6 -- బ్రహ్మదేవుని సృష్టికార్యమున నియోగించుట

సౌతి రువాచ-  సౌతి మహార్షి ఇట్లు పలికెను-

 అథకృష్ణా మహాలక్ష్మీం సాదరంచ సరస్వతీం ।

నారాయణాయ ప్రదదౌ రత్నేంద్రం మాలయా సహా ॥

సావిత్రీ బ్రహ్మణే ప్రాధాన్మూర్తిం ధర్మాయ సాదరం ।

రతిం కామాయ రూపాఢ్యాo కుబేరాయ మనోరమాం ॥

అన్యాశ్చ యాయా అన్యేభ్యో యాశ్చ యేభ్యః సముద్భవాః ।

తస్మై తస్మై దదౌ కృష్ణ: తాం తాo రూపవతీం సతీం ॥

తతః శంకరమాహూయ సర్వేశో యోగినాం గురుం ।

ఉవాచ ప్రియమిత్యేవం గృహ్ణీయాః సింహవాహినీం ॥

శ్రీకృష్ణ భగవానుడు సాదరముగా నారాయణునకు వనమాలా, కౌస్తుభ రత్నములతో పాటు మహాలక్ష్మిని, సరస్వతిని ఇచ్చెను. అట్లేబ్రహ్మ దేవునికి సావిత్రిని, యమధర్మరాజుకు మూర్తి అనుసామెను. మన్మథునికీ మిక్కిలి సౌందర్యవతియైన రతీదేవిని, కుబేరునకు మనోరమ అను స్త్రీని భార్యగా నీచ్చెను: అట్లే ఇతర దేవతా గణమునుండి పుట్టిన స్త్రీలను వారి వారికి భార్యలుగా నొసగెను, అదే విధముగ సర్వేశ్వరుడైన కృష్ణుడు సమస్త యోగులకు గురువైన శంకరుని పిలిచి సింహవాహిని యగు దుర్గను భార్యగా నొసగెను.

శ్రీకృష్ణస్యవచః శ్రుత్వా ప్రహసన్నీలలోహితః ।

ఉవాచ భీతః ప్రణతః ప్రాణేశం ప్రభుమచ్యుతం  ॥

శ్రీకృష్ణదేవుని మాటలు విని శంకరుడు భీతితో ప్రాణేశుడు, ప్రభువగు అచ్యుతునకు నమస్కరించి ఇట్లు పలికెను.

