14 - మాలతి విష్ణుమూర్తుల సంవాదము

సౌతీరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను –

తత్ర స్థిత్వా క్షణం దేవా బ్రహ్మేశాన పురోగమా ।

యయుర్మారావతిమూలం పరం మంగళదాయకః ॥

మాలావతి సురాన్ దృష్ట్యా ప్రణనామ పతివ్రతా ।

రురోద కాంతం సంస్ధాప్య దేవానాం సన్నీధౌ మునే ॥

ఏతస్మిన్నంతరే తత్ర కశ్చిద్రాహ్మణబాలకః ।

ఆజగామ సురాణాం చ సభామతీమనోహరః॥

దండీ ఛత్రీ శుక్లవాసాః బీభ్రత్తిలకముజ్వలం ।

దీర్ఘపుస్తకహస్త్రశ్చ సప్రశాంతశ్చ సుస్మితః ॥

చందనోక్షితసర్వాంగః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా ।

సురాసంభాష్య తత్త్రైవ విస్మితాన్ విష్ణుమాయయా॥

తత్రోవాస సభామధ్యే తారామధ్యే యథా శశీ ।

ఉవాచ దేవావ్ సర్వాంశ్చ మాలతీం చ విచక్షణః ॥

బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు పాలసముద్రము యొక్క తీరములో కొంత సమయముండి మాలావతి ఉన్న ప్రదేశమునకు వెళ్ళిరి. మాలావతి దేవతలను చూచి నమస్కరించి తన భర్త శవమును దేవతల ముందుంచి ఏడ్వసాగిమ. ఆ సమయమున ఆతీమనోహరాకారుడు. చేతిలో దండమును, ఛత్రమును ధరించినవాడు అగు ఒక బ్రాహ్మణ బాలకుడు తెల్లని వస్త్రములను, ఉజ్వలమైన తిలకమును. చేతిలో తాళపత్ర గ్రంథమును ధరించి ప్రశాంతత, చిరునవ్వుతో కూడుకొనిన వాడై ఆ దేవతల సమీపమునకు వచ్చెను.

 ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రహ్మ తేజముతో ప్రకాశించుచు, విష్ణుమాయవలన విస్మయము చెందిన దేవతలనందరమ పలుకరించి చుక్కలమధ్య చంద్రుడున్నట్లు ఆ సభామధ్య భాగమున కూర్చుండి దేవతలతో, మాలావతీతో ఇట్లనెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను –

కథ మత్రసురాః సర్వే బ్రహ్మేశాన పురోగమాః ।

స్వయం విధాతా జగతాం స్రష్టా వైకేన కర్మణా ॥

 సర్వబ్రహ్మాండపంహర్తా శంభురత్ర స్వయం విభుః ।

ఆహో త్రిజగతాం పాక్షీ ధర్మో వై సర్వ కర్మణాం ॥

కథం రవిః కథం చంద్రః కథ మత్ర హుతాశనః ।

కథం కాలో మృత్యుకన్యా కథం వాఽత్ర యమాధయః ॥

హే మాలావతి తే క్రోడే కోటిశుష్కుతచో నఘే ।

 జీవితాయాః కథం మూలే యోషితశ్చ పుమాన్ శవః ॥

ఇత్యుకా తాంశ్చ తాం విప్రో విరరామ సభాస్థలే ।

మాలావతి తం ప్రణమ్య సమువాచ విచక్షణం ॥

 ఇక్కడ బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ప్రపంచములనన్నిటిని సృజించు విధాత, సమస్త బ్రహ్మాండములను సంహరించు శంకరుడు, ముల్లోకములకు పాక్షీ భూతుడైన ధర్మదేవత, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, కాలుడు, మృత్యుకన్య, యముడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ఓ మాలావతి వీఒడిలో మిక్కిలి శుష్కించిన శవమున్నది. ఇది ఎవరిదీ? బ్రతికియున్న స్త్రీయొక్క ఒడిలో పురుషుని శవమెందుకున్నది? అని ఆ బ్రాహ్మణుడనగా మాలావతి ఆతవికి నమస్కరించి ఇట్లనెను.

మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –

ఆనంద పూర్వకం వందే విప్రరూపం జనార్దనం ।

తుష్టా దేవా హరిస్తుష్టో యప్య పుష్ప జలేన చ ॥

ఆపధానం కురు విభో శోకార్తాయాః నివేదనే ।

సమా కృపా సతాం శశ్వత్ యోగ్యాయోగ్యే కృపావతాం ॥

ఉషబర్హణ భార్యాహిం కవ్యా చిత్రరథస్య చ ।

సర్వే మాలావతీం కృత్వా వదంతే విప్రపుంగవ ॥

దివ్యం లక్షయుగం రమ్యే స్థానే స్థానే మనోహరే ।

కృతాః స్వచ్ఛందతః క్రీడా చానేన స్వామినా సహ ॥

ప్రియే స్నేహో హి స్వాధీనాం యావానిపేంద్ర యోషితాం ।

సర్వశాస్త్రానుసారేణ జానాది త్వం విచక్షణ ॥

ఆకస్మాత్ బ్రహ్మణః శాపాత్ ప్రాణాంస్తత్యాజ మత్పతిః ।

దేవాసుద్దిశ్య వీలపే యథా జీవతి మత్పతిః ॥

స్వకార్యసాధనే సర్వే వ్యగ్రాశ్చ జగతీతలే ।

భావాభావం న జానంతో కేవలం స్వార్థతత్పరాః ॥

సుఖం దుఃఖం భయం శోకం సంతాపః కర్మణా నృణాం ।

ఐశ్వర్యం పరమానందో జన్మ మృత్యుశ్చ మోక్షణం ॥

దేవాశ్చ పర్వజవకాః దాతారః కర్మణాల ఫలం ।

కర్తారః కర్మవృక్షాణాం మూలచ్ఛేదం చ లీలయా ॥

న హి దేవాత్పరో బంధుః వ హి దేవాత్పరో బలీ ।

దయావావ్నహి దేవాచ్చ న చ దాతా తతః పరః ॥

పర్వాన్ దేవానహం యాచె పతిదానం మమేప్సితం ।

ధర్మార్థ కామమోక్షాణాం ఫలదాంశ్చ సురద్రుమాన్ ॥

యది దాస్యంతి దేవా మే కాంతదావం యథేప్సితం ।

భద్రం తదవ్యథా తేభ్యో దాస్యామి స్త్రీవధం ధ్రువం॥

శపిష్యామి చ సర్వాంశ్చ దారుణం దుర్నివారకం ।

దుర్శివార్యః సతీశాపః తపసా కేన వార్యతే ॥

ఇత్యుక్యా మాలతీ సాధ్వీ శోకార్తా సురపంసది ।

వీరరామ ద్విజశ్రేష్టస్తామువాచ చ శౌనకః ॥

బ్రాహ్మణ రూపియైన జనార్దమని సంతోషముగా నమస్కరించుచున్నాను. బ్రాహ్మణుని పూజించినచో శ్రీహరి, దేవలందరు సంతృప్తులైనట్లే భావించవచ్చును. శోకార్తనైన నా మాటలను శ్రద్ధగా ఆలకించుము. దయామూర్తులైన సజ్జనులు యోగ్యులపై అయోగ్యులపై సమానమైన కృప కలిగి ఉందురు.

నేను చిత్రరథుడను. గంధర్వునీ కూతురును. నా భర్త ఉపబృంహణుడనే గంధర్వరాజు. నమ్న మాలావతి అని పిలుతురు. నా భర్తతో కలిసి లక్ష దివ్యయుగములు సంతోషముగా క్రీడించితివి. పతివ్రతలైన స్త్రీలు తమ ప్రియునిపై పేహముతో మండుట సర్వశాస్త్ర సమ్మతము. అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు శాపమిచ్చుటవలన నాభర్త చనిపోయెను. అందువలన నా భర్త తీరిగి బ్రతుకవలెనని దేవతలనుద్దేశించి శోకించుచున్నాను.

ఈ ప్రపంచమున ప్రతివారు తమ పమలు సాధించుకొవ జూతురు. స్వార్థపరులు మంచి చెడులను గమనించక ప్రవర్తింతురు. మానవులు చేయు కర్మలవలన సుఖము, దుఃఖము, భయము, శోకము, సంతాపము, ఐశ్వర్యము, పరమానందము, జన్మ మృత్యువు, మోక్షము కలుగుచున్నవి.

దేవతలు సమస్త కర్మసలితములనిచ్చువారు. అట్లే కర్మ వృక్షములమ సమూలము నాశనము చేయుదురు. అట్టి దేవతల కన్న శ్రేష్టుడైన బంధుపు, బలవంతుడు, దయకలవాడు, దాత ఎవరు ఈ ప్రపంచమున లేరు. అందువలన నాకిష్టమైన వత దావము నిప్వుమనీ దేవతలను యాచించుచుద్ఘాను. వారు ధర్మర్థకామమోక్షములనే ఫలములనిచ్చు వృక్షములు.

