శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను-
పూర్వము బ్రాహ్మణుడు తన భార్యను వదలి ఏమి చేసెను. అశ్వినీ కుమారుల పేరేమి? వారు ఎవని వంశమువారు? మొదలగు విషయములను తెలుపుము.
సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లనెను-
ఓ శౌనక మహర్షీ! సుతపుడనే భరద్వాజ వంశమునకు చెందిన ముని హిమాలయ పర్వత ప్రాంతమున శ్రీకృష్ణదేవుని గురించి లక్ష సంవత్సరములు తపస్సు చేసెను. ఆతడు బ్రహ్మ వర్చస్సుతో గొప్పగా ప్రకాశించుచు ఆకాశమున జ్యోతిః స్వరూపుడైన శ్రీకృష్ణుని క్షణకాలము దర్శించెను. సుతపునకు పరమాత్మ దర్శనము జరిగినా ఆ పరాత్పరుని ఏ వరము ఆడుగలేదు. చివరకు మోక్షమును సైతము యాచించలేదు. కాని అతడు పరమాత్మమ స్థిరమైన భగవద్దాస్యము, భగవద్భక్తిని తనకు ప్రసాదించమనీ ఆడిగెను.
అప్పుడు భగవంతుడు ఆకాశవాణి ద్వారా తొలుత వివాహము చేసికొమ్మని, తరువాత భగవద్దాస్యమును, అనుభవక్షయము జరిగిన తరువాత భగవద్భక్తిని ఇత్తునని చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుడు పితృదేవతల మానస కన్యను అతనికిచ్చి వివాహము చేసెను. వారిద్దరకు కళ్యాణమిత్రుడనే పుత్రుడు కలిగెను. కల్యాణమిత్రుడు మిక్కిలి పవిత్రమైనవాడు. అతనిని స్మరించినంత మాత్రముననే కలివల్ల కలుగు భయములన్నీ తొలిగిపోవును.
సుతపమహర్షి (ఆశ్వినీ కుమార సంగతయైన) తన భార్యను వదలి పెట్టి సూర్యపుత్రుడైన అశ్వినీ కుమారునకు అతని సోదరునకు యజ్ఞభాగము ఉండకుండునట్లు, వ్యాధిగ్రస్తులై జడమైన అవయవములతో గౌరవ దూరులు కమ్మని శపించి తన పుత్రుడైన కల్యాణమిత్రునితో కలిసి ఇంటికి వెళ్ళిపోయెను. ముల్లోకములకు పూజ్యుడైన సూర్యుడు వ్యాధిపీడితులైన తన కుమారులను వెంటపెట్టుకొని సుతపమహర్షి వెంటవెళ్ళి ఆతనినిట్లు ప్రస్తుతించెను.
సూర్య ఉవాచ- సూర్యుడిట్లనెను -
ప్రతి యుగములో విష్ణుస్వరూపుడవైన ఓ బ్రాహ్మణుడా! నా పుత్రుని తప్పును క్షమించుము. బ్రహ్మ విష్ణు, మహేశుడు మొదలైన దేవతలు బ్రాహ్మణుడిచ్చు ఫలములను, పుష్పములను, నీటిని అనుభవించుచున్నారు. బ్రాహ్మణులచే ఆవాహనము చేయబడిన దేవతలు సమస్త ప్రపంచములందు పూజులనందుకొనుచున్నారు. అందువలన బ్రాహ్మణుని కంటే గొప్పనైన దేవుడు ఎక్కడ లేడు. విష్ణుమూర్తి స్వయముగా బ్రాహ్మణ రూపమున ఉండుమ. బ్రాహ్మణుడు సంతోషపడినచో విష్ణుమూర్తి కూడ సంతసించగలడు. నారాయణుడు సంతుష్టుడైనచో సమస్త దేవతలు సంతుష్టులైనయట్లే.
గంగానదితో సమానమైన పుణ్యతీర్ధము, శ్రీకృష్ణునికంటే గొప్పవైన దేవత, శంకరుని కన్న గొప్ప వైష్ణవ భక్తుడు, భూమికంటే గొప్ప క్షమాశీలి, సత్యము కంటే గొప్ప ధర్మము, పార్వతి కంటే గొప్ప పతివ్రత, ఆదృష్టము కంటే గొప్పవైన బలవంతుడు కుమారుని కంటే ఇష్టమైన వ్యక్తి ఉండడు. ఆట్టే వ్యాధితో సమానమైన శత్రువు, గురువు కన్న గొప్ప పూజ్యుడు, తల్లితో సమానమైన బంధువు, తండ్రిని మించిన స్నేహితుడు, ఏకాదశీ వ్రతమును మించిన వ్రతము, ఉపవాసమున మించిన తపస్సు రత్నము కంటే గొప్పనైన ధనము, విద్యారత్నమును మించిన రత్నము ఎక్కడా కన్పడదు.
ఆశ్రమవాసులందరికంటెను బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. వేదములు, వేదాంగముల తత్వము తెలిసిన బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడైన గురువు లేడని బ్రహ్మదేవుడు తెలిపినాడు.
సూర్యుని మాటలు విని భారద్వాజుడైన సుతపు డతనికి నమస్కరించి, తన తపశ్శక్తివలన సూర్యపుత్రులను వారి వ్యాధినుండి విముక్తులను చేసి, తరువాత వారికి యజ్ఞహవిస్సు తీసుకొను ఆర్హత లభించగలదని చెప్పి, మరల సూర్యునకు నమస్కరించి నారాయణుని సేవకై గంగాతీరమునకు వెళ్ళిపోయెను.
సూర్యుడు తన కుమారులతో కలిసి తన ఇంటికి వెళ్ళి పోయెను.
