన యన్నమును తిలలతో చల్లిగానీ శ్రాద్ధమున పెట్టరాదు. తిలలు తీలలతో కూడిన వండిన యన్నము రాక్షసులకు తీలలు కుక్కలకు రీవృతము చెప్పబడినవి. (సూకరము) పంది శ్రాద్ధమును చూచి చూడగనే పాడుచేయును. కుక్కుటము (కోడి) తన రెక్కల గాలితో పాడు చేయును. రజస్వలయైన స్త్రీ తన కరస్పర్శతో శ్రాద్దమును పాడుచేయును. అంతియేకాక శ్రాద్ధకర్త కోప స్వభావముతో శ్రాద్ధము నాచరించిన, అదియును పాడగును. (44) పితృదేవతలు రమ్యములైన నదీ తీరములందు, సరసీరము లందు, వివిక్త స్థలముల యందు పెట్టం బడిన శ్రాద్ధములచే తృప్తి నొందుదురు. కుడి మోకాలి చిప్పును నేలకు నంట నీయరాదు. యోగము నభ్యసించువాఁడు మాటలాడరాదు. అందుచే (కర్త) కుడిచేతి ఉంగరపు వేలికి ధర్భల ముడిని దాల్చి, తిలలను చుట్టును చల్లుకొని శ్రాద్ధము నాచరించవలయును. ఈ విధముగా పితరులను తృప్తి పరచును. మొదట బ్రాహ్మణుల అంగీకారమును బడసి కర్త పవిత్ర కర్మలను అగ్నీకరణమున చేయవలయును. (47)
పితృణాం నిర్వపేద్భూమౌ. సూర్యే వా దర్భసంస్తరే ।
శుక్లపక్షే చ పూర్వాహ్ణే శ్రాద్ధం కుర్యాద్యథావిధి ॥
కృష్ణపక్షేఽపరాహ్ణే తు రౌహిణం వైన లంఘయేత్ ।
ఏవమేతే మహాత్మానో మహాయోగా మహౌజసః ॥
సదా వై పితర: పూజ్యాః సంప్రాప్తౌ దేశకాలయోః ।
పితృభక్యైవ తు నరో యోగం ప్రాప్నోతి దుర్లభమ్ ॥
ధ్యానేన మోక్షం గచ్ఛేద్ధి హీత్వా కర్మ శుభాశుభమ్ ।
యజ్ఞహేతోస్తదుద్ధృత్య మోహయిత్వా జగత్తథా ॥
గుహాయాం నిహితం బ్రహ్మ కశ్యపేన మహాత్మనా ।
అమృతం గుహ్యముద్ధృత్య యోగో యోగవిదాం వరాః ॥
ప్రోక్తః సనత్కుమారేణ మహతో బ్రహ్మణః పదమ్ ।
దేవానాం పరమం గుహ్యమృషీణాం చ పరాయణమ్ ॥
పితృభక్త్యా ప్రయత్నేన ప్రాప్యతే తన్మనీషిభిః ।
పితృభక్తః సమాసేన పితృపూర్వపరశ్చ యః ॥
అయత్నాత్ర్పాప్నుయాదేవ సర్వమేతన్న సంశయః ।
పితృతర్పణమును పితరులకు భూమి మీఁద లేదా (సూర్యరశ్మిలో) సూర్యకాంతిలో లేక పరచిన దర్భల మీఁదనయినను నిర్వాపము చేయవలయును. శుక్ల పక్షమున పూర్వాహ్లామున శ్రాద్ద మాచరించవలేను, దినమున తొమ్మిదవ ముహూర్తము రౌహిణము. కృష్ణ పక్షమున శ్రాద్ధమును రోహిణ ముహూర్తమున అపరాష్ట్రమున ఆచరించవలెను. రౌహిణ ముహూర్తమును దాటరాదు. ఈ విధముగా మహాత్ములు, మహా యోగులు మహాశక్తిమంతులునయిన పితరులను దేశకాలముల పవిత్రత్వము నెంగి పూజింపవలయును. పితరుల యందు సదా భక్తిచేతనే మానవుఁడు దుర్లభమయిన యోగమును పొందును. (50) శుభాశుభములయిన కర్మల విడిచి ధ్యానము చేతను మోక్షమును పొందవలెను. యజ్ఞము కోకు, ఆ విధముగా జగత్తును భ్రాంతి పరచుటకు బ్రహ్మ పదార్థము గ్రహీంపఁబడీ హృదయ గుహాయందుంచబడినది. తరువాత మహాత్ముఁడయిన కశ్యపునిచే బ్రహ్మము, అమృతము గుహ్యమునైనదీ, ఉద్దరింపఁబడినది. యోగములలో