శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

11 -  ఏకాదశోఽధ్యాయః

సూతుడిట్లు పలికెను: శ్రీకృష్ణుడు సుసమృద్ధమగు తన ఆవర్తదేశ మును చేరి, అచటి జనుల వియోగదుఃఖమును పోగొట్టుచున్నాడా యన్నట్లు శంఖములలో శ్రేష్ఠమగు పాంచజన్యమును ఊదెను.

శ్రీకృష్ణుడు శంఖమును పద్మములవంటి అరచేతులయందు పట్టు కోని ఊదినప్పుడు, అది తెల్లనిదే అయిననూ ఆయన క్రింది పెదవియొక్క ఎర్రదనము దానియందు ప్రతిఫలించి అది కూడ ఎర్రగా కన్పట్టెను. పద్మ ములను బోలిన ఆయన అరచేతులలో ఆ శంఖము, పద్మముల గుంపులో నున్న దై బిగ్గరగా కూసే రాజహంసను బోలియుండెను.

జగత్తులోని భయమునకు భయమును గొలిపే ఆ శబ్దమును దగ్గ రగా విని జనులందరు తమ ప్రభువును దర్శించాలనే లాలస గలవారై ఎదురేగిరి.

ఆ సమయములో జనులు సూర్యునకు దీపమును చూపించే భక్తు లవోలె మహాదరముతో ఉపాయనములను గొనివచ్చి, ఆత్మస్వరూపము నందు రమించువాడు, సర్వకాలములలో ఆనందఘనమగు ఆత్మయొక్క లాభముచే పరిపూర్ణమైన కామనలు గలవాడు, సర్వులను పాలించే మిత్రుడు అగు శ్రీకృష్ణునకు సమర్పించిరి. తరువాత వారు ఆయనను ఉద్దే శించి, పిల్లలు తండ్రితో వలె, ఆనందముతో బొంగురుపోయిన కంఠముతో నిట్లు పలికిరి.

ఓ ప్రభూ! బ్రహ్మాదులను కూడ కబళించి వేసే కాలముయొక్క నీడయైననూ నీపై పడదు. నీ పాదపద్మమును బ్రహ్మ సనకాదులు ఇంద్రుడు నమస్కరించెదరు. ఈ లోకములో క్షేమమును గోరువారికి సర్వోత్కృష్టమగు ఆశ్రయమైన నీ పాదపద్మమును మేము నమస్కరించుచున్నాము,

జగత్తును సృష్టించిన ఓ పరమేశ్వరా! మాకు కల్యాణమును కలి గించుము. మాకు తల్లి, తండ్రి, మిత్రుడు, ప్రభువు, సద్గురువు మరియు సర్వోత్కృష్టమగు దైవమవు నీవే. మేము నిన్ను సేవించి కృతార్థులమైతిమి.

ఆహా! నీ మూలకముగా మేము కృతార్థులమైతిమి. ప్రేమతో కూడిన చిరునవ్వుతో మురిపించే చూపులు గల ముఖముతో నలరారే నీ సర్వసుందరమగు రూపమును మేము కనుగొను చున్నాము. ఈ రూపము స్వర్గవాసులకైననూ దుర్లభమే గదా!

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు మిత్రులను చూడ గోరి హస్తినాపురమునకు గాని, మథురామండలమునకు గాని వెళ్లిపోయిన ప్పుడు, సూర్యుడు లేని కన్నులకు వలె, నీ వారమగు మాకు క్షణము కోటి సంవత్సరములతో సమానముగా గడచును.

భక్తవత్సలుడగు శ్రీకృష్ణుడు ఈ విధముగా జనుల పలుకులను వింటూ, వారిపై అనుగ్రహదృష్ణులను బరపుచుండెను. శ్రీకృష్ణునితో సమా నమగు బలము గల మధు-భోజ-దశార్హ-అర్హ-కుకుర-అంధక-వృష్టివంశ ములకు చెందిన యాదవులు ద్వారకను, నాగులు భోగవతీనగరమును వలె రక్షించుచుందురు. ఋతువులన్నింటిలో సకలవైభవముతో కూడిన పుణ్యవృక్షములతో మరియు లతామండపములతో కూడిన ఉద్యానవనము లతో, సామాజిక వనములతో మరియు క్రీడామైదానములతో చుట్టువారబడి యున్న సరస్సులు ఆ నగరపు శోభను ఇనుమడింప జేయుచుండెను. నగ రద్వారములకు, గృహద్వారములకు, మార్గములయందు జనులు ఉత్సవ తోరణములను కట్టిరి. రంగు రంగుల జెండాలు, ప్రతాకలు లోపలకు ఎండ రాకుండగా చేయుచుండెను. రాజమార్గములను, ఇతరవీధులను, కూడళ్ల ను, బజార్లను తుడిచి, పరిమళజలములను చిమ్మి, ఫలములను, పుష్ప ములను, అక్షతలను, చిగుళ్లను చల్లిరి. ప్రతి గృహద్వారమునందు పేరు గు, అక్షతలు, పళ్లు, చెరుకు ముక్కలు గల జలపూర్ణకుంభములు, ఉపహార ములు మరియు ధూపదీపములు ఏర్పాటు చేయబడెను. శ్రీకృష్ణుడు అట్టి ద్వారకా నగరమును ప్రవేశించేను.

