బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

 13 - మాలతీదేవి విలాపము

సౌతీ రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-

పుత్రోత్సవే చ రత్నాని ధనాని వీవీధాని చ

గంధర్వరాజః ప్రదదౌ బ్రాహ్మణేభ్యో ముదాన్వితః

ఉబర్హణస్తు కాలేన హరేర్మంతం సుదుర్లభం

వసిష్ఠేన తు సంప్రాప్య స చక్రే దుష్కరం తపః

ఏకదా గండకీతీరే తం చ సంప్రాప్తయౌవనం

గంధర్వవత్యో దద్రుశుః మూర్చామాపుశ్చ. తక్షణం

 తాశ్చ తీవ్రం తపః కృత్వా ప్రాణాన్ సంత్యజ్య యోగతః

పంచాశత్తా బభూవుశ్చ కన్యాశ్చిత్రరథస్య చ

ఉపబర్హణగంధర్వం తాశ్చతం వర్రిరే పతిం

ముదా మాలా దదు స్తస్మై కాముక్యః పితురాజ్ఞయా

గృహీత్వా తాశ్చ గంధర్వో యువా సుస్థిర యౌవనః

దివ్యం త్రిలక్షవర్షం చ రేమే రహసి కాముకః

తతోఽ పి సురుచీరఁ రాజ్యం కృత్వా తాభిః సహానీశం

జగామ బ్రహ్మణః స్థానం హరీగాథాం జగౌ మునే

ఓ శౌనక మహర్షీ! గంధర్వరాజు తనకు పుత్రుడు పుట్టిన సందర్భమున సంతోషముతో బ్రాహ్మణులకు ఆనేక విధములైన ధనములను రత్నములను దానము చేసెను.

ఉపబర్హణుడు కాలక్రమముగా పెద్ద పెరిగి గురువైన వసిష్ఠ మహర్షివలన సులభ సాధ్యము కాని హరి మంత్రమును పొంది, మిక్కిలి కఠినమైన తపస్సు చేసెను. తరుణ వయస్కుడగు ఆ ఉపబర్హణునీ గండకీ నదీ తీరమునుండి పోవుచున్న గంధర్వ స్త్రీలు చూచి ఆతనీ అందమునకు మూర్చబోయిరి. తరువాత వారందరు కఠినమైన తపస్సుచేసి యోగమార్గమున ప్రాణములు వదలి చిత్రరథుడను గంధర్పునకు ఏబది మంది కూతుళ్ళుగా పుట్టిరి. వారంతా ఉపబర్హణునే భర్తగా కోరుకొని తండ్రియొక్క ఆజ్ఞననుసరించి సంతోషముతో ఆతని మెడలో వరమాలలను నేసిరి.

ఉపబర్హణుడు వారినందరిని తీసుకొని మూడు లక్షల దివ్య సంవత్సరములు వారీతో రహస్యముగా క్రీడించెను. తరువాత వారితో కలిసి చాలా సంవత్సరములు రాజ్యమునేలి, ఒకప్పుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అచట పొరీ కథలను గానము చేయుచుండెను.

దృష్ట్యా స రంభా రంభోరు నర్తనే కఠినం స్తనం

బభూవ స్థలనం తస్య గంధర్వస్య మహాత్మనః

ద్రుతం తత్యాజ సంగీతం మూర్ఛాంప్రాప సభాతలే

ఉచ్చైః ప్రజహసుర్దేవా బ్రహ్మా కోపాచ్ఛశాప తం

ప్రజ త్వం శూద్రయోనిం చ గాంధర్వీం తనుముత్స్పజ

కాలే వైష్ణవసంసంర్గాన్మత్పుత్రస్యం భవిష్యసి

వివా విపతేర్మహిమా పుంసాం నైవ భవేత్సుత

సుఖం దుఃఖించ సర్వేషాం క్రమేణ ప్రభవేదితి

ఇత్యేవముక్త్యా స విధిరగచ్ఛతుష్కరాత్ గృహం

ఉపబర్హణగంధర్వస్పజహౌ తాం తనుం తదా

ఆచ్చట రంభ నాట్యము చేయుచుండగా ఆమె యొక్క కఠినమైన స్తనములను చూచి మైమరచి తాను చేయుచున్న హరిగానమును మరచి మూర్చపోయెను. ఉపబర్హణునీ స్థితికి అచ్చటనున్న దేవతలు. నవ్విరీ. బ్రహ్మదేవుడు కోపముతో నాతనిని ఈ గంధర్వ శరీరమును వదలి పెట్టి శూద్రుడవై జన్మించుమని శపించెను. ఆ తరువాత క్రైస్తవులయొక్క సంబంధమువలన తిరిగి నాపుత్రుడవు కాగలవు. పురుషులకు ఆపదలు లేకుండా గొప్ప తనము తెలియదు. సుఖదుఃఖములు క్రమముగా కలుగుననీ చెప్ప కమలమునుండి తన గృహమునకు పోయెను. ఉపబర్హణుడు బ్రహ్మశాపమువలన తన శరీరమును వదిలి పెట్టెను.

