శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
11 - ఉత్తర రామ చరితము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీరామ భగవానుడు ఆచార్యునీ యెదుట నుంచుకొని ఉత్తమమగు సాధనములు గల యజ్ఞములను చేసెను. ఈ విధముగా ఆయన తానే అయి ఉన్న సకలదేవతాస్వరూపుడగు దేవుని తానే ఆరాధించెను.
ఆ శ్రీరామ ప్రభుడు తూర్పు దిక్కును హోతకు, దక్షిణదిక్కును బ్రహ్మకు, పడమర దిక్కును అధ్వర్యునకు, ఉత్తరదిక్కును సామగాన మును చేసే ఉద్గాతకు దానము చేసెను.
శ్రీరామునకు కామనలు లేవు. ఈ భూమినంతనూ పొందుటకు వేదవేత్త తగినవాడే, అని ఆయన భావన. ఆ దిక్కుల మధ్యలో మిగిలి యున్న భూమిని ఆయన ఆచార్యునకు ఇచ్చి సెను.
ఈ విధముగా ఈ శ్రీరాముడు కేవలము అలంకారములతో మరియు కట్టుబట్టలతో, మహారాణియగు సీతాదేవి మాంగల్యచిహ్నము. లగు సూత్రము, ముక్కుపుడక మొదలగు ఆభరణములతో మరియు వస్త్ర ములతో మాత్రమే మిగిలియుండిరి.
శ్రీరామునకు వేదవేత్తలే దైవము. ఈ విషయములో సత్పురు షులు రాముని కొనియాడుచుందురు. ఆయన ప్రేమను చూచిన ఋత్వి క్కులకైతే వారి హృదయములు ప్రేమతో ఆర్ద్రములాయెను. వారు తమకి చ్చిన భూమిని మరల ఆయనకు సమర్పించి ఇట్లు పలికిరి.
ఓ భగవానుడా! జగన్నాథుడవు నీవే. నీవు మాకీయనిది ఏది గలదు? (ఏదీ లేదు). ఎందుకంటే, నీవు మా హృదయముల లోపల (ఆత్మ రూపముగా) ప్రవేశించి చీకటి (అజ్ఞానము) ని పోగొట్టుచున్నావు.
మొక్కవోని బుద్దిశక్తి గల శ్రీరామునకు వేదవేత్తలే దైవము. ఆయన ఉత్తమమగు కీర్తి గలవారిలో అగ్రేసరుడు. సకలప్రాణులకు అభయదక్షిణ నిచ్చే సర్వసంగపరిత్యాగులు ఆయన పాదములను తమ హృదయములో నీలుపుకొనెదరు. అట్టి శ్రీరామునకు నమస్కారము.
శ్రీరాముడు అయోధ్యా నగరములోని జనులను గురించి తెలియ గోరి మారు వేషముతో రాత్రియందు ఇతరులకు కానరాకుండా సంచరించే ను. అపుడాయన ఒకానొక వ్యక్తి తన భార్యనుద్దేశించి పలికీన పలుకులను వినెను.
నీవు దుష్టురాలవు, పరాయివాని ఇంటికి వెళ్లిన పాపివి. నేను నిన్ను ఏలుకోను. రాముడు స్త్రీయందు లోభము గలవాడు గాన, సీతను ఏలుకోనుగాక! కాని, నేను మాత్రము ఏలుకోను.
లోకులు పలువిధములుగా మాటలాడెదరు. అజ్ఞానులగు జనులను మెప్పించుట సంభవము కాదు. వారికి భయపడి శ్రీరాముడు సీతాదేవిని విడిచి పెట్టగా, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమమును చేరెను.
గర్భిణియగు ఆ సీతాదేవి ప్రసవసమయము వచ్చినప్పుడు కవల పుత్రులనిద్దరిని కనెను. వారు కుశలవులు అని ప్రఖ్యాతి గాంచిరి. వారిద్దరికి వాల్మీకి మహర్షి జాతకర్మాది సంస్కారములను చేసెను.
ఓ మహారాజా! అంగదుడు, చిత్రకేతువు అనువారలు లక్ష్మణుని పుత్రులు. తక్షుడు, పుష్కలుడు భరతుని పుత్రులు.
శత్రుఘ్నునకు సుబాహుడు, శ్రుతసేనుడు అనే పుత్రులు కలిగిరి. భరతుడు దిగ్విజయమునందు కోట్లాది గంధర్వులను సంహరించెను.
