2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
27వ అధ్యాయము
వసిష్ఠ ఉవాచ :-
తస్మిన్పురే సంతులీలామరేంద్ర పురీప్రభావే మునివర్యధనుః ।
వినిర్మమే తేషు గృహేషు పశ్చాత్తద్యోగ్యనారీవరవృందజాతమ్॥ విచిత్రవేషాభరణప్రసూనగంధాంశుకాలంకృతవిగ్రహాభిః । సహావభావాభిరుదారచేష్టాశ్రీకాంతీసౌందర్యగుణాన్వితాభిః ॥ మందస్పురద్ధంతమరీచిజాలవిద్యోతితొననసరోజజితేందుభాభిః ।
ప్రత్యగ్ర యౌవనభరాసవవలుగీర్భిః స ప్రేమనుందరకటాక్షనిరీక్షణాభిః ॥ ప్రీతిప్రసన్నహృదయాభిరతిప్రభాభిః శృంగారకల్పతరుపుష్పవిభూషితాభిః । దేవాంగనాతులితసౌభగసౌకుమార్యరూపాభిలాషమధురాకృతిరంజితాభిః ॥
ఉత్తప్తహేమకలశోపమచారుపీనవక్షోరుహద్వయభరానతమధ్యమాభిః ।
శ్రో ణీభరాక్రమణఖేదపరీశ్రీతాసుగారక్తపావకరసారుణితాంఘిభూభిః ॥
కేయూరహారమణికంకణమకంఠసూత్రామలశ్రవణమండలమండితాభిః ।
స్రగ్ధామచుంబితసకుంతలకేశపాశ కాంచీకలాపపరిశింజితనూపురాభిః ॥
ఆమృష్టరోషపరిసాంత్వననర్మహాసకేళీప్రియాలపనభర్త్పనరోషణేషు ।
భావేషు పార్థివనిజప్రియధైర్యబంధసర్వాపహారచతురేషు కృతాంతరాభిః ॥
తంత్రీస్వనోపమితమంజులసౌమ్యగేయగంధర్వతారమధురారవభాషిణీభిః । కామప్రయోగనిపుణాభిరహీనసంపదౌదార్యరూపగుణశీలసమన్వితాభిః ॥ వీణాప్రవీణతరపాణితలాంగులీభిః గంభీరచక్రచటువాదరతోత్సుకాభిః ॥
వసిష్ఠుఁడిట్లు చెప్పెను.
అమరేంద్రుని పట్టణ ప్రభావముతో తులతూగిన యా పట్టణమున మునీంద్రుని యొక్క యాగధేనువు, తరువాత ఆ యా గృహముల యందు వారల కరమైన నారీ బృందజాతమును,విచిత్ర వేషములతో ఆభరణములతో ప్రసూన గంధాంశుకాలంకృతమనోహర విగ్రహములతో హావభావ సహితమైన ఉదార చేష్టలతో, సౌందర్య గుణాన్వీత ముగా, చిరు నవ్వులచే ప్రకాశించు దంత కాంతుల కిరణ జాలములతో భాసించు ముఖ సరోజజీత ఇందుకాంతులతో, ప్రత్యగ్రమయిన యౌవన భరముచే వ్యక్తీకృతములయిన వాక్కులతోడి ప్రేమ మందరకటాక్ష నిరీక్షణములతో నిర్మించెను. ఇంకను వారు ప్రీతిచే ప్రసన్నమయిన హృదయాతిప్రభావిలసితలు, శృంగారకల్పతరుపుష్పవిభూషితలు; దేవతా స్త్రీలతో తులతూగిన సౌభగము, సౌకుమార్యము, రూపము, అభిలాషలుగల, మధురమయిన ఆకృతులతో రంజితలు, వారు కాచిన బంగారుతో నిర్మించిన కలశములతో నుపంపవీలయిన మనోహరములు, పీనములు నయిన స్తనద్వయముల భారములచే వంగీన కటిభాగములు కలవారు, పిఆుందుల భారములే ఆక్రమింపబడుటచే కలిగిన భేద పరిశ్రమవలన రక్తము యొక్క యెట్టిందనముచే పావకరసమువలె అరుణీ మత్వము నొందిన అంఘిభాగము కలవారు, కేయూరములు, హారములు, మణికంకణములు, హేమకంఠసూత్రములు, అమలము లయిన శ్రవణ కుండలములచే మండితులయిన వారు, పుష్పమాలలచే చుంబితములయిన సకుంతల కేశపాశములచే, కాంచీకలాపములచే పరిశింజితములగు {మ్రోగు) కాలినూపురములు కలవారు; వారు, రోషభావము, పరిసాంత్వనము, శృంగార నర్మ హాస కేళీ సమయ ప్రియాలపనము కృత్రిమమయిన భర్త కోప ప్రదర్శనముల వివిధ భావ ప్రదర్శనముల స్వకీయమయిన అనుభవమును