2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము

Table of Contents

12 - శ్రాద్ధ నియమములు, పంచమహాయజ్ఞములు

సూత ఉవాచ :-

దేవాశ్చ పితరశ్చైవ అన్యోన్యం నియతాః స్మృతాః ।

ఆధర్వణస్త్వేష విధిరిత్యువాచ బృహస్పతిః ॥

పూజయేత పితౄన్ పూర్వం దేవాంశ్చ తదనంతరమ్ ।

దేవా అపి పితృన్ పూర్వమర్చయంతి హి యత్నతః ॥

దక్షస్య దుహితా నామ్నా విశ్వా సామేతి విశ్రుతా ।

విశ్వాఖ్యాస్తు సుశాస్తస్యాం ధర్మతో జజ్ఞిరే దశ ॥

ప్రఖ్యాతాస్త్రీషులోకేషు సర్వలోకనమస్కృతాః ।

సమస్తాస్తే మహాత్మానశ్చేరురుగ్రం మహత్తపః ॥

హిమవచ్ఛిఖరే రమ్యే దేవర్షిగణసేవితే ।

శుద్ధేన మనసా ప్రీతా ఊచుస్తానీతరస్తథా ॥

వరం వృణీధ్వం ప్రీతాః స్మ కం కొమం కరవామహే ।

ఏవముక్తీ తు పితృభిస్తదా త్రైలోక్యభావనః ॥

బ్రహ్మోవాచ మహాతేజాః తపసా స్తు తోషితః ।

ప్రీతోస్మి తపసానేన కం కామం కరవాణి వః ॥

ఏవముక్తా సదా విశ్వే బ్రహ్మణా విశ్వకర్మణా ।

ఊచుస్తే సహితాస్సర్వే బ్రహ్మాణం లోకభావనమ్ ॥

శ్రాద్దే స్మాకం భవేదంతో హ్యేష నః కాంక్షతో వరః ।

ప్రత్యువాచ తతో బ్రహ్మా తానై త్రిదశపూజితః ॥

భవిష్యత్యేవమేవం తు కాంక్షితో వో వరసు యః ।

పితృభిశ్చ తథోత్యుక్తమేవమేతన్న సంశయః ॥

సహాస్మాభిస్తు భోక్తవ్యం యత్కించిదృశ్యతే త్విహ ।

అస్మాకం కల్పితే శ్రాద్ధే యుష్మానప్రాశనం హి వై ॥

భవిష్యతి మనుష్యేషు సత్యమేతత్ బ్రువామహే ।

మాల్యైర్గంథైస్తదాన్నేన యుష్మానగ్రేఖర్చయిష్యతి ॥

అగ్రే దత్వా తు యుష్మాకమస్మాకం దాస్యతే తతః ।

విసర్జనమథాస్మాకం పూర్వం పశ్చాత్తు దైవతమ్ ॥

రక్షణం చైవ శ్రాద్ధస్య ఆతిథ్యస్య వీధిద్వయమ్ ।

భూతానాం దేవతానాం చ పితృణాం చైవ కర్మణీ ॥

సూతుఁడిట్లు చెప్పెను.

