భాగవత మహా పురాణము
7 - సముద్ర మథనము - శివుడు విషమును భక్షించి జగత్తును కాపాడుట
శ్రీశుక ఉవాచ ।
కురువంశ శ్రేష్టుడవగు ఓ మహారాజా! వారు మథించగా వచ్చే అమృతమునందు వాటాను ఇస్తామని నాగులకు రాజగు వాసుకిని ప్రార్థించి, ఆయనను ఆ పర్వతమునకు త్రాడుగా చుట్టిరి. అపుడు వారు ఆనంద ముతో గూడి పూర్ణ ప్రయత్నముతో అమృతము కొరకై సముద్రమును మథించుటకు ఆరంభించిరి. ముందుగా అజిత భగవానుడు (శ్రీహరి) వాసుకిని ముఖము వైపు పట్టుకోగా, దేవతలు ఆయన ప్రక్కన చేరిరి.
రాక్షస నాయకులకు పురుషోత్తముని ఆ చేష్ట నచ్చలేదు. పాము యొక్క అమంగళకరమగు అవయవము తోక; దానిని మేము పట్టుకోము, అని వారు పలికిరి..
మేము వేదాధ్యయన సంపన్నులము; మేము జన్మచే మరియు కర్మలచే లోకములో ప్రఖ్యాతిని పొందినవారము, అని పలికి రాక్షసులు మిన్నకుండిరి. ఆ విధముగా నిలబడియున్న రాక్షసులను చూచి, అజిత భగ వానుడు చిరునవ్వు నవ్వి, దేవతలతో బాటుగా వాపుకి ముఖమును విడిచి పెట్టి తోకను పట్టుకొనెను.
కశ్యప ప్రజాపతియొక్క సంతానమగు దేవతలు, రాక్షసులు ఈ విధముగా తమ తమ స్థానములను కేటాయించుకొనిరి. వారు పూర్ణమగు ప్రయత్నముతో అమృతము కొరకై పాల సముద్రమును మథించిరి.
పాండునందనుడవగు ఓ మహారాజా! సముద్రమును వారు. మథిస్తూ ఉంటే ఆధారము లేని ఆ పర్వతము చాల బరువు గలది యగుల చే, బలశాలురు పట్టుకున్ననూ, సముద్రజలములలో మునిగిపోయెను.
దైవము మిక్కిలి బలమైనది. దైవముచే తమ పౌరుషము నష్టము కాగా, ఆ దేవతలకు రాక్షసులకు మనస్సు చాల భేదమును పొందెను. వారి ముఖములు మాడిపోయి శోభ దూరమయ్యెను.
ఆ విఘ్నమును విఘ్నేశ్వరుడే కలిగించినాడని శ్రీహరి తెలుసుకో నెను. అనంతమగు శక్తి గల ఆయన సంకల్పము వ్యర్థము కాదు. ఆయన ఆశ్చర్యమును గొల్పే పెద్ద తాబేలు రూపమును దాల్చి, నీటిలో ప్రవేశించి పర్వతమును పైకి ఎత్తాను.
మరల పైకి లేచిన కులపర్వతమైన ఆ మందరమును చూచి దేవ తలు, రాక్షసులు మథించుటకు సంసిద్దులైరి. మరియొక ద్వీపమా యన్న ట్లు పది లక్షల యోజనముల విస్తారము గల పెద్ద వీపుతో తాబేలు ఆ పర్వ తమును మోసెను.
ఓయీ! దేవనాయకులు, రాక్షస నాయకులు తమ భుజబలముతో ఆ పర్వతమును గిరగిర త్రిప్పుచుండిరి. ఇంద్రియములకు మనస్సునకు గోచరము కాని ఆదిపురుషుడు (శ్రీహరి) తాబేలు రూపును దాల్చి తన వీపుపై ఆ పర్వతమును మోయుచుండెను. ఆయన ఆ పర్వతముయొక్క భ్రమణము వలన కలిగిన రాపిడిచే తన వీపుమీది దురద తీరినదని తలపో సెను.
విష్ణువు ఆ రాక్షసుల బలమును ప్రభావమును ప్రవర్తిల్ల జేయు వాడై అసురులకు చెందిన రాజసరూపముతో అసురులను, అదే విధముగా దేవతల గణములను వర్దిల్ల జేయువాడై వారిని దైవీశక్తి (సాత్త్వికము) తో, మరియు నిద్ర (తామసశక్తి) అనే రూపముతో నాగరాజగు వాసుకీని ఆవేశంచేను.
