శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
19 – వామనావతారము - వామనుడు బలిని మూడు అడుగుల భూమిని కోరుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విరోచన పుత్రుడగు బలి ఈ విధముగా ధర్మబద్ధము, ప్రియము, సత్యము అగు వాక్కును పలికెను. ఆ మాటను విన్న వామన భగవానుడు సంతోషించి ఆయనను అభినందిస్తూ ఇట్లు పలికెను.
ఓ తుంహారాజా! నీవు పలికిన ఈ మాట సత్యము, ప్రియము, ధర్మ జధము. అది నీకు కీర్తిని కలిగించును. నీకు పరలోకసాధనము విషయ పులో భృగువంశీయులు మాత్రమే గాక, కులవృద్ధుడు మరియు ప్రస తమ్ముడు ఆకు తాతగారు (ప్రహ్లాదుడు) ప్రమాణము (అనగా, వారి యాదే శము నీకు శిరోధార్యము).
ఈ (మీ) కులమునందు మాటను ఇచ్చి తిరస్కరించే ధైర్యహీనం డైన త! నాని, వేదవేత్తకు దానమును చేయని లోభియగు వ్యక్తిగాని ఎవ్వరూ ఊ లేరు.
దానమును చేసే సమయములో యాచకుడు కోరగా ముఖమును వెనుకకు తిప్పుకున్న స్వాభిమానరహితులైన రాజులు గాని, యుద్ధము సకు కాలు దువ్వే శత్రువునకు వెన్ను చూపే అభిమానరహితులైన రాజులు గాని మీ వంశములో పుట్టలేదు. మీ వంశములో ప్రహ్లాదుడు, ఆకాశమునం దలి చంద్రుడు వలె, స్వచ్ఛమైన కీర్తితో ప్రకాశించుచున్నాడు.
మీ వంశములో పుట్టిన హిరణ్యాక్షుడు దిగ్విజయము నిమిత్తముగా గదను చేతబట్టి ఈ భూమినంతనూ ఒంటరిగా సంచరించెను. ఆయన ముందు నిలబడి యుద్ధము చేయువాడు ఆయనకు తారసిల్లలేదు.
విష్ణువు భూమిని పైకి తీసుకువచ్చుచుండగా హిరణ్యాక్షుడు వచ్చి ఆయన పై దండెత్తెను. అపుడాయన కష్టము మీద ఆతనిని జయించెను. అయిననూ, ఆతడు చూపించిన అధికమగు పరాక్రమమును తరువాత గుర్తు చేసుకొని విష్ణువు తాను విజేతనని తలపోయలేదు.
హిరణ్యాక్షుని వధను గురించి విని, పోనీ సోదరుడుగు హిరణ్యకశి పుడు కోపించెను. ఆతడు తన సోదరుని చంపినవానిని చంపుటకై శ్రీహరి నివాసము (వైకుంఠము) నకు వెళ్లాను.
ఏ కాలమునందు ఏమి చేయవలెనో విష్ణువునకు బాగా తెలియు ను.ఆయన మాయావులలో అగ్రేసరుడు. శూలమును చేతబట్టి మృత్యువు వలే తన మీదకు వచ్చుచున్న ఆ హిరణ్యకశిపుని చూచి ఆయన ఇట్లు తల పో సెను.
ప్రాణధారులు ఎక్కడకు వెళితే అక్కడకు మృత్యువు వెంటాడును. అదే విధముగా నేను ఎక్కడకు వెళ్లినా, ఈతడు నన్ను వెంటాడును. కాని, ఈతడు బహిర్ముఖుడు గనుక, నేనీతని హృదయములో ప్రవేశించెదను.(అనగా, ఈతడు నన్ను కనుగొనలేడు).
ఓ రాక్షసరాజా! భయముతో నిండిన మనస్సు గల ఆ శ్రీహరి ఈ . విధముగా నిశ్చయించుకొనెను. ఆయన మీదకు పరుగెత్తుచున్న శత్రువు యొక్క దేహములో ఉచ్చ్వాసనిశ్శ్వాసలు జరిగే వాని ముక్కుకుండా సూక్ష్మరూపముగా . లోపల ప్రవేశించి, శ్వాసవాయువుచే అంతర్షితుడై యుండెను.
వీరుడగు ఆ హిరణ్యకశిపుడు శూన్యముగానున్న ఆ విష్ణువు యొక్క నివాసమును అంతటా వెదికెను. అయిననూ, ఆతనికి విష్ణువు కాన రాలేదు. ఆతడు కోపముతో నాదమును చేసెను. అతడు భూలోకమును, స్వర్గలోకమును, అంతరిక్షమును, దిక్కులను, పాతాళాది లోకములను, సముద్రములను విష్ణువు కొరకు వెదికెను. అయిననూ, ఆతడు విష్ణువును కనుగోనలేక పోయెను.
