2 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము
6 - దనువంశకీర్తనము
సూత ఉవాచ :-
అభవన్షనుపుత్రాస్తు వంశే ఖ్యాతా మహాసురాః ।
విప్రచిత్తిప్రధానాస్తే చింతనీయపరాక్రమాః ॥
సర్వే లబ్ది వరాశ్చైవ తే తప్తతపసస్తథా ।
సత్యసంథాః పరాక్రాంతాః క్రూరాః మాయావిసశ్చ తే ॥
మహాబలాస్తే జవనా బ్రహ్మిషా యే చ సాగ్నయః ।
కీర్త్యమానాన్మయా సర్వాన్ ప్రాధాన్యేన నిబోధత ॥
ద్వీమూర్ధా శంబరశ్చైవ యథా శంకురథో విభుః ।
శంకుకర్ణో విపాదశ్చ గవిష్ణో దుందుభిస్తథా ॥
అయోముఖస్తు మఘవాన్ కపిలో వామనో మయః ।
మరీచిరసిపాశ్చైవ మహామాయోశిరా భళీ ॥
వీక్షోభశ్చ సుకేతుశ్చ కేతువీర్యశతాహ్వయా ।
ఇంద్రజిద్వివిదశ్చైవ తథా భద్రశ్చ దేవజిత్॥
ఏకచక్రో మహాబాహుస్తారకశ్చ మహాబలః ।
వైశ్వానరః పులోమా చ ప్రొపజోథ మహాశీరాః ॥
స్వర్భానుర్వృషపర్వా చ పురుండశ్చ మహాసురః ।
ధృతరాష్ట్రశ్చ సూర్యశ్చ చంద్రమా ఇంద్రలాపనః ॥
సూక్ష్మశ్చైవ నిచంద్రశ్చ చూర్ణనాభో మహాగిరిః ।
అసిలోమా సుకేశశ్చ శరశ్చ మూలకోదరః ॥
జంలో గగనమూర్ధా చ కుంభమానో మహోదకః ।
ప్రమదోద్మశ్చ కుపడో అశ్వగ్రీవశ్చ వీర్యవాన్ ॥
వైమృగః సవిరూపాక్షః సుపథశ్చ హలాహలో ।
అక్షో హిరణ్మయశ్చైవ శతగ్రీవశ్చ శంబరః ॥
శరభః శ్వలభశ్చైవ సూర్యాచంద్రమసావుభౌ ।
అసురాణాం స్కృతావే సురాణాం చ ప్రభావిణే ॥
ఇతి పుత్రాః దనోర్వంశప్రధానాః పరికీర్తితాః ।
తేషామపరీసంఖ్యేయం పుత్రపౌత్రమనంతరమ్ ॥
ఇత్యేత అసురాః క్రాంతి దైతేయా దానవాస్తథా ।
సుత్వానస్తు సుృతి దైత్య అసుత్వానో దనోః సుతాః ॥
ఇమే చ వంశానుగతా దనోః పుత్రాన్వయాః స్మృతాః ।
ఏకాక్షే శ్వప్రభారిష్టః ప్రలంబనరకావపి ॥
ఇంద్రబోధనకేశీ చ పురుషః శేషవానురుః ।
గరిష్ఠశ్చ గవాక్షశ్చ తాలకేతుశ్చ వీర్యవాన్ ॥
ఏతే మనుష్యా వధ్యాస్తు దసుపుత్రాస్వయాః స్మృతాః ।
దైత్యదానవసంయోగే జాలో భీమ పరాక్రమాః ॥
సింహికాయామదోత్పన్నా విప్రచిత్తే: సుతా ఇమే ।
సైంహికేయాః సమాభ్యాతాశ్చతుర్ధశ మహాసురాః ॥
శలశ్చ శలభశ్చైవ సవ్యసివ్యస్తథైవ చ ।
ఇల్వలో నముచిశ్చైవ వాతాపిస్తు సుపుంజికః ॥
హరకల్పః కాలనాభో భౌమశ్చ కనకస్తథా ।
రాహుర్జ్యేష్ఠస్తు తేషాం వై సూర్యచంద్రప్రమర్దనః ॥
సూతుఁడిట్లనెను.
