19 - విష్ణు శంకరుల స్తోత్రములు

సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-

మాలావతీ ధనం దత్వా బ్రాహ్మణేభ్యః ప్రహర్షితా ।

చకార వివిధం వేషం స్వాత్మనః స్వామినః కృతే ॥

భర్తుశ్చకార శుశ్రూషాం పూజాం చ సమయోచితాం ।

తేన సార్థం సురసికా రేమే సా సుచీరం ముదా ॥

మహాపురుషస్తోత్రం చ పూజాం చ కవచం మనుం ।

విస్మృమతం బోధయామాస స్వయం రహసి సువ్రతా ॥

పురాదత్తం వసిష్టేన స్తోత్రపూజాదీకం హరేః ।

గంధర్వాయ చ మాలత్యై మంత్రమేకం చ పుష్కరే ॥

విస్మృతం సోత్రకవచం వసిష్ఠతు కృపానిధిః ।

గంధర్వరాజం రహసీ బోధయామాస శూలినః ॥

ఏవం చకార రాజ్యం చ కుబేరభవనోపమే ।

ఆశ్రమే పరమానందో గంధర్వో బాంధవైస్సహ ॥

యథాతథా గతిభిశ్చ స్త్రీభిరస్యాభిరేవచ ।

ఆగత్య తాభిః స్వస్వామీ సంప్రాప్తః పరయాముదా ॥

మాలావతి సంతోషముతో బ్రాహ్మణులకు ధనమును ఇచ్చి, తన భర్త కొరకు చక్కగా అలంకరించుకొని తన భర్తకు సమయోచితమైన శుశ్రూష చేయుచు అతనితో చాలాకాలము సుఖముగాఉండెను.

ఆమె విస్మృతి చెందిన తన భర్తకు మహాపురుష స్తోత్రమును, పూజను మంత్రమును, కవచమును, రహస్య ప్రదేశమున బోధించెను. శ్రీమన్నారాయణుని పూజాస్తోత్ర కవచాదులను వసిష్ఠమహర్షి ఉపబర్హణ గంధర్పునకు, మాలావతికి, పుష్కర క్షేత్రమున ఉపదేశించెను. దయాసముద్రుడైన వసిష్ఠమహర్షి గంధర్వరాజైన ఉపబర్హణునకు ఆతడు మరచిపోయిన శంకరుని ప్రోత కవచములను తిరిగి రహస్య ప్రదేశమున బోధించెను.

ఉపబర్హణుడు కుబేర భవనమువంటి ఇంటిలోనుండి రాజ్యము చేయుచుండగా ఆతనిని వదలి పెట్టి వెళ్ళిన ఇతర స్త్రీలు మరల తిరిగివచ్చి తమ స్వామితో సుఖముగా నుండిరి.

శౌనక ఉవాచ- శానకమహర్షి ఇట్లనెను-

కిం స్తోత్రం కవచం విష్ణోర్మంత్రపూజావీధిః పురా ।

దత్తో వసిష్ఠప్రాభ్యాం చ తం భవాన్ వక్తుమర్హసి ॥

ద్వాదశాక్షరమంత్రం చ శూలినః కవచాదికం ।

దత్తం గంధర్వరాదాయ వపి చ కిం పురా ॥

తదపి బ్రూహి హేసౌతే శ్రోతుం కౌతూహలం మమ ।

శంకరస్తోత్రకవచం మంత్రం దుర్గతివాశనం ॥

ఓసౌతిమహర్షి! వసిష్ఠ మహర్షి ఆ గంధర్వ దంపతులకు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ మంత్రమును, స్తోత్రమును, కవచమును పూజావిధిని ఉపదేశించెను? అట్లే గంధర్వరానైన ఉపబర్హణువకు శంకరునికి సంబంధించిన ఏ ద్వాదశాక్షర మంత్రమును, కవచాదీకములను ఉపదేశించెనో వాటినన్నిటినీ చెప్పుము. శంకరునీ సొలకవచములు, మంత్రము పఠించువారి కష్టములన్నిటిని పోగొట్టును. కావున వాటినన్నిటిని వివరముగా నాకు తెలుపుము.