సుశిక్షణము కలవారు. వారు రాజ సంబంధమయిన నిజ ప్రీయధైర్య బంధ సర్వాపహారములందు చతురలయినవారు, వారు తంత్రీ స్వరములతో తుల్యమయిన మంజులము, సౌమ్యము, నయిన గేయముల యందు, గంధర్వ స్త్రీల సంగీతమునందలి, తార మధుర రవముల భాషింప ప్రవీణలు. కామ ప్రయోగ నీపుణలు, అధికమైన సంపదలచే ఔదార్యముచే రూపగుణ శీల సమన్వితలు. వీణయందు అధికమయిన ప్రావీణ్యముగల అంగుళులు గలవారు. వారు గంభీరములయిన వాదములందు, వ్యంగ్య చాటు పోదముల యందు, నుత్సాహము కలవారు.
స్త్రీభిర్మదాలసతరాభిరతిప్రగల్భభావాభిరాకులితకాముకమానసాభిః । కామప్రయోగనిపుణాభిరహీనసంపదౌదార్యరూపగుణశీలసమన్వితాభిః ॥
సంఖ్యాతిగాభిరనిశం గృహకృత్యకర్మవ్యగ్రాత్మకాభిరపి తత్పరిచారికాభిః ।
పుంభిశ్చ తద్గుణగుణోచితరూపశోభైరుద్భాసితైర్గృపచరైః పరితః పరీతమ్ ॥
సరాజమార్గాపణసౌధసద్మసోపాన దేవాలయ చత్వరేషు ।
పౌరైరశేషార్థగుణైః సమంతాదధాస్యమానం పరిపూర్ణకామైః ॥
అనేకరత్నోజ్జ్వ లితైర్విచిత్రైః ప్రాసాదసంఘైరతంలైరసంఖ్యైః । రథాశ్వమాతంగఖరోష్ఠగోజాయోగ్యైరనేకైరపి మందిరైశ్చ ॥
నరేంద్రసామంతనిషాదిసాదిపదాతిసేనాపతీనాయకానామ్ ।
విప్రాదికానాం రథసారథీనాం గృహైస్తథా మాగధబందినాం చ ॥
వివిక్తరథ్యాపణచిత్రచత్వరైరనేకవస్తుక్రయవిక్రయైశ్చ ।
మహాధనోపస్కరసాధునిర్మితైర్గృహైశ్చ శుభ్రైర్గణికాజనానామ్ ॥
మహార్హరత్నోజ్జ్వలతుంగగోపురైః సహాశ్వగృధ్రవ్రజనర్తనాలయైః ।
చిత్రైర్ద్వజైశ్చాపి పతాకికాభిః శుభ్రైః పటైర్మండపికాభిరున్నతైః ॥
స్త్రీలు మదాలసతరలు; అతి ప్రొఢములయిన భావములచే కాముకుల మనస్సులను ఆకులిత మొనర్చువారు. కామ ప్రయోగ నిపుణలు. అహీనమయిన సంపదచే ఔదార్యముచే, రూపముచే, గుణములచే శీలముచే సమన్వితలు. వారు సంఖ్యాతిగాములు. ఎల్లప్పుడును గృహకృత్య కర్మల యందు ఆసక్తలయిన వారు. వారి పరిచారికలును నట్టివారే. అందు అసమానములు అసంఖ్యేయములు, అనేక రత్నోజ్వలిత విచిత్ర ప్రాసాద సంఘములున్నవి. రథములు, అశ్వములు, మదేభములు, ఖరములు, ఉష్ట్రములు, గోవులు, మేకలు, అంతీయేకాక యోగ్యములయిన వానితో గూడియున్న అనేకమందిరములు విలసిల్లుచున్నవి. అంతీయేకాక, నరేంద్రులకు, సామంతులకు, నిషాదులకు, సాదులకు, పదాతులకు, సేనలకు, సేనానాయకులకు, విప్రులకు, రథసారథులకు, వందిమాగధులకు ప్రత్యేకముగా నియమింపఁబడిన గృహములచే నదీవిరాజిల్లుచుండెను. అందు విశాలమయిన వీధులు, అంగడులు, చిత్రములయిన చత్వరములు, అనేకములయిన వస్తు క్రయ విక్రయశాలలు, శుభ్రములయిన గడికోజనులకు నిర్మితములయిన గృహములు కలవు. అయ్యవి మహాధనములతో గూడి చక్కగా నిర్మితములయిన భవనములు అందు మహారములు, రత్నోజలములు, ఉన్నతములు నయిన గోపురములు కలవు. అందు శునకములకు గట్టిన మందిరములు, గృధవజమునకు నిర్మించిన కేంద్రములు, నర్తనాలయములు. విచిత్రములయిన ధ్వజములు, పతాకములు, పరిశుభ్రములయిన పటములచే నిర్మింపబడిన యున్నతమయిన మండపములు కలవు.