పైన సహస్రబాహు రూపముతో, క్రింద తాబేలు రూపముతో, దేవాసురుల దేహములయందు ఆయా శక్తులతో, పర్వతమునందు దృడ త్వము రూపముగా, త్రాడు (వాసుకి) నందు నిద్ర రూపముగా పరమేశ్వ రుడు ఆవేశించెను. ఈ విధముగా వర్ధిల్లజేయబడిన ఆ దేవాసురులు తీవ్ర మగు గర్వము గలవారై బలముగా ఆ గొప్ప పర్వతముతో సముద్రమును మథించుచుండగా, దానియందలి మొసళ్ల గుంపులు సంక్షోభమును పొందినవి.
నాగరాజగు వాసుకియొక్క వేలాది క్రూరమైన కళ్లనుండి, నోళ్లనుండి, శ్వాసనుండి వెలువడే పొగ ఆ రాక్షసుల వర్చస్సును నాశము చేసెను. పౌలోములు, కాలేయులు, బలి, ఇల్వలుడు మొదలైన రాక్షసులు కార్చిచ్చుచే కాల్చివేయబడిన తెల్లతెగడ చెట్లవలె అయిరి.
ఆ వాసుకీయొక్క ఉచ్చ్వాసనిశ్శ్వాసలనుండి వచ్చే మంటలు దేవతల వర్చస్సును కూడ నాశనమొనర్చెను. వారి వస్త్రములు, మాలలు, శ్రేష్ఠమైన కవచములు, ముఖములు దుమ్ము కొట్టుకొని యుండెను. అపుడు భగవానునకు అధీనములై యుండే మేఘములు వారిపై చక్కగా అంతటా వర్షమును కురిపించినవి. సముద్రతరంగముల మీదుగా చల్లని వాయువులు వీచి వారికి సేద దీర్చినవి.
దేవతల మరియు రాక్షసుల సేనానాయకులు ఈ విధముగా సము. ద్రమును మథించిననూ అమృతము పుట్టలేదు. అప్పుడు అజిత భగవా నుడు స్వయముగా మథించెను.
అప్పుడు (అమృతము పుట్టని ఆ సమయమునందు) నీలమేఘ శ్యాముడగు అజిత భగవానుడు బంగారము వలె మెరిసే వస్త్రమును ధరించి, చెవులయందు కుండలములు మెరుపులవలె మెరియుచుండగా, జయమును తెచ్చి పెట్టి జగత్తునకు అభయమునిచ్చే భుజములతో సర్ప మును పట్టుకోని పర్వతమునే కవ్వముగా చేసి సముద్రమును చిలుకుతూ మరియొక పర్వతము వలె ప్రకాశించేను. మాలను ధరించియున్న ఆయన తలపై చెల్లాచెదరైన జుట్టు ప్రకాశించుచుండెను. ఎర్రని కళ్లు గల ఆయన తాబేలు రూపముతో పర్వతమును పైకి ఎత్తి ఉంచెను.
సముద్రమును గట్టిగా మథించుచుండగా చేపలు, మొసళ్లు, పాములు, తాబేళ్లు భయపడి పైకి తేలినవి. తిమి, తిమింగలము, నీటి యేనుగు, మొసలి మొదలైన ప్రాణులతో సముద్రము కలిచి వేయబడెను. అపుడా. సముద్రమునుండి ముందుగా చాల భయంకరమైన విషము పుట్టె ను. దానికి హాలహలము (హాలాహలము) అని పేరు.
ఓయీ! సాటి లేని ఆ విషమును సహించుట శక్యము కాకుండెను. అది భయంకరమగు వేగముతో దిక్కులన్నిటియందు పైన క్రింద కూడ ప్రసరించి వ్యాపించుచుండెను. జనులు భయపడి పరుగులు తీసిరి. వారికీ రక్షకుడు కరువాయెను. అపుడు వారు పాలకులతో సహా సదాశివుని శరణు వేడిరి.
దేవశ్రేష్ఠుడగు. ఆ శివుడు ముల్లోకముల కల్యాణము కొరకై పార్వ తీదేవితో గూడి కైలాసగిరిని అధిష్టించి యుండెను. మహర్షులకు ప్రియు డైన ఆయన మోక్షము నిమిత్తముగా తపస్సును సేవించుచుండెను. (మోక్ష హేతువు అగుటచే మహర్షులకు అభిమతమైన తపస్సును ఆచరిం చుట ద్వారా శిక్షణ నిచ్చుచుండెను). వారు శివుని చూచి స్తోత్రములతో నమస్కరించిరి.