హిరణ్యకశిపునకు విష్ణువు కనబడలేదు. అపుడాతడు - ఇట్లు పలి కెను -- నేను ఈ జగత్తును వెదికితిని. నా సోదరుని చంపిన విష్ణువు నిశ్చ యముగా వెనుకకు తిరిగి రాని స్థితిని, అనగా మృత్యువును, పొందినాడు.
ఈ లోకములో దేహాభిమానము గలవారలకు నిరంతరముగా కొన సొగే వైరము కూడ మరణము వరకు మాత్రమే ఉండును. కోపము అజ్ఞాన మునుండి పుట్టి, దేహమునందు నేను అనే అభిమానముచే వర్ధిల్ల జేయబ డును,
నీ తండ్రి, ప్రహ్లాదుని పుత్రుడు అగు వీరోచనుడు బ్రాహ్మణుల యందు ప్రీతి గలవాడు. దేవతలు బ్రాహ్మణుల వేషములో వచ్చి ఆయ నను ఆయువును దానము చేయుమని యాచించిరి. వారు బ్రాహ్మణుల వేషములోనున్న దేవతలని ఆయనకు తెలియును. అయిననూ, ఆయన వారికి తన ఆయుర్దాయమును దానముగా ఇచ్చెను.
గృహష్ఠులైన బ్రాహ్మణులు (శుక్రాచార్యులు మొదలగువారు), పూర్వీకులు (ప్రహ్లాదుడు మొదలగువారు), గొప్ప కీర్తి గల ఇతరశూరులు ఆచరించిన ధర్మములను నీవు ఆచరించితివి.
ఓ రాక్షసరాజా! నీవు వరములనిచ్చువారిలో శ్రేష్ఠుడవు. కావుననే, నేను నీనుండి కొద్దిగా భూమిని కోరుచున్నాను. నా కాలితో కొలువబడే మూడు అడుగుల భూమిని నాకు ఇమ్ము,
ఓ రాజా! జగన్నాథుడవగు నీవు దాతవు. అయిననూ, నేను నీనుండి ఇంతకు మించి ఇంకోటి కోరను. ఎందుకంటే, ఎంతవరకు ప్రయో జనమో అంతవరకే ప్రతిగ్రహము చేసే వివేకి ప్రతిగ్రహ దోషమును పొంద.
బలి ఇట్లు పలికెను --- ఓ బ్రాహ్మణ బాలకా! ఆహా! నీ మాటలు పెద్దలు ప్రశంసించ దగ్గవి. కాని, పిల్లవాడవగు నీ బుద్ధి అజ్ఞానుల బట్టియే. ఎందుకంటే, నీకు నీ ప్రయోజనము గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలియదు.
నేను ముల్లోకములకు ఏకచ్ఛత్రాధిపతిని. ఒక ద్వీపము (ఖండ ము) ను ఇచ్చే శక్తి నాకు గలదు. నన్ను నీవు నీ మాటలతో ప్రసన్నుని చేసి తివి. అట్టి నీవు నన్ను మూడు అడుగులను కోరుచున్నావు. నీకు తెలివితేటలు లేవు.
ఓ బ్రహ్మచారీ! ఒకసారి నన్ను యాచించిన వ్యక్తి ఇంకోసారి యాచన కొరకు వెళ్లుట తగదు. కావున, నీవు నానుండి బ్రదుకు దెరువునకు సరిపడే భూమిని యథేచ్ఛగా స్వీకరించుము.
శ్రీ వామన భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! ముల్లోక ములలో ఎన్ని మిక్కిలి ప్రియమగు భోగ్యవస్తువులు గలవో, అవి అన్నీ కలిసి కూడ ఇంద్రియజంగము లేనివానియొక్క కామనలను పరిపూర్తి చేయుటకు చాలవు.
మూడు అడుగులతో సంతోషమును చెందనివానికి తొమ్మిది దేశ ములతో కూడియున్న జంబూద్వీపము (ఆసియా ఖండము) నంతనూ ఇచ్చివనూ సంతుష్ఠిని చెందడు. ఎందుకంటే, అప్పటికి ఏడు గొప్ప ద్వీప ములను పొందాలనే కోరిక వానికి ఉదయించును.
వేనపుత్రుడగు పృథువు, గయుడు, ప్రియవ్రతుడు మొదలగు చక్ర వర్తులు ఏడు ద్వీపములకు అధిపతులు. అయిననూ, వారు సంపదలపై మరియు భోగములపై ఉండే పేరాసయొక్క అంతమును చేరలేకపోయి రని మేము వినియున్నాము.
ఈశ్వరేచ్చచే అనుకోకుండా లభించినదానితో సంతోషించే వ్యక్తి సుఖముగా జీవించును. మనస్సు, ఇంద్రియములు, దేహములపై నియం. త్రణ లేని వ్యక్తి ముల్లోకములు లభించినా సంతోషించడు. వానికి సుఖము ఉండదు.
