శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
13 - రాబోయే మన్వంతరముల వర్ణనము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సూర్యదేవుని పుత్రుడు శ్రాద్ధదే వుడు అని ప్రసిద్ధి గాంచినవాడు ఇప్పుడు ఏడవ మనువుగా ఉన్నాడు. ఆయన సంతానమును గురించి నేను చేప్పెదను. వినుము.
శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! ఇక్ష్వాకువు, నభగుడు, ధృష్ణుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, పృష ధ్రుడు, వసుమంతుడు అనే పదిమంది వైవస్వత మనువుయొక్క పుత్రులు అని మహాత్ములు చెప్పెదరు.
ఓ మహారాజా! ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుత్తుల గణములు, అశ్వినీ దేవతలు, ఋభువులు అనువారలు దేవగణ ములు. వారి ఇంద్రుడు పురందరుడు.
కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమద గ్ని, భరద్వాజుడు అనువారలు సప్తర్షులు అని చెప్పెదరు.
ఈ మన్వంతరమునందు కూడ విష్ణు భగవానుడు అవతరించెను. ఆయన కశ్యపునకు అదితియందు ఆదిత్యుల తమ్ముడగు వామనుడై జన్మించెను.
నేను ఏడు మన్వంతరముల గురించి నీకు సంక్షేపముగా చెప్పితి ని. తరువాత విష్ణువుయొక్క శక్తితో గూడి భవిష్యత్తులో రాబోయే మన్వంత రములను గురించి కూడ చెప్పగలను.
ఓ మహారాజా! సూర్యభగవానునకు సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలు గలరు. వారిద్దరు విశ్వకర్మయొక్క పుత్రికలే. వారిని గురించి నీకిది వరలో చెప్పియుంటిని.
సూర్యునకు వడవ అనే మూడవ భార్య కూడ గలదని కొందరు చెప్పెదరు. ఆ భార్యలలో సంజ్ఞకు యముడు శ్రాద్ధదేవుడు అనే పుత్రులు, యమున అనే పుత్రిక కలిగిరి. ఛాయయొక్క పుత్రులను గురించి కూడ వినుము.
సావర్ణి ఛాయయొక్క పెద్ద కొడుకు. తపతి ఆమె కుమార్తె. శనైశ్చ రుడు ఆమె మూడవ సంతానము, తపతీ సంవరణుని భార్య ఆయెను, వడ వ పుత్రులు అశ్వినీ దేవతలు.
ఓ మహారాజా! ఎనిమిదవ మన్వంతరములో సావర్ణి మనువు కాగ లడు. నిర్మోకుడు, విరజస్కుడు, అర్వవీరుడు మొదలగువారు సావర్ణి యొక్క పుత్రులు కాగలరు.
ఆ మన్వంతరములో సుతపసులు, విరజులు, అమృతప్రభలు అనే గణములు దేవతలు కాగా, వారికి విరోచనుని పుత్రుడగు బలి ఇంద్రుడు కాగలడు.
మూడు అడుగులను యాచించే విష్ణువునకు ఆ బలి ఈ భూమిని దానము చేసి, తనకు లభించిన ఇంద్రపదవిని విడిచిపెట్టి, తరువాత ఆయన మోక్షమును పొందగలడు.
ఒకప్పుడు బలిని శ్రీహరి భగవానుడు బంధించెను. కాని, ఆత నిపై ప్రసన్నుడైన భగవానుడు ఆతనిని స్వర్గముకంటె గొప్పదియగు సుత లమునందు ఉంచెను. ఆతడు ఇప్పటికీ అక్కడనే ఇంద్రుడు వలె ఉన్నాడు.
ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు గలవుడు, దీప్తిమంతు డు, పరశురాముడు, ద్రోణాచార్యుని పుత్రుడగు అశ్వత్థామ, కృపాచార్యు డు, ఋష్యశృంగుడు, మా తండ్రి పూజనీయుడు అగు బాదరాయణ వ్యాసుడు అనువారలు సప్తర్షులు కాగలరు. వీరు ఇప్పుడు తమ యోగశ క్తిచే తమ తమ ఆశ్రమస్థానములయందు ఉన్నారు.
శ్రీహరి ప్రభుడు దేవగుహ్యుడు, సరస్వతి అనే దంపతులకు పుత్రుడై సార్వభౌముడు అనే పేరుతో ప్రసిద్ది గాంచును. ఆ ప్రభుడు పురం దరుడనే ఇంద్రుని వద్దనుండి స్వర్గస్థానమును లాగుకొని బలి చక్రవర్తికి ఈయగలడు.
ఓ మహారాజా! వరుణుని పుత్రుడగు దక్షసావర్ణి తొమ్మిదవ మనువు కాగలడు. భూతకేతువు, దీప్తికేతువు, పంచహోత్రుడు మొదలగు వారు ఆయన పుత్రులు కాగలరు.
ఆ మన్వంతరమునందు పారులు, మరీచిగర్బులు, సుధర్ములు మొదలగువారు దేవతలు కాగా, అద్బుతుడు ఇంద్రుడు కాగలడు. ద్యుతి మంతుడు, మేధాతిథి మొదలగువారు సప్తర్షులు కాగలరు.