దేవతలు నేను కోరుకుంటున్న ప్రతి దావము నొసగినచో వారికి మేలు జరుగును, లేనిచో స్త్రీవధ. చేసిన వారగుదురు. దేవతలకందరకు దుర్నివారణమైన శాపమువిత్తును. అని మాలతీ దుఃఖముచే విహ్వల అయి దేవతలముందు బ్రాహ్మణ కుమారునితో చెప్పగా. నాతడు మాలావతితో ఇట్లనెను.

బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను –

కర్మణాం ఫలదాతారో దేవాః సత్యం చ మాలతి ।

స పద్యః సుచిరేణైవ ధాన్యం కృషకవంపృణాం ॥

గృహే చ కృషకద్వారా క్షేత్ర ధాన్యం వపేత్సతి ।

తదంకురో భవేత్కాలే కాలే వృక్షః ఫలత్యసి ॥

కాలే సుపక్వం భవతి కాలే ప్రాప్నోతి తగ్దృహీ ।

ఏవం సర్వం సమున్నేయం చిరేణ కర్మణః ఫలం॥

ఆష్ఠీవపతి సంసారే గ్రహస్తో విష్ణుమాయయా ।

కాలే తదంకురో వృక్షః కాలే ప్రాప్నోతి తత్పలం ॥

పుణ్యవాన్ పుణ్యభూమౌ చ కరోతి సుచిరం తపః ।

తేషాం చ ఫలదాతారో దేవాః సత్యం నసంశయః ॥

 బ్రాహ్మణానాం ముఖే క్షేత్రే శ్రేష్ఠే నూషర ఏవచ ।

యో యజ్ఞహోతి భక్త్యాచ స తత్రాప్నోతి నిశ్చితం ॥

 వబలం నచ సౌందర్యం వైశ్వర్యం వ ధనం సుతః ।

నైన స్త్రీ న చ పత్కంతః కిం భవేత్తపసా వినా॥

 సేవతే ప్రకృతిం యోహి భక్త్యా జన్మని జన్మని ।

 స లభేత్పుందరీం కాంతాం వినీతాం చ గుణాన్వితాం ॥

ఓ మాలతీ! మానవులు కర్షకుడి వలన ఏవిధముగా ధావ్యమును పొందుచున్నారో ఆట్లే దేవతల ద్వారా కర్మ ఫలితములను పొందుచున్నారు. గృహస్థ కర్షకుని ద్వారా తన క్షేత్రములో ధాన్యమును విత్తగా ఆది ఆంకురమై, వృక్షమై ఫలములు కలిగి ఆ తరువాత వరీపూర్ణముగా పక్వమైన ఫలములు కలిగి గృహస్థుకు అనుభవయోగ్యమైనట్లు కర్మఫలము కూడ క్రమముగా పరీవక్వమై ఆమభయోగ్యమగుచున్నది.

గృహస్తు విష్ణుమూర్తి యొక్క మాయచే ఈ ప్రపంచమున ధాన్యపుగింజను విత్తినచో అది కొంత కాలమునకు మొలకెత్తి వృక్షమై ఫలవంతమైనప్పుడు ఆ ఫలమును అనుభవించుచున్గాడు. ఆట్లే పుణ్యవంతుడు పుణ్యభూమిపై చాలాకాలము తపస్సు చేసినచో దేవతలు తప్పక తత్పలమునీతురు. బ్రాహ్మణులమఃఖమందు, చక్కని క్షేత్రమందు ఆదరములో ఏది చేసిన ఆది చక్కగా ఫలితమునిచ్చుమ, తపస్సులేక బలము, సౌందర్యము, ఐశ్వర్యము, ధనము, సుతులు, భార్య, భర్త ఎవరు లభించరు.

ఎవరు ప్రకృతిని జన్మజన్మలందు భక్తి శ్రద్ధలతో ఆరాధింతురో ఆతడు వినయవంతురాలు, పగుణవంతురాలు, సుందరియైన భార్యను పొందును.