దేవతలు పితరులు అన్యోన్యము నియతులు : స్వతంత్రులు. బృహస్పతి (ఇది అధర్వ వేదమందలి విధి (నియమము) అని చెప్పెను” ప్రథమతః (ముందుగా) పితరులను పూజింపవలెను. తరువాత దేవతలను ఇంతయేల దేవతలు, ముందుగా పితరును ప్రయత్న పూర్వకముగ శ్రద్ధగా పూజింతురు. (2) దక్షుని యొక్క కూతురు 'విశ్వ' అనునామమున ప్రసిద్ధురాలు. ధర్ముని వలన ఆమెకు పదిమంది కుమారులుదయించిరి. వారు లోకప్రసిద్ధులు. వారందరు విశ్వులు. పోరు మూఁడు లోకముల యందు ప్రఖ్యాతులు. సర్వలోక నమస్కృతులు వారు. వారందరు మహాత్ములు. వారు ఉగ్రమయినది గొప్పదియయినదియునగు తపస్సాచరించిరి. (4) వారు రమ్యమయినది, దేవర్షి గణములచే సేవింపబడునది యునగు హిమవద్గిరి శిఖరమున తపస్సాచరించిరి. వారి పరిశుద్దమయిన మనః ప్రణిధానమునకు పితృదేవతలు (పితరులు) సంప్రీతులయి వారితో - 'మీరు వరముల కోరుకొనుఁడు. మేము సంప్రీతులమయితీమి. మీ యొక్క యే కోరికను మేము తీర్పవలయును?” అనిరి. వారిట్లు పితరులచే చెప్పబడగా, మూఁడు లోకముల సృజించినవాఁడు, మహా తేజస్వి, వారల తపస్సు వలన సంతుష్టుఁడైనవాడు నగు బ్రహ్మ ఇట్లు పలికేను - "మీ తపస్సుచే సంప్రీతుఁడనయితీని మీకే కోరిక నేను నెరవేర్తును” అని, విశ్వకర్మయైన బ్రహ్మచే నీట్లడుగబడి లోకమును సృజించిన బ్రహ్మతో విశ్వులందరు కలిసి ఏకముగా, “శ్రాద్ధము నందు మాకు కూడ నొక (యంశము) భాగము అగుగాక. అది అస్మతాంక్షితమయిన పరము' అని నిరి. త్రిదశ పూజితుఁడయి బ్రహ్మ 'మీరు కోరిన వరము సఫలమగు గాక' అని ప్రత్యుత్తర మొసంగెను “తథాస్తు ! అట్లే యగుగాక' యనీ పితరులుననిరి. దానికింక సంశయము లేదు. (10) ఇచ్చట మాకగుపించిన దేల్ల మాచే అనుభవింపఁబడినది భోక్తవ్యమగుగాక. మాకు కల్పితమయిన (అర్పితమయిని శ్రాద్ధము నందు మీరును ఆహారమును ఆరగింతురుగాక. ఇది మానవుల యందు సత్యమగుగాక యని చెప్పుచున్నాము, మాల్యములతో, గంథములతో, అన్నములతో మానవులు ముందుగా మిమ్మర్చింతురు. (12) మీకు ముందుగా నోసంగి తరువాత మాకొసంగెదరు. విసర్జనము (పితరులమయిన మమ్ము వెనుకకు పంపించు క్రియ) మాకు ముందుగా జరుగును. తరువాత దేవతలకు విసర్జనము వచ్చును. శ్రాద్దమున విధి ద్వయమున్నది. శ్రాద్ధ రక్షణము, భూతములకు దేవతలకు, పితరులకు ఆతిథ్యము. (14) ఇట్లు చేసినచో సర్వము సమ్యక్కుగా నాచరించినదే యగును.

