2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
17 - శ్రాద్ధ మాచరించుటకు దగిన తిథులు
బృహస్పతి రువాచ :-
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి శ్రాద్ధకర్మణి పూజితమ్ ।
కామ్యం నైమిత్తికాజస్రం శ్రాద్ధకర్మణి నిత్యశః ॥
పుత్త్రదారనిమిత్తాః స్యురష్టకాస్తిస్ర ఏవ తు ।
కృష్ణపక్షే వరిష్ఠా హి పూర్వాఖండలదేవతా ॥
ప్రాజాపత్యా ద్వితీయా స్యాత్తృతీయా వైశ్వదేవికా ।
ఆద్యాఽపూపైః సదా కార్యా మాంసైరన్యా సదా భవేత్ ॥
శాకైః కార్యా తృతీయా స్యాదేవం ద్రవ్యగతో విధిః ।
అత్రాపిష్టం పితృణాం వై నిత్యమేవ విధీయతే ॥
యా చాప్యన్యా చతుర్థి స్యాత్తాం చ కుర్యాద్విశేషతః ।
ఆసు శ్రాద్ధం బుధః కుర్వన్సర్వసేనాపి నిత్యశః ॥
క్షిప్రమాప్నోతి హి శ్రేయః పరత్రేహ చ మోదతే ।
పితరః సర్వకాలేషు తిథికాలేషు దేవతాః ॥
సర్వేషు పురుషా యాంతి నిపాతమివ ధేనవః ।
మాసాంతే ప్రతిగచ్ఛేయురష్టకాసు హ్యపూజితాః ॥
మోఘాస్తస్య భవంత్యాశాః పరత్రేహ చ సర్వశః ।
పూజకాసం సముత్కర్షో నాస్తికానామధోగతిః ॥
దేవాంస్తు దాయినో యాంతి తిర్యగ్గచ్ఛంత్యదాయినః ।
పుష్టిం ప్రజాం స్కృతీం మేధాం పుత్రానైశ్వర్య మేవ చ ॥
కుర్వాణః పూజనం చాసు సర్వం పూర్ణం సమశ్నుతే ।
ప్రతిపద్ధనలాభాయ లబ్దం చాస్య న సశ్యతి ॥
ద్వితీయాయాం తు యః కుర్యాద్విపదాధిపతిర్భవేత్ ।
వరార్థినాం తృతీయా తు శత్రుఘ్నీ పాపనాశనీ ॥
చతుర్థ్యాం తు ప్రకుర్వాణః శత్రుచ్ఛిద్రాణి పశ్యతి ।
పంచమ్యాం చాపి కుర్వాణః ప్రాప్నోతి మహతీం శ్రియమ్ ॥
బృహస్పతి ఇట్లు చెప్పెను.
ఇంక ముందు త్రివిధములైన శ్రాద్ధ కర్మలఁ గూర్చి చెప్పెదను. 1. (కామ్యము) మనస్సులో నొక కోరిక నుంచుకొని చేయునట్టిది. 2, (నైమిత్తికము) ఒక నిమిత్తము నుద్దేశించి, అప్పుడప్పుడు (ప్రత్యేక సమయములలో) జేయునది 3. (అజస్రము) నిత్యము చేయునట్టిది, ఈ శ్రాద్ధములన్నియును గౌరవనీయములయినవి. అష్టక శ్రాదత్రయములు పుత్రుల యొక్క భార్యల యొక్క క్షేమము కొఱకు ఆచరింపఁబడునవి. ఇయ్యవి చాంద్రమాసములయిన మార్గశీర్షము, పుష్యము, మాఘము అనుమాసములలో కృష్ణ పక్షమున అష్టమి తిథినాఁడు చేయబడునవి. మొదటిది ఆఖండలుడయిన ఇంద్రుడు దైవము-- గలది. ఉత్తమమయినది. రెండవది ప్రజాపతి దైవముగా గల ప్రాజాపత్యము. మూఁడవది విశ్వేదేవతలు దేవతలుగా గలిగినది. మొదటిది సదా అపూపములతో చేయఁదగినది. రెండవది యెల్లప్పుడు మాంసముతో చేయఁదగినది, ఇక మూఁడవది కూరలతో (శాకములతో) చేయఁదగినది. ఇది శ్రాద్ధ గత ద్రవ్య వినియోగ సంబంధవిధి. అయినను, నిత్య శ్రాద్దము పితరుల క్రిష్ణ ప్రాయమైనదని విధింపఁబడినది. [4) వేతకటీ నాలుగవదియున్నది. ఇయ్యది ప్రత్యేకముగా విశేషమయిన శ్రద్ధతో చేయదగినది. తనకున్న సంపదను సర్వము నయినను వెచ్చించి యీ శ్రాద్ధముల నాచరించీ వివేకియయిన బుధుఁడు, ఇహమున, పరత్ర, శ్రేయస్సు వెంటనే పొందును. (5) పీతరులు, పర్వదినములలో (అమావాస్య మొదలగు రోజులలో) సప్తమి, అష్టమి, నవమి తిథులలో, అధిష్టాన దేవతలు. (6) ఈ పురుషులు (పీతరులు) ఆవులు నీటి పడియలకు పోవునట్లు శ్రాద్ధ యోగ్య ప్రదేశముల కరుగుదురు. అష్టకములలో శ్రాద్ధము నిర్వర్తింపఁబడక పోయినచో, పూజింపఁబడకయే మాసాంతమున తిరిగి పోవుదురు.(7) ఇహమున పరమున ఆ వ్యక్తి కోరికలు (ఆశలు) నిష్పలములయినవగును. పూజించిన వారలకు సముత్కర్ష (అభివృద్ధియు, పూజింపని నాస్తికుల కధోగతియును నగును. (8) శ్రాద్దము పెట్టిన వారు (దాతలు) దేవతలం జేరుదురు. పెట్టని వారలు తిర్యగ్దంతులను చేరుదురు. తిథుల యందు పూజలను చేయునట్టి వారు పుష్టిని, సంతానమును, స్మృతిని, బుద్ధిబలమును, పుత్రులను, ఐశ్వర్యమును పుష్కలముగా పొందుదురు. శుక్లపక్షము నందు ప్రతీపత్తు (పాడ్యమినాఁడు) అధికమయిన ధనలాభమున కనుకూలము, ఆతఁడు పొందిన పుష్యాదీకములు నశించవు. (10) ద్వీతీయ తిథి యందు శ్రాద్ధమాచరించినవాఁడు ద్వీపాత్ జంతువుల కధిపతియగును. శుక్లపక్ష తృతీయా తిథిని ఆచరించు వారు, ఉత్తమ వస్తువుల పొందుదురు. శత్రుఘ్నుడగును. పాపములు నాశనము చెందును. (॥) చతుర్థి యందు చేయునతఁడు శత్రువుల ఛిద్రములను (లోపములను) కనుగొనును. పంచమీ తిథి నాచరించినవాఁడు గొప్పదయిన సౌభాగ్యము నందును. (12)
షష్ఠ్యాం శ్రాద్ధాని కుర్వాణః సంపూజ్యః స్యాత్ ప్రయత్నతః ।
కురుతే యస్తు సప్తమ్యాం శ్రాద్ధాని సతతం నరః ॥
మహీశత్వమవాప్నోతి గణానాం చాధిపో భవేత్ ।
సంపూర్ణామృద్ధిమాప్నోతి యోఽష్టమ్యాం కురుతే నరః ॥
శ్రాద్ధం నవమ్యాం కర్తవ్యమైశ్వర్యం స్త్రీశ్చ కాంక్షతా ।
కుర్వన్ దశమ్యాం తు నరో బ్రాహ్మీం శ్రియమవాప్నుయాత్ ॥ వేదాంశ్చైవాప్నుయాత్సర్వాన్విప్రాణాం సమతా వ్రజేత్ ।
ఏకదశ్యాం పరం దానమైశ్వర్యం సతతం తథా ॥
ద్వాదశ్యాం జయలాభం చ రాజ్యమాయుర్వసూని చ ।
ప్రజావృద్ధిం పశూన్ మేధాం స్వాతంత్ర్యం పుష్టిముత్తమామ్ ॥
దీర్ఘమాయురథైశ్వర్యం కుర్వాణస్తు త్రయోదశమ్ ।
యువానశ్చ గృహే యస్య మృతాస్తేభ్యః ప్రదాపయేత్ ॥
శస్త్రేణ వా హతా యే చ తేషాం దద్యాచ్చతుర్ధశీమ్ ।
అమావాస్యాం ప్రయత్నేన శ్రాద్ధం కుర్యాత్ సదా శుచిః ॥
