2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
3 - ధర్మసంతతి - స్వయంభువుని త్రైగుణ్యము - దేవర్షిసర్గము
ఋషయ ఊచుః :-
దేవానాం దోనవానాం చ దైత్యానాం చైవ సర్వశః ।
ఉత్పత్తిం విస్తరేణైవ బ్రూహి వైవస్వతేంతరే ॥
సూత ఉవాచ :-
ధర్మస్యైవ ప్రవక్ష్యామి నిసర్గం తం నిబోధత ।
అరుంధతీ వసుర్జామా లంబా భానుర్మరుత్వతీ ॥
సంకల్పా చ ముహూర్తాచ సాధ్యా విశ్వా తథైవ చ ।
ధర్మస్య పత్యో దశ తా దక్షః ప్రాచేతసో దదౌ ॥
సాధ్యాపుత్రాస్తు ధర్మస్య సాధ్యా ద్వాదశ జజ్ఞిరే ।
దేవేభ్యస్తాన్ పరాన్ దేవాస్ దైవజ్ఞాః పరీచక్షతే ॥
బ్రాహ్మణా వై ముఖోత్సృష్టా జయా దేవాః ప్రజేపయా ।
సర్వేమంత్రశరీరాస్తే స్మృతా మన్వంతరేష్విహ ॥
దర్శశ్చ పౌర్ణమాసశ్చ బృహద్యచ్చ రథంతరమ్ ।
విశ్చైవ వివిత్తిశ్చ ఆకూతికి కూతిరేవ చ ॥
విజ్ఞాతా చైవ విజ్ఞాతో మనోయజ్ఞస్తథైవ చ ।
సామాన్యేతాని తేషాం వై యజ్ఞానాం ప్రథితాని చ ॥
బ్రహ్మశోపేన తే జాతాః పునః స్వాయంభువే జితాః ।
స్వారోచిష వై తుషితాః సత్యాశ్చైవోత్తమే పునః ॥
తామసే హరయో నామ వైకుంఠా రేవతాంతరే ।
తే సాధ్యాశ్చాక్షుషే నామ్నా ఛందజా జజ్ఞిరే సురాః ॥
ధర్మపుత్రాః మహాభాగాః సాధ్యా యే ద్వాదశామరాః ।
పూర్వం సమనుసూయంతే చాక్షుషస్యాంతరే మనోః ॥
స్వారోచిషేఖంతరేఖ తీతా దేవా యే వై మహౌజసః ।
తుషితా నామ తేన్యోన్యమూచుర్వై చాక్షుషేంతరే ॥
కించిచ్చిష్ట తదా తస్మిన్ దేవా వై తుషితా బ్రువన్ ।
ఏతామేవ మహాభాగాం వయం సాధ్యం ప్రవిశ్య వై॥
మన్వంతరే భవిష్యామస్తన్నః శ్రేయో భవిష్యతి ।
ఏవముక్త్వా తు తే సర్వే చాక్షుషస్యాంతరే మనోః ॥
ద్వాదశ సంభూతా ధర్మాత్స్వాయంభువాత్పునః ।
నరనారాయణా తత్ర జజ్ఞాతే పునరేవ హి ॥
విపశ్చిదిద్రో యశ్చాభూత్తథా సత్యో హరిశ్చ తౌ ।
స్వారోచిషేంతరే పూర్వమాస్తాంతౌ తుషితాసుతౌ ॥
ఋషులిట్లడిగిరి;
వైవస్వత మన్వంతరమున దేవతల యొక్క దానవుల యొక్క దైత్యుల యొక్క యుత్పత్తిని గూర్చి సవిస్తరముగా చెప్పుము. సూతుఁడిట్లు సమాధాన మొసంగెను.
నేను ధర్మము యొక్క సంతతిని గూర్చి చెప్పెదను, తెలిసికొనుఁడు. ప్రాచేతసుఁడయిన దక్షుఁడు తన యొక్క కూతుండ్రను పదిమందిని భార్యలుగా ధర్మునకొసంగెను. వారు - ఆరుంధతి, వసు, జామ, లంబ, భాను, మరుత్వతి, సంకల్పముహుర్త, సాధ్య మరియు విశ్వ, ధర్మునకు సాధ్యకు పండ్రెండుగురు సాధ్యులుదయించిరి. దైవజులు, దేవతలతో పరిచయము కలిగిన వీరిని దేవతలకంటే నుత్తములుగా నున్నతులనుగా నిశ్చయింతురు. వీరిని జయదేవతలందురు. సంతతి కొఱకు బ్రహ్మయొక్క ముఖము నుండి వారు సృష్టింపఁబడిరి. అన్ని మన్వంతరములయందు వీరిని మంత్రశరీరులలో దేవతలనుగా స్మరింతురు. (5) ఈ పండ్రెండుగురి యొక్క నామములు యజ్ఞముల యందు సుప్రథితములు. (1) దర్శ (2) పౌర్ణమాసము, (3) బృహతీ (4) రథంతరము, (5) మనము (6) విత్త, (7) వివిత్తి, (8) ఆకూతి, (9) కూతి, (10) విజ్ఞాత, (11) విజ్ఞాత మరియు (12) యజ్ఞము. స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క శాపముచే వారు జీతులుగను, స్వారోచిష మన్వంతరమున తుషితులుగను, ఉత్తమ మన్వంతరమున సత్యులుగను, శామస మన్వంతరమున హరితులను పేరి దేవతలుగను, రైవత మన్వంతరమున వైకుంఠులుగను పుట్టిరి, చాక్షుష మన్వంతరమున వారు సాధ్యులను దేవతలుగా ఆత్మీయశక్తిచే (స్వతంత్రభావమున) నుదయించిరి. (9) ధర్ముని పుత్రులు సాధ్యులు చాక్షుష మన్వంతరమున నుదయించిరి. వారు పండ్రెండుగురు. దేవతలు. మహాభాగులు. వారే స్వారోచిష మన్వంతరమున మహా తేజస్వంతులు తుషితులను నామమున దేవతలు. వారు పరస్పరముమాట్లాడుకోనీరి : “చాక్షుష మన్వంతరము కొంత మిగిలియుండఁగా, మేమీ మహాభాగురాలయిన సాధ్యలో ప్రవేశించి, చాక్షుష మన్వంతరమున పుట్టెదము, అయ్యది మా యొక్క శ్రేయస్సున కగును.” ఇట్లు చెప్పిన తరువాత సాధ్యకు ధర్మునకు ఈ పండ్రెండుగురు ఉదయించిరి. వీరు స్వయంభువుని యొక్క వారసులు అందే మరల. నరుఁడు నారాయణుఁ డును పుట్టిరి. (14) వారు మొదట విపశ్చిత్తు ఇంద్రుడును. తరువాత సత్యుఁడు హరియును. పూర్వము వారు స్వారోచిష మన్వంతరమున తుషిత యొక్క కుమారులు.(15)
తుషితానాం తు సాధ్యత్వే నామాన్యేతాని చక్షతే ।
మనోనుమంతా ప్రాణశ్చ నరోపానశ్చ వీర్యవాన్ ॥
వితిర్నయో హయశ్చైవ హంసో నారాయణస్తథా ।