సౌతిరువాచ – సౌతి మహర్షి ఇట్లు పలికెను-

తు ష్ఠావ యేన స్తోత్రేణ మాలతీ పరమేశ్వరం ।

తదేవ స్తోత్రం దత్తం చ మంత్రం చ కవచం శ్రుణు ॥

ఓం నమోభగవతే రాసమండలేశాయ స్వాహా ।

ఇమం మంత్రం కల్పతరుం ప్రదదౌ షోడశాక్షరం ॥

పురా దత్తం కుమారాయ బ్రహ్మణా పుష్కరే హరేః ।

పురా దత్తంచ కృష్ణేన గోలోకి శంకరాయ చ ॥

ధ్యానం చ విష్ణోర్వేదోక్తం శాశ్వతం సర్వదుర్లభం ।

మూలేన సర్వం దేయం చ నైవేద్యాదికముత్తమం ॥

ఆతీవ గుప్తకవచం పితుర్వక్రాన్మయా శ్రుతం ।

పిత్రే దత్తం పురా విప్ర గంగాయాం శూలివా ధ్రువం ॥

శూలినే బ్రహ్మణే దత్తం గోలోకే రాసమండలే ।

ధర్మాయ గోపీకాంతేన కృపయా పరమాద్భుతం ॥

మాలావతి భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి చేసిన స్తోత్రమ్ శ్రీకృష్ణస్తోత్రము ఇక మంత్రము, కవచములను నీవు వినుము.

“ఓం నమో భగవతే రాసమండలేశాయ స్వాహా” అను ఈ మంత్రము పదువారు అక్షరములు కలది. భక్తులకు కల్పతరుపువంటి ఈమంత్రమును పుష్కర క్షేత్రమున బ్రహ్మదేవుడు కుమారునికి ఇచ్చేము. పూర్వకాలమున ఈ మంత్రమున శ్రీకృష్ణుడు, గోలోకమున శంకరునకుపదేశించెను.

ఈమంత్రస్తోత్రాదులందున్న శ్రీహరి ధ్యానము శాశ్వతమైనది. ఆందరకు దుర్లభమైనది. మంత్రపోత్రాదుల జపము తరువాత చక్కని నైవేద్యమును పెట్టవలెమ. బహురహస్యమైన ఈ కవచము వాకు మాతండ్రివలన లభించినది. మాతండ్రికి శంకరుడే స్వయముగా గంగాతీరమున ఉపదేశించెను, గోపీ కారకుడైన శ్రీకృష్ణుడు గోలోకమున రాసమండలమున బ్రహ్మకు, శంకరునికి, ధర్మదేవతకు పరమాద్భుతమైన ఈమంత్రమును ఉపదేశించెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

రాధాకాంత మహాభాగ కవచం యత్ర్పకాశితం ।

బ్రహ్మాండపావనం నామ కృపయా కథయ ప్రభో ॥

మాం మహేశం చ ధర్మం భక్తం చ భక్తవత్సల ।

త్వత్ర్పసాదేన పుత్రేభ్యో దాస్యామి భక్తిసంయుతః ॥

ఓరాధాకాంతుడవగు శ్రీకృష్ణా బ్రహ్మాండమును పవిత్రము చేయు నీకవచమును నాకు, మహేశ్వరునకు, ధర్మునకు తెలిపితివి. నేను నీ అనుగ్రహముతో ఈ కవచరాజమును వా పుత్రులకుపదేశింతుమ. దీనికై మీరు అనుగ్రహించవలెను.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను-

