సౌతీ రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను-
ఓ శౌనక మహర్షీ! గంధర్వరాజు తనకు పుత్రుడు పుట్టిన సందర్భమున సంతోషముతో బ్రాహ్మణులకు ఆనేక విధములైన ధనములను రత్నములను దానము చేసెను.
ఉపబర్హణుడు కాలక్రమముగా పెద్ద పెరిగి గురువైన వసిష్ఠ మహర్షివలన సులభ సాధ్యము కాని హరి మంత్రమును పొంది, మిక్కిలి కఠినమైన తపస్సు చేసెను. తరుణ వయస్కుడగు ఆ ఉపబర్హణునీ గండకీ నదీ తీరమునుండి పోవుచున్న గంధర్వ స్త్రీలు చూచి ఆతనీ అందమునకు మూర్చబోయిరి. తరువాత వారందరు కఠినమైన తపస్సుచేసి యోగమార్గమున ప్రాణములు వదలి చిత్రరథుడను గంధర్పునకు ఏబది మంది కూతుళ్ళుగా పుట్టిరి. వారంతా ఉపబర్హణునే భర్తగా కోరుకొని తండ్రియొక్క ఆజ్ఞననుసరించి సంతోషముతో ఆతని మెడలో వరమాలలను నేసిరి.
ఉపబర్హణుడు వారినందరిని తీసుకొని మూడు లక్షల దివ్య సంవత్సరములు వారీతో రహస్యముగా క్రీడించెను. తరువాత వారితో కలిసి చాలా సంవత్సరములు రాజ్యమునేలి, ఒకప్పుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అచట పొరీ కథలను గానము చేయుచుండెను.
మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్దము, ఆజ్ఞా ఆనే షట్చక్రములను భేదించుకొని, ఇడ, విశుద్ధ, నీరుద్ధ, వాయుసంచారిణి, తేజశుష్కకరీ, బలపుష్టికరీ, బుద్ధిసంచారీణి, జ్ఞానజృంభణకారిణి, సర్వప్రాణహర, పునర్జీవనకారిణి, అను పదునారు నాడులను భేదించుకొని ఆత్మను మనస్సుతో కలిపి యోగశక్తితో బ్రహ్మరంధ్రమువరకు తీసికొని వచ్చి ఉపబర్హణుడు క్షణకాలము ఆత్మను ఆత్మలోనే ఉంచి తన గత జన్మజ్ఞానము కలిగి పరబ్రహ్మను చేరుకొనెను.
ఇంకను అతడు మూడు తీగలుకలవీణను ఎడమ భుజముపై నుంచుకొని, కుడిచేతిలో శుద్ధ స్పటికమాలను ధరించి, వేదములకు సారభూతము, పరాత్పరము, వరబ్రహ్మ, మోక్షకారకము ఐన కృష్ణ అను రెండక్షరములు జపించుచు, శిరస్సు తూర్పునకు, పాదములు పశ్చిమమునకు పెట్టి దర్భల శయ్యపై పడుకొన్న పురుషునివలె మనస్సుతో శ్రీకృష్ణుని స్మరించుచు యోగశక్తితో పరబ్రహ్మమును చేరుకొనెను.
విష్ణుమాయచే మోహితులైన ఆ గంధర్వ రాజు భార్యలు బంధువులు, శోకార్డులై మిక్కిలి వీడ్చిరి. ఆ ఉపబర్హణుని ఏబదిమంది భార్యలలో పెద్దదైన మాలావతి భర్త శవముపైబడి ఎలుగెత్తి ఏడ్చెను. దుఃఖవతియైన ఆ మాలావతి భర్తను సంబోధించి ఈ విధముగా ఆనెను.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –
ఓ నాథుడా, రమణుడా, రషికేశ్వరుడా! జీవిత బంధూ! శోక సాగరంలో మునిగిన నాకు నీ దర్శనము నిమ్ము, పుష్పభద్రానదీతీరమున అందమైన పుష్పోద్యానములో, రమ్యమైన చందన వృక్షముల మధ్య ఏకాంతముగా నున్న భవనములో, చందన పర్వతము యొక్క సమీపమున నున్న చందనవనములో చందన గంధముతో కూడిన పుష్పచందన శయ్య పై, గంధమాదన పర్వత ప్రాంతమున నున్న నదీతీరమున గండు కోయిలల కూతలు వినిపించు మాలతీ తీగల పొదరింటిలో, శ్రీనివాసుడు నీవసించుచున్న శ్రీశైలములోని (తీరుమల) దివ్యమైన శ్రీవనములో పూర్వము రహస్యంగా నీవు చేసిన రాసక్రీడలను తలచుకొన్న నా మనస్సు పరిపరివిధముల బాధలకు గురియగుచున్నది. పూర్వము అమృత తుల్యములైన నీమాటలచే పరవశించిపోయినాను. అవి నా మనస్సును మిక్కిలి దారుణముగ బాధ పెట్టుచున్నవి. మంచివారితో కలిసి ఉండుట వైకుంఠములో ఉండుట కంటే చాలా శ్రేష్ఠమైనది. వారీవియోగము మరణము కంటే ఎక్కువ బాధను కలిగించును.