విభుశ్చాపి ప్రభుశ్చాపి సాధ్యా ద్వాదశ జజ్ఞిరే॥
స్వాయంభువేంత పూర్వం తతః స్వారోచిషే పునః ।
నామాన్యాసస్ఫురస్తాని తుషితానాం నిబోధత ॥
ప్రాణాపానావుదానశ్చ సమానో వ్యాన ఏవ చ ।
చక్షుః శ్రోత్రం రసో ఘాణం స్పరో బుద్ధిర్మనస్తథా ॥
నామాన్యేతాని వై పూర్వం తుషితోనాం స్కృతాని చ ।
వసోస్తు వసవః పుత్రాః సాధ్యానామనుజాః స్మృతాః ॥
ధరో ధ్రువశ్చ సోమశ్చ ఆయుతైవానలోనిలః ।
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో షో ప్రకీర్తితాః ॥
ధరస్య పుత్రో ద్రవీణ్ హుతహవ్యో రజస్తథా ।
ధ్రువపుత్రోభవత్తాత కొలోలోకప్రకొలనః ॥
సోమస్య భగవాన్వరా బుధశ్చ గ్రహబోధనః ।
ధరోద్మీ కలిలశైవ పంచ చంద్రమసః సుతాః ॥
ఆయస్య పుత్రో వైతండ్య: శమః శాంతస్తథైవ చ ।
స్కందః సనత్కుమారశ్చ జజే పాదేన తేజసః ॥
అగ్నేః పుత్రం కుమారం తు స్వాహా జ శ్రియావృతమ్ ।
తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ ప్రష్టజాః ॥
అనీలస్య శివా భార్యా తస్యాః పుత్రో మనోజవః ।
అవిజ్ఞానగతిశ్చైవ ద్వౌ పుత్రావనిలస్య చ ॥
ప్రత్యూషస్య వీడుః పుత్రమృషిం సామ్నాథ దేవలమ్।
ద్వౌ పుత్రో దేవలస్యాపి క్షమావంతో మనీషిణే॥
బృహస్పతేస్తు భగినీ భువనా బ్రహ్మవాదినీ ।
యోగసిద్ధ జగత్కృత్నమశక్తి చరతి స హ ॥
ప్రభాసస్య తు భార్య సా వసూనామష్టమస్య హ ।
విశ్వకర్మా సుతస్తస్యాః ప్రజాపతిపతిర్వభుః॥
విశ్వేదేవాస్తు విశ్వాయా జజ్ఞిరే దశ విశ్రుతాః ।
క్రతుర్దక్షః శ్రవః సత్యః కాలః కామో మునిస్తథా ॥
తుషితులు సాధ్యులుకాగా, మన, అనుమంత, ప్రాణము, నరుఁడు, వీర్యవంతమయిన అపానుఁడు, వితీ, నయుఁడు, హయుఁడు, నారాయణుఁడు, విభువు, ప్రభువు అను నామములు వారికి చెప్పఁబడినవి. ఆ విధముగా ద్వాదశ సాధ్యులుదయించిరి.. (17) పూర్వమీదే స్వాయంభువ మన్వంతరమున జరిగినది. అంతియేకాక, మరల స్వారోచిష మన్వంతరమున గూడ తుషితుల నామముల నెఱుంగుడు. ప్రాణుం డు, అపానుడు, ఉదానుండు, సమానుఁడు, వ్యానుడు, చక్షువు. శ్రోత్రము, రసము, ఘ్రాణము, స్పర్శము, బుద్ధి, మనము. ఇవి పూర్వపు నామములు. వీనిని జ్ఞాపకముంచుకొనిరి. వస్తువులు పసుపుత్రులు. వారిని సాధ్యుల యొక్క అనుజులునుగా స్మరింతురు. ధరుఁడు, ధ్రువుఁడు, సోముఁడు, ఆయువు, అనలుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, ప్రభాసుఁడు - వీరు వసువులేనమండ్రుగా ప్రకీర్తితులు. (21) ధరుని పుత్రులు ద్రవిణుఁడు, హుశహవ్యుఁడు, రజస్సు. ధ్రువుని పుత్రుఁడు కాలుఁడు. ఆతఁడే లోకముల నియమించును (లోకప్రకాలనుఁడు) (22) భగవాన్వర్చస్సు, బుధుఁడు, గ్రహబోధనుఁడు, ధరోర్నీ కలితుఁడు - అను ఐదుగురు చంద్రుని సుతులు. ఆయుని కుమారులు - వైతండ్యుఁడు, సాముఁడు, శాంతుఁడు, స్కందుఁడు మరియు సనత్కుమారుఁడు వీరొక్కొక్క రాక్కొక్క తేజః పాదమున నుద్భవించిరి. (24) స్వాహ, అగ్నివలన కుమారులను కనెను. వారు - కుమారుఁడు; ఆతఁడు శ్రియా సంవృతుఁడు, సౌఖుఁడు, విశాఖుఁడు, నైగమేయుఁడు ఈ ప్రష్టజుఁడు నల్వురా కుమారుని తమ్ములు. కుమారుని తరుపోత పుట్టిన వారసులు - అనుజులు} {25) శివ అనిలుని భార్య మనోజవుఁడు, అవిజ్ఞాగతి - అను నీర్వురును ఆమె పుత్రులు. అనిలు న కిర్వురే కుమారులు, ప్రత్యూషసుని కుమారుఁడు ఋషి దేవలుఁడు. దేవలున కిద్దరు పుత్రులు వారు క్షమావంతులు మనీషిణలు. (27) బృహస్పతి యొక్క చెల్లెలు భువన. ఆమె బ్రహ్మజ్ఞురాలు. బ్రహ్మవాదిని. ఆమె యోగ సిద్ధురాలు. ఆమె నిస్పృహురాలు. ఆమె ప్రపంచమంతయు సంచరించుటకు శక్తురాలు. వసువులలో అష్టముఁడయిన ప్రభాసుని భార్య అయిన భువనకు ప్రజాపతి పతి విశ్వకర్మ సుతుఁడు. విశ్వధర్ముని భార్య. విశ్రుతులయిన దశ విశ్వేదేవులు విశ్వునకుదయించిరి. వారు - క్రతువు, దక్షుఁడు, శ్రవుఁడు, సత్యుండు, కాలుఁడు, కాముఁడు, ముని. (30)
పురూరవో మార్ద్రవసో రోచమా నశ్చ తే దశ ।
ధర్మపుత్రాః సురా ఏతే విశ్వాయాం జజ్ఞిరే శుభః ॥
మరుత్వత్యాం మరుత్వంతో భానవో భానుజాః స్మృతాః ।
ముహూర్తాశ్చ ముహూర్తాయా ఘోషలంబా హ్యజాయత॥
సంకల్పాయాం తు సంజజ్ఞే విద్వాన్ సంకల్ప ఏవ తు ।
నవ, వీథ్యస్తు జాయాయాః పథత్రయముపాశ్రితాః॥
పృథివీ విషయం సర్వమరుంధత్యామజాయత ।
ఏష సర్గః సమాఖ్యాతో విద్వాఛైర్మస్య శాశ్వతః ॥
ముహూర్తాశ్చైవ తిథ్యాళ్ళ ప్రతిభిః సహ సువ్రతాః ।
