సౌతి రువాచ- శ్రీ సాతిమహర్షి ఇట్లు చెప్పెను.
బ్రహ్మ ప్రపంచమును సృష్టించి సావిత్రి అను తన భార్య యందు కాముకుడు, కాముకి యందు వలె వీర్యాధానమును చేసెను. ఆ సావిత్రి నూరు దివ్యవర్షాలు సహించుటకు మిక్కిలి కష్టమైన గర్భమును ధరించి చతుర్వేదములను వివిధములైన తర్క, వ్యాకరణాది శాస్త్రములను నానాతాళ సమన్వితములైన షట్ రాగములను సత్య, త్రేత, ద్వాపరములను, కలహప్రియమైన కలియుగాన్ని కనెను.
సంవత్సరము. మాపము, ఋతువు, తిథి, దండ, క్షణాదికమును, పగలు, రాత్రి, వారము, సంధ్య, ఉషః కాలమును కనెను, అట్లే పుష్టి, దేవసేన, మేధ, విజయ, జయ అను కృత్తికలను, విష్కంభాదీయోగములను, బవ మొదలైన కరణములను, బ్రాహ్మము, పాద్మము, వారాహము అను మూడు కల్పములను, నీత్యము, నైమిత్తికము, ద్వీపరార్థము, ప్రాకృతమను చతుర్విధప్రళయములను, కాలమును, సావిత్రి కనెను.
అట్లే మృత్యుకన్యక, మృత్యుకారణమైన సమస్త వ్యాధిగణమునకు సావిత్రియే మాత.
బ్రహ్మదేవునియొక్క వెనుకభాగమునుండి అధర్ముడు, ఎడమభాగమునుండి అలక్ష్మి (పెద్దమ్మవారు) బొడ్డుప్రాంతము నుండి శిల్పి గురువైన విశ్వకర్మ, అష్టవసువులు ఉదయించిరి.
ఆట్లే బ్రహ్మమనస్సునుండి సనక, సనంద, సనాతన, సనత్కుమారులనే ఐదు సంవత్సరాల ప్రాయముతో, బ్రహ్మవర్చస్పుతో ప్రజ్వలించుచున్న నలుగురు కుమారులు ఆవిర్భవించిరి. అతని ముఖమునుండి బంగారుకాంతి, దివ్యరూపమును ధరించిన ఒక సుందర యువకుడు, స్త్రీతో కలసి ఆవిర్భవించెను. ఆ యువకుడు క్షత్రీయులకెల్ల మూలభూతుడైన స్వాయంభువ మనువు. ఆతనివెంట ఉదయించిన స్త్రీ స్వాయంభువమనుపత్నియైన శతరూప. స్వాయంభువ మనువు తన భార్యతో కలపి తండ్రియైన బ్రహ్మదేవుని ఆజ్ఞను పరిపాలించుటకు సిద్ధమాయెను.
అప్పుడు సంతోషముతోనున్న తన పుత్రులను చూచి విధాత ఇట్లు పలికెను.
శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు మహాభాగవతులైన తన కుమారులను సృష్టిచేయమని కోరెను. కాని పరమ భక్తులైన వారు తాము సృష్టికర్మ చేయమని చెప్పి వెళ్ళిపోయిరి. అందువల్ల విధాత కోపగించగా బ్రహ్మతేజస్సుతో ప్రజ్వరిల్లుతూ కోపాసక్తుడైన అతనీ నొసటినుండి ఏకాదశరుద్రులు ఉద్భవించిరి. సృష్టిసంహారము చేయు కాలాగ్ని రుద్రుడు వారిలో ఒకడు. సమస్త ప్రపంచములందు ఆరడు తామస స్వభావుడని చెప్పబడినాడు. కాని బ్రహ్మరాజస స్వభావుడు, శివుడు, విష్ణువు ఈ ఇద్దరు సాత్విక స్వభావులు. గోలోకాధిపతియైన శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతుడు. నిర్గుణస్వరూపుడు.