ఏవం కృతే సమ్యగేతత్ సర్వమేవ భవిష్యతి ।

ఏవం దత్త వరం తేషాం బ్రహ్మా పితృగణైః సహ ॥

క్షమానుగ్రహకృద్దేవః సంచకార యధోదితమ్ ।

వేదే పంచ మహాయజ్ఞా నరాణాం సముదాహృతాః ॥

ఏతాన్పంచ మహాయజ్ఞాన్నీర్వపేత్సతతం నరః ।

యత్ర స్థాస్యంతీ దాతారస్తత్థానం వై నిబోధత ॥

నిర్భయం విరజస్కం చ నీశోకం నిర్వ్యథక్షమమ్ ।

బ్రాహ్యం స్థానమవాప్నోతి సర్వలోకపురస్కృతమ్ ॥

శూద్రోణాపి చ కర్తవ్యాః పంచైతే మంత్ర వర్జితాః ।

అదోజన్యథా తు యో భుంక్తే స ఋణం నిత్యమశ్నుతే ॥

ఋణం భుంక్తే స పాపాత్మా యః పచేదాత్మకారణాత్ ।

తస్మాన్నిర్వర్తయేత్పంచ మహాయజ్ఞ్యాన్సరో ఋధః ॥

ఉదక్ఫూర్వే బలిం కుర్యాదుదకాంతే తథైవ చ ।

బలిం సువిహితం కుర్యాదుచైరుచ్చతరం క్షిపేత్ ॥

పరశృంగం గవాం మూత్రం బలిం సూత్రం సముత్క్షిపేత్ ।

తన్నివేద్యో భవేత్పిండః పితృణాం యస్తు జీవతి ॥

ఇప్లేనాన్నేన శక్యైశ్చ భోజయేచ్చ యథావీధి ।

నీవేద్యం కించి దిచ్ఛంతి జీవంత్యపి హి యత్నతః ॥

దేవదేవా మహాత్మానో హ్యేతే పితర ఇత్యుత ।

ఇచ్ఛంతి కించిదాచార్యాః పశ్చాత్పిండనివేదనమ్ ॥

పూజనం చైవ విప్రాణాం పూర్వమేవేహ నిత్యశః ।

తద్ధి ధర్మార్థకుశలో నేత్యువాచ బృహస్పతిః ॥

పూర్వం నివేదయేల్పీందాన్ పశ్చాద్వీపాంశ్చ భోజయేత్ ।

యోగాత్మానో మహాత్మానః పితరో యోగసంభవాః ॥

సోమమాప్యాయంత్యేతే పితరో యోగసంస్థితాః ।

తస్మాద్దద్యాచ్ఛుచిః పిండాస్ యోగేభ్యస్తత్పరాయణః ॥

పితృణాం హి భవేదేక సాక్షాదివ హుతం హవిః ।

బ్రాహ్మణానాం సహస్రస్య యోగస్థం గ్రాసయేద్యద ॥

యజమానం చ భోక్తంశ్చ గౌరివాంభసి తారయేత్ ।

అసతాం ప్రగ్రహో యత్ర సతాం చైవ వీమానతా ॥

దండో దైవకృతస్తత్ర సద్యః పతతి దారుణః ।

హిత్వా మమ సధర్మాణం బాలిశం యస్తు భోజయేత్ ॥

ఈ విధముగా వారలకు వరప్రదాన మొనరించి, క్రమానుగ్రహముల నొసంగు దేవుఁడయిన బ్రహ్మ ఉక్త విధముగా సర్వము పితృగణములతో ఆచరించెను. (15,16) మానవులకు ఆచరింపవలసినవిగా పంచ మహా యజ్ఞములు సముదాహృతములయినవి. ఈ పంచ యజ్ఞములను సతతము మానవుఁడొనరించవలెను. ఈ పంచమహా యజ్ఞముల నాచరించు నట్టివారు ఎందుందురు, తత్థానమును తెలుంగుము. (17) వారు బ్రహ్మకు సంబంధించిన స్థానమును పొందుదురు. అదీ భయ రహితమయినది. రజోగుణ దూరమయినది. శోక రహితమయినది. బాధా (వ్యథ) రహితమయినది. శ్రమ రహితమయినది. అంతియేకాక ఆ స్థావము సర్వలోకములచే గౌరవింపఁబడినది. (18) ఈ పంచ యజ్ఞములు శూద్రుల డు కూడ ఆచరింపవలెను. కాని యాతండు మంత్ర రహితముగా నొనరించవలెను. అందుచే నెవ్వఁడయిన యీ పంచ యజ్ఞముల నాచరించక భుజించునో, యతఁడు ఎప్పుడును aణములతో మునిగి యుండును. (19) ఎవ్వఁడు తన కొకే వండుకొనునో యతఁడు పాపాత్ముఁడు. ఋణము ననుభవించును. అందుచే తెలివైనవాఁడు) బుధుడు పంచ మహా యజ్ఞములమ సదా నిర్వర్తింపవలెను.(20) పితరులకు ఉదక తర్పణములను (బలులను) ఒక జలాశయము కడ (నది ఒడ్డుననో - తటాకు గట్టునవో) ఈశాన్య భాగమున నొసంగవలెను. విధి ననుసరించి బలిని సువిహితముగా నొనర్పవలయును. మంత్రములను గట్టిగా నుచ్చరించుచు, బలులను ఉచ్చతరముగో విసర్జించ వలయును. (21) గో మూత్రమును కాళీగా నున్న కోమ్మ పాత్రలో గ్రహించవలయును. అందొక సూత్రమువిడి (దారమును) బలి నొసంగవలెను. పితరులలో బ్రతికి యున్న వారికి అన్న పిండము నైవేద్యముగా నొసంగవలెను. (ఈ శ్లోకము అర్థవంతముగా తోచదు). (22) విధి నతిక్రమింపకుండ ఇష్టమయిన అన్నముతో భక్ష్యములతో, భోజన మొసంగవలయును. బ్రతికియున్న పితరునకు, ప్రయత్న పూర్వకముగా నైవేద్యము నొసంగవలయును. (23) వితరులు దేవదేవులు, మహాత్ములు. అందుచే కొంద రాచార్యులు ముందుగా విప్రులకు భోజనము పెట్టవలయుననీ తరువాత పిండము లొసంగవలయును (పితరులకు) అని చెప్పుదురు. (24) కర్త అన్న పిండములను ముందుగా సమర్పింపవలయును. తరువాత బ్రాహ్మణులకు భోజన మీడవలయును. పితరులు యోగాత్ములు. మహాత్ములయిన పితరులు యోగ దిలమున నుద్భవించినవారు.(26) ఈ పితరులు సోముని (చంద్రుని) ఆప్యాయన మొనర్తురు. బలవంతునీ, వృద్ధిమంతంని చేయుదురు. వారు వారి యోగశక్తిచే ప్రవర్తిల్లుదురు. అందుచే కర్త శుచీముంతుం డై తత్పరాయణుఁడై ఆ యోగాత్ములయిన పితరులకు పిండముల నొసంగవలయును;