శ్రీమహేశ్వర ఉవాచ-  శ్రీమహేశ్వరుడు ఇట్లనెను –

అధునాఽహం న గృహ్ణామి ప్రకృతిం ప్రాకృతో యథా ।

త్వద్భక్త్ర్యెకవ్యవహితాం దాస్యమార్గవిరోధినీం ॥

తత్వజ్ఞాన సమాచ్ఛన్నాం యోగద్వార కపాటికాం ।

ముక్తీచ్ఛాధ్వంసరూపాం చ సకామాం కామ వర్ధినీం ॥

శశ్వద్విబుద్ధి జననీం సద్బుద్ధిచ్ఛేదకారిణీం ।

శశ్వద్వీభోగసారాం చ విషయేచ్ఛావివర్ధినీం ॥

తపస్యాచ్చన్నరూపాం చ మహామోహాకరండికాం ।

భవకారగృహే ఘోరే దృఢాం నిగడరూపిణీం ॥

నేచ్ఛామి గృహిణీం నాథ వరం దేహి మమేప్సితం ।

యస్య యద్వాంఛితం తస్మై తద్ధదాతి సదీశ్వరః ॥

త్వద్భక్తి విషయే దాస్యే లాలసావర్ధతేఽనిశం ।

తృప్తిర్నజాయతే నామ జపనే పాదపూజనే॥

త్వన్నామ పంచవక్ర్తేణ గుణం సన్మంగళాలయం ।

స్వప్నే జాగరణే శశ్వత్ గాయన్ గాయన్ భ్రమామ్యహం ॥

ఆకల్పకోటి కోటించ తద్రూప ధ్యాస తత్పరం ।

భోగేచ్ఛా విషయేనైవ యోగే తపసి మన్మనః ॥

త్వత్సేవనే పూజనేచ వందనే నామ కీర్తనే ।

సదోల్లసితమేషాంచ విరతౌ విరతిం లభేత్ ॥

స్మరణ కీర్తనం సామగుణయోః శ్రవణం జప:।

త్వచ్చారు రూపధ్యానం త్వత్పాద సేవాభివందనం ॥

సమర్పణం చాత్మనశ్చ నిత్యం నైవేద్య భోజనం ।

వరం పరేశ దేహీదం నవధా భక్తి లక్షణం ॥

సార్ష్టి సాలోక్య సారూప్య సామీప్యం సామ్యలీనతాo ।

వదంతి షడ్విధాo ముక్తిం ముక్తాః ముక్తివిదో ప్రభో ॥

అణిమా లఘిమా ప్రాప్రిః ప్రాకామ్యం మహిమా తథా।

ఈశిత్వం చ వశిత్వం చ సర్వ కామావసాయితా ॥

సర్వజ్ఞ దూర శ్రవణం పరకాయ ప్రవేశనం ।

వాక్సిద్ధిః కల్పవృక్షత్వం స్రష్టుం సం హర్తుమీశతా॥

అమరత్వంచ సర్వాగ్యం సిద్ధయోఽష్టా దశ స్మృతాః ।

యోగాస్త్రపాంసి సర్వాణి దానాని చ ప్రతాని చ ॥

పరమాత్మా! ఇప్పుడు నేను ఈ ప్రకృతిని భార్యగా స్వీకరించలేను. ఎందువలన అంటే గృహిణి నీ భక్తికి అడ్డంకుగా ఉంటుంది. నేనుంచుకున్న దాస్యమార్గాన్ని ఒప్పుకొనకపోవచ్చు. నీ జ్ఞానికి ఆటంకమౌతుంది. యోగద్వారమునకు ద్వారము వంటిది. ముక్తి పై కోరికను కలిగించదు. తాను కామము కలది. ఇతరులకు కామమును ప్రేరేపించును. సద్బుద్ధిని కాక వీపరీత బుడ్డిని కలిగించును. విపరీత భోగములకు నీలయమైనది. విషయముల యందు కోరికను పెంపొందించును. అధికమైన మోహమునకు కరండిక వంటిదీ, సంసారమను కారాగృహమున నున్న దృఢమైన గొలుసువంటిది. అట్టి భార్యను స్వీకరించి సంసారమున ఉండుటకు ఇష్టమగుటలేదు.

భక్తులు ఏయే కోరికలు గోరుదురో వరమేశ్వరుడు వారికి ఆయా కోరికలను పూర్తి చేయును. కావున నాకు ఇష్టమైన వరమును ఇమ్ము.

నాకు నీ భక్తి విషయమున, దాస్యమున కోరిక దిన దిన ప్రవర్ధమానమగుచున్నది. నీ నామ జపమున, పాదపూజయందు నాకు తృప్తిలేదు. కల్యాణ గుణములకు నిలయమైన నీ నామములను, నీ కల్యాణ గుణములను మేలుకొన్న సమయమున, స్వప్నావస్థయందును నా ఐదు శిరస్సులచే గానము చేయుచుందును. నీ సేవలో పూజలో నమస్కృతి యందు నా మనస్సు ఎల్లప్పుడు మునిగియుండును. వీటిని విరమించుకొన్న నాకు విరతి ఏర్పడును.

స్మరణము, కీర్తనము, నామములను, గుణములను వినుట, జపించుట, అందమైన నీ రూపును మనస్సులో ధ్యానించుట, నీ పాదములను సేవించుట, ఆత్మసమర్పణ, నిత్యము నీకు నివేదించిన పదార్థములను భుజించుట అనునవి నవవిధ భక్తులు, ఇట్టి భక్తిని వరముగా నాకిమ్ము.

