భాగవత మహా పురాణము
3 - సుకన్యా రేవతుల వృత్తాంతము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మనుపుత్రుడగు ఆ శర్యాతి వేదవేత్తయై ఉండెను. ఆయన అంగిరస గోత్రీయుల సత్రయాగమునందు రెండవ రోజు చేయవలసిన కర్మను గురించి చెప్పి వ్యవస్థను చేసెను.
ఆ శర్యాతికి సుకన్య కనే కలువ కన్నుల కుమార్తె ఉండెను. ఆయన ఆమెతోగూడి అడవికి వెళ్లి చ్యవన మహర్షి ఆశ్రమమునకు వెళ్లాను.
ఆ సుకన్య తన చెలికత్తెలు చుట్టువారి రాగా అడవిలో చెట్లను వెదుకుచుండెను. ఆమెకు పాము పుట్ట చిల్లులో రెండు మిణుగురు పురుగు లవంటి వెలుగులు కనబడెను.
విధిచే ప్రేరితమైన ఆ సుకన్య చిన్నవయసు చిలిపిదనముచే ఆ రెండు వెలుగులను పుల్లతో గట్టిగా పొడిచేను. అపుడు వాటినుండి రక్తము అధికముగా స్రవించెను.
వెనువెంటనే సైనికులకు మలమూత్రములు బంధించబడెను. ఆ విషయమును తెలిసి రాజర్షియగు శర్యాతి ఆశ్చర్యమును పొంది, సైనికు లతో నిట్లనెను.
మీరు భృగువంశీయుడగు చ్యవనుని యెడల అపరాధమును చేయలేదు గదా? మనలో ఎవరో ఒకరు ఆయన ఆశ్రమమును కలుషితము చేసినారని (మూత్రబంధనమును బట్టి) స్పష్టమగుచున్నది.
భయపడిన సుకన్య తండ్రితో నిట్లనెను -- నేను ఒక పనిని చేసితి ని. నేను తెలుసుకోకుండా రెండు వెలిగే చుక్కలను ముల్లుతో గట్టిగా పొడి చితిని.
కుమార్తె మాటను విన్న శర్యాతికి భయము కలిగెను. పుట్టలోపల కనబడకుండా ఉన్న చ్యవనుని ఆయన మెల్లగా ప్రసన్నుని చేసుకొనెను.
ఆ మహర్షి అభిప్రాయమును తెలుసుకున్న శర్యాతి తన కుమా రైను ఆయనకిచ్చి వివాహము చేసెను. ఈ విధముగా ఆయన సావధాన ముగా ఆ విపత్తునుండి బయట పడి, ఆ మహర్షి వద్ద సెలవు తీసుకోని తన నగరమునకు బయలుదేరి వెళ్లాను.
సుకన్య భర్తయగు చ్యవన మహర్షి మిక్కిలి కోపిష్టి. కాని, ఆమె ఆయన మనసునెరిగి సావధానురాలై ఆయనకు అనుకూలమగు సేవలను చేసి ఆయనకు ప్రీతిని కలిగించెను.
తరువాత కొంత కాలమునకు అశ్వినీ దేవతలు ఆ మహర్షి ఆశ్రమ మునకు రాగా, ఆయన వారిని పూజించి ఇట్లు పలికెను -- మీరిద్దరు సర్వ సమర్థులు. నాకు యౌవనమును ప్రసాదించుడు.
మీకిద్దరికి యజ్ఞములో సోమమునందు భాగము లేదు. నేను మీకి దరి కొరకై సోమరసపాత్రను గ్రహించి సమర్పించ గలను. మీరు నాకు యౌవనమును, మత్తెక్కించే యువతులకు ప్రీతికరమైన రూపమును కలీ గించుడు.
గొప్ప వైద్యులైన అశ్వినీ దేవతలు చ్యవన మహర్షిని కొనియాడి ఇట్లు పలికిరి -- సరే, తమరు సిద్దులచే నిర్మించబడిన ఈ సరస్సునందు మునుగుడు.
ముసలిదనము చ్యవనుని దేహమునంతనూ వ్యాపించగా, దేహ ములోని నరములు అంతటా బయటకు పొక్కి యుండెను. ఒళ్లు ముడు తలు పడగా, జుట్టు తెల్లబడి ఆయన వికృతముగా నుండెను. అశ్వినీ దేవత లిద్దరు పైన చెప్పిన విధముగా పలికి, ఆయనను ఆ సరస్సులోనికి ప్రవే శ పెట్టిరి.
