శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
19 - పుంసవన వ్రత విధానము
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! తమరు పుంసవ నము అని ప్రసిద్ధి గాంచిన వ్రతమును గురించి చెప్పితిరి. ఆ వివరములను నేను తెలియ గోరుచున్నాను. ఆ వ్రతముచే విష్ణువు ప్రసన్నుడగును గదా!
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- స్త్రీ భర్త అనుమతితో కోరికలన న్నింటినీ ఈడేర్చే ఈ వ్రతమును మార్గశిర శుక్ల పాడ్యమి నాడు ప్రారం భించ వలెను.
స్త్రీ మరుత్తుల జన్మవృత్తాంతమును విని, వేదవేత్తల అనుమతిని పొందవలెను. ప్రతి దినము ఆమె దంతములను శుభ్రము చేసుకొని, స్నానము చేసి, రెండు తెల్లని వస్త్రములను ధరించి, అలంకరించుకొని, ఉదయపు ఫలహారమునకు ముందే లక్ష్మీదేవితో గూడియున్న శ్రీహరి భగ వానుని పూజించవలెను.
హే భగవన్! నీవు ఆప్తకాముడవు. నీకు అపేక్షలు లేవు. నీకు సర్వము సుసంపన్నము. నీవు గొప్ప మహిమలకు (లక్ష్మికి) ప్రభుడవు. సక లసిద్ధులు నీయందే ఉన్నవి. నీకు అనేక నమస్కారములు అగు గాక!
ఓ ఈశ్వరా! దయ, సంపద, తేజస్సు, మహిమ, శక్తి మొదలగు సకలగుణములు పూర్ణములై నిన్ను సేవించుచున్నవి. కావుననే, నీవు భగ వానుడవు, జగన్నాథుడవు అగుచున్నావు.
విష్ణుపత్నివగు ఓ లక్ష్మీ! గొప్ప మాయాశక్తివి నీవే. పురుషోత్తముని లక్షణములే నీయందు కూడ గలవు. గొప్ప భాగ్యవతియగు ఓ లోకజననీ! నాపై ప్రీతిని కలిగియుండుము. నీకు నమస్కారమగు గాక!
ఓమ్, మహాప్రభావశాలి, మహామహిమాన్వితుడు, మహావీభూతు లతో (లక్ష్మితో కూడియున్నవాడు అగు పురుషోత్తమ భగవానుని కొరకు నమస్కారము. పూజాద్రవ్యములను సమర్పించేదను గాక! అనే భావము గల పై మంత్రముతో ప్రతిదినము ఆ స్త్రీ ఏకాగ్రమగు చిత్తముతో విష్ణువు నకు ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్ర ములు, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, ధూప ము, దీపము, నైవేద్యము మొదలైన ఉపచారములను కూడ సమర్పించవలెను.
గొప్ప విభూతియగు లక్ష్మీదేవికి భర్తయగు పురుషోత్తమ భగవా నుని కొరకు ఇది సమర్పించ బడుచున్నది అనే అర్థము గల మంత్రముతో, నైవేద్యము పెట్టగా మిగిలిన హవిస్సును పన్నెండు సార్లు అగ్నిలో హోమము చేయవలెను.
లక్ష్మీదేవి, విష్ణువు వీరిద్దరి వలననే మనోరథములన్నియు ఈడే రును. కావున, సకలసంపదలను కోరే వ్యక్తి భక్తితో, వరములనిచ్చే వారిద్ద రిని నిత్యము చక్కగా పూజించవలెను.
భక్తితో వినమ్రమైన మనస్సుతో సాష్టాంగ నమస్కారము చేసి, మంత్రమును పదిసార్లు జపించి, తరువాత స్తోత్రమును పఠించవలెను.
మీరిద్దరు జగత్ప్రభువులు. మీరు జగత్తునకు కారణమై జగత్తునకు అతీతులై యున్నారు. జగత్తునకు ఉపాదానమగు సూక్ష్మశక్తి ఈ లక్ష్మీదే వియే. ఉల్లంఘించ శక్యము కాని మాయాశక్తి ఈమెయే.
పురుషోత్తముడవగు నీవే సాక్షాత్తుగా ఆ మాయాశక్తికి అధీశ్వరుడ వు. నీవు సర్వయజ్ఞమూర్తివి కాగా, యజ్ఞక్రియ ఈమెయే. నీవు సర్వకర్మల ఫలముననుభవించే జీవుని రూపములో నుండగా, ఈమె లౌకిక క్రియ (క్రియాశక్తి) రూపములో నున్నది.
సత్త్వరజస్తమోగుణముల అభివ్యక్తియే లక్ష్మీదేవి కాగా, ఆ గుణ ములను ప్రకటించి అనుభవించే చేతన పురుషుడవు నీవు. సర్వప్రాణుల రూపముగా ఉన్న అఖండచైతన్యము (ఆత్మ) నీవు కాగా, ఆ శరీరములు, ఇంద్రియములు, అంతఃకరణముల రూపములో లక్ష్మీ ప్రకటమైనది. లక్ష్మీ భగవతి నామరూపములు కాగా, ఆ నామరూపములకు ఆశ్రయము ప్రకాశ కము అగు సచ్చిదాత్మ నీవే.
ఓ శ్రీహరీ! నీ కీర్తి పవిత్రమైనది. నీవు, లక్ష్మి ముల్లోకములకు వర ములనిచ్చే పరమేశ్వరులు. కావున, నా గొప్ప మనోరథములు కూడ మీ అనుగ్రహముచే యథార్థములగు గాక!