దనుని యొక్క పుత్రులు మహాసురులు వంశమునందు ప్రఖ్యాతులు. వారిలో ప్రధానుఁడు విప్రచిత్తి. వారు ఊహించుటకు సాధ్యము కానీ పరాక్రమము కలవారు. వారందరు తపస్సాచరించినవారు పొందబడిన వరములు కలవారు. వారు సత్యసంధులు. శత్రువునెడ పరాక్రమవంతులై, శత్రువుల బాధించినవారు. వారు క్రూరులు, మాయావినులు, వారు మహాబలురు. అత్యధికమయిన జవనము (వేగము) కలవారు. వారు వేదముల నధ్యయనము చేసినవారు. నిత్యాగ్నిహోత్ర దీక్షితులు. వారి యొక్క ప్రాధాన్యము ననుసరించి వారిని కీర్తించితినని యెఱుంగుము. (3) ఈ క్రింద పేర్కొనబడినవారు వంశానుగతులయిన దనువు పుత్రులుగా ప్రకీర్తితులు. ద్వీమూర్తుఁడు, శంబరుఁడు, దుందుభి, అయోముఖుఁడు, మఘవంతుఁడు, శంకురథుఁడు, విభుఁడు, శంకుకర్ణుఁడు, వీపాదుఁడు, గవిష్ఠుడు, కపిలుడు, వామనుఁడు, మయుఁడు, మరీచి, అసిపుండు,మహామాయుడు, అశిరసుఁడు, భృశి, విక్షోభుఁడు, సుకేతుండు, కేతువీర్యుఁడు, శతాహ్వయుఁడు, ఇంద్రజిత్తు, దావీదుఁడు, భద్రుండు, దేవజిత్, ఏకచక్రుఁడు, మహాబాహువు. తారకుఁడు (మహాబలశాలి) వైశ్వానరుఁడు, పులోముఁడు, ప్రాపణుఁడు, మహాశిరుఁడు, స్వర్భానుఁడు, వృషపర్వుఁడు, మహాసురుడయిన పురుండుడు, ధృతరాష్ట్రుఁడు, సూర్యుఁడు, చంద్రముఁడు, ఇంద్రతాపసుఁడు. సూక్ష్ముఁడు, నిచంద్రుఁడు, చూర్ణనాభుఁడు, మహాగిరి, అసిలోముఁడు, సుకేశుఁడు, శకుఁడు, మూలకోదరుడు, జంభుఁడు, గగనమూర్ధనుఁడు, కుంభ మానుఁడు, మహోదకుండు, ప్రమదుఁడు, అధ్ముఁడు (కుపడుఁడు, అశ్వగ్రీవుడు వీర్యవంతుఁడు వైగమృగుడు, విరూపాక్షుఁడు, సుపథుఁడు, హలుఁడు, అహలుఁడు, శరభుఁడు, శలభుఁడు సూర్యచంద్రులు వీరిద్దరు సురాసురులలో ప్రభావిణులు, వీరి కుమారులు, మనుమలు మునుమనుమలు అసంఖ్యాకులు. వారీ గణింప శక్యము కాదు. ఇట్లు అసురులు, దైత్యులు, దానవులు వివరింపఁబడినారు. (14) దైత్యులు సుత్వానులుగా తలంపబడిరి. (సోమపాయులు). ఇక దనువుకుమారులు అసుత్వానులుగా దలపబడిరి. వీరందరు వంశానుగతులయిన దనుపుత్రవంశీయు లనబడిరి. ఏకాక్షుఁడు, అశ్వప్రభారిష్ణుఁడు, ప్రలంబుఁడు, నరకుఁడు, ఇంద్రబోధనకేశీ, పురుషుఁడు, శేషవానుఁడు, ఉరువు, గరిష్ణుఁడు, గవాక్షుఁడు, వీర్యవంతుడయిన తాలకేతువు, వీరు దనుపుత్రులు. మనుష్యులచే అవధ్యులు, వారు దైత్యదానవ సంబంధమున పుట్టిరి. వారు భీమ పరాక్రములు. (17) ఈ క్రింద చెప్పబడునట్టి పదునలుగురను సైంహికేయులందురు. వారు సింహికకు విప్రచిత్తికి పుట్టిరి. శలుడు, శలభుం డు, సవ్యుఁడు, సివ్యుఁడు, ఇల్వలుఁడు, సముచి, వాతాపి, సుపింజకుఁడు, హరకల్పుఁడు, కాలనాభుఁడు, భౌముఁడు, కనకుఁడు సూర్య ప్రమర్ధనుఁడయిన రాహువు వీరిలో పెద్దవాడు.(20)