కల్హార కంజకుముదోత్పలరేణువాసితైః చక్రాహ్వహంసకురరీబకసారసానామ్ । నానారవాధ్యరమణీయతటాకవాపీసరోవరైశ్చాపి జలోపపన్నైః ॥
చూతప్రియాలపనసామ్రమధూకజంబూపక్షేర్నవైశ్చ తరుభిశ్చ కృతాలవాలైః । పర్యంతరోపితమనోరమనాగకేతకీపున్నాగచంపకవనైశ్చ పతత్రిజుష్టైః ॥
మందారకుందకరవీరమనోజ్ఞయూధికాజాత్యాదికైర్వివిధపుష్పఫలైశ్చ వృక్షైః । సంలక్ష్యమాణపరీతోపవనాలిభిశ్చ సంశోభితం జగతి విస్మయనీయరూపైః ॥ సర్వర్తుకప్రవరసౌరభవాయుమందమందప్రచారిభర్త్పితధర్మకాలమ్ ।
ఇత్థం సురాసురమనోరమభోగసంపద్విస్పష్టమానవీభవం నగరం నరేంద్ర ॥ సౌభాగ్యభోగమమితం మునిహోమధేనుః సద్యో విధాయ వినివేదయదాశు తస్మై ।
జ్ఞాత్వా తతో మునివరో ద్విజహోమధేన్వా సంపాదితం నరపతే రుచిరాతిథేయమ్ ॥
ఆహూయ కంచన తదంతిక మాత్మశిష్యం ప్రాస్తాపయత్సగుణశాలినమాశు రాజన్ ।
గత్వా విశామధిపతేః తరసా సమీపం సప్రశ్రయం మునిసుతస్తమిదం బభాషే ॥
ఆతిథ్యమసదుపపాదీతమాశు రాజ్ఞా సంభావనీయమితి నః కులదేశికాజ్ఞా।
రాజా తతో మునివరేణ కృతాభ్యనుజ్ఞః సంప్రావిశత్పురవరం స్వకృతే కృతం తత్ ॥
అందు రమణీయములయిన తటాకములు, దిగుడుబావులు, సరోవరము లెన్నియో జలపూర్ణములై కలవు. అందలి జలములు కలార్ధముల, పద్మముల, కుముదముల, ఉత్పలముల పుష్పరేణువులచే వాసీతములు; చక్రవాకములు, హంసలు, హంసకురరులు, ఐకములు, సారసముల యొక్క నానా విధములయిన రకములచే రమణీయములు. అందు వృక్షమూలముల యందు ఆలవాలములతో చూత వృక్షములు, ప్రియాలకములు, పనసలు, ఆమ్లములు, మధూక తరువులు, నేరేడు చెట్లు, ప్లక్ష వృక్షములు అనేకములు కలవు. సరోవర తీరముల నాగములు, కేతకులు, పున్నాగములు, చంపకములు మొదలయిన సుందర వృక్షములు పెంచబడినవి. ఆ వృక్షములపై తరచుగా పక్షులు వసించుచుండును. మందారములు, కుందములు, కరవీరములు, సుందరములయిన యూధీకాతరువులు, జాతి మొదలయిన పుష్పవంతము లయినవి. ఫలవంతము లయినవియు నగు వృక్షములు కలవు. తత్ర్పదేశము విస్మయనీయమయిన ఉపవనములతో సర్వత్ర నిండియుండెను. పరిసర వన సముదాయముచే సో ప్రదేశము చక్కగా శోభితము. అందలి ఉపపనములు సర్వ ఋతు సంబంధ శ్రేష్ఠ సౌరభముతో గూడిన వాయువుల మందమంద ప్రచారములతో గ్రీష్మ ఋతువును బెదరించుచున్నట్లున్నవి. ఈ విధముగానో రాజా ! సురాసుర మనోరమ భోగ సంపత్తులతో సృజ్యమాన విభవవంతమయిన నగరముగా నుండెను. ఆ మునివర్యుని హోమధేనువు అమితమయిన సౌభాగ్య భోగముతో వెంటనే కల్పించి ఆ మహర్షికి నివేదించెను. అంత, మునివరుఁడు, ద్విజ హోమధేనువు వలన నరపతి మనోజ్ఞమయిన ఆతిథ్యమును సంపాదించుట నెటీంగి, వెంటనే గుణశాలియయిన ఆత్న శిష్యునొకనిని పిలిచి, హైహయ సృపతికై (పిలువ) పంపెను. వెడలి ప్రభువును వెంటనే కలిసి వినయ పూర్వకముగా ఆతనితో నీట్లు ఆతడు విన్నవించేను. “మాచే ఉపపాదితమయిన ఆతిథ్యమును గౌరవింప వలసినదని మా కులపతి దేశికుని ఆజ్ఞ” అంతముని వరునిచే కృతాభీష్టుడై తన కొఱకై నిర్మించిన పురవరమును రాజు ప్రవేశించెను.