అర్థ (సంపదలు) కామము (భోగము) లయెడల సంతోషము లేకుండుట అనే ఈ లక్షణము వ్యక్తిని సంసారము (సుఖదుఃఖప్రవాహము, జననమరణప్రవాహము) లోనికి నెట్టివేయును. ఈశ్వరేచ్చనే అనుకోకుండా లభించినదానితో సంతోషించుట మోక్షమునకు దారి తీయునని మహా త్ములు చెప్పెదరు.
ఈశ్వరేచ్చచే అనుకోకుండా లభించినదానితో సంతోషించే వేదవే త్తకు తేజస్సు వర్ధిల్లును. సంతోషము లేనిచో అదే తేజస్సు, నీళ్లు పోసిన అగ్నివలె, చల్లారిపోవును.
అందువలన, నీవు వరములనిచ్చువారిలో శ్రేష్ఠుడవే అయిననూ, సీనుండి మూడు అడుగులను మాత్రమే నేను కోరుచున్నాను. అంతమా త్రము చేతనే నేను సంసిద్దుడనగుదును. అవసరమున్నంత వరకు మాత్రమే ధనమును ప్రోగుచేయవలెను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వామనుడు ఇట్లు పలుకగా, బలి చక్రవర్తి నవ్వి, నీ కోరికకు తగ్గట్లుగనే స్వీకరించుము, అని పలికెను. అపుడాయన వామనునకు భూమిని దానము చేయుటకై నీటి పాత్రను చేతి లోనికి తీసుకొనెను.
శుక్రాచార్యుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు, వామనరూపములోనున్న విష్ణువు ఏమి చేయగోరెనో ఆయనకు ఎరుకయే. రాక్షస రాజగు బలిచక్రవర్తి విష్ణువునకు భూమిని ఈయబోవుచుండెను. అపుడు శుక్రుడు తన శిష్యు డైన బలితో ఇట్లనెను.
శుక్రాచార్యుడిట్లు పలికెను --- విరోచనపుత్రుడవగు ఓ బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తుగా వినాశరహితుడగు విష్ణుభగవానుడు. ఈతడు దేవ తల కార్యమును సంపాదించుటకై కశ్యపునకు అదితియందు పుట్టినవాడు.
నీవు ఆపదను గుర్తించకుండా వీనికి మాటను ఇచ్చితివి. నీవు చేసిన పని రాక్షసులకు హితకరమగునని నేను తలచుట లేదు. రాక్షసులకు పెద్ద అన్యాయము (దుఃఖ హేతువు) వచ్చి పడినది.
ఈతడు కపట బ్రహ్మచారి వేషములోనున్న శ్రీహరి. ఈతడు నీ స్థానమును, అధికారమును, సంపదను, తేజస్సును, ప్రఖ్యాతమైన కీర్తిని లాగుకోని ఇంద్రునకు కట్టి పెట్టగలడు.
ఓ తెలివి తక్కువ వాడా! ఈతడు జగత్తే దేహముగా గల శ్రీహరి. ఈతడు మూడు అడుగులలో జగత్తునంతను అతిక్రమించగలడు. నీకు ఉన్నది అంతా విష్ణువునకు ఇచ్చివేసినచో, నీవు ఎట్లు బ్రదికెదవు?
సర్వవ్యాపియగు ఈ శ్రీహరి ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో స్వర్గమును, తన పెద్ద దేహముతో అంతరిక్షమును అతిక్రమించి వేయును. అప్పుడు మూడవ అడుగుతో కొలిచి ఈయవలసిన దానిని ఎక్క డనుండి తెచ్చేదవు?.
వాగ్దానము చేసిన దానిని ఇచ్చే సామర్థ్యము నీకు లేదు. కావున, నీవు ఇచ్చిన మాటను నిలుపుకోని కారణముగా నరకమును పొందెదవని నా అభిప్రాయము.
ఏ దానముచే దాతయొక్క బ్రదుకు దెరువు ఆపదలో పడునో, అట్టి దానమును మహాత్ములు మెచ్చుకోరు. ఎందుకంటే, బ్రదుకు దెరువు గల వానికి మాత్రమే దానము, యజ్ఞము, తపస్సులు సంభవమగును.
సంపదలో కొంత ధర్మమునకు, కొంత కీర్తి ప్రతిష్ఠల కొరకు, కొంత భోగమునకు ఖర్చు పెట్టి, కొంత ధనము వర్ధిల్లుటకు పెట్టుబడి పెట్టి, కొంత తనవారికి ఈయవలెను. ఇట్లు సంపదను అయిదు విధములుగా విభాగము చేసి వినియోగించువాడు ఇహపరములలో సుఖమును పొందును.