ఇత్యేతే సింహికాపుత్రా దేవైరపి దురాసదాః ।
దారుణాభిజనాః క్రూరాః సర్వే బ్రహ్మహణశ్చ తే ॥
దశ తానీ సహస్రాణి సైంహికేయా గణాః స్మృతాః ।
నిహతా జామదగ్యేన భార్గవేణ బలీయసా ॥
స్వర్భానోస్తు ప్రభా కన్యా పులోమ్నస్తు శచీ సుతా ।
ఉపదానవీ సదస్యాథ శర్మిష్ణా వృషపర్వణః ॥
పులోమా కాలికా చైవ వైశ్వానరసుతే ఉభే ।
ప్రభాయాం నహుషః పుత్రో జయంతస్తు శచీసుతః ॥
పురుం జజేఖథ శర్మిష్ణా దుష్యంతముపదానవీ ।
వైశ్వానరసుతే ఏతే పులోమా కాలకా తథా ॥
ఇహపత్యం ఉభే కన్యే మారీచస్య పరిగ్రహః ।
తయోః పుత్రసహస్రాణి షష్టిర్దానవపుంగవాః ॥
చతుర్ధశ తథాన్యాని హిరణ్యపురవాసినామ్ ।
పౌలోమాః కాలకేయాశ్చ దానవాః సుమహాబలాః ॥
అవధ్యా దేవతానాం తే నిహతాః సవ్యసాచీనా ।
మయస్య జాతా రంభాయాం పుత్రాః షట్చ మహాబలాః ॥
మాయావీ దుందుభిశ్చైవ పుత్రశ్చ మహిషస్తథా ।
కాలికశ్చాజకర్ణశ్చ కన్యా మండోదరీ తథా ।
దైత్యానాం దానవానాం చ సర్గ ఏష ప్రకీర్తితః ।
అనాయుషాయాః పుత్రాస్తే స్మృతాః పంచ మహాబలాః ॥
అరరుర్బలవృతౌ చ విజ్వరశ్చ వృషస్తథా ।
అరరోస్తనయః క్రూరో ధుంధుర్నామ మహాసురః ॥
నిహతః కువలాశ్వేత ఉత్తంకవచనాద్బీలే ।
బలవృత్రా మహావీర్యో తేజసా ప్రతీమావుళే ॥
నికుంభశ్చక్రవర్మా చ స కర్ణః పూర్వజన్మని ।
విజరస్యాపి పుత్రా ద్వౌ కాలకశ్చ ఖరశ్చ॥
వృషస్య తు పునః పుత్రాశ్చత్వారః క్రూరకర్మణః ।
శ్రాద్ధాదో యజ్ఞహా చైవ బ్రహ్మహా పశుహా తథా ॥
కాంతా హ్యనాయుషః పుత్రో వృత్రస్యాపి నిబోధత ।
జజ్ఞిరేఖ సుమహాఘోరా వృత్రస్యేంద్రేణ యుధ్యతా ॥
బకా నామ సమాఖ్యాతా రాక్షసాః సుమహాబలాః ।
శతం కాని సహస్రాణి మహేంద్రోనుచరాః స్మృతాః ॥
సర్వే బ్రహ్మవిదః సౌమ్యా ధార్మికాః సూక్ష్మమూర్తయః ।
ప్రజాస్వంతర్గతాః సర్వే నివసంతి క్రుథా వృతః ॥
క్రోధాత్వప్రతిమాన్పుతాన్ జట్లే వై గాయనోత్తమాన్ ।
సిద్ధః పూర్ణశ్చ వహ్వీ చ పూర్ణాంశశ్చైవ వీర్యవాన్ ॥
బ్రహ్మచారీ శతగుణః సుపర్ణశ్చైవ సప్తమః ।
విశ్వావసుశ్చ భానుశ్చ సుచంద్రో దశమస్తథా ।
ఇత్యేతే దేవ గంధర్వాః క్రోధాయాః పరికీర్తితాః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమాభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే, దనువంశకీర్తనం నామ షష్ఠో ధ్యాయః.