భరతుడు ఆ గంధర్వుల సంపదనంతనూ తెచ్చి శ్రీరామ ప్రభు నకు సమర్పించెను. శత్రుఘ్నుడు కూడ మధువుయొక్క పుత్రుడైన లవణు డని ప్రసిద్ధి గాంచిన రాక్షసుని సంహరించి, మధువనమునందు మథుర అని ప్రసిద్ధి గాంచిన నగరమును నిర్మించెను.
భర్తయగు శ్రీరామునిచే పరిత్యజించబడిన సీతాదేవి పుత్రులిద్దరిని వాల్మీకి మహర్షికి అప్పజెప్పి, శ్రీరాముని పాదములను ధ్యానిస్తూ, భూమి లోని బిలమును ప్రవేశించెను.
శ్రీరామ భగవానుడు ఆ విషయమును విని వివేకబుద్ధితో దుఃఖా శ్రువులను ఆపుకొనుటకు యత్నించెను. ఆయన సర్వసమర్థుడే అయిన నూ సీతాదేవియొక్క ఆయా గుణములను గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరు పెట్టకుండా ఉండలేక పోయెను.
స్త్రీపురుషులకు పరస్పరము ఉండే ఈ విధమైన (అధికమగు) ఆసక్తి సర్వసమర్థులైనవారికి కూడ అన్ని సందర్భములలో భయ హేతువే యగును. ఇక గృహమునందు తగుల్కొన్న చిత్తము గలవారై భోగపరాయ ణులగు సామాన్యవ్యక్తులకు భయ హేతువగునని వేరుగా చెప్పవలెనా?
సీత భూమిని ప్రవేశించిన తరువాత శ్రీరామ ప్రభుడు బ్రహ్మచారి గనే ఉండిపోయెను. ఆయన పదమూడు వేల సంవత్సరములు అవిచ్చిన్న ముగా అగ్నిహోత్రమును చేసెను.
తరువాత శ్రీరాముడు దండకారణ్యములో ముళ్లచే గాయపరచబ డిన తన చిగుళ్లవంటి పాదములను తనను స్మరించే భక్తుల హృదయ ములో నిలిపి, ఆయన తన స్వరూపమగు పరబ్రహ్మ చైతన్యమునందు విలీనమాయెను (ప్రకాశించే తన వైకుంఠ ధామమును చేరెను).
దేవతలు ప్రార్థించగా శ్రీహరి దేహమును స్వీకరించి రఘువంశ శిరోమణియై లీలలను నెర పెను. మహిమ (ప్రకాశము) లో ఆయనకంటే అధికుడు గాని, ఆయనతో సమానమైనవాడు గాని లేడు. ఆయన అస్త్ర ముల సముదాయములతో రాక్షసులను వధించుట, సముద్రము పై సేతు వును కట్టుట ఆయనకు కీర్తిని ఇచ్చేటంతటి ఘనకార్యములు కానే కావు. శత్రువులను సంహరించుటయందు ఆయనకు వానరుల సాహాయ్యము ఆవశ్యకమా?(కాదు).
రఘువంశ శిరోమణియగు శ్రీరాముని స్వచ్చమైన కీర్తి స్మరించు వారల పాపములను పోగొట్టును. ఆ కీర్తి గొప్ప దిగ్గజములకు నడుము పట్టె యైనది (అనగా, దిగంతముల వరకు వ్యాపించినది). ఈ నాటికీ ధర్మరాజా దుల సభలయందు మార్కండేయ మహర్షులు ఆ కీర్తిని గానము చేయు చునే యున్నారు. ఇంద్రాది లోకపాలకులు, భూపాలురు తమ కిరీటము లను పద్మములవంటి శ్రీరాముని పాదములకు ఆన్చి సేవించెదరు. అట్టి శ్రీరాముని నేను శరణు వేడుచున్నాను.
కోసలదేశస్థులలో ఎవరైతే శ్రీరాముని స్పృశించినారో, లేదా పరి కించి చూచినారో, లేదా సహవాసము చేసినారో, లేదా ఆయన వెంట నడ చిరో, వారందరు యోగులు చేరే ధామమును చేరిరి.
ఓ పరీక్షిన్మహారాజా! దయాగుణము ప్రధానము గల ఏ వ్యక్తి యైతే నిరంతరము శ్రీరాముని చరితమును శ్రవణము చేస్తూ, ఆయనను హృదయములో నిలుపుకొనునో, అట్టి వ్యక్తి కర్మబంధములనుండి విముక్తు డగును.
