సౌతిరువాచ- సౌత్ మహర్షి ఇట్లు పలికినాడు.
ఆథ బ్రహ్మా స్వపుత్రాంస్తానాదిదేశ చ సృష్టయే ।
సృష్టిం ప్రచక్రతుస్తే సర్వే విప్రేంద్ర నారదం వీనా ॥
తరువాత బ్రహ్మదేవుడు మిగిలిన పుత్రులను సృష్టి చేయమని ఆజ్ఞాపించెను. నారదుడు తప్ప మిగిలిన అతని పుత్రులు సృష్టి చేయుటకు మొదలు పెట్టిరి.
మరీచేర్మనసో జాతః కశ్యపశ్చ ప్రజాపతిః ।
ఆత్రే: నేత్రమలాచ్చంద్రః క్షీరోదే చ బభూవ హ ॥
ప్రచేతసోఽపీ మనసో గౌతమశ్చ బభూవహా ।
పులస్త్యమానస పుత్రో మైత్రావరుణ ఏవచ ॥
మనోశ్చ శతరూపాయాం తిస్రః కన్యాః ప్రజజ్ఞిరే।
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిస్తా: పతివ్రతాః ॥
ప్రియవ్రతోత్తానపాదౌ ద్వౌ చ పుత్రౌ మనోహరౌ ।
ఉత్తానపాదతనయో ధ్రువః పరమ ధార్మికః ॥
ఆకూతిం రుచయే ప్రాదాద్దక్షాయాథ ప్రసూతికాం ।
దేవహూతిం కర్దమాయ యత్పుత్రః కపిల స్వయం ॥
ప్రసూత్యాం దక్షబీజేన షష్టికన్యా ప్రజజ్ఞిరే।
అ ష్టౌ ధర్మాయ స దదౌ రుద్రాయైకాదశ స్మృతా: ॥
శివాయైకాం సతీం ప్రాదాత్ కశ్యపాయ త్రయోదశ ।
సప్తవింశతి కన్యాశ్చ దక్షశ్చంద్రాయ దత్తవాచ్ ॥
మరీచి మహర్షి యొక్క మనస్సునుండి కశ్యపప్రజాపతి, అత్రిమహర్షి నేత్రమలము క్షీరసముద్రమున పడగా అందులోనుండి చంద్రుడు, ప్రచేతసునీ యొక్క మనస్సునుండి గౌతమ మహర్షి, పులస్త్యుని మనస్సునుండి మైత్రావరుణుడు ఉద్భవించిరి. మనువునకు ఆతని భార్యయైన శతరూపయందు ముగ్గురు కన్యలు ఉద్భవించిరి. వారి పేర్లు ఆకూతి, దేవహూతి ప్రసూతి. ఇంకను ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కొడుకులు కలిగిరి. ఉత్తానపాదునీ పుత్రుడు పరమధార్మికుడైన ధ్రువుడు. మనువు తన కూతురైన ఆకూతిని రుచియనువానీకిచ్చెను. దక్షునికి ప్రసూతినీ, కర్ణమునకు దేవహూతి నొసగెను. వారీపుత్రుడు కపిలమహర్షి. దక్ష ప్రజాపతివలన ప్రసూతికి ఆరువది కన్యకలు పుట్టిరి. వారిలో ఎనమండుగురిని ధర్మునకు, రుద్రునకు పదకొండుమందిని, కశ్యపమహర్షికి పదముగ్గురినీ, చంద్రునకు ఇరువది ఏడుమందినీ, శివునకు సతియను కన్యను భార్యగా నిచ్చెను.
నామానీ ధర్మపత్నీనాం మత్తో వీప్ర నీశామయ ।
శాంతి పుష్టిః దృతిస్తుష్టిః క్షమా శ్రద్దా మతిః స్మృతి ॥
శాంతేః పుత్రశ్చ సంతోష పుష్టే పుత్రో మహానభూత్ ।
ధృతేర్దైర్యం చ తుష్టేశ్చ హర్షదర్పౌ సుతా స్మృతా ॥
క్షమాపుత్రః సహిష్ణుశ్చ శ్రద్దాపుత్రశ్చ ధార్మిక: ।
మతైర్జ్ఞానాభిధః పుత్రః స్మృతేర్జాతిస్మరోమహాన్ ॥
పూర్వపత్న్యాం చ మూర్త్యాం చ నరనారాయణావృషీ ।
బభూవురేతే ధర్మిష్ఠా ధర్మపుత్రాశ్చ శౌనక ॥
ధర్ముని భార్యల పేర్లు వరుసగా శాంతి, పుష్టి ధృతి, తుష్టి క్షమ. శ్రద్ధ, మతి, స్మతి. శాంతీ పుత్రుడు సంతోషుడు, పుష్టి కొడుకు మహాన్, ధృతికి ధైర్యుడు, తుష్టీకి హర్షదర్పులనే పుత్రులు క్షమకు సహిష్ణువు, శ్రద్ధకు ధార్మికుడు, మతికి జ్ఞానుడు, స్మృతికి జాతిస్మరుడు, ధర్మునీ మొదటిభార్యయైన మూర్తికి నరనారాయణులను ఋషులు ఉద్భవించిరి.