నామతః సంప్రవక్ష్యామీ ద్రువతో మే నిబోధత ॥
అహోరాత్రవిభాగశ్చ నక్షత్రాణీ సమాశ్రితః ।
ముహూర్తాః సర్వనక్షత్రా అహోరాత్రబీదస్తథా ॥
అహోరాత్రకలానాం తు షడశీత్యధికాః స్మృతాః ।
రవేర్గతివిశేషేణ సర్వర్తుషు చ నిత్యశః ॥
తతో వేదవిదశైతాం గతిమిచ్ఛంతి పర్వసు।
అవిశేషేషు కాలేషు జేయః సవితృమానతః ॥
రౌద్రః సార్పస్తథా మైత్రః పిత్ర్యో వాసవ ఏవ చ ।
ఆప్యోఖథ వైశ్వదేవశ్చ బ్రాహ్మా మధ్యాహ్న సంశ్రితః ॥
ప్రాజాపత్య స్తథైవేంద్ర ఇంద్రాగ్నీ నిరృతిస్తథా ।
వారుణశ్చ యథార్యమ్లో భగశ్చాపి దినాశ్రితాః ॥
ఏతే దినముహూర్తాశ్చ దివాకరవినిర్మితాః ।
శంకుచ్ఛాయావిశేషేణ వేదితవ్యాః ప్రమాణతః ॥
అజైకపాదహిర్బుధ్యః పూషాశ్వీయచదేవతాః ।
ఆగ్నేయశ్చాపి విజేయః ప్రాజాపత్యస్తథైవ చ ॥
సౌమ్యశ్చాపి తథాదిత్యో బార్హస్పత్యశ్చ వైష్ణవః ।
సావిత్రిశ్చ తథా త్వషో వాయవ్యశ్చేతి సంగ్రహః ॥
ఏతే రాత్రేర్ముహూర్తాః స్యుః క్రమోర్తా దశ పంచ చ ।
ఇందోర్గత్యుదయాజ్జేయా నాడికా ఆదితస్తథా ॥
కాలావస్తాస్విమాస్త్వేతే ముహూర్తా దేవతాః స్మృతాః ।
సర్వగ్రహాణాం త్రీణ్యేవ స్థానాని విహితాని చ ॥
పురూరవుడు, మార్ద్రవసుడు, రోచమానుఁడు. వీరు పదిమంది. ఈ మహానుభావులు విశ్వకు ధర్ముని వలన కుమారులుగా ఉద్భవించిరి. (31) మరుద్వంతులు మరుత్వతి వలనను, భానులు భానువు (ధర్ముని భార్య) వలన పుట్టిరి. ముహూర్తులు ముహూర్తవలన పుట్టిరి. లంబ ఘోషుని కనెను. సంకల్ప యందు విద్వాంసుఁడయిన సంకల్పుఁడు పుట్టెను. నవవీథులు (గ్రహమండలములు9) త్రిమార్గగాములు జమకు పుట్టిరి. (35) పృథివీ సంబంధమైన వన్నీయును అరుంధతి వలన పుట్టెను. ఇది విద్వాంసుడయిన ధర్మునీ యొక్క శాశ్వతసృష్టి. (34) ఓ సుప్రతులారా! తిథులతో ముహూర్తములను వివరించెదను. వానినీ వాని పేర్లతో వివరించుచుండగనే అవగాహన చేసికొనుఁడు. (35) అహోరాత్ర విభాగము నక్షత్రముల సమాశ్రయించి యున్నది. ముహూర్తములు సర్వనక్షత్రములు పగళ్ల యొక్క రాత్రుల యొక్క విభాగముల నేర్పరచును. దివారాత్రముల యొక్క 86 (ఎనుబది ఆరు) కంటే అధికముగ కళలు కలవు. రవి యొక్క గతి విశేషమును ననుసరించి యా కళలు అన్ని ఋతువుల యందు ప్రతి దినము నందు కలుగుచుండును. (37) అందుచేతనే, వేదవిదులయిన వారు, పర్వములయందు వాని యొక్క గతిని (సంచారమును) అంగీకరింతురు. విశేషరహితములయిన కాలములయందు, సావనమానము ననుసరించి తెలిసికొనవలయును. (38) రౌద్రము, సార్పము, మైత్రము, పిత్ర్యము, వాసవము, ఆష్యము, వైశ్వదేవము, బ్రాహ్మము - అనునవి ముహూర్తములు. ఈ ముహూర్తములు మధ్యాహము వరకు నున్నవి. ప్రాజాపత్యము, ఐంద్రము, ఇంద్రాగ్నులు, నిర్భతి, వారుణము, అర్యమ్లము మరియు భాగము అను ముహూర్తములు అపరాహ్నము నందలివి. ఇవి దీనముహూర్తములు దీవాకర వినిర్మితములు. కానీ వాని ప్రమాణమున 'శంకుచ్ఛాయా' విధానమున నెజుంగవలయును. రాత్రి యందలి పదునైదు ముహూర్తములు క్రమముగా అజైకపాదము అహిర్బుధ్యము. ఆ ముహూర్తముల అధిదైవములు - పూషన్, అశ్విన్, యమ, అగ్ని, ప్రజాపతి, సోముఁడు, ఆదిత్యుండు, గ్రహపతి, విష్ణువు, త్వష్ట వాయువు. ఇవి రాత్రి ముహూర్తములు. సంఖ్యకు పదియైదు, చంద్రుని యొక్క గతులను మొదటి నుండియు నాడికల నుండి గ్రహింపవలయును. ఈ ముహూర్తములు కాలావస్థితి నెఱింగించును. వానినీ దేవతలుగా గణింతురు. (ముహూర్త దేవతలు). సర్వగ్రహములకు మూఁడు స్థానములు విహితములయి యున్నవీ.
దక్షిణోత్తరమధ్యని తాని విద్యాద్యథాక్రమమ్ ।
స్థానం జారద్గవం మధ్యే తథైరావతముత్తరమ్ ॥
వైశ్వానరం దక్షిణతో నిర్దిష్టమివ తత్త్వతః ।
అశ్వనీ కృత్తికా యామ్యం నాగవీథీతి విశ్రుతా ॥
బ్రాహ్మ్యం సౌమ్యం తథాఠా చ గజవీథీతి శబ్దితా ।
పుష్యాశ్లేషే తథాదిత్యం వీథీ చైరావతీ మడా 11
తీస్రస్తు వీధయో హ్యేతో ఉత్తరో మార్గ ఉచ్యతే ।
పూర్వోత్తరే చ ఫల్గున్యో మఘా చైవార్షభి సతా ॥
హస్తశ్చిత్రా తథా స్వాతీ గోవీథితి తు శబ్దితా ।
జ్యేషా విశాభానురాధా వీథీ జారధవీ మతి ॥
ఏతాస్తు వీథయస్తిసో మధ్యమో మార్గ ఉచ్యతే ।
మూలం పూర్వోత్తరాషాఢ అజవీథ్యభిశబ్దితే ॥
శ్రవణం తు ధనిషా చ మార్గ శతభిషక్తథా ।
వైశ్వానరీ భాద్రపదే రేవతీ చైవకీర్తితా ॥
ఏతాస్తు వీథయస్తిసో దక్షిణే మార్గ ఉచ్యతే ।
అష్టావింశతీ యాః కస్యా దక్షః సోమాయ తా దదే ॥