మహాత్ముడగు వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్ర సేనుడు, అద్భుత మగు పరాక్రమము గల బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతి పుత్రుడగు సాంబుడు ప్రియతముడగు శ్రీకృష్ణుని రాకను గురించి విని, గొప్ప హర్షమును పొందిరి. వారు ఆ ఆనందపు హడావుడిలో తల్పము, ఆసనము, మరియు భోజనము అనువాటిని ఎక్కడివి అక్కడనే విడిచి పెట్టి, కంగారుగా రథములపై ఆయనకు ఎదురేగిరి. వారు ఆనంద ముతో ఆదరముతో పెద్ద ఏనుగును ముందడుకొని వెళ్లిరి. మంగళద్రవ్య ములను చేత ధరించిన బ్రాహ్మణులు వేద ఘోషను చేయుచూ వెంట నడిచిరి. కాంతులీనే కుండలములచే ప్రకాశింప చేయబడే చెక్కిళ్లతో శోభిల్లే ముఖములు గల నాట్యగత్తెలు వందల సంఖ్యలో శ్రీకృష్ణుని దర్శించ వలె ననే కుతూహలముతో వాహనములపై ఎదురేగిరి. నటులు, నాట్యగాళ్లు, పౌరాణికులు, వంశకీర్తివాచకులు, కబుర్ల రాయుళ్లు కూడ ఎదురేగిరి. పవిత్ర కీర్తి గల శ్రీకృష్ణుని అద్భుతములగు గాథలను గాయకులు పాడుచుండిరి.

ఆ సమయములో శ్రీకృష్ణభగవానుడు తనను కలుసుకొనుటకు వచ్చిన బంధువులను, నగరవాసులను విడివిడిగా దగ్గరకు వెళ్లి కలిసి వారిని ఆదరించెను.

సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు కొందరికి తలను వంచి నమస్కరిం చెను. కొందరికి నమస్కారమును చెప్పెను. కొందరిని కౌగిలించు కొనెను. కొందరితో చేతులను కలి పెను. కొందరిని చిరునవ్వుతో పలుకరించెను. కొందరితో చూపులను కలిపెను. కొందరికి అభీష్టములగు వరములనిచ్చే ను. ఈ విధముగా మిక్కిలి అల్పుని వరకు అందరిని ఆదరించెను. ఇంతే గాక, తాను స్వయముగా గురువుల, భార్యలతో గూడియున్న బ్రాహ్మణుల మరియు వృద్ధుల ఆశీర్వచనములను స్వీకరించి, వందిమాగధులు కీర్తించు చుండగా, అందరితో కలిసి నగరమును ప్రవేశించెను.

ఓ శౌనకమహర్షీ! శ్రీకృష్ణుడు రాజవీధికి చేరుకోగానే ద్వారకలోని కులస్త్రీలు ఆయనను చూడాలనే గొప్ప ఉత్సాహము గలవారై మేడల పైకి ఎక్కిరి.

ద్వారకానగరనివాసులు నిత్యము వక్షఃస్థలమునందు లక్ష్మి నిత్యని వాసము చేసే శ్రీకృష్ణుని చూచుచునే యున్ననూ, వారి నేత్రములకు తృప్తి కలుగుట లేదు.

ఆయన వక్షఃస్థలము లక్ష్మీదేవికి, బాహువులు లోకపాలకులకు, పద్మమువంటి పాదము ఆయన కీర్తిని గానము చేసే భక్తులకు నివాసస్థాన ములు. ఆయన ముఖము కన్నులకు అమృతకలశము (అనగా, ఆయనమ చూచుట అమృతపానము వంటిది).

పచ్చని వస్త్రములను వనమాలను దాల్చియున్న శ్రీకృష్ణునకు రాజమార్గములో తెల్లని గొడుగును పట్టి, వింజామరలను వీచిరి. ఆయనపై పూలవానను కురిపించిరి. అపుడాయన సూర్యుడు (గొడుగుతో పోలిక), నక్షత్రములు (పూలు), చంద్రుడు (వింజామరల భ్రమణము), ఇంద్రధ నస్సు (వనమాల) నురియు మెరుపు (ఉత్తరీయము) లతో కూడిన మేఘము (స్వయముగా శ్రీకృష్ణుడే) వలె నొప్పారెను.

శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల ప్రాసాదమునకు వెళ్లి ఆనందముతో దేవకి మొదలగు ఏడురు తల్లులకు తలవంచి నమస్కరించెను. వారు ఆయ నను కౌగిలించుకొనిరి.