నుత్తమమయిన యీ యోగము సనత్కుమారునిచే ప్రోక్తమయినది. ఇదియే గొప్పదియైన బ్రహ్మ యొక్క పదము. అదియే దేవతలకు ఋషులకు మిక్కిలి రహస్య తమమైన సిద్దాంతము. పితృభక్తి చేతను, స్వకీయ ప్రయత్నము చేతను, మనీషులచే ఇది పొందబడును. సూక్ష్మముగా చెప్పవలయు నన్నచో పితరుల యెడ భక్తి కలిగినవాఁడు, పూర్వ పరముల యందు పితరులను భక్తితో పూజించువాఁడు, వీనినన్నింటిని నిస్సంశయముగా ప్రయత్నముచే పొందును. (55)
బృహస్పతి రువాచ :-
యస్మై శ్రాద్ధాని దేయాని యచ్చ దత్తం మహత్ఫలమ్ ।
యేషు చాప్యక్షయం శ్రాద్ధం తీర్ధేషు చ గు హాసు చ ॥
యేషు స్వర్గ మవాప్నోతి తత్తే ప్రోక్తం ససంగ్రహమ్ ।
శ్రుత్వేమం శ్రాద్ధ కల్పం చ నకుర్యాద్యస్తు మానవః ॥
స మజ్జేన్నరకే ఘోరే నాస్తికస్తమసా వృతే ।
పరీవాదో న కర్తవ్యో యోగినాం తు విశేషతః ॥
పరివాదా త్క్రిమిర్భూత్వా తత్రైవ పరివర్తతే ।
యోగాన్పరివదేద్యస్తు ధ్యానినో మోక్షకాంక్షిణః ॥
స గచ్ఛేన్నరకం ఘోరం శ్రోతాప్యస్య న సంశయః ।
ఆవృతం తమసః సర్వం నరకం హోరదర్శనమ్ ॥
యోగీశ్వరపరీవాదాన్న స్వర్గం యాతి మానవః ।
యోగేశ్వరాణామాక్రోశం శృణుయాద్యో యతాత్మనామ్॥
స హి కాలం చిరం మజ్జేన్నరకే నాత్ర సంశయః ।
కుంభీపాకేషు పచ్యంతే జిహ్వాచ్ఛేదే పునః పునః ॥
సముద్రే చ యథా లోష్టస్తద్వత్ సీదంతి తే నరాః ।
మనసా కర్మణా వాచా ద్వేషం యోగేషు వర్జయేత్ ॥
ప్రేత్యానంతం ఫలం భుక్తం ఇహ వాపి న సంశయః ।
న పారగో విందతి పారమాత్మన స్త్రీలోకమధ్యే చరతీ స్వకర్మభిః ।
ఋచో యజుః సామ తదంగపారగేఽవికారమేతం హ్యవాప్య సీదతి ॥
వికారపారం ప్రకృతేశ్చ పారగస్త్రయీగుణానాం త్రిగుణస్య పారగః ।
యః స్యాచ్చతుర్వింశతితత్త్వపారగః స పారగో నాధ్యయనస్య పారగః ॥
కృత్స్నం యథావత్సముపైతి తత్పరస్తథైవ భూయః ప్రలయత్వమాత్మనః । ప్రత్యాహరేద్యోగపథం న యో ద్విజో న సర్వపారక్రమపారగోచరః ॥
బృహస్పతి చెప్పెను,
ఎవనికీ శ్రాద్ధములలో దానము, భోజనము నీయవలయునో, ఎవనీ కోసంగఁబడినదీ మహత్పలమొసంగునో, ఏయే తీర్థము లందు, గుహలయందు ఆచరించిన శ్రాద్ధ మక్షయ మగునో, వేనీ యందాచరించిన స్వరమును పొందుదురో - ఇది యంతయు నీకు సంగ్రహముగా వివరింపఁబడినది. ఈ శ్రాద్ధ కల్పమును విని, యెవ్వఁడు, మనుష్యుఁడు, శ్రాద్దము నాచరించండో, ఆతఁడు నాస్తికుఁడు. తమసావృతమయిన ఘోర నరకమున ఆతఁడు నీమజ్జితుఁడగును. (57) పరివాదము చేయరాదు. యోగుల విషయములో ప్రత్యేకముగా పరీవాదము (నీంద) చేయరాదు. పరివాదము (వసిష్ఠ మహర్షి కాలము నుండి ధర్మశాస్త్రముల ననుసరించి, శ్రాద్దమున కాహ్వానింపఁబడు వారిలో యొక ప్రత్యేక స్థానము యోగులకున్నది. పురాణ కాలములో నది యొక గ్రుడ్డి నమ్మకముగా సాగినది. అంతవరకు ఒక యోగికీ భోజనమీడుట వందలాది