57 -  యజ్ఞప్రవర్తనం

ఋషులనిరి:- పూర్వము స్వాయంభువ మన్వంతరముననున్న నాలుగు యుగములను వాని స్వభావమును తత్యమును విస్తరముగా వినదలచితిమి.

సూతుడనెను:- పృథివి మొదలగువాని ప్రసంగమున నేను పూర్వము చెప్పినవారి చతుర్యుగమిది. దానిని జెప్పెదను వినుడు. ఇచట విస్తారముగా నంతట సంఖ్యచే చక్కగా లెక్కించి, యుగము, యుగభేదము, యుగధర్మము, యుగాంశకము, సంధ్యాంశకము, యుగసంధానము - అను నాజు విధముల యుగనామములను వాని తత్యములతో నిటజెప్పెదను. లౌకిక ప్రమాణముతో తెలియబడిన సంవత్సరము మానుషము. ఆ సంవత్సరముతో లెక్కించి యిచట చతుర్యుగమును జెప్పెదను.

నిమేషకాలము (కనురెప్పపాటు కాలము) కాష్ఠ, కళలు, ముహూర్తకములు ఇవి కాలగణనలో కొన్ని (ఏకమాత్రకమై హ్రస్వమైన) లఘ్వక్షరము నిమేషకాల తుల్యమైనది-6. పదియైదు నిముషములు కాష్ఠ ముప్పది కాష్ఠలు కళయని లెక్కింపవలె. ముప్పది ముహూర్తములు ఒక రాత్రి పగలు గలిగినదియు. సూర్యుడు అహోరాత్రములను మానుషములు దైవికములు అని రెండు విధములుగా విభజించును. అందులో పనిచేతలందు అహస్సు, పడుకొనుటకురాత్రియు కల్పింపబడుచున్నవి. పితరుల రాత్రీ పగలు గలిసిన దినము మానవుల ఒక మాసము ఆ రాత్రి పగలు విభాగము మానవుల కృష్ణ పక్షము పితరులకు ఒక పగలు, అట్లే శుక్లపక్షము వారికి పడుకొనుటకు రాత్రి. ముప్పది మానుష మాసములు పితరులకు ఒక్క మాసము. మూడు వందల యజువది మానుష మాసములు ఒక పితరుల సంవత్సరము. మానుష మాసమున నూరేండ్లు పిత్సమాసమున నీట మూడేండ్లుగా లెక్కింపబడినవి. పిత్స మానమున నాలుగు మాసములధికములనబడినవి. లౌకిక మానమున మానుషమైన సంవత్సరము దేవా మానమున ఒక రాత్రి పగలు కలసినదినము. ఈ శాస్త్రమున నిశ్చయమీష్టము . దేవతల రాత్రి పగళ్ళు, వర్షము మరి వారియొక్క విభాగమిట్లుండును. పైజెప్పబడిన దేవతల రాత్రి పగళ్ళలో ఉత్తరాయణము పగలు దక్షిణాయనము రాత్రియు నగును. ఆ ముప్పది మాసములు దేవతల మాసమనబడినది. నూరు మానుష మాసములు మూడు దివ్యమాసములు మరియు పది దినములును. ఇది దివ్యవిధి యనబడినది. మూడువందల యజువదియేండ్లు దివ్య సంవత్సరము. ఇది మానుష మానముతో జెప్ప బడినది, మానుష మానముతో మూడువేల ముప్పది' వర్షములు సప్తర్షుల సంవత్సరము. మానుషములైన తొమ్మిదివేల తొంబదియేండ్లు క్రౌంచ సంవత్సరమనబడును. మానుషమానముతో ముప్పదియారువేల వత్సరములు దివ్యములైన నూరు సంవత్సరములు ఇది దివ్యవిధియనబడినది. మూడు మానవుల మాసములు లెక్కించిన నియుత (లక్ష) సంవత్సరములు మరియు అరువదివేల సంవత్సరములు (60,000) దేవమానమున వేయిసంవత్సరములని సంఖ్యాధులైన జనులు చెప్పుదురు. ఈ విధముగ దేవమానసంఖ్యతోగూడినది ఋషులతో జెప్పబడినది. యుగ సంఖ్యా ప్రకల్పనముగూడ దేవమానముతోనే చూడవలెను.

