శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
18 - అష్టాదశోఽధ్యాయః
సూతుడు ఇట్లు పలికెను: పరీక్షిత్తు తల్లి గర్భములో నుండగా అశ్వ త్థామయొక్క అస్త్రముచే దహింపబడియు, అద్భుతమగు లీలలు గల శ్రీకృష్ణభగవానునియొక్క అనుగ్రహము వలన జీవించెను. ఆయనకు బ్రాహ్మణశాపము వలన తక్షకుని రూపములో ప్రాణగండము కలిగెను. కాని, భగవానునియందు అర్పితమైన హృదయము గల ఆయనను ఆ మహాభయము కూడ సమ్మోహితుని చేయలేక పోయేను. ఆయన వ్యాసుని కుమారుడగు శుకమహర్షికి శిష్యుడై సర్వమునందు ఆసక్తిని విడనాడి, శ్రీహరియొక్క తత్త్వమును తెలుసుకొని, గంగానదీతీరమునందు తన దేహమును విడిచి పెట్టెను.
పరమేశ్వరుని పవిత్రమగు కీర్తిని మాత్రమే వర్ణిస్తూ, ఆయన - గాథలు అనే అమృతమునాస్వాదిస్తూ, ఆయన పాదపద్మములను స్మరిస్తూ జీవించే సాధకులకు మరణసమయములో నైననూ అజ్ఞానవ్యామోహము కలుగదు.
అభిమన్యుపుత్రుడగు పరీక్షిత్తు ఏకచ్ఛత్రాధిపతియై భూమిని పాలించుచున్నంత వరకు, కలి ఈ లోకములో అంతటా వ్యాపించి యున్ననూ, ఆతని ప్రభావము ఉండదు.
ఏ రోజున ఏ క్షణములో భగవానుడు భూమిని విడిచినాడో, అదే క్షణములో అధర్మమునకు మూలకారణమగు కలి ఈ లోకములో ప్రవేశించి నాడు.
కలియుగములో పుణ్యమును తలబెట్టినంత మాత్రాన ఫలము సిద్ధించును. కాని పాపమును తల పెట్టి ఆచరించినప్పుడు మాత్రమే దాని ఫలము మానవునకు తగులుకోనును. ఈ సారము తుమ్మెద వలె సారగ్రా హియగు పరీక్షిత్తునకు తెలియును. కావుననే, ఆయన కలిని ద్వేషించలే
తోడేలు గొర్రెల మందలో ప్రవేశించి వాటిని కబళించును. అదే విధముగా కలీ అసోవధానమగు చిత్తము గల మానవులలో ప్రవేశించి వారిని ప్రభావితులను చేయును. ఈ విధముగా అవివేకులపై తన ప్రతిభను చూపే కలి వివేకవంతుల యెడల భయపడును. అట్టి భీరువు వలన ఏమగును?
మీరు కోరిన విధముగా నేను ఇంతవరకు శ్రీకృష్ణభగవానుని వృత్తాంతముతో కలిసి ఉన్న పవిత్రమైన పరీక్షిత్తుయొక్క గాథను మీకు చెప్పియుంటిని.
భగవానుని గుణములు మరియు. లీలలు విషయవస్తువులుగా గల కథలు చక్కగా వర్ణించుటకు తగియుండును. శ్రేయస్సును కోరు మన వుడు వాటిని అన్నింటినీ సేవించ దగును.
ఓ సూతా! నీవు మర్త్యులమగు మాకు శ్రీకృష్ణభగవానుని అమృత తుల్యమగు విశుద్ధకీర్తిని గురించి వర్ణించినావు. అట్టి నీవు చిరకాలము జీవించము.
ఈ సత్రయాగము మమ్ములను గట్టెక్కించుననే నమ్మకము లేదు. ఈ యజ్ఞములో మా శరీరములు పొగరినవి. నీవు మాకు మధురమగు
విష్ణుభక్తులతోడి సంగముయొక్క లేశమునకైననూ స్వర్గము గాని, పునర్జన్మ లేని మోక్షము గాని తులదూగవు. ఇక మరణధర్ములగు మాస వుల భోగములను గురించి చెప్పునదేమున్నది?
శ్రీకృష్ణభగవానుడు మహాత్ములకు ఏకైకము మరియు పర్వో త్కృష్టము అగు ఆశ్రయమై యున్నాడు. ఆయన కథలయందు రసజ్ఞుడగు వానికి ఎవనికైననూ తృప్తి కలుగదు. శివుడు, బ్రహ్మ మొదలగు యోగేశ్వరులు నిర్గుణుడగు పరమేశ్వరుని గుణముల అంతమును కనుగొనలేక పోయిరి.
