శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము

Table of Contents

17 - చిత్రకేతువు శాపముచే వృత్రుడై జన్మించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విద్యాధరుడగు చిత్రకేతువు అనంతుడు అంతర్ధానమైన దిక్కునకు నమస్కరించి, యథేచ్ఛగా ఆకాశ మార్గమునందు సంచరించెను.

అనేకములగు సంకల్పములను సిద్ధింపజేసే కులపర్వతరాజగు మేరుపర్వతముయొక్క లోయలలో ఆ చిత్రకేతువు పది వేల కోట్ల సంవత్స రములు విహరించెను. గొప్ప యోగియగు ఆతని ఇంద్రియముల పాట వము తగ్గనే లేదు. ఆతనిని మహర్షులు, సిద్దులు, చారణులు స్తుతించెడివా రు. ఆతని ప్రేరణచే విద్యాధరస్త్రీలు శ్రీహరి భగవానుని కీర్తించెడివారు.

ఒకనాడాతడు విష్ణువు ఇచ్చిన మెరిసి పోయే విమానములో వెళ్లుచుండెను. సిద్దులు, చారణులచే చుట్టువారబడియున్న కైలాసవాసి యగు శివుడాతనికి కనబడెను. ఆయన మహర్షుల సభలో తన అంకము పై పార్వతీ దేవిని కూర్చుండ బెట్టుకొని, ఆమెను బాహువుతో ఆలింగనము చేసుకొనియుండెను. ఆమె వినుచుండగా, చిత్రకేతువు బిగ్గరగా నవ్వి, ఆమె సమీపమునందు ఇట్లు పలికెను.

చిత్రకేతువు ఇట్లు పలికెను --- ఈయన సాక్షాత్తుగా లోకములకు తండ్రి, గురువు. ఈయన మానవులకు ధర్మమును బోధించును. ఈ సభలో ఈయనే ప్రముఖుడు. అయిననూ, భార్యను కౌగిలించుకొని ఉన్నాడు.

ఈయన జటలను ధరించి కఠినమగు తపస్సును చేసినవాడు. వేద వేత్తల సభకు అధ్యక్షుడు ఈయనే, అయిననూ, ఈయన సభలో సిగ్గు లేకుండా స్త్రీని కౌగిలించుకొని యున్నాడు.

సామాన్య జనులైననూ బహుశః ఏకాంతమునందు మాత్రమే స్త్రీని అంకముపై కూర్చుండ బెట్టుకొనెదరు. కాని, గొప్ప ప్రతనిష్ఠ గల ఈయన మాత్రము సభయందు స్త్రీని అంకముపై కూర్చుండ బెట్టుకొనెను.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శివ భగ వానుని సంకల్పము ఊహకు అందేది కాదు. ఆయన ఆ మాటను విని నవ్వి మిన్నకుండెను. సభలోని సభ్యులు కూడ ఆయన పద్ధతినే పాటించిరి.

చిత్రకేతువు పొగరుమోతు. తాను మనస్సును జయించినాననే గర్వముతో, శివుని శక్తిని ఎరుగని ఆ చిత్రకేతువు ఈ విధముగా చాల తప్ప మాటలను పలుకుచుండగా, పార్వతీ దేవి కోపముగా వానితో నిట్లనే ను.

పార్వతీ దేవి ఇట్లు పలికేసు --- ఈసోడు లోకములో, సిగ్గులేని దుష్టులమగు మనవంటి వారలకు శిక్షను వేసి కష్టమును కలిగించి శాసించే ప్రభుడు ఈతడేనా యేమి?

పద్మసంభవుడగు బ్రహ్మగారు, ఆయన పుత్రులగు భృగువు నార దుడు మొదలగు వారు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు కూడ ధర్మ మునెరుగరు గదా! ఏలయనగా, మితిమీరి ప్రవర్తించుచున్న శివుని వారు అడ్డుకొన లేదు.

వీరందరు జగత్తునకు తండ్రి, గురువు అగు శివుని పద్మముల వంటి పాదముల జంటను నిరంతరముగా ధ్యానించుచుందురు. ఆయన స్వయముగా మంగళములన్నింటికీ మంగళుడు. ఈ క్షత్రియాధముడు, ఈ పొగరుమోతు మహర్షులను త్రోసిపుచ్చి, ఆయనను శాసించుచున్నాడు. కావున, వీనికి శిక్షను వేయవలసినదే.

తాను ఉత్తముడనని గర్వించియున్న ఈతడు సత్పురుషులచే సేవించబడే శ్రీహరి పాదముల మూలమును చేరుటకు తగడు.