భారత వర్షమున యుగములు నాలుగని కవులు (పండితులు) తెలియుదురు. మొదట కృతయుగము తరువాత త్రేతాయుగమనబడినది. ద్వాపరము కలియునని యీ యుగముల కల్పింపవలెను. నాలుగువేల సంవత్సరములు కృతయుగమందురు. అచట నైతే సంధ్య(లు) నూరే సంధ్యాంశములు నట్లే (నూరి). ఇతర సంధ్యలలోను మూడు సంధ్యాంశముల లోను ఒకటి తక్కువ వేయి నూరు (1099) ఉండును. త్రేతాయుగము మూడు వేలయేండ్లు అని సంఖ్య చెప్పబడినది. దానికి మూడు వందల సంధ్యలు సంధ్యాంశములు నంతియ (300). ద్వాపర యుగము రెండువేల యేండ్లని విద్వాంసులందురు. దానికిగూడ రెండు వందల సంధ్యము సంధ్యాంశములు గూడ సంధ్యలతో సమానము (20. కలియగము వేయియేండ్లని విద్వాంసులందురు దానికి గూడ ఒక నూరుసంధ్యలు సంధ్యాంశములు సంధ్యలతో సమానము(100). ఇది పన్నెండువేలయుదియని యుగ సంఖ్య చెప్పబడినది. అవి కృతయుగము త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని.

ఈ విధముగా సంధ్యాంశములు లేకుండగా నాలుగు యుగముల కాలము చెప్పబడినది. సంధ్యాంశములతోగూడిన చుతర్యుగ సంఖ్య నలుబది మూడు లక్షల యిరువదివేలు. ఈ విధముగ చతుర్యుగముల పేరు సాధిక కృత త్రేతాది - యుక్తమైయది డెబ్బది యొక్కటియైనచోమనువు యొక్కయంతరమనబడును. మన్వంతరము యొక్క సంఖ్యను వర్షాగ్రముతో, వీనుడు. అవి మానుషమానమునముప్పది కోట్ల సంవత్సరములు అనబడినది. సాధికను వదిలి యరువది యేడు లక్షల యిరువది వేల (సంవత్సరముల) కాలము. ఇది మన్వంతరము యొక్క సంఖ్య. పండితులచే చెప్పబడినది. ఈ మన్వంతరము యొక్క కాలము యుగములతోబాటు చెప్పబడినది. నాలుగువేల యేండ్లతో గూడినది. మొదటి కృతయుగము త్రేతాయుగమును ద్వాపర యుగమును కలియుగమును జెప్పెదను. ఒకేసారి కలిసినయర్థము (వస్తువు విషయమును) రెండు విధముల జెప్పరాదు. క్రమముగా వచ్చిన యీ యుగద్వయము ఋషివంశ ప్రసంగమునను అట్లే వ్యాకులుడనగుట చేతను నాచే నీకు చెప్పబడినది. అందులో త్రేతాయుగ ప్రారంభమున మనువు ఆ సప్తర్షులును శ్రుతి ప్రోక్తమైన ధర్మము, స్మృతిప్రోక్తమైన ధర్మమున్ను బ్రహ్మచే ప్రేరేపింపబడినవి. ఋగ్ యుజ్ సామవేదముల జెప్పబడిన దారాగ్నిహోత్ర సంయోగము మొదలగు లక్షణములుగల భౌతమగు (శ్రుతిప్రోక్తమగు) ధర్మమును సప్తర్షులు చెప్పిరి. పరస్పరముగా వచ్చిన ధర్మము ఆచారరూపమై స్మార్త ధర్మమైనది. వర్ణాచార ఆశ్రమాచారములతో గూడిన దానిని స్వాయంభువ మనువు ధర్మముగా జెప్పును. సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను తపస్సుతోను బాగుగా తపించిన తపస్సుగల తపస్వుల యారేయ (ఋషిసంబంధమైన) క్రమముతోను, సప్తర్షుల యొక్కయు, మనువు యొక్కయు త్రేతాయుగ ప్రారంభమున అబుద్ధి పూర్వకముగా

ఇచట మానమాన ప్రకారముగా సంవత్సరములు సృష్టించబడినవి. ఆ ప్రమాణముతోనే కృతయుగ వర్ష (సంవత్సర) మానమునుజెప్పెదను. అవి అంకెలలో నిట పదునాలుగు లక్షలు కలికాలయుగమునకు నలుబది నాలుగు వేలు ఈ విధముగ లెక్కించిన కాలము. విశేషించి కాలములలో లెక్కించిన కాలము. అక్రియ పూర్వకముగా తారకాది నిదర్శనములతో వెలువడినవి మంత్రములు ఆదికల్పమునందైతే దేవతల నుండియే స్వయముగా బయలువెడలినవి. నాశమందైనను ఈ సిద్ధులు ప్రవర్తిల్లును. గడచిన కల్పములలో వేలకొలది మంత్రములుండినవి. ఆ మంత్రములైతే వారి ప్రతిభాసము నుండి బుట్టినవి. సప్తర్షులచే ఋక్కులు (ఋగ్వేదము) యజుస్సులు (యజుర్వేదము) సామములు (సామవేదమును జెప్పబడినవి. మనువు స్మార్త ధర్మమును జెప్పెను.

త్రేతాయుగ ప్రారంభమున కేవలము ధర్మ విశేషముగా వేదములు గూర్చబడినవి. ద్వాపరయుగమున ఆయువును సంరోధించుట వలన విశేషముగా వ్యాపించి యుంచబడినవి. పూర్వము కలియందును ద్వాపరమునందును ఋషులును దేవతలును స్వయంభువుడైన బ్రహ్మచే జనన మరణములులేనివారుగా దివ్యులుగాను సృష్టించబడిరి. యుగమున వారు యుగముననుసరించి ధార్మికులుగను, ప్రజలతో గూడిన వారుగను రాజ్యాంగములతో గూడిన వారుగను, వేదమును జెప్పువారుగను సమానమైన (సుఖ) ప్రయోజనముగల వారుగనునై విశేషముగ క్రీడించుచుండిరి. క్షత్రియ జాతియొక్క కార్యారంభము యజ్ఞముగా గలవారు ఋషులు.రాజు యొక్క (యజ్ఞములలో నీయబడిన) హవిసే యజ్ఞముగా గలవారు దేవతలు. పరీచారమే (ఉన్నత జాతుల సేవయే) యజ్ఞముగా గలవారు శూద్రులు. జపమే యజ్ఞముగా గలవారు బ్రాహ్మణోత్తములు-50. ఆ విధముగా త్రేతాయుగములో నాలుగు వర్ణములును (జాతులు) మిక్కిలి సంతుష్టులై ధర్మముచే రక్షింపబడిన వారై నిత్యము క్రియావంతులై ప్రజా (సంతాన)వంతులై ఐశ్వర్యవంతులై సుఖులునైయుండిరి. క్షత్రియులు బ్రాహ్మణులను అనుసరించి మెలగుచుండిరి. క్షత్రియులను వైశ్యులు వైశ్యులను శూద్రులు అనుసరించి మెలగుచుండిరి. ఈ విధముగా అందరును పరస్పరముగా నియమ బద్దులై పెద్దలననుసరించుచుండిరి. వారి ప్రవృత్తులు (నడవడులు) శుభములు, ధర్మములు వర్ణాశ్రమానుగుణములు మనసుచే సంకల్పించిన దానిని వాక్కుతో పలికిన దానిని వారు తమ క్రియలతో నాచరించెడివారు త్రేతాయుగమున కర్మారంభము వికలముగాకుండగా సిద్దించెడిది. త్రేతా యుగమున ఆయువు మేధ, బలము, రూపము ఆరోగ్యము, ధర్మశీలత, ఇవి సర్వసాధారణములై అందరియందుండునవై యుండెడివి.

 బ్రహ్మ వారికి వర్ణాశ్రమ వ్యవస్థానములనావిధముగా జేసెను. కాని మరల నా ప్రజలు అజ్ఞానము వలన ఆ ధర్మములను పాలించలేదు. ఆ ప్రజలు పరస్పర విరోధముతో మనువు ననుసరించిరి. స్వాయంభువ మనువు ఉన్నదీ యున్నట్లున్న నిజమును జూచెను-56. బ్రహ్మపురుషుడై శతరూపనుండి ప్రియవ్రత - ఉత్తాన పాదులను బుట్టించేను. వారు మొదటి రాజులు. అది మొదలు దండధారులైన రాజులు పుట్టిరి. ప్రజలను రంజింపచేయుటవల్ల ఆ నరపాలురు రాజులైరి. కప్పిపుచ్చుకొన్న పాపములు గలిగి భూమిలో జయింపనలవిగానివారు. ధర్మ సంస్థాపనమునకై వారిని శాసించు శాస్త్రమున నా చేత తపము జేయబడినది-59. ఋషులైన బ్రాహ్మణులచే త్రేతాయుగమున వర్ణముల విభాగములు చక్కగా జెప్పబడినవి, తరువాత వేదసంహితలు మంత్రములును చెప్పబడినవి. అపుడు దేవతలచేత నీ విధముగా యజ్ఞము ప్రవర్తింపజేయబడినది. జపములతో అప్పుడీ విధముగ శుక్లపక్ష యామముల సర్వసంభారములతోను జపములచే దేవతలు యజ్ఞమును నిర్వహింపజేసిరి. విశ్వభుక్కైన విష్ణువుతోబాటు మహౌజస్వియైన దేవేంద్రునిచే స్వాయంభువ మన్వంతరమున పూర్వ యా యజ్ఞములు ప్రవర్తింపబడినవి. సత్యము జపము, తపము దానములను త్రేతాయుగములో ధర్మమని చెప్పబడినది. క్రియాధర్మము తగ్గును. సత్యధర్మము ప్రవర్తించును.

తరువాత శూరులు, ఆయుష్మంతులు, మహాబలులు ప్రజలను శిక్షించు దండనీతి గలవారు, మహాభాగులు (అదృష్టవంతులు), యజ్ఞములను జేయువారు, బ్రహ్మను (వేదములను పరబ్రహ్మను) జెప్పువారును, పద్మపత్రములవలె విశాలమైన కన్నులుగల వారు, విశాల వక్షముగలవారు చక్కని శరీరావయవముల కూర్సుగలవారు, సింహములను గూడ జంపు శౌర్యము గలవారు, మహాప్రాణశక్తి గలవారు మదపుటేనుగువలె ఠీవిగా నడచువారును, మహాధనుస్సును ధరించినవారునైన చక్రవర్తులు త్రేతాయుగమున నుండువారు. వారు సర్వలక్షణ సంపన్నులు, మట్టిచెట్టు వంటి పరిమండలముగలవారు. ఆ బాహువులు న్యగ్రోధములు (మజ్జిచెట్టువలె విశాలము) అనబడినవి. వారి బాహ్వంతరము గూడ న్యగ్రోధము (మజ్జిచెట్టువలె విశాలము) అనబడినది. దేహికి ఎడమవైపుగా సమోన్నతమైనది సముచ్చయమగు. ఆ విధముగా సమోన్నతమైన వైశాల్యము న్యగ్రోధమండలమని తెలియవలెను. చక్రము, రథము, మణి, భార్య, విధి, అశ్వములు, గఖములు - ఈ యేడు సమస్త చక్రవర్తులకును మహారత్నములు. చక్రము, రథము మణి, ఖడ్గము, ధనుః శ్రేష్ఠము, ధ్వజము(జెండా) నిధియు ఈ యేడును ప్రాణహీనములు (రత్నములు) అనబడినవి. భార్య పురోహితుడు, సేనాని, రథకారుడు, మంత్రి, అశ్వము, గున్నయేనుగును నీ యేడును ప్రాణముతో గూడినవి(రత్నములు) అనబడినవి. ఈ రత్నములు దివ్యములు మహాత్ములకు సిద్ధించునవి. చక్రవర్తులందరికిని నీ పదునాలుగు రత్నములు విధిగా నుండదగినవి.