ఆదికర్మ నముత్సృజ్య దాతా తత్ర వినశ్యతి ।

పిండ మగ్నౌ సదా దద్యాద్ఫోగార్ధీ ప్రథమం నరః ॥

దద్యాత్పజార్థీ యత్నేన మధ్యమం మంత్రపూర్వకమ్ ।

ఉత్తమం కాంతిమన్విఛ్ఛన్లోషు నిత్యం ప్రయచ్ఛతి ॥

ప్రజ్ఞాం చైవ యశః కీర్తిమప్సు వై సంప్రయచ్ఛతి ।

ప్రార్థయన్ దీర్ఘమాయుశ్చ వాయసేభ్యః ప్రయచ్ఛతి ॥

సౌకుమార్య మథాన్వీఛ్ఛన్ కుక్కుటేభ్యః ప్రయచ్ఛతి ।

ఏవమేతత్సముద్ధిష్టం ఏండనీర్వపడే ఫలమ్ ॥

ఆకాశే గమయేద్వాపి అప్పు పా దక్షిణాముఖః ।

పితృణాం స్థానమాకాశం దక్షిణా చైవ దిగ్భవేత్ ॥

ఏకే విప్రాః పునః ప్రాహుః పిండోద్ధరణమగ్రతః ।

అనుజ్ఞాతస్తు తైర్విషైః కామముద్రియతామితి ॥

పుష్పాణాం చ ఫలానాం చ భక్ష్యాణామన్నతస్తథా ।

అగ్ర ముద్ధృత్య సర్వేషాం జుహుయాద్ధవ్యవాహనే ॥

భక్ష్యమన్నం తథా పేయం మూలాని చ ఫలాని చ ।

హుత్వా గ్నౌ చ తతః పిండాన్నిర్వపేత్ దక్షిణాముఖః ॥

వైవస్వతాయ సోమాయ హుత్వా పిండాన్నివేద్య చ ।

ఉదకాన్నయనం కృత్వా పశ్చాద్విప్రాంశ్చ భోజయేత్ ॥

అనుపూర్వం తతో విప్రాన్ భక్యైరన్నైశ్చ శక్తితః ।

స్నిగ్ధరుషైః సుగంధైశ్చ తర్పయేత్తానసైరపి ॥

ఏకాగ్రః పర్యుపాసీనః ప్రయతః ప్రాంజలిః స్థితః ।

తత్పరః శ్రద్ధధానశ్చ కామానాప్నోతి మానవః ॥

అక్షుద్రత్వం కృతజ్ఞత్వం దాక్షిణ్యం సంస్కృతం వచః ।

తపో యజ్ఞాంశ్చ దానం చ ప్రయచ్ఛంతి పితామహాః ॥

అతః పరం తిధిం సౌమ్యం భుక్తవత్సు ద్విజాతిషు ।

ఆనుపూర్యేణ విహితం తన్మే నిగదతః శృణు ॥

ప్రోక్ష్య భూమిమధోద్ధృత్య పూర్వం పితృపరాయణః ।

తతోన్నవికిరం కుర్యా ద్విధాదృష్టేన కర్మణా ॥

ఇయ్యది పితరులకు సాక్షాత్తుగా సమర్పించిన హవిస్సు అగును. యోగస్థుఁడయి పిత్రాత్మకు గ్రాసము (భోజనము) ఒసంగినచో, బ్రాహ్మణుల సహస్ర సంఖ్యకు సంతర్పణ చేసిన ఫలము కలుగును. నావ నీటి ప్రవాహము నుండి తరింపఁజేసినట్లు, పితృ పిండ ప్రదానము యజమానుని ఆతనితో గూడ ఆ భోజనమున పాల్గొనిన వారలను తరింపఁజేయును. (27,28) ఎచ్చట అసత్పురుషులాదరింపఁబడి సత్పురుషులు అవమానింపం బడుదురో (అగౌరవీంపఁబడుదురో) దైవకృతమయిన