ఓరీ దుర్బుద్దీ! కావున, నీవు పాపభూయిష్టమగు రాక్షసజన్మను పొందుము. ఓ కుమారా! ఈ శిక్ష వలన నీవీ లోకములో మరల మహాత్ముల యెడల అపరాధమును చేయకుండెదవు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షి న్మహారాజా! ఈ విధముగా శాపమును పొందిన ఆ చిత్రకేతువు విమానము నుండి క్రిందకు దిగి, వినమ్రమైన శిరస్సుతో పార్వతీదేవిని ప్రసన్నురాలిని చేసుకొనెను.

చిత్రకేతువు ఇట్లు పలికెను --- ఓ జగన్మాతా! నీవు నాకిచ్చిన శాపమును నేను దోసిలియొగ్గి (వినయపూర్వకముగా) స్వీకరించుచున్నా ను. మానవునకు ప్రారబ్ధకర్మచే లభించే దానికి దేవతలు కేవలము సూచనను చేయువారు మాత్రమే.

అజ్ఞానముచే వ్యామోహమును పొందియున్న జీవుడు ఈ సంసార చక్రములో తిరుగుతూ, దేశకాలములన్నింటియందు సుఖదుఃఖముల నను భవించుచునే యుండును.

సుఖదుఃఖములనిచ్చేది తన ఆత్మ కాదు; ఇంకొకరు కూడ కాదు. కాని, అజ్ఞాని ఆత్మ గాని, మరియొకరు గాని కర్తయని తలపోయును.

ఈ సంసారము సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము (మిథ్య) మాత్రమే. దీనిలో శాపమెట్టిది ? అనుగ్రహమెట్టిది ? స్వర్గమేది? నరకమేది? సుఖమేది? దుఃఖమేది?

అద్వితీయుడు, కర్తృత్వభోక్తృత్వములు లేనివాడు అగు భగవా నుడే తన మాయాశక్తిచే ప్రాణులను, వారి వారి బంధమోక్షములను, సుఖ దుఃఖములను కూడ సృష్టించుచున్నాడు.

భగవానుడు సర్వసముడు, రాగద్వేషములు లేనివాడు. ఆయనకు ఒకడు ప్రియుడనియు, మరియొకడు శత్రువనియు, తనవాడు పరాయి వాడు అనియు భేదము ఉండదు. ఆయనకు జ్ఞాతి అని, బంధువు అని ఉండరు. ఆయనకు సుఖమునందు ఆసక్తి లేదు. అట్టి స్థితిలో కోపము ఎక్క డనుండి వచ్చును?

అయినప్పటికీ ఈ జగత్తు రూపముగా ప్రకటమైన ఆయన మాయాశక్తి ఈ దేహధారులకు సుఖదుఃఖములను, మంచి చెడులను, బంధమోక్షములను, జననమరణప్రవాహరూపమగు సంసారమును కల్పించుటకు సమర్థమగుచున్నది.

ఓ పతివ్రతా! నీకు కోపము ఎక్కువయే. నేను నిన్ను ప్రసన్నురాలి నిగా చేసుకొనుచున్నాను. కాని, శాపవిముక్తి కొరకు కాదు. నా మాట చెడు అని నీవు తలచితివి. దానిని నీవు క్షమించుము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అంతశ్శత్రువులను అణచిన ఓ పరీక్షిన్మహారాజా! కైలాసవాసులగు పార్వతీ పరమేశ్వరులను ఈ విధ ముగా ప్రసన్నము చేసుకొని, వారు విస్మితులై చూచుచుండగా, చిత్రకే తువు తన విమానముపై వెళ్లాను.

అపుడు దేవతలు, మహర్షులు, దైత్యులు, సిద్ధులు. రుద్రాసుచ రులు కూడ వినుచుండగా, రుద్రభగవానుడు పార్వతితో నిట్లనెను.

శ్రీరుద్ర భగవానుడిట్లు పలికెను --- ఓ సుందరీ! శ్రీవారి లీలలు ఆశ్చర్యకరములు. ఆయన సేవకుల సేవకులు కూడ కామనలు లేని మహా త్ములే. నీవు అట్టి మహాత్ముని మహిమను చూచినావు.

నారాయణుని శరణు పొందిన భక్తులెవరైననూ దేనివలనైననూ భయపడరు. వారికి స్వర్గము, నరకము, మోక్షములయందు కూడ అంతటా సమానముగా పరమార్థతత్త్వమగు భగవానుడే కానవచ్చును.