అందువలన సజ్జన వీరహము అధికమైన శోకమును కల్గించును. దానికన్న బంధుమరణము వలన కలుగు శోకము అతి భయంకరమైనది. బంధుమరణము కంటే పతిమరణమువలన కలుగుతోకము మిక్కిలి బాధాకరము, దానీకంటే మీంచీన బాధ స్త్రీకి ఇంకొకటి లేదు. నిద్రపోయిన సమయమున, భోజన సమయమున, కలలో, జాగ్రదవస్థలోను భర్శ దుఃఖము ప్రతిదినము నిత్యనూతనమై బాధ పెట్టును.
స్త్రీ భర్తతో కలిసి యున్నప్పుడు సమస్త విధములైన శోకములను మరిచిపోవును. భర్తను మరిపించే బంధువు స్త్రీకి లేనేలేడు. బ్రహ్మదేవుడు సహితము ఇదే విషయము తెలిపినాడు.
అందువలన ఓదిక్పాలకులారా! ఓ ధర్మదేవత! ఓ ప్రజాపతీ! ఓ శంకరుడా! ఓ లక్ష్మీపతీ! నాకు మీరు ప్రతిదానము చేయుడు-
అని, చిత్రరథుని కూతురైన మాలావతి ఏడ్చుచు పతి విరహమును భరించలేక ఆ దుర్గమమైన ఆడవియందే. మూర్చపోయేను. మాలావతి భర్తయొక్క శవముపై పడి చైతన్యమును కోలుపోయి ఒక దినము సంపూర్ణముగా స్మతి రహితయై యుండెను. అప్పుడామెను సమస్త దేవతలు రక్షించుచుండిరి.
మరుసటి దినము ఆమె స్మృతిలోనికి వచ్చినను భర్తకై మిక్కిలి శోకించుచు శ్రీహరిని సంబోధించి ఇట్లు పలికెను.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను -
ఓ జగత్పతియైన శ్రీకృష్ణా నేను ఈ ప్రపంచమునుండి దూరము కాలేదు. సమస్తజగములు రక్షించునీవు నన్నెందుకు రక్షించవు? నీమాయవల్లనే ఇతడు నాభర్త, నేను ఇతని భార్యను, ఇదినాది అనే భావములు కలుగుచున్నవి. నీవే అన్నిటికిని కారణము. నీవే అందరిని భరించువాడవు.
ఈగంధర్వుడు నా పూర్వకర్మ ఫలితముగా భర్తయైనాడు. నేను కూడ ఆతని పూర్వ కర్మ ఫలితముగా భార్యనైతిని. ఈ కర్మలను అనుభవించిన తరువాత ప్రియురాలనైన నన్ను ఎక్కడో వదలి ఆతడు ఎక్కడకో పోయినాడు. ఎవరు ఎవరికి భర్త? ఎవరు పుత్రుడు? ఎవరు భార్య? బ్రహ్మ దేవుడు ఆయా వ్యక్తులు చేసికొన్న కర్మ ఫలితమునమసరించి ఇరువురిని కలుపుతున్నాడు. విడగొట్టుచున్నాడు.
ఈ ప్రపంచమున మూర్ఖుడు కలిసి యున్నప్పుడు పరమానందమును పొందుచున్నాడు. విడిపోయినప్పుడు ప్రాణసంకటమును పొందుచున్నాడు. తన ఆత్మయందు తానే రమించువ్యక్తి ఈ సుఖదు:ఖములకు అతీతుడై ప్రవర్తించుచున్నాడు.
ప్రపంచములోనున్న శరీరసౌఖ్యము, భోగ భాగ్యములు బంధుత్వము అశాశ్వతములు. వీటినన్నింటిని స్వయముగా వదులుకున్నవారు సుఖముగా నుందురు. ఇతరులచే బలవంతముగా వదలి పెట్టబడినచో దుఃఖము కలుగును. అందువలన శ్రేష్ఠులైనవారు వీటిని స్వయముగా వదలిపెట్టి, ఎటువంటి ఆపదలకు కారణము కాని శ్రీకృష్ణపదములను మనస్సులో ధ్యానించుచు తమకు ఇష్టమైన పరమైశ్వర్యమును పొందుచున్నారు.