మూలాధారం స్వాధిష్టానం మణిపూరమనాహతం

విశుద్దమాజ్ఞాఖ్యం చేతి భిత్వా షట్చక్రమేవ చ

ఇడం సుషుమ్నాం మేధాం చ పింగళాం ప్రాణహారిణీం

సర్వజ్ఞానప్రదాం చైవ మనస్సంయమినీం తథా

విశుద్ధాం చ నిరుద్ధాం చ వాయుసంచారిణీం తథా

తేజశుష్క కరీం చైవ బలపుష్టికరీం తథా

బుద్ధిసంచారిణీం చైవ జ్ఞానజృంభణకారిణీం

సర్వప్రాణహరాం చైవ పునర్జీవనకారిణీం

ఏతాః షోడశధా నాడీర్భిత్వానే హంసమేవ చ

మనసా సహితం బ్రహ్మరంధ్రమానీయ యోగతః

స్థిత్వా ముహరార్తమాత్మానం ఆత్మన్యేవ యుయోజ హ

జాతీస్మరశ్చ యోగీంద్రః సంప్రాప బ్రహ్మ శౌనక

వీణాం త్రితండ్రీం దుష్పాప్యాం వామస్కంధే నిధాయచ

శుద్ధస్ఫటికమాలాం చ విధృత్వా దక్షిణే కరే

సంజల్సన్ పరమం బ్రహ్మ వేదసారం పరాత్పరం

పరం నిస్తారబీజం చ కృష్ణ ఇత్యక్షరద్వయం

ప్రాచ్యాం కృత్వా శిరః స్థానం పశ్చిమే చరణద్వయం

నిధాయ దర్భశయనే శయానః పురుషో యథా

గంధర్వరాజస్తం దృష్ట్యా భార్యయా సహతత్క్షణం

యోగేన బ్రహ్మ సంప్రాప శ్రీకృష్ణ మనసాస్మరన్

మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్దము, ఆజ్ఞా ఆనే షట్చక్రములను భేదించుకొని, ఇడ, విశుద్ధ, నీరుద్ధ, వాయుసంచారిణి, తేజశుష్కకరీ, బలపుష్టికరీ, బుద్ధిసంచారీణి, జ్ఞానజృంభణకారిణి, సర్వప్రాణహర, పునర్జీవనకారిణి, అను పదునారు నాడులను భేదించుకొని ఆత్మను మనస్సుతో కలిపి యోగశక్తితో బ్రహ్మరంధ్రమువరకు తీసికొని వచ్చి ఉపబర్హణుడు క్షణకాలము ఆత్మను ఆత్మలోనే ఉంచి తన గత జన్మజ్ఞానము కలిగి పరబ్రహ్మను చేరుకొనెను.

ఇంకను అతడు మూడు తీగలుకలవీణను ఎడమ భుజముపై నుంచుకొని, కుడిచేతిలో శుద్ధ స్పటికమాలను ధరించి, వేదములకు సారభూతము, పరాత్పరము, వరబ్రహ్మ, మోక్షకారకము ఐన కృష్ణ అను రెండక్షరములు జపించుచు, శిరస్సు తూర్పునకు, పాదములు పశ్చిమమునకు పెట్టి దర్భల శయ్యపై పడుకొన్న పురుషునివలె మనస్సుతో శ్రీకృష్ణుని స్మరించుచు యోగశక్తితో పరబ్రహ్మమును చేరుకొనెను.