నామాని రుద్రపత్నీనాం సావధానం నిబోధ మే ।
కళా, కళావతీ కాష్ఠా కాళికా కలహప్రియా !!
కందళీ, భీషణా రాస్నా ప్రమోచా భూషణా శుకీ ।
ఏతాసాం బహవః పుత్రా బభూవుః శివపార్షదాః ॥
సా సతీ స్వామినిందాయాం తనుం తత్యాజ యజ్ఞతః ।
పునర్భూత్వా శైలపుత్రి లేభే సా శంకరం ప్రియం ॥
కళ, కళావతి, కాషా, కాళికా, కలహప్రియా, కందళీ, భీషణా, రాస్నా, ప్రమోచ, భూషణ శుకి ఆనువారు ఏకాదశ రుద్రుల భార్యలు. వీరికి కలిగిన పుత్రులంతా శివునికి అనుచరులైరి.
శివుని భార్యయైనసతి తండ్రియైన దక్షుడు, చేసిన యజ్ఞములో తన భర్తకు జరిగిన నిందను భరించలేక శరీరమున వదలి తరువాతి జన్మలో హిమవత్పర్వతమునకు కూతురుగా పుట్టి శంకరుని భార్యగా నయ్యెను.
కశ్యపస్య ప్రియాణాం చ నామాని శ్రుణు ధార్మిక ।
ఆదితీర్దేవమాతావై దైత్యమాతా దితిస్తథా ॥
సర్పమాతా తథా కద్రూర్వీనతా పక్షిసూస్తథా ।
సురభిశ్చ గవాం మాతా మహిషాణాం చ నిశ్చితం ॥
సారమేయాదిజంతూనాం సరమా సూశ్చతుష్పదాం ।
దను: ప్రసూర్దానవానాం అన్యాశ్చత్యేవమాదికాః ॥
కశ్యపునికి దేవతల తల్లియైన ఆదితి, దైత్యులకు తల్లియైన దితి, సర్పములకు తల్లియగు కద్రువ, పక్షులకు తల్లియైన వినత, గోవులకు, మహిషములకు మాతయైన సురభి, సారమేయములు మొదలగు చతుష్పాద జంతువులకు తల్లియైన సరమ, దానవులకు తల్లియైన దనువు మొదలైన భార్యలున్నోరు.
ఇంద్రశ్చ ద్వాదశాదీత్యాః ఉపేంద్రాద్యాః సురామునే ।
కదితాశ్చాదితేః పుత్రాః మహాబలపరాక్రమాః ॥
ఇంద్రపుత్రో బియంతశ్చ బ్రహ్మాన్ శచ్యామజాయత ।
ఆదిత్యస్య సవర్ణాయాం కన్యాయాం విశ్వకర్మణః ॥
శనైశ్చరయమౌ పుత్రౌ కాళిందీ కన్యకా తథా ।
ఉపేంద్రవీర్యాత్ ప్పథ్వ్యాం తు మంగళః సమజాయత ॥
ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు ఉపేంద్రుడు మొదలైన దేవతలు ఆదితిపుత్రులు. ఇంద్రునియొక్క కొడుకు జయంతుడు. ఇతడు శచీదేవియందు కలిగెను. ఆదిత్యునికి విశ్వకర్మకూతురైన సవర్ణయందు శని, యముడు, అనుకొడుకులు కాళింది అనుకూతురుపుట్టెను.
శౌనక ఉవాచ- శానకమహర్షి ఇట్లనెను.
కథం సౌతే స చో పేంద్రాన్మంగళః సమజాయత ।
వసుంధరాయాం బలవాంస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి ॥
సూతమహర్షీ! ఉపేంద్రునకు భూమియందు బలపరాక్రమశాలియైన మంగళు డేవిధముగా పుట్టెనో నాకు చక్కగా వివరింపుము.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు చెప్పెను.
