శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
4 - చతుర్థోఽధ్యాయః
వ్యాసుడు ఇట్లు పలికెను: చిరకాలము సాగే సత్రయాగము కొరకై ఒకచోటకు చేరియున్న ఆ మునులలో పెద్దవాడు, కులపతి, ఋగ్వేదవి ద్వాంసుడునగు శౌనకుడు ఈ విధముగా పలికిన సూతమహర్షిని కొని యాడి ఇట్లు పలికెను.
శౌనకమహర్షి ఇట్లు పలికెను: ఓయీ సూతా! మహాత్మా! నీవు వక్త లలో శ్రేష్ఠుడవు. పూజ్యుడగు శుకమహర్షి చెప్పిన పవిత్రమైన భగవంతునికి సంబంధించిన గాథను మాకు చెప్పుము.
ఈ భాగవతసంహిత ఏ యుగమునందు ఏ స్థానమునందు ఏ కారణముచే ఆరంభమైనది? వ్యాసమహర్షి ఎవరి ప్రేరణచే దీనిని రచించినాడు?
ఆ వేదవ్యాసమహర్షియొక్క కుమారుడగు శుకయోగీంద్రుడు సర్వత్రా బ్రహ్మను దర్శించే జ్ఞాని. ఆయనయందు భేదదర్శనము లేదు. అజ్ఞానమనే నిద్రనుండి మేల్కాంచిన ఆ శుకుని మనస్సు నిరంతరము భగ వంతునిపై లగ్నమై యుండును. ఆయన మహిమ బయటకు ప్రకటము కాని కారణముచే చూచువారలకు మూడుడా యన్నట్లు కానవచ్చును.
తన పుత్రుడగు శుకుని అనుసరించి వ్యాసుడు వెళ్లుచుండగా, అప్సరసలు ఆయనను చూచి, ఆయన నగ్నముగా లేకున్ననూ, తమ వస్త్రములను ధరించిరి. కాని, ఆయన ముందు నగ్నముగా వెళ్లుచున్న ఆయన పుత్రుడగు శుకుని చూచి వారు కంగారుపడ లేదు. ఆశ్చర్యము! ఈ విషయమును గమనించిన వ్యాసుడు ప్రశ్నించగా, వారు ఇట్లు బదులు చెప్పిరి: నీకు స్త్రీపురుషభేదము గలదు. కాని, పవిత్రమగు దృష్టిగల నీ పుత్రునకు అట్టి భేదము లేదు సుమా!
కురుజాంగలదేశమును చేరుకొని హస్తినాపురములో పిచ్చివాని వలే (లోకవిపరీతమగు చేష్టలను కలిగియుండుట), మూగవానివలె (మాటలాడకుండుట), మందునివలె (ఏ విధమైన ఉద్యమమును చేపట్టకుండుట) సంచరించే ఆ శుకమహర్షిని పురప్రజలు ఎట్లు గుర్తుపట్టిరి?
పాండవుల వంశములో జన్మించిన రాజర్షియగు పరీక్షిత్తునకు శుక మహర్షితో సంవాదము ఏ విధముగా సంపన్నమయ్యెను? ఆ సంవాదము నందే శుకమహర్షి ఈ భాగవతసంహితను చెప్పినాడు గదా!
మహాత్ముడగు ఆ శుకమహర్షి గృహస్థుల గృహములయందు వారి గృహమును పవిత్రము చేయువాడై ఆవు పాలను పితికినంత సేపు మాత్రమే వేచియుండును.
అభిమన్యుని పుత్రుడగు పరీక్షిత్తు భగవద్బక్తులలో శ్రేష్ఠుడని చెప్పెదరు. గొప్ప ఆశ్చర్యమును గొలిపే ఆయన జన్మను మరియు కర్మ లను గురించి మాకు చెప్పుము.
పాండువంశప్రతిష్ఠను ఇనుమడింపజేసే ఆ చక్రవర్తి సామ్రాజ్యల క్ష్మిని తిరస్కరించి గంగాతీరమునందు ప్రాయోపవేశము చేయుటకు కారణ మేమై యుండును?