శ్రుణు వక్ష్యామి బ్రహ్మేశ ధర్మేదం కవచం పరం ।

అహం దాస్యామి యుష్మభ్యం గోపనీయం సుదుర్లభం ॥

యస్మై కస్మై న దాతవ్యం ప్రాణతుల్యం మమైవహి ।

యత్తేజో మమ దేహి తత్తేజ కవచేఽపిచ ॥

కురు సృష్టిమిమం ధృత్యా ధాతా త్రిజగతాం భవ ।

సంహర్తా భవ హే శంభో మమ తుల్యో భవే భవ ॥

హే ధర్మ త్వమిమం ధృత్వా భవ సాక్షీ చ కర్మణాం ।

తపసాం ఫలదాతరో యూయం భవత మద్ర్వరాత్ ॥

బ్రహ్మాండపావనస్యాస్య కవచస్య హరిః స్వయం ।

ఋషిశ్ఛందశ్చ గాయత్రీ దేవోహం జగదీశ్వరః ॥

ధర్మార్థ కామ మోక్షేషు వినియోగః ప్రకీర్తితః ।

త్రిలక్షవారపఠనాత్ సిద్దిదం కవచం విధే ॥

యో భవేత్సద్ధకవచో మమ తుల్యో భవేచ్చ సః ।

తేజపా సిద్ది యోగేన జ్ఞానేన విక్రమేణ చ ॥

ఓ బ్రహ్మా, శివ, ధర్మదేవతలారా నేను చెప్పి ఈ కవచము చాలా శ్రేష్ఠమైనది. రహస్యమైనది అందరికి లభించునది కాదు. అట్టి కవచమును అనర్హులకు చెప్పకూడదు. ఇది నా ప్రాణములతో సమానమైనది. నాశరీరములో ఉన్న తేజస్సు వా కవచముందు కూడా ఉన్నది. నా కవచమును ధరించి బ్రహ్మదేవుడా నీవు సృష్టికర్తవు కమ్ము. ఓ శంకరా వీపు సంహారకారకుడవు కమ్ము, ఓ ధర్మ దేవతా నీవు సమస్త ప్రాణులు చేయు సమస్త కర్మలకు పాక్షివి కమ్ము నాయొక్క వరమువలన తపస్సు యొక్క ఫలితమును మీరు ఇవ్వగలరు.

బ్రహ్మాండమునంతయు వవితము చేయగలిగిన ఈ కవచమునకు శ్రీహరియే ఋషి ఛందస్సు గాయత్రీ ఛందస్సు. నేనే దీనికి దేవతను, ధర్మ, అర్థ, కామ, మోక్షములలో దీనికి వినియోగము కలదు. దీనిని మూడు లక్షల మార్లు పఠించిన కవచము సిద్ధించును. ఆట్లు పఠించినవాడు సిద్ధకవచుడు, నాతో సమానమైనవాడు కాగలడు.

ప్రణవో మే శిరః పాతు నమో రామేశ్వరాయ చ ।

ఫాలం పాయాచేత్రయుగ్మం నమో రాధేశ్వరాయ చ ॥

కృష్ణః పాయాత్ త్రయుగ్మం హే హరే ఘ్రాణమేవ చ ।

జిహ్వికాం వహ్ని జాయా తు కృష్ణాయేతి చ సర్వతః ॥

శ్రీకృష్ణాయ స్వాహేతి చ కంఠం పాతు షడక్షరః ।

హ్రీం కృష్ణాయ నమో వక్రం క్లీం పూర్వశ్చ భుజద్వయం ॥

నమో గోపాంగనేశాయ స్కంధపష్టాక్షరోఽవతు ।

దంతపంక్తమోష్ఠయుగ్మం నమో గోపీశ్వరాయచ ॥

ఓం నమోభగవతే రాసమండలేశాయ స్వాహా ।

స్వయం వక్షః స్థలం పాతు మంత్రాలయం షోడశాక్షరః ॥

ఐం కృష్ణాయ స్వాహేతి చ కర్ణయుగ్మం సదాఽవతు ।

ఓం విష్ణవే స్వాహేతి చ కపోలం సర్వతోఽవతు ॥

ఓం హరయే నమ ఇతి పృష్ఠం పాదం సదాఽవతు ।

ఓం గోవర్ధనధారిణే స్వాహా సర్వశరీరకం ॥

ప్రాచ్యాం మాం పాతు శ్రీకృష్ణః ఆగ్నేయ్యాం పాతు మాధవః ।

దక్షిణే పాతు గోపీకో నైఋత్యాం నందనందనః ॥

వారుణ్యాం పాతు గోవిందో వాయవ్యాం రాధికేశ్వరః ।

ఉత్తరే పాతు రాసేశః ఐశాన్యామచ్యుతః స్వయం ॥

సతతం సర్వతః పాతు పరో నారాయణః స్వయం ।

ఇతి తే కథితం బ్రహ్మన్ కవచం పరమాద్భుతం ॥

ఓం నమో రామేశ్వరాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక, ఓం నమో రాధేశ్వరాయ అనునది వానొసటిని కళ్ళను రక్షించుగాక, కృష్ణుడు చెవులను రక్షింపనిమ్ము. ఓ హరీ నాసికను రక్షింపుము. స్వాహా అనుమంత్రము నా నాలుకకును, కృష్ణాయ అనునది నా సర్వమును రక్షింపనిమ్ము.

