శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను-
ఓ సౌతమహర్షి! ఋషి వంశముల గురించి చెప్పు సందర్భమున తెల్సిన వివిధకథలను ఉత్సాహముతో వింటివి. మహార్పులలో ఎవరెవరు సృష్టి క్రమమునకుపక్రమించిరి? ఎవరు ఊర్థ్వరేతస్కులైరి? తండ్రితో విరోధము పెట్టుకున్న నారదుడేమి చేసిను. బ్రహ్మ, బ్రహ్మతనయుడైన నారదుడు పరస్పరము శాపములిచ్చుకొని ఏమైనాలో ఆకథనంతయు చెప్పుము.
సౌతీరువాచ - సౌతి మహర్షి ఇట్లు చెప్పెను.
ఓ శౌనకమహర్షీ! హంసుడు, యతీ, ఆరణి, వోడువు, పంచశీఖుడు అపాంతరతముడు, సనక సనందాదులు తప్ప మిగిలిన బ్రహ్మదేవుని పుత్రులందరు తండ్రియొక్క ఆజ్ఞను పరిపాలించుచు, సాంసారిక జీవనము గడుపుచు సంతానమున కన్నారు.
బ్రహ్మదేవుడు, తన పుత్రుడైన నారదుని శాపము వలన పూజించుటకు ఆనరుడయ్యెను. అందువలననే విద్వాంసులు బ్రహ్మను పూజించరు. ఆట్టే నారదుడు తండ్రి శాపమువలన గంధర్వుడాయెను. ఆ గంధర్వుని వృత్తాంతమున విపులముగా చెప్పుదును. శౌనకమహర్షి నీవు వినుము.
సమస్త గంధర్వులలో శ్రేష్ఠుడైన ఒక గంధర్వ రాజుకు మిక్కిలి సంపద ఉన్నప్పటికిని, సంతానము లేనందువలన గురువైన వసిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞననుసరించి పుష్కర క్షేత్రములో మిక్కిలి దీక్షతో దీనమనస్కుడై పరమేశ్వరుని గురించి తపస్సు చేసెను.
దయకల వసిష్ఠమహర్షి శివస్తోత్రమును, కవచమును తీవద్వాదశాక్షరమంత్రమును గంధర్వ రాజనకుపదేశించగా ఆతడు ఆ శివమంత్రమును పుష్కర క్షేత్రమున నూరు దీవ్య సంవత్సరములు జపించెను. ఆ నూరు దివ్య సంవత్సరముల తర్వాత గంధర్వ రాజునకు, బ్రహ్మతేజస్సుచే దీశదిశలను ప్రకాశింపచేయుచున్నవాడు. తేజు! స్వరూపుడు, సనాతుడు, చిరునవ్వుతో ప్రసన్నమైవ ముఖము కలవాడు, భక్తులననుగ్రహించువాడు. తపో రూపుడు తపః కారణుడు, తపస్సు యొక్క ఫల ప్రదాత, శరణాగతులైనవారికి, భక్తులకు సర్వసంపదలనిచ్చు వాడు, త్రిశూలము పట్టిశీమను ఆయుధముల ధరించినవాడు, వృషభవాహనుడు, దిగంబరుడు. శుద్ధమైన స్పటికమువలె తెల్లనివాడు, ముక్కంటి, చంద్రశేఖరుడు, మేలిమిటరిగారు కాంతి గల బిడలు ధరించినవాడు, నీలకంఠుడు, సర్వఙాడు, సర్పములే యజ్ఞోపవీతముగా కలవాడు, ఆందరిని సంహరించువాడు, కాలస్వరూపుడు, మృత్యుంజయుడు, గ్రీష్మకాల మధ్యాహ్నమున కనిపించు కోటి సూర్యులతో సమానమైన కాంతికలవాడు. తత్వజ్ఞానమును తెలుపువాడు, పరమశాంతుడు, ముక్తిని ఇచ్చువాడు, హరి భక్తిని ఇచ్చువాడు. భగవంతుడు ఐన శంకరుని చూచీ గంధర్వరాజు సాష్టాంగ దండ ప్రణామమాచారించి వసిష్టుడుపదేశించిన శివస్తోత్రముతో స్తుతించెను.
దయాసాగరుడైన పరమేశ్వరుడు గంధర్వరాజును, వరము వేడుకొమ్మనగా అతడు శ్రీకృష్ణునిపై భక్తిని హరిభక్తిగల కుమారుని వరముగా నీమ్మని వేడుకొనెను.
గంధర్వ, రాజు మాటలు విని దీమలను రక్షించువాడు దీనుల బంధువు ఐన పరమేశ్వరుడు నవ్వి దీనుడైన గంధర్వరాజుతో ఇట్లనెను.
శ్రీమహాదేవ ఉవాచ- శ్రీమహాదేవు డిట్లనెను-
ఓగంధర్వరాజా! నీవు చాలా కృతార్థుడవు, నీవు కోరుకున్న వరముకంటె తక్కిన వరమేదైనా చర్విత చర్వణమువలె వ్యర్థమౌతుంది. మిక్కిలి కళ్యాణకరమైన వరముల విషయములో ఎవరు తృప్తి పొందుదురు. వత్స! సర్వమంగళ స్వరూపమైన శ్రీహరి భక్తి దృఢముగా ఎవరికుండునో ఆ భక్తుడు సమస్త ప్రపంచమున తేలికగా రక్షించగలడు. ఆట్లే తనయొక్క పూర్వీకుల శతకోటిని, మాతామహుల శతకోటిని ఉద్ధరించి గోలోకమునకు నిశ్చింతగా వెళ్ళును. ఆట్లే కోటి జన్మలందు మనోవాక్కాయములచే చేసిన పాపములు పుణ్యములు నశింపగా శ్రీహరి దాస్యము తప్పక ఆతనికి లభించును. మానవులకు శ్రీహరిపై భక్తి ఎంతవరకు కలుగడో అంతవరకే భార్య, పుత్రులు, ఐశ్వర్యము, సుఖము, దుఃఖము ఉండును. శ్రీకృష్ణునిపై భక్తి ఏర్పడగనే ఆ భక్తి ఖడ్గము మానవుల యొక్క కర్మలనే వృక్షములను సమూలముగా ఛేదించును. ఏ పుణ్యపురుషులయొక్క పుత్రులు పరమ వైష్ణవులో, వారు తమ తండ్రుల పూర్వీకులను కోటి మందిని తేలికగా ఉద్ధరింతురు.
