బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

11 - విష్ణుమూర్తి, వైష్ణవుల ప్రశంస

శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను-

ద్విజః స భార్యాం సంత్యజ్య కిం చకార విశేషతః

అశ్వినోర్వా మహాభాగ కిం నామ కస్య వంశజౌ

పూర్వము బ్రాహ్మణుడు తన భార్యను వదలి ఏమి చేసెను. అశ్వినీ కుమారుల పేరేమి? వారు ఎవని వంశమువారు? మొదలగు విషయములను తెలుపుము.

సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లనెను-

ద్విజశ్చ సుతపా నామ భారద్వాజో మహామునిః

తపశ్చకార కృష్ణస్య లక్షవర్షం హిమాలయే

మహాతపస్వీ తేజస్వీ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా

జ్యోతిర్దదర్శ కృష్ణస్య గగనే సహసా క్షణం

వరం స వవ్రే నిర్లిప్తమాత్మానం ప్రకృతేః పరం

 న చ మోక్షం యయాచే తం దాస్యం భక్తిం చ నిశ్చలాం

 బభూవాకాశవాణీతి కురు దారపరిగ్రహం

పశ్చాద్దాస్యం ప్రదాస్యామి భక్తిం భోగక్షయే ద్విజా

పితృణాం మానసీం కన్యాం దదా తస్మై విధిః స్వయం

తస్యాం కల్యాణమిత్రశ్చ బభూవ మునిపుంగవ

యస్య స్మరణమాత్రేణ న భవేత్ కలిజం భయం

న ద్రష్టవ్యం బంధుమాత్రం నూనం తత్ప్మరణాద్భవేత్

ఓ శౌనక మహర్షీ! సుతపుడనే భరద్వాజ వంశమునకు చెందిన ముని హిమాలయ పర్వత ప్రాంతమున శ్రీకృష్ణదేవుని గురించి లక్ష సంవత్సరములు తపస్సు చేసెను. ఆతడు బ్రహ్మ వర్చస్సుతో గొప్పగా ప్రకాశించుచు ఆకాశమున జ్యోతిః స్వరూపుడైన శ్రీకృష్ణుని క్షణకాలము దర్శించెను. సుతపునకు పరమాత్మ దర్శనము జరిగినా ఆ పరాత్పరుని ఏ వరము ఆడుగలేదు. చివరకు మోక్షమును సైతము యాచించలేదు. కాని అతడు పరమాత్మమ స్థిరమైన భగవద్దాస్యము, భగవద్భక్తిని తనకు ప్రసాదించమనీ ఆడిగెను.

అప్పుడు భగవంతుడు ఆకాశవాణి ద్వారా తొలుత వివాహము చేసికొమ్మని, తరువాత భగవద్దాస్యమును, అనుభవక్షయము జరిగిన తరువాత భగవద్భక్తిని ఇత్తునని చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుడు పితృదేవతల మానస కన్యను అతనికిచ్చి వివాహము చేసెను. వారిద్దరకు కళ్యాణమిత్రుడనే పుత్రుడు కలిగెను. కల్యాణమిత్రుడు మిక్కిలి పవిత్రమైనవాడు. అతనిని స్మరించినంత మాత్రముననే కలివల్ల కలుగు భయములన్నీ తొలిగిపోవును.