ప్రజాపతయ ఊచుః ।
ప్రజాపతులు ఇట్లు పలికిరి --- ఓ మహాదేవా! నీవు దేవదేవుడవు.. ప్రాణులను సృష్టించిన నీవే ప్రాణుల ఆత్మస్వరూపుడవై యున్నావు. నిన్ను శరణు వేడిన మమ్ములను ముల్లోకములను దహించి వేయుచున్న విషము నుండి రక్షించుము.
సకలజగత్తుయొక్క బంధమోక్షములకు నీవు ఒక్కడివే ప్రభుడవు. నీవు శరణు వేడినవారి దుఃఖమును పోగొట్టే తండ్రివి. వివేకవంతులగు నేర్పరులు అట్టి నిన్ను పూజించెదరు.
ఓ ప్రభూ! స్వయంప్రకాశ స్వరూపుడవగు నీవు పరబ్రహ్మవు. నీవే సత్త్వరజస్తమోగుణాత్మకమగు నీ మాయాశక్తిచే జగత్తుయొక్క సృష్టి స్థితిల యములను చేయునప్పుడు క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే పేర్లను ధరించెదవు.
రహస్యమైన పరబ్రహ్మవు నీవే. యోగ్యులైన దేవతలు మొదలగు ప్రాణులను, అయోగ్యము (దుఃఖరూపము) అయిన చెట్టుచేమలు మొద లైన ప్రాణులను నీవే సృష్టించుచున్నావు. నీవు నీ సత్త్వరజస్తమోగుణము లనే శక్తులతో జగద్రూపముగా ప్రకాశించుచున్నావు. నీవే సర్వమునకు ఆత్మవు, జగన్నాథుడవు.
వేదములు నీనుండియే పుట్టినవి. జగత్కారణమగు నీవే ప్రాణు లలో ఆత్మరూపుడవై ఉన్నావు. ప్రాణులలోని ప్రాణము, ఇంద్రియములు, ద్రవ్యము (పంచభూతముల దేహము) అనువాటికి కారణమైన సత్త్వరజస్త మోగుణములు నీ స్వభావములే (ప్రకటమయ్యే ఉపాధులే). కాలస్వరూపుడవగు నీవే యజ్ఞరూపముగా ప్రకటమయ్యేదవు. నామరూపాత్మకమగు జగత్తుయొక్క యథార్థ తత్త్వము నీవే. జగత్తులోని నియతి, ధర్మము నీవే. అవినాశి, సత్త్వరజస్తమోగుణములు అనే మూడు పేటలు గలది అగు ప్రకృతి (మాయాశక్తి) కి అధిష్ఠానము నీవేనని మహర్షులు చెప్పెదరు.
ఓ దేవా! లోకములు నీనుండియే ఆవిర్భవించినవి. సకల దేవతా రూపుడగు అగ్ని సకలదేవతా స్వరూపుడవగు నీ నోరు అనియు, భూమి నీ పద్మమువంటి పాదములనియు, కాలము నీ గమనమనియు, దిక్కులు నీ చెవులనియు, జలాధిపతియగు వరుణుడు నీ నాలుక అనియు మహా త్ములు తెలియుదురు.
ఓ భగవానుడా! ఆకాశమే నీ నాభి. వాయువే నీ ఊపిరి. సూర్యుడే నీ కన్నులు. నీరే నీ రేతస్సు. గొప్ప-తక్కువ అగు జీవులకు అధిష్టానమగు చైతన్యము నీ స్వరూపమే. చంద్రుడే నీ మనస్సు. ద్యులోకమే నీ తల.
వేదములే స్వరూపముగా గల ఓ దేవా! సముద్రములే నీ ఉదర ము. పర్వతములే నీ ఎముకల సమూహములు. సకలములైన మొక్కలు మరియు చెట్లే నీ రోమములు. గాయత్రి, త్రిష్టుభము, అనుష్టుభము, బృహతి, పంక్తి, జగతి, ఉష్టిక్ అనే ఏడు ఛందస్సులే సాక్షాత్తుగా నీ ఏడు ధాతు వులు (రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మూలుగు, వీర్య ము). సకలధర్మములు నీ హృదయము.