ప్రేమచే స్రవించే స్తనములు గల ఆ తల్లులు శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండ బెట్టుకొని మహానందముతో ముంచెత్తబడిన హృదయములు గలవారై ఆయనను ఆనందాశ్రువులతో తడిపీరి.

తరువాత ఆయన సకలభోగములతో కూడియున్న సర్వోత్తము మగు తన భవనమును ప్రవేశించేను. అక్కడనే ఆయన భార్యల పదునారు వేల ఎనిమిది మకాములు గలవు.

కొంత కాలము దూరదేశములో నివసించి తిరిగి వచ్చిన భర్తను దూరమునుండియే చూచిన ఆ పత్నులు మనస్సులో ఉవ్విళ్లూరే ఉత్సా హముతో, కన్నులలో ముఖములో సిగ్గును ఒలకబోయుచూ, వెంటనే ధ్యానమును, దానితో బాటు భర్త లేనప్పుడు పాటించే నియమములను కూడ విడిచి, ఆసనమునుండి లేచి నిలబడిరి.

ఓ శౌనకమహర్షీ! గంభీరమగు అభిప్రాయము గల ఆ శ్రీకృష్ణప త్నులు తమ భర్తను ముందు హృదయములో, తరువాత చూపులతో, తరు వాత పుత్రుల రూపముగా శరీరముతో కౌగిలించు కొనిరి. అధికముగా సిగ్గు పడుచున్న ఆ పత్నులు వివశలై కన్నీటి ప్రవాహమును ప్రయత్నించియు ఆపుకొన లేక పోయిరి.

ఈ శ్రీకృష్ణుడు ఏకాంతములో తమ ప్రక్కనే యున్ననూ, వారికి ఆయన పాదములు ప్రతి క్షణములో నిత్యనూతనములుగా కన్పట్టుచుండె ను. ఏ పాదమును చంచలయగు లక్ష్మి (కదలాడే శోభు ఏ కాలమునందై నను విడిచి పెట్టదో, అట్టి పాదమునందు ఏ భార్యకు విసుగు కలుగును?(కలుగదు).

అక్షౌహిణీల సేనలచే తేజస్సును సర్వత్రా ప్రసరింప జేసి తమ పుట్టుక భూమికి భారమగునట్లు చేసిన రాజుల మధ్య విరోధమును కల్పించి, అడవిలో రాపిడి ద్వారా నిప్పును కలిగించి దానితో ఆ అడవిని తగుల బెట్టి ఉపశమించే వాయువు వలే, శ్రీకృష్ణుడు కూడ తాను ఆయుధమును పట్టకుండగనే వారు పరస్పరము వధించు కొనునట్లు చేసి తాను విరమించెను.

తన మాయాశక్తిచే ఈ మనుష్యలోకమునందు అవతరించిన శ్రీకృ ష్ణభగవానుడు సామాన్యమానవుని వలె ఉత్తమలగు భార్యల మధ్యలో నున్నవాడై రమించెను.

ఏ స్త్రీల గంభీరమగు మనోభిప్రాయమును వెల్లడి చేసే స్వచ్చ మగు సుందరమైన చిరునవ్వు మరియు సిగ్గుతో కూడిన చూపులు అను వాటిచేత కొట్టబడినవాడై సంమోహమును పొందిన మన్మథుడు తన ధన స్సును పరిత్యజించినాడో, అట్టి సౌందర్యరాశులగు స్త్రీలు కూడ తమ కప టవిలాసములచే శ్రీకృష్ణుని మనస్సునందు లేశమైననూ క్షోభను కలిగించ లేక పోయిరి.

శ్రీకృష్ణుడు వివిధములగు పనులను చేయుచున్ననూ, ఆయనకు వాటియందు కర్తృత్వభోక్తృత్వరూపమగు సంగము లేదు. కాని ఈ విషయ మునేరుంగని మానవుడు తనతో పోల్చుకొని, ఆయన కూడ సంగము కల వాడే యని భ్రాంతి పడుచుండును.

పరమాత్మ త్రిగుణాత్మకమగు ప్రకృతి అనే ఉపాధియందు ప్రకట మగును. కాని, ఆయనకు ఆ ప్రకృతిగుణములగు సుఖదుఃఖాదులతో సంగ ము లేదు, అదియే ఈశ్వరుని ఈశ్వరత్వము, సర్వదా పరమాత్మయందు లగ్నమై ఉండే బుద్ది తనయందలి రాగద్వేషాది సంస్కారములచే లిప్తము కాదు గదా!

అజ్ఞానులగు ఆ స్త్రీలకు తమ భర్తయగు శ్రీకృష్ణుని మహిమ తెలి యదు. వారు తమ బుద్ధికి తోచినట్లుగా, క్షేత్రజ్ఞుడగు పరమాత్మను బుద్ధివృ త్తులు తమ వశములోని జీవుడని భావించు విధముగా, ఆయన తమకు వశుడనియు, ఏకాంతమునందు తమకు సేవను చేయువాడనియు తలపో సిరి.

శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో

పదునొకండవ అధ్యాయము ముగిసినది.