నారద మహా పురాణము
109 - బ్రహ్మండ పురాణ అనుక్రమణీ నిరూపణము
చేసిన ఇంద్రస్తుతి, విష్ణు మాహాత్మ్య కధనము, బలివంశ నిరూపణము, కలియుగమున భవిష్యరాజ చరితము. ఇది మధ్యమభాగము. తృతీయ పాదము. ఇక ఉత్తర భాగమున ఉపసంహార పాదమున, వైవస్వత మన్వన్తర కధ! భవిష్యమను చరితము, కల్ప ప్రలయ నిర్దేశములు, కాలమానము, చతుర్దశ లోక లక్షణములు, వికర్మాచరణమున లభించు నరకముల వర్ణన, మనోమయ పురాఖ్యానము, ప్రాకృతి కలయము, శైవ వర్ణము, పురవర్ణనము, త్రివిధ గుణ సంబంధము వలన జంతువులకు ప్రాప్తించుగతి, అనిర్దేశ్యము, అప్రతర్క్యము అగు పరమాత్మ యగు బ్రహ్మను అన్వయ వ్యతిరేకములచే వర్ణనము వర్ణించబడినది. ఇట్లు నాలుగు పాదములు కల బ్రహ్మాండపురాణమును చెప్పితిని. ఇదియే పదునెనిమిది సారములన్నిటికంటే సారతరము. నాలుగు లక్ష శ్లోకములు కల పురాణ భాగమును వ్యాస భగవానుడు పదునెనిమిది విధములుగా విభజించి మహానుభావులగుమునులకు ఉపదేశించెను. నానుండి వ్యాసమహర్షి, అతని నుండి మునులు విని లోకములకు ప్రకాశింప చేసిరి. ఈ మునులందరు ధర్మశీలులు. దీనాను గ్రహకారులు. మొదట నేనీ పురాణమును వసిష్ఠ మహర్షికి చెప్పితిని. వసిష్ఠమహర్షి తన పుత్రుడగు శక్తికి, శక్తి జతుకర్ణునికి, జతుకర్ణుడు వ్యాసమహర్షికి చెప్పెను. వ్యాస మహర్షి ఈ పురాణములను ప్రమాణీకరించి ప్రవర్తింప చేసెను. ఈ పురాణములను చదివిన వాడు, సావధానముతో వినినవాడు పాపములను తొలగించుకొని ఉత్తమ లోకములను పొందును. ఈ పురాణమును వ్రాసి స్వర్ణసింహాసనమున నుంచి, వస్త్రముతో కప్పి బ్రాహ్మణునకు దానము చేసినచో బ్రహ్మలోకమును పొందును. ఓ మరీచి మహర్షి! నీకిట్లు అష్టాదశ పురాణములను చెప్పితిని. ఇట్లు అష్టాదశ పురాణములను చెప్పువాడు వినువాడు పునర్జన్మను పొందడు. పురాణ పఠన ఫలమును కోరువారు ఈ పురాణ సూత్రమును నిత్యము చదువ వలయును. దాంభికునకు, పాపికి, సాధు ద్వేషికి, శరునకు చెప్పకూడదు. శాంతునకు శనుచిత్తునకు, శుశ్రూష చేయు వానికి, నిర్మత్పరునకు, శుచికి సదైష్ణవునకు ఉపదేశించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున బ్రహ్మండ పురాణ అనుక్రమణీ నిరూపణమను నూటా తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 111 of the Nārada Mahā Purana is as follows:
సత్యసంధుడైన రుక్మాంగద మహారాజు యొక్క పవిత్ర పాలన మరియు ఆయన తన రాజ్యంలో సమస్త ప్రజలచేత ఏకాదశీ వ్రతమును ఆచరింపజేసిన దివ్య ఘట్టము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. రుక్మాంగదుని ధర్మనిష్ఠ వలన యమలోకము శూన్యమై వైకుంఠము భక్తులతో నిండిన సత్యచరిత్ర ఇక్కడ నిరూపించబడినది.