నారద మహా పురాణము
34 - భగవద్దర్శనమ్
వసిష్ఠమహర్షి పలికెను :
రుక్మాంగద మహారాజు పుత్రుని మాటలను విని, వికసించిన కమలము వలె నున్న సంధ్యావలీ ముఖమును చూచి, ఏకాదశిన భుజింపుము. పుత్రుని చంపకుము అని మోహిని పలికిన మాటలను విను చుండెను. ఈ సమయముననే పుండరీకాక్షుడగు శ్రీహరి అంతర్గానగతుడై రుక్మాంగదుని ధైర్యమును చూడగోరి ఆకాశమున నిలిచి యుండెను. మేఘ శ్యాముడు నిరంజనుడగు భగవానుడు రుక్మాంగద ధర్మాంగద సంధ్యావలుల మధ్యన గరుడ వాహనారూఢ యుండెను. భుజించుము భుజించుము అని మోహిని పలుకు చుండగా సుతుడగు ధర్మాంగదుని చంపుటకు నిర్మలమగు ఖడ్గమును స్వీరించెను. సంతోషమునిండిన మనసుతో గరుడధ్వజునికి నమస్కరించెను. ధర్మాంగదుడు కూడా ఖడ్గమును ధరించిన తండ్రిని చూచి, తల్లిదండ్రులకు నమస్కరించి, చక్రధరునికి నమస్కరించి ధైర్యముతో నున్న తల్లి ముఖమును చూచి తన కంఠమును భూమి మీద వంచి యుంచెను. అతని కంఠము శంఖము వంటిది, సమము, చక్కని వర్ణము కలది, కోమలము, బహురేఖలు కలది, స్థూలము, అయిన కంఠమును ఖడ్గమార్గమున నుంచెను. ధర్మాంగ దునకు గల పితృభక్తి మాతృభక్తి కంఠ సమర్పణకు ప్రేరేపించెను. ధర్మాంగదుడు కంఠమునిచ్చుటకు సంతోషముచే చంద్రవదనుడు కాగా, రుక్మాంగద మహారాజు ఖడ్గమును స్వీకరించగా భూమి పర్వతములతో అరణ్యములతో కంపించసాగెను. మూడు లోకములను ముంచుటకు సముద్రముప్పొంగెను. ఆకాశ మధ్యమునుండి మెరుపులతో ఉరుములతో భూమి మీద ఉల్కలు పడెను. నేను దేవకార్వమును చేయలేకపోతినని మోహిని వివర్లరూపము కలదాయెను. ఇపుడు నాపుట్టుక నిరర్థక మాయెను. జగద్విధాయి యగు దైవమిట్లు చేసెను. అందరిని మోహింప చేయు ఈ రూపము విడంబకము మాత్రమే. రాజు భుజించలేదు. ఇపుడు స్వర్గమున నాస్థితి గడ్డి పరకతో సమానమాయెను. సత్యాధికుడగు రుక్మాంగద మహారాజు మోక్షమునకు వెళ్ళును. నేను పరమదారుణమగున నరకమునకు వెళ్ళెదను. రుక్మాంగద మహారాజు ఖడ్గమునెత్తగా మోహయుక్తయగు మోహిని భూమి పై మూర్చిల్లెను. రుక్మాంగద మహారాజు కూడా ధర్మాంగదుని మండలయుతము, చంద్రప్రకాశము, శోకించు వక్రము అగు శిరమును ఖండించుటకు ధైర్యాన్వితుడై ఖడ్గమును వేయునంతలో శ్రీ లక్ష్మీనాధుడు రుక్మాంగదుని హస్తమును తన కరముచే గ్రహించెను. సంతోషించితిని. సంతోషించితిని. ఇక సంశయమేలేదు. ఈ భూమి పై కీర్తిని స్థాపించి ప్రియురాలగు సంధ్యావలితో ధర్మాంగదునితో నాలోకమునకు వెళ్ళుము. నీ కీర్తిని మూడులోకములలో పూజ్యముగా చేసి, స్వచ్ఛమును, శుక్లమును చేయుము. యమధర్మరాజు శిరమున పాదమునుంచి వెళ్ళుము. నాదేహమును చేరుము అని పలికెను. శ్రీహరి స్పృశించగనే రుక్మాంగదుడు ప్రియురాలితో పుత్రునితో పరిశుద్దుడాయెను. వేగముగా మహానుభావుడగు రుక్మాంగదుడు భూమండలములోని సంపదను, దాసీ జనమును, ధనమును భోగములను, గజాశ్వరధములను, దారవర్గమును, స్వజనాదికములను విడిచి మధుసూదనుని దేహమును చేరెను. ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. సంతోషించిన సురసిద్ధులచే మ్రోగించబడిన దేవదుందుభులు మ్రోగినవి. గంధర్యులు గానము చేసిరి సంతోషించిన దేవాంగనలు నృత్యము చేసిరి. సూర్యపుత్రుడగు యమధర్మరాజు దారాపుత్రులతో రుక్మాంగద మహారాజు, తన లిపిని చెరిఫి శ్రీహరిని ప్రవేశించుటను చూచి లోకములనన్నింటిని రాజు చూపిన దారిలో హరిమార్గము వైపు పయనింప చేయుటను చూచి భయపడుచు మరల బ్రహ్మను సమీపించి రోధించుచు బ్రహ్మతో ఇట్లు పలికెను. నేను నీ యాజ్ఞను పాలించలేక పోయితిని కావున ఈ నియోగముతో నాకు పనిలేదు. ఇంకొక పనిని తెలుపుము. చేసెదను. దండించుట మాత్రము నాకొద్దు
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున సుత వధోద్యతుడగు రుక్మాంగ దునకు భగవద్దర్శనమను ముప్పది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 161 of the Nārada Mahā Purana is as follows:
అగస్త్య మహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచిన సత్యచరిత్ర మరియు గోదావరి తీరంలో అగస్త్యాశ్రమ ఆవిర్భావము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. అగస్త్య తీర్థ స్నాన మహిమ ఇక్కడ నిరూపించబడినది.