సర్వా నక్షత్రసామ్యస్తా జ్యోతిషే పరికీర్తితాః ।
తాసామపత్యాన్యభవన్ దీప్తయోమిత తేజసః ॥
యాస్తు శేషాస్తదా కన్యాః ప్రతిజగ్రాహ కశ్యపః।
చతుర్ధశ మహాభాగాః సర్వాస్తా లోకమాతరః ॥
అదితిర్దితిర్ధనుః కాషారిష్టానాయుః ఖతౌ తథా।
సురభిర్వినతా తామ్ర మునిః క్రోధవశా తథా ॥
కర్జూర్మాతా చ నాగానాం ప్రజాస్తాసాం నిబోధత।
స్వాయంభువేం తరే తాత యే ద్వాదశ సురోత్తమా॥
వైకుంఠా నామ తే సాధ్యా బభూవుశ్చాక్షుషేంత ।
ఉపస్థితేంఇతరే హ్యసినునర్వైవస్వతస్య హ ।
ఆరాధితా అదిత్యో తే సమేత్యోచుః పరస్పరమ్ ।
ఏతామేవ మహాభాగామదితిం సంప్రవిశ్య వై ॥
వైవస్వతేంతరే హ్యస్మిన్యోగాదర్థేన తేజసా ।
గచ్ఛేమ పుత్రతోమస్యాస్తన్నః శ్రేయో భవిష్యతి ॥
ఆ స్థానత్రయము - 1.దక్షిణస్థానము, 2. ఉత్తరస్థానము, 3.మధ్యస్థానము. అని క్రమముగా నెఱుంగవలయును. “జారధవమన్నది మధ్య స్థానము. ఐరావతమన్నది ఉత్తర స్థానము. వైశ్వానర మన్నది దక్షిణ స్థానము. ఇట్లు తత్త్వతః స్థానములు నిర్దిష్టములు. అశ్విని, భరణి, కృత్తికల మండలములు “నాగవీథి' యని విశ్రుతము. (47) రోహిణీ మండలము, మృగశీర్చమండలము, ఆర్ధామండలము - వీనిని గజవీథి యందురు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష - నక్షత్ర మండలము ఐరావతీ వీధిని ఏర్పరచును. ఈ వీధీత్రయము ఉత్తర మార్గముగా చెప్పఁబడినది. మఖ, పూర్వ ఫలుణి, ఉత్తర ఫల్గుణీ - నక్షత్రమండలములు ఆరబీ వీథిని కలిగించును. హస్త, చిత్త, స్వాతి నక్షత్రమండములను “గోవీథ” యందురు. విశాఖ అనూరాధ, జ్యేష్ఠ - నక్షత్రమండలములు 'జగద్దవీ' వీథిని గలిగించును.. వీడులను మధ్యమ మార్గములుగా చెప్పుదురు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ మండలమును 'అజవీథి' యందురు. శ్రవణము, ధనిష్ఠ, శతభిష నక్షత్రమండలమును 'మార్టీ' వీధి యందురు. పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతీ - నక్షత్రమండలములు వైశ్వానరీ వీథిగా కీర్తించెదరు. (52) ఈ వీథీత్రయము దక్షిణ మార్గముగా చెప్పుదురు. దక్షుండు తన (28) ఇరువది యెనమండ్ర (?27) కన్యలను సోమునకు వివాహమున నొసంగెను. వారందరు జ్యోతిః పథమున పరికీర్తింపఁబడిరి. వారందరు నక్షత్రమండల నామముల నుండిరి. వారికి అపత్యము (సంతానము) కలిగిరి. వారు దీప్తిమంతులు. అమిత తేజః పూరీతులు. మహాభాగురాండ్రు అయిన ఇతరుల పదునల్లురు కన్యలను కశ్యపుఁడు వివాహమాడెను. వారందరు లోకమాతలు. (55) వారు అదీతీ, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, అనాయువు, ఖశ, సురభి, వీనత, తామ్ర, మునీ, క్రోధపశ, కద్రులు. (కద్రూ నాగమాత). పొరీ సంతానము నెరుంగుఁ డు. (56) స్వాయంభువ మన్వంతరము పండ్రెండుగురు సురోత్తములు కలరు. వారు వైకుంఠులు - వారు రైవత మన్వంతరము నందు సాధ్యులు చాక్షుష మన్వంతరమున ఈ వైవస్వత మన్వంతరముపస్థితము కాగా, అదితిచే వారు ఆరాధితులు. వారందరు సమావీష్టులై పరస్పరము వారీట్లు పలికిరి. ఈ వైవస్వత మన్వంతరమున మనమందరమున మన యోగశక్తిచే, మన యొక్క తేజస్సు నుపయోగించి ఈ పూజ్యురాలయిన అదితిలో ప్రవేశింతము. మన మామె పుత్రులమయ్యెదము. అయ్యది మన యొక్క శ్రేయస్సునకు కాగలదు.” అనీ.
ఏవముక్త్వా తు తే సర్వే వర్తమానంతరే తదా ।
జజ్ఞిరే ద్వాదశాదిత్యా మారీచాత్మశ్యపాత్పునః ॥
శతక్రతుశ్చ విష్ణుశ్చ జజ్ఞాతే పునరేవ హి ।
వైవస్వతేంతరే హ్యస్నిన్నరనారాయణౌ తదా ॥
తేషామపి హి దేహాసాం నీధనోత్పత్తిరుచ్యతే ।
యథా సూర్యస్య లోకేబిన్నుదయాస్తమయావుభౌ॥
దృష్టానుశ్రవికే యస్మాత్సక్తాః శబ్దాదిలక్షణే ।
అష్టాత్మకే ఉమాద్యే చ తస్మాత్రే జజ్ఞిరే సుర॥
ఇత్యేష విషయ రోగః సంభూతానికి కారణం స్మృతమ్ ।
బ్రహ్మశాపేన సంభూ జయాః స్వాయంభువే జితాః ॥
స్వారోచిషే పై ముషితాః సత్యాశ్చైవోత్తమే పునః ।
తామసే హర దేహా జాతోశ్చారిష్టవే తు వై ॥
వైకుంఠాశ్చాక్షుషే సాధ్యా ఆదీత్యోః సప్తమే పునః ।
ధూర్యమా చ మిత్రశ్చ వరుణోం శో భగస్తథా ॥
ఇంద్రో వివస్వాన్ పూషా చ పర్జన్యో దశమః స్మృతః।
తతస్త్వష్టా తతో విష్ణురజఘన్యో జఘన్యజః ॥
ఇత్యేతే ద్వాదశాదిత్యః కశ్యపస్య సుతా విభోః ।
సురభ్యాం కశ్యపాద్రుద్రో ఏకాదశ విజిరే॥
మహాదేవ ప్రసాదేన తపసా భవితా సతీ ।
అంగారకం తథా సర్పం నిరృతిం సదసత్చస్పతిమ్ ॥
అజైకపాదహిర్బుధ్యే ద్వావేకం చ జ్వరం తథా ।
భువనం చేశ్వరం మృత్యుం కపాలీతి చ విశ్రుతమ్ ॥
దేవానేకాదశైతాంస్తు రుద్రాంశ్రిభువనేశ్వరాన్ ।
తపసోద్రేణ మహతా సురభిస్తానజ్జనత్ ॥
తతో దుహితరావన్యే సురభిరేవ్యజాయత ।
రోహిణీ చైవ సుభగాం గాంధర్వీం చ యశస్వినీమ్ ॥
రోహిణ్యా జజ్ఞిరే కన్యాశ్చతస్ర లోకవిశ్రుతాః ।
సురూపా హంసకాలీ చ భద్రా కామదుఘా తథా ॥
సుషువే గాః కామదుఘా సురూపా తనయద్వయమ్ ।
హంసకాలీ తు మహిషాన్భదాయాస్త్వవిజాతయః ॥
విశ్రుతాస్తు మహాభాగా గాంధర్వా వాజినః సుతాః ।
ఉచ్చైశ్రవాదయో జాతాః ఖేచరాస్తే మనోజవాః ॥
శ్వేతాః శోణాః పిశంగాశ్చ సారంగా హరీతార్జునా ।
ఉక్తా దేవోపవాహ్యాస్తే గాంధర్వయోనయో హయాః॥
ఇట్లు పలికి, అదితి కశ్యపులకు పండ్రెండుగురు ఈ జరుగుచున్న మన్వంతరమున పుట్టిరి. (మరీచీ పుత్రుడు కశ్యపుడు). వైవస్వత మన్వంతరములో శతక్రతువు విష్ణువు నరనారాయణులుగా మరలపుట్టిరి. (62) సూర్యునికి ఈ ప్రపంచమున ఉదయము అస్తమానము ఉన్న విధముగనే ఈ దేవతలకు జనన మరణములు కలవు. అని చెప్పబడినది.(63) ప్రాపంచిక విషయములయిన శబ్దాదులయందు వేదసంప్రదాయమున వారు సంసక్తులగుటచేతను వారు అణిమాద్యష్టశక్తుల యందు సిద్దులయందు సంసక్తులగుటచే దేవతలు మరల జన్మించిరి.(64) ఇట్లు ప్రాప్తించిన విషయానురాగ సంసక్తతయే కారణముగా వారు పునర్జన్మ నొందిరని జ్ఞాపకముంచుకొనవలెను. (64) స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క శాపము కారణముగా 'జయలు' అను పేరుగల దేవతలు 'జీతులు'గా నుద్భవించిరి. వారే స్వారోచిష మన్వంతరమున తుషితు'లుగా పుట్టిరి. ఉత్తమ మన్వంతరమున 'సత్యులు'గాను పుట్టిరి. ఆ దేవతలే తామస మన్వంతరమున 'హరులు'గా పుట్టిరి. అరిష్టవ రైవత) మన్వంతరమున వారు (ఆ దేవతలు} వైకుంఠులుగా పుట్టిరి. సాధ్యులుగా వారు చాక్షుష మన్వంతరమున పుట్టిరి. ఏడవదిన వైవస్వత మన్వంతరమున వారు ఆదిత్యులుగా పుట్టిరి. విభుఁడయిన కశ్యపుని కుమారులగు ద్వాదశాదిత్యులు - ధాత,అర్యముఁడు, మిత్రుఁడు, వరుణుఁడు, అంశుఁడు, భగుఁ డు, ఇంద్రుఁడు, వివస్వంతుఁడు, పూషుఁడు, పర్జన్యుఁడు, త్వష్ట, విష్ణువు, తుదిని జన్మించినను విష్ణువు ప్రధానుండే. (అజఘన్యో జఘన్యజః) సురభికి కశ్యపుని పుత్రులుగా పదునొక్కండ్రు రుద్రులు పుట్టిరి. వారు మహాదేవ ప్రసాదమున జన్మించిరి. ఆ పరమ పవిత్రురాలు వ్రతముల చేతను తపస్సు చేతను సతి (పవిత్రురాలు). ఏకాదశ రుద్రులు - అంగారకుఁడు, సర్పుఁడు, నిరృతి, సదసస్పతి అజైకపాదుఁడు, అహిర్భుధ్యుం డు, జ్వరుండు, భువనుఁడు, ఈశ్వరుఁడు, మృత్యువు, కపాలీయని ప్రపంచవీశ్రుతుఁడు. పవిత్ర వ్రతములచే, తపస్సుచే, సురభి యీ పదునొకండు రుద్రులను (దేవతలను) కనెను. వారందరు శ్రీభువనేశ్వరులు.(71) మహాత్మురాలయిన సురభి ఇద్దరు కూతుండ్రను కూడ కనెను. - వారు సౌందర్య నిధియైన రోహిణి. (72) గొప్ప యశస్వినియైన గాంధర్వీయు(73) లోక విశ్రుతలయిన నురు పుత్రికలు రోహిణీకి కలిగిరి. వారు సురూష, హంసకాళీ, భద్ర మరియు కామదుమ. అనువారు (74) కామదుఘకు ఆవులు పుట్టెను. సురూప ఇరువురు కుమారులను కనెను. హంసకాలి మహిషములను కనెను. భద్ర అజసంతతులను కనెను. గాంధర్వ బిడ్డలు అశ్వములు. అవి సువిశ్రుతములు అవియే ఉచ్చైశ్రవము మున్నగునవి. వానికి మనోజవము గలదు. అవి ఆకాశమున సంచరించును. గాంధర్వి తల్లిగా గల అశ్వములు దేవతల వాహనములు. అవి శ్వేత, శోణ, పిశంగ వర్ణములు. అంతీయేకాక అవి పచ్చనివి. అర్జునవర్ణము కలిగినవి.
భూయో జజ్ఞే సురభ్యాస్తు శ్రీమాన్ చంద్రప్రభో వృషః ।
స్రగ్వీ కకుద్మాన్యుతిమానమృతాలయసంభవః ॥
సురభ్యనుమతే దత్తో ధ్వజో మాహేశ్వరస్తు సః ।
ఇత్యేతే కశ్యపసుతా రుద్రాదీత్యాః ప్రకీర్తితాః ॥
ధర్మపుత్రాః స్మృతాః సాధ్యా విశ్వ చ వసవస్తథా ।
యథేంధనవశాద్వహ్నిరేకస్తు బహుధా భవేత్ ॥
భవత్యేకస్తథా తద్వన్మూర్తీనాం స పితామహః ।
ఏకో బ్రహ్మాంతకశ్చైవ పురుషశ్చేతి తత్ర యః ॥
ఏకస్యైతాః స్మృతాన్తస్రస్తనవస్తు స్వయంభువః ।
బ్రాహ్మీ చ పౌరుషీ చైవ కాలాఖ్యా, చేతి తాః స్మృతాః ॥
యా తత్ర రాజసీ తస్య తసుః సా వై ప్రజాకరీ ।
మతా సా యా తు కాలోఖ్యా ప్రజాక్షయకరీ తు సా ॥
సాత్త్వికీ పౌరుషీ యా తు సా తనుః పాలికా స్మృతా ।
రాజసీ బ్రహ్మణో యా తు మారీచః కశ్యపో భవత్ ॥