పత్యశ్చ బాంధవాస్సర్వే విలప్య రురుదుర్భశం

జగ్ముః క్రమేణ శోకాల్తా మోహితా విష్ణుమాయయా

పంచాశద్యోషితాం మధ్యే ప్రధానా మహిషీ చ యా

సాధ్వీ మాలావతీ నామ్నా పరమా ప్రేయసీ వరా

ఉచ్చైరురోద సా తీవ్రం కాంతం కృత్వా చ వక్షసి

ఇత్యువాచ చ శోకార్తా కాంతం సంబోధ్య చైవ హి

విష్ణుమాయచే మోహితులైన ఆ గంధర్వ రాజు భార్యలు బంధువులు, శోకార్డులై మిక్కిలి వీడ్చిరి. ఆ ఉపబర్హణుని ఏబదిమంది భార్యలలో పెద్దదైన మాలావతి భర్త శవముపైబడి ఎలుగెత్తి ఏడ్చెను. దుఃఖవతియైన ఆ మాలావతి భర్తను సంబోధించి ఈ విధముగా ఆనెను.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –

హే నాథ రమణ శ్రేష్ఠ విదగ్గ రసికేశ్వర

దర్శనం దేహి మే బంధో నిమగ్నాం శోకసాగరే

విస్రంభకే సువసనే రమ్యే చందనకాననే

పుష్పభద్రానదీతీరే పుష్పోద్యానే మనోహరే

చందనాచలసాన్నిధ్యే చారుచందన కాననే

పుష్పచందన తల్పేచ చందనానీల వాసితే

గంధమాదన శైలైక దేశ రమ్య నదీ తటే

పుంస్కోకిల నినాదేచ మాలతీ జాల శాలినీ

శ్రీశైలే శ్రీవనే దివ్యే శ్రీనివాస్ నీషేవీతే

శ్రీయుక్తే శ్రీపదాంభోజే పూతేచ్యుత కృతే శుభే

పురా యాయా కృతా క్రీడా వసంతే రహసి త్వయా

మయా చ దుర్హృదా సార్థం తయా వై దూయతే మనః

సుధాతుల్యేన వచసా సిక్తాహం చ పురా త్వయా

దూయతే సతతం తేన పరమాత్మాబడి దారుణం

సాధునా సహ సంసర్గో వైకుంఠాదపి దుర్లభః

ఆహో తతోపి బంధు విచ్చేదో మరణాదపీదుష్కరః

తస్మాత్తేషాం చ విచ్ఛేదః సాధుశోకకరః పరః

తతోపి బంధువిచ్ఛేదః శోకః పరమ దారుణః

తత్పత్యవియోగాహి మరణాదతిరిచ్యతే

సర్వస్మాత్పతిభేదోహి తత్పరం నాస్తి సంకటం

శయనే భోజనే స్నానే స్వప్నే జాగరణిపిచ

స్వామి విచ్ఛేద దు:ఖంచ నూతనం చ దినేదినే

సర్వశోకం విస్మరేత్ స్త్రీ స్వామి సంయోగ మాత్రతః

బంధుమన్యం నపశ్యామి యం దృష్ట్యా విస్మరేత్పతిం

నాతో విశిష్టం పశ్యామి బాంధవం. స్వామినా వినా

సాధ్వీనాం కులజాతానా మిత్యాహ కమలోద్భవః

హే దిగీశాశ్చ దిక్పాలా హే ధర్మ త్వ ప్రజాపతే

గిరీశ కమలాకాంత పతిదానం చ దేహి మే

ఓ నాథుడా, రమణుడా, రషికేశ్వరుడా! జీవిత బంధూ! శోక సాగరంలో మునిగిన నాకు నీ దర్శనము నిమ్ము, పుష్పభద్రానదీతీరమున అందమైన పుష్పోద్యానములో, రమ్యమైన చందన వృక్షముల మధ్య ఏకాంతముగా నున్న భవనములో, చందన పర్వతము యొక్క సమీపమున నున్న చందనవనములో చందన గంధముతో కూడిన పుష్పచందన శయ్య పై, గంధమాదన పర్వత ప్రాంతమున నున్న నదీతీరమున గండు కోయిలల కూతలు వినిపించు మాలతీ తీగల పొదరింటిలో, శ్రీనివాసుడు నీవసించుచున్న శ్రీశైలములోని (తీరుమల) దివ్యమైన శ్రీవనములో పూర్వము రహస్యంగా నీవు చేసిన రాసక్రీడలను తలచుకొన్న నా మనస్సు పరిపరివిధముల బాధలకు గురియగుచున్నది. పూర్వము అమృత తుల్యములైన నీమాటలచే పరవశించిపోయినాను. అవి నా మనస్సును మిక్కిలి దారుణముగ బాధ పెట్టుచున్నవి. మంచివారితో కలిసి ఉండుట వైకుంఠములో ఉండుట కంటే చాలా శ్రేష్ఠమైనది. వారీవియోగము మరణము కంటే ఎక్కువ బాధను కలిగించును.