ఓ విద్వాంసుడా! నీ జీవితములో భగవత్సేవ ప్రముఖమైన అంశ ముగా నున్నది. అట్టి నీవు మహాత్ములకు ఏకమాత్రజీవనసర్వస్వమగు శ్రీహరియొక్క పవిత్రచరితమును వినగోరే మాకు దానిని విస్తారముగా చెప్పుము.
మహాబుద్ధిశాలి మాత్రమే గాక, గొప్ప భగవద్భక్తుడు కూడా అయిన ఆ పరీక్షిన్మహారాజు వ్యాసపుత్రుడగు శుకమహర్షిచే ఉపదేశించబ డిన జ్ఞానముయొక్క ప్రభావముచే మోక్షము అని పిలువబడే గరుడధ్వ జుని పాదమూలమును పొందెను. అట్టి పరమపవిత్రమగు భాగవతపురాణ ము ఆ అనంతుని లీలలతో మాత్రమే గాక, అత్యాశ్చర్యకరమగు జ్ఞానని ష్ఠతో గూడియున్నది. శుకుడు పరీక్షిత్తునకు ఉపదేశించిన ఆ భాగవతము భగవద్భక్తులకు అత్యంతప్రీతిపాత్రమైనది. దాని అర్థము మాకు సుస్పష్ట ముగా బోధపడే విధముగా నీవు దానిని మాకు చెప్పుము.
ఆశ్చర్యము! బాగు బాగు! నేను విలోమకులమునకు చెందినవా డనే అయిననూ ఈ నాడు మహాత్ముల సేవాభాగ్యము లభించుటచే నా జన్మ సఫలమైనది. మహాత్ములతో సంభాషించే యోగము పట్టినచో, అది విలోమకులమునకు చెందియుండుట వలన కలిగిన మానసిక పీడను శీఘ్ర ముగా పోగొట్టును.
మహాత్ములకు ఏకమాత్ర శరణస్థానమగు పరమేశ్వరుని నామ మును కీర్తించు వాని దోషములన్నియు తొలగి పోవునని వేరే చెప్పవల యునా? ఆ శ్రీవిష్ణుభగవానుడు అనంతమగు శక్తి గలవాడు, మరియు అంతము లేని గొప్ప గుణములు గలవాడు అగుట చేతనే ఆయనకు అనం తుడను పేరు వచ్చినది.
గుణములచే పరమేశ్వరునితో సమానమైనవాడు గాని, అధికుడు గాని లేడను విషయమును తెలియుటకు ఇంతమాత్రము సూచించిన చాలు ను. అది యేదనగా, లక్ష్మి తనను ప్రార్థించే బ్రహ్మాదులను విడిచి పెట్టి, తనను కోరని శ్రీహరియొక్క పాదధూళిని సేవించుచున్నది.
ఇంతేగాక, బ్రహ్మగారు శ్రీహరియొక్క పాదములపై అర్ఘ్యజల మును సమర్పించగా, అదియే ఆ పాదములనుండి జారి గంగయై, శివు నితో సహా జగత్తును పవిత్రము చేయుచున్నది. ముకుందుని మినహా యించి భగవాన్ (ఐశ్వర్య-వీర్య-యశః- శ్రీ-జ్ఞాన-వైరాగ్యములనే ఆరు గుణములు గలవాడు) అనే పదము మరి యెవరిని నిర్దేశించును?
ఆ పరమేశ్వరునియందు భక్తిగల వివేకులు శీఘ్రముగా దేహము మొదలగు వాటియందు గల బలమైన ఆసక్తిని విడిచి పెట్టి, ఆశ్రమములలో ఆఖరుది మరియు సర్వశ్రేష్థమైనది అగు పరమహంసాశ్రమము (సన్న్యాస ము) ను స్వీకరించి, అహింస మరియు సర్వకర్మసన్న్యాసము అనునవి సహజధర్మములుగా గలవారు అగుదురు.
సూర్యుని వలె ప్రకాశించే ఓ మహాత్ములారా! మీరు నన్ను శ్రీహరి యొక్క లీలలను గురించి ప్రశ్నించిరి. ఈ విషయములో నేను నాకు గల జ్ఞానమునకు అనురూపముగా మాత్రమే చెప్పగలను. పక్షులు ఆకాశములో పైకి తమ శక్తి మేరకు మాత్రమే ఎగురును గదా! అటులనే, విద్వాంసులు విష్ణువుయొక్క లీలలను తమ శక్తిమేరకు మాత్రమే వర్ణించ గల్గుదురు. కాని, ఆకాశము వలె ఆ లీలలు అనంతములే.
ఒకనాడు పరీక్షిన్మహారాజు అడవిలో వేటాడుచూ ధనస్సును ఎక్కు పెట్టి మృగముల వెనుక వెళ్లి వెళ్లి అలసి సొలసి అధికమగు ఆకలి దప్పికలకు వశుడయ్యెను.