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను -- ఆ శ్రీరామ భగవానుడు తన అంశ లే అయిన సోదరుల యెడల తాను ఎట్లు వ్యవహరించెను? ఆ సోదరులు, ప్రజలు, పురజనులు కూడ ఆయన యెడల ఎట్లు వ్యవహరిం చిరి?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పట్టాభిషేకము తరువాత ముల్లోకములకు ప్రభువగు శ్రీరాముడు తన సోదరులను దిగ్విజయయా త్రకై ఆదేశించెను. ఆయన తన వారలకు దర్శనమిచ్చుటయే గాక, అయోధ్యా నగరమును తాను సోదరులతో గూడినవాడై దర్శించెను.
అయోధ్యలోని రాజమార్గములు గంధజలములతో మరియు ఏను గుల మదజలములతో తడిసి యుండెడివి. ఆ నగరము తన వద్దకు వచ్చిన ప్రభువును చూచి మిక్కిలి మత్తెక్కిన యువతిని పోలియుండెడిది.
ఆ నగరము బంగరు కడవలతో అలంకరించబడిన ప్రాసాదములు, గోపురములు, సభామండపములు, విహారములు, దేవాలయములు మొద లగువాటితో మరియు జెండాలతో శోభిల్లెను.
ఆ నగరములోని గృహద్వారములు పళ్ల గుత్తులతో కూడిన పోకచె ట్లతో, అరటి చెట్లతో, మంచి వస్త్రముల పతాకములతో, అద్దములతో మరియు మాలలతో అలంకరించబడి మంగళకరముగా నుండెను. బజారు లయందు వస్త్రములు పరుచబడి యుండెను.
ఆ నగరములో పురజనులు శ్రీరాముని అక్కడక్కడ పూజాద్రవ్య ములను పట్టుకోని సమీపించి, ఓ దేవా! నీవు పూర్వము (వరాహావతారము లో) ఉద్ధరించిన ఈ భూమండలమును రక్షించుము, అంటూ ఆశీస్సులను ప్రయోగించిరి.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యేను. చిరకాలము తరువాత తిరిగి వచ్చిన ఆయనను చూడవలెననే కోరిక ప్రజలకు ఉండెను. స్త్రీలు, పురు షులు ఇళ్లను వదిలి వచ్చి ప్రాసాదముల పైకి ఎక్కి పద్మములవంటి కన్నులు గల శ్రీరాముని చూచి ఆయనపై పూలను చల్లిరి. ఆయనను చూచుచున్ననూ, వారి కళ్లకు తృప్తి లేకుండెను.
తరువాత శ్రీరాముడు తన ప్రాసాదమును ప్రవేశించెను. ఆయన పూర్వజులైన మహారాజులు ఆ ప్రాసాదమునే సేవించిరి. అది హద్దులు లేని అనేకములైన ఖజానాలతో, మరియు విలువ కట్టలేని అనేకములైన సామగ్రులతో సమృద్ధమై యుండెను.
ఆ ప్రొసాదమునందలి ద్వారముల గడపలకు పగడములు పొదగ బడి యుండెను. దానియందు కెంపులు పొదిగిన స్తంభముల వరుసలు ఉండెను. అచటి స్వచ్చమైన నేలలు పచ్చలు పొదిగి యుండెను. అచటి గోడలపై స్పటికములు ప్రకాశించుచుండెను.
రంగురంగుల మాలలు, పతాకలు, చాందినీలు, వస్త్రములు, మణుల గుంపుల కాంతులు, అక్కడక్కడ శుద్ధచైతన్యము వలె స్వచ్చమైన ఉజ్జ్వలమగు ముత్యములు మరియు సుందరమగు భోగసాధనములు అను వాటితో ఆ ప్రాసాదము ప్రకాశించెను.
సుగంధయుక్తములగు ధూపదీపములతో, మరియు పుష్పాలంకా రములతో ఆ ప్రాసాదము అలంకరించబడెను. అలంకారములకే అలంకార ములనదగిన దేవతలను పోలిన స్త్రీపురుషులు ఆ ప్రాసాదమును సేవించు చుండిరి.
ఆత్మారాములలో అగ్రేసరుడగు శ్రీరాముడు వివేకవంతులై ఆత్మా రాములైన మహాత్ములకు ప్రియమైనవాడు. ప్రేమమూర్తియగు సీతాదేవి తన నడవడిచే ఆయనకు ఆహ్లాదమును కలిగించెడిది. ఆయన ఆమెతో గూడి ఆ ప్రాసాదములో విహరించెను.
మానవులచే ధ్యానించబడే చిగుళ్లవంటి పాదములు గల శ్రీరా ముడు ధర్మమును సంకోచము చేయకుండా (ధర్మమునకు అడ్డు పడకుం డా), అనేక సంవత్సర సమూహముల కాలములో ఉచితమగు సమయము లయందు కామనలను కూడ అనుభవించెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో ఉత్తరరామచరితమును వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది.