కల్యాణమిత్ర జననీం పరిత్యజ్య మహామునిః

శశాప సూర్యపుత్రం చ యజ్ఞభాగ్వర్జితో భవ

ససోదరశ్చ వాపూజ్యో భవేతి చ సురాధమ

వ్యాధిగ్రస్తో జడాంగశ్చ భూయత్తేఽ కీర్తిమానితి II

ఇత్యుక్త్యా సుతపా గేహం ప్రతస్థ సూనునా సహ 

ఆశ్విభ్యాం సహితః సూర్య ప్రయయా చ తదంతికం

పుత్రాభ్యాం వ్యాధియుక్తాభ్యాం సూర్యప్రిజగతాం పతిః

మునీంద్రం వై సుతపసం సతుష్టావ చ శౌనక

సుతపమహర్షి (ఆశ్వినీ కుమార సంగతయైన) తన భార్యను వదలి పెట్టి సూర్యపుత్రుడైన అశ్వినీ కుమారునకు అతని సోదరునకు యజ్ఞభాగము ఉండకుండునట్లు, వ్యాధిగ్రస్తులై జడమైన అవయవములతో గౌరవ దూరులు కమ్మని శపించి తన పుత్రుడైన కల్యాణమిత్రునితో కలిసి ఇంటికి వెళ్ళిపోయెను. ముల్లోకములకు పూజ్యుడైన సూర్యుడు వ్యాధిపీడితులైన తన కుమారులను వెంటపెట్టుకొని సుతపమహర్షి వెంటవెళ్ళి ఆతనినిట్లు ప్రస్తుతించెను.

సూర్య ఉవాచ- సూర్యుడిట్లనెను -

క్షమస్వ భగవనిప్ర విష్ణురూప యుగే యుగే

మమ పుత్రాపరాధం చ భారద్వాజ మునీశ్వర

బ్రహ్మవిష్ణుమహేశాద్యాః సురా సర్వే చ సంతతం

భుంజతే విప్రదత్తం తు ఫలపుష్పజలాదికం

బ్రాహ్మణావాహితా దేవా శశ్వద్విశ్వేషు పూజితాః

న చ విపాత్పరో దేవో విప్రరూపీ స్వయం హరిః

బ్రాహ్మణే పరితుష్టే చ తుష్టా నారాయణః స్వయం

నారాయణి చ సంతుష్టే సంతుష్టాః సర్వదేవతాః

నాస్తి గంగాసనం తీర్థం న చ కృష్ణాత్పరః సురః !

న శంకరాదైష్ణవశ్చ న సహిష్ణుర్ధరా పరా

న చ సత్యాత్పరో ధర్మః వ సాధ్వీ పార్వతీ పరా

న దైవాద్బలవాస్కశ్చిత్ న చ పుత్రాత్పరః ప్రియః

న చ వ్యాధినమః శత్రు: న చ పూజ్యో గురోః పరః

నాస్తి మాతృసమో బంధుః న చ మిత్రం పితుః పరం

ఏకాదశీవ్రతాన్నోన్యత్ తపో నానశవాత్పరం

పరం సర్వధనం రత్నం విద్యారత్నం పరం తతః

 సర్వాశ్రమైః పరో విప్రః నాస్తి విప్రనమో గురు:

వేదవేదాంగతత్వజ్ఞ ఇత్యాహ కమలోద్భవః

ప్రతి యుగములో విష్ణుస్వరూపుడవైన ఓ బ్రాహ్మణుడా! నా పుత్రుని తప్పును క్షమించుము. బ్రహ్మ విష్ణు, మహేశుడు మొదలైన దేవతలు బ్రాహ్మణుడిచ్చు ఫలములను, పుష్పములను, నీటిని అనుభవించుచున్నారు. బ్రాహ్మణులచే ఆవాహనము చేయబడిన దేవతలు సమస్త ప్రపంచములందు పూజులనందుకొనుచున్నారు. అందువలన బ్రాహ్మణుని కంటే గొప్పనైన దేవుడు ఎక్కడ లేడు. విష్ణుమూర్తి స్వయముగా బ్రాహ్మణ రూపమున ఉండుమ. బ్రాహ్మణుడు సంతోషపడినచో విష్ణుమూర్తి కూడ సంతసించగలడు. నారాయణుడు సంతుష్టుడైనచో సమస్త దేవతలు సంతుష్టులైనయట్లే.