“ఓం కృష్ణాయ స్వాహా” అను షడక్షరమంత్రము కంఠమును, ప్రీం క్లీం కృష్ణాయ నమః అను మంత్రము ముఖమును, భుజములను, సమో గోపాంగనేశాయ అమ అష్టాక్షర మంత్రము స్కంధ భాగములమ, వమో గోపీశ్వరాయ అను మంత్రము దంతములమ, పెదవులను, ఓంనమో భగవతే రాపమండలేశాయ అనుషోడశాక్షర మంత్రము వక్షస్థలమును కాపాడుగాక.

అట్లే ఐం కృష్ణాయ స్వాహా అనుమంత్రము చెవులను, ఓం విష్ణవే స్వాహా అను మంత్రము చెక్కిళ్ళను ఓం హరయేనమః అను మంత్రము వీపుము, పాదములను, ఓం గోవర్ధనధారిణే స్వాహా అసుమంత్రము సమస్త శరీరమును రక్షింపనిమ్ము!

తూర్పు భాగమున శ్రీకృష్ణుడు, ఆగ్నేయ దిశయందు మాధవుడు, దక్షిణ దిశయందు గోపీశుడు, నైఋతి దిశయందు నందనందనుడు, పశ్చిమ దిశయందు గోవిందుడు, వాయవ్యమున రాధికేశ్వరుడు, ఉత్తరమున రాసక్రీడాపతి, ఈశాన్యమున అచ్యుతుడు, నారాయణుడు నాశరీరమంతయు రక్షించుగాక.

ఓ బ్రహ్మదేవుడా పరమాద్భుతమైన నా కవచమును నీకిప్పుడు చెప్పితిని.

మమజీవన తుల్యం చ యుష్మభ్యం దత్తమేవ చ ।

అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ ॥

కళాం నార్హంతి తావ్యేవ కవచస్యైవ ధారణాత్ ।

గురుమభ్యర్చ్య విధివత్ వస్త్రాలంకార చందనైః ।

స్నాత్వా తం చ నమస్కృత్య కవచం ధారయేత్సుధీః ॥

కవచస్య ప్రసాదేన జీవన్ముకో భవేన్నరః ।

యది స్యాత్సిద్ధకవచో విష్ణురేవ భవేద్ద్వి జ ॥

నా ప్రాణములలో సమానమైన ఈ కవచమును మీకొసగితిని. వేయి అశ్వమేధయాగములు వందల కొలది వాజపేయ యాగములు ఈ శ్రీకృష్ణ కవచముయొక్క ఒక ఆంశకైనను సరిపడవు.

విజ్ఞాడైనవాడు ఈ కవచమును గురువునకు శాస్త్రపద్దతిననుసరించి బట్టలు, అలంకారములు చందనాదులతో గౌరవించి, ఆతవికి, కవచమునకు, నమస్కరించి కవచమును ధరించవలెను. ఈ కవచము యొక్క అనుగ్రహమువలన మానవుడు జీవన్ముక్తుడు కాగలడు. అతనికి కవచము సిద్ధించినచో స్వయముగా విష్ణువే కాగలడు.

సౌతీరువాచ- సౌతీ మహర్షి ఇట్లు పలికెను-

శివస్య కవచం స్తోత్రం శ్రూయతామితి శౌనక ।

వసిష్ఠేన చ యద్దత్తం గంధర్వాయ చ యో మనుః ॥

ఓం నమో భగవతే శివాయ స్వాహేతి చ మనుః ।

దత్తో వసిష్ఠేన పురా పుష్కరే కృపయావిభో ॥

అయం మంత్ర రావణాయ ప్రదత్తో బ్రహ్మణా పురా ।

స్వయం శంభుశ్చ బాణాయ తథా దుర్వాససే పురా ॥

మూలేన సర్వం దేయం చ నైవేద్యాదికముత్తమం ।

ధ్యాయేన్నిత్యాదికం ధ్యానం వేదోక్తం సర్వసమ్మతం ॥

శౌనక మహర్షీ శివుని యొక్క కవచము స్తోత్రము, మంత్రము, పూర్వము వసిష్ఠుడు గంధర్వరాజైన ఉబర్హణునకుపదేశించెను. దానిని నీవు వినుము. ఓం నమో భగవతే శ్రీవాయ స్వాహా అను పన్నెండు అక్షరముల శివ మంత్రమును దయతో పుష్కర క్షేత్రమున వసిష్ఠుడు గంధర్వరాజువకుపదేశించెను.