సాయుజ్యము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సామ్యము, లీనమగుట అను షడ్విధముక్తులను ముక్తులైన ముక్తి వేత్తలు తెలుపుచున్నారు. అట్లే సూక్ష్మముగా మారుట (అణిమ), తేలికగానగుట (లఘిమ), తన శరీరమును విపరీతముగా పెంచుట (మహిమ), గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము, సమస్త కామ్యములను తీర్చుట, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టించుసామర్థ్యము, సంహరించు శక్తి, అమరత్వము, అంతటా ఆగ్రాసనాధిపత్యం(సర్వాగ్ర్యం) సర్వజ్ఞత్యము అనునవి అష్టాదశ సిద్ధులు.

యశః కీర్తిర్వచః సత్యం ధర్మాణ్యనశనానిచ ।

భ్రమణం సర్వ తీర్థేషు స్నానమన్యసురార్చనం ॥

సుగార్చాదర్శనం సప్తద్వీప సప్త ప్రదక్షిణం ।

స్నానం సర్వ సముద్రేషు సర్వ స్వర్గ ప్రదర్శనం ॥ 

బ్రహ్మత్వం చ రుద్రత్వం విష్ణుత్వం చ పరం పదం ।

ఆతోఽనిర్వచనీయాని వాంచనీయాని సంతి వా ॥

 సర్వాణ్యేతాని సర్వేశ  కథితానిచ యాని చ ।

తవ భక్తి కలాంశస్య కలాం నార్హంతి షోడశీం ॥

ఓ పరమాత్మా! యోగములు, తపస్సులు, సమస్తదానములు, సమస్త వ్రతములు, యశస్సు, సత్యవాక్కు. ధర్మములు, ఉపవాసములు, సమస్త పుణ్యక్షేత్రములు సందర్శించుట, సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేయుట, అన్యదేవతారాధన, దేవతారాధనను సందర్శించుట, సప్త ద్వీపములను ఏడుసార్లు చుట్టి తిరిగి వచ్చుట, సర్వ సముద్రములలో చేసిన స్నానము, సమస్త స్వర్గమును దర్శించుట, బ్రహ్మపదము, రుద్రపదవి, విష్ణుపదవి, ఇంకను చెప్పుటకు వీలులేని కోరికలు, ఇవన్నియు నీ భక్తి కళాంశము యొక్క పదునారవ భాగముగా కూడ కానేరవు.

శర్వస్య వచనం శ్రుత్వా కృష్ణస్తం యోగినాం గురుం ।

ప్రహస్యోవాచ వచనం సత్యం సర్వసుఖప్రదం ॥

యోగులకందరకు గురువైన శంకరుని మాటలు విని శ్రీకృష్ణ భగవానుడు నవ్వుచు అందరికి మేలు కలిగించు సత్యమైన వాక్కును ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ- శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లు పలికెను-

