12 - శ్రీరాముని తరువాతి రఘువంశ రాజుల చరితము

శ్రీశుక ఉవాచ

కుశస్య చాతిథిస్తస్మాన్నిషధస్తత్సుతో నభః

పుండరీకోఽథ తత్పుత్రః క్షేమధన్వాఽభవత్తతః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కుశుని పుత్రుడు అతిథి. అతిథి పుత్రుడు నిషధుడు. నిషధుని పుత్రుడు నభుడు. నభుని పుత్రుడు పుండరీ కుడు. పుండరీకుని పుత్రుడు క్షేమధన్వుడు.

దేవానీకస్తతోఽనీహః పారియాత్రోఽథ తత్సుతః

తతో బలస్థలస్తస్మాద్వజనాభోఽర్కసంభవః  

క్షేమధన్వుని పుత్రుడు దేవానీకుడు. దేవానీకుని పుత్రుడు అనీహు డు. అనీహుని పుత్రుడు పారియాత్రుడు. పారియాత్రుని పుత్రుడు బలస్థలు డు. బలస్థలుని పుత్రుడు సూర్యుని అంశతో జన్మించిన వజ్రనాభుడు.

ఖగణస్తత్సుతస్తస్మాద్విధృతిశ్చాభవత్సుతః

తతో హిరణ్యనాభోఽభూద్యోగాచార్యస్తు జైమినేః

శిష్యః కౌసల్య ఆధ్యాత్మం యాజ్ఞవల్యోపఽధ్యగాద్యతః

యోగం మహోదయమృషిర్హృదయగ్రంథిభేదకమ్

ఆ వజ్రనాభుని పుత్రుడు ఖగణుడు. ఖగణుని పుత్రుడు విధృతి. విధృతి పుత్రుడు హిరణ్యనాభుడు. ఆయన జైమిని శిష్యుడు, యోగాచా ర్యుడు. కోసలదేశవాసియగు యాజ్ఞవల్క్య మహర్షి ఆయన వద్దనే అధ్యా త్మయోగమునధ్యయనము జేసెను. ఆ యోగము సాధకునకు గొప్ప అభ్యుదయమును కలిగించి, హృదయమునందలి అజ్ఞానమనే ముడిని తొలగించును.

పుష్యో హిరణ్యనాభస్య ధ్రువసంధిస్తతోఽభవత్

సుదర్శనోఽథాగ్నివర్ణశ్శీఘ్రస్తస్య మరుస్సుతః  

హిరణ్యనాభుని పుత్రుడు పుష్యుడు. పుష్యుని పుత్రుడు ధ్రువసంధి. ధ్రువసంధి పుత్రుడు సుదర్శనుడు. సుదర్శనుని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుడు. శీఘ్రుని పుత్రుడు మరువు.

యోఽసావాస్తే యోగసిద్ధః కలాపగ్రామమాశ్రితః

కలేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః

మరువు యోగముచే మృత్యువును జయించి ఇప్పుడు కలాప మనే గ్రామమునందు ఉన్నాడు. కలియుగాంతమునందు కనబడకుండా పోయిన సూర్యవంశమును ఆయన మరల ప్రవర్తిల్ల జేయగలడు.

తస్మాత్ప్రసుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణః మహస్వాంస్తత్సుతస్తస్మాద్విశ్వసాహ్వోఽన్వజాయత  

మరువు పుత్రుడు ప్రసుశ్రుతుడు. ప్రసుశ్రుతుని పుత్రుడు సంధి. సంధి పుత్రుడు అమర్షణుడు. అమర్షణుని పుత్రుడు మహస్వంతుడు. మహ స్వంతుని పుత్రుడు విశ్వసాహ్వుడు.

తతః ప్రసేనజిత్తస్మాత్తక్షకో భవితా పునః

తతో బృహద్వలో యస్తు పిత్రా తే సమరే హతః  

విశ్వసాహ్వుని పుత్రుడు ప్రసేనజిత్తు. ప్రసేనజిత్తు పుత్రుడు తక్షకు డు. తక్షకుని పుత్రుడు బృహద్వలుడు. బృహద్వలుని నీ తండ్రియగు అభి మన్యుడు మహాభారత యుద్ధములో సంహరించెను.