ఆ సరస్సునుండి కుండలములను, పద్మముల మాలలను, చక్కని వస్త్రములను ధరించియున్న సుందరాకారులగు ముగ్గురు పురుషుని పైకి లేచిరి. సమానమైన వారి రూపములు యువతులకు ప్రీతిని గొల్పునవి.
సమానమైన రూపముతో సూర్యుని వలె వెలిగిపోవుచున్న వారిని ముగ్గురిని సుందరియగు సుకన్య చూచెను. కాని, ఆ పతివ్రత తన భర్తను గుర్తు పట్టలేకపోయెను. అపుడామె అశ్వినీ దేవతలనే శరణు జొచ్చెను.
అశ్వినీ దేవతలు సుకన్యయొక్క పాతివ్రత్యముచే సంతోషించి, ఆమెకు ఆమె భర్తను చూపించిరి. అపుడు వారు చ్యవన మహర్షి వద్ద సెలవు తీసుకొని విమానమెక్కి స్వర్గమునకు వెళ్లిరి.
తరువాత శర్యాతి యజ్ఞమును చేయబోవువాడై, చ్యవన మహర్షి ఆశ్రమమునకు వెళ్లాను. అచట ఆయనకు తన కుమార్తెయగు సుకన్య సర సన సూర్యునివలె వెలిగిపోవుచున్న యువకుడు కనబడెను.
శర్యాతి మహారాజు తన కుమార్తెయగు సుకన్యను చూచెను. ఆయన మనస్సునకు అధికమగు ప్రీతి కలుగలేదు. కావుననే, ఆమె తన పాదములకు నమస్కరించిననూ ఆశీర్వచనము పలుకకుండగనే, ఆ రాజు ఆమెతో నిట్లనెను.
ఓ దుష్టురాలా! ఇది యేమి? నీవు యేమి చేయ దలచితివి? నీ భర్త లోకముచే నమస్కరించబడే మహర్షి. నీవాయనను వంచించితివి. ఎందుకంటే, ముసలిదనము ఆవరించిన ఆ మహర్షి నీకు నచ్చుబాటు కాలే దు. కావుననే, దారిన పోయే ఈ విటుని పట్టుకున్నావు.
ఓ సుకన్యా! సత్పురుషుల వంశమునందు పుట్టిన నీకు ఇట్టి అయోగ్యమగు బుద్ది ఎట్లు కలిగినది? (నీ బుద్ది ఇట్లు నశించినదేల?) నీవు సిగ్గు లేకుండా విటుని సేవించుట యేది గలదో ఇది కులమును చెడగొట్టుట యే. నీవు తండ్రి మరియు భర్తల రెండు కులములను నరకములోనికి త్రోసివేయుచున్నావు.
స్వచ్చమైన చిరునవ్వు గల సుకన్య ఇట్లు పలుకుచున్న తండ్రిని ఉద్దేశించి చిరునవ్వుతో నిట్లనెను -- తండ్రీ! ఈయన నీ అల్లుడు, భృగునం దనుడు అగు చ్యవనుడే.
చ్యవనుడు వయస్సును, రూపమును పొందిన వృత్తాంతమునం తనూ సుకన్య శర్యాతికి చెప్పెను. ఆయన ఆశ్చర్యమును, పరమానంద మును పొంది కుమార్తెను కౌగిలించుకొనెను.
వీరుడగు శర్యాతిచే చ్యవనుడు సోమయాగమును చేయించెను. దానిలో చ్యవనుడు తన తేజస్సుచే సోమరసపాత్రను గ్రహించి, సోమయా గములో భాగము లేని అశ్వినీ దేవతలకు కూడ సమర్పించెను.
సహనము నెరుంగని ఇంద్రునకు కోపము వెంటనే వచ్చెను. ఆయన భృగుపుత్రుడగు ఆ చ్యవనుని చంపుటకై వజ్రమును తీసుకొనెను. కాని, చ్యవనుడు వజ్రమును పట్టుకున్న ఇంద్రుని చేతిని స్తంభింప జేసెను.
ఇదివరలో వైద్యులనే కారణముగా అశ్వినీ దేవతలు సోమరసము యొక్క ఆహుతినుండి బహిష్కరించ బడినారు. కానీ, ఇంద్రుని చేతిని చ్యవనుడు స్తంభింప జేసిన తరువాత దేవతలందరు, అశ్వినీ దేవతలకు కూడ సోమరసపాత్రను స్వీకరించి ఆహుతినిచ్చుటను అంగీకరించిరి.