మత్సేవాం కురు సర్వేశ శర్వ సర్వ విదాం వర ।

కల్పకోటి శతం యావత్పూర్ణం శశ్వదహర్నిశం ॥

పరస్తపస్వినాo త్వంచ సిద్దానాం యోగినాం తథా।

జ్ఞానినాం వైష్ణవానాం చ సురాణాంచ సురేశ్వర ॥

అమరత్వం లభ భవ భవ మృత్యుంజయోమహాన్ ।

సర్వసిద్ధించ వేదాంశ్చ సర్వజ్ఞత్వంచ మద్వరేత్ ।

అసంఖ్య బ్రహ్మణాంపాతం లీలయా పత్స పశ్యసి ।

ఆద్యప్రభృతి జ్ఞానేన తేజసా వయసా శివ ॥

పరాక్రమేణ యశసా మహాసా మత్సమో భవ ।

ప్రాణానామధికస్యంచ న భక్తస్యత్పరోమమ ॥

 త్వత్పరో నాస్తి మే ప్రేయాన్ త్వం మదీయాత్మనః పరః ।

యే త్వాం నిందంతి పాపిష్వా జ్ఞానహీనా విచేతనాః ॥

ప్యంతే కాలసూత్రేణ యావచ్చంద్ర దీవాకరౌ।

కల్పకోటి శతాంతే చ గ్రహిష్యసి శివాం శివ ॥

మమావ్యర్థం చ వచనం పాలసం కర్తుమర్హసి ।

త్వన్ముఖాన్నిర్గతం వాక్యం న కరోమ్యధునేతి చ ॥

మద్వాక్యంచ స్వవాక్యం చ పాలనం తత్కరిష్యసి ।

గృహీత్వా ప్రకృతిం శంభో దివ్యం వర్షసహస్రకం ॥

సుఖం మహచ్చ శృంగారం కరిష్యసి న సంశయః ।

న కేవలం తపస్వీ త్వం ఈశ్వరో మత్సమో మహాన్ ॥

శంకరా। నూరు కోట్ల కల్పములు పూర్తియగునంతవరకు రాత్రింబవశ్శు నాసేవ చేయుము. నీవు తపస్వులలో, సిద్ధులలో యోగులలో అట్లే జ్ఞానవంతులైన వైష్ణవులలో అందరికన్నా శ్రేష్ఠుడవు. నావరమువల్ల అమరత్వమును, సర్వసిద్ధినీ, సర్వజ్ఞత్వాన్ని కూడ పొందుము. అట్లే వేదముల నన్నిటిని పొందుము. మృత్యుంజయుడవు కూడా కమ్ము. నీవు అసంఖ్యాకులైన బ్రహ్మదేవతల నిర్యాణాన్ని చూడగలవు. నేటినుండి జ్ఞానములోను, తేజస్సులోను, వయస్సులోను, పరాక్రమములోను, కీర్తిలో, గొప్పతనములో అన్నిటిలో నాతో సమానుడవు కాగలనీవు. నేటినుండి నాభక్తుడవు కాదు. నాప్రాణములకన్న అధికమైనంత దగ్గరివాడవు. నీకంటే గొప్ప భక్తుడు నాకు లేడు, నాకు నీకంటె ఇష్టమైనవాడు లేడు. నీవు నా ఆత్మకంటె గొప్పవాడివి.

తెలివితక్కువతనముతో జ్ఞానములేనీ పాపాత్ములు నిన్ను నిందించి సూర్యచంద్రులున్నంతవరకు యమలోకమున ఉందురు. నీవు నూరు కోట్ల కల్పముల తరువాత ప్రకృతి రూపిణియైన దుర్గాదేవిని గ్రహింతువు. వ్యర్థము కాని నావాక్యమును నీవు తప్పక పరిపాలించవలెను. నేను కూడా నీమాటను ఇప్పుడు వ్యర్థము చేయను. అందువల్ల నామాటను, నీమాటను నీవు తప్పక పరిపాలించవలెను. నీవు ప్రకృతిని స్వీకరించి వేయి దివ్యసంవత్సరములు ఆమెతో సుఖముగా ఉందువు. నీవు తపస్విని మాత్రమే కాదు. నాతోసమానుడవు.

కాలే గృహీ తపస్వీచ యోగీ స్వేచ్ఛామయో హీ యః ।

దుఃఖం చ దారసం యోగే యత్త్వయా కథితం శివ॥

కుస్త్రీ దదాతి దుఃఖం చ స్వామినే న పతివ్రతా ।

కులే మహతీ యా జాతా కులజా కులపాలికా ॥

కరోతి పాలనం స్నేహాత్ సత్పుత్రస్య సమం పతిం ।

పతిర్బంధుః పతిర్భర్తా దైవతం కులయోషితాం ।

పతితోఽపతితో వాఽడి కృపణశ్చేశ్వరోఽథవా ॥

అసత్కులప్రసూతా యాః పిత్రోః దుశ్శీల మిశ్రితాః ॥

ధ్రువం తా పరభోగ్యాశ్చ పతిం నిందంత సంతతం ।

ఆవయోరతిరిక్తం చ యా పశ్యతి పతిం సతీ ॥

గోలోకే స్వామినా సార్థం కోటికల్పం ప్రమోదతే ।

భవితా పా శివా శైవీ ప్రకృతి: వైష్ణవి శివ ॥

మదాజ్ఞయా చ తాo పాధ్వీం గ్రహిష్యసి భవాయ చ ।

ప్రకృత్యా: యోనీసంయుక్తం త్వల్లింగం తీర్థమృత్కృతం ॥

తీర్థే సహస్రం సంపూజ్య భక్త్యా పంచోపచారత: ।

సదక్షిణం సంయతో యః పవిత్రశ్చ జితేంద్రియః॥

కోటికల్పం చ గోలోకే మోదతే చ మయా సహ ।

లక్షం తీర్థే పూజయ్యేద్యో విధివత్పాదుదక్షిణం ॥

న చ్యుతిషస్య గోలోకాత్ సభవేద్వయోః సమః ।

మృద్భస్మగోశకృత్పిండైః తీర్థే వాలుకయాఽపి వా॥

కృత్వా లింగం పకృత్పూజ్య వసేత్కల్పాయుతం దివి।

ప్రజావాన్ భూమీమాన్ విద్వాన్ పుత్రవాన్ ధనవాన్ తథా ।

జ్ఞానవాన్ ముక్తిమాన్ సాధుః శివలింగార్చనాద్భవేత్ ॥

శివలింగార్చనం స్థానం మత్తీర్థం తీర్థమేవ తత్ ।

భవేత్తత్ర మతః పాపీ శివలోకం స గచ్ఛతి ॥

మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదీనః।

పశ్చాద్యామీ మహత్రస్తః నామశ్రవణలోభతః ॥

శివేతి శబ్దముచ్ఛార్య ప్రాణాంస్త్యజతీ యో నరః ।

కోటి జన్మార్జితాతాపాత్ ముక్తో ముక్తిం ప్రయాతీసః ॥

శివకల్యాణవచనం కల్యాణం ముక్తివాచకం ।

యతస్తత్ర్పభవేత్తేన స శివః పరికీర్తితః ॥

విచ్చేదే ధనబంధూనాం నిమగ్నః శోకసాగరే ।

శివేతీ శబ్దముచ్చార్య లభేత్సర్వ శివం నరః ॥

పాపఘ్నే వర్తతే శిశ్చ వశ్చ ముక్తిప్రదే తథా ।

పాపఘ్నోమోక్షదో నౄణాం శివస్తేన ప్రకీర్తితః ॥

శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే ।

కోటిజన్మార్జితం పాపం తస్య నశ్యతి విశ్చితం ॥

ఇత్యుక్త్యా శూలినే కృష్ణో దత్వా కల్పతరుం మనుం ।

తత్వజ్ఞానం మృత్యుజయం అవోచత్, సింహవాహినీం॥

తపస్వి. యోగి, స్వేచ్చగా ఉండువాడైనా యుక్తకాలమున తప్పక వివాహము చేసికొనవలెను. వివాహము దుఃఖము కలిగించుననీ నీవేదైతే అన్నావో అది దుష్టస్త్రీలకు సంబంధించినది. దుష్టురాలైన స్త్రీ భర్తకు దుఃఖాన్ని కలిగించును కానీ పతీవ్రత ఆ విధముగా చేయదు. మంచి వంశములో పుట్టిన స్త్రీని కులజ. కులపాలిక అందురు. ఆమె సత్పుత్రుల కని, వారిని తన భర్తను ప్రేమతో లాలించి రక్షించగలదు. ఆ కులపాలికకు భర్తయే బంధువు, దైవము. భర్త చెడ్డవాడైనను, మంచివాడైనను. పిసినారియై, ధనవంతుడైనా అతనిని చక్కగా చూచుకొనును. కాని తలిదండ్రుల చెడునడవడికవల్ల చెడుకులములో పుట్టిన స్త్రీలు భర్తను ఎల్లప్పుడు నిందించుచు పరపురుషుల వెంటపడుదురు.

ఏ స్త్రీ తన భర్తను మనలో ఒకరిగా భావించి గౌరవించునో ఆమె తన భర్తతో కలసి గోలోకమున కోటి కల్పములు సుఖముగా ఉండును.

శంకరా! ప్రకృతి స్వరూపిణియగు దుర్గ తప్పక భక్తితో నిన్ను ధానించుచు నీకు భార్య కాగలదు. నా ఆజ్ఞననుసరించి సాధ్వియగు ఆ దుర్గను నీవు తప్పక వివాహము చేసికొనవలెను.

ప్రకృతియొక్క యోనితో కూడుకున్న పుణ్యతీర్ణములందలి మట్టితో చేయబడిన నీ లింగమును పుణ్యతీర్థములయందు భక్తిశ్రద్ధలతో జితేంద్రియుడై పంచోపచారపూజలతో వేయిమార్లు అర్చించువాడు గోలోకమున కోటి కల్పములు నాతో కలిసి ఉండును. లక్షసార్లు దక్షిణ పూర్వకముగా నిన్ను పూజించిన వ్యక్తి సదా గోలోకముననే ఉండును. ఆతడు మన ఇద్దరిలో సమానుడు కాగలడు. మన్ను, భస్మము, ఆవు పేడ, తీర్థమందలి ఇసుక వీటిలో దేనితో నైనను లింగమును చేసి ఒక్కసారి నిన్ను పూజించినను పదిలక్షల సంవత్సరములు దేవతలలోకమున ఉండును. శివలింగమును పూజించినవానికి పుత్రులు, భూమి, విద్య, జ్ఞానము చీవరకు ముక్తికూడ కలుగును. శివలింగార్చన జరిగిన స్థలము పుణ్యక్షేత్రము. ఆది నాకుకూర పుణ్యక్షేత్రమే. అచ్చట చనిపోయినవాడు పాపము చేసినవాడైనను శివలోకమును పొందును, మహాదేవ మహాదేవ మహాదేవ అని ఎవరు జపించుచుందురో వారివెంట, నీ నామ శ్రవణమున కల ప్రీతి చేత వెళ్ళుదును, శివ అని ఉచ్చరించి ఎవరైతే ప్రాణము విడుతురో అతడు కోటిజన్మలలో చేసికొన్న పాపమును వదిలి ముక్తిని పొందును. శివ ఆను శబ్దమే కల్యాణమైనది. ఆ శబ్లోచ్చారణవల్ల మంగళములన్నీ లభించును. కావుననే అతడు శివుడైనాడు. 'శివ' అనుశబ్దము నుచ్చరించినవానికి ధనము, బంధువులు నశించిన శోకము కలుగదు. కల్యాణపరంపరనతడు పొందును. 'శి' అనగా పాపములు పోగొట్టువాడు, 'వ' అనగా ముక్తిదాత. పాపములు పోగొట్టి ముక్తినిచ్చువాడు కావుననే శివుడైనాడు. 'శివ' అనే శబ్దమును ఎల్లప్పుడు ఉచ్చరించువానికి కోటి జన్మలలో చేసిన పాపమైనా నశించిపోగలదు.

ఈ విధముగా శివునితో శ్రీకృష్ణుడు పలికి ఆతనికి కల్పవృక్షమును, మంత్రమును, తత్వజ్ఞానమును ఇచ్చి సింహవాహనయగు దుర్గతో ఇట్లనెను.

శ్రీభగవానువాచ- భగవంతుడు ఇట్లు పలికెను-

అధునా తిష్ఠ వత్సే త్వం గోలోకే మమసన్నిధౌ ।

కాలే భజిష్యసి శివం శివదం చ శివాయనం ॥

తేజస్సుసర్వదేవానాం ఆవిర్భూయ వరాననే ।

సంహృత్య దైత్యాన్ సర్వాంశ్చ భవితా సర్వపూజితా ॥

తతః కల్పవిశేషే చ సత్యం సత్యయుగే సతి।

భవితా దక్షకన్యా త్వం సుశీలా శంభుగేహినీ ॥

తతః శరీరం సంత్యజ్య యజ్ఞే భర్తుశ్చ నీందయా ।

మేనాయాం శైలభార్యాయాం భవితా పార్వతీతి చ ॥

దివ్యం వర్షసహాసం చ వీహరిష్యసి శంభునా ।

పూర్ణం తతః సర్వకాల మభేదం త్వం లభిష్యసి ॥

కాలే సర్వేషు విశ్వేషు మహాపూజాసు పూజితే ।

భవితా ప్రతీవర్షేచ శారదీ యా సురేశ్వరీ ॥

గ్రామేషు నగరేస్వేవ పూజితా గ్రామదేవతా ।

భవతీ భవితేత్యేవం నామభేదేన చారుణా ॥

మదాజ్ఞయా శివకృతైః తంత్రైరానావిధైరపి ।

పూజావిధిం విదాస్యామి కవచం స్తోత్రసంయుతం ॥

భవిష్యంతి మహాంతశ్చ తవైవ పరిచారకాః ।

ధర్మార్థకామమోక్షాణాం సిద్దాశ్చ ఫలభాగినః ॥

యే త్వాం మాతర్భజిష్యంతి పుణ్యక్షేత్రే చ భారతే ।

తేషాం యశశ్చ కీర్తిశ్చ ధర్మైశ్వర్యం చ వర్ధతే ॥

ఆమ్మా! ప్రస్తుతము నీవు నాలోకముననే నివసించుము. సరియైన సమయమున మంగళప్రదాత, మంగళములకు నిలయభూతుడైన శివుని భర్తగా పొందగలవు, సమస్త దేవతల తేజస్సుతో రాక్షసులనందరిని చీల్చి చెండాడి దేవతీర్యజ్మనుష్యులందరి చేతను పూజలందుకొనగలవు. తరువాత కల్పవిశేషమైన సత్యయుగములో దక్షునికి కుమార్తెగా పుట్టి పరమేశ్వరుని భార్యవు కాగలవు. అటు పిమ్మట యజ్ఞమున జరిగిన భర్తనిందను భరించలేక ఆయజ్ఞముననే శరీరత్యాగముచేసి హిమవత్పర్వతముయొక్క భార్యయైన "మేన"యందు పార్వతిగా జన్మించి పార్వతి అను పేరుతో శంకరునికి భార్యవై దివ్యవర్ష సహస్రములు అతనితో కలిసి విహరింతువు. తరువాత నీవనిలో అభేదమును పొందగలవు.

అన్నిచోట్ల, అన్ని పూజలలోన నీవు పూజింపబడగలవు. ప్రతి సంవత్సరము శరత్కాలములో పూజలందుకొని 'శారది' అవియు సురులకు ఈశ్వరివీ కాన సురేశ్వరివని, గ్రామములలో, పట్టణములలో పూజలందుకుంటున్నందువల్ల గ్రామదేవత అని అనేకమైన పేర్లతో నీవు ప్రకాశింతువు. శివకృతములైన నానావిధమంత్రములలో, తంత్రములతో కవచము, స్తోత్రములతో కూడిన పూజాపద్ధతిని వేసు కల్పింతును. ఆ నీకు ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గ ఫలమును అనుభవించు, సిద్ధులైన పరిచారకులు ఉండగలరు. అమ్మా! నీన్ను ఈ పుణ్యక్షేత్రమైన భారతఖండములో ఎవరు సేవింతురో వారికి కీర్తి, ధర్మబుద్ధి, ఐశ్వర్యము మొదలగునవి కలుగును.

ఇత్యుక్త్వా ప్రకృతిం తస్యై మంత్ర మేకాదశాక్షరం ।

దత్వా సకామబీజం చ మంత్రరాజ సుమత్తమం ॥

చకార విధి ధ్యానం భక్తిం భక్తానుకంపయా ।

శ్రీ మాయాకామబీజాడ్యం దదౌ మంత్రం దశాక్షరం ॥

సృష్ట్యాపయోగికీం శక్తిం సర్వసిద్ధిం చ కామదాం।

తద్విశిష్టోత్కృష్టతత్వం జ్ఞానం తస్యై దదౌ విభుః ॥

ఈవిధముగా శ్రీకృష్ణదేవుడు ప్రకృతి స్వరూపిణియైన దుర్గతో వలీకి, "క్లీం" అను కామబీజ సహితమైన ఏకాదశాక్షర మంత్రరాజమును, "శ్రీం హ్రీం క్లీం" అను శ్రీమాయా కామబీజ సహితమైన దశాక్షర మంత్రమును కూడ ఆమెకు ఇచ్చెను, ఆట్లే దుర్గాదేవికి సమస్త సృష్టికి ఉపయోగించు శక్తిని, అన్నివిధములైన కోరికలు దీర్చె సర్వసిద్ధిని, ఉత్కృష్టమైన తత్వజ్ఞానమును ఆమెకు ఇచ్చెను.

త్రయోదశాక్షరం మంత్రం దర్వాతస్మై జగత్పతిః ।

కవచం స్తోత్రసహితం శంకరాయతథా ద్విజ ॥

దత్వా ధర్మాయ తం మంత్రం సిద్ధిజ్ఞానం తథైవ చ ।

కామాయ వహ్నయే చైవ కుబేరాయ చ వాయవే ॥

ఏవం కుబేరాదిభ్యస్తు దత్వమంత్రాదికం వరం ।

విధిం ప్రోవాచ సృస్ట్యర్థం విధాతుర్విధిరేవ సః ॥

శంకరునకు కవచము స్తోత్రసహితమైన త్రయోదశాక్షర మంత్రమును, ధర్మునికి కూడ అదే మంత్రమును, సిద్ధివి, జావముమ, మన్మథునకు, అగ్నికి, కుబేరునికి, వాయుపునకు ఆయా మంత్రములను ఉపదేశించి విధాతకే సృష్టికర్తయైన భగవంతుడు సృష్టికార్యక్రమమునకై బ్రహ్మదేవుని ప్రేరేపించెను.

శ్రీ భగవామవాచ- భగవంతుడు ఇట్లు సుడిపెమ.

మదీయం చ తపః కృత్వా దివ్యం వర్ష సహస్రకం ।

సృష్టిం కురు మహాభాగ విధే నానావిధాం పరాం॥

ఇత్యుక్యా బ్రహ్మణే కృష్ణో దదౌ మాలాం మనోరమాం ।

జగామ సార్థం గోపీభిః గోపైః వృందావనం వనం॥

దివ్యపర్షసహస్రములు నాకైతపమాచరించి వివిధ సృష్టికార్యక్రమమును ప్రారంభింపుము అని బ్రహ్మదేవునితో శ్రీకృష్ణదేవుడు పలికి తన దగ్గరనున్న మిక్కిలి ఆందమైన మాలను ఆ బ్రహ్మ దేవునకిచ్చి గోపికలు, గోపాల బాలురలో కలిపి బృందావనమనే వనమునకు వెళ్ళిపోయేమ.

ఇతి బ్రహ్మ వైవర్త మహాపురాణే సౌతి శోనక సంవాదే. బ్రహ్మఖండే సృష్టినిరూపణం నామ షష్ఠోఽద్యాయః ॥

బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి శానక. సంపాదరూపమైన బ్రహ్మఖండములో సృష్టినీరూపణమను ఆరవ అధ్యాయము సమాప్తమైనది.