ఓయీ సూతా! శత్రువులు తమ క్షేమమును గోరి సంపదలను తీసుకొని వచ్చి పరీక్షిన్మహారాజుయొక్క పాదపీఠమునకు స్పష్టముగా నము స్కరించేదరు. యువకుడు, వీరుడు అగు ఆ మహారాజు క్లేశముచే మాత్రమే విడువ సాధ్యమయ్యే సంపదను ప్రాణములతో సహా పరిత్యజించుటకు కారణమేమి? ఇదీ ఆశ్చర్యముగా నున్నది!
భగవానుని మాత్రమే శరణు జొచ్చి జీవించే జనులు లోకము యొక్క కల్యాణము, సమృద్ధి మరియు ఐశ్వర్యముల కొరకు మాత్రమే ఉవించెదరు గాని, తమ కొరకు కాదు. పరీక్షిత్తు విరక్తుడై పరోపకారము కకు మాత్రమే నియోగింపబడే తన శరీరమును విడుచుటకు కారణమేమి?
ఈ సందర్భములో మేము నిన్ను ఏదైతే ప్రశ్నించినామో, ఆ సర్వ మును మాకు చెప్పుము. వేదవాక్కును మినహాయిస్తే, వాక్కులకు గోచర మయ్యే విజ్ఞానములో, అనగా సర్వశాస్త్రములలో నీవు పారంగతుడవని నా అభిప్రాయము.
సూతమహర్షి ఇట్లు చెప్పెను: మూడవదియగు ద్వాపరయుగము అంతము కాబోయే సమయములో పరాశరమహర్షి వలన ఉపరిచరవసువు యొక్క కుమార్తెయగు సత్యవతియందు శ్రీహరియొక్క అంశావతారమైన జ్ఞానియగు వ్యాసమహర్షి జన్మించినాడు.
ఆ మహర్షి ఒకనాడు సూర్యోదయసమయములో సరస్వతీనది యొక్క జలములలో స్నానాదికమును చేసి పవిత్రుడై నిర్జనస్థానమునందు ఒంటరిగా కూర్చుండెను.
అమోఘమగు దృష్టిని కలిగి భూతభవిష్యత్కాలముల గురించి తెలిసినవాడు, మననశీలుడునగు ఆ వేదవ్యాసమహర్షి గుర్తుపట్టరానంత వేగముతో పరుగెత్తే కాలముయొక్క ప్రభావము వలన ప్రతి యుగపరి వృత్తిలో భూలోకమునందు ఆయా యుగధర్మములు క్షీణించుచుండుటను గమనించేను. ఇంతేగాక, ధర్మగ్లానియొక్క ప్రభావముచే పంచభూతము లచే నిర్మితమైన శరీరము మొదలగువాటి శక్తి క్షీణించుటను కూడ ఆయన కనుగొనెను. భాగ్యవిహీనులగు జనులు శ్రద్ద, ధైర్యము (సత్త్వగుణము) లేనివారై, మందబుద్ధులై, అల్పాయుష్కులై ఉందురని ఆయన తన దివ్య దృష్టితో చూచి, సమస్తవర్ణములకు మరియు ఆశ్రమములకు హితమును చేకూర్చు ఉపాయమును గురించి విచారించు చుండెను.
హోత, అధ్వర్యుడు, ఉద్గాత మరియు బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే నిర్వర్తించబడే వేదవిహితకర్మ జనుల అంతఃకరణమును శుద్ధి చేయునని గమనించి, అట్టి యజ్ఞములు నిరంతరముగా కొనసాగ గలందులకై ఆ వేదవ్యాసమహర్షి ఒకే వేదమును నాలుగుగా విభాగము చేసి వ్యవస్థను చేసెను.
ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములనే నాలుగు వేదములను వేరు చేసేను. ఇతిహాసపురాణములకు అయిదవ వేదమని పేరు.
ఆ వేదములలో ఋగ్వేదమునందు పైలుడు, సామవేదగా నమునందు విద్వాంసుడగు జైమిని, మరియు యజుర్వేదమంత్రము లయందు కేవలము ఒక్క వైశంపాయనుడు నిష్ణాతులైరి.