ఓ ఈశ్వరా! సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రము నీ సద్యో జాత ముఖము, తత్పురుషాయ విద్మహే అనేది తత్పురుష ముఖము, వామదేవాయ నమః అనేది వామదేవ ముఖము, అఘోరేభ్యః అనేది అఘోర ముఖము, ఈశానస్సర్వవిద్యానాం అనేది ఈశాన ముఖము. ఆ మంత్రముల పదములను విడదీసినచో ముప్పై ఎనిమిది కలా మంత్ర ములు వచ్చును. ఓ దేవా! ఉపనిషతతిపాద్యమైన పరమార్థ వస్తువునకు శివుడు అని పేరు. ఆ తత్త్వము నీవు నీ స్వయంప్రకాశ స్వరూపమునందు నిలిచియుండుటయే.
ఓ దేవా! అధర్మతరంగములైన కామలోభములయందు నీ నీడ (నీ గురించిన అజ్ఞానము) గలదు. సృష్టికి మూలమునందున్న సత్త్వరజస్త మోగుణములు నీ మూడు కన్నులు. గాయత్రి మొదలైన ఛందస్సులతో నిండియున్న ప్రాచీనమైన వేదమే జ్ఞానస్వరూపుడవు, వేదనిర్మాతవు అగు నీ విచారము (దర్శనము).
ఓ కైలాసగిరి పాలకా! సర్వాతీతమైన నీ చైతన్యస్వరూపమునందు సత్త్వరజస్తమోగుణములు లేవు. దేశకాలపరిచ్చేదములకు అతీతమైన నీ స్వరూపమునందు భేదములు లేశమైననూ లేవు. నీ స్వరూపమును సకల లోకపాలకులు, బ్రహ్మగారు, వైకుంఠ లోకవాసులు, ఇంద్రుడు కూడ తెలి యజాలరు.
ప్రాణులకు ద్రోహమును చేసే కాముడు, దక్షుని యజ్ఞము, త్రిపురా సురులు, కాలకూట విషము మొదలైన అనేకములను నీవు నశింప జేసినా వు (కాలకూట విషమును నీవు తప్పక నాశము చేయగలవని అభిప్రాయము). నిన్ను అట్లు స్తుతించుట కూడ నీ విషయములో అత్యల్పమే య. గును. ఈ జగత్తును నీవే సృష్టించితివి. ప్రళయకాలములో నీ కన్నునుండి పుట్టిన అగ్నియొక్క మిణుగురుయొక్క జ్వాలలో ఈ జగత్తు బూడిద కాగా, నీవా విషయమును కూడ గమనించనే గమనించవు.
ఆత్మనిష్ఠయందు ఆనందిస్తూ జ్ఞానమును ప్రబోధించే మహా త్ములు నీ రెండు పాదములను తమ హృదయములో ధ్యానించెదరు. నీవు నిరంతరముగా తపస్సును చేయుచుందువు. అయిననూ, కొందరు నీవు పార్వతీదేవితో సంచరిస్తూ ఉండే భోగాసక్తుడవనియు, శ్మశానమునందుండే క్రూర పురుషుడవనియు ప్రలాపములను పలికెదరు. వారికి నీ లీల నిశ్చ యముగా తెలిసినదా? (లేదు). వారు సిగ్గును విడిచి పెట్టి అట్లు వదరు చున్నారు.
అందువలన, కార్యకారణములకంటె మాయాశక్తి అతీతమైనది కాగా, నీవు మాయాశక్తికంటే అతీతుడవు. దేశకాలపరిచ్చేదములు లేని అట్టి నీయొక్క స్వరూపమును తెలియుటకు బ్రహ్మగారు మొదలగువారు సమ ర్థులు కారు. నిన్ను చక్కగా స్తుతించే సామర్థ్యము వారికి లేదని వేరుగా చెప్పవలయునా? మేమైతే ఆ బ్రహ్మగారిచే సృష్టించబడిన ప్రజాపతుల సృష్టిలోని వారము, (అట్టి మేము ఎట్లు స్తుతించగలము?) అయిననూ, మా శక్తిని బట్టి ఈ స్తోత్రమును చేయుచున్నాము.
ఓ మహేశ్వరా! మేము కేవలము నీయొక్క ఈ కళ్ల ముందు కన బడే రూపమును మాత్రమే చక్కగా చూడగలము. దీనికి అతీతమైన నీ స్వరూపమును మేము తెలియజాలము. నీ లీలల తత్త్వమును తెలియుట అసంభవము. కాని, నీవు లోకరక్షణ కొరకు మాత్రమే సగుణరూపమును స్వీకరించెదవు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ దేవతల ఆ ఆపదను చూచి రుద్రదేవుడు దయచే అధికమగు పీడను పొందెను. సకల ప్రాణులకు హితకారియగు ఆ దేవుడు ప్రియురాలగు సతీదేవితో నిట్లనెను.