ఉపేంద్రరూపమాలోక్య కామార్తా చ వసుంధరా ।
విధాయ సుందరీవేషం అక్షతా ప్రౌడయౌవనా ॥
మలయే నిర్జనే రమ్యే చారుచందనపల్లవే ।
చందనోక్షితసర్వాంగం రత్నభూషణభూషితం ॥
తం సుశీలం శయానం చ శాంతం సస్మితమీప్సితం ।
సస్మితా తస్య తల్పే చ సహసా సముపస్థితా ॥
సురమ్యాం మాలతీమాలాం దదౌ తస్మై వరాననా ।
సుగంధి చందనం చారు కస్తూరీ కుంకుమాన్వితం ॥
ఉపేంద్రస్తన్మనో జ్ఞాత్వా కామినీం కామపీడితాo ।
నానాప్రకారశృంగారం చకార చ తయా, సహ ॥
తదంగ సంగసంసక్తా మూర్చాంప్రాప సతి తదా ।
మృతేన నిద్రతేవాసౌ బీజాధానం కృతే హరౌ ॥
తాం విలగ్నాం చ సుశ్రోణీం సుఖసంభోగమూర్చితాo ।
బృహన్ముక్త నితంబాం చ సస్మితాం విపులస్మితాం ॥
క్షణం వక్షసి కృత్వాతాం తదోష్ఠం చ చుచుంబహ ।
విహాయ తత్ర రహసి జగామ పురుషోత్తమ: ॥
ఊర్వశీ పథ గచ్ఛంతి బోధయామాస తాo మునే ।
సా చ పప్రచ్చ వృత్తాంతం కథయామాస భూశ్చ తాo ॥
వీర్యసంవరణం కర్తుం సాచాశక్తా చదుర్బలా ।
ప్రవాళస్యాకరే త్రస్తా వీర్యన్యాసం చకార సా ॥
తేన ప్రవాళవర్ణశ్చ కుమారః సమపద్యత ।
తేజసా సూర్యసదృశో నారాయణ సుతోమహాన్ ॥
మంగళస్య ప్రియా మేధా తస్య ఘంటేశ్వరో మహాన్ ।
ప్రణదాతాఽతీతేజస్వీ విష్ణుతుల్యో బభూవ హ॥
ఉపేంద్రుని సుందర రూపమును చూచి భూదేవి మోహించి ప్రౌఢ వయస్సుగల సుందరీ రూపమును ధరించి జనరహితమైన అందమైన చందన వృక్షములతో విరాజిల్లే మలయ పర్వత ప్రాంతమున తన సర్వావయవములపై చందనము. పూసికొని మంచి రత్న భూషణములలో చిరునవ్వుతో పరుపుపై పడుకొని ఉన్న ఉపేంద్రుని సమీపించి, అతని శయ్యపై కూర్చుండి ఆందముగా నున్న మాలతీ మాలను. ఉపేంద్రుని మెడలో వేసెను. అట్టే కస్తూరీ కుంకుమలతో నున్న చందనమును అతనికి అద్దినది. ఉపేంద్రుడు భూదేవి మనస్సును గుర్తించి అనేక విధములైన శృంగార చేష్టలు చేసెను. శ్రీహరి శరీరము తగిలి బీజావాపము జరుగగా ఆమె మూర్చను పొందినది. నిద్రపోయినట్లు ఆమె మైమరిచినది. ఉపేంద్రుడు సుఖసంభోగపీడిత, సస్మితయైన భూదేవిని క్షణకాలము అక్కున చేర్చుకొని ఆమెను ముద్దులాడి వెళ్ళిపోయెను.
ఆకాశమార్గములో పోతున్న ఊర్వశీ మలయపర్వత ప్రాంతమున పడియున్న భూదేవిని తట్టిలేపి ఆమె వృత్తాంతమును అడిగి తెలుసుకో సను, ఆ భూదేవి ఉపేంద్రుని వీర్యమును భరించలేక పగడాల చీప్పలో ఆ వీర్యమునుంచెను. అందువల్లనే నారాయణుని పుత్రుడైన కుబాడు తేజస్సున సూర్యునివంటివాడై పగడపు కాంతిని కల్గియుండెను.
ఆ మంగళునకు భార్యని మేధ. వారిద్దరికి మిక్కిలి తేజస్సుకలవాడు, విష్ణుమూర్తీతో సమానమైన, ఘంటేశ్వరుడు కలిగెను.
దితేః హిరణ్యకశిపు హిరణ్యాక్షౌ మహాబలౌ।
కన్యా చ సింహికా విప్ర సైంహికేయశ్చ, తత్సుతః ॥
నిర్రుతి: సింహికా సా చ తన రాహుశ్చ నైఋతః ।
సూకరేణ హిరణ్యాక్షోఽప్యనపత్యో మృతో యువా॥
హిరణ్యకశిపోః పుత్రః ప్రహ్లాదో వైష్ణవాగ్రణీః ।
విరోచనశ్చ తత్పుత్ర; తత్పుత్రశ్చ బలిః స్వయం ॥
బలేః పుత్రో మహాయోగీ జ్ఞానీ శంకరకింకరః ।
దితేర్వంశశ్చ కథితః కద్రూవంశం నిబోధ మే ॥
దితికి హరణ్యకశిపు, హిరణ్యాక్షులను ఇద్దరు కొడుకులు, సింహిక అనుకూతురు పుట్టినది, నిర్ఋతి సింహికల పుత్రుడు సైఋతుడు, సైంహికేయుడు అనే పేర్లు గల రాహువు. ఇక హిరణ్యాక్షుడు ఆదివరాహ మూర్తిచేత సంతానము కలుగక ముందే చంపబడినాడు. హిరణ్యకశిపునకు వైష్ణవులలో శ్రేష్టుడైన ప్రహ్లాదుడు, ఆతనికి విరోచనుడు, విరోచనునకు బలి చక్రవర్తి, అతనికి మహాజ్ఞాని, శంకరుని సేవకుడైన మహాయోగి పుత్రుడు.
ఇది దితివంశము, కద్రూవంశమును ఇప్పుడు చెప్పుచున్నాను.
అనంతం వాసుకీం చైవ కాళీయం చ ధనంజయం ।
కర్కోటకం తక్షకం చ వద్మమైరావతం తథా ॥
మహాపద్మం చ శంకుం చ శంఖం సంవరణం తథా! ।
ధృతరాష్ట్రం చ దుర్ధర్షం దుర్జయం దుర్ముఖం బలం ॥
గోక్షం గోకార్ముకం చైవ విరూపాదీంశ్చ శౌనక ।
న తేషాం ప్రవరాశ్చైవ యావత్య సర్పజాతయః ॥
కన్యకా మనసా దేవీ కమలాంశసముద్భవ ।
తపస్వినీనాం ప్రవరా మహాతేజస్వినీ శుభా ॥
యత్పతిశ్చ జరత్కారు: నారాయణకులోద్భవః ।
ఆస్తికః తనయో యస్యా విష్ణుతుల్యశ్చ తేజసా ॥
ఏతేషాం నామమాత్రేణ నాస్తి నాగభయం నృణాం ।
కద్రూవంశో నిగదితః వినతాయాః శృణుష్వ మే ॥
కద్రువుకు అనంతుడు, వాసుకి, కాళియుడు. ధనంజయుడు, కర్కోటకుడు, తక్షకుడు, పద్మము, ఐరావతము, మహాపద్మము, శంకు, శంఖుడు, సంవరణుడు, ధృతరాష్ట్రుడు, దుర్ణరుడు, దుర్జయుడు, దుర్ముఖుడు, గోక్షుడు, గోకార్ముకుడు, విరూపాక్షుడు మొదలైనవారు కొడుకులు. కూతురు మహాతపస్విని, లక్ష్మీదేవి అంశమునుండి పుట్టిన మనసాదేవి. ఈమె భర్త నారాయణుని కులమున పుట్టిన జరత్కారువు, వీరి పుత్రుడు ఆస్తీక మహాముని.
కద్రూ పుత్రుల పేర్లు విన్నంత మాత్రమున సర్పభయం తొలిగిపోతుంది. ఇక ఏనత యొక్క వంశమున పుట్టిన వారి పేర్లు వినుము.
వైనతేయరుణౌ పుత్రౌ విష్ణుతుల్యపరాక్రమౌ ।
తౌ బభూవుః క్రమేనైవ యావత్య: పక్షిజాతయః ॥
గావశ్చమహిషాశ్చైవ సురభిప్రవరా ఇమే ।
సర్వే వై సారమేయాశ్చ బభూవుః సరమాసుతాః ॥
దానవాశ్చ దనోర్వంశా: అన్యో: సామాన్యజాతయః ।
ఉక్తః కాశ్యప వంశశ్చ చంద్రఖ్యానం నిభోధమే॥
వినతకు విష్ణుమూర్తితో సమానమైన తేజస్సుకల గరుత్మంతుడు, ఆరుణి అను కొడుకులు కలిగిరి. వీరివలన క్రమముగా తక్కిన పక్షిజాతులన్ని కలిగినవి.
గోవులు, మహిషములు సురభి వంశములో పుట్టినవి. సారమేయములన్నీ సరమవంశములో పుట్టినవి. దనువు యొక్క వంశములో దానవులు పుట్టినారు. ఇవి కాశ్యపవంశములో ఉన్నవారి పేర్లు, ఇక చంద్రుని సంబంధించిన కథను ఓ శౌనకమునీ! వినుము.
నామాని చంద్రపత్నీనాం సావధానం నిశాము ।
ఆత్యపూర్వం చ చరితం పురాణేషు పురాతసం ॥
అశ్వినీ భరణీ చైవ కృత్తికా రోహిణీ తథా ।
మృగశీర్షా తథాఽర్ద్రాచ పూజ్యా సాద్వీ పునర్వసుః ॥
పుష్యాశ్లేషా మఘ పూర్వఫల్గుణ్యుత్తరఫల్గుణీ ।
హస్తా చిత్రా తథా స్వాతి వీశాఖా చానురాధికా ॥
జ్యేష్ఠా మూలా తథా పూర్వాషాఢ శైవోత్తరా స్మృతా ।
శ్రవణా చ ధనిష్టా చ తథా శతభిషక్చుభా ॥
పూర్వాభాద్రోత్తరాభాద్రా రేవత్యంత విధుప్రియాః ।
తాసాం మధ్యేచ సుభగా రోహిణీ రసికా వరా ॥
సంతతం రసభావేన చకార శశినం వశం ।
రోహిణ్యుపగతశ్చంద్రో న యాత్యన్యాం చ కామినీం ॥
సర్వా భగిన్యః పితరం కథయామాసురాదృతాః ।
సపత్నీకృతసంతాపం ప్రాణనాశకరం పరం ॥
దక్ష: ప్రకుపితశ్చంద్ర మశపన్మంత్ర పూర్వకం ।
ద్రుతం శ్వశురశాపేన యక్షగ్రస్తో బభూవ సః ॥
దీనే దీనే యక్ష్మణా స క్షీయమాణశ్చ దుఃఖితః ।
వపుష్యర్దం క్షీయమాణే శంకరం శరణం యయౌ ॥
దృష్ట్వా చంద్రం శంకరశ్చ క్లేశితం శరణాగతం ।
కరుణాసాగరస్తస్మై కృపయా చాభయం దదౌ ॥
నిర్ముక్తం యక్ష్మణా కృత్వా స్వకపోలే స్థలం దదౌ ।
అమరో నిర్భయో భూత్వా స తస్థౌ శివశేఖరే ॥
తం శివః శేఖరే కృత్వా చాభవచ్చంద్రశేఖరః ।