అందువలన సజ్జన వీరహము అధికమైన శోకమును కల్గించును. దానికన్న బంధుమరణము వలన కలుగు శోకము అతి భయంకరమైనది. బంధుమరణము కంటే పతిమరణమువలన కలుగుతోకము మిక్కిలి బాధాకరము, దానీకంటే మీంచీన బాధ స్త్రీకి ఇంకొకటి లేదు. నిద్రపోయిన సమయమున, భోజన సమయమున, కలలో, జాగ్రదవస్థలోను భర్శ దుఃఖము ప్రతిదినము నిత్యనూతనమై బాధ పెట్టును.

స్త్రీ భర్తతో కలిసి యున్నప్పుడు సమస్త విధములైన శోకములను మరిచిపోవును. భర్తను మరిపించే బంధువు స్త్రీకి లేనేలేడు. బ్రహ్మదేవుడు సహితము ఇదే విషయము తెలిపినాడు.

అందువలన ఓదిక్పాలకులారా! ఓ ధర్మదేవత! ఓ ప్రజాపతీ! ఓ శంకరుడా! ఓ లక్ష్మీపతీ! నాకు మీరు ప్రతిదానము చేయుడు-

ఇత్యుక్త్యా సా విరహార్తా సా కన్యా చిత్రరథస్య చ

మూర్ఛాం సంప్రాప తతైవ దుర్గమే గహనే వనే

విచేతనా తత్ర తస్థౌ కాంతం కృత్వా స్వవక్షసి

పరిపూర్ణం దీవానక్తం సర్యైర్దేవైశ్చ రక్షితా

ప్రభాతే చేతనాం ప్రాప్య విలలాప భృశం ముహుః

ఇత్యువాచ పునస్తత్ర హరిం సంభోధ్య సా సతీ

అని, చిత్రరథుని కూతురైన మాలావతి ఏడ్చుచు పతి విరహమును భరించలేక ఆ దుర్గమమైన ఆడవియందే. మూర్చపోయేను. మాలావతి భర్తయొక్క శవముపై పడి చైతన్యమును కోలుపోయి ఒక దినము సంపూర్ణముగా స్మతి రహితయై యుండెను. అప్పుడామెను సమస్త దేవతలు రక్షించుచుండిరి.

మరుసటి దినము ఆమె స్మృతిలోనికి వచ్చినను భర్తకై మిక్కిలి శోకించుచు శ్రీహరిని సంబోధించి ఇట్లు పలికెను.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను -

హే కృష్ణ జగతాంనాథ నాథ నాహం జగద్బహిః

త్వమేవ జగతాం పాలా మాం న పాసి కథం ప్రభో

ఆయం భర్తాస్య భార్యానాం మమేతి తవ మాయయా

త్వమేవ సంభవో భర్తా సర్వేషాం సర్వకారణః

గంధర్వః కర్మణా కాంతః కాంతారాం చాస్య కర్మణా

క్వ గతః కర్మభోగాంతే కుత్ర సంస్థాప్య మాం ప్రియాం

కో వా కస్యపతిః పుత్రః కా వా కస్యప్రియా ప్రభో

సంయునక్తి విధాతా చ యునక్తి చ కర్మణా

సంయోగే పరమానందో వియోగే ప్రాణసంకటం

శశ్వజ్ఞగతీ మూర్థస్య వాత్మారామస్య నిశ్చితం

నశ్వరో విషయః సత్యం భువి భోగశ్చ బాంధవః

స్వయం వ్యక్తః సుఖాయైవ దుఃఖాయ త్యాజితః పరైః

 తస్మాత్పంతః స్వయం త్యకా పరమైశ్వర్యమీప్సితం

ధ్యాయంతే సతతం కృష్ణపాదపద్మం నిరాపదం

సర్వత్ర జ్ఞానినః సంతః కా స్త్రీ జ్ఞానవతీ భువి

తతో మహ్యం విమూఢాయై దాతుమర్హతి వాంచితం

న మే వాంఛిదురత్వే చ శక్రత్వే మోక్షవర్మని

ఇమం కాంతం వరం దేహి చతుర్వర్గకరం పరం

యావతీ కామినీ జాతిర్జగత్యాం జగదీశ్వర

కస్యైచిన్న హి దత్తశ్చ తేన ధాత్రదృశః పతిః

 తస్మై దత్తా గుణాః సర్వే రూపాణి వివిధాని చ

సుశీలాని చ సర్వాణి చామరత్వం వినా హరే

రూపేణ చ గుణేనైవ తేజసా ఏక్రమేణచ

జ్ఞానేన శాంత్యా సంతుష్టా హరీతుల్యః ప్రభుర్మమ

హరిభక్తో హరినమో గాంభీర్యే సాగరో యథా

దీప్తిమాన్ సూర్యతుల్యశ్చ శుద్ధో వహ్నిసమస్తథా

చంద్రతుల్యః సుదృశ్యశ్చ కందర్పసమసుందరః

బుధ్యా బృహస్పతిసమః కావ్యే కవిసమస్తథా

వాణీచ సర్వశాస్త్రజ్ఞా ప్రతీభాయాం భృగోరివ

కుబేరముల్యో ధనవాన్ మహాన్ దాతా మవోరిన

ధర్మే ధర్మసమే ధర్మీ సత్యే సత్యవ్రతాధికః

కుమారతుల్యస్తపసా స్వాచారే బ్రహ్మణా సమః

ఐశ్వర్యే శక్రతుల్యశ్చ సహిష్ణుః పృథివీసమః

ఏవం భూతో మృతః కాంతః ప్రాణా యాంతీ నమే కథం

ఓ జగత్పతియైన శ్రీకృష్ణా నేను ఈ ప్రపంచమునుండి దూరము కాలేదు. సమస్తజగములు రక్షించునీవు నన్నెందుకు రక్షించవు? నీమాయవల్లనే ఇతడు నాభర్త, నేను ఇతని భార్యను, ఇదినాది అనే భావములు కలుగుచున్నవి. నీవే అన్నిటికిని కారణము. నీవే అందరిని భరించువాడవు.

ఈగంధర్వుడు నా పూర్వకర్మ ఫలితముగా భర్తయైనాడు. నేను కూడ ఆతని పూర్వ కర్మ ఫలితముగా భార్యనైతిని. ఈ కర్మలను అనుభవించిన తరువాత ప్రియురాలనైన నన్ను ఎక్కడో వదలి ఆతడు ఎక్కడకో పోయినాడు. ఎవరు ఎవరికి భర్త? ఎవరు పుత్రుడు? ఎవరు భార్య? బ్రహ్మ దేవుడు ఆయా వ్యక్తులు చేసికొన్న కర్మ ఫలితమునమసరించి ఇరువురిని కలుపుతున్నాడు. విడగొట్టుచున్నాడు.

ఈ ప్రపంచమున మూర్ఖుడు కలిసి యున్నప్పుడు పరమానందమును పొందుచున్నాడు. విడిపోయినప్పుడు ప్రాణసంకటమును పొందుచున్నాడు. తన ఆత్మయందు తానే రమించువ్యక్తి ఈ సుఖదు:ఖములకు అతీతుడై ప్రవర్తించుచున్నాడు.

ప్రపంచములోనున్న శరీరసౌఖ్యము, భోగ భాగ్యములు బంధుత్వము అశాశ్వతములు. వీటినన్నింటిని స్వయముగా వదులుకున్నవారు సుఖముగా నుందురు. ఇతరులచే బలవంతముగా వదలి పెట్టబడినచో దుఃఖము కలుగును. అందువలన శ్రేష్ఠులైనవారు వీటిని స్వయముగా వదలిపెట్టి, ఎటువంటి ఆపదలకు కారణము కాని శ్రీకృష్ణపదములను మనస్సులో ధ్యానించుచు తమకు ఇష్టమైన పరమైశ్వర్యమును పొందుచున్నారు.

 పురుషులు ఎప్పుడైనను, ఎచ్చటనైనను జ్ఞానవంతులే. జ్ఞానవతియైన స్త్రీ ప్రపంచమున కానరాదు. అందువలన అజ్ఞానురాలనైన నా కోరికను తప్పక మీరు తీర్చవలేను. నాకు దేవత్వము పైన కానీ, ఇంద్ర పదవిపై గాని, మోక్షమార్గముపై గాని కోరికలేదు. నాకు ధర్మార్థకామమోక్షములకు కారణమైన భర్తను వరముగానిమ్ము. ఓ భగవంతుడా! భూమిపై నున్న ఏ స్త్రీకి నా భర్త వంటి భర్తను నీవివ్వలేదు.