శుద్ధ పత్వ స్వరూపి, నిర్మలుడు, విష్ణుభక్తాగ్రేసరుడగు శివుని పూర్తిగా అజ్ఞానవంతులు, మూర్ఖులైన వారు మాత్రమే తామస స్వరూపి అసీ అందురు. ఈ ఏకాదశరుద్రుల పేర్లు ఇవీ -
మహాన్, మహాత్మా, మతిమాన్, భీషణుడు, భయంకరుడు, ఋతుధ్వజుడు, ఊర్ధ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి. ఇంతకు ముందు చెప్పబడిన కాలాగ్ని రుద్రుడు.
బ్రహ్మ దేవుని కుడిచెవినుండి పులస్త్యుడను ముని, ఎడమ చెవినుండి పులహామహర్షి, కుడి కంటినుండి అత్రిమహాముని, ఎడమకంటనుండి క్రతుమహర్షి, నాసికారంధ్రమునుండి అరణిమహర్షి, ముఖమునుండీ ఆంగిరసమహర్షి, ఎడమ పార్శ్వమునుండి భృగుమహర్షి, కుడిపార్శ్వమునుండి దక్దుడు, చాయనుండి కర్దమమహర్షి, నాభినుండి పంచశిఖుడు, వక్షస్థలమునుండి వోడుమహర్షి, కంఠప్రదేశమునుండి నారదుడు, స్కంధప్రదేశమునుండి మరీచి మహర్షి, గొంతుకనుండి ఆపాంతరతముడనే ఋషి, నాలుకనుండి వసిష్ఠుడు, ఆధరోష్ఠమునుండి ప్రచేతసుడను వరుణుడు, కుక్షిభాగమునకు ఎడమపార్శ్వమునుండి హంసమహర్షి, కుడిపార్శ్వమునుండి యతి అమ ఋషి ఉద్భవించిరి.
బ్రహ్మదేవుడు ఈ కుమారులకు సృష్టికార్యము చేయుడని ఆజ్ఞాపించెను. అప్పుడు తండ్రి ఆజ్ఞను విన్న నారదుడు తండ్రితో ఈవిధముగా అనెను.
నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లనెను.
ఓ తండ్రీ! మాకు అన్నలగు సనక, సనందాదులమ మొదట పిలిపించి వారికి వివాహము చేసి, మాకు వివాహముగురించి చెప్పుము. వారు తపస్సు చేసికొనుటకనుమతింపబడినారు. మేముమాత్రము సంసారము చేయుటకు అనుమతించబడినామా? మీ బుద్ధి విపరీతముగానున్నది. ఓక పుత్రువికి, అమృతముకంటే గొప్పదైన తపస్సునొసగి, ఇంకొకరికి ఏషముకన్న మిన్నయైన పంపారమును ఇచ్చుచున్నారు, ఎవరైతే మీక్కిలి లోతైన, భయంకరమైన సంసారసాగరములో పడుదురో, వారికి నూరుకోట్ల కల్పములు గడచినా నిష్కృతి లేదందురు. సంపూర్ణముగా తరించుటకు ఎవరు కారకులో, అందరికి ఎవరు కారణభూతులో, పురుషోత్తముడు, సమస్తకోరికలు తీర్చువాడు, భక్తిప్రదుడు, దాస్యప్రదుడు, సత్యస్వరూపి, కృపామయుడు, భక్తులకు అనవ్య శరణుడు, భక్తవత్సలుడు. భక్తప్రియుడు, భక్తులకు నాథుడు, భక్తులను సంతతము అనుగ్రహించువాడు, భక్తులకు ఆరాధ్యదేవత భక్తికి మాత్రమే లొంగువాడు ఆగు పరమేశ్వరుని వదలి నాశనమువకు కారణమైన సంసారములో ఎట్టి మూడుడు మనస్సు పెట్టును? అమృతము కన్న మిన్నయైనది, చాలా ఇష్టమైనది అగు కృష్ణసేవను వదలి సంసారమనే విషమును ఎటువంటి మూడుడు సేవించును? అది కలవలె క్షణికమైనది. తుచ్చమైనది. అపత్యమైనది, మృత్యువునకు కారణభూతము, ఇంకను ఆది పురుగులను దీపశిఖవలె బాగుగా ఆకర్షించి నాశనము చేయును. తేలికగా చేపలు చిక్కుటకు ఎరలయొక్క మాంసము ఏవిధముగా, కారణమగునో ఆకై ఏషయలంపీటులైనవారికి సంసారము వాశవకారణమగును.