నాస్తి దేవేషు లోకేషు శీవాచ్చరణపంజరః ॥
దక్షకన్యా: పతిం ముక్తం ధృష్ట్యా చ రురుదు: పునః ।
అజగ్ముః శరణం తాతం దక్షం తేజస్వినాం వరం॥
ఉచ్చైశ్చ రురుదుర్గత్వా విహత్యాంగం పునః పునః ।
తమూచుః కాతరం దినాః దిననాథం విధేః సుతం॥
చంద్రుని భార్యల పేర్లు వరుసగా ఆశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష మఖ, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనువారు. వారిలో రోహిణి మిక్కిలి అందగత్తె, రసికురాలు. ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశము చేసికొన్నది. రోహిణి ఇంటికి వెళ్ళిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్ళకు వెళ్ళేవాడు కాడు. అందువలన రోహిణి తప్ప మిగిలిన ఆక్కచెల్లెండ్లందరు తండ్రి దగ్గరకు వెళ్ళి చావు కంటే గొప్పదైన సవతిబాధను చెప్పుకొనిరి. అందువల్ల దక్షుడు కోపముతో చంద్రుని మంత్రపూర్వకముగా శపించెను. దక్ష శాపమునకు భయపడి పరుగెత్తిన చంద్రునికి క్షయ వ్యాధి సంప్రాప్తించేను. ఆ క్షయవ్యాధివల్ల ప్రతిదినము చంద్రుడు క్షీణించుచు దు:ఖితుడాయెను. తనయొక్క సగము శరీరము క్షీణించగా శంకరునీ ఆతడు శరణువేడెను. శంకరుడు బాధలలో ఉండి తనను శరణుపొందిన చంద్రుని చూచి డయలో అభయమతనీకి నిచ్చెను. శంకరుడాతని క్షయ రోగ ముక్తుని గావించి తనకపోలస్థలమున స్థలము నీచ్చెను. చంద్రుడు శివుని ఆనుగ్రహము వలన ఆమరుడై భయవిముక్తుడు కాగా శివుని తలపై నుండెను. ఇట్లు చంద్రుడు తలపై ఆభరణముగా ఉన్నందువలన శివుడు చంద్రశేఖరుడాయెను. సమస్త దేవతలలో, సమస్తలోకములలో శివునివలె శరణు కోరిన వారిని రక్షించువాడెవడు లేడు.
దక్షకన్యలు తమ భర్తముక్తుడాయెనని మరల ఏడ్చుచు మహాతేజస్వి. తండ్రియైన దక్షుని దగ్గరకు వెళ్ళి మాటిమాటికి రొమ్ము కొట్టుకొనుచు పెద్దగా దుఃఖించిరి. అట్లే దైన్యము కల ఆ దక్షకన్యలు దీనుల రక్షించువాడు, బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షునితో ఈవిధముగా అనిరి.
దక్షకాన్య ఊచుః – దక్షకన్యలిట్లనిరి
స్వామి సౌభాగ్యలాభాయ త్వముక్తోస్మభిరేవ చ।
సౌభాగ్యమస్తు నస్తాత గత: స్వామి గుణాన్వితః ॥
స్థితే చక్షుషి హే తాత దృష్టం ధ్వాంతమయం జగత్ ।
విజ్ఞాతమధునాస్త్రీణాం పతిదేవ హి లోచనం ॥
పతిదేవ గ స్త్రీణాం పతిః ప్రాణాశ్చ సంపద: ।
ధర్మార్థ కామమోక్షాణాం హేతుః సేతుర్బవార్ణవే ॥
పతీర్నారాయ స్త్రీణాం వ్రతం ధర్మ; సనాతనః ।
సర్వం కర్మ వృథా తాసాం స్వామీనాం విముఖాశ్చ యాః ॥
స్నానం చ సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దక్షిణా ।
సర్వదానాని పుణ్యానీ వ్రతానీ నియమాశ్చ యే ॥
దేవార్చనం చానశనం సర్వాణి చ తపాంసి చ ।
స్వామినః పాద సేవాయాః కళాం నార్హంతి షోడశీం ॥
సర్వేషాం బాంధవానాం చ ప్రియః పుత్రశ్చ యోషితాం ।
సః ఏవ స్వామినోoఽశశ్చ శతపుత్రాత్పరః సతిః ॥
అసద్వంశప్రసూతా యా సా ద్వేష్టి స్వామినం సదా ।
యస్యా మనశ్చలం దుష్టం సంతతం పరపూరుషే॥
పతితం రోగినాం దుష్టం నిర్ధనం గుణహీనకం ।
యువానం చైవ వృద్ధం వా భజేత్తం నత్యజేత్సతీ ॥
సగుణం నిర్గుణం వాపి ద్వేష్టి యా సంత్యజేత్పతిం !
పచ్యతే కాల సూత్రీ సా యావచ్చంద్ర దీవాకరౌ ॥
కీటైః శుకతుల్యైశ్చ భక్షితా సా దివానీశం ।
భుంక్తే మృతవసామాంసం పిబేన్మూత్రం చ తృష్ణయా ॥
గృధ్ర: కోటి సహస్రాణి శతజన్మాని ఘాకరః।
శ్వాపదః శతజన్మాని సాభవేద్బందుహా తతః ॥
తతో మానవజన్మానీ లభేచ్చత్పూర్వకర్మణః ।
విధవా ధనహీనా చ రోగయుక్తా భవేద్ద్రువం ॥
దేహి నః కాంతదానం చ కామపూరం విధేః సుత !
విధాత్రా సదృశస్త్యం చ పునః స్రష్టుం క్షమో జగత్ ॥
కన్యానాం వచనం శ్రుత్వా దక్షః శంకర సన్నిధిం ।
జగామ శంభుస్త్రం దృష్ట్యా సముత్థాయ ననామ సః ॥
దక్షస్తస్యాశిషం కృత్యా సమువాచ కృపానిధిం ।
తత్యాజ కోపం దుర్ధర్షో దృష్ట్యా చ ప్రణతం శివం ॥
తండ్రీ! భర్త్రు సౌభాగ్యము కలిగి ఉండుడని ఇంతకుముందు నీవే మమ్ములనాశీర్వదించితివి. ఇప్పుడు మంచి గుణములు కల మా భర్త మానుండి దూరమైనాడు, కళ్ళు ఉంటేనే ప్రపంచము చీకటిగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. ఆటే మాకు ఇప్పుడు భర్త యొక్క ప్రాధాన్యము తెలిసినది. స్త్రీలకు భర్త కంటివంటివాడు. అతడే ఆధారము, ప్రాణములు, సంపద. ఈ సంసారమనే సముద్రములో సేతువువంటివాడు. ధర్మర్థ కామ మోక్షములను చతుర్వర్గములు పొందుటకు భర్తయే కారణము. అతడే స్త్రీలకు నారాయణుడు. వ్రతము, సనాతన ధర్మము. భర్త అంటే పడనివారికి వారు చేసిన సమస్త కర్మములు వృథా కాగలవు. సమస్త పుణ్యతీర్థములలో చేసిన స్నానములు, సమస్తయజ్ఞములలో ఇచ్చిన దక్షిణలు, సమస్త దానములు, సమస్త పుణ్యములు, సమస్త వ్రతములు, అన్నీ విధములైన నీయమములు, భగవదర్చన, ఉపవాసదీక్షలు, అన్ని విధములైన తపస్సులు భర్త పాద సేవయొక్క పదునారవ కళకు సమాసము కావు. బంధువులందరికి ఇష్టమైనవాడు ఐన కుమారుడు భర్తయొక్క ఆంశస్వరూపము, అందువలన భర్త నూరుగురు పుత్రులకంటే గొప్పవాడు. మంచి కులములో పుట్టని స్త్రీ భర్తను ద్వేషించును. ఆమె మనస్సు ఎప్పుడు చంచలమై, పరపురుషుని యందు నిమగ్నమై యుండును. భర్త మంచివాడైనా, చెడ్డవాడైనా పతీతుడైనా, రోగియైనా, దుష్టుడైనా, ధనహీనుడైనా, యువకుడైనా, ముసలివాడైనా పతివ్రతయైన స్త్రీ అతనిని వదలివేయదు. అటువంటి భర్తను ఏ స్త్రీ అయితే ద్వేషించునో, వదలివేయునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంతవరకు నరకముననుండును. అచ్చట శునకములంత ఎత్తైన కీటకములు ఆమెను రాత్రింబగళ్ళు తినుచుండును. ఆమె చనిపోయిన వారి వసను, మాంసమును తింటూ దప్పిచే మూత్రము త్రాగును. తరువాత వేయికోట్ల జన్మలు గద్దగాను, వందజన్మలు పందిగాను, వందజన్మలు పులిగాను ఆతరువాత పూర్వసుకృతమువలన మానవ జన్మనెత్తినా విధవగానో, బీదస్త్రీగానో, రోగముతో బాధపడుతూనో ఉండును,
అందువలన బ్రహ్మ దేవుని పుత్రుడైన ఓతండ్రీ! నీవు మాకామమును దీర్చు భర్భదానమును చేయుము. నీవు బ్రహ్మదేవునివలె సృష్టించుటకు, రక్షించుటకు, మరల సృష్టించుటకు సమర్థుడవు. ఈవిధముగా తనను వేడుకొనుచున్న పుత్రికల మాటలు విని దక్షప్రజాపతి శంకరుని సన్నిధికేగెను. శంకరుడు దక్షుని చూడగానే లేచి నమస్కరించెను. దక్షుడు తనకన్నా వయస్సులో చిన్నవాడు, అల్లుడు ఐన శంకరునికి ఆశీస్సులిచ్చి, తన పూర్వకోపమును వదిలి పెట్టి తనకు నమస్కరిస్తున్న శివునితో ఈ విధముగా అనెను.
దేహి జామాతరం శంభో మదీయం ప్రాణవల్లభం ।
మత్సుతానాంచ ప్రాణానాం పరమేవ ప్రియం పతిం ॥
నచేద్దదాసి జామాతః మమ జామాతరం విభుం ।
దాస్యామి దారుణం శాపం తుభ్యం త్వం కేన ముచ్యసే ॥
దక్షస్య వచనం శ్రుత్వా తమువాచ కృపానిధిః ।
సుధాధికం చ వచనం బ్రహ్మాన్ శరణపంజరః ॥
ఓశంభూ! నాకు మిక్కిలి ప్రియమైన వాడు, నా పుత్రికలకు ప్రాణములకన్న మిన్నయైన వారి భర్త, నాఆల్లుడు ఐన చంద్రుని నాకిచ్చివేయుము. లేకపోయినచో నేను నీకు భయంకరమైన శాపము నిత్తును. ఎవరు కూడా దీనిని తప్పించలేరు. దక్షుని ఈ మాటలు కృపానిధి, శరణాగత రక్షకుడైన శంకరుడు విని ఆమృతముకంటె చల్లనైన మాటలు పల్కెను.
శివ ఉవాచ - శివుడిట్లు పల్కెను.
కరోషి భస్మసాచ్చేన్మాం దద్యా వా శాపమేవ చ ।
సాహం దాతుం సమర్థశ్చ చంద్రం చ శరణాగతం ॥
శివస్య వచనం శ్రుత్వా దక్షస్తం శపుముద్యతః ।
శివః సస్మార గోవిందం వీపన్మోక్షణకారణం ॥
ఏతస్మిన్నంతరే కృష్ణో వృద్ధ బ్రాహ్మణవేషధృక్ ।
సమాయయౌ తయోర్మూలం తౌ తం చ నమతుః క్రమాత్ ॥
దత్వా శుభాళిషం తొ స బ్రహ్మజ్యోతి: సనాతనః ।
ఉవాచ శంకరం పూర్వం పరిపూర్ణతమో ద్వీజ॥
దక్షుడా! నీవు నన్ను భస్మము చేసినా, లేక నాకు శాపము పెట్టినా శరణాగతుడైన చంద్రుని మాత్రము వదిలి పెట్టలేను, శివుని ఈ మాటలు విని దక్షుడు కోపముతో శపించబోయెను. శంకరుడప్పుడు ఆపదలనుండి తప్పించు విష్ణుమూర్తిని మనస్సులో తలచెను. అందువలన విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషమున శివదక్ష ప్రజాపతుల దగ్గరికి రాగా వారిద్దరు వృద్ధ బ్రాహ్మణ వేషమున నున్న గోవిందునికి నమస్కరించిరి, విష్ణుమూర్తి వారిరువురరకు శుభాశీస్సులొసగి శంకరునితో ఈ విధముగా ఆనెను.
శ్రీ భగవానువాచ - భగవంతుడైన హరి ఇట్లనెను.
న చాత్మనః ప్రియః కశ్చిత్ శర్వ సర్వేషు బంధుషు ।
ఆత్మానం రక్ష దక్షాయ దేహి చంద్రం సురేశ్వర ॥
తపస్వినాం వరః శాంతః త్వమేవ వైష్ణవాగ్రణీ: ।
సమః సర్వేషు జీవేషు హింసాక్రోధ వివర్జితః ॥
దక్షః క్రోధీ చ దుర్ధర్ష: తేజస్వీ బ్రహ్మణః సుతః ।
శిష్టా బిభేతి దుర్ధర్షం న దుర్ధర్షశ్చ కంచన ॥
నారాయణవచశ్శ్రుత్వా హసిల్వా శంకరః స్వయం !
ఉవాచ నీతిసారం చ నీతిబీజం పరాత్పరం ॥
శంకరుడా తనకంటే ప్రియమైన వస్తువు సమస్త బంధువు లయందెచ్చట కనిపించదు. అందువలన నిన్ను నీవు రక్షించుకోని చంద్రుని దక్షునికి ఇచ్చివేయుము, వీపు తపస్సు చేయువారీలో ఉత్తముడవు, శాంతుడు, విష్ణుభక్తులలో శ్రేష్టుడవు, హింస; కోపము వదలి సమస్త జీవులయందు సమానముగా ఉన్న వాడవు. దక్షుడు ముక్కోపి, దుష్టుడు, తేజస్పి, బ్రహ్మయొక్క పుత్రుడు. మంచివాడు చెడ్డవానికి భయపడును కాని చెడ్డవాడు ఆట్లు కాదుకదా! నారాయణుని యొక్క ఈ మాటలు విని శంకరుడు నవ్వుచు నీతిసారము నీతిబీజము ఐన మాటలీట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.
తపో దాస్యామి తేజశ్చ సర్వసిద్ధిం చ సంపదం ।
ప్రాణాంశ్చ న సమర్ధోహం ప్రదాతుం శరణాగతం ॥
యో దదాతి భయేనైవ ప్రపన్నం శరణాగతం !