అతని వద్ద సమస్త సుగుణములున్నవి. మంచి రూపము ఉన్నది. ఆమరత్వము తప్ప తక్కిన సౌశీల్యగుణములన్ని కలవు. నా భర్త రూపమున, గుణమున, తేజస్సున, విక్రమమున, జ్ఞానమున శాంతి సంతుష్టులలో శ్రీహరితో సమానుడు. అతడు హరీభక్తుడు. శ్రీహరితో సమానమైనవాడు. గాంభీర్యమున సముద్రమువంటివాడు., సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు. అగ్నివలె పరిశుద్ధుడు, చంద్రునివలె అందగాడు, మన్మథునివంటివాడు. బుద్ధియందు బృహస్పతి, కవిత్వమున వాల్మీకి వంటివాడు. సర్వశాస్త్రజ్ఞత్వమున సరస్వతి వంటివాడు. ప్రతీభయందు భృగుమహర్షి, కుబేరుని వంటి ధనవంతుడు. మనువు వలె గొప్పదాత. ధర్మమున ధర్మదేవతతో సమానుడు. సత్యవ్రతము కలవాడు. తపస్సున కుమారస్వామి వంటివాడు. ఆచారమున బ్రహ్మతో సమానుడు. ఐశ్వర్యమున ఇంద్రునితో సమానుడు. భూమీవంటి సహనము కలవాడు.

ఇన్ని సుగుణములు కల సౌభర్త చనిపోయెను. ఐనను నాప్రాణములు పోకుండ ఉన్నవి.

ఆరే సురా యజ్ఞభాజః ఘృతం భోక్తుం క్షమా భువి

క్షణేనాయజ్ఞభాజశ్చ కరిష్యామి స్వలీలయా

నారాయణ జగత్కాంత నాహమేవ జగద్భహిః

శీఘ్రం జీవయ మే కాంతం అన్యథా త్వాం శపామ్యహం

ప్రజాపతే పుత్రశాపాత్త్యమపూజ్యో మహీతలే

 తవైవానధికారిత్వం కరిష్యామ్యధునా భవే

హే శంభో జ్ఞానలోపం తే కరిష్యామి శపేన చ

ధర్మలోపం చ ధర్మస్య కరిష్యామ్యేవ లీలయా

యమాధికారం దూరే చ కరిష్యామి న సంశయః

సత్యం కాలం శపీష్యామీ మృత్యుకన్యాం సునిష్టురాం

 శపామి సర్వానతైవ జారాం వ్యాధిం వినాధునా

వ్యాధినా జరయామృత్యుర్న హ్యభూచ్చ పతేర్మమ

ఇత్యుక్త్యా కౌశికీతీరే చాగచ్ఛప్తుమేవ తాన్

మాలావతీ మహాసాధ్వీ శవం కృత్వా స్వవక్షసి

యజ్ఞా భాగమున యజ్ఞహవిస్సును భుజించు ఓ దేవతలారా! నాశక్తిచే క్షణమున మీకందరకు యజ్ఞభాగము లేకుండ చేయగలము. జగద్రక్షకుడవగు నారాయణా! నేను మాత్రమే లోక బాహ్యురాలను కాలేను. నాభర్తను వెంటనే బ్రతికించకపోయినచో నిన్ను కూడా శపింతుమ, ఓ బ్రహ్మదేవుడా! వీపుత్రునీ శాపమువలన నీవు పూజకు దూరమైనావు. నేనిప్పుడు నీకు సృష్టిచేయు అధికారము లేకుండా చేయగలను. ఓ శివుడా! నేను శపించి మీకు జ్ఞానము లేకుండా చేయుదుమ. ఓ ధర్మదేవతా నీకు ధర్మలోపము కలుగునట్లు చేయుదుము. యముని యొక్క అధికారమును తొలగించగలమ. కాలునీ, మృత్యుకన్యను కూడా శపింతును. నా భర్త వ్యాధి, ముసలితనములతో చనిపోలేదు కావున జరావ్యాధులు తప్ప మీగిలిన దేవతలనందరను శపింతును అని భర్త శవముపై పడియున్న మహాసాధ్వియైన మాలావతీ వారిని శపించుటకు కౌశికీవదీ తీరమునకు వచ్చెను.

తాం శప్తుముద్యతాం దృష్టా బ్రహ్మా దేవపురోగమః

జగామ శరణం విష్ణుం తీరం క్షీరపయోనిధేః

తత్ర స్నాత్వా చ తుష్టావ పరమాత్మానమీశ్వరం

విష్ణుం బ్రహ్మా జగత్కాంతమిత్యువాచ హ భీతవత్

శపించుటకు ప్రయత్నించుచున్న ఆ మాలావతిని చూచి దేవతలనందరను ముందుంచుకొని బ్రహ్మ క్షీరసముద్రమునకు విష్ణువును శరణుపొందుటకు వెళ్ళేను. అతడు క్షీరసముద్రమున స్నానము చేసి విష్ణుమూర్తిని స్తుతించి భీతిచెందిన వానివలె ఇట్లనెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-