దోష దండము వెంటనే దారుణముగా ఫలించును. ఎవఁడు ధర్మవంతుఁడయిన వానిని విడీచి, మూర్చుండు అధర్మాత్ముడు నయిన వానికి భోజన మిడునో, ఆచరించుచున్న కర్మను విసర్జించీ, యజమానీ (అన్నదాత) వెంటనే నశించును. (30) భోగార్డియైన నరుఁడు ప్రథమ పిండమును నగ్ని యందర్పీంచవలెను. (31) సంతానాభిలాషీయైన వ్యక్తి మంత్ర పూర్వకముగా మధ్యమ పిండమును (అగ్ని యందు) సమర్షింపవలయును. ఉత్తమమయిన కాంతినీ (విభవమును గోరువాఁడు తుదిపిండమును గోవున కీడవలయును. (32) ప్రజ్ఞను, యశస్సును, కీర్తిని నభిలషించువాఁడు పిండములను ఉదకము నందిడవలెను. (ప్రవాహములోనో తటాకములోనో వీడువవలెను) దీర్ఘమయిన ఆయువును ప్రార్ధించుచు పిండమును పొయసములకు (కాకులకు) ఇడవలయును. సౌకుమార్యమును (శరీర సీరత్వమును గోరువాఁడు) నభిలషించువాఁడు కుక్కుటములకు (కోళ్లకు) పిండము లొసంగును. ఈ విధముగా పిండముల నిర్వహణము వలని ఫలము చెప్పబడినది. (34) ఆకాశమున పిండముల విసర్జించినను, నీటి యందు విసర్జించినను దక్షిణాభిముఖుఁడై కర్త యాచరింపవలెను, పితరుల యొక్క స్థానము" ఆకాశము (లేక) దక్షిణ దిక్కు అగును. (35) అనుజ్ఞాతుఁడయిన పిమ్మట - ఆ బ్రాహ్మణుల చేతను అనుజ్ఞాతం డయిన పిమ్మట - ఆ బ్రాహ్మణులు ' ఆపిండమును ఎత్తుఁడు' అన్న తరువాత యజమానీ (భక్తుఁడు) ఆ పిండములను నుద్దరించవలయును. (36) ఆ పిండముల యగ్ర భాగము నుండి (శీర్ష స్థానముల నుండి) పుష్పములను, ఫలములను, భక్ష్యములను, అగ్రమును ముందుగా తీసి అంతటిని హవ్యవాహనునకు (అగ్నికి) ఆహుతి చేయవలయును. (37) భక్ష్యమును, అన్నమును, పేయము (త్రాగుటకుపయుక్త పదార్థమును మూలములను, ఫలములను, అగ్ని యందు హోమము చేసి, దక్షిణాభిముఖుఁడై పిండముల విసర్జించవలయును. (38) వైవస్వతునకు, యమునకు సోమునికి, హోమముజేసి, పిండములను ఉదక తర్పణముతో నివేదించి, తరువాత బ్రాహ్మణ సమారాధనము చేయవలయును. (39) తరువాత సవ్యమయిన క్రమ విధానముతో, తన శక్తి ననుసరించీ ఆజ్య సహితములు, ఉష్ణములు, సుగంధయుతములు నయిన వానితో బ్రాహ్మణులను సంతృప్తులను జేయవలయును. (40)