పూర్వము ఈ మంత్రమును బ్రహ్మదేవుడు, రావణాసురునకుపదేశించెను. శంకరుడు దీనిని బాణాసురునకు దుర్వాస మహర్షికి ఉపదేశించెను, మంత్రమును ధ్యానించుటకు ముందు ఉత్తమ నైవేద్యమును సమర్పించవలయును.

ఓం నమో మహాదేవాయ - మహాదేవునకు నమస్కారము.

బాణాసుర ఉవాచ- బాణాసురుడిట్లనెను-

మహేశ్వర మహాభాగ కవచం యత్ర్పకాశితం ।

సంసారపాచనం నామ కృపయా కథయ ప్రభో ॥

ఓమహేశ్వర! సంసారమును పవిత్రము చేయు వీకవచమును కృపతో తెల్పుము.

మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను -

శ్రుణు వక్ష్యామి హే వత్స కవచం పరమాద్భుతం ।

అహం తుభ్యం ప్రదాస్యామి గోపనీయం సుదుర్లభం ॥

పురా దుర్వాససే దత్తం త్రైలోక్యవిజయాయ చ ॥

మమైవేదం చ కవచం భక్త్యా యో ధారయేత్సుధీః ॥

జేతుం శక్నోతి త్రైలోక్యం భగవన్నవలీలయా ।

సంసారపావనస్యాస్య కవచస్య ప్రజాపతిః ॥

ఋషిశ్చందశ్చ  గాయత్రీ దేవోహం చ మహేశ్వరః ।

పంచలక్షజుపేనైవ సిద్ధిదం కవచం భవేత్ ॥

యో భవేత్సద్ధకవచో మమ తుల్యో భవేద్భునీ ।

తేజసాసిద్ధియోగేన తపసా విక్రమేణచ ॥

ఓ బాణాసురుడా! పరమాద్భుతము, రహస్యముగా నుంచతగినది, దుర్లభమైనది ఆగు వా కవచమును ఇంతకుముందు దుర్వాసమహర్షికి త్రైలోక్య విజయమునకై ఉపదేశించితిని. ఈ వాకవచమును భక్తితో ఎవరు ధరింతురో వారు ముల్లోకములను అవలీలగా జయించగలరు.

సంసారపావనమైన ఈ కవచమువకు ప్రజాపతి ఋషి. గాయత్రి చందస్సు, వేనే దేవతను. ఈకవచమును ఐదు లక్షల మార్లు చదివినచో సిద్ధి కలుగును. ఈ కవచమును సిద్ది చేసికొనిన వాడు నాలో సమానమగును.

శంభుర్మే మస్తకం పాతు ముఖం పాతు మహేశ్వరః ।

దంతపంక్తిం నీలకంఠోద్యధరోష్టం హరః స్వయం ॥

కంఠం పాతు చంద్రచూడః స్కంధౌ వృషభవాహనః ।

వక్షస్థలం నీలకంఠః పాతు పృష్ఠం దిగంబరః ॥

సర్వాంగం పాతు విశ్వేశః పర్వదీక్షు చ సర్వదా ।

స్వప్నే జాగరణే చైవ స్థాణుర్మే పాతు సంతతం ॥

ఇతి తే కథితం బాణ కవచం పరమాద్భుతం ।

యస్మై కస్మై న దాతవ్యం గోపనీయం ప్రయత్నతః ॥

యత్ఫలం సర్వతీర్థానాం స్నానేన లభతే నరః ।

తత్ఫలం లభతే నూనం కవచస్యైవ ధారణాత్ ॥

ఇదం కవచమజ్ఞాత్వా భజేన్మాం యః సుమంధధీః ।

శతలక్షప్రజప్తోపి న మంత్రః సిద్ధిదాయకః ॥

శంభువు నాశిరస్సును, మహేశ్వరుడు నాముఖమును, నీలకంఠుడు నాదంతములను, హరుడు ఆధర్భోమును, చంద్రశేఖరుడు కంఠమును. వృషభవాహనుడు స్కంధములను, నీలకంఠుడు వక్షస్థలమును, దీగంబరుడు పృష్ఠభాగమును, విశ్వేశుడు నా సర్వాంగములమ అన్ని దిక్కులలోను రక్షించుగాక. ఆబ్లీ స్థాణువు స్వప్నమునందు జాగ్రదవస్థలోను నన్ను రక్షించుగాక.