విష్ణుభక్తులమగు మాకు మిక్కిలి దుర్లభమైన సంచిత ధనము శ్రీ కృష్ణభక్తి. దానిని ఇతరుల కిచ్చుటకు మేమెప్పుడు ఇష్టపడము. అందువలన నీకిష్టమైన ఇంకేదైనా వరమును కోరుకొనుము. అది ఇంద్రత్వమైనా, దేవత్వమైనా, దుర్లభమైన బ్రహ్మత్వమైనా, సర్వసిద్ధియైనా, మహాయోగము, జ్ఞానము, మృత్యుజయము మొదలైన ఏకోరికనైనా లేక అన్నిటినైనా తేలికగా ఇచ్చెదను. కాని హరిదాస్యమనే కోరికను మాత్రము వదలిపెట్టుము.
శంకరుని మాటలు విని గంధర్వ రాజు దీమడై, ఎండిన గొంతు, పెదవులు, వాలుక కలవాడై సర్వసంపదలిచ్చువాడు, దీమల కాపాడువాడగు పరమేశ్వరునితో ఇట్లనెను.
గంధర్వ ఉవాచ- గంధర్వరాజు ఇట్లనెను-
ఓ మహాదేవా! భగవంతుడైన శ్రీహరియొక్క కనురెప్పల కదలికతోనే బ్రహ్మదేవుడు పతనమైపోవును. అందువలన బ్రహ్మపదవి కలవంటిది. అటువంటి బ్రహ్మపదవీ కావలెననీ శ్రీకృష్ణభక్తుడు ఎప్పుడు కోరుకొనడు. అదే విధముగా ఇంద్రత్వము, అమరత్వము, యోగసిద్ధి, జ్ఞానము, మృత్యుజయము మొదలగు వానీని సాలోక్యము మొదలగు మోక్షములను కూడ వైష్ణవులు ఎప్పుడు కోరుకొనరు.
శ్రీకృష్ణునిపైని దృడభక్తి, హరీదాస్యము ఇవి చాల దుర్లభమైనవి కావున హరిభక్తులు స్వప్నావస్థలోను, జాగ్రదావస్థలోను వీటినే వరములుగా కోరుకొందురు. భక్తులకు కల్పవృక్షమువంటి ఓ పరమేశ్వరా నీవు సంతోషపడినచో ఎట్టి అధముడైనను సమస్తవరములు పొందగలుగును కావున శ్రీహరిదాస్యమును, శ్రీహరీభక్తుడైన పుత్రుని వరముగా నాకిమ్ము.
ఓ మహాదేవా! చెడు పనులు చేయు నాకు ఈవరమును ఇవ్వనిచో, నాతలను తెంచుకొని నిప్పులో పడవేయుదును. అను గంధర్వరాజు మాటలు విని కృపాసముద్రుడు, భక్తులననుగ్రహించు శంకరుడిట్లనెను.
శ్రీశంకర ఉవాచ- శ్రీశంకరుడిట్లనెను-
ఓగంధర్వరాజ! నీకు హరిభక్తి, హరిదాస్యము రెండు కలుగును. అట్లే పరమ వైష్ణవుడు, చిరాయుష్కుడు, సద్గుణవంతుడు, ఎల్లప్పుడు స్థిరముగా ఉండు యౌవనము కలవాడు, జ్ఞాని, సుందరుడు, గురుభక్తుడు, జితేంద్రియుడు ఐన పుత్రుని పొందగలవు. ఆది శంకరుడు గంధర్వ రాజాతో చెప్పి స్వస్థానమునకు వెళ్ళిపోయెను. ఆట్టే గంధర్వరాజు సంతోషముతో తన ఇంటికి పోగా ఆతని భార్యయందు నారదుడు పునర్జన్మనందెను. గంధమాదన పర్వతమున వృద్ధురాలైన గంధర్వరాజభార్య శిశువును కనగా వసిష్ఠమహర్షి యథోచితముగా పేరు పెట్టెను.
ఉపశబ్దమునకు ఆధికము అనీ బర్హణ: అనగా పూజ్యుడని అర్థములు కలవు. ఆ శిశువు పూజ్యులలో శ్రేష్టుడు కావున ఉంబర్హణుడను పేరు పొందెను.
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రాతి శౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున పన్నెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 12 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
Fulfilling the solemn curse pronounced upon him by his father Lord Brahmā, the sublime sage Maharshi Nārada took birth in the celestial world as the exceptionally handsome Gandharva named Upabarhaṇa. Endowed with flawless physical beauty, immense wealth, and an extraordinary vocal mastery of divine music, Upabarhaṇa lived a life of celestial luxury, surrounded by fifty beautiful wives led by the devoted and virtuous Mālatī. He spent his time enchanting the heavenly courts of the Devas with his soulful singing and playing upon the vinā, yet beneath his worldly enjoyment lay the dormant seed of supreme spiritual devotion awaiting its destined awakening through divine grace.