ఆ పరీక్షిన్మహారాజునకు ఎక్కడా జలాశయము కానరాలేదు. ఆయన అచట ఒక ఆశ్రమములోనికి ప్రవేశించెను. అచట కన్నులు మూసు కొని శాంతభావముతో నున్నవాడు, ఇంద్రియవ్యాపారములను (ప్రత్యాహార ము) ఉచ్చ్వాసనిశ్శ్వాసలను (ప్రాణాయామము) కట్టి పెట్టి మనస్సును బుద్ధిని నిరోధించి (సమాధి) సంసారమునకు అతీతముగా నున్నవాడు, జాగ్రత్-స్వప్న-సుషుప్తులు అనే మూడు అవస్థలకు అతీతమైన ప్రత్యగభి న్నమగు నిర్వికారపరబ్రహ్మస్వరూపమునందు ప్రతిష్ఠితుడై యున్నవాడు, రేగిన జటలచే మరియు కృష్ణమృగచర్మముచే కప్పబడియున్న దేహము గలవాడు అగు మునిని చూచి, ఎండిపోవుచున్న అంగుడి గల ఆ మహా రాజు ఆయనను నీటిని ఇమ్మని కోరెను.
ఆ ముని రాజునకు కూర్చునే చాపను ఈయలేదు. ఆసనమనసు చూపించలేదు. త్రాగే నీటిని ఈయలేదు. తియ్యని పలకరింపు లేదు. ఆయన తనను అవమానించినాడనియే రాజు భావించి కోపించేను.
ఓ శౌనకమహర్షీ! ఆకలి దప్పీకలతో బాధపడుచున్న రాజునకు వెనువెంటనే ఇదివరలో ఎన్నడూ లేని విధముగా ఆ మునిపై అసహనము మరియు కోపము కలిగెను.
ఆ మహారాజు అక్కడనుండి బయటకు వస్తూ, చచ్చిపడియున్న ఒక పామును ధనస్సుయొక్క కొనతో కోపముచే ఆ బ్రహ్మర్షి మెడలో వేసి, నగరమునకు తిరిగి వచ్చెను.
ఈతడు వాస్తవముగా సకలేంద్రియములను ఉపసంహరించి కన్ను లను మూసుకొనియున్నాడా? లేక, ఈ అయోగ్యులగు రాజులతో మనకు పని యేమి అని తలచి, సమాధిని నటించుచున్నాడా? (అని ఆ రోజు ఆ సమయములో తలపోసెను).
ఆ మునికి మహాతేజశ్శాలియగు బాలకుడైన పుత్రుడు గలడు. ఆతడు పిల్లలతో ఆడుకుంటూ, రాజు తన తండ్రి విషయములో తప్పుగా ప్రవర్తించినాడని విని, అప్పుడు ఇట్లు పలికెను.
జనులు విసిరిన అన్నమును తిని బలిసియున్న కాకులవంటి పాల కులు ఎంతటి అధర్మమును చేయుచున్నారు! పాలకులు తమ ప్రభువులగు ప్రజలకు ద్రోహమును చేయుట, గుమ్మము వద్ద కాపలా కాసే కుక్క ప్రభువు ఇంటిలోనికి చొరబడిన చందముగా నున్నది.
ఈ అయోగ్యుడగు క్షత్రియుడు బ్రాహ్మణులచే తమ ద్వారపాలకు నిగా నియోగించ బడినాడు. అట్టి ద్వారపాలకుడు ఇంటిలో ప్రవేశించి గిన్నె లోని ఆహారమును భుజించుట ఎట్లు సమంజసమగును?
తప్పు దారిన నడిచే వారిని దండించే శ్రీకృష్ణభగవానుడు అవతా రమును చాలించినాడు. కాని, ఈ నాడు నేను మర్యాదను ఉల్లంఘించు వారిని దండించుచున్నాను. నా బలమును చూడుడు.
కోపముతో ఎరుపెక్కిన కన్నులు గల ఆ ఋషిబాలకుడు తన మిత్రులగు ఋషిబాలకులతో నిట్లు పలికి, కౌశికీనదియొక్క నీటిని ఆచమ నము చేసి, వాక్కు రూపములోనున్న వజ్రము (శాపము) ను విడిచి పెట్టెను.
ఈ తీరున నా తండ్రికి ద్రోహమును చేయుట ద్వారా మర్యాదను ఉల్లంఘించి తన వంశమునకు చేటు తెచ్చి పెట్టిన ఆ వ్యక్తిని నాచే ప్రేరితుడైన తక్షకుడు ఈనాటినుండి ఏడవ రోజున వినాశము చేయగలడు.