తామసీ చాంతకృద్యా తు తదంతో విష్ణురుచ్యతే ।
త్రైలోకే తాః స్మృతాస్తిప్రసనవో వై స్వయంభువః ।
నానాప్రయోజనార్థా హి కాలావస్థాః కరోతి సః ॥
సృజత్యథానుగృహ్లా తథా సంహరతి ప్రజాః ।
ఏనమేతాః స్మృతాస్తిసస్తనవో హి స్వయంభువః ॥
ప్రాజాపత్యా చ రౌద్రా చ వైష్ణవీ చేతి తాస్త్రిధా ।
ఏతాస్త (స్వ:) న్యః స్మృతా దేవా ధర్మశాస్త్రీ పురాతనే॥
సాంఖ్యయోగరతైరీరైః పృథగేకార్థదర్శిభిః ।
అభిజాతిప్రభావజైర్మునిఖిస్తత్వదర్శిభిః ॥
ఏకత్వేన పృథక్ష్వేన లాసు భిన్నా: ప్రజాస్విమా ।
ఇదం పరమిదం నేతి బ్రుపతే భిన్నదర్శినః ॥
బ్రహ్మాణం కారణం కేచితేచిదాహుః ప్రజాపతిమ్ ।
కేద్భవం పరత్వేన ప్రాహుర్విష్ణుం తథాపరే ॥
అభిజ్ఞానేన సంభూతాః సత్తారిష్టవిచేతసః ।
సత్త్వం కాలం చ దేశం చ కార్యం చవేక్ష్య కర్మ చ ॥
కారణం తు స్మృతా హ్యేతే సోనార్దేష్విహ దేవతాః ।
ఏకం ప్రశంసమానస్తు సర్వానేవ ప్రశంసతి ॥
ఏకం నిందతి యస్తేషాం సర్వానేవ స నీందతి ।
న ప్రద్వేషస్తతః కార్యో దేవతాస్తు ఏజనతా ॥
న శక్యా ఈశ్వరా జ్ఞాతుమైశ్వర్యేణ వ్యవస్థితాః ।
ఏకత్వాత్స త్రిధా భూత్వా సంప్రమోహయతి ప్రజాః ॥
శ్రీమంతము చంద్రప్రభము నయిన యొక వృషభము సురభికి కలిగిను. ఆ వృషభమునకు ఒక మాల, ప్రకాశవంతమయిన మూపురము కలవు. ఆ వృషభము అమృతాలయసంభవము (?) సురభి యొక్క అనుమతితో నయ్యది మహేశ్వరునకు ధ్వజముగా నీయఁబడెను. ఈ విధముగా కశ్యపసుతులు (రుద్రులు) ఆదిత్యులు ప్రకీర్తింపఁబడిరి. (79) సాధ్యులు, విశ్వేదేవతలు, వస్తువులు ధర్మపుత్రులుగా స్మరింపం బడిరి. ఇంధనముల వశముచే ఒకే అగ్ని బహ్వగ్నులగునట్లు పితామహుడొక్కండు, కాని ఆతని కనేకములయిన మూర్తులు. బ్రహ్మ, అంతకుఁడు, పురుషుఁడు - ఈ మువ్వురొక్కమూర్తియే.కాని ఈ ముగ్గురు ఒకే యొక స్వయంభువుఁ డయిన ప్రభువునకు త్రివిధములయిన భౌతికశరీరములు అని యెఱుంగవలయును. ఈ భౌతిక శరీరములు (బ్రాహ్మీ, పౌరుషీ, కాలాఖ్యములుగా జ్ఞాపకముంచుకొనబడినవి. రజోగుణ ప్రధానమయిన రాజసీ తనువు ప్రజలను సృజించును. కాలాఖ్యమయినది ప్రజాక్షయకరీ సత్వగుణ ప్రధానమయిన పౌరుషీ శరీరము పాలీకగో ప్రజారక్షకముగా దలంతురు. మరీచి కుమారుఁడయిన కశ్యపుండు రాజసీయుతమైన బ్రహ్మయొక్క శరీరమయ్యెను. (84) అంతకృత్ (నాశనము చేయు) తామసీ సంబంధమయిన శరీరమును విష్ణువందురు. స్వయంభువుని యొక్క త్రిరూపములయిన తనువులు మూఁడు లోకములందుండు ననీ తలంతురు, ఆతఁడు, వివిధములయిన కాలసంబంధమైన రూపములను అషస్థలను వహించును. ఆతఁడే ప్రజలను సృజించును, పాలించును. సంహరించును. ఈ విధముగా స్వయంభువుని మూఁడు తనువులు జ్ఞాపకముంచుకొనఁబడినవి. (87) (ఆ కళలు) అయ్యవి 1. ప్రాజాపత్యము (ప్రజాపతి సంబంధములైనవి) 2.రౌద్రములు (రుద్ర సంబంధములయినవి), 3.వైష్ణవములు (విష్ణుసంబంధములయినవి)గా మూఁడు విధములు. తత్త్వద్రష్టలు, సాంఖ్య యోగముల యందు ప్రీతులు, యోగరతులు, బుద్దేశాలురు, ప్రభావజ్ఞులు, ఆభిజాత్యము యొక్క గొప్పతనము శక్తిని నెటింగీనవారు, వస్తువుయొక్క స్థితిని విచక్షణతో అంగీకరించి ప్రత్యేకముగా నెఱింగినవారును, అయిన మునులచే, ప్రాచీనములయిన ధర్మ శాస్త్రములండు ఈ త్రివిధ శరీరములు చెప్పబడినవి. (89) ఈ ప్రజలు, ఏకత్వమునను పృథక్త్వమునను భీన్నులు. భిన్నదర్శనులయినవారు ఇది గొప్పదీ ఇదీ గొప్పది కాదు. అని యందురు. (90) కొంతమంది బ్రహ్మనే ప్రధాన కారణమందురు. కొందరో ప్రజాపతియే కారణమందురు. మకాందరో భవుఁడే (ఈశ్వరుండే) అందరికంటే నధికుఁడందరు. ఇతరులు విష్ణువు గొప్పయందురు. (91) ఆధ్యాత్మిక (తాత్త్వీక)చింతనము కలిగిన వ్యక్తులు, వారీ వారి విజ్ఞానములచే ప్రభావితులు. వారు అనిష్టకరములయిన శకునాదులకు సంసక్తులగుట మనస్సులలో భ్రాంతి నొందుదురు. వారు సత్త్వ, కోల,దేశ,కార్య కర్మములను గమనించి చెప్పుదురు, ఆయా దేవతలు వీనికి కారణములని వారు సంస్మరింతురు. ఒకదానిని ప్రశంసించువాఁ డు ఇతరులను ప్రశంసించును. (83) ఒకదానిని నిందించినవాఁడు మిగిలిన వానీ నన్నీంటినీ కూడ నిందించును. అందుచే వీనిని తెలిసిన వాడెవ్వఁడును, దేవతలయందు ద్వేషము వహింపరాదు. (94) ఐశ్వర్యశక్తి వ్యవస్థితులయిన ఈశ్వరులను దెలిసికొన శక్తి చాలదు. ఏకత్వము నుండి త్రిధా భావము నొంది ప్రజలను (ఈశ్వరుఁడు) సమ్మోహపరచును.