 భూత భవిష్యత్కాలములలోని మన్వంతరములయన్నింటిలోను భూలోకమున చక్రవర్తులు విష్ణువుయొక్క యంశతో బుట్టుదురు. భూతభవిష్యత్తులలోను వర్తమానము నందును త్రేతాయుగాదులలోను ఇచట చక్రవర్తులు విష్ణ్యంశతోనే బుట్టుదురు. ఆ రాజులకు ఇచట నీవిక్షేమకరములు. బలము, ధర్మము, సుఖము, ధనము అనునీ నాలుగు అద్భుతములు. ఇవి పరస్పరవిరోధము లేకుండగా సమముగా రాజులను చేరును. అణిమాదులైన యైశ్వర్యముతోను, ప్రభుశక్తితోను వీనికి వేరైన తపస్సుచేతను వీరు ఋషులను అవమానింతురు. బలము చేతను, తపముచేతను, దేవదానవ, మానవులను తిరస్కరింతురు. వీరు శరీరమున (నుండు) మానుషేతరములైన చిహ్నములతో గూడ జన్మింతురు. వెంట్రుకలతో ఫాలభాగమున కనుబొమల మధ్య సుడిగలవారు, చీపురువంటి నాలుకగలవారు, ఎఱ్ఱని పెదవులు దంతములు గలవారు. రొమ్మునందు (విష్ణువునకు వలె) మచ్చగలవారు పైకి నిక్కబొడిచిన వెంట్రుకలు గలవారు మోకాళ్ళ వరకు బాహువులు గలవారు, జాలమువలెనుండు చేతులు గలవారు (అరచేతి వేళ్ళు) సందులుగానున్నవారు), వృషభ చిహ్నము గలవారు మఱిచెట్టు వలే విశాలమైనవారు సింహము వంటి భుజస్కంధము గలవారు, చక్కని జననాంగము గలవారు, గజరాజువలె గంభీరముగ నడచువారు, గొప్పనైన చెక్కిలిపై భాగము గలవారు, వారి పాదములలో చక్రమత్స్యములు చేతులలో శంకపద్మములును గలవారు. వారు ఎనుబదియైదు సంవత్సరముల వరకు ఆ రాజులు ముసలితనములేనివారై యుందురు. వారియొక్క గమనములు సంగము లేనివి. అవి నాలుగు అంతరిక్ష గమనము. సముద్ర గమనము, పాతాళగమనము, పర్వత గమనమును. త్రేతాయుగములో ఇజ్యా (యుగము) దానము, తపము, సత్యమును, ధర్మముగా జెప్పబడినవి.  అపుడు ధర్మము వర్ణాశ్రమ విభాగమును బట్టి నడుచుచుండెను. దండనీతి మర్యాదాస్థాపనమునకే ప్రవర్తిల్లుచుండెను. సమస్త ప్రజలు సంతుష్టులై పుష్టిగాను, రోగములేని వారుగను. పూర్ణమైన మనస్సుగలవారుగను నుండిరి. త్రేతాయుగవిధిలో నాలుగు పాదములతో గూడిన యొక్కవేదము చెప్పబడినది. అపుడు మానవులు మూడు వేలయేండ్లు జీవించు యుండువారు . పుత్రులతోను మనుమలతోను వ్యాపించినవారై క్రమముగా వారు మరణింతురు. ఇది త్రేతాయుగములోని ధర్మము త్రేతాసంధిలో దానిని వినుడు.

 త్రేతాయుగ విభాగము సంధ్యావాదముతో నుండును. సంధ్యయందలి స్వభావము యుగపాదముతో నుండును . శాంశపాయ నుడనేను. పూర్వము స్వాయంభువమను సృష్టిలో త్రేతాయుగ ప్రారంభమున యజ్ఞము యొక్క ప్రవర్తనము (జరుపుట) ఎట్లుండెనో! దానిని నాకు జెప్పుము. కృతయుగముతోబాటు సంధ్యగూడ గడచిపోగా, త్రేతాయుగము వచ్చినపుడు కళయన్నది ప్రవర్తిల్లగా మరల వర్ణాశ్రమవ్యవస్థ నేర్పరచిరి. ఓ శాంశపాయనః ఆ సంభారములన్నియు సంపాదించి యజ్ఞమెట్లు నిర్వహింపజేయబడినదో వినుమనీ సూతుడు చెప్పెను. త్రేతాయుగప్రారంభమున వర్ష సృష్టి జరిగి యోషధులు పుట్టగనే, గృహములలోను ఆశ్రమములలోను, పురములలోను, జీవనోపాయములైన వృత్తులు స్థిరముగ నేర్పడగనే యజ్ఞము ప్రవర్తిల్లజేయబడినది. వర్ణ-ఆశ్రమముల వ్యవస్థ నేర్పరచి, వేద మంత్రములను సంహితను రచించి, లౌకికాలౌకికర్మలందు ఆ మంత్రములను జోడించియు. విశ్వాపాలకుడైన యింద్రుడు అపుడు సమస్త దేవతలతో గూడి సర్వసంభారములతో సంపాదించిన యజ్ఞమును బ్రవర్తిల్లజేసెదను.