సర్వోపభోగ్యనిలయం మునిహోమధేనుసామర్థ్యసూచకమశేషబలైస్సమేతః ।
అంతః ప్రవిశ్య నగరర్ధిమశేషలోకసంమోహినీమభిసమీక్ష్య స రాజవర్య: ॥
ప్రీతిప్రసన్నవదనః సబలస్తు దానీ ధీరోఽపి విస్మయమవాప భృశం తదానీమ్ ।
గచ్ఛన్ సురస్త్రీనయనాలీయూధపానైకపాత్రోచితచరుమూర్తిః ॥
రేమే స హైహయపతీః పురరాజమార్ధే శక్రః కుబేర వసతావివ సామరౌఘః ।
తం ప్రస్థితం రాజపథోత్సమంతాత్ రాంగనాశ్చందనవారీసిక్తెః ॥ ప్రసూనలాజాప్రకరైరజస్రమవీవృషన్ సౌధగతాః సుహృద్యైః । అభ్యాగతార్షణసముత్సుకసౌరకాంతహస్తారవిందగళితామలలాజవరైః ॥
కాలేయపంకసురభీకృత నందనోత్థశుభ్రప్రసూననికరైరలిబృందగీతైః ।
తత్రత్యపౌరవనితాం జనరత్నసారముక్తాభిరష్యనుపదం ప్రవీకీర్యమాణః ॥
వ్యభ్రాజతావనిపతిర్విశదైః సమంతాచ్చీతాంశురశ్మినికరైరివమందరాద్రిః।
బ్రాహ్మీం తపశ్శ్రి యముదారగణామచింత్యాం లోకేషు దుర్లభతరాం స్పృహణీయశోభామ్ ॥
సర్వోప భోగనిలయము, మునిహోమధేనువుయొక్క సామర్థ్య సూచకము నయిన నగరమును, అశేష బల సమేతుఁడుడై రాజు ప్రవేశించెను. సమస్త లోకమును సమ్మోహింపఁజేయు భోగైశ్వర్య విభవ సమృద్ధమయిన నగరము నాతఁడు చూచెను. రాజు స్వయముగా మహోదార దాతయు, అత్యధికైశ్వర్యవంతుఁడు నయినను, ప్రీతి ప్రసన్న వదనుడై దానిని చూచి యప్పుడు తన బలగముతో అత్యంత విస్మయ మొందెను. రాజు యొక్క చారుతరమూర్తి దేవతా స్త్రీ నయన సమూహములకు నిరంతర పానయోగ్యమైన దయ్యెను. పుర రాజు మార్గము వంటి పోవుచుండ, హైహయపతి కుబేర నగరమున దేవతా సమూహముతో గూడిన శక్రుని వలె ఆనందించెను. ఆతఁడు రాజ మార్గము వంటి పోవుచుండ, ఆ నగర స్త్రీలు ఇరుప్రక్కల సౌధముల యందుండి, మంచి గంధజలముతో తడిసిన ప్రసూనములచే, పేలాలచే, సేసలు చల్లిరి. తమ హృదయ గత స్వాగతముల వ్యక్తము చేసిరి. ఆగతులయిన అతిధీ ప్రకరమును స్వాగతీకరింప, గౌరవింప, నుత్సాహముతో పొర కాంతల హస్తార విందముల నుండి జారినట్టి అమల లాజ వరముతో రాజు మునింగేను. ప్రతిపదమునకు కాలేయ పంకముచే పరీమళవంతములు, పసుపుతో నిండినవి. నందన వనము నుండి తీసికొని రాబడినవియు, నయిన శుభ్ర ప్రసూన నికరముల చేతను, ప్రతిధ్వనించు తుమ్మెదల రొదలతోడను గూడిన పూవులను పౌరవనితాంజనరత్నసారమౌక్తికములను చల్లిరి. ఇట్లు పౌరాంగనా జనములచే పుష్పాదులచే ప్రతిపదము చల్లబడి రాజు, సర్వత్ర చంద్ర కిరణములచే ఆవరింపఁబడిన మందర పర్వతమువలె ప్రకాశించెను. బ్రహ్మ తేజోమయ మయినది. తపస్సు యొక్క సంపద్విశేషము, ఉదార గుణాంచితమయినదియు, ఏ లోకమునందును పొందుటకు అచింత్యమయినదియు, దుర్లభతరమయినదియు సంస్పృహణీయ శోభోజ్జ్వలమునయిన
పశ్యన్వీశామధిపతీః పురసంపదం తాముచ్చైః శశంస మనసా వచసేవ రాజన్ ।
మేనే చ హైహయపతీర్భువి దుర్బలేయం క్షాత్త్రీమనోహరతరా సహితా హి సంపత్ ॥
అస్యాః శతాంశతులనామపి నోపగంతుం విప్రశ్రీయః ప్రభవతీతి సురార్చితాయాః । మధ్యేపురం పురజనోచితాం విభూతిమాలోకయన్సహ పురోహితమంత్రిసార్ధైః ॥
గచ్చ త్స్వపార్శ్వ చరదర్శితవర్ణసౌధో లేభే ముదం పురజనైః పరిపూజ్యమానః ।
రాజా తతో మునివరోపచితం సపర్యామాత్మానురూపమిహ సానుచరో లభస్వ ॥
ఇత్యశ్రమేణ నృపతీర్వనివర్తయిత్వా స్వార్థం ప్రకల్పితగుహాభిముఖో జగామ ।
పౌరైః సమేత్య వివీధర్హణపాణిభిశ్చ మార్గే ముదా విరిచితాంజలిభిః సమంతాత్ ॥
సంభావితోభనుపదం జయశబ్దఘోషైస్తూర్యారవైశ్చ బధిరీకృతదిగ్విభాగైః ।
కక్షాంతరాణి నృపతిః శనకైరతీత్య త్రీణి క్రమేణ చ ససంభ్రమకంచుకీని ॥
దూరప్రసారితపృథగ్జనసంకులానీ సద్మావివేశ సచివాదరదత్తహస్తః ।
తత్ర ప్రదీపదధిదర్పణగంధపుష్పదూర్వాక్షతాదిభిరలం పురకామినీభిః ॥
నిర్యాయ రాజభవనాంతరతః సలీలమానందితో నరపతిర్బహుమానపూర్వమ్ ।
తాభిః సమాభివినివేశితమాశు నానారత్నప్రవేకరుచిజాలవిరాజమానమ్ ॥
పుర సంపదను రాజు చూచి, మనస్సులో, నధికముగా ప్రశంసించెను. వాగ్రూపమునఁ బొగడెను. హైహయపతి ఇట్లు తలపోసెను - బలయుతమయినది, మనోహరతరమైనదియు నగు క్షత్రియ సంపద భూమీయందు దుర్బలమయినది. దీనిలో శతాంశముతోనయినను తులతూగజాలదు. దేవతార్చతమయిన విప్రశ్రీ అతి ప్రభావవంతమయినది”. పురము నందలి మధ్య భాగమందలి విభూతీని, పుర జనోప చితమైన దానిని, పురోహితులతో, మంత్రులతో సహితముగా రాజు దర్శించి, పోపుచు, స్వపార్వమున చరించు వ్యక్తిచే చూపింపఁబడి, నానా వర్ణములతో సుందరముగానున్న సౌధమును చూచి, అత్యంత ముదము నొందెను. పురజనులచే నధికముగా పూజింపఁబడి రాజు, మునివర్యుని సమకూర్పంబడినదియు, ఆత్మాను రూపమయిన దానిని సహానుచరులతో పొందెను. ఇట్లు అశ్రమముగా రాజు సంచరించి తన పరివారముతో గృహాభీముఖుఁడయ్యెను, పౌరులు వివిధారణవస్తుపాణులతో, మార్గమునందంతటను అంజలిబద్దులై అనుపదము, జయ జయ శబ్ద ఘోషములతో, తూర్యారవములతో దిగ్భాగములు విధిరీకృతములౌనట్లు, రాజును సంభావించిరి. కంచుకులు వివిధ జన సంకులములను, దూరముగా తొలగింప, రాజు మెల్లమెల్ల కక్ష్యాంతరముల మూడింటిని సద్భావముతో గూడిన సచివులు ఆదరముతో హస్తములందీయ పుచ్చుకొని, పురోగమించుచుండ, పురకామినీ సంతతులు దీపములతో, పెరుగుతో, దర్పణములతో, గంధ పుష్ప దూర్వలతో అక్షతలతో వెంటరా, రోజు రాజ భవనాంతరము నుండి బయటికి వచ్చెను. వారు వెంటనే బంగారముచే తాపబడిన యొక ఆసనమును సమకూర్చిరి. అయ్యది ప్రశస్తతరమయిన రత్నములచే అలంకరణముచే వీరాజిల్లెను,
సూక్ష్మోత్తరచ్ఛదముదాయశా మనోజ్ఞమధ్యారురోహ కనకోత్తరవిష్టరం తమ్ ।
తస్మిన్ గృహే నృప తదీయపురంద్రివర్గః స్వాధీన మాశు నృపతిర్వివిధార్హణాభిః ॥
వాద్యాదీభిస్తదను భూషణగంధపుష్పవస్త్రా ద్యలంకృతిభిరగ్ర్యముదం తరాన । తస్మిన్నశేషదివసోచితకర్మ సర్వం నిర్వర్య హైహయపతిః స్వమతానుసారమ్ ॥
సానావిధాలయననర్మవిచిత్రకేళీసంప్రోక్షితైర్ది నముశేషసులం నినాయ ।
కృత్వా దినంతసమయోచితకర్మ చైవ రాజా స్వమంత్రిసచివానుగతః సమంతాత్ ॥
ఆసన్నభృత్యకరసంస్థితదీపకేషు సుశాంతసంతమసమాశు సదః ప్రపేదే ।
తత్రాసనే సముపవశ్య పురోధమంత్రిసామంతనాయకశతైః సముపాస్యమానః ॥
అన్వాస్త రాజసమితో వివిధైర్వినోదైర్హృష్టః సురేంద్ర ఇవ దేవగణేరుపేతః ।
తతశ్చిరం వివిధవాద్యవినోదనృత్త పేక్షాప్రవృత్తహసనాదికథాప్రసంగః ॥
అసాంచకార గణిజననర్మహాసక్రీడావిలాసపరితోషితచిత్తవృత్తిః ।
ఇత్థం విశామధిపతీర్భృశమనీశార్ధం నానావిహారవిభవానుభవైరనేకైః ॥
సూక్ష్మతరమయిన వస్త్రము ఆ ఆసనముపై కప్పబడెను. ఉదార యశస్వియైన రాజు కనకాలంకృతమయిన సువర్ణాసనమును అధిరోహించెను. రాజు అంతఃపురమున ఆ యాసనమునందు కూర్చుండియుండ, తదీయ పురంథి వర్గము రాజు యొక్క ఆనందమును పోద్యములచే, భూషణములచే, గంధ పుష్ప వస్తాద్యలంకృతులచే విస్తరింపఁజేసిరి. అంత హైహయపతి, స్వమతాను సారముగా దీవ సోచిత కర్మనంతను నిర్వర్తించేను. తరువాత రాజు నానా విధములయిన ఆలయ సంబంధమైన చర్మ విచిత్ర కేళీ సంప్రోక్షితుఁడై దినమంతయు గడపెను. దినాంతమున నాచరింప నర్ఘమైన కర్మను స్వమంత్రి సచివానుగతుఁడై సలిపెను. అంత, సమీపమునందున్న భృత్యుల చేతుల యందున్న దీపికా సమూహముచే గృహ మందలి అంధకార మంతయును శాంతించెను. అంత ఆసనమును రాజు అలంకరించెను. పురోహితులు మంత్రులు సామంతులు, నాయకులు అనేకులు వచ్చి రాజును సముపాసించి యుండిరి. దేవగణములతో గూడి యుండిన ఇంద్రునివలే రాజ సమితి యందు రాజు వివిధములయిన వినోదములతో కూడి సంతుష్ఠుఁడయ్యెను. తరువాత వివిధములయిన వాద్యములచే వినోదములచే నృత్యములచే ప్రేక్షకులచే ప్రవృత్తమయిన హసనాదీ కథా ప్రసంగములు జరిగెను. తరువాత గణికాజనుల హాస్యయుత నర్మయుత హాస క్రీడా విలాసములతో రాజు పరితోషిత చిత్త వృత్తుఁడయ్యెను. ఈ విధముగా నృపతి నిశార్దము వరకు నానా విహార విభవాను భవములచే కాలము గడిపి, నరపతులను వారి వారి నివాసములకు నంపెను.
స్థిత్వానుగాన్నరపతీనపి తన్నివాసం ప్రస్థాప్య వాసభవనం స్వయమప్యయాసీత్ । తద్రాజసైన్యమఖిలం నిజవీర్యశౌర్యసంపత్ర్పభావమహిమానుగుణం గృహేషు ॥
ఆత్మానురూపవిభవేషు మహార్హవస్త్రస్రగ్భూషణాదిబీరలం ముదితం బభూవ ।
సైన్యాని తాని నృపతేర్వివిధానపానసద్భక్ష్యభోజ్యమధుమాంసపయోఘృతాద్యైః ॥
తృప్తా న్యవాత్సురఖిలాని సుఖోపభోగైః తస్యాం నరేంద్రపురి దేవగణా దివీవ ।
ఏవం తదా నరపతేరనుయాయినస్తే నానావిధోచితసుఖానుభవప్రతీతాః ॥
అన్యోన్యమూచురితి గేహధనాదిభిర్వా కింసాధ్యతే వయమీహైవ వసామ సర్వే ।
రాజాపి శార్వరవిధానమధ్ విధాయ నిర్వర్త్య హాసభవనే శయనీయమగ్ర్యమ్ ॥
అధ్యాస్య రత్ననికరైరతిశోభి భద్రం నిద్రామసేవత నరేంద్ర చిరం ప్రతీతః ।
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
అర్జునోపాఖ్యానే సప్తవింశతి తమోఽధ్యాయః॥
తాను వాస భవనమున కరిగి యందుండెను. ఆతని రాజ సైన్యమంతయు వారి వారి వీర్య శౌర్య సంపత్ర్పభావ మహిమాసుగుణములయిన గృహముల కరిగిరి. ఆత్మాను రూపమయిన రూప విభవములందు, గొప్పవి యైన వస్త్రములు, పుష్పమాలలు, భూషణములు ధరించి అత్యంత సంతోషము నందిరి. ఆ నృపతి సైన్యములు వివిధములయిన అన్నపాన సద్భక్ష్య భోజ్య మధు మాంసములు క్షీరములు, ఘృతములు మొదలగు వానిచే తృప్తిని పొందిరి. దేవతలు స్వర్గమున తృప్తి పొందియుండునట్లు ఆ రాజ నగరమున సైనికులు తృప్తి పొందిరి. ఈ విధముగా ఆ రాజు యొక్క అనుయాయులు నానా విధోచిత సుఖానుభవ ప్రతీతి నొందిరి. రాజాను యాయులు వారిలో వారు అన్యోన్యమిట్లు మాట్లాడుకొని, “మన గేహధనాదులతో నేమి సాధింపఁబడును? మన మందర మిందే యుందము” అనిరి రాజు రాత్రి చేయవలసిన కార్యములు నిర్వర్తించి, తన ఉత్తమమయిన శయనీయము చేరి పరుండెను. ఆ శయనీయము రత్న నీకరణములచే ప్రకాశించుచుండెను. అందు కలలు లేని ప్రశాంతకర నిద్రా భాగ్యమును రాజు పొందెను.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువది యేడవ అధ్యాయము.