శ్రీయం చ నిశ్చలాం పుత్రం పౌత్రం భూమిం ధనం ప్రదాం ।

ప్రకృతేశ్చ నరెణైవ లభేద్బకోవలీలయా ॥

శివం శివస్వరూపం చ శివదం శివకారణం ।

జ్ఞానానందం మహాత్మాసం పరం మృత్యుంజయం పరం ॥

తమీశం సేవతే యోపా భక్త్యా జన్మని జన్మనీ ।

పుమాన్ ప్రాప్నోతి సత్కాంతాం కామినీ చాపి సత్పతిం ॥

విద్యాం జ్ఞాపం సుకవితార పుత్రం పౌత్రం పరాం శ్రీయం ।

విద్యామైశ్వర్యమానందం వరేణ బ్రహ్మణో నరః ॥

యో నరో భజతే భక్త్యా దీననాథం దినేశ్వరం ।

 విద్యామారోగ్యమానందం ధనం పుత్రం లభేత్ ధ్రువం ॥

 గణేశ్వరం యో భజతే దేవదేవం సనాతనం ।

పర్వాగ్రపూజ్యం పర్వేశం భక్త్యా జన్మని జన్మని ॥

 విఘ్ననాశో భవేత్తవ్య స్వప్నే జాగరణేనిశం ।

పరమానందమైశ్వర్యం పుత్రం పౌత్రం ధనం ప్రజాః ॥

 జ్ఞానం విద్యాం సుకవితార లభతే ఆద్వరేణచ ।

భజతే యో హే విష్ణుం చ లక్ష్మీకాంతం సురేశ్వరం ॥

వరార్థి చేల్లభేత్సర్వం నీర్వాణ మన్యథా ధ్రువం ।

శాంతం విషేవ్య పాతారం సత్యం సత్యం లభేన్నరః ॥

సర్వం తపః సర్వధర్మం యశః కీర్తిమమత్తమాం ।

విష్ణుం విషేవ్య పర్వతం యో మూడో లభతే వరం ॥

విడంబితో విధాత్రా మోహితో విష్ణుమాయయా ।

మాయా నారాయణీశావా పర్వప్రకృతీరేశ్వరీ ॥

సా కృపాం కురుతే యం చ విష్ణుమంత్రం దదాతి తం।

ధర్మం యో భజతే ధర్మీ సర్వధర్మం లభేత్ ధ్రువం ॥

ఇహలోకే సుఖం భుక్య యాతి విష్ణోః పరం పదం ।

యో యం దేవం భజేద్భక్త్యా స చాదౌ లభతే చ తం ॥

 కాలే పశ్చాత్తేన సార్థం పరం విష్ణోః పదం లభేత్ ।

ప్రకృతియొక్క అనుగ్రహమువలన స్థిరమైన సంపదను పుత్రులను, మనుమలను, భూమిని, ధనమును పొందును.

శివుడు, మంగళస్వరూపుడు, మంగళములను ఇచ్చువాడు, తత్కారణుడు, జ్ఞానానంద స్వరూపుడు, మహాత్ముడు, మృత్యుంజయుడు అగు ఈశ్వరుని ఎవరు జన్మజన్మలనుండి సేవింతురో. వాడు పురుషుడైనచో మంచి భార్యను, ప్రీయైనచో మంచి భర్తను పొందును. ఇంక విద్యను, జ్ఞానమును, మంచి కవిత చెప్పగలశక్తినీ, పుత్రపౌత్రులను, ఆంతులేని సంపదను, బలమును, పరాక్రమమును హరుని అనుగ్రహమున పొందును.

బ్రహ్మదేవుని సేవించినచో చక్కని సంతానమును, సంపదను, విద్యను, ఐశ్వర్యమును, ఆనందమును అతని ఆమగ్రహమున పొందును.

సూర్యుని పూజించినచో విద్య, ఆరోగ్యము, ఆనందము, ధనము, పుత్రులు కలుగుదురు.

గణేశ్వరుని పూజించినచో సర్వాగ్యపూజ, ఎల్లప్పుడు విఘ్నములు లేకుండుట, పరమానందము, ఐశ్వర్యము, పుత్ర పౌత్రాదులు, జ్ఞానము, విద్య, సుకవీత మొదలగునవి.. లభించును.

సురేశ్వరుడు, లక్ష్మీపతి యగు విష్ణుమూర్తినీ భక్తితో పూజించినచో కోరిన కోరికలన్నీ సిద్ధించును. ఏకోరికను కోరనిచో ముక్తి తప్పక లభించగలదు. శాంత స్వరూపుడు, సర్వ రక్షకుడగు విష్ణుమూర్తిని పూజించి సమస్త ధర్మములను గొప్పనైన కీర్తినీ వరముగా పొందినవాడు మూర్తుడు. ఆతడు బ్రహ్మదేవునిచే విష్ణుమాయచే మోహితుడగుచున్నాడు.