ఇట్లు నారదుడు తండ్రితో పలికి నమస్కరించి ఆతని సన్నిధిలో నిలబడెను.
కుమారుడగు నారదుని మాటలు విని బ్రహ్మదేవుడు కంపించుచున్న అవయవములతో, ముఖము ఎఱ్ఱబాగా పెదవులు వణకగా ఇట్లనెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఈవిధముగా అనెను.
నారద! నీకు నాశాపము వలన జ్ఞాన లోపము కలుగును. నీవు ఉపబర్హణుడవను గంధర్వుడవుగా పుట్టుదువు. ఆజన్మలో నీవు స్త్రీలోలుడవు. స్థిర యావనము, మంచి అందము కల స్త్రీల కెందరికో నీవు ప్రియుడవు కాగలవు. నీకు భార్యలు ఏబదిమంది ఉందురు. నీవు శృంగారశాస్త్రవేత్తవై, నానావిధములైన శృంగారవిషయములందు మేటి ప్రవీణుడవు కాగలవు. గంధర్వవంశములో నీవు చాలా గొప్పవాడవుగా, సుస్వరముగల మంచిగాయకుడవుగా, వీణావాదనలో మిక్కిలి నిపుణుడవుగా, ప్రాజ్ఞుడు, మధురపోక్, శాంతము కలవాడు, మంచినడవడి కలవాడు, సుందరుడు, జ్ఞానవంతుడవుగాకూడ కాగలవు నీవు, నీ భార్యలు, ప్రియురాండ్రతో కలసి నిర్జనమైన అడవిలో లక్షదీవ్యయుగాలు గడిపి, మరల నా శాపముతోనే దాసీ పుత్రుడవు కాగలవు, ఆ జన్మలో విష్ణుభక్తులతో కలిసియున్నందువలన, వైష్ణవులయొక్క ఉచ్చిష్టమును భుజించుటవలన, మరల నా అనుగ్రహమువలన నాపుత్రుడవు కాగలవు. నీవు ఏ జన్మలో ఉన్నా నీకు దివ్యమైన పూర్వజ్ఞానముండును. ఇక ప్రస్తుతము నీవు దివ్యత్వమును, నాయొక్క పుత్రత్వమును పోగొట్టుకొని భూలోకమున పడిపోవుదువు.
బ్రహ్మదేవుడు తన పుత్రుడైన నారదునితో ఈవిధముగా అనగా నారదుడు ఏడ్చుచు చేతులు జోడించుకొని తండ్రితో ఈవిధముగా ఆనెను.
నారద ఉవాచ- నారదుడు ఇట్లు అనెను.
ఓ తండ్రి నాపై నీ కోపమును ఉపసంహరింపుము. జగములను సృష్టించువాడవు. తపస్వులలో శ్రేష్టుడవైన నీకు అసందర్భమైన ఈ కోపము తగదు. విద్వాంసుడు తన కొడుకు చెడుతోవలలో తిరిగినచో తిట్టవచ్చును. వదలి వేయవచ్చును. కానీ తపస్సు చేసుకొను కొడుకును ఎందుకు తిట్టెదవు, ఐనా ఓ తండ్రి నేను ఏఏ. జన్మలెత్తినా హరిభక్తి నన్ను వదలకుండునట్లు, వేదజ్ఞానము వదలకుండునట్లు వరమును మాత్రము ఇమ్ము, బ్రహ్మదేవుని పుత్రుడైనా హరిభక్తి లేనిచో ఈ భారత దేశమున సూకరముకన్న వేరు కాజాలడు. హరిభక్తికలవాడు సూకరజన్మనెత్తినా తన గతజన్మసృతి కలిగిన వాడై తన కర్మలచే గోలోకమును చేరగలడు. భగవంతుడైన హరియొక్క పదపంకజములందలి భక్తియనే తేనెను ఆస్వాదించు వైష్ణవాదుల స్పర్శచేతనే ఈ భూమీ పవిత్రమైనది. అట్లే పుణ్యతీర్థములు పాపులయొక్క, పాపితత్వముకలవారియొక్క, పాపముల ప్రక్షాళనకై వైష్ణవులయొక్క స్పర్శను కోరును. నారాయణ మంత్రోపదేశమును పొందినందువలన మానవులు తమకు ముందుపుట్టిన కోటి పురుషులు, తరువాత పుట్టబోవు కోటిమందితో కలసి ముక్తిని పొందుదురు. నారాయణ మంత్రాన్ని స్వీకరించినంతనే కోటి జన్మలనుండి సంపాదించిన పాపములు తొలగి, వారి పూర్వకర్మలు తొలగి పరిశుద్ధులగుదురు.