సర్వకామానవాప్నోతి స్వర్గం చానంతమశ్నుతే ।
తథా విషమజాతాసాం యమలానాం చ సర్వశః ॥
శ్రాద్ధం దద్యాదమావాస్యాం సర్వకామానవాప్నుయాత్ ।
మఘాసు కుర్వఞ్చాద్ధాని సర్వకామానవాప్నుయాత్ ॥
ప్రత్యక్షమర్చితాస్తేన భవంతి పితరస్తథా ।
పితృదేవా మమా యస్మాత్తస్మాత్తాస్వక్షయం స్కుతమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రొక్తే వుధ్యభాగే తృతీయోపోద్ఘాతపాదే
శ్రాద్ధకల్పే తిథి శ్రాద్ధవర్ణనం నామ సప్తదశోఽధ్యాయః॥
షష్ఠినాఁడు శ్రాద్ధముల నాచరించువాఁడు ప్రయత్నపూర్వకముగా మిక్కిలిగా పూజింపఁదగినవాఁడగును. సప్తమినాఁడు శ్రాద్ధముల సతము సాచరించు నరుఁడు భూమికి ప్రభువగును. గణముల కధిపతియగును, అష్టమి యందాచరించిన మానవుఁడు సంపూర్ణముగా నభివృద్ధిని పొందును. (14) ఐశ్వర్యమును స్త్రీలను కాంక్షిచునట్టివాఁడు, సపమీయందు శ్రాద్ధమాచరించవలయును. దశమి నౌఁడాచరించిన వ్యక్తి బ్రాహ్మీ శక్తిని శ్రీయమును పొందును. సర్వ వేదములను నేర్చినవాఁడగును. విప్రులతో సమత్వమును పొందును. ఏకాదశి నౌఁడాచరించిన శ్రాద్ధము వలన ఉత్కృష్టమైన దానమును ఐశ్వర్యమును సతతము ఆ వ్యక్తి పొందును. (16) ద్వాదశి యందు శ్రాద్ధ మాచరించిన నరుఁడు, జయ లాభమును, రాజ్యమును, ఆయుర్దాయమును, ధనమును, ప్రజావృద్ధిని, పశువులను, మేధను (తెలివిని) స్వాతంత్ర్యమును ఉత్తమమయిన పుష్టిని పొందును. (17) త్రయోదశి యందు శ్రాద్ధము సాచరించిన వాఁడు దీర్ఘాయుర్దాయమును ఐశ్వర్యమును పొందును. చిన్నతనములో మృతినొందిన వారికి లేక ఆయుధములచే గొట్టంబడి మరణించిన వారికి చతుర్దశి నాడు శ్రాద్దము నాచరించవలయును. అమావాస్యనాఁడు ప్రయత్న పూర్వకముగా సదా శుచిమంతుఁడై శ్రాద్ధమాచరించవలయును. ఆతఁడు సర్వకామములను పొందును. శాశ్వత స్వర్గము నందును. అట్లే, కవలలుగా పుట్టిన వారికి, అననుకూల నక్షత్రములందు పుట్టిన వారికి సర్వత శార్దమును అమావాస్య నాఁడొచరించవలెను. ఆతఁడు సర్వమైన కోరికలను పొందును. మఘ నక్షత్రమందు శ్రాద్దము లాచరించినవాఁడు సర్వకామములను పొందును. (21) మఘ నక్షత్ర మండలికి పితరులు అధ్యక్షులగుట పీతరులు స్వయముగా ప్రత్యక్షముగా నర్చీంపఁబడిన వారగుదురు. అందుచే మఘ నక్షత్రమున నాచరింపఁబడిన శ్రాద్దము అక్షయమయిన లాభముల నొసంగునట్టిదిగా స్మరింపఁబడినది.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండ పురాణము నందు మధ్యభాగమున, తృతీయోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున తిథి శ్రాద్ధవర్ణనమను పదునేడవ అధ్యాయము.