ఉపబర్హణపత్ని సా కవ్యా చిత్రరథస్య చ

కాంతి తోశ్చ మా దేవాన్ శపేత్త్వం రక్ష మాధవ

స్మరంతి సాధవః సంతో జపంతి మునయో ముదా

స్వప్నే జాగరణే చైవ సర్వ కార్యేషు మాధవం

శరణాగత దీవార్త పరిత్రాణ పరాయణ

రక్ష రక్ష హృషీకేశ ప్రజామః శరణం వయం

పూజా మే పుత్రశాపేన విహతా సాంప్రతం ప్రభో

ఆధికారహతం మాం చ కురుతే మాలతీ పతీ

సర్వాధికారే బ్రహ్మాండే త్వయా దత్తః పురా ప్రభో

సంపదేతాదృశీ నాథ యాప్యత్యేవాధునా మమ

చిత్రరథుని కూతురు ఉపబర్హణుని భార్యయైన మాలావతీ తన భర్త ప్రాణములకై నన్ను, దేవతలను శపించుచున్నది, అందువలన నీవు మమ్మందరిని రక్షింపుము. సాధుపుంగవులు నిన్ను స్మరింతురు. మహర్షులు నిన్ను ఎల్లప్పుడు సర్వకార్యములందు జపింతురు. ఓ శరణాగత దీనార్త త్రాణపరాయణ! హృషీకేశ మమ్ములను రక్షింపుము. మేమందరము నీ శరణు జొచ్చితిమి.

నా పుత్రుని యొక్క శాపమువలన నా పూజ పోయినది. ప్రస్తుతము ఈ మాలావతి నన్ను అధికారమునుండి తొలగించుచున్నది. నీవు బ్రహ్మాండమున ఇచ్చిన పర్వాధికార సంపద ఇప్పుడు పోవుచున్నది అని ఆనెను.

మహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-

త్వయా దత్తం మహాజ్ఞానం గుప్తం సర్వేషు దుర్లభం

శతమన్వంతర తపఃఫలేన పుష్కరే పురా

ఐశ్వర్యం వా ధవం వాపి విద్యా వా విక్రమోధవా

జ్ఞానస్య పరమార్థస్య కలాం నార్హంతి షోడశీం

సర్వాఙ్ఞాతం సర్వగుప్తమత్యంతం దుర్లభం పరం

మమ తత్వజ్ఞానరత్నం శాపాన్నిర్యాతి యోషితః

అహో పతివ్రతాతేజః పర్వేషాం తేజం పరం

తేజోనలేన దగ్ధం మాం రక్ష రక్ష హరే హరే

 ఓ నారాయణా ! ఇతరులందరికి దుర్లభమైనది. మిక్కిలి గుప్తమైనది వంద మన్వంతరముల తపః ఫలితముగా వీవిచ్చినదీఙ్ఞానము. ఐశ్వర్యమైనా ధనమైనా, విద్యయైనా, పరాక్రమమైనా పరమార్థ జ్ఞానము యొక్క షోడశ కళకు కూడ సరిపడవు. అత్యంత దుర్లభమైనది. మిక్కిలి గుప్తమైనది ఐన నా తత్వజ్ఞానమును ఒక స్త్రీ తొలగించుచున్నది. అన్ని తేజస్సుల కంటే మిన్నయైన పతివ్రతా తేజము చాలా గొప్పది. ఆమె తేజప్పవే - అగ్నిచే దగ్గుడనగుచున్న నన్ను రక్షింపుము.

ధర్మ ఉవాచ - ధర్మ దేవత ఇట్లనెను-

సర్వరత్నాత్పరం రత్నం ధర్మం ఏవ పరోతవః

యాప్యత్యేకం విధో ధర్మస్త్యయా దత్తః పురా ప్రభో

సప్తమన్వంతరతపః ఫలేవ పరమేశ్వర

ప్రాప్తో ధర్మోధునా యాతి శాపేవ యోషితః ప్రభో

దేవా ఊచుః - దేవతలిట్లనిరి-

యజ్ఞభాజో ఘృతభుజో వయమేవ త్వయా కృతాః

యోషిచ్ఛాపేన తత్పర్వమధునా యాతీ మాధవ

సమస్త రత్నములకంటె మిన్నయైన రత్నము సనాతమైన ధర్మము. ఏడు మన్వంతరములు వేమ చేసిన తపఃఫలితముగా  దానిని నీవిచ్చితివి. ఆ ధర్మము ఒక స్త్రీ శాపమువలన పోవుచున్నది అని ధర్మదేవత అనెను.