పురుషులు ఎప్పుడైనను, ఎచ్చటనైనను జ్ఞానవంతులే. జ్ఞానవతియైన స్త్రీ ప్రపంచమున కానరాదు. అందువలన అజ్ఞానురాలనైన నా కోరికను తప్పక మీరు తీర్చవలేను. నాకు దేవత్వము పైన కానీ, ఇంద్ర పదవిపై గాని, మోక్షమార్గముపై గాని కోరికలేదు. నాకు ధర్మార్థకామమోక్షములకు కారణమైన భర్తను వరముగానిమ్ము. ఓ భగవంతుడా! భూమిపై నున్న ఏ స్త్రీకి నా భర్త వంటి భర్తను నీవివ్వలేదు.
అతని వద్ద సమస్త సుగుణములున్నవి. మంచి రూపము ఉన్నది. ఆమరత్వము తప్ప తక్కిన సౌశీల్యగుణములన్ని కలవు. నా భర్త రూపమున, గుణమున, తేజస్సున, విక్రమమున, జ్ఞానమున శాంతి సంతుష్టులలో శ్రీహరితో సమానుడు. అతడు హరీభక్తుడు. శ్రీహరితో సమానమైనవాడు. గాంభీర్యమున సముద్రమువంటివాడు., సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు. అగ్నివలె పరిశుద్ధుడు, చంద్రునివలె అందగాడు, మన్మథునివంటివాడు. బుద్ధియందు బృహస్పతి, కవిత్వమున వాల్మీకి వంటివాడు. సర్వశాస్త్రజ్ఞత్వమున సరస్వతి వంటివాడు. ప్రతీభయందు భృగుమహర్షి, కుబేరుని వంటి ధనవంతుడు. మనువు వలె గొప్పదాత. ధర్మమున ధర్మదేవతతో సమానుడు. సత్యవ్రతము కలవాడు. తపస్సున కుమారస్వామి వంటివాడు. ఆచారమున బ్రహ్మతో సమానుడు. ఐశ్వర్యమున ఇంద్రునితో సమానుడు. భూమీవంటి సహనము కలవాడు.
ఇన్ని సుగుణములు కల సౌభర్త చనిపోయెను. ఐనను నాప్రాణములు పోకుండ ఉన్నవి.
యజ్ఞా భాగమున యజ్ఞహవిస్సును భుజించు ఓ దేవతలారా! నాశక్తిచే క్షణమున మీకందరకు యజ్ఞభాగము లేకుండ చేయగలము. జగద్రక్షకుడవగు నారాయణా! నేను మాత్రమే లోక బాహ్యురాలను కాలేను. నాభర్తను వెంటనే బ్రతికించకపోయినచో నిన్ను కూడా శపింతుమ, ఓ బ్రహ్మదేవుడా! వీపుత్రునీ శాపమువలన నీవు పూజకు దూరమైనావు. నేనిప్పుడు నీకు సృష్టిచేయు అధికారము లేకుండా చేయగలను. ఓ శివుడా! నేను శపించి మీకు జ్ఞానము లేకుండా చేయుదుమ. ఓ ధర్మదేవతా నీకు ధర్మలోపము కలుగునట్లు చేయుదుము. యముని యొక్క అధికారమును తొలగించగలమ. కాలునీ, మృత్యుకన్యను కూడా శపింతును. నా భర్త వ్యాధి, ముసలితనములతో చనిపోలేదు కావున జరావ్యాధులు తప్ప మీగిలిన దేవతలనందరను శపింతును అని భర్త శవముపై పడియున్న మహాసాధ్వియైన మాలావతీ వారిని శపించుటకు కౌశికీవదీ తీరమునకు వచ్చెను.
శపించుటకు ప్రయత్నించుచున్న ఆ మాలావతిని చూచి దేవతలనందరను ముందుంచుకొని బ్రహ్మ క్షీరసముద్రమునకు విష్ణువును శరణుపొందుటకు వెళ్ళేను. అతడు క్షీరసముద్రమున స్నానము చేసి విష్ణుమూర్తిని స్తుతించి భీతిచెందిన వానివలె ఇట్లనెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
చిత్రరథుని కూతురు ఉపబర్హణుని భార్యయైన మాలావతీ తన భర్త ప్రాణములకై నన్ను, దేవతలను శపించుచున్నది, అందువలన నీవు మమ్మందరిని రక్షింపుము. సాధుపుంగవులు నిన్ను స్మరింతురు. మహర్షులు నిన్ను ఎల్లప్పుడు సర్వకార్యములందు జపింతురు. ఓ శరణాగత దీనార్త త్రాణపరాయణ! హృషీకేశ మమ్ములను రక్షింపుము. మేమందరము నీ శరణు జొచ్చితిమి.