పుత్రులకు, భార్యకు, శిష్యులకు, సేవకులకు, బంధువులకు ఏయజమాని సన్మార్గమును చూపించునో అతడు సద్గతిని పొందును. శిష్యులు సంపూర్ణ విశ్వాసము తనయందుంచినా చెడుమార్గమును ఎవరు చూపింతురో ఆ గురువు సూర్యచంద్రులు కలయంత కాలము కుంభీపాక నరకముననుండును. ఎవరైతే శ్రీకృష్ణపాదభక్తిని ఇవ్వలేరో ఆతడు గురువైనా, తండ్రియైనా, స్వామియైనా, కొడుకైనా అతడు దుర్మార్గుడే.
ఓ చతురాననుడా! తప్పులేక నీచే శపింపబడినాను. అందువల్ల నీవుకూడ శపించుటకు తగినవాడవు. పండితులైనా చంపుచున్నవానిని చంపుచున్నారు కదా. సృష్టికర్తలకు సృష్టికారకుడవైన నీకు కవచము, స్తోత్రము, పూజ మొదలైనవి నా శాపము వల్ల ఉండకుండుగాక. మూడు కల్నములు సంపూర్ణమైన తర్వాత నీవు పూజింపబడుదువు. నీకు యజ్ఞ భాగము, ప్రతాదులలో పూజ, దేవతలు మొదలగువారిచే గౌరవింపబడడము జరుగదు. అని నారదుడు బ్రహ్మదేవునితో పలికి బాధాతప్తహృదయముతో సభయందు నిలుచుండెను.
బ్రహ్మదేవుని శాపమువలన ఉపరుడను గంధర్వుడుగా, దాసీపుత్రుడుగా తరువాత జ్ఞానమును పొంది నారదుడయ్యెను.
శౌనక మహరీ! నీకు తరువాత కథను చెప్పెదను.
బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతిశౌనక సంవేదరూపమైన బ్రహ్మఖండమున, బ్రహ్మదేవుడు, నారదుడు పరస్పరము శాపములిచ్చుకొనుట, నిందించుట అనే ఎవమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 8 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
Continuing his sacred task of populating the cosmos with wisdom and life, Lord Brahmā brought forth from his four sacred mouths the four holy Vedas, the Vedāṅgas, the sacred Mantras, and the personified codes of righteous living. He then created from his divine mind the progenitors of mankind, including the Manus, Maharshi Daksha, and his spiritual son Maharshi Nārada. However, when Lord Brahmā commanded Maharshi Nārada to enter worldly family life and assist in procreating populations, Maharshi Nārada respectfully declined, declaring his unwavering resolve to remain a lifelong celibate focused exclusively on the loving service of Lord Śrī Kṛshṇa. This refusal sparked intense anger in Lord Brahmā, leading to a dramatic exchange of mutual curses wherein Lord Brahmā cursed Maharshi Nārada to become a wandering Gandharva immersed in worldly passion, while Maharshi Nārada cursed Lord Brahmā to lose widespread ritual worship among human beings on earth.