ఓ బాణాసురుడా పరమాద్భుతమైన నా కవచమును నీకు చెప్పితిని. దీనిని జాగ్రత్తగా కాపాడవలెను. ఎవరికి బడితే వారికి ఇవ్వకూడదు. ఈకవచమువలన సర్వ పుణ్యతీర్థములందు చేసిన స్నానఫలము లభించును.

ఈకవచమును తెలిసికొనక పఠించకుండ, నా మంత్రమును నూరు లక్షలమార్లు జపించినను ఆ మంత్రము సిద్ధిని పొందదు.

సౌతిరువాచ – సౌతి మహర్షి ఇట్లనెను –

ఇదం చ కవచం ప్రోక్తం స్తోత్రం చ శ్రుణు శౌనక ।

మంత్రరాజః కల్పతరుః వ సిష్ఠో దత్తవాన్ పురా ॥

కల్పతరువు వంటి మంత్ర రాజమును, శివకవచమును, స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజునకు పూర్వముపదేశించెను.

ఓం నమశ్శివాయ - శివునకు నమస్కారము

బాణాసుర ఉవాచ- బాణాసురు డిట్లనెను-

వందే సురాణాం పారం చ సురేశం నీలలోహితం ।

యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుం ॥

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనం ।

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం ॥

తపోరూపం తపోభీజం తపోధనధనం వరం ।

వరం వరేణ్యం వరదమీర్యం సిద్ధగణైర్వరైః ॥

కారణం భుక్తి ముక్తీనాం సరకార్ణవతారణం ।

ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరం ॥

హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభం ।

బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తానుగ్రహ విగ్రహం ॥

విషయాణాం విభేదిన బీభతం బహురూపకం ।

జలరూపమగ్నిరూపమాకాశరూపమీశ్వరం ॥

వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ర్పభుం ।

ఆత్మనః స్వపదం దాతుం సమర్థమవలీలయా ॥

భక్తజీవవమీశం చ భక్తానుగ్రహకాతరం ।

వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుం ॥

ఆపరిచ్ఛిన్నమీశానమహో వాజ్మనసోః పరం ।

వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరం ॥

త్రిశూలపట్టిశధరం పస్మితం చంద్రశేఖరం ॥

ఇత్యుక్త్యా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః ।

ప్రాణమిచ్ఛంకరం భక్త్యా దుర్వాసాశ్చ మునీశ్వరః ॥

ఇదం దత్తం పసిష్టేన గంధర్వాయ పురామునే ।

కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం ॥

దేవతలలో షుడు, దేవతలకు ఈశ్వరుడు, యోగీశ్వరుడు, యోగములకు కారణభూతుడు, యోగులకు, గురువులకు గురువైన ఆ మహాదేవుని నమస్కరింతును. ఆతడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానరూపి, జ్ఞాన కారణము, సనాతనుడు, తపః ఫలితముల విచ్చువాడు, సమస్త సంపదల నిచ్చువాడు, తపః స్వరూపుడు, తపస్సు చేయుటకు కారణమైనపోడు, తపోధనులనే ధవముగా భావించువాడు ఆట్టి శంకరువీ నమస్కరింతును. ఇంకను అతడు సర్వశ్రేషుడు, పరములనిచ్చువాడు, సిద్ధులందరిచే నమస్కరింపబడినవాడు, భుక్తికి ముక్తికి కారణభూతుడు, వరకమనే సముద్రమును దాటించువాడు. అతడు ఆల్పసంతోషి శాంతుడు, కరుణాసాగరుడు, మంచు, చందనము, మల్లెపూవులవలె తెల్లనివాడు. బ్రహ్మస్వరూపము. జ్యోతిఃస్వరూపుడు. భక్తులననుగ్రహించుటకై దేహమును ధరించినవాడు. విషయ భేదములననుసరించి అనేక రూపములను ధరించువాడు. పంచ భూత స్వరూపుడు సూర్యచంద్రరూపుడు, భక్తులకు తన స్థావమునైనా అవలీలగా నిచ్చువాడు. భక్తులకు ప్రాణము వంటివాడు, భక్తులననుగ్రహింపవలెనను కోరిక కలవాడు. అట్టి పరమేశ్వరుని వేదములే స్తుతింపలేవవిన అతనిని స్తుతింతీంచుటకు నేనెంతటివాడను.