శివ ఉవాచ ।
ఆహా! అయ్యో! ఓ భవానీ! పాలసముద్రమునుండి మథించగా పుట్టిన కాలకూట విషము వలన ప్రాణులకు వచ్చి పడిన ఈ దుఃఖమును చూడుము.
వీరు తమ ప్రాణములను నిలబెట్టుకొన గోరుచున్నారు. వీరికి ప్రభు వునగు నేను వీరికి అభయమునిచ్చి రక్షించవలెను. ఎందుకంటే, దీనులను అన్ని విధములుగా కాపాడుట మాత్రమే ప్రభువునకు కర్తవ్యము.
నా మాయాశక్తిచే వ్యామోహితులైన జనులు పరస్పరము దృఢ మగు వైరమును కలిగియుందురు. కాని, ప్రాణములు క్షణములో వినష్ట మగునని సత్పురుషులకు ఎరుకయే. వారు తమ ప్రాణములనొడ్డి ఇతరప్రా ణులను కాపాడెదరు.
ఓ కల్యాణీ! ప్రాణులపై దయను చూపే వ్యక్తి యెడల శ్రీహరి భగవానుడు ప్రసన్నుడగును. ఆయన ప్రసన్నుడైనచో, కదిలే మరియు కద అని ప్రాణులతో గూడియున్న జగత్తుతో సహా నేను కూడ ప్రసన్నుడనగుదు ను. కావున, నేనీ విషమును భక్షించెదను. నా వలన నా ప్రజలకు మంగ భము కలుగు గాక!
శ్రీశుక ఉవాచ ।
జగత్తును కాపాడే రుద్ర భగవానుడు ఈ విధముగా పార్వతిని ఒప్పించి, విషమును భక్షించుటకారంభించేను. ఆమెకు ఆయన మహిమ ఎరుకయే. కావుననే, ఆమె అంగీకరించెను.
తరువాత ప్రాణులను కాపాడే మహాదేవుడు వ్యాపించుచున్న హాలాహల విషమును దయతో అరచేతిలో చిక్కబట్టి భక్షించెను.
నీటినుండి పుట్టిన కాలుష్యమైన ఆ విషము తన శక్తిని ఆయనకు కూడ చూపించెను. అది యేదన, ఆయన కంఠము నల్లగా ఆయెను. లోకో పకారకుడగు ఆయనకు అది కూడ అలంకారమే ఆయెను.
పరోపకారులగు జనులు తరచుగా జనుల దుఃఖమును చూసి తాము దుఃఖమును పొందెదరు. ఎందుకంటే, పురుషోత్తముడు సర్వప్రాణు లలో ఆత్మరూపుడై యున్నాడు. కావున, పరోపకారమే ఆయనకు చేసే పూజలలోకెల్లా ఉత్తమమైనది.
శంభుడు భక్తులకు మనోరథములను వర్షించే దేవదేవుడు. ఆయన చేసిన ఆ పనిని చూచి ప్రజలు, దక్షపుత్రికయగు సతీదేవి, బ్రహ్మగారు, శ్రీహరి కూడ ప్రశంసించిరి.
విషమును రుద్రుడు త్రాగుచుండగా ఆయన చేతినుండి కొన్ని చుక్కలు జారి క్రింద పడినవి. వాటీని తేళ్లు, త్రాచుపాములు, ఇతర విషస ర్పములు, ఇతరములైన విషప్రాణులు, విషపు మొక్కలు కూడ గ్రహించినవి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో రుద్రుడు విషమును భక్షించి జగత్తును కాపాడుటను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7) .
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
As the devatās and asuras pulled Vāsukī back and forth to churn the ocean, Mount Mandara began sinking into the ocean floor due to lack of support beneath. Bhagavān manifested as Kūrma-avatāra, a colossal tortoise who dived into the waters and supported the mountain upon His shell. As the churning resumed, the first substance to emerge was Hālāhala, a terrifying lethal poison whose toxic fumes scorched the worlds. Seeking a savior, the devatās prayed to Mahādeva Śiva, who compassionately drank the lethal poison, holding it in His throat, which turned blue and earned Him the immortal title Nīlakaṇṭha.