అథర్వవేదశాఖలయందు క్రూరుడగు సుమంతు (స్పష్టమగు దోషము గలవాడు) ముని (లేదా దరుణుని కుమారుడగు సుమంతుడు), ఇతిహాసపురాణములలో నా తండ్రియగు రోమహర్షణుడు నిష్ణాతులైరి.
ఆ ఈ మహర్షులు తమ తమ వేదములను మరల అనేకశాఖలుగా విభాగము చేసిరి. ఈ విధముగా శిష్యులు, శిష్యుల శిష్యులు, మరల వారి శిష్యుల ద్వారా వేదములు అనేకశాఖలు గలవి అయెను.
దీనులయందు ప్రేమగల భగవాన్ వేదవ్యాసమహర్షి అవియే వేద ములను మందబుద్దులగు మానవులు కూడ తమ బుద్దియందు ధరించగ లిగే విధముగా విభాగమును చేసెను.
వేదోక్తమగు కర్మలు శ్రేయస్సునకు సాధనములు. కాని వాటి విష యములో మూడులైయున్న స్త్రీలకు, శూద్రులకు మరియు ఉపనయనసం స్కారమున్ననూ యోగ్యత లేనివారికి వేదము శ్రేయస్సాధనరూపములో అందుబాటులో లేదు. కావున, ఈ కాలములో వారికి ఈ విధముగా శ్రేయస్సు కలుగుగాక! అనే దయాబుద్ధితో వ్యాసమహర్షి మహాభారతమనే ఇతిహాసమును రచించినాడు.
ఓ మహర్షులారా! ఈ విధముగా వ్యాసమహర్షి సర్వకాలములలో సర్వశక్తులను ధారపోసి ప్రాణుల హితమును చేగూర్చీసాడు. అయిననూ, ఆ కార్యముల వలన ఆయన హృదయమునకు సంతోషము కలుగలేదు. ఒకనాడు ధర్మవేత్తయగు ఆ వ్యాసమహర్షి కొద్దిగా ఖిన్నమగు మనస్సు గల వాడై పవిత్రమగు సరస్వతీనదీతీరమునందు నిర్జనస్థానములో కూర్చుండి ఆలోచిస్తూ తనలో తాను ఇట్లు అనుకొనెను.
నేను వ్రతమును చేబట్టి వేదములను, గురువులను మరియు అగ్నులను పూజించి, వారి (గురువుల మరియు వేదముయొక్క) ఆదేశ మును పాటించితిని.
ఇంతేగాక, మహాభారతము అనే పేరుతో వేదముయొక్క తాత్ప భ్యమును నేను జనులకు అందజేసితిని. దానియందు స్త్రీలు, శూద్రులు మొదలగువారు కూడ ధర్మము మొదలగు విషయములను చూచి తెలుసు కొన గల్గుదురు.
అయ్యో! అయినప్పటికీ ఈ నా దేహములో ఉపలభ్యమయ్యే జీవుడు స్వరూపముచే పూర్ణుడే అయిననూ అపూర్ణునివలే, బ్రహ్మతేజస్సు గలవాడే అయిననూ మిక్కిలి అయోగ్యుని వలే తోచుచున్నాడు.
నేను భగవంతుని వద్దకు చేర్చే ధర్మములను ప్రముఖముగా వర్ణిం చలేదని తోచుచున్నది. అదియే నా ఖేదమునకు హేతువు కావచ్చును. ఏలయనగా, పరమహంసలకు (జ్ఞానులకు) ప్రియములగు ఆ ధర్మములే శ్రీమహావిష్ణువునకు కూడ ప్రియములు.
ఈ విధముగా వ్యాసమహర్షి తనను అపూర్ఖునిగా భావించి ఖేద మును పొందియుండగా, నారదమహర్షి పైన ఉదహరించిన వ్యాసుని ఆశ్రమమునకు విచ్చే సెను.
దేవతలచే పూజింపబడే నారదముని విచ్చేయుటను గాంచి వ్యాస మహర్షి వెనువెంటనే ఎదురేగి ఆయనను యథావిధిగా పూజించేను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో నాల్గవ అధ్యాయము ముగిసినది.