గంగానదితో సమానమైన పుణ్యతీర్ధము, శ్రీకృష్ణునికంటే గొప్పవైన దేవత, శంకరుని కన్న గొప్ప వైష్ణవ భక్తుడు, భూమికంటే గొప్ప క్షమాశీలి, సత్యము కంటే గొప్ప ధర్మము, పార్వతి కంటే గొప్ప పతివ్రత, ఆదృష్టము కంటే గొప్పవైన బలవంతుడు కుమారుని కంటే ఇష్టమైన వ్యక్తి ఉండడు. ఆట్టే వ్యాధితో సమానమైన శత్రువు, గురువు కన్న గొప్ప పూజ్యుడు, తల్లితో సమానమైన బంధువు, తండ్రిని మించిన స్నేహితుడు, ఏకాదశీ వ్రతమును మించిన వ్రతము, ఉపవాసమున మించిన తపస్సు రత్నము కంటే గొప్పనైన ధనము, విద్యారత్నమును మించిన రత్నము ఎక్కడా కన్పడదు.

ఆశ్రమవాసులందరికంటెను బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. వేదములు, వేదాంగముల తత్వము తెలిసిన బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడైన గురువు లేడని బ్రహ్మదేవుడు తెలిపినాడు.

సూర్యస్య వచనం శ్రుత్వా భారద్వాజో ననామ తం

నీరుజౌ చాపి తత్పుత్రై చకార తపసః ఫలాత్

పశ్చాచ్చ తన పుత్రే చ యజ్ఞభాజా భవిష్యత

ఇత్యుక్త్యా తం చ సుతపాః ప్రణమ్యాహస్కరం మునిః

జగామ గంగాం సంత్రప్తో హరిసేవనతత్పరః

పుత్రాభ్యాం సహితః సూర్యో జగామ నిజమందిరం

ఏతత్పూర్యకృతం విప్ర స్తోత్రం యోమానవః పఠేత్

విప్రపాద ప్రపాదేన సర్వత్ర విజయీ భవేత్

సూర్యుని మాటలు విని భారద్వాజుడైన సుతపు డతనికి నమస్కరించి, తన తపశ్శక్తివలన సూర్యపుత్రులను వారి వ్యాధినుండి విముక్తులను చేసి, తరువాత వారికి యజ్ఞహవిస్సు తీసుకొను ఆర్హత లభించగలదని చెప్పి, మరల సూర్యునకు నమస్కరించి నారాయణుని సేవకై గంగాతీరమునకు వెళ్ళిపోయెను.

సూర్యుడు తన కుమారులతో కలిసి తన ఇంటికి వెళ్ళి పోయెను.

ఓ శౌనకమహర్షీ! సూర్యుడు చేసిన ఈస్తోత్రమును ఎవరు చదువుదురో, బ్రాహ్మణానుగ్రహామువలన అంతట విజయము వారికి లభించును.

బ్రాహ్మణేభ్యో నమ ఇతి ప్రాతరుత్థాయ యః పఠేత్

సః స్నాతః సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షితః

పృథివ్యాం యానీ తీర్థానీ తానీ తీర్థానీ సాగరే

సాగరే యాని తీర్థాని ఏప్రపాదేషు తాని చ

విప్రపాదోదకం పీత్వా యావత్తిష్ఠతి మేదినీ

తావత్సుష్కురపాత్రేషు పిబంతి పితరో జలం

విప్రపాదోదకం పుణ్యం భక్తియుక్తశ్చ యః పిబేత్

స స్నాతః సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షితః

మహారోగీ యది పిబ్ద్విప్రపాదోదకం ద్విజః

ముచ్యతే సర్వ రోగాచ్ఛ మాసమేకం తు భక్తితః

అవిద్యో వా సవీద్యో వా సంధ్యాపూతో హి యో ద్వీజః !