నా పుత్రుని యొక్క శాపమువలన నా పూజ పోయినది. ప్రస్తుతము ఈ మాలావతి నన్ను అధికారమునుండి తొలగించుచున్నది. నీవు బ్రహ్మాండమున ఇచ్చిన పర్వాధికార సంపద ఇప్పుడు పోవుచున్నది అని ఆనెను.
మహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-
ఓ నారాయణా ! ఇతరులందరికి దుర్లభమైనది. మిక్కిలి గుప్తమైనది వంద మన్వంతరముల తపః ఫలితముగా వీవిచ్చినదీఙ్ఞానము. ఐశ్వర్యమైనా ధనమైనా, విద్యయైనా, పరాక్రమమైనా పరమార్థ జ్ఞానము యొక్క షోడశ కళకు కూడ సరిపడవు. అత్యంత దుర్లభమైనది. మిక్కిలి గుప్తమైనది ఐన నా తత్వజ్ఞానమును ఒక స్త్రీ తొలగించుచున్నది. అన్ని తేజస్సుల కంటే మిన్నయైన పతివ్రతా తేజము చాలా గొప్పది. ఆమె తేజప్పవే - అగ్నిచే దగ్గుడనగుచున్న నన్ను రక్షింపుము.
ధర్మ ఉవాచ - ధర్మ దేవత ఇట్లనెను-
దేవా ఊచుః - దేవతలిట్లనిరి-
సమస్త రత్నములకంటె మిన్నయైన రత్నము సనాతమైన ధర్మము. ఏడు మన్వంతరములు వేమ చేసిన తపఃఫలితముగా దానిని నీవిచ్చితివి. ఆ ధర్మము ఒక స్త్రీ శాపమువలన పోవుచున్నది అని ధర్మదేవత అనెను.
ఓ మాధవ నీవే మాకు యజ్ఞములందు భాగములను ఇచ్చితివి. అట్లే యజ్ఞహవిస్సులను తీనువట్లు ఏర్పాటు చేసితివి. ఇదంతయు. ఒక స్త్రీ యొక్క శాపముచే తొలగి పోవుచున్నది అని దేవతలవీరి.
ఆని వారందరు భయముతో అచ్చట ఉండిపోయిరి. ఆ సమయములో వారికి మీరందరు మాలావతి దగ్గరకు పొండు. బ్రాహ్మణ వేషధారియైవ జనార్దనుడు మీవెనక మీమ్ముల రక్షించుటకు ఆమెను శాంతి పరచుటకు రాగలడు” అమ ఆశరీర వాణి మాటలు విని దేవతలందరు సంతోషములో మాలావతి ఉన్న కౌశికీనదీ తీరమునకు వెళ్ళిరి.
అచ్చట పతివ్రతయైన మాలావతి రత్నభూషణములతో లక్ష్మీదేవి కళ కలిగినదై, విప్పువలె స్వచ్చమైన వస్త్రమును ధరించినది. సిందూరపు బొట్టు కలది, శాంతురాలై శరత్కాల చంద్రునీ కాంతిని దశదిశలను వెదజల్లుచు, పతి యొక్క పేహ ధర్మముచే చాలాకాలమునుండి సంపాదించిన తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న అగ్నిశిఖవలె శవమును వక్షస్థలము పై నుంచుకొని యోగాసనమున నుండి భర్తయొక్క వీణను కుడిచేతిలో పట్టుకొని, చూపుడు వ్రేలు, పెద్దప్రేలులో భర్తయొక్క స్పటిక మాలను యోగముద్రలో పట్టుకొని, అందమైన చంపకవర్గపు కాంతి కలదై పదునారేళ్ళ స్త్రీవలె సుస్థిర వనవతియై తన భర్త చనుమ శుభంకరమైన దృష్టితో మాటి మాటికి చూచుచుండెను.
అస్థితిలో నున్న మాలావతిని ధార్మికులు, ధర్మమునకు భయపడువారిన దేవతలు చూచి ఆశ్చర్యపడిరి.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణే సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే మాలావతీ విలాపో నామ త్రయోదశోధ్యాయః|
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి-శావక సంవాదరూపమైన బ్రహ్మఖండమున మాలావతి విలాపమను పదమూడవ యధ్యాయము సమాప్తము.
Summary of chapter 13 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
During a grand celestial assembly convened by Lord Brahmā to sing sacred hymns in honor of the Supreme Lord, the Gandharva Upabarhaṇa became distracted by the alluring dances of celestial damsels and lost his devotional focus, thereby committing a severe spiritual offense. Enraged by this lapse of reverence during a holy ritual, Lord Brahmā cursed Upabarhaṇa to instantly drop dead, causing his life air to depart his celestial form immediately. Beholding her beloved husband lifeless upon the ground, his chaste wife Mālatī fell into agonizing grief, weeping bitterly and threatening to consume the entire cosmos with the blazing heat of her virtuous chastity if her husband was not restored to life.