ప్రాణులకు దేహము తోడి తాదాత్మ్యము వలననే, సుఖదుఃఖము లు, జన్మమరణములు, శాపానుగ్రహములు మొదలగు ద్వంద్వములు కలుగుచుండును. ఇది అంతా ఈశ్వరుని లీల.

మానవునకు అవివేకము మంచి-చెడులు, సుఖదుఃఖముల తేడా కనబడుచుండును. ఇది స్వప్నముల భేదము లేని ఆత్మ చైతన్యమునందు అనేకములగు భేదములు భాసించుట పంటిది. మాలయందు మానవుడు సర్పమును దర్శించినట్లుగానే, అనాత్మయందు ఆత్మను దర్శించును. 

వాసుదేవ భగవానునియందు భక్తిని చేస్తూ, జ్ఞానవైరాగ్యములే బలముగా గల మానవులకు ఈ లోకములో పని కట్టుకుని ఆశ్రయించ దగి నది ఏదీ లేదు.

ఆ శ్రీహరియొక్క అభిప్రాయమును, లీలను, స్వరూపమును నేను, బ్రహ్మగారు, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మమానసపుత్రులగు మహర్షులు తెలియకున్నారు. శ్రీహరి అంశయగు బ్రహ్మగారి అంశలైన లోకపాలకులు భేదదృష్టిచే తాము ప్రభువులమని తలపోయుచుందురు. కాని, వారు కూడ ఆయన స్వరూపమును తెలియకున్నారు.

ఈశ్వరునకు ఒకడు ప్రియుడనియు, మరియొకడు కాదనియు, ఒకడు తనవాడనియు, ఇంకొకడు పరోయి పాడనియు లేదు. సకలప్రాణు లకు ఆత్మ శ్రీహరియే గనుక, అందరు శ్రీహరికి ప్రియులే. శ్రీహరి అందరీకి ప్రియుడే.

గొప్ప భాగ్యవంతుడగు ఈ చిత్రకేతువు శ్రీహరికి ప్రియమైన అను చరుడు. శాంత స్వభావము గల ఈతడు అంతటా సమానముగా పరబ్ర హ్మను దర్శించును. నేను కూడ శ్రీహరికి ప్రియుడనే. నాకు కూడ శ్రీహరి ప్రియుడు.

కావున మహాత్ములు, పురుషోత్తముని భక్తులు, అంతటా సమాన ముగా పరబ్రహ్మను దర్శించువారగు  వ్యక్తుల యెడల గర్వమును ప్రదర్శించరాదు.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికేను --- ఓ పరీక్షిన్మహారాజా! శివభగవా ను తనతో పలికిన ఈ షబును వినిన ఉమాదేవికి గర్వము తొలగిపోయి, మనస్సు ప్రసన్నమయ్యెను.

ఈ విధముగా భగవద్భక్తుడగు చిత్రకేతును ఉదూదేవికి తిరిగి శాపము నీయగల గొప్ప సామర్థ్యము గల వాడే అసనంగా, ఆమె ఇచ్చిన శాపమును వంచి స్వీకరించెను. సత్పురుషుల లక్షణము ఇతరులకు అపకారమును చేయకుండుట.

ఆ చిత్ర కేతువే త్వష్టకు దక్షిణాగ్నియందు రాక్షసుడై జన్మించి, వృత్రుడు అని అంతటా గొప్ప ప్రఖ్యాతిని పొంచెను. ఆతడు పరోక్షమగు ఆత్మజ్ఞానము మాత్రమే గాక, ఆత్మానుభవము కూడ గలవాడు.

            రాక్షసుడై పుట్టిన వృత్రునకు భగవంతునియందు భక్తి ఉండుటకు గల కారణమేముని నీవు నన్ను ప్రశ్నించితివి. ఆ విషయమునంతనూ నేను నీకే విధముగా చెప్పితిని.

మహాత్ముడగు ఈ చిత్ర కేతువుయొక్క వృత్తాంతము పావనమైన ఎ. విష్ణుభక్తుల మహిమను విన్నవారికి సంసారబంధమునుండి విముక్తి లభించును.

ఎవడైతే ఉదయమే లేచి మౌనముగా శ్రీహరిని స్మరించి ఈ వృత్తాంతమును శ్రద్ధతో పఠించునో, ఆతడు మోక్షమును పొందును. పురు షార్థములలో కెల్లా మోక్షము శ్రేష్ఠము.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో చిత్ర కేతువు శాపముచే వృత్రుడై జన్మించుటను వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).