భాగవత మహా పురాణము
12 - శ్రీరాముని తరువాతి రఘువంశ రాజుల చరితము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కుశుని పుత్రుడు అతిథి. అతిథి పుత్రుడు నిషధుడు. నిషధుని పుత్రుడు నభుడు. నభుని పుత్రుడు పుండరీ కుడు. పుండరీకుని పుత్రుడు క్షేమధన్వుడు.
క్షేమధన్వుని పుత్రుడు దేవానీకుడు. దేవానీకుని పుత్రుడు అనీహు డు. అనీహుని పుత్రుడు పారియాత్రుడు. పారియాత్రుని పుత్రుడు బలస్థలు డు. బలస్థలుని పుత్రుడు సూర్యుని అంశతో జన్మించిన వజ్రనాభుడు.
ఆ వజ్రనాభుని పుత్రుడు ఖగణుడు. ఖగణుని పుత్రుడు విధృతి. విధృతి పుత్రుడు హిరణ్యనాభుడు. ఆయన జైమిని శిష్యుడు, యోగాచా ర్యుడు. కోసలదేశవాసియగు యాజ్ఞవల్క్య మహర్షి ఆయన వద్దనే అధ్యా త్మయోగమునధ్యయనము జేసెను. ఆ యోగము సాధకునకు గొప్ప అభ్యుదయమును కలిగించి, హృదయమునందలి అజ్ఞానమనే ముడిని తొలగించును.
హిరణ్యనాభుని పుత్రుడు పుష్యుడు. పుష్యుని పుత్రుడు ధ్రువసంధి. ధ్రువసంధి పుత్రుడు సుదర్శనుడు. సుదర్శనుని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుడు. శీఘ్రుని పుత్రుడు మరువు.
మరువు యోగముచే మృత్యువును జయించి ఇప్పుడు కలాప మనే గ్రామమునందు ఉన్నాడు. కలియుగాంతమునందు కనబడకుండా పోయిన సూర్యవంశమును ఆయన మరల ప్రవర్తిల్ల జేయగలడు.
మరువు పుత్రుడు ప్రసుశ్రుతుడు. ప్రసుశ్రుతుని పుత్రుడు సంధి. సంధి పుత్రుడు అమర్షణుడు. అమర్షణుని పుత్రుడు మహస్వంతుడు. మహ స్వంతుని పుత్రుడు విశ్వసాహ్వుడు.
విశ్వసాహ్వుని పుత్రుడు ప్రసేనజిత్తు. ప్రసేనజిత్తు పుత్రుడు తక్షకు డు. తక్షకుని పుత్రుడు బృహద్వలుడు. బృహద్వలుని నీ తండ్రియగు అభి మన్యుడు మహాభారత యుద్ధములో సంహరించెను.
వీరందరు గడచిపోయిన ఇక్ష్వాకువంశపు రాజులు. ఇప్పుడు రాబోయే రాజులను గురించి వినుము. బృహద్వలునకు బృహద్రణుడని ప్రసిద్ధి గాంచిన పుత్రుడు కలుగును.
బృహద్రణునకు ఉరుక్రియుడు, ఉరుక్రియునకు వత్సవృద్దుడు, వత్సవృద్దునకు ప్రతివ్యోముడు, ప్రతివ్యోమునకు భానుడు, భానునకు సేనాధిపతియగు దివాకుడు పుత్రులై జన్మించెదరు.
దివాకుని పుత్రుడు వీరుడైన సహదేవుడు, సహదేవుని పుత్రుడు బృహదశ్వుడు, బృహదశ్వుని పుత్రుడు భానుమంతుడు, భానుమంతుని పుత్రుడు ప్రతీకాశ్వుడు, ప్రతీకాశ్వుని పుత్రుడు సుప్రతీకుడు, సుప్రతీకుని పుత్రుడు మరుదేవుడు, మరుదేవుని పుత్రుడు సునక్షత్రుడు, సునక్షత్రుని పుత్రుడు పుష్కరుడు, పుష్కరుని పుత్రుడు అంతరిక్షుడు, అంతరిక్షుని పుత్రుడు సుతపసుడు, సుతపసుని పుత్రుడు అమిత్రజిత్తు కలుగగలరు.
అమిత్రజిత్తుని పుత్రుడు బృహద్రాజు, బృహద్రాజుయొక్క పుత్రుడు బర్షి, బర్షియొక్క పుత్రుడు కృతంజయుడు, కృతంజయుని పుత్రుడు రణంజయుడు, రణంజయుని పుత్రుడు సంజయుడు కాగలరు.
సంజయుని పుత్రుడు శాక్యుడు, శాక్యుని పుత్రుడు శుద్ధోదుడు, శుద్ధోదుని పుత్రుడు లాంగలుడు, లాంగలుని పుత్రుడు ప్రసేనజిత్తు, ప్ర సేన జిత్తు పుత్రుడు క్షుద్రకుడు, క్షుద్రకుని పుత్రుడు రణకుడు, రణకుని పుత్రుడు సురథుడు, సురథుని పుత్రుడు సుమిత్రుడు అనువారలు కలుగగలరు. వీరు బృహద్వలుని వంశమునకు చెందినవారు. వీరిలో సుమిత్రుడు ఆ వంశము నకు ఆఖరివాడుగా ప్రసిద్ది గాంచును.
ఈ ఇక్ష్వాకు వంశపు రాజుల వంశమునకు సుమీత్రుడు ఆఖరి మహారాజు. ఏలయనగా, కలియుగములో ఆ వంశము నిశ్చయముగా ఆయనతో అంతము కాగలదు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో శ్రీరాముని తరువాతి రఘువంశరాజుల చరితమును వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī traces the remaining lineage of the Solar Dynasty from Bṛhadbala, who fought heroically in the Kurukshetra war, down to the future kings who would rule Ayodhyā across the Kali Yuga. The chapter names notable monarchs such as Bṛhadraṇu, Divāka, Sahadeva, Bṛhadāśva, and Śuddhodana (the father of Gautama Buddha), concluding with King Sumitra, who would be the final monarch of the Ikshvāku line in the current epoch, establishing that the Solar Dynasty, which gave birth to Bhagavān Śrī Rāmacandra, maintains an unbroken historical continuity across vast spans of cosmic time.