వాక్కులకు మనస్సునకు ఆతీతుడు, వ్యాఘ్ర చర్మాంబరధారి, వృషభవాహనుడు, దిగంబరుడు, త్రిశూలము, పట్టిశము అను ఆయుధముల ధరించు చంద్రశేఖరుని నేను నమస్కరింతును.

ఈవిధముగా బాణుడు ఈ స్తోత్రముచే శంకరునీ స్తుతించెను. దుర్వాసమహర్షి కూడ ఆతనిని స్తుతించెను. ఈ పరమేశ్వర స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజైన ఉపబర్హణునకు పూర్వము ఉపదేశించెను.

ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః ।

స్నానస్య సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితం ॥

అపుత్రో లభతే పుత్రం వర్షమేకం శ్రుణోతి యః ।

సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుం ॥

గళత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శ్రుణోతి యః ।

ఆవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితీ శ్రుతం ॥

కారాగారే పి బద్దో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిం ।

స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాత్ ధ్రువం ॥

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యా మాసం శ్రుణోతి యః ।

మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్రృష్టధనో ధనం ॥

యక్ష్మగ్రస్తో వర్షమేకం ఆస్తికో యః శ్రుణోతి చేత్ ।

నిశ్చితం ముచ్యతే రోగాత్ శంకరస్య ప్రసాదతః ॥

యః శ్రుజోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్వీజ ।

తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక ॥

కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య భారతే ।

అచలం పరమైశ్వర్యం లభతేనాత్ర సంశయః ॥

సుసంయతోతి భక్త్యా చ మాసమేకం శ్రుణోతి యః ।

అభార్యో లబతే భార్యాం సువినీతాం సతీం వరాం ॥

మహామూర్థశ్చ దుర్మేధా మాసమేకం శ్రుణోతి యః ।

బుద్ధిం విద్యాం చ లభతే గురూపదేశమాత్రతః ॥

కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శ్రుణోతి యః ।

ధ్రువం విత్తం భవేత్తస్య శంకరస్య ప్రసాదతః ॥

ఇహలోకే సుఖం భుక్త్యా కృత్వా కీర్తిం సుదుర్లభాం ।

నానాప్రకారధర్మం చ యాత్యంతే శంకరాలయం ॥

పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరం ।

యః శ్రుణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమం ॥

మిక్కిలి పుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు సర్వతీర్ణములలో స్నానము చేసిన ఫలితమును పొందును. ఒక్క సంవత్సరము ఈ స్తోత్రమును భక్తితో పఠించినచో, ఏన్నచో పుత్రులు లేనివాడు పుత్రులను, కుష్ఠు, మహాశూలవంటి గొప్పవ్యాధులు కలవారు నిర్వ్యాధిత్వమును పొందగలరు.

ఒక మాసము పర్యంతము ఈ స్తోత్రమును శ్రద్ధగా చదివినవాడు, విన్నవాడు కారాగారములో బద్దుడైనచో బంధనిర్ముకుడగును. భ్రష్టరాజ్యుడు రాజ్యమును, ధనభ్రష్టుడు ధనమును పొందును.

మూడు పూటలు ప్రతి దినము ఈ స్తోత్రమును చదివినచో లేక విన్నను ఆతనికి ముల్లోకములలో అసాధ్యమనునది , ఉండబోదు. అతనికి బంధువుల వియోగము జరుగదు. అంతులేని ఐశ్వర్యము కూడ లభించును. భార్యారహితుడు ఒక నెలలోనే మంచి భార్యను పొందును. మహామూర్ఖుడైనను, తెలివి తక్కువవాడైనను ఈ స్తోత్రపఠనమువలన మంచి బుద్ధిని విద్యను పొందును. పూర్వ కర్మలవల్ల దరిద్రుడైనను అధిక ధనమును పొందును. ఈ స్తోత్రమును ఎల్లప్పుడు పఠించువాడు ఇహలోకమున సుఖముననుభవించి, పరమున శంకరుని స్థానము చేరుకొని, ఆ మహాదేవునకు అనుచరుడై, అచ్చట ఎల్లప్పుడు శంకరుని సేవించుకొనుచుండును.

ఇతిశ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణే బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే విష్ణు శంకరస్తోత్ర కథనం నామ ఏకోనవింశోధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున బ్రహ్మ ఖండమున సౌతి శౌనక సంవాద సమయమున చెప్పబడిన విష్ణు శంకర స్తోత్రములు గల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.