పర్వప్రకృతిస్వరూపిణి, ఈశ్వరియైన విష్ణుమాయ ఎవరిని అనుగ్రహించునో అతనికి విష్ణుమంత్రమును ఉపదేశించును.

ధర్మదేవతను సేవించినవాడు సమస్త ధర్మాచరణవలన కలుగు ఫలితమును, ఇహలోకసుఖముమ, ఆటుపిమ్మట వైకుంఠమును పొందును.

ఆయా దేవతలను భక్తితో సేవించి, తొలుత తదనుగ్రహమును పొందును. ఆయా దేవతాసారూప్యముమ కూడ పొంది కాలక్రమమున ఆయా దేవతలతో పాటు విష్ణమూర్తి యొక్క సాన్నిధ్యమును పొందును.

శ్రీకృష్ణ భజతే యోపా నిర్గుణం ప్రకృతేః పరం ॥

బ్రహ్మ విష్ణు శివాదీనాం సేవ్యం బీజం పరాత్పరం ।

అక్షరం పరమం బ్రహ్మ భగవంతం సనాతనం ॥

సాకారం ద నిరాకారం జ్యోతిఃస్వేచ్ఛామయం విభుం ।

సర్వాధారం చ పర్వేశం పరమానందమీశ్వరం ॥

నిర్లిప్తం పాక్షిరూపం చ భక్తానుగ్రహవిగ్రహం ।

 జీవన్ముక్తః స సత్యం హి వ వరం లభతే సుధీః ॥

స పర్వం మన్యతే తుచ్ఛం సాలోక్యాది చతుష్టయం ।

బ్రహ్మత్వమమరత్వం వా మోక్షం యతుచ్ఛవత్పతి ॥

ఐశ్వర్యం లోష్టతుల్యం చ నశ్వరం చైవ మన్యతే ।

ఇంద్రత్వం చ మనుత్వం చ చిరంజీవిత్వమేవ వా ॥

జలబుద్బుదపల్ బుధ్యా చాతీతుచ్చం న గణ్యతే ।

స్వప్నే జాగరణేవాణి శశ్వతేవాం చ వాంఛతి ॥

దాస్యం వీనా న యాచేత శ్రీకృష్ణస్య పదం పరం ।

తత్పదాబ్జె దృణాం భక్తిం లబ్ద్వా పూర్ణో నిరంతరం ॥ 

పరిపూర్ణతమం బ్రహ్మ నిషేవ్యం సుస్థిరః సదా ।

ఆత్మనః కులకోటం చ శతం మాతామహాస్య చ ॥

 శ్వశురస్య శతం పూర్వం ఉద్దృత్య చావలీలయా ।

దాహం దాసీం ప్రసూం భార్యాం పుత్రాదపి పరం శతం ॥

ఉద్ధరేత్ కృష్ణభక్తశ్చ గోలోకం యాతి నిశ్చితం ।

నిర్గుణస్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, బ్రహ్మాదులచే సేవింపబడువాడు, సర్వకారణుడు, పరాత్పరుడు, క్షరుడు కానివాడు (వాశనములేక వ్యష్టి సమష్టి రూపమున నున్న పంప్రకృతి) పరబ్రహ్మస్వరూపుడు, భగవంతుడు, సనాతనుడు, పాకార నిరాకార స్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, స్వేచ్ఛామయుడు, అన్నిటికి ఆధారభూతుడు, సర్వేశుడు, పరమానందరూపుడు, ఈశ్వరుడు, విర్లిపుడు, సర్వసాక్షి, భక్తులవనుగ్రహించు శ్రీకృష్ణుని సేవించు విద్వాంసుడు ఆ భగవంతునినుండి ఎట్టి పరమును కోరడు. అతడే జీవమ్మక్తుడు. అతడు సాలోక్య పారూప్య, పామీప్య, సాయుజ్యములను చతుర్విధముక్తులను తుచ్చముగా భావించి ఐశ్వర్యమును మట్టిగడ్డతో సమానముగ అశాశ్వతముగా తలచుము. అట్లే ఇంద్రత్వమును, మమత్వమును, చిరంజీవిత్వమును, నీటిబుడగవలె ఆతీ తుచ్ఛముగా తలంచును.

