బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

27 - భక్ష్య భక్ష్య పదార్థముల వివరణ

నారద ఉవాచ- నారదుడు ఇట్లు పలికిను-

భక్ష్యం కివాఽప్యభక్ష్యం చ ద్వీజానాం గృహిణాం ప్రభో

యతీనాం వైష్ణవానాం చ వీధవాబ్రహ్మచారిణాం

కిం కర్తవ్యమకర్తవ్యం ఆభోగ్యం భోగ్యమేవ వా

సర్వం కథయ సర్వజ్ఞ సర్వేశః సర్వకారణం

ఓ ప్రభూ బ్రాహ్మణులు, గృహస్థులు, సన్యాసులు, వైష్ణవులు వీధవలు, బ్రహ్మచారులు తినతగిన వస్తువులు, తినతగనివి ఏవి? అట్లే ఏది చేయదగినది? ఏదీ చేయదగినది. ఏది అనుభవించతగినది? ఏది అనుభవించతగనిదీ, సర్వేశుడు ఎవరు? సర్వకారణమేదీ? వీటినన్నిటిని విస్తరముగా నాకు తెలుపవలసినది.

మహేశ్వర ఉవాచ- మహేశ్వరు డిట్లనెను-

కశ్చిత్తపస్వీ విప్రశ్చ నిరాహారీ చిరం ముని:

