శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము

Table of Contents

5 - అంబరీషోపాఖ్యానము - అంబరీషుడు దూర్వాసుని విష్ణుచక్రమునుండి విడిపించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- చక్రముచే తపింప జేయబడిన దూర్వాస మహర్షిని శ్రీహరి భగవానుడు ఈ విధముగా ఆదేశించగా, దుఃఖి తుడైయున్న ఆ మహర్షి అంబరీషుని వద్దకు తిరిగి వచ్చి, ఆయన పాదములను పట్టుకొనెను.

దూర్వాస మహర్షి తన పాదములను పట్టుకొనగా అంబరీషుడు బిడియపడెను. ఆయన ఆ మహర్షియొక్క హడావిడిని చూచి కృపచే మన స్సులో చాల కష్టపడెను. అపుడాయన శ్రీహరియొక్క ఆయుధమగు ఆ చక్రమును స్తుతించెను.

అంబరీషుడిట్లు పలికెను --- పృథివీ-జలములు-అగ్ని-వాయువు -ఆకాశము అనే అయిదు స్థూల భూతములు, శబ్ద-స్పర్శ-రూప-రస-గం ధములనే అయిదు సూక్ష్మభూతములు, శ్రోత్ర-త్వక్-చక్షుః-జిహ్వా-ఫ్రణ ములనే ఇంద్రియములు, పూజనీయుడగు సూర్యుడు, నక్షత్రాధిపతియగు చంద్రుడు నీ రూపములే..

ఓ సుదర్శనమా! నీకు నమస్కారము. శ్రీహరికి ప్రియమైన నీకు వేయి ఆకులు (పళ్లు) గలవు. నీవు సకలములైన అస్త్రములను వినష్టము చేసి భూమిని రక్షించెదవు. ఈ మహర్షికి మంగళమును కలిగించుము.

ధర్మము నీవే. మధురమైన సత్యవచనము నీవే. యజ్ఞము నీ రూపమే. యజ్ఞముల ఫలములకు భోక్తవు నీవే. లోకములను పాలించేది నీవే. సర్వముయొక్క సారము నీవే. పురుషోత్తముని సర్వాతిశాయియగు తేజస్సు నీవే.

ఓ చక్రమా! చక్కని నడిమి తూము గల నీవు సకలధర్మములను నిలబెట్టెదవు. అధర్మస్వభావము గల రాక్షసులను నీవు అగ్నివలె దహించే దవు, తోకచుక్క వలె అనర్థమును కలిగించెదవు. ముల్లోకములను రక్షించే నీ తేజస్సు స్వచ్ఛమైనది. నీవు మనోవేగముతో అద్బుతమైన కర్మలను చేయుదువు. నీకు నమస్కారమును చేయుచున్నాను.

వాక్కులకు ప్రభువగు ఓ చక్రమా! ధర్మరూపమగు నీ తేజస్సు మహాత్ముల చీకటి (ఆపద, అజ్ఞానము) ని పోగొట్టి, వెలుతురు (అభివృద్ధి, జ్ఞానము) ను కలిగించును. నీ మహిమ అపారము. మూర్త (పృథివి-జల ము-అగ్నులు)-అమూర్త (వాయు-ఆకాశములు) రూపమైనట్టియు, కార్య కారణరూపమైన ఈ జగత్తు వాస్తవములో నీ రూపమే.

పరాజయము లేని ఓ చక్రమా! నీరంజనుడగు (రాగద్వేషాది దోష ములు లేని) శ్రీహరి నిన్ను దైత్యుల (దితి సంతానము) మరియు దానవుల  (దనువు సంతానము) సైన్యముపై ప్రయోగించినప్పుడు నీవు నిరంతర ముగా చేతులను ఉదరములను తొడలను కాళ్లను తలలను నరుకుతూ, యుద్దమునందు నిశ్చయముగా అధిక ప్రకాశమును కలిగియుండెదవు.

జగత్తును రక్షించే ఓ చక్రమా! సర్వమును సహించే నిన్ను గదా ధారియగు శ్రీహరి దుష్టులను సంహరించి జగత్తును రక్షించుటకై నియో గించినాడు. మా వంశమునకు భాగ్యమును లభింప జేయుట కొరకై ఈ మహర్షికి కల్యాణమును కలిగించుము. ఏలయనగా, మహర్షిని రక్షించు టయే మాకు అనుగ్రహము అగును.

నేను దానమును గాని, యజ్ఞమును గాని చేసియున్నచో, నేను స్వధర్మమును చక్కగా అనుష్ఠించి యున్నచో, మా వంశము వేదవేత్తలే దైవముగా గలది అయినచో, ఈ వేదవేత్త తాపము (ఉపద్రవము) నుండి విముక్తుడగుగాక!

అద్వితీయుడగు శ్రీహరి భగవానుడు సకలగుణములకు నిధాన ము. సకలప్రాణులయందు మేము ఆత్మభావమునే కలిగియున్నాము. అట్టి మాపై ఆయనకు ప్రీతి ఉన్నచో, ఈ వేదవేత్త తాపము (ఉపద్రవము) నుండి విముక్తుడగుగాక!

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అంబరీష మహారాజు ఈ విధ ముగా చక్కగా స్తుతించెను. సుదర్శనమనే విష్ణుచక్రము ఆ మహర్షినీ అన్ని వైపులా అధికముగా దహించి వేయుచుండెను. కాని, అంబరీషుడు కోరు టను బట్టి అది శాంతించెను.