బ్రాహ్మణులకు భోజనము పెట్టుట కంటే ఘనముగా నంగీకరింపఁబడినది. అందుచే యోగులను గూర్చి అవమానకరముగా మాటలాడుట నిషేధింపబడినది). అవమానము, నింద్యముగా పలుకుట. (58) అట్టి పరీవాదముచే నా వ్యక్తి యొక క్రిమి యై యచ్చటనే నరకముననే పరివర్తించుచుండును. ధ్యానపరులుగాని, మోక్షకాంక్షులుకాని యెవరు యోగులఁగూర్చీ నిందచేయుదురో, వారు ఘోరమయిన నరకమును పొందుదురు. శ్రాతకూడ (ఆ నిందలను విన్నవాఁడు) నిస్సంశయముగ ఘోర నరకమును చెందును. ఆ నరకము హోరదర్శనమయినది. అంతయు దట్టమయిన చీకటిచే ఆవృతమై యుండును. (60) యోగీశ్వరుల నిందించుట వలన మానవుఁడు స్వర్గమును చేరలేడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన (యతాత్ములయిన) యోగుల నిందను ఎవఁడు వినునో యతఁడు చిరకాలము నరకమున నిమగ్నుఁడగును. సంశయము లేదు. అట్టివారు కుంభీపాకమున (నరకమున) నిప్పులో వేల్చబడుదురు; అంతియేకాక పోరీ నాలుకలు మాటి మాటికి తెగకోయఁబడును. (61) అట్టి మనుష్యులు సముద్రములో పారవేయఁబడిన చిల్లపెంకువలే నశింతురు. అందుచే మనోవాక్కర్మలచే యోగుల నవమానించుట మానవలయును. ఆతఁడిచ్చటనే యిహమందు పరమందును అనంత ఫలము నొందును, దానిలో సంశయము లేదు. (62) సర్వశాస్త్రముల పారగుఁడయినవాఁడు, తన విషయమై పారగత్వమును పొందఁడు. తన క్రియలచే నాతఁడీ మూఁడులోకముల మధ్యచరించుచుండును.
వేదస్య వేదితవ్యం చ వేద్యం విందతి యోగవిత్ ।
తం వై వేదవిదః ప్రాహుస్తమాహుర్వేదపాగరమ్ ॥
వేదం చ వేదితవ్యం చ విదిత్వా వై యథాస్థితః ।
ఏవం వేదవిదః ప్రాహురన్యం వై వేదపారగమ్ ॥
యజ్ఞాన్ వేదాంస్తథా కామాంసపాంసి వివిధానీ చ ।
ప్రాప్నోత్యాయుః ప్రజాశ్చైవ పితృభక్తో న సంశయః ॥
శ్రద్దయా శ్రాద్దకల్పం తు యస్త్విమం నీయతః పఠేత్ ।
సర్వాణ్యేతానీప్రాప్నోతి తీర్ధదానఫలాని చ ॥
స పంక్తిపావనశ్చైవ ద్విజాసామగ్రభుగ్భవేత్ ।
ఆశ్రావ్య చ ద్వీజాన్ సోఽథ సర్వకామానవాప్నుయాత్ ॥
యశ్చైవచ్చ్రుణుయాన్నిత్యమన్యాంశ్చ శ్రావయేద్ద్విజః ।
అనసూయుర్జితక్రోధో లోభమోహవివర్జితః ॥
తీర్థాదీనాం ఫలం ప్రాప్య దానాదీనాం చ సర్వశః ।
మోక్షోపాయం లభేచ్చ్రేష్ఠం స్వర్ణోపాయం న సంశయః ॥
ఇహ చాపి పరా పుష్టిస్తస్మాత్కుర్వీత నిత్యశః ।
ఇమం విధిం యో హి పఠేదతండ్రితః సమాహితః సంపదీ సర్వసంధిషు ।
అపత్యభాగీ చ పరేణ తేజసౌ దీవౌకసాం స వ్రజతే సలోకతామ్ ॥
యేన ప్రోక్తః స్వయం కల్పో నమస్తస్మై స్వయంభువే ।
మహాయోగేశ్వరేభ్యశ్చ సదా చ ప్రణతోఽస్మ్యహమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ మధ్యభాగే తృతీయోపోద్ఘాతపాదే శ్రాద్ధకల్పే
బ్రహ్మణపరీక్షా నామ ఏకోనవింశోఽధ్యాయః ॥