కశ్చిత్సమీరణాహారీ ఫలాహారీ చ కశ్చన

ఆన్నాహారీ యథాకాలే గృహి చ గృహిణీయుతః

యేషామిచ్చా చ యా బ్రహ్మన్ రుచీనాం వివిధాగతిః

హవిష్యాన్నం బ్రాహ్మణానాం ప్రశస్తం గృహిణాం సదా

నారాయణోచ్ఛిష్టమిష్ట మభక్ష్యమనివేదితం

అన్నం విష్ఠా జలం మూత్రం యద్విషోరనివేదితం

విణ్మూత్రం సర్వధా ప్రోక్తం ఆన్నం చ హరివాసరే

బ్రాహ్మణ: కాషతోఽన్నం చ యో భుంక్తే హరివాసరే

 త్రైలోక్యజనితం పాపం సోఽపీ భుంక్తే న సంశయః

 న భోక్తవ్యం న భోక్తవ్యం న భోక్తవ్యం చ నారద

 గృహిభిర్భ్రాహ్మణైరన్నం సంప్రాప్తి హరీవాసరే

గృహీ శైవశ్చ శాక్తశ్చ బ్రాహ్మణో జ్ఞానదుర్బలః

ప్రయాతి కాలసూత్రం చ భుక్త్యా చ హరీవాసరే

కృషిభిః శాలిమానైశ్చ భక్షితస్తత్ర తిష్ఠతి

వీణ్మూత్రభోజనం కృత్వా యావదింద్రాశ్చతుర్ధశ

జన్మాష్టమి దినే రామనవమీ దివసే హారేః

శివరాత్రే చ యో భుంక్తే సోపి ద్విగుణ పాతకీ

ఉపవాసాసమర్థశ్చ ఫలం మూలం జలం పిబేత్

నష్టే శరీరే స భవేదన్యధా చాత్మపతకః

సకృధ్భుంక్తే హవిష్యాన్నం విష్ణోర్నైవేద్యమేవ చ

నభవేత్ ప్రత్యవాయీ స చోపవాసఫలం లభేత్

ఏకాదశ్యామనాహారం గృహీ విప్రశ్చ భారతే

స చ తిష్ఠతి వైకుంఠే యావద్ద్వై బ్రహ్మణో వయః

గృహిణాం శైవశాక్తానాం ఇదముక్తిం చ నారద

విశేషతో వైష్ణవానాం యతీనాం బ్రహ్మచారిణాం

నిత్యం నైవేద్యబోయ: శ్రీవిష్ణుస హి వైష్ణవః

నిత్యం శతోపవాసానాం జీవన్ముక్తఫలం లభేత్

 వాంఛంతి తస్య సంస్పర్శం తీర్థాన్యఖీలదేవతాః

ఆలాపం దర్శనం చైవ సర్వపాప ప్రణాశనం

ద్వి: పిన్నమన్నం పృథుకం శుద్ధం దేశవిశేషకే

సాత్యంతం శస్తం విప్రాణాం భక్షణే న నివేదనే

అభక్ష్యం వై యతీం చ విధవా బ్రహ్మచారిణాం

తాంబూలం చ యథా బ్రహ్మన్ తదైతద్వస్తు న ధ్రువం

తాంబూలం విధవాస్త్రీణాం యతీనాం బ్రహ్మచారిణం

తపస్వినాం చ విప్రేంద్ర గోమాంససదృశం ధ్రువం

 ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై తపస్వి కావచ్చును. అట్లే మరియొక ముని గాలిని మాత్రమే ఆహారముగా స్వీకరింపవచ్చును. ఇంకొకడు ఫలములను మాత్రమే ఆహారముగా తీసికొనవచ్చును. ఒక గృహస్థుడైన బ్రాహ్మణుడు భార్యతో కలిసి కాలనియమములతో అన్నమును తినవచ్చును.

ఈవిధముగా ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధముగా నుండవచ్చును.

గృహస్థులైన బ్రాహ్మణులకు హోమమునకు సంబంధించిన అన్నము (హవిష్యానము) మిక్కిలి ప్రశస్తమైనదీ. నారాయణునకు నైవేద్యముగా పెట్టిన అన్నముకూడ శ్రేష్టమైనది. కాని నైవేద్యము పెట్టని అన్నము మాత్రము తినతగినది కాదు. విష్ణుమూర్తికి నైవేద్యమిడక తిన్న అన్నము, పానీయము మలమూత్రములవంటివి. అట్లే హరివాసరమైన ఏకాదశినాడు తిన్న ఆన్నము, త్రాగిన పానీయము కూడ మలమూత్రములవంటివే. ఏకాదశినాడు భోజనము చేసినవాడు ముల్లోకములందున్న పాపములనన్నిటిని అనుభవించును. ఏకాదశినాడు గృహస్ధాశ్రమముననున్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితిలోను అన్నమును భుజించరాదు. జ్ఞానములేని బ్రాహ్మణ గృహస్థు, శైవుడైనను, శాక్తేయుడైనను ఏకాదశినాడు అన్నము తినినచో నరకమునకు పోవును. అచ్చట పదునలుగురు ఇంద్రుల కాలమువరకు క్రిమికీటముచే బాధింపబడును. మలమూత్రములను అనుభవించును.

అట్లే శ్రీకృష్ణాష్టమి దినమున, శ్రీరామనవమి, శివరాత్రి దీనములలో అన్నమును భుజించినవాడు ఏకాదశినాడు భుజించినవానీకన్న రెండురెట్లు అధికపాపమును పొందును.

ఫై దినములలో ఉపవాసము సంపూర్ణముగా చేయలేనివాడు పండ్లను, గడ్డలను, జలములను త్రాగవచ్చును. ఉపవాసముచేయు సామర్థ్యములేనివాడు బలవంతముగా ఉపవాసముచేసి చనిపోయినచో ఆత్మహత్య చేసికొనిన వాడగును.

విష్ణునివేదితాన్నమునుగాని, హవిష్యానమునుగాని ఒక సారి మాత్రము తననిచో ఆతనికి పాపమంటదు. పైగా అతడు ఉపవాసముచేసిన ఫలమును పొందును,

ఏకాదశీ దినమున ఆహారము తీసికొనని గృహస్థుడు బ్రహ్మదేవుడు బ్రతికియున్నంతవరకు వైకుంఠమున శ్రీహరి సన్నిధిలో నివసించగలడు. ఇది శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, యతులు, బ్రహ్మచారులు అనుసరించవలసిన పద్ధతి.