ఓ మాధవ నీవే మాకు యజ్ఞములందు భాగములను ఇచ్చితివి. అట్లే యజ్ఞహవిస్సులను తీనువట్లు ఏర్పాటు చేసితివి. ఇదంతయు. ఒక స్త్రీ యొక్క శాపముచే తొలగి పోవుచున్నది అని దేవతలవీరి.

ఇత్యుక్త్యా సంయతాః సర్వే తస్థుస్తత్ర భయార్దితాః

ఏతస్మిన్నంతరేకప్మాద్వాగృభూదాశరీరిణీ

యూయం గచ్ఛత తన్మూలం విప్రరూపీ జనార్ధవః

పశ్చాద్యాస్యత శాంత్యర్థమీతి నో రక్షణాయ చ

శ్రుత్వా తద్వచనం దేవాః ప్రహృష్టమనసోన్ముఖాః

జగ్ముర్మాలావతి స్థానం కౌశికీ తీరమీశ్వరాః

తామేన దదృశుర్దేవా దేవీం మాలావతీం సతీం

రత్నసారేంద్ర భూషాభిరుజ్జ్వాలాం కమలా కళాం

వహ్నిశుద్ధాంశుకాధానాం సిందూరబిందు భూషితాం

శరచ్చంద్రప్రభాం శాంతాం ద్యోతయంతీం దిశస్త్విషా

పతిసేవామహాధర్మ చిరసంచితతేజపా

ప్రజ్వలంతీం సుప్రదీప్తశిఖాం వరివోత్తమాం

యోగాసనం కుర్వతీం చ శవవక్షస్థలస్థితాం

సురమ్యాం స్వామినో వీణాం బిభ్రతీం దక్షిణీ కరే

తర్జన్యంగుష్ఠకోటిభ్యాం శుద్ధస్ఫటికమాలికొం

భక్త్యా స్నేహేవ కాంతస్య బిభ్రతీం యోగముద్రయా

చారుచంపకవర్ణాభాం బింబోష్ఠిం రత్నమాలివీం

యధా షోడశవర్షీయాం శశత్సుస్థిరయౌవానం

బృహన్నీతంబభారార్తాం పీనశ్రోణి పయోధరాం

పశ్యంతీం శమీశస్య శుభదృష్ట్యా పునః పునః

ఏవం భూతాం చ తాం దృష్ట్యా దేవాస్తే విస్మయం యయుః

స్థగితాం చ క్షణం తత్ర ధార్మిక ధర్మధీరవః

ఆని వారందరు భయముతో అచ్చట ఉండిపోయిరి. ఆ సమయములో వారికి మీరందరు మాలావతి దగ్గరకు పొండు. బ్రాహ్మణ వేషధారియైవ జనార్దనుడు మీవెనక మీమ్ముల రక్షించుటకు ఆమెను శాంతి పరచుటకు రాగలడు” అమ ఆశరీర వాణి మాటలు విని దేవతలందరు సంతోషములో మాలావతి ఉన్న కౌశికీనదీ తీరమునకు వెళ్ళిరి.

అచ్చట పతివ్రతయైన మాలావతి రత్నభూషణములతో లక్ష్మీదేవి కళ కలిగినదై, విప్పువలె స్వచ్చమైన వస్త్రమును ధరించినది. సిందూరపు బొట్టు కలది, శాంతురాలై శరత్కాల చంద్రునీ కాంతిని దశదిశలను వెదజల్లుచు, పతి యొక్క పేహ ధర్మముచే చాలాకాలమునుండి సంపాదించిన తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న అగ్నిశిఖవలె శవమును వక్షస్థలము పై నుంచుకొని యోగాసనమున నుండి భర్తయొక్క వీణను కుడిచేతిలో పట్టుకొని, చూపుడు వ్రేలు, పెద్దప్రేలులో భర్తయొక్క స్పటిక మాలను యోగముద్రలో పట్టుకొని, అందమైన చంపకవర్గపు కాంతి కలదై పదునారేళ్ళ స్త్రీవలె సుస్థిర వనవతియై తన భర్త చనుమ శుభంకరమైన దృష్టితో మాటి మాటికి చూచుచుండెను.

అస్థితిలో నున్న మాలావతిని ధార్మికులు, ధర్మమునకు భయపడువారిన దేవతలు చూచి ఆశ్చర్యపడిరి.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణే సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే మాలావతీ విలాపో నామ త్రయోదశోధ్యాయః

 శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి-శావక సంవాదరూపమైన బ్రహ్మఖండమున మాలావతి విలాపమను పదమూడవ యధ్యాయము సమాప్తము.