ఓ శౌనకమహర్షీ! సూర్యుడు చేసిన ఈస్తోత్రమును ఎవరు చదువుదురో, బ్రాహ్మణానుగ్రహామువలన అంతట విజయము వారికి లభించును.
ఉదయమే లేచి బ్రాహ్మణులకు నమస్కరించుచున్నాను అని ఎవడమనో అతడు సమస్త పుణ్యతీర్థములందు పానము , చేసిన వానితో సమానుడు. సమస్త యజ్ఞములందు దీక్ష తీసికొన్న వానితో సమానుడు.
భూమీపై ఎన్ని పుణ్య తీర్థములున్నవో, సముద్రమున అన్ని తీర్థములున్నవి. సముద్రములో మన్న తీర్థములన్నీ బ్రాహ్మణుల పాదతీర్థమునమన్నవి. విప్రులపాదోదకము తాగినచో భూమియున్నంతకాలము ఆతని పితృదేవతలు పుష్కర పాత్రలలో తర్పణ జలము తాగుదురు. పవిత్రమైన బ్రాహ్మణపాదోదకమున తాగినవాడు సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేసినవానితో, సమస్త యజ్ఞములందు దీక్షను గైకొన్న వానితో సమానుడు. మహారోగియైనా వీప్రపాదోదకమును ఒక నెల భక్తితో స్వీకరించినచో అతని సమస్త రోగములు వెంటనే తొలగిపోవును. ప్రతిదినము సంధ్యావందనము చేయు బ్రాహ్మణుడు చదువుకున్నా, చదువుకోక పోయినా, విష్ణుద్వేషములేనిచో అతడు విష్ణుమూర్తితో సమానుడు. విప్రుడు కొట్టినా అతనిని కొట్టవద్దు. శపించినా శపించవద్దు, హరిభక్తుడైతే అతడు ఆవులకన్న వందరెట్లు ఎక్కువగా గౌరవించతగినవాడు. విప్రునియొక్క పాదోదకమును ఆతని నైవేద్యముమ ఎవరు స్వీకరిస్తారో అతడు నిత్యము భగవనైవేద్యమున తిమవాడు. రాజసూయ ఫలితమనుభవించువాడగును.
ఏకాదశినాడు ఎవరు ఉపవాసముందురో ఎవరు ప్రతిదినము శ్రీకృష్ణుని పూజింతురో వారి పాదోదకము పడిన స్థలము తప్పక పుణ్యతీర్థము కాగలదు. శ్రీకృష్ణునికి నివేదితమైన అన్నమును ఎవరు ప్రతిదినము తిందురో ఆతడు జీవన్ముక్తుడు కాగలడు. విష్ణుమూర్తికి నివేదింపబడని అన్నము మలముతో సమానము. పాలు మూత్రముతో సమానము.
బ్రహ్మ, బ్రహ్మయొక్క పుత్రులందరు విష్ణుభక్తి పరాయణులు. ఆ బ్రహ్మకులములో పుట్టిన బ్రాహ్మణుడు విష్ణుభక్తికి విముఖుడెలాడా? తల్లి దండ్రులు, మాతామహులు, పితామహులు, గురువు మొదలగువారి దోషమువలన బ్రాహ్మణులు విష్ణుభక్తి విదూరులగుచున్నారు. ఆట్టివారు జీవన్మృతులు. హరిభక్తి కలిగించని గురువు గురువుకాదు. తండ్రి తండ్రి కాడు. కొడుకు కొడుకు కాదు. ప్నేహితుడు, రాజు, బంధువు ఎవరైనను సరియైన వారుకాదు. వైష్ణవుడు--కాని బ్రాహ్మణుని కంటే వైష్ణవుడైన చండాలుడు చాలా గొప్పవాడు. విష్ణుభక్తిలేవి బ్రాహ్మణుడు నరకమునకు వెళ్ళును. సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు, నిత్యము అశుచియైనవాడు, శ్రీకృష్ణభక్తి రహితుడైన బ్రాహ్మణుడు విషములేని సర్పమువలె పనీకిరానీ వాడగును.
గురువు ముఖమునుండి విష్ణువుకు సంబంధించిన మంత్రము ఎవరి చెవిన పడునో ఆవైష్ణవుడు పరమ పవిత్రుడని, జీవన్ముక్తుడనీ అందురు. వైష్ణవుడు మాతామహుడు మొదలైన నూరు తరములవారిని, తన వారినందరినీ వైకుంఠమునకు చేర్చుము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులవలె వైష్ణవులనేది ప్రత్యేకమైన జాతి.
వైష్ణవులెల్లపుడు గోవిందుని వదపంకజములను స్మరించుచుందురు. ఆ గోవిందుడు కూడ వారిని స్మరించును. తన భక్తుల సంరక్షణకై సుదర్శన చక్రమును ఎల్లప్పుడు నియోగించినప్పటికిని పూర్తిగా భక్తరక్షణ చేసితినని నిశ్చింతగానుండడు.
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతి శౌనకసంవాదమను బ్రహ్మఖండమున విష్ణు, వైష్ణవబ్రాహ్మణప్రశంసలుకల పదకొండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 11 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
This inspiring chapter chronicles the uplifting history of the divine twin physicians, the Aśvinī Kumāras, who had been subjected to a past curse that deprived them of their rightful share in sacred sacrificial offerings. Through their sincere repentance, flawless service to holy ascetics, and the merciful intervention of pure devotees, the Aśvinī Kumāras achieved complete purification and were restored to their exalted celestial status. The narrative transitions into a profound eulogy celebrating the incomparable purity, spiritual power, and divine status of true Vaishṇava Brāhmaṇas, whose sincere prayers, unyielding austerity, and continuous chanting of Lord Śrī Kṛshṇa's holy names possess the potency to purify all three worlds and grant spiritual liberation.