ప్రతిదినము శ్రీహరికి నివేదితమైన అన్నము తీను వైష్ణవుడు శ్రీవిష్ణువే యగుచున్నాడు. అతడు ప్రతి వంద ఉపవాసములు చేసినవారితో సమానమైన ఫలమును, జీవన్ముక్తుని ఫలమును పొందును. అట్టి పుణ్యవంతుని స్మర్శను పొందవలెనని సమస్త పుణ్యతీర్థములు, సమస్త దేవతలు కోరుకొందురు. ఆతనిని చూచినను, ఆతనితో మాట్లాడినను సమస్త పాపములు తొలగిపోవును.

రెండుమార్లు ఉడికించిన అన్నము (వేపుడు బియ్యము?) అటుకులు కొన్ని ప్రాంతములలో పరిశుద్ధమే ఐనను బ్రాహ్మణులు తినుటకుగాని భగవంతునకు నైవేద్యము పెట్టుటకు గాని పనికిరావు. అట్లే బ్రహ్మచారులకు, యతులకు, విధవలకు పై వస్తువులు పనికిరావు. బ్రహ్మచారులు మొదలైనవారు తాంబూలమును తిన్నచో ఆదీ గో మాంసభక్షణముతో సమానమైనదీ. అందువల్ల బ్రహ్మచారులు, సన్యాసులు, విధవలు తాంబూలమును తీసికొనకూడదు.

సర్వేషాం బ్రాహ్మణాసాం యదభక్ష్యం శ్రుణు నారద

యదుక్తం సామవేదే చ హరిణా చాహ్నిక క్రమే

తామ్రపాత్రే పయ: పానముచ్ఛిష్టే ఘృత భోజనం

దుగ్ధం లవణసార్థం చ సద్యో గోమాంసభక్షణం

 నారికేళోదకం కారి స్యే తామ్రపత్రే స్థితం లఘు

ఐక్షవం తామ్రపత్రస్థం సురాతుల్యం న సంశయః

ఉత్థాయ వామహస్తేన యస్తోయం పిబతీ ద్వీజః

సురాపీ చ స విజ్ఞేయ: సర్వధర్మ బహిష్కృతః

అనివేద్యం హరేరన్నం భుక్తశేషం చ నిత్యశః

 పీతశేషజలంచైవ గోమాంససదృశం మునే

వానీంగణఫలం చైవ గోమాంసం కార్తికే స్మతం

మామే చ మూలకం చైవ కలంబి శయనే తథా

 శ్వేతవర్ణం చ తాళం చ మసూరం మత్స్యమేవ చ

సర్వేషాం బ్రాహ్మణానాం చ త్యాజ్యం సర్వత్ర దేశకే

 మత్స్యాంశ్చ కామతో భుక్త్యా సోపవాసః త్ర్యహం వసేత్

ప్రాయశ్చిత్తం తతః కృత్వా శుద్ధీమాప్నోతి బాడవః

 ప్రతిప్రత్సు చ కూష్మాండం అభక్ష్యం హ్యార్థనాశనం

ద్వితీయాయాం చ బృహతీ భోజనేన స్మరేద్ధరిం

 అభక్ష్యం చ పటోలం చ శత్రువృద్ధి కరం పరం

 తృతీయాయాం చతుర్థాం చ మూలకం ధననాశనం

కలంకకారణం చైవ పంచమ్యాం బిల్వభక్షణం

 తిర్యగ్యోనిం ప్రాపయేత్తు షష్ట్యాం వై నింబభక్షణం

రోగవృద్ధికరం చైవ నరాణాం తాళభక్షణం

సప్తమ్యాం చ తథా తాళం శరీరస్య చ నాశకం

నారికేళఫలం భక్ష్యమష్టమ్యాం బుద్ధినాశనం

 తుంబి నవమ్యాం గోమాంసం దశమ్యాం చ కలంబికా

 ఏకాదశ్యాం తథా శింబీ ద్వాదశ్యాం, పూతికా తథా

త్రయోదశ్యాం చ వార్తాకీ న భక్ష్యా పుత్రనాశనం

 చతుర్దశ్యాం మాషభక్ష్యం. మహాపాపకరం పరం

పంచాదశ్యాం తథా మాంసమభక్ష్యం గృహిణామునే

సామవేదమున ఆహ్నిక విషయమున శ్రీహరి చెప్పిన బ్రాహ్మణులు తినకూడని వస్తువులను నారదా! తెలిసికొనుము.