తరువాత ఆ మునిబాలకుడు. ఆశ్రమమునకు వచ్చి తన తండ్రి మెడలో పాముయొక్క మృతదేహమును గాంచి, దుఃఖపీడితుడై బిగ్గరగా రోదించెను.
ఓ శౌనకమహర్షీ! అంగిరసుని వంశములో జన్మించిన ఆ శమీకమహర్షి పుత్రుని రోదనమును విని, మెల్లగా కన్నులను తెరచి, తన మెడలోని చచ్చిన పామును చూచి, దానిని ఆవల పారవైచి, పుత్రుని ఇట్లు ప్రశ్నించెను: కుమారా! ఎందులకు ఏడ్చుచుంటివి? నీకు ఎవరు అపకారమును చేసినారు? అపుడా బాలకుడు జరిగిన వృత్తాంతమును చెప్పెను.
శాపమునకు అర్హుడు గాని పరీక్షిన్మహారాజును తన పుత్రుడు శపిం చినాడని విని, ఆ శమీకమహర్షి తన పుత్రుని అభినందించ లేదు. ఆయన వానితో నిట్లనెను: అయ్యో! ఓరీ మూర్ఖా! నీవు పెద్ద పాపమును చేసితివి. చిన్న తప్పుకు పెద్ద దండనను విధించితివి.
పరిపక్వము కాని బుద్ది గల ఓ అజ్ఞానీ! రాజు అనగా విష్ణువే అని శాస్త్రములు చెప్పుచున్నవి. అట్టి రాజును నీవు సామాన్యమానవులతో సమానముగా జమ కట్టుట తగదు. మహారాజుయొక్క తేజస్సును ఇత రులు సహించలేరు. ఆ తేజస్సుచే రక్షింపబడే జనులు భయవిముక్తులై మంగళములను పొందుచున్నారు.
ఓయీ! చక్రధారియగు విష్ణువు రాజు అనే పేరుతో లోకమును రక్షించుచుండును. అట్టి రోజు లేని కాలములో రక్షణ కరువైన ఈ లోకము చోరులతో నిండి, గొర్రెల మందవలే క్షణకాలములో నశించును.
లోకమునకు రాజు లేనప్పుడు చోరులు ఇతరుల ధనమునపహ రించెదరు. ఆ పాపము సంబంధము లేకున్ననూ మనకు చుట్టుకొనును. జనులలో చోరుల శాతము పెరుగును. జనులు ఒకరినొకరు చంపుకోనె దరు; తిట్టుకొనెదరు; పశువులను, స్త్రీలను, సంపదలను అపహరించెదరు.
ఇంతే గాక, రాజు లేని సమాజములోని మానవులలో వైదికమగు ఆర్యధర్మము నశించి, వర్ణాశ్రమాచారములు లోపించి, జనులలో అర్థకామ ములయందలి తృష్ణ పెరిగి, వర్ణసంకరమేర్పడును. జనులు శునకముల వలె భోగమాత్రపరాయణులై, కోతుల వలే చంచలచిత్తు లగుదురు.
ధర్మరక్షకుడు, గొప్ప కీర్తి గలవాడు, స్వయముగా గొప్ప భక్తుడు, రాజర్షి, అశ్వమేధయాగములను చేసినవాడు అగు పరీక్షిన్మహారాజు ఆకలి దప్పికలతో అలసి సొలసి మన ఆశ్రమమునకు వచ్చినాడు. ఆ చక్రవర్తి మన శాపమునకు అర్హుడు కానే కాడు.
పరిపక్వము కాని బుద్ధి గల ఈ అవివేకి పాపమునేరుంగని పోడు, మనకు సేవను చేయువాడు అగు మహారాజు విషయములో పాపమును చేసినాడు. సర్వప్రాణులకు ఆత్మరూపుడగు పరమేశ్వరుడు ఆ పాపమును క్షమించును గాక!
శ్రీహరి భక్తులను తిరస్కరించిననూ, మోసగించిననూ, తిట్టిననూ, అవమానించిననూ, ఆఖరికి కొట్టిననూ, వారు సమర్థులే అయి ఉండి కూడా, దానికి ప్రతీకారమును చేయరు.
ఈ విధముగా ఆ శమీకమహర్షి తన కుమారునిచే రాజు విషయములో చేయబడిన పాపమునకు పశ్చాత్తాపపడుచుండెనే గాని, తన విషయములో రాజు చేసిన దోషమును గురించి తలపోయనే లేదు.
లోకములో జనులు తమను సుఖదుఃఖాది ద్వంద్వములకు గురి చేసిననూ, సాధుపురుషులయందు దుఃఖము గాని, హర్షము గాని ఉండ దు. ఏలయనగా, ఆత్మస్వరూపము సుఖదుఃఖాదులకు అతీతమైనది.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో
పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.