తం చ ధర్మః పరిత్యజ్య యాతి శప్త్యా సుదారుణం ॥
సర్వం త్యక్తుం సమర్ధోఽహం న స్వధర్మం జగత్ర్పభో ।
య: స్వధర్మవిహీనశ్చ స చ సర్వబహిష్కృతః ॥
యశ్చధర్మం సదా రక్షేత్ ధర్మస్థం పరిరక్షతి ।
ధర్మం వేదేశ్వర త్వంచ కిం మాం బ్రూహి స్వమాయయా ॥
త్వం సర్వమాతా స్రష్టా చ హంతా చ పరిణామతః ।
త్వయి భక్తిర్దృడా యస్య తస్య కస్మాద్భయం భవేత్ ॥
శంకరస్య వచః శ్రుత్వా భగవాన్ సర్వభావవిత్ ।
చంద్రం చంద్రాద్వినిష్కృష్య దక్షాయ ప్రదదౌ హరిః ॥
ప్రతస్థావర్దచంద్రశ్చ నిర్వాధీః శివశేఖరే ।
నీజగ్రాహ పరం చంద్రం విష్ణుదత్తం ప్రజాపతిః ॥
యక్ష్మ గస్తం చ తం దృష్ట్యా దక్షిస్తుష్టావ మాధవం !
పక్షే పూర్ణం క్షతం పక్షే తం చకార హరిః స్వయం ॥
కృష్ణస్తేభ్యో వరం దత్వా జగామ స్వాలయం ద్విజి ।
దక్షశ్చంద్రం గృహిత్వా చ కన్యాభ్యః ప్రదదౌ పునః ॥
చంద్రస్తాశ్చ పరిప్రాప్య ఏజహార దీవానిశం ।
సమం దదర్శ తాః సర్వా: తత్ర్పభృత్యేవ కంపితః ॥
నేను నాతపఃఫలితమునిచ్చెదను. నాతేజస్సును, నాసర్వసిద్దులను, సంపదను, చివరకు ప్రాణములనైన ఇచ్చెదను కానీ శరణాగతుడైన వానిని వదలుకోలేను. ఎవరైతే భయపడి శరణాగతుడైనవానిని ఇతరులకిస్తారో వారిని ధర్మము భయంకరమైన శాపమునిచ్చి అతనిని వదలివేయును. నేను అన్నిటిని వదులుకొందును కానీ నా ధర్మమును మాత్రము వదలి పెట్టలేను. స్వధర్మమును వదలుకొనిన వాడు సర్వధర్మ బహిష్కృతుడు కాగలడు. ఎవరు తన ధర్మమును. ఎల్లప్పుడు రక్షించుకొనునో ఆతనినది సర్వదా రక్షించును. వేదేశ్వర ! నీవు నీమాయచే నాకు ధర్మవిరుద్ధమైన దానిని చెప్పుచున్నావు. నీవు అన్నిటికి కారకుడవు, సృష్టిచేయువాడవు, రక్షించువాడవు, నశింపచేయువాడవు. నీపై భక్తి ఎవనికి దృడముగానుండునో ఆతనికి భయమెక్కడిదీ. శంకరునిమాటలు సర్వభావములు తెలిపిన భగవంతుడు ఏవి శంకరుని శిరస్సుపై నున్న చంద్రుని నుండి చంద్రుని పేరు చేసి దక్షునకు ఇచ్చివేసెను. క్షయవ్యాధి రహితుడైన చంద్రుడు శివుని శిరస్సుపై నుండెను. వ్యాధి సహితుడైన చంద్రుని విష్ణుమూర్తి ఈయగా దక్షుడు సంతోషించి అతనిని స్తుతించెను. విష్ణుమూర్తి చంద్రుడు ఒక పక్షములో క్రమముగా సంపూర్ణుడగునట్లు, ఇంకొక పక్షములో క్షీణించునట్లు చేసి వారి కందరికి వరములిచ్చి తన గోలోకమునకు తిరిగిపోయెను. దక్షప్రజాపతి హరి తనకు ఇచ్చిన చంద్రుని తీసికొని తన కూతుళ్ళకు మరల అప్పగించెను. చంద్రుడు నాటినుండి తన భార్యలందరితో కలిసి మెలిసి తిరుగుచు అందరిపై సమాన దృష్టిలో ఉండెను.
ఇత్యేవం కథితం సర్వం కించిత్ సృష్టి క్రమం మునే ।
శ్రుతం చ గురువక్త్రేనపుష్కరేముని సంసధి॥
ఓ శౌనకమహర్షీ! ఈ విధముగా నాకు గురువైన వేదవ్యాసుడు పుష్కర క్షేత్రములో నున్న మునుల సభలో శ్రుష్ఠి క్రమమున కొంత భాగమును నీకు చెప్పితిని.
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే సౌతీ శౌనక సంవాదే బ్రహ్మ ఖండే నవమోఽధ్యాయ:।
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో సౌతి శౌనక సంవాదమను బ్రహ్మఖండమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 9 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
In order to fulfill the cosmic mandate of populating the universe after Maharshi Nārada's detachment, Maharshi Daksha produced sixty virtuous daughters through his ascetic vows and mind-born potencies. These noble daughters were given in sacred marriage to the great progenitor sages, including Maharshi Kashyapa, Maharshi Dharma, Maharshi Chandra, and Maharshi Angiras. Through these divine unions, an extraordinary variety of living entities was born into the material world, including the Devas, Asuras, Nagas, celestial musicians, birds, beasts, trees, and human beings, thereby expanding the intricate web of living entities across all continents, oceans, and subtle dimensional realms under the watchful direction of the Supreme Lord.