శర్యాతి మహారాజునకు ఉత్తానబరి, ఆనర్హుడు, భూరి షేణుడు అనే ముగ్గురు పుత్రులు కలిగిరి. ఆనర్తుని పుత్రుడు రేవతుడు.
శత్రువులను దునుమాడిన ఓ మహారాజా! ఆ రేవతుడు సము ద్రము లోపల (ద్వీపమునందు) కుశస్థలి అనే నగరమును నిర్మించి, దానిని రాజధానిగా చేసుకొని, ఆనర్తము మొదలగు దేశములను పాలించెను.
ఆ రేవతునకు వందమంది ఉత్తములగు పుత్రులు కలిగిరి. వారిలో కకుద్మి పెద్దవాడు. కకుద్మి తన కుమార్తెయగు రేవతికి వరును గురించి బ్రహ్మగారిని అడిగి తెలుసుకొనుటకై ఆమెను తీసుకొని ప్రకాశముతో నిండి యుండే బ్రహ్మలోకమునకు వెళ్లాను. అచట అపుడు సంగీతోత్సవము జరుగుచుండుటచే ఆయనకు బ్రహ్మగారితో మాటలాడుటకు అవకాశము చిక్క నందు వలన, అచటనే కొద్ది సేపు నిలిచియుండెను.
ఆ సంగీతము ముగిసిన పిదప కకుద్మి తన అభిప్రాయమును సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు విన్నవించెను. అపుడు పూజనీయుడగు ఆ బ్రహ్మగారు నవ్వి కకుద్మితో నిట్లనిరి.
అయ్యో! మహారాజా! నీవు వరులుగా భావన చేసిన వారినంద రినీ కాలము కబళించి వేసినది. ఇప్పుడు వారి కొడుకులు, మనుమలు మరియు మునిమనుమల పేర్లు కూడ వినబడవు.
ఓ రాజా! ఇరవై ఏడు మహాయుగముల కాలము (భూలోకములో) గడచిపోయినది. కావున, నీవు వెళ్లుము. దేవదేవుడగు నారాయణుడు అంశచే మహాబలశాలియగు బలదేవుడై అవతరించినాడు. ఆయన మాన వులలో శ్రేష్ఠుడు. ఆయనకు కన్యలలో శ్రేష్ఠురాలగు ఈ రేవతినిచ్చి వివా హము చేయుము.
ప్రాణులను సృష్టించి పాలించే శ్రీహరీ భగవానుడు భూభార మును తొలగించుట కొరకై తన అంశచే అవతరించి యున్నాడు. ఆయన లీలలను విని కీర్తించువారలు పావనులగుదురు.
ఈ విధముగా ఆదేశించబడిన కకుద్మి మహారాజు స్వయంభువు డగు బ్రహ్మగారికి నమస్కరించి, తన నగరము (కుశస్థలి) నకు తిరిగి వచ్చే ను. ఇంతలో యక్షులకు భయపడిన ఆతని సోదరులు (వంశమునకు చెంది నవారు) ఆ నగరమును విడిచి పెట్టి నలుదిక్కులకు పారిపోయిరి.
కకుద్మి మహారాజు తన కుమార్తెయగు సర్వాంగసుందరియైన రేవతిని బలశాలియగు బలదేవునకిచ్చి వివాహము చేసెను. అపుడాయన తపస్సును చేయుటకై బదరీవనమునందలి నరనారాయణాశ్రమమునకు వెళ్లాను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో సుకన్యా రేవతుల వృత్తాంతమును వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).
Summary of chapter 3 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter records the history of King Śaryāti, another son of Manu, whose daughter Sukanyā inadvertently poked the eyes of the aged, motionless sage Cyavana Muni while he was encased in an anthill. To appease the enraged sage whose mystic power paralyzed the royal army, King Śaryāti given Sukanyā in marriage to Cyavana. Demonstrating exemplary chastity and devotion, Sukanyā served her elderly husband faithfully. When the divine physicians Aśvinī-kumāras visited the hermitage, Sukanyā requested them to restore Cyavana's sight and youth. Immersion in a sacred lake transformed Cyavana and the dual demigods into identical, radiant youths. Sukanyā flawlessly identified her husband among them, prompting the grateful Cyavana to grant the Aśvinī-kumāras a share in Soma offerings during King Śaryāti's grand sacrifice, despite the opposition of King Indra.