ఏతేషాం వై త్రయాణాం తు వీచిన్వంత్యంతరం జనాః ।
జిజ్ఞాసవః పరీహంతే సక్తా దుష్టా విచేతసః ॥
ఇదం పరమిదం నేతి సంరంభాద్భిన్నదర్శినః ।
యాతుధానా విశేషా యే పిశాచాశ్చైవ సాంతరమ్ ॥
ఏకః స తు పృథక్ష్వేన స్వయం భూత్వా చ తిష్ఠతి ।
గుణమాత్రాత్మికాభిస్తు తనుభిర్మోహయన్ ప్రజాః ॥
తేషేకం యజతే మో వై స తో యజతే త్రయమ్ ।
తస్మాద్దేవాస్తయో హ్యేతే నేరంతర్యేణ ధిష్ఠితాః ॥
తస్మాతృథక్వమేకత్వం సంఖ్యాసంఖ్యే గతాగతమ్ ।
అల్పత్వం పా బహుత్వం వా తేషు కో జ్ఞాతుమర్హతి ॥
తస్మాత్సుృష్ట్వానుగృహోతీ గ్రసతే చైవ సర్వశః ।
గుణాత్మకత్వవైకల్యే తస్మాదేకః స ఉచ్యతే ॥
రుద్రం బ్రహ్మాణ మీంద్రం చ లోకపొలాన్ ఋషీన్ మనూన్ ।
దేవం తమేకం బహుథా ప్రాహుః నారాయణం ద్వీజాః ॥
ప్రాజాపత్యా చ రౌద్రీ చ తనుర్యా చైవ వైష్ణవీ ।
మన్వంతరేషు వై తీస ఆవర్తంతే పునః పునః ॥
క్షేత్రజ్ఞా అపీ చాన్యేస్య విభో జాయంత్యనుగ్రహాత్ ।
తేజసా యశసా బుద్ధా శ్రుతేన చ బలేన చ ॥
జాయంతే తత్సమాశ్చైవ తానపీమాన్నిబోధత ।
రాజస్యా బ్రహ్మణాంశేన మారీచః కశ్యపోఽభవత్ ॥
తామస్యా స్తస్య చాంశేన కాలో రుద్రః స ఉచ్యతే ।
సాత్విక్యాశ్చ తథాంశేన యజ్జో విష్ణురజాయత ॥
తీషు కాలేషు తస్యైతా బ్రహ్మణస్తనవో ద్విజాః ।
మన్వంతరేష్విహ స్రష్టుమావర్తంతే పునః పునః ॥
మన్వంతరేషు సర్వేషు ప్రజాః స్థావరజంగమాః ।
యుగాదౌ సకృదుత్పన్నాస్థిష్ఠంతీహాప్రసంయమాత్ ॥
ప్రాప్తి ప్రాప్తీ తు కల్పాంతే రుద్రః సంహరతి ప్రజాః ।
కాలో భూత్వా యుగాత్మాసౌ రుద్రః సంహరతే పునః ॥
సంప్రాప్తే చైవ కల్పాంతే సప్తరశ్మిర్దివాకరః ।
భూత్వా సంవర్తకాదిత్యట్రంల్లో కాంశ్చ దహత్యుత ॥
విష్ణుః ప్రజానుగ్రహకృత్సదా పాలయతి ప్రజాః ।
తస్యాం తస్యామవస్థాయాం తత ఉత్పాద్య కారణమ్ ॥
సత్త్వోద్రిక్తా తు యా ప్రోక్తా బ్రహ్మణః పౌరుషీ తనుః ।
తస్యాంశేన చ విజ్ఞేయో మనోః స్వాయంభువేంతరే ॥
ఈ మూడింటి యొక్క భేదమును ప్రజలు తెలిసికొనుటకు ప్రయత్నింతురు. కోరుదురు. దెలిసికొనఁగోరువారు సంసక్తులు. పోరుదుష్ట చేతస్కులు, వారు వారి మనస్సులలో వీమోహితులు. వారనేకత్వమును చూచెదరు. ఏలయన - వారిట్లందురు “ఇదీ పరము (ఉత్కృష్టము), ఇది కాదు (నీచము). అని సంరంభమున భేదమును జూతురు. (నిజమునకు) యాతుధానులు - పిశాచులు వీరిలో భేదము లేదు. ఆతడు ఒక్కడే! కానీ విభిన్నముగా నుండును (పృథక్ష్వేన గుణమాత్రాత్మికములయిన దేహములను పొంది, ప్రజలను విమోహ మొనరించుచుండును. (98) వానీలో నెవ్వఁడొక్క దానిని పూజించునో ఆతఁడు మూడింటిని పూజించును. అందుచే నీ ముగ్గురు దేవతలు నైరంతర్యమున అధిష్టితులై అభిన్నముగా నుందురు. అందుచే వానీ యందలి పృథక్యము, ఏకత్వము, సంఖ్యాత్వము, అసంఖ్యాత్వము గమనించుటకు శక్యముగాదు. వాని యందలి యల్పత్వము కాని బహుత్వము కాని యెవ్వఁడెఱుంగ సమర్థుఁడు? (100) అందుచే ఆతఁడు సృజించి అనుగ్రహించును. సర్వవిధములను గ్రసించును. అందుచే అతని యందు గుణాత్మకత్వము లేనిచో ఆతని నొక్కండందురు. (101) బ్రాహ్మణులు ఆ ప్రభువయిన నారాయణుని వివిధములయిన రుద్ర బ్రహ్మ ఇంద్రలోకపాల ఋషి మను దేవ - నామములతో నొక్కండని యందురు. ప్రాజాపత్య, రౌద్రి, వైష్ణవి అను మూఁ డు తనువులును మన్వంతరముల యందు పునః పునః వచ్చును. ఆవర్తించును. క్షేత్రజ్ఞులు కూడ నీ విభుని యొక్క యను గ్రహమున పుట్టుచున్నారు. ఈ క్షేత్రజ్ఞులు తేజస్సుచే, యశస్సుచే, బుద్దీచే, శ్రుతిచే, బలములచే ఆ ప్రభునితో సమానముగా జన్మించుచున్నారు. వారిని చక్కగా గ్రహింపుము. మరీచి పుత్రుఁడయిన కశ్యపుండు బ్రహ్మయొక్క రాజసీభాగముచే నుదయించెను. (105) కాలుఁడయిన రుద్రుండు, బ్రహ్మయొక్క తామసీ లక్షణముచే జన్మించెను. యజ్ఞ స్వరూపుఁడయిన విష్ణువు బ్రహ్మ యొక్క సాత్త్విక లక్షణముచే పుట్టెను. ఓ బ్రాహ్మణులారా ! బ్రహ్మయొక్క శరీరములు పునః పునః సృష్టి ప్రయోజనము కొఱకు మూఁడు కాలములయందు ఆవర్తించును. అన్ని మన్వంతరము ఆరంభమునందు స్థావర జంగమాత్మకములయిన ప్రజలు (సకృదేవ) ఒకేయొకసారి పుట్టి, వారీ వినాశన పర్యంతముందురు. (ప్రళయమున నాశనము చేందుదురు). కల్పాంతమున రుద్రుఁడు ప్రజలను సంహరించును. కాలుండయి రుద్రుఁడు యుగాత్ముఁడైన యాతండు ప్రజలను సంహరించును. కల్పాంతము సంప్రాప్తముకాగా సప్తరశ్నియైన దీవాకరుఁడు సంవర్తకాదిత్య రూపమున మూడు లోకములను భస్మీభూతమొనర్చును. (110) ప్రజానుగ్రహ కారకుఁడయిన విష్ణువు ప్రజలను పాలించును. భిన్న భిన్న అవస్థల యందు ప్రజోత్పాదన కారణమును నతఁడే కలిగించును. సత్త్వ గుణ ప్రధానత్వము వహించిన పౌరుషీతనువయిన బ్రహ్మనుండి విష్ణువు మొదట పుట్టును. అతడు మనువు యొక్క స్వాయంభువ మన్వంతరమున ఆతని యంశచే పుట్టునని యెఱుంగవలయును.