ఓ రాక్షసశ్రేష్ఠా! ఈ (మాటను నిలబెట్టుకొనే) విషయములో ఋగ్వేదద్రష్టలగు మహర్షులు గానము చేసిన విషయమును వినుము. ఇచ్చిన మాటకు సరే అని అంగీకారమును తెలిపినచో అది సత్యమగును. ఇచ్చిన మాటను కాదు అని నిరాకరించినచో అది అసత్యము అగును.
దేహేంద్రియమనస్సంఘాతమనే చెట్టునకు సత్యము (ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట) పుష్పము మరియు ఫలమువంటిదని తెలియన లేనని ఋగ్వేదము చెప్పుచున్నది. కానీ, ఆ చెట్టే జీవించి లేనిచో, పువ్వు కాయ ఉండవు గదా! కావున, అసత్యము (ఇచ్చిన మాటను తప్పుట) చేనైననూ దేహేంద్రియమనస్సంఘాతమనే చెట్టును నిలబెట్టుకొనవలెను.
ఈ విషయములో ఒక సంగతిని గమనించవలెను. చెట్టుయొక్క తల్లివేరును పెరికివేసినచో, ఆ చెట్టు తొందరలో ఎండిపోయి కూలిపోవును. అదే విధముగా, ఇచ్చిన మాటను కాదనే - అసత్యమును, పట్టుకోనిచో, దేహేంద్రియమనస్సంఘాతమే నశించును. సందేహము లేదు.
ఓమితి సత్యం నేత్యనృతం తదేతత్పుష్పం ఫలం వాచో యత్సత్యం స హేశ్వరో యశస్వీ కల్యాణకీర్తిర్భవితా పుష్పం హి ఫలం వాచస్పత్యం వదత్యథైతన్మూలం వాచో యదనృతం తద్యథా వృక్ష ఆవిర్మూలశ్శుష్యతి స ఉద్వర్తత ఏవమేవానృతం వదన్నావిర్మూలమాత్మానం కరోతి న శుష్యతి స ఉద్వర్తతే తస్మాదనృతం న పదేద్దయేత త్వేతేన/ అనే ఋగ్వేదవాక్యములకు పై శ్లోకములు వ్యాఖ్యానము.
సరే ఇస్తాను, అనే మాటయే వ్యక్తియొక్క సంపదను దూరము చేసి, వానిని ధనహీనునిగా చేసి తీరును. కావున, ఇస్తాను సరే అనే కొంచెము పలుకును పలికిన వ్యక్తి నిశ్చయముగా దరిద్రుడగును. సర్వమును ఇస్తానని యాచకుని యెదుట పలికిన వ్యక్తి తన సుఖమును సంపా దించుకొనుటలో అసమర్థుడగును.
పరాగ్వా ఏతద్రిక్తమక్షరం యదేతదోమితి తద్యత్కించోమిత్యాహా త్రైవాస్మై తద్రిచ్యతే స యత్సర్వమోంకుర్యాదాత్మానం స కామేభ్యో నాలం స్యాత్!
అనే మంత్రమునకు పై శ్లోకము వ్యాఖ్యానము. రిక్తమ్ అనే మంత్రములోని పదమునకు అపూర్ణమ్ అనే శ్లోకములోని పదము వివరణము.
అందువలన, నేను ఇస్తానని అనలేదు అని అసత్యమును పలికే వ్యక్తి సంపదతో నిండుగా ఉండును. పైగా, ఆతని ఈ పలుకులు సంపదను ఆతని వైపునకు ఆకర్షించును. కాని, ఇట్లు అన్ని సందర్భములలో అన్ని వస్తువుల విషయములో అసత్యమును చెప్పు వ్యక్తి అపకీర్తిని పొందును. అట్టివాడు గాలిని పీల్చుచున్ననూ మరణించినవానితో సమానము (కావున, అట్లు చేయరాదు).
అథ్లెతత్పూర్ణమభ్యాత్మం యన్నేతి స యత్సర్వం నేతి బ్రూయా త్పాపికాఽస్య కీర్తిర్జాయేత సైనం తత్రైవ హన్యాత్! అని ఋగ్వేదశ్రుతి.
యువతిని ప్రసన్నము చేసుకొనే సందర్భము, పరిహాసము, వివాహము జరి గేట్లు చేయుట, బ్రదుకు దెరువును నిలబెట్టుకొనుట, ప్రాణములకు సంకటము ఏర్పడిన పరిస్థితి, గోవులకు బ్రాహ్మణులకు హితమును చేసే సందర్భము, హింసను నివారించే సందర్భము -- ఈ సందర్భము లలో అసత్యము నిందనీయము కాదు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో వామనుడు బలిని మూడు అడుగుల భూమిని అడుగుటను వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).