ఏతే హీక్ష్వాకుభూపాలా అతీతాశ్శృణ్వనాగతాన్

బృహద్వస్య భవితా పుత్రో నామ బృహద్రణః

వీరందరు గడచిపోయిన ఇక్ష్వాకువంశపు రాజులు. ఇప్పుడు రాబోయే రాజులను గురించి వినుము. బృహద్వలునకు బృహద్రణుడని ప్రసిద్ధి గాంచిన పుత్రుడు కలుగును.

ఉరుక్రియస్తతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి

ప్రతివ్యోమస్తతో భానుర్ధివాకో వాహినీపతిః

బృహద్రణునకు ఉరుక్రియుడు, ఉరుక్రియునకు వత్సవృద్దుడు, వత్సవృద్దునకు ప్రతివ్యోముడు, ప్రతివ్యోమునకు భానుడు, భానునకు సేనాధిపతియగు దివాకుడు పుత్రులై జన్మించెదరు.

 సహదేవస్తతో వీరో బృహదశ్వోఽథ భానుమాన్

ప్రతీకాశ్వో భానుమతస్సుప్రతీకోఽథ తత్సుతః

భవితా మరుదేవోఽథ సునక్షత్రోఽథ పుష్కరః

తస్యాంతరిక్షస్తత్పుత్రస్సుతపాస్తదమిత్రజిత్

దివాకుని పుత్రుడు వీరుడైన సహదేవుడు, సహదేవుని పుత్రుడు బృహదశ్వుడు, బృహదశ్వుని పుత్రుడు భానుమంతుడు, భానుమంతుని పుత్రుడు ప్రతీకాశ్వుడు, ప్రతీకాశ్వుని పుత్రుడు సుప్రతీకుడు, సుప్రతీకుని పుత్రుడు మరుదేవుడు, మరుదేవుని పుత్రుడు సునక్షత్రుడు, సునక్షత్రుని పుత్రుడు పుష్కరుడు, పుష్కరుని పుత్రుడు అంతరిక్షుడు, అంతరిక్షుని పుత్రుడు సుతపసుడు, సుతపసుని పుత్రుడు అమిత్రజిత్తు కలుగగలరు.

బృహద్రాజస్తు తస్యాపీ బర్షిస్తస్మాత్కృతంజయః

రణంజయస్తస్య సుతస్సంజయో భవితా తతః  

అమిత్రజిత్తుని పుత్రుడు బృహద్రాజు, బృహద్రాజుయొక్క పుత్రుడు బర్షి, బర్షియొక్క పుత్రుడు కృతంజయుడు, కృతంజయుని పుత్రుడు రణంజయుడు, రణంజయుని పుత్రుడు సంజయుడు కాగలరు.

తస్మాచ్చాక్యఽథ శుద్దోదో లాంగలస్తత్సుతస్స్మృతః

తతః ప్రసేనజిత్తస్మాత్ క్షుద్రకో భవితా తతః

రణకో భవితా తస్మాత్సురథస్తనయస్తతః

సుమిత్రో నామ నిష్ఠాంత ఏతే భార్హద్వలాన్వయాః  

సంజయుని పుత్రుడు శాక్యుడు, శాక్యుని పుత్రుడు శుద్ధోదుడు, శుద్ధోదుని పుత్రుడు లాంగలుడు, లాంగలుని పుత్రుడు ప్రసేనజిత్తు, ప్ర సేన జిత్తు పుత్రుడు క్షుద్రకుడు, క్షుద్రకుని పుత్రుడు రణకుడు, రణకుని పుత్రుడు సురథుడు, సురథుని పుత్రుడు సుమిత్రుడు అనువారలు కలుగగలరు. వీరు బృహద్వలుని వంశమునకు చెందినవారు. వీరిలో సుమిత్రుడు ఆ వంశము నకు ఆఖరివాడుగా ప్రసిద్ది గాంచును.

ఇక్ష్వాకూణామయం వంశస్సుమిత్రాంతో భవిష్యతి

యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధే ద్వాదశోఽధ్యాయః

ఈ ఇక్ష్వాకు వంశపు రాజుల వంశమునకు సుమీత్రుడు ఆఖరి మహారాజు. ఏలయనగా, కలియుగములో ఆ వంశము నిశ్చయముగా ఆయనతో అంతము కాగలదు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో శ్రీరాముని తరువాతి రఘువంశరాజుల చరితమును వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.