ఆతడు కలలోనైనా జాగ్రదావస్థలోనూ ఎల్లప్పుడు శ్రీహరి పేవనే కోరుకొనును. శ్రీహరి దాస్యము తప్ప ఇతరమైన దానినెప్పుడు కోరుకొవడు. శ్రీకృష్ణపదాబ్జములయందు దృఢమైన భక్తిని కలిగి పరిపూర్ణమైన పరబ్రహ్మమును సేవించుమ. అట్టివాడు తన వంశమునందు పుట్టిన కోటిమందిని, మాతామహుని ఇంటికి, మామగారి ఇంటికి చెందిన వందతరములను, తన భార్యా పుత్రులను, ఇంటిలోని దాస దాసీజనమును అందరిని ఉద్ధరించి గోలోకమునకు తప్పక వెళ్ళును.

యావద్గర్భే వసేత్కామీ తావతి యమయాతనా ॥

తావద్ఘీ చ భోగార్థీ యావత్కృష్ణ న సేవతే ।

గురువక్త్రా ద్వీష్ణుమంత్రో యస్యకర్ణే ప్రవిశ్యతి ॥

యమస్తల్లిఖనం దూరం కరోతి తత్క్షణం భీయా ।

మధుపర్కాదికం బ్రహ్మా పురైన తన్నియోజయేత్॥

అహో విలంఘ్య మల్లోకం మార్గేణానేన యాస్యత ।

 తస్య వై నిష్కృతిర్నాప్తి కల్పకోటిశతైరపి ॥

దురితానీ చ భీతాని  కోటి జన్మ కృతాని చ ।

తం విహాయ పలాయం వైనతేయ మివోరగాః ॥

పురాతనం కృతం కర్మ యద్యత్తస్య శుభాశుభం ।

చినత్తి కృషశ్చక్రేణ తీక్షణ ధారేణ సతతం ॥

తం విహాయ జరామృత్యుర్యాతి చక్రబియా సతి ।

అన్యథా శతఖండం తాం కురుతే చ సుదర్శనః ॥

నిఃశంకో యాతి గోలోకం విహాయ మానవీం తనుం ।

గత్వా దివ్యాం తనుం ధృత్వా శ్రీకృష్ణం సేవతే సదా ॥

యావత్ కృష్ణో హి గోలోకే తావద్భక్తో వసేత్సదా ।

 నిమేషం మన్యతే దాసో వశ్వరం బ్రహ్మణ్ వయః ॥

శ్రీకృష్ణుని భజించనంతవరకు గర్భవాపము, యమయాతనలు, గృహస్థుగా ఉండుట, భోగములనర్జించుట అమనవి ఉండును. ఆచార్యుని ద్వారా విష్ణుమంత్రం ఎవరి చెవిలో పడునో ఆతని నోసటిరాతను భయములో యముడు దూరము చేయును. బ్రహ్మదేవుడు ముందుగనే అతని గురించి మధుపర్కాదికమును సిద్దము చేయును, ఇంకన అతడు బ్రహ్మయొక్క కళ్ళముందే గోలోకమునకు వెళ్ళుటను గమవీంచీ ఇతడు లోకమును దాటి పోవుచున్నాడని బాధపడును.

ఆ శ్రీకృష్ణభక్తునకు నూరుకోట్ల కల్పములకైనా ప్రాయశ్చిత్తముయొక్క అవసరముండదు. కోటి జన్మలలో చేసిన పాపములైనా గరుత్మంతుని చూచిన సర్పములవలె వెంటనే పారిపోగలవు, పూర్వజన్మలలో చేసిన శుభాశుభకర్మలను శ్రీకృష్ణుడు తన చక్రధారలచే చీల్చును. జరామృత్యువులు శ్రీకృష్ణుని చక్రమునకు భయపడిపోవును. లేనిచో సుదర్శన చక్రము వాటిని శతఖండములుగా చేయును. ఆభక్తుడు మానవశరీరమును వదలి దివ్య శరీరమును ధరించి శ్రీకృష్ణుని సేవించుటకు గోలోకమునకు వెళ్ళును. శ్రీకృష్ణుడు ఎంతవరకు గోలోకమున ఉండునో శ్రీకృష్ణభక్తుడు అచ్చట ఆంతవరకుండును. అతడు బ్రహ్మ దేవుని వయస్పును క్షణికమైనదని తలచుసు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖండే సౌతి శౌనకసంవాదే విష్ణుమాలావతీ సంవాదో నామ చతుర్దశోఽధ్యాయః ।

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున విష్ణమాలావతీ సంవాదమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.