స్వధా వాచ్యా తతో విప్రాన్ విధివత్ భూరిదక్షిణాన్ ।

అన్నశేషమనుజ్ఞాష్య సత్కృత్య ద్విజసత్తమాన్ ॥

ప్రాంజలిః ప్రయతశ్చైవ అనుగమ్య విసర్జయేత్ ॥

ఇతి శ్రీ బ్రహ్మండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

శ్రాద్ధకల్పే ద్వాదశోధ్యాయః ॥

యజమాని బ్రాహ్మణులను, భక్తియుతుఁడై మనః పారిశుద్ధ్యముతో ప్రాంజలియై, శ్రద్ధాపరుఁడై సేవించిన సర్వకామములను పొందును. (41) పితరులు ఆ యజమానికి - అక్షుద్రత్వము (నీచత్వ దూరస్థితిని కృతజ్ఞత్వమును, దాక్షిణ్య లక్షణమును, సంస్కృత (దోష రహితమయిన) వాక్కును, తపస్సును, యజ్ఞమును, దానమును - పితరులొసంగెదరు. (42) యథావిహితముగా నీ కార్యము నిర్వహింపఁబడి బ్రాహ్మణులు భోజనమాచరించిన పిమ్మట, చేయవలసినది చెప్పెదను వినుము. పితృ పరాయణుఁడయిన యజమాని, భూమిని నీటితో ప్రోక్షించి (ఉద్ధుత్య) కొంచెము పెల్లగించినట్లుచేసి, తరువాత విధి ననుసరించి అన్నవితీరము చేయవలయును. (అన్నమును కొద్దీగా చల్లుట) (44) తరువాత శ్రాద్దమంత్రము పునరుచ్చరింపఁబడును. విధివత్ బ్రాహ్మణులకు భూరి దక్షిణముల నొసంగవలెను. “ఇంక - అన్న శేషము నేమి చేయవలయునని యడిగి “ఇష్టైస్సహభుజ్యతాం” ఇష్టులయిన వారితో భుజింపుఁడని బ్రాహ్మణులచే ననుజ్ఞప్తుడయి యాద్వీజసత్తముల సత్కరించి, ప్రాంజలిబంధము వహించి, ప్రయత్న పూర్వకముగ శ్రద్ధతో, వారిని కొంత దూరము అనుగమించి వారలను విసర్జించవలెను. (46)

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణము నందు, మధ్యపాదమున తృతీయమైన ఉపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమునందు ద్వాదశాధ్యాయము సమాప్తము.