లక్ష్మీసమేతుడగు శ్రీనివాసుని ఈ విధముగా స్తుతించి, నైవేద్యము నచటనుండి తీసివేసి, ఆచమనమును సమర్పించి పూజించవలెను.
తరువాత భక్తితో వినమ్రమైన మనస్సుతో స్తోత్రమును పఠించవలె ను. అటు పిదప యజ్ఞములో మిగిలిన హవిస్సును ఆఘ్రాణించి, సర్వోత్తమ మగు భక్తితో శ్రీహరికి పునఃపూజ చేయవలెను. భర్తను కూడ పురుషోత్త ముడే యను బుద్ధితో పూజించవలెను.
భర్త కూడ ప్రేమ స్వభావము గలవాడై, ఆయా ప్రియమగు వస్తు వులను భార్యకు అర్పించవలెను. మరియు, భార్యయొక్క చిన్న పెద్ద పను లలో ఆమెకు చేదోడు వాదోడుగా నుండవలెను.
దంపతులిద్దరిలో ఏ ఒకరు చేసినా ఫలము ఇద్దరికి వచ్చును. భార్య సమర్ధురాలు కానిచో, భర్త ఈ వ్రతమును ఏకాగ్రమగు చిత్తముతో చేయవలెను.
ఈ విష్ణువ్రతమును చేయు వ్యక్తి దీనికి ఏ విధముగనూ ఆటం కమును కలుగనీయరాదు. ఈ ప్రతనియమమును చేపట్టిన వ్యక్తి వేదవేత్తల ను, సువాసినులగు స్త్రీలను, శ్రీహరిని కూడ పుష్పమాలలు, గంధము, ఆహారము, అలంకారములతో ప్రతిదినము భక్తితో పూజించవలేను.
శ్రీహరిని తన ధామమునకు సాగనంపి, అంతఃకరణశుద్ధి కొరకు సకలమనోరథసమృద్ధి కొరకు నైవేద్యము పెట్టిన ప్రసాదమును మున్ముం దుగా తినవలెను.
పతివ్రతయగు స్త్రీ ఈ పూజావిధానమును అధికమాసము లేని సంవత్సరము పన్నెండు నెలలు అనుష్ఠించి, తరువాత కార్తీక అమావాస్య నాడు ఉపవాసము చేయవలెను.
మరునాడు ఉదయమే భర్త స్నానము చేసి, పూర్వమునందు వలెనే శ్రీహరిని పూజించి, నేతితో కూడిన పాయసమును పన్నెండు ఆహు తులను స్థాలీపాక విధానముతో హోమము చేయవలెను.
సంతుష్టులైన వేదవేత్తలు చక్కగా చేసిన ఆశీర్వచనములను తల వంచి స్వీకరించవలెను. భక్తితో వారికి తల వంచి నమస్కరించి వారి అను మతితో భుజించవలెను.
భర్త మౌనముగా నుండి బంధువులతో గూడి ఆచార్యుని ఎదుటని డుకొని, హోమము చేయగా మిగిలిన పాయసమును భార్యకు ఈయవలె ను. ఈ ప్రసాదము వలన చక్కని సంతానము, సౌభాగ్యము కలుగును.
ఈ విషువ్రతమును యథావిధిగా ఆచరించే పురుషునకు ఈ లోక ములో కోరిన ప్రయోజనము సిద్ధించును. దీనిని ఆచరించే స్త్రీకి సౌభాగ్య ము, సంపద, సంతానము, భర్తకు దీర్ఘాయుర్దాయము, కీర్తి మరియు స్వంత ఇల్లు లభించును.
ఈ వ్రతమును కన్య ఆచరించినచో, సకలసలక్షణములు గల భర్త లభించును. సంతానము (భర్త) లేని స్త్రీ చేసినచో, ఆమె దోషములన్నియు తొలగిపోయి పుణ్యలోకము లభించును. సంతానము పోయిన స్త్రీ చేసిన చో, ఆమెకు దీర్ఘాయుర్దాయము గల సంతానము కలుగుటయే గాక, ఆమె సంపన్నురాలగును. దురదృష్టము గల స్త్రీ చేసినచో, అదృష్టము కలిసి వ చ్చును. అందము లేని యువతి చేసినచో, గొప్ప అందము కలుగును. రోగము గలవాడు దీనిని చేసినచో, రోగమునుండి విముక్తుడగుటయే గాక, ఇంద్రియపాటవము గల బలమైన దేహమును కూడ పొందును. దీనిని యజ్ఞము, దానము మొదలగు అభ్యుదయ కర్మలను చేయు సమయ ములో సాధకుడు పఠించ దగును. దీనిని పఠించుట వలన పితృదేవతలకు అనంతమగు తృప్తి కలుగును.
హోమము పూర్తి అయిన తరువాత పితృదేవతలు, హోమద్రవ్యలో క్తయగు శ్రీహరి మరియు లక్ష్మీదేవి కూడ సంతోషించి సకల మనోరథము లను ఇచ్చెదరు. ఓ పరీక్షిన్మహారాజా! నేను నీకు గొప్పది మరియు పావ నము అగు మరుత్తుల జన్మ వృత్తాంతమును, దితియొక్క గొప్ప ప్రత మును గురించి చెప్పితిని.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో పుంసవన వ్రతమును వర్ణించే పంతొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).