శ్రీహరి భగవానుడు ఆయుష్మంతునకు అంబుధారయందు ఋష భుడు అనే పేరుతో అవతరించగలడు. ఆయన ముల్లోకములను స్వాధీ నము చేసుకొని ఈయగా, అద్బుతుడు వాటిని భోగించగలడు.
ఉపశ్లోకుని పుత్రుడు, మహాత్ముడు అగు బ్రహ్మసావర్ణి పదవ మనువు కాగలడు. భూరి షేణుడు, సుక్షేత్రుడు మొదలగువారు ఆయన పుత్రులు కాగలరు. హవిష్మంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.
హవిష్మంతుడు, సుకృతి, సత్యుడు, జయుడు, మూర్తి, అప్రతి ముడు మొదలగువారు సప్తర్షులు కాగా, సువాసనులు, విరుద్ధులు, సుఖులు మొదలగువారు దేవతలు మరియు శంభుడు దేవేంద్రుడు కాగలరు.
భగవానుడగు శ్రీహరి ప్రభుడు విశ్వసృజ్, విషూచి అనే దంపతు లకు తన అంశచే విష్వక్సేనుడు అనే పేరుతో జన్మించి, శంభుడనే ఇంద్రు నితో మైత్రిని నేరపగలడు.
జితేంద్రియుడగు ధర్మసావర్ణి పదకొండవ మనువు కాగలడు. ఆయనకు సత్యధర్ముడు, క్షేమధన్వ మొదలగు పదిమంది పుత్రులు కలుగ గలరు.
ఆ మన్వంతరమునందు విహంగములు, కామగములు, నిర్వాణ రుచులు అనే దేవగణములు ఉండెదరు. వారికి వైధృతుడు ఇంద్రుడు కాగ లడు. అరుణుడు, హవిష్మంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.
ఆ మన్వంతరములో శ్రీహరి ఆర్యకునకు వైధృతయందు ధర్మసే తువు అనే పేరుతో అంశయై జన్మించి, ముల్లోకములను కాపాడగలడు.
ఓ మహారాజా! రుద్రసావర్ణి పన్నెండవ మనువు కాగలడు. ఆయనకు దేవవంతుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు, విదూరథుడు మొదలగు వారు పుత్రులు కాగలరు.
ఆ మన్వంతరమునందు ఋతధాముడు ఇంద్రుడు కాగా, హరి తులు, సుధర్ములు మొదలగువారు దేవగణములు కాగలరు. తపోమూర్తి, తపస్వి, ఆగ్నీధ్రకుడు, ద్యుతి మొదలగువారు సప్తర్షులు కాగలరు.
శ్రీహరి ప్రభుడు సత్యసహసునకు సూనృతయందు స్వధాముడు అనే అంశయై జన్మించి, ఆ మన్వంతరమును రక్షించగలడు.
జితేంద్రియుడగు దేవసావర్ణి పదమూడవ మనువు కాగలడు. ఆయనకు చిత్రసేనుడు, విచిత్రుడు, నయతి మొదలగు పుత్రులు కలుగగలరు.
ఆ మన్వంతరమునందు సుకర్ములు, సుత్రాములు అనువారు దేవ గణములు కాగా, దివస్పతి ఇంద్రుడు కాగలడు. నిర్మోకుడు, తత్త్వద ర్శుడు, ధృతిమంతుడు మొదలగువారు సప్తర్షులు కాగలరు.
శ్రీహరి దేవహోత్రునకు బృహతియందు యోగేశ్వరుడు అనే పేరుతో అంశమై జన్మించి, దివస్పతి అనే ఇంద్రునకు ముల్లోకములను సంపాదించి పెట్టగలడు.
ఇంద్రసావర్ణి పదునాల్గవ మనువు కాగలడు. ఆయనకు ఉరువు, గంభీరబుద్ధి, భరతుడు మొదలగు పుత్రులు కలుగగలరు.
పవిత్రులు, చాక్షుషులు దేవగణములు కాగా, శుచి ఇంద్రుడు కాగ లడు. అగ్ని, బాహువు, శుచి, శుద్ధుడు, మాగధుడు, ఆగ్నీధ్రుడు మొదలగు వారు సప్తర్షులు కాగలరు.
ఓ మహారాజా! ఆ మన్వంతరమునందు శ్రీహరి సత్రాయణునకు వితానయందు బృహద్భానువు అనే పుత్రుడై జన్మించి, వేదోక్తకర్మల పరం పరను విస్తరింప జేయగలడు.
ఓ మహారాజా! నేను నీకు గడచినవి, నడచుచున్నది మరియు రాబోవునవి అగు పదునాల్గు మన్వంతరములను గురించి చెప్పితిని. వేయి మహాయుగమలు ఒక కల్పము అగును. ఈ విధముగా కాలచక్రముయొక్క అవయవమైన కల్పములో పదునాల్గు మన్వంతరముల కాలము ఉండును.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో భావి మన్వంతరములను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .
