సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-
మాలావతి సంతోషముతో బ్రాహ్మణులకు ధనమును ఇచ్చి, తన భర్త కొరకు చక్కగా అలంకరించుకొని తన భర్తకు సమయోచితమైన శుశ్రూష చేయుచు అతనితో చాలాకాలము సుఖముగాఉండెను.
ఆమె విస్మృతి చెందిన తన భర్తకు మహాపురుష స్తోత్రమును, పూజను మంత్రమును, కవచమును, రహస్య ప్రదేశమున బోధించెను. శ్రీమన్నారాయణుని పూజాస్తోత్ర కవచాదులను వసిష్ఠమహర్షి ఉపబర్హణ గంధర్పునకు, మాలావతికి, పుష్కర క్షేత్రమున ఉపదేశించెను. దయాసముద్రుడైన వసిష్ఠమహర్షి గంధర్వరాజైన ఉపబర్హణునకు ఆతడు మరచిపోయిన శంకరుని ప్రోత కవచములను తిరిగి రహస్య ప్రదేశమున బోధించెను.
ఉపబర్హణుడు కుబేర భవనమువంటి ఇంటిలోనుండి రాజ్యము చేయుచుండగా ఆతనిని వదలి పెట్టి వెళ్ళిన ఇతర స్త్రీలు మరల తిరిగివచ్చి తమ స్వామితో సుఖముగా నుండిరి.
శౌనక ఉవాచ- శానకమహర్షి ఇట్లనెను-
ఓసౌతిమహర్షి! వసిష్ఠ మహర్షి ఆ గంధర్వ దంపతులకు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ మంత్రమును, స్తోత్రమును, కవచమును పూజావిధిని ఉపదేశించెను? అట్లే గంధర్వరానైన ఉపబర్హణువకు శంకరునికి సంబంధించిన ఏ ద్వాదశాక్షర మంత్రమును, కవచాదీకములను ఉపదేశించెనో వాటినన్నిటినీ చెప్పుము. శంకరునీ సొలకవచములు, మంత్రము పఠించువారి కష్టములన్నిటిని పోగొట్టును. కావున వాటినన్నిటిని వివరముగా నాకు తెలుపుము.
సౌతిరువాచ – సౌతి మహర్షి ఇట్లు పలికెను-
మాలావతి భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి చేసిన స్తోత్రమ్ శ్రీకృష్ణస్తోత్రము ఇక మంత్రము, కవచములను నీవు వినుము.
“ఓం నమో భగవతే రాసమండలేశాయ స్వాహా” అను ఈ మంత్రము పదువారు అక్షరములు కలది. భక్తులకు కల్పతరుపువంటి ఈమంత్రమును పుష్కర క్షేత్రమున బ్రహ్మదేవుడు కుమారునికి ఇచ్చేము. పూర్వకాలమున ఈ మంత్రమున శ్రీకృష్ణుడు, గోలోకమున శంకరునకుపదేశించెను.
ఈమంత్రస్తోత్రాదులందున్న శ్రీహరి ధ్యానము శాశ్వతమైనది. ఆందరకు దుర్లభమైనది. మంత్రపోత్రాదుల జపము తరువాత చక్కని నైవేద్యమును పెట్టవలెమ. బహురహస్యమైన ఈ కవచము వాకు మాతండ్రివలన లభించినది. మాతండ్రికి శంకరుడే స్వయముగా గంగాతీరమున ఉపదేశించెను, గోపీ కారకుడైన శ్రీకృష్ణుడు గోలోకమున రాసమండలమున బ్రహ్మకు, శంకరునికి, ధర్మదేవతకు పరమాద్భుతమైన ఈమంత్రమును ఉపదేశించెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
ఓరాధాకాంతుడవగు శ్రీకృష్ణా బ్రహ్మాండమును పవిత్రము చేయు నీకవచమును నాకు, మహేశ్వరునకు, ధర్మునకు తెలిపితివి. నేను నీ అనుగ్రహముతో ఈ కవచరాజమును వా పుత్రులకుపదేశింతుమ. దీనికై మీరు అనుగ్రహించవలెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను-
ఓ బ్రహ్మా, శివ, ధర్మదేవతలారా నేను చెప్పి ఈ కవచము చాలా శ్రేష్ఠమైనది. రహస్యమైనది అందరికి లభించునది కాదు. అట్టి కవచమును అనర్హులకు చెప్పకూడదు. ఇది నా ప్రాణములతో సమానమైనది. నాశరీరములో ఉన్న తేజస్సు వా కవచముందు కూడా ఉన్నది. నా కవచమును ధరించి బ్రహ్మదేవుడా నీవు సృష్టికర్తవు కమ్ము. ఓ శంకరా వీపు సంహారకారకుడవు కమ్ము, ఓ ధర్మ దేవతా నీవు సమస్త ప్రాణులు చేయు సమస్త కర్మలకు పాక్షివి కమ్ము నాయొక్క వరమువలన తపస్సు యొక్క ఫలితమును మీరు ఇవ్వగలరు.
బ్రహ్మాండమునంతయు వవితము చేయగలిగిన ఈ కవచమునకు శ్రీహరియే ఋషి ఛందస్సు గాయత్రీ ఛందస్సు. నేనే దీనికి దేవతను, ధర్మ, అర్థ, కామ, మోక్షములలో దీనికి వినియోగము కలదు. దీనిని మూడు లక్షల మార్లు పఠించిన కవచము సిద్ధించును. ఆట్లు పఠించినవాడు సిద్ధకవచుడు, నాతో సమానమైనవాడు కాగలడు.
ఓం నమో రామేశ్వరాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక, ఓం నమో రాధేశ్వరాయ అనునది వానొసటిని కళ్ళను రక్షించుగాక, కృష్ణుడు చెవులను రక్షింపనిమ్ము. ఓ హరీ నాసికను రక్షింపుము. స్వాహా అనుమంత్రము నా నాలుకకును, కృష్ణాయ అనునది నా సర్వమును రక్షింపనిమ్ము.
“ఓం కృష్ణాయ స్వాహా” అను షడక్షరమంత్రము కంఠమును, ప్రీం క్లీం కృష్ణాయ నమః అను మంత్రము ముఖమును, భుజములను, సమో గోపాంగనేశాయ అమ అష్టాక్షర మంత్రము స్కంధ భాగములమ, వమో గోపీశ్వరాయ అను మంత్రము దంతములమ, పెదవులను, ఓంనమో భగవతే రాపమండలేశాయ అనుషోడశాక్షర మంత్రము వక్షస్థలమును కాపాడుగాక.
అట్లే ఐం కృష్ణాయ స్వాహా అనుమంత్రము చెవులను, ఓం విష్ణవే స్వాహా అను మంత్రము చెక్కిళ్ళను ఓం హరయేనమః అను మంత్రము వీపుము, పాదములను, ఓం గోవర్ధనధారిణే స్వాహా అసుమంత్రము సమస్త శరీరమును రక్షింపనిమ్ము!
తూర్పు భాగమున శ్రీకృష్ణుడు, ఆగ్నేయ దిశయందు మాధవుడు, దక్షిణ దిశయందు గోపీశుడు, నైఋతి దిశయందు నందనందనుడు, పశ్చిమ దిశయందు గోవిందుడు, వాయవ్యమున రాధికేశ్వరుడు, ఉత్తరమున రాసక్రీడాపతి, ఈశాన్యమున అచ్యుతుడు, నారాయణుడు నాశరీరమంతయు రక్షించుగాక.
ఓ బ్రహ్మదేవుడా పరమాద్భుతమైన నా కవచమును నీకిప్పుడు చెప్పితిని.
నా ప్రాణములలో సమానమైన ఈ కవచమును మీకొసగితిని. వేయి అశ్వమేధయాగములు వందల కొలది వాజపేయ యాగములు ఈ శ్రీకృష్ణ కవచముయొక్క ఒక ఆంశకైనను సరిపడవు.
విజ్ఞాడైనవాడు ఈ కవచమును గురువునకు శాస్త్రపద్దతిననుసరించి బట్టలు, అలంకారములు చందనాదులతో గౌరవించి, ఆతవికి, కవచమునకు, నమస్కరించి కవచమును ధరించవలెను. ఈ కవచము యొక్క అనుగ్రహమువలన మానవుడు జీవన్ముక్తుడు కాగలడు. అతనికి కవచము సిద్ధించినచో స్వయముగా విష్ణువే కాగలడు.
సౌతీరువాచ- సౌతీ మహర్షి ఇట్లు పలికెను-
శౌనక మహర్షీ శివుని యొక్క కవచము స్తోత్రము, మంత్రము, పూర్వము వసిష్ఠుడు గంధర్వరాజైన ఉబర్హణునకుపదేశించెను. దానిని నీవు వినుము. ఓం నమో భగవతే శ్రీవాయ స్వాహా అను పన్నెండు అక్షరముల శివ మంత్రమును దయతో పుష్కర క్షేత్రమున వసిష్ఠుడు గంధర్వరాజువకుపదేశించెను.
పూర్వము ఈ మంత్రమును బ్రహ్మదేవుడు, రావణాసురునకుపదేశించెను. శంకరుడు దీనిని బాణాసురునకు దుర్వాస మహర్షికి ఉపదేశించెను, మంత్రమును ధ్యానించుటకు ముందు ఉత్తమ నైవేద్యమును సమర్పించవలయును.
ఓం నమో మహాదేవాయ - మహాదేవునకు నమస్కారము.
బాణాసుర ఉవాచ- బాణాసురుడిట్లనెను-
ఓమహేశ్వర! సంసారమును పవిత్రము చేయు వీకవచమును కృపతో తెల్పుము.
మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను -
ఓ బాణాసురుడా! పరమాద్భుతము, రహస్యముగా నుంచతగినది, దుర్లభమైనది ఆగు వా కవచమును ఇంతకుముందు దుర్వాసమహర్షికి త్రైలోక్య విజయమునకై ఉపదేశించితిని. ఈ వాకవచమును భక్తితో ఎవరు ధరింతురో వారు ముల్లోకములను అవలీలగా జయించగలరు.
సంసారపావనమైన ఈ కవచమువకు ప్రజాపతి ఋషి. గాయత్రి చందస్సు, వేనే దేవతను. ఈకవచమును ఐదు లక్షల మార్లు చదివినచో సిద్ధి కలుగును. ఈ కవచమును సిద్ది చేసికొనిన వాడు నాలో సమానమగును.
శంభువు నాశిరస్సును, మహేశ్వరుడు నాముఖమును, నీలకంఠుడు నాదంతములను, హరుడు ఆధర్భోమును, చంద్రశేఖరుడు కంఠమును. వృషభవాహనుడు స్కంధములను, నీలకంఠుడు వక్షస్థలమును, దీగంబరుడు పృష్ఠభాగమును, విశ్వేశుడు నా సర్వాంగములమ అన్ని దిక్కులలోను రక్షించుగాక. ఆబ్లీ స్థాణువు స్వప్నమునందు జాగ్రదవస్థలోను నన్ను రక్షించుగాక.
ఓ బాణాసురుడా పరమాద్భుతమైన నా కవచమును నీకు చెప్పితిని. దీనిని జాగ్రత్తగా కాపాడవలెను. ఎవరికి బడితే వారికి ఇవ్వకూడదు. ఈకవచమువలన సర్వ పుణ్యతీర్థములందు చేసిన స్నానఫలము లభించును.
ఈకవచమును తెలిసికొనక పఠించకుండ, నా మంత్రమును నూరు లక్షలమార్లు జపించినను ఆ మంత్రము సిద్ధిని పొందదు.
సౌతిరువాచ – సౌతి మహర్షి ఇట్లనెను –
కల్పతరువు వంటి మంత్ర రాజమును, శివకవచమును, స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజునకు పూర్వముపదేశించెను.
ఓం నమశ్శివాయ - శివునకు నమస్కారము
బాణాసుర ఉవాచ- బాణాసురు డిట్లనెను-
దేవతలలో షుడు, దేవతలకు ఈశ్వరుడు, యోగీశ్వరుడు, యోగములకు కారణభూతుడు, యోగులకు, గురువులకు గురువైన ఆ మహాదేవుని నమస్కరింతును. ఆతడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానరూపి, జ్ఞాన కారణము, సనాతనుడు, తపః ఫలితముల విచ్చువాడు, సమస్త సంపదల నిచ్చువాడు, తపః స్వరూపుడు, తపస్సు చేయుటకు కారణమైనపోడు, తపోధనులనే ధవముగా భావించువాడు ఆట్టి శంకరువీ నమస్కరింతును. ఇంకను అతడు సర్వశ్రేషుడు, పరములనిచ్చువాడు, సిద్ధులందరిచే నమస్కరింపబడినవాడు, భుక్తికి ముక్తికి కారణభూతుడు, వరకమనే సముద్రమును దాటించువాడు. అతడు ఆల్పసంతోషి శాంతుడు, కరుణాసాగరుడు, మంచు, చందనము, మల్లెపూవులవలె తెల్లనివాడు. బ్రహ్మస్వరూపము. జ్యోతిఃస్వరూపుడు. భక్తులననుగ్రహించుటకై దేహమును ధరించినవాడు. విషయ భేదములననుసరించి అనేక రూపములను ధరించువాడు. పంచ భూత స్వరూపుడు సూర్యచంద్రరూపుడు, భక్తులకు తన స్థావమునైనా అవలీలగా నిచ్చువాడు. భక్తులకు ప్రాణము వంటివాడు, భక్తులననుగ్రహింపవలెనను కోరిక కలవాడు. అట్టి పరమేశ్వరుని వేదములే స్తుతింపలేవవిన అతనిని స్తుతింతీంచుటకు నేనెంతటివాడను.
వాక్కులకు మనస్సునకు ఆతీతుడు, వ్యాఘ్ర చర్మాంబరధారి, వృషభవాహనుడు, దిగంబరుడు, త్రిశూలము, పట్టిశము అను ఆయుధముల ధరించు చంద్రశేఖరుని నేను నమస్కరింతును.
ఈవిధముగా బాణుడు ఈ స్తోత్రముచే శంకరునీ స్తుతించెను. దుర్వాసమహర్షి కూడ ఆతనిని స్తుతించెను. ఈ పరమేశ్వర స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజైన ఉపబర్హణునకు పూర్వము ఉపదేశించెను.
మిక్కిలి పుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు సర్వతీర్ణములలో స్నానము చేసిన ఫలితమును పొందును. ఒక్క సంవత్సరము ఈ స్తోత్రమును భక్తితో పఠించినచో, ఏన్నచో పుత్రులు లేనివాడు పుత్రులను, కుష్ఠు, మహాశూలవంటి గొప్పవ్యాధులు కలవారు నిర్వ్యాధిత్వమును పొందగలరు.
ఒక మాసము పర్యంతము ఈ స్తోత్రమును శ్రద్ధగా చదివినవాడు, విన్నవాడు కారాగారములో బద్దుడైనచో బంధనిర్ముకుడగును. భ్రష్టరాజ్యుడు రాజ్యమును, ధనభ్రష్టుడు ధనమును పొందును.
మూడు పూటలు ప్రతి దినము ఈ స్తోత్రమును చదివినచో లేక విన్నను ఆతనికి ముల్లోకములలో అసాధ్యమనునది , ఉండబోదు. అతనికి బంధువుల వియోగము జరుగదు. అంతులేని ఐశ్వర్యము కూడ లభించును. భార్యారహితుడు ఒక నెలలోనే మంచి భార్యను పొందును. మహామూర్ఖుడైనను, తెలివి తక్కువవాడైనను ఈ స్తోత్రపఠనమువలన మంచి బుద్ధిని విద్యను పొందును. పూర్వ కర్మలవల్ల దరిద్రుడైనను అధిక ధనమును పొందును. ఈ స్తోత్రమును ఎల్లప్పుడు పఠించువాడు ఇహలోకమున సుఖముననుభవించి, పరమున శంకరుని స్థానము చేరుకొని, ఆ మహాదేవునకు అనుచరుడై, అచ్చట ఎల్లప్పుడు శంకరుని సేవించుకొనుచుండును.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున బ్రహ్మ ఖండమున సౌతి శౌనక సంవాద సమయమున చెప్పబడిన విష్ణు శంకర స్తోత్రములు గల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 19 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
In this spiritually potent chapter, the text reveals the secret knowledge of supreme spiritual armours, including the Kṛshṇakavacha and the Śivakavacha, along with the exalted royal hymn known as Śivastavarāja. These sacred compositions, composed of transcendent Mantras and divine vibrations, bestow complete immunity against negative influences, demonic forces, mental anxieties, and physical dangers upon anyone who recites or wears them with pure faith. Lord Śiva explained that these sacred Kavachas serve as indestructible shields of divine light, purifying the subtle body, bestowing all material and spiritual opulences, and ensuring the ultimate attainment of Lord Śrī Kṛshṇa's eternal abode.