ఆకృత్యాం మనసా దేవ ఉత్పన్నః ప్రథమం విభుః ।
తతః పునః స వైదేవః ప్రాప్తే స్వారోచిషేఖంతరే ॥
తుషితాయాం సముత్పన్నో హ్యజితస్తుషితైః సహ ।
ఔత్తమే హ్యంతరే వాపి హ్యజితస్తు పునః ప్రభుః ।
సత్యాయామభవత్సత్యః సహ సత్యైః సురోత్తమైః ।
తామసస్యాంతరే చాపి స దేవః పునరేవ హి ॥
హరిణ్యాం హరిభిః సార్ధం హరిరేవ బభూవ హ ।
వైవస్వతేంతరే చాపి హరిర్దేవైః పునస్తు సః ॥
వైకుంతే నామతో జట్టే విధూతరజసైస్సహ ।
మారీచాత్కశ్యపాద్వీష్ణురదీత్యాం సంబభూవ హ ॥
త్రిభిః క్రమైరిమాంల్లోకాస్ జిత్వా విష్ణుప్రివిక్రమః ।
ప్రత్యపాదయిదింద్రాయ దేవతైశ్చైవ స ప్రభుః ॥
ఇత్యేతాస్తనవో జాతా వ్యతీతాః సప్తసప్తసు ।
మన్వంతరేష్వరీతేషు యాభిః సంరక్షితాః ప్రజాః ॥
యస్మాద్విశ్వమీదం సర్వం జాయతే లీయతే పునః ।
యస్యాంతేనామరాః సర్వే జయంతే త్రిదివేశ్వరాః ॥
వర్గంతే తేజసా బుద్దా శ్రుతేన చ బలేన చ ।
యద్యద్విభూలీమత్సత్వం శ్రీమదూర్జీతమేవ వా ॥
తత్తదేపావగచ్ఛధ్వం విష్ణో స్తేజోంశ సంభవమ్ ।
స ఏవ జాయతేం శేన కేందీచ్ఛంతి మానవః ॥
ఏకే వివదమాసాస్తు దృష్టాంతాంత్చ బ్రవంతీ పా।
ఏషాం న విద్యతే భేదః త్రయాణాం ద్యుసహమిహ॥
జాయంతే మోహయంత్యంశైరీశ్వరా యోగమాయయా ।
తస్మాత్తేషాం ప్రచారే తు యుక్తాయుక్తం న విద్యతే ।
భూతానువాదినామాద్యా మధ్యస్థా భూతవాదినామ్ ॥
భూతానువాదినః సక్తాస్త్రయశ్చైవ ప్రవాదినామ్ ।
పరీక్ష్య ఛానుగ్భద్ధాంతి నిగృహ్లంతీ ఇలాన్ స్వయమ్ ॥
మత్తః పూర్వే చ తే తస్మాత్ర్పభవశ్చ తవ్ధికాః ।
తథాధికరణైరేతైర్యథా తత్త్వనిదర్శకాః ॥
దేవానాం దేవభూతాశ్చ తే వై సర్వప్రవర్తకాః ।
కర్మణాం మహతాం తే హి కర్తారో జగదీశ్వరాః ॥
స్వాయంభువ మన్వంతరము ఆకృతియందు బ్రహ్మకు మనసా ఉత్పన్నుఁడు. మరల స్వారోచిష మన్వంతరము రాగా ఆ ప్రభువు తుషిత యందు అజితుడుగా జన్మించెను. ఆతనితో సహా ఇతరులయిన తుషిత దేవతలు నుదయించిరి. ఔత్తమమన్వంతరమున ఆజితుఁడే మరల ప్రభువు. ఆతఁడు సత్యయందు సత్యుఁడుగా పుట్టెను. ఆతనితో సహా సురోత్తములయిన సత్యదేవతలుదయించిరి. (115) తామస మన్వంతరమున ఆ ప్రభువు హరిగా హరిణీ యందు ఇతరులయిన హరులతో పుట్టెను. వైవస్వత మన్వంతరమున (రైవత?) ఆతఁడు (హరి) మరల వైకుంఠుఁడు అను నామముతో సర్వ రజో గుణములను పరిత్యజించిన దేవతలతో నుదయించెను. విష్ణువు మరీచి కుమారుఁడయిన కశ్యపునకు అదితి వలన నుదయించెను. (117) మూఁడడుగులచే లోకములను జయించి విష్ణువు త్రివిక్రముఁడై ఇంద్రునకీ లోకత్రయమును నొసంగేను. (118) ఈ విధముగా ఏడు మన్వంతరములయందు వీరు ఏడుమారు లుదయించిరి. గత మన్వంతరములందు ప్రజలు వారిచే సంరక్షింపఁబడిరి. (119) విష్ణుని వలననే యీ యావత్తు విశ్వము పుట్టినది. మరల ఈ ప్రపంచము అతని యందే లయమగును. విష్ణ్వంశము వలననే త్రిలోకాధిపతులు అమరులును పుట్టిరి. ఆ విష్ణువు వలననే ఆ దేవతలందరు తేజస్సుచే, బుద్దిచే, శ్రుతులచే, బిలముచే వృద్ధి పొందుచున్నోరు. విభూతిమంతము శక్తిమంతము (ఊర్జితము) అయినదేదియున్నదో యది యంతయు విష్ణుని యొక్క తేజోంశ సంభవముగా నుత్పన్నమైనట్టిదే. (121) కోందరు తనయంశము చేతనే విష్ణువు పుట్టెనని భావింతురు. కొందరి విషయమునంగీకరింపక వివాదించెదరు. వారేవో కొన్ని యుదాహరణముల నొసంగెదరు. ఆ మువ్వురి యందు భేదము లేదు. వారు స్వర్గాధివాసులు. (123) ఆ మువ్వురు వారంతట వారే యోగమాయచే పుట్టుదురు. వారి విభిస్తోంశలచే ఇతరులను విమోహింపఁజేయుదురు. అందుచే వారి యొక్క ప్రచారము నందు యుక్తమయినదీ కాని యయుక్తమయినది కాని మరేదియు లేదు. భూతాను వాదులో వారు మొట్టమొదటివారు. వారే భూతవాదులలో మధ్యస్థులు.. ఆ మువ్వురు భూతముల నంగీకరించువారితో సంబంధము కలఫారు. వారు గుణములను పరీక్షించిన తరువాత వారే ప్రజలననుగ్రహించెదరు. దుర్మార్గులనువారే స్వయముగా నిగ్రహించెదరు. (126) వారు నాకంటే పూర్వము పుట్టినవారు. అందుచే వారత్యధిక శక్తిమంతులయిన ప్రభువులు. సత్యమును సూచించు వ్యక్తులవలే వారును నీయుపాధుల నుపయోగింతురు. (127) వారు విశ్వమున కధిపతులు. వారు దేవతలకు దేవతలు. వారు సర్వప్రవర్తకులు. వారే మహత్కార్యములను సాధించిన కర్తలు జగదీశ్వరులు.(128)
శ్రుతిజ్ఞైః కారణై రేతైశ్చతుర్భిః పరికీర్తితాః ।
బాలిశాస్తే న జానంతి దైవతాని ప్రభాగశః॥
ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం యోగీశ్వరాన్ ప్రతి ।
కుర్యాద్యోగబలం ప్రాప్య తైశ్చ సర్వైర్మహాంశ్చదేత్ ॥
ప్రాప్నుయాద్విషయాంశ్చైవ పునశ్బోర్ధ్వం తపశ్చరేత్ ।
సంహరేత పునః సర్వాస్ సూర్యో జ్యోతిర్గణానివ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
స్వయంభూత్రైగుణ్యస్వరూపవర్ణసం నామ తృతీయోధ్యాయః॥
ఈ నాలుగు కారణములచే, శ్రుతీజులయినవారిచే వారందరు పరికీర్తితులు. స్తోత్రమాచరింపఁబడిరి. బాలిశులు (మూఢులు - అజ్ఞానులు) ఆ దేవతలను వివిధములయిన వారి లక్షణములతో విభాగశః తెలియరు. (129) ఈ సందర్భములో యోగీశ్వరులను గూర్చి ఈ శ్లోకమును ఉదాహరణముగా చెప్పెదరు. (యోగీశ్వరులు యోగానుభవమున శ్రేష్టులు) యోగీశ్వరుఁడు యోగసంబంధమయిన బలమును పొందిన తరువాత సర్వము నాచరించును. వారందరితో ఆ మహాయోగి సంచరించును. అతఁడో ప్రాపంచిక విషయానందమును పొందవచ్చును. తరువాత నతండే తపస్సు నాచరించును. మరల నతఁడు సూర్యుఁడెట్లు సర్వజ్యోతిర్గణములను సంహరించునో (ఉపసంహరించునో) అట్లే ఉపసంహరించును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున స్వయంభువుని త్రైగుణ్య స్వరూప వర్ణనమను తృతీయాధ్యాయము.