ఋగ్వేద మంత్రములను, యజుర్వేద మంత్రములను, సామవేద మంత్రములను, తత్సంబంధి, యితర శాస్త్రముల యొక్క పారము ముట్టిన హాఁడయినను, అవికారములను, అచాంచల్యమును వదలి బ్రహ్మను' పొందలేడు. అతఁడు నశించును. (63) ప్రకృతి యందలి సర్వ వికారముల యొక్క పారమును ముట్టిన వాండే, అవిద్య నేజింగిన వాఁడు మూఁడు వేదముల యొక్క పారమును పూర్ణముగానెరిగినవాఁడు, త్రిగుణముల పారము నందిన వాఁడు అంతీయకాక ఇరువది నాలుగు తత్త్వముల కడను చూచినవాఁడు, సంసారమునుత్తరించి యావలగట్టునకు చేరినవాఁడయి సర్వ విద్యాపారంగతుడగును. ఎవ్వడు బ్రహ్మకు విధియుతముగా వంకితమయినవాడో యతఁడు దానిని పూర్ణముగ నందును. అట్లే యతఁడు సర్వము ఆత్మయందు లీనమయిన స్థితిని గ్రహించును. (65) యోగమార్గము నవలంబింపనీ బ్రాహ్మణుఁడు సర్వ విజ్ఞానమున చేప్పబడు దాని సారమును ముట్టలేఁడు. (65) యోగమును నెఱింగినవాఁడు వేదముల యందు గ్రహింపదగిన ధాని నంతటిని అవగాహనము చేసికొనును. దానినే గ్రహింపవలయును. అది బ్రహ్మము. అప్పుడు వేదము నెఱింగిన వారాతనిని వేదపారగుఁడు అందురు. (66) వేదమును వేదితవ్యమును నెంగినవాఁడు యథాస్థితుఁడై యుండును. అనఁగా నీజముగా వేదముల నెటింగిన వాడు బ్రహ్మస్థితిలో నుండును. మిగిలినవారో శబ్దత: వేదముల తుదిని మాత్రమెటింగీన వారు. (67) పితృభక్తుఁడయినవాఁడు నిస్సంశయముగా యజ్ఞములను, వేదములను, కామములను, వివిధములయిన తపస్సులను, ఆయువును, సంతానమును పొందును. (68) శ్రద్దగా నొ శ్రాద్ధ కల్పమును నియమ పూర్వముగా అధ్యయనము. చేసినవాఁడు, సమస్త తీర్థదాన ఫలములను, (పై వాని నెల్లను) పొందును. ఆతఁడు పంక్తి పావనుఁడగును. బ్రాహ్మణులలో పంక్తి యందు ప్రథమమున నుండి భోజనమాచరించు వాఁడగును. ద్విజులకు విధేయుడగువాఁడు, వారిని భజించువాఁడు సర్వకామములను పొందును. (70) వానిని నిత్యమును వినువాఁడు, ఇతరులయిన ద్వీజులకు వినిపించువాడు అనసూయాపరుఁడు, జితక్రోధుఁడు, లోభమోహ వివర్జితుం డు తీర్థముల యొక్క ఫలములను, దానాదుల యొక్క ఫలితమును ఎల్లప్పుడును పొంది, మోక్షోపాయమును పొందును, శ్రేష్ఠమయిన స్వర్ణోపాయమును నిస్సంశయముగ నందును. ఇహ లోకమున ఉత్కృష్టమయిన పుష్టిని పొందును. అందుచే నీత్యమును శ్రాద్దము నాచరించవలయును. ఈ శ్రాద్ధ కల్పమును నెవ్వఁడు అతంద్రితుఁడై సమాహితచిత్తుఁడై సభలయందు, పర్వముల సంధి కాలముల యందు పఠించునో యతఁడు సంతానము - నందును. అత్యంత తేజోవైభవముతో దీనౌకసుల లోకమును పొందును. (73) ఈ కల్పము ఎవ్వనిచే చెప్పంబడినదో ఆ స్వయంభువునకు నమస్కారము. మహా యోగేశ్వరులకు నేనెప్పుడును ప్రణామ మాచరింతును, (74)
ఇది వాయు ప్రోక్త మహాపురాణమయిన బ్రహ్మాండ పురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున బ్రాహ్మణ పరీక్ష యనంబడు పందొమ్మిదవ అధ్యాయము.