ఈ సింహికా పుత్రులు దేవతలకు గూడ చేరరానట్టి వారు. వారి వంశము మీక్కిలి దారుణమైనది. వారందరు బ్రాహ్మణ హంతకులు, క్రూరులు. (21) సైంహికేయగణములు పదివేల మందిగా చెప్పుదురు. వారందరు జమదగ్ని కుమారుఁడు, భార్గవుఁడయిన పరశురామునిచే చంపఁబడిరి. స్వర్భానుకూతురు ప్రభ. శచీ పులోమనీ కూతురు, ఉపధానవి సదునీ యొక్క కూతురు. శర్మిష్ణ వృషపర్వుని కూతురు. వైశ్వానరున కిద్దరు కూతుండ్రు పులోమ కాలీకయు. నహుషుఁడు ప్రభకుమారుఁడు; జయంతుఁడు శచీపుత్రుఁడు. (24} శర్మిష్ణ పురుని కనెను. ఉపధానవి దుష్యంతుని కనెను. పులోమ - కాలకలు వైశ్వానరుని పుత్రీద్వయము. ఈ ఇరువురు కూతుండ్రకు చాలమంది పుత్రులు. ఆ యిరువురు మరీచి భార్యలు. వారికి అరువది వేల పుత్రులు. వారందరు దానవ పుంగవులు. (26) ఇంకను 14 వేల మంది యధికముగా గలరు. వారు హిరణ్య పురవాసులు. పౌలోములు, కొలకేయులు వారు దానవులు మహాబలురు. (27) వారు దేవతలచే నవధ్యులు. కాని అర్జునునిచే వధింపఁబడిరి. మయునకు రంభయందు 5 {యైదుగురు) కుమారులు, ఒక కూతురు పుట్టిరి. వారారుగురు మహాబలురు. (28) వారు మాయావి, దుందుభి, మహిషుఁడు, కాలీకుఁడు; అజకర్ణుఁడు. వీరు పుత్రులు. మండోదరి కూతురు. (29) ఈ విధముగా దైతేయుల యొక్క దానవుల యొక్క సృష్టి వర్ణింపఁబడినది. అసాయుషకు అగరుఁడు, బలుడు, వృత్రుఁడు, విజ్వరుఁడు, వృషుఁడు అను నైదుగురు పుత్రులు, అరరు యొక్క కుమారుఁడు/ పరమ క్రూరుడయిన అసురుఁడు. పేరు దుందుభుఁడు. ఈతడో కువలాళ్వునిచే ఉత్తంకుని ప్రేరణమున గుహలో చంపఁబడెను. నీకుంభుఁడు, చక్రవర్మయు బలుని యొక్క కుమారులు. వీరు మహావీర్యులు. తేజస్సుచే వారిరువురసమామాన్యులు. (32) వీరిరువులో చక్రవర్మ పూర్వజన్మమున కర్ణుఁడు, విజరున కొద్దరు కొడుకులు. వారు కొలుఁడు, ఖరుఁడు, వృషునకు నలుగురు కుమారులు. పోరు క్రూర కర్ములు. వారు శ్రాద్ధాదులను నాశనము చేయువారు; యజ్ఞహంతలును; బ్రహ్మహంతలును, పశుఘాతకులు. (34) అసాయుష యొక్క పుత్రులు చెప్పఁబడిరి. ఇఁక వృత్రుని బిడ్డలను గూడ నెఱుంగుము. సుమహాహోరులు 'బకులు' అను పేరొందిన రాక్షసులు వృత్రుఁడు ఇంద్రునితో యుద్ధము చేయుచుండగ పుట్టిరి. ఒక వందవేల మందివారు ఇంద్రుని సేవకులుగా సంస్కృతులు. వారందరు బ్రహ్మవిదులు (వేదము నేటింగిన వారు) వారు సౌమ్యులు ధార్మికులు. వారు సూక్ష్మమూర్తులు. పోరు వారి సూక్ష్మరూపములతో ప్రజాంతర్గతులై క్రోధస్వభావులై యుందురు. క్రోధకు అప్రతిమానులు గాయనోత్తములునగు పుత్రులు కలిగిరి. వారు సంఖ్యకు పదిమంది. వీరు దేవ గంధర్వులు. క్రోధము వలనఁబుట్టిరి. ఆ పదిమంది సిద్దుఁడు, పూర్ణుండు. బహ్పీ, పూర్ణాంశుఁడు, వీర్యవంతుఁడు, బ్రహ్మచారి (శతగుణుఁడు) సుపర్ణుఁడు ఏడవవాఁడు. విశ్వావసువు, భానువు, పదవపాడు ‘క్రోధ’ వలన బుట్టినవారు. సుచంద్రుఁడు. వీరు దేవ గంధర్వులు.
ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాత పాదమున దనువంశ కీర్తనమను ఆరవ అధ్యాయము.