రాగిపాత్రలో పోసిన పాలు తాగినచో, తిని వదలివేసిన అన్నములో నేయి వేసికొని తీన్నదానితో సమానము. అట్లే పాలలో ఉప్పువేసికొని తాగినచో, అది గోమాంసమును తిన్నదానితో సమానము. కంచుపాత్రలో, రాగిపాత్రలో నున్న కొబ్బరినీరు, రాగిపాత్రలో పోసిన చెరుకురసము కల్లుతో సమానమైనవి.

ఎడమచేతితో నీళ్ళుత్రాగు బ్రాహ్మణుడు కల్లు తాగినవానితో సమానుడు. శ్రీహరికి నివేదితముకాని అన్నము, తినగా మిగిలిన అన్నము (భుక్త శేషము), త్రాగగా చెంబులోనో ఇతర పాత్రలోనో మిగిలిననీరు, ఆవుమారసముతో సమానమైనవి. - కార్తీక మాసములో వానీంగణ ఫలము మాఘమాసములో గడ్డకూరలు, ఆషాడమాసములో బచ్చలికూర తినకూడదు. ఆదేవిధముగా తాటిపండ్లు (ముంజలు). చీరు సెనగలు, చేపలు ఆన్నీ కాలములందును, అన్ని ప్రదేశములలోను, తినకూడదు. చేపలను తిన్న బ్రాహ్మణుడు మూడుదినములుపవాసముండి ప్రాయశ్చిత్తము చేసికొన్నగానీ పరిశుద్ధుడు గాలేడు.

ప్రతీపద (పాడ్యమి) తిథినాడు గుమ్మడికాయ, విదియనాడు బృహతీ పత్రములలో భోజనము, పొట్లకాయ తృతీయనాడు, చవితినాడు గడ్డకూరలు, పంచమినాడు . మారేడు, షష్ఠినాడు వేపపువ్వు తినుట, సప్తమినాడు తాటిపండ్లు తినుట, అష్టమినాడు కొబ్బరికాయ తినుట, నవమినాడు సొరకాయ, దశమినాడు తీగబచ్చలి. ఏకాదశినాడు పెసర్లు మినుములవంటి ధాన్యములు. ద్వాదశినాడు పూతిక, త్రయోదశినాడు వంకాయ, చతుర్దశినాడు మినుములతో చేసిన వస్తువులు, అమావాస్యా, పౌర్ణిమలలో మాంసము తినకూడని వస్తువులు.

గృహిణాం ప్రోక్షితం మాంసం భక్ష్యమన్యదినేషు చ

ప్రాతః స్నానే తథా శ్రాద్ధే పార్వణీ వ్రతవాసరే

 ప్రశస్తం సార్షపం శైలం పక్వతైలం చ నారద

కుహూ పూర్ణేందు సంక్రాంతి చతుర్దశ్యష్టమీషు చ

రవౌ శ్రాద్దే వ్రతాహే చ దుష్టం ప్రీతిలతైలకం

మాంసం చ రక్తశాకం చ కాంస్యపాత్రే చ భోజనం

నిషిద్ధం శయనం చైవ కూర్మమాంసం చ మంత్రితం

నిషిద్ధం సర్వవర్ణానాం దివా స్వస్తీ నిషేపణం

రాత్రౌ చ దధీభక్ష్యం చే శయనం సంధ్యయోర్దినే

రజస్వలా స్త్రీగమనమేతన్నరక కారణం

ఉదిక్యవీరయో రన్నం పుంశ్చల్యన్నమభక్షకం

శూద్రాన్నం యాజకాన్నం చ శూద్రశ్రాద్ధాన్నమేవ చ

అభక్ష్యాన్నం చ విప్రర్షే యదన్నం వృషలీపతే:

 బ్రహ్మన్ వార్ధుషికాన్నం చ గణకాన్నమభక్షకం

ఆగ్రదాని ద్విజాన్నం చ చికిత్సాకారకస్య చ

హస్తచిత్రాహి తైల మగ్రాహ్యం చాప్యభక్షకం

మూలే మగే భాద్రపద మాంసం గోమాంసతుల్యకం

ఆమాయాం కృత్తికాయాం చ ద్విజై: క్షౌరం వివర్జితం

కృత్వా తు మైథునం క్షౌరం యో దేవాంస్తర్పయేత్పతకాన్

రుధిరం తద్భవేత్తోయం దాతా చ నరకం వ్రజేత్

యత్కర్తవ్యమకర్తవ్యం యద్భోజ్యం యదభోజ్యకం

సర్వం తుభ్యం నిగదితం కిం భూయ: శ్రోతుమిచ్ఛసి

గృహస్తులు పైన తెల్పిన దీనములు కాక మిగిలిన దీనములలో మాంసము తినవచ్చును. ఉదయము స్నానము చేయగానే పార్వణ శ్రాద్ధమున, వ్రతములనాడు ఆలనూనె లేదా పక్వము చేసి తీసిన నూనె ప్రశస్తమైనది.

అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి దినములు, అష్టమీ చతుర్థశీతిథులు, ఆదివారమునాడు, శ్రాద్ధదినము, వ్రతదినములలో స్త్రీ సహవాసము, మావులనూనె పనికిరానివి.

మాంసము, ఎఱ్ఱని కూరగాయలు, కంచుపాత్రలో భోజనము, ఇతర స్త్రీల పొందు, తాబేటిమాంసము నిషిద్ధములు. అట్లే అన్ని కులములవారు పగటిపూట తన భార్యతోనైనా సంగమము చేయరాదు. అదేవిధముగా రాత్రిపూట పెరుగుచేసికొని తినుట, పగటిపూట, ప్రాతః సాయంకాల సంధ్యలలో నిద్రపోవుట కూడనివి. ముట్టిన సీసంగమము పూర్తిగా వదిలి పెట్టవలెను. ఆది నరకమునకు కారణమగుచున్నది.

రజస్వలయైన స్త్రీయొక్క అన్నము, జారస్త్రీ పెట్టిన అన్నము, యాజకాన్నము, శూద్రాన్నము, శూద్రస్త్రీని ఉంచుకొనిన బ్రాహ్మణుని అన్నము, ధనమప్పుగానిచ్చి దాని వడ్డీ వలన బ్రతుకువానీ అన్నము, కరణముయొక్క అన్నము తినరానివి.

అట్లే ఆగ్రదాని లేక అత్యాశకుపోయి తొలుతనే దానము తీసుకొను బ్రాహ్మణుని అన్నము, వైద్యుని అన్నముకూడ భుజించకూడదు.

మూలానక్షత్రమున మృగశిరనక్షత్రమున, భాద్రపదమాసమందును మాంసము భుజింపరాదు. అది ఆ దినములలో గో మాంస సమమై ఉండును.

అమావాస్యనాడు, కృత్తికా నక్షత్రమునాడు ద్విజులు క్షారముచేసికోనకూడదు. క్షారము చేసికొనిన తరువాత, సీసంగమము తరువాత దేవతార్చన, పితృతర్పణము చేయకూడదు.

నారద! గృహస్థులు చేయతగిన పనులు, చేయతగని పనులు, తినతగినవి, తిన తగనివీ అన్నిటిని నీకు చెప్పితిని, ఇంకను వినవలసినవి ఏమైన ఉన్నచో అడుగుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే బ్రహ్మఖండే సౌతిశౌనక సంవాదే నారదం ప్రతి శివోపదేశ భక్ష్యాది వివరణం నామ సప్తవింశతితమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమున సౌతీశానకుల సంవాదముగల బ్రహ్మఖండమున నారదునకు శివుడుపదేశించిన భక్ష్యాభక్ష్యముల వివరణగల ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.