తరువాత దూర్వాస మహర్షికి చక్రముయొక్క అగ్ని వలన తాపము దూరమయ్యెను. అపుడాయన స్తిమితపడి ఆ మహారాజునకు గొప్ప ఆశీర్వచనములను చేస్తూ, ఆయనను గొప్పగా కొనియాడేను.

దూర్వాస మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఆశ్చర్యము! తప్పు చేసిన నాకు నీవు చక్కగా కల్యాణములను చేయుచున్నాను. నాకీ నాడు అనంతుడగు శ్రీహరి భక్తులయొక్క మహిమ అనుభవమునకు వచ్చుచున్నది.

ఎవరైతే భక్తపాలకుడగు శ్రీహరి భగవానుని తమ హృదయము నందు దృఢముగా నిలిపి యుంచెదరో, అట్టి సత్పురుషులైన మహాత్ములు చేయలేనిది గాని, విడిచి పెట్టలేనిది గాని ఏమి ఉండును?

శ్రీహరి పాదములు గంగాది తీర్థములకు ఆశ్రయము. ఆయన నామమును విన్నంత మాత్రాన వ్యక్తి పవిత్రుడగును. అట్టి శ్రీహరి భక్తులకు కర్తవ్యము ఏమి మిగిలియుండును?

ఓ మహారాజా! మిక్కిలి దయామయుడవగు నీవు నన్ను అనుగ్ర హించితివి. ఏలయనగా, నీవు నా పాపమును విస్మరించి నా ప్రాణము లను కాపాడితివి.

మహర్షి తిరిగి వచ్చుననే ఆకాంక్షతో అంబరీష మహారాజు భోజ నము చేయలేదు. ఆయన ఆ మహర్షి పాదములకు నమస్కరించి, ఆయ నను ప్రసన్నునిగా చేసి, ఆయనచే సుష్ఠుగా భోజనము చేయించెను.

సర్వోత్తమమగు రసాదులతో సంపన్నమైన ఆహారము మొదలగు ఆతిథ్యమును అంబరీష మహారాజు సాదరముగా ఆ మహర్షికి సమర్పించే ను. ఆయన ఆహారమును భుజించి మనస్సులో సంతుష్టుడై సాదరముగా మహారాజును కూడ, భోజనము చేయుడని పలికెను.

భగవద్భక్తుడవగు నిన్ను చూచి, స్పృశించి, నీతో మాటలాడుట వలన నేను అనుగ్రహించ బడితిని. నీవు పరమాత్మయందు బుద్ది నిలిపి ఇచ్చిన ఆతిథ్యముచే నిశ్చయముగా ప్రీతిని జెందితిని.

నీయొక్క ఈ పవిత్రమైన కర్మ (మహర్షిని కాపాడుట) ను స్వర్గ స్త్రీలు పలుమార్లు గానము చేయుదురు. ఈ భూలోకము కూడ మిక్కిలి పవిత్రమైన నీ కీర్తిని గానము చేయగలదు.

దూర్వాస మహర్షి చాల సంతోషించి అంబరీష మహారాజును ఈ విధముగా చాల స్తుతించి, ఆయన వద్ద సెలవు తీసుకొని బ్రహ్మలోకము నకు వెళ్లాను. కేవలకర్మచే బ్రహ్మలోకమును పొందుట శక్యము కాదు.

వెళ్లిన మహర్షి తిరిగి వచ్చు సరికి ఒక సంవత్సరము కాలము గడచి పోయెను. ఆయన రాక కొరకు ఎదురు చూచుచున్న అంబరీష మహారాజు ఆ కాలములో కేవలము నీటిని మాత్రమే త్రాగెను.

దూర్వాస మహర్షి వెళ్లిన తరువాత, ఆయన తినుటచే పవిత్రమైన ఆహారమును ఆ అంబరీషుడు ఆరగించెను. ఆ మహర్షి ఆ విధముగా ఆపదలో పడి గట్టెక్కుటను గమనించి, తాను ధైర్యముగా ఉండుట మరియు ఆ సర్వము పరమాత్మ యొక్క మహిమయేనని ఆ మహారాజు తలపోసెను.

ఈ విధముగా అనేకగుణములకు నిధియగు ఆ అంబరీష మహా రాజు పలువిధముల క్రియల ద్వారా, ప్రకృతికి ఆతీతమగు ఆత్మరూపమై శ్రీకృష్ణ రూపమును దాల్చిన పరబ్రహ్మయందు మంచి భక్తిని చేసెను. ఆ భక్తి యొక్క ప్రభావముచే ఆయన బ్రహ్మలోకము వరకు గల భోగములను నరకముతో సమానమైనవాటిని తలపో సెను.

తరువాత ఆత్మానాత్మవివేకియగు అంబరీషుడు ఆత్మరూపుడగు వాసుదేవునియందు మనస్సును నిలిపి సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము (సంసారము) నకు అతీతుడాయెను. ఆయన రాజ్యమును పుత్రుల కప్పజెప్పి అడవిని ప్రవేశించెను.

అంబరీష మహారాజుయొక్క ఈ విధమైన ఈ పవిత్రమగు గాథను చక్కగా కీర్తించి ధ్యానించు సాధకునియందు భగవద్బక్తి నెలకొనును.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో అంబరీషోపాఖ్యానమునందు దూర్వాస మహర్షిని అంబరీషుడు విష్ణుచక్రమునుండి విడిపించుటను వర్ణించే అయిదవ అధ్యాయము ముగిసినది (5).