స ఏవ విష్ణుసదృశో న హరే విముఖో యది ఈఈ

ఘ్నంతం విప్రం శంపంతం వా న హన్యాన్న చ తం శపేత్

గోభ్యః శతగుణం పూజ్యో హరిభక్తశ్చ స స్మృతః

పాదోదకం చ నైవేద్యం భుంక్తే విప్రస్య యో ద్వీజ

నిత్యం నైవేద్యభోజీ యో రాజసూయఫలం లభేత్

ఉదయమే లేచి బ్రాహ్మణులకు నమస్కరించుచున్నాను అని ఎవడమనో అతడు సమస్త పుణ్యతీర్థములందు పానము , చేసిన వానితో సమానుడు. సమస్త యజ్ఞములందు దీక్ష తీసికొన్న వానితో సమానుడు.

భూమీపై ఎన్ని పుణ్య తీర్థములున్నవో, సముద్రమున అన్ని తీర్థములున్నవి. సముద్రములో మన్న తీర్థములన్నీ బ్రాహ్మణుల పాదతీర్థమునమన్నవి. విప్రులపాదోదకము తాగినచో భూమియున్నంతకాలము ఆతని పితృదేవతలు పుష్కర పాత్రలలో తర్పణ జలము తాగుదురు. పవిత్రమైన బ్రాహ్మణపాదోదకమున తాగినవాడు సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేసినవానితో, సమస్త యజ్ఞములందు దీక్షను గైకొన్న వానితో సమానుడు. మహారోగియైనా వీప్రపాదోదకమును ఒక నెల భక్తితో స్వీకరించినచో అతని సమస్త రోగములు వెంటనే తొలగిపోవును. ప్రతిదినము సంధ్యావందనము చేయు బ్రాహ్మణుడు చదువుకున్నా, చదువుకోక పోయినా, విష్ణుద్వేషములేనిచో అతడు విష్ణుమూర్తితో సమానుడు. విప్రుడు కొట్టినా అతనిని కొట్టవద్దు. శపించినా శపించవద్దు, హరిభక్తుడైతే అతడు ఆవులకన్న వందరెట్లు ఎక్కువగా గౌరవించతగినవాడు. విప్రునియొక్క పాదోదకమును ఆతని నైవేద్యముమ ఎవరు స్వీకరిస్తారో అతడు నిత్యము భగవనైవేద్యమున తిమవాడు. రాజసూయ ఫలితమనుభవించువాడగును.

ఏకాదశ్యాం వ భుంక్తే యో నిత్యం కృష్ణం  సమర్చయేత్

తస్య పాదోదకం ప్రాప్య స్థలం తీర్థం భవేత్ ధ్రువం

యో భుంక్తే భోజనోచ్ఛిష్టం నిత్యం నైవేద్యభోజనం

కృష్ణదేవస్య పూతో జీవన్ముక్తో మహీతలే

అన్నం విష్ణా పయో మూత్రం యద్విష్ణోరనివేదితం

ద్విజానాం కులజాతానామిత్యాహ కమలోద్భవః

బ్రహ్మా చ బ్రహ్మపుత్రాశ్చ సర్వే విష్ణుపరాయణాః !

బ్రాహ్మణస్తత్కులే జోతో విముఖశ్చ హరౌ కథం

 పిత్రోర్మాతామహాదీవాం సంసర్గస్య గురోశ్చవా

దోషేణ విముఖాః కృష్ణ విప్రా జీవన్మృతాశ్చయే

ప కిం గురుః స కిం తాతః స కిం పుత్రః స కిం సఖా

స కిం రాజా స కిం బంధుః న దద్ద్యో హరో మతం

ఆవైష్ణవాద్విబాద్విస్ర చండాలో వైష్ణవో వరః

సగణః శ్వపచోముకో బ్రాహ్మణో నరకం వ్రజేత్

సంధ్యాహీనోఽశుచిర్నిత్యం కృష్ణ వా విముఖో ద్విజః

స ఏవ బ్రాహ్మణాభాసో విషహీనో యథోరగః

 గురువక్రాద్విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవిశ్యతి

తం వైష్ణవం మహాపూతం జీవన్ముక్తం వచేద్విది

పుంసాం మాతామహాదీనాం శతైః సార్థం హరేః పదం

ప్రయాతి వైష్ణవః పుంసామాత్మనః కులకోటిభిః

బ్రహ్మక్షత్రియవీట్ శూద్రాశ్చతస్రః జాతయో యథా

స్వతంత్రా జాతిరేకా చ విశ్వస్మిన్ వైష్ణవాభిధా !!

ధ్యాయంతి వైష్ణవాః శశ్వద్గోవిందపదపంకజం

ధ్యాయతే తాంశ్చ గోవిందః శశ్వతేషాం చ సన్నీధౌ

సుదర్శనం పంనియోజ్య భక్తానాం రక్షణాయ చ

 తథాసిన ఏ నిశ్చింతోవతి స్టేద్భక్తసన్నిధౌ

ఏకాదశినాడు ఎవరు ఉపవాసముందురో ఎవరు ప్రతిదినము శ్రీకృష్ణుని పూజింతురో వారి పాదోదకము పడిన స్థలము తప్పక పుణ్యతీర్థము కాగలదు. శ్రీకృష్ణునికి నివేదితమైన అన్నమును ఎవరు ప్రతిదినము తిందురో ఆతడు జీవన్ముక్తుడు కాగలడు. విష్ణుమూర్తికి నివేదింపబడని అన్నము మలముతో సమానము. పాలు మూత్రముతో సమానము.

బ్రహ్మ, బ్రహ్మయొక్క పుత్రులందరు విష్ణుభక్తి పరాయణులు. ఆ బ్రహ్మకులములో పుట్టిన బ్రాహ్మణుడు విష్ణుభక్తికి విముఖుడెలాడా? తల్లి దండ్రులు, మాతామహులు, పితామహులు, గురువు మొదలగువారి దోషమువలన బ్రాహ్మణులు విష్ణుభక్తి విదూరులగుచున్నారు. ఆట్టివారు జీవన్మృతులు. హరిభక్తి కలిగించని గురువు గురువుకాదు. తండ్రి తండ్రి కాడు. కొడుకు కొడుకు కాదు. ప్నేహితుడు, రాజు, బంధువు ఎవరైనను సరియైన వారుకాదు. వైష్ణవుడు--కాని బ్రాహ్మణుని కంటే వైష్ణవుడైన చండాలుడు చాలా గొప్పవాడు. విష్ణుభక్తిలేవి బ్రాహ్మణుడు నరకమునకు వెళ్ళును. సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు, నిత్యము అశుచియైనవాడు, శ్రీకృష్ణభక్తి రహితుడైన బ్రాహ్మణుడు విషములేని సర్పమువలె పనీకిరానీ వాడగును.

గురువు ముఖమునుండి విష్ణువుకు సంబంధించిన మంత్రము ఎవరి చెవిన పడునో ఆవైష్ణవుడు పరమ పవిత్రుడని, జీవన్ముక్తుడనీ అందురు. వైష్ణవుడు మాతామహుడు మొదలైన నూరు తరములవారిని, తన వారినందరినీ వైకుంఠమునకు చేర్చుము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులవలె వైష్ణవులనేది ప్రత్యేకమైన జాతి.

వైష్ణవులెల్లపుడు గోవిందుని వదపంకజములను స్మరించుచుందురు. ఆ గోవిందుడు కూడ వారిని స్మరించును. తన భక్తుల సంరక్షణకై సుదర్శన చక్రమును ఎల్లప్పుడు నియోగించినప్పటికిని పూర్తిగా భక్తరక్షణ చేసితినని నిశ్చింతగానుండడు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే సౌతి శౌనక సంవాదే బ్రహ్మ ఖండే విష్ణు వైష్ణవ బ్రాహ్మణ ప్రశంసా నామ ఏకాదశోధ్యాయః

 శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతి శౌనకసంవాదమను బ్రహ్మఖండమున విష్ణు, వైష్ణవబ్రాహ్మణప్రశంసలుకల పదకొండవ అధ్యాయము సమాప్తము.