 ఆ తరువాత అశ్వమేధయాగ విస్తారము జరుగగా మహర్పులు వచ్చిరి. అందరు వచ్చి పవిత్రములైన పశువులతో హోమము జేసి యజ్ఞము చేయుచుండిరి. నిరంతరము జరుగు యజ్ఞ కర్మయందు ఋత్విజులు వారి పనులలో నిమగ్నమైరి. ఆ తరువాత వెంటనే వేదములు (ఆగమములు) గానము జేయబడినవి-. యజ్ఞమున యజుర్వేదమును జదువు (అధ్వర్యు శ్రేష్ఠులు తొందరగా తిరుగుచుండిరి. పవిత్రములైన పశుగణములు లభింపకుండినవి. యజ్ఞాహుతికై కోయబడినవి. దేవతలును యజ్ఞభాక్కులైన మహాత్ములును పిలువబడగానే దేవహోతలచే (దేవతలకై హోమము జేయువారిచే) దేవలతకై హవిస్సు హోమము జేయబడినది. ఇంద్రియాత్మకులైనట్టియు, యజ్ఞక్కులైనట్టియు కల్పాదిలో నున్నవారునైన దేవతలను దేవతలప్పుడు, కల్పాదులలో యజ్ఞముతో బూజింతురు-96. ప్రేష కాలమున లేచిన యధ్వర్యులైన మహర్షులు దీనములైయున్న పశుగణములను జూచి యందజుగూడి ఈ యజ్ఞ విధియేమిటని యింద్రుని నడిగిర. నీవు ధర్మమును బొందగోరి హింసచేయుట నీకు బలీయమైన ధర్మము. ఓ దేవ శ్రేష్ఠుడా! నీ యజ్ఞమున పశువధయనిష్టము. ధర్మమును పడగొట్టుటకై పశువులతో నీచే యధర్మమునుప్రారంభింపబడినది. ఇది ధర్మముగాదు. ఇదియధర్మము హింస ధర్మమని చెప్పబడదు. నీవు కోరినచో వేదముతో యజ్ఞమును జేయము. అవినాశ కారణమైన వేద శాస్త్రదృష్టమైన విధానముగల యజ్ఞముతో ధర్మమును నిర్వహింపుము. ఓ దేవేంద్ర! హింసకు తావులేనివియు మూడేండ్ల యుత్కృష్ట కాలముండి మొలవనట్టి యజ్ఞ బీజములతో యజ్ఞమును నిర్వహింపుము. ఓ యింద్రా! ఇది స్వయంభువైన బ్రహ్మచే పూర్వము చెప్పబడిన గొప్ప ధర్మము.

జంగమములచేతనా? లేక స్థావరములచేతనా? యెవరిచే నీలోకమున యజ్ఞము చేయదగినది జెప్పబడినది? అని యీ విధముగా తత్యదర్శనులైన మునులతో నింద్రుడు చర్చించేను. ఋషులనిరి మహాప్రాజ్ఞుడవైన యోరాజా! ఉత్తానపాదునందు యజ్ఞ విధి యే రీతిగా నీచే జూడబడినది? తెలుపుము ఓ ప్రభూ! మాసంశయమును బోగొట్టుము-102. తత్యయుక్తులైన ఆ మునులు కూడ నావివాదముతో ఖిన్నులై యింద్రునితో మాట్లాడి ఈశ్వరుడైన వసువు నీ విధముగా నడిగిరీ.

వారి మాటను విని, బలాబలమును విచారింపక, వేదశాస్త్రములను స్మరించి యజ్ఞతత్యమును బలికెను. రాజు ఉపదేశించిన విధానములతో యజ్ఞము చేయదగినది అని పలికెను. యజ్ఞ బీజములు ఫలములునైన పవిత్రములైన పశువులతో యజ్ఞము చేయదగినది. యజ్ఞము యొక్క హింసాస్వభావమును గూర్చి కూడ నీ విధముగ నాకీతడు చెప్పుచున్నాడు. దీర్ఘమైన తపస్సుతో గూడిన తారకాదుల దర్శనముతో మహర్షులచేత హింసాలింగ (లక్షణ)ము గల మంత్రములు చూడబడినవి. ఆప్రామాణ్యముతోనే నాతో గూడ జెప్పబడినది. అందువలన దానిని భావింపదగదు. ఓ బ్రాహ్మణులారా! ఆ మంత్రములే ప్రమాణములైనచో అట్లే యజ్ఞము జరుగుగాక, కానిచో మా మాట అసత్యమగును. ఈ విధముగా యుక్తాత్ములై తపోధనులైన మునులు ప్రత్యుత్తరములేని వారైరి. అబద్ధములాడిన రాజు పాతాళమును బ్రవేశించినందున, పాతాళమున (నాతని) భవనమును జూచి మాటాడక మిన్నకుండుము.

అని చెప్పిన వెంటనే రాజు పాతాళమును ప్రవేశించెను. ఊర్థ్వమున చరించువాడై వసువయి పాతాళమున జరించువాడయ్యెను. ఆ మాటతోనే యాతడు భూతలమున నుండువాడు గూడనయ్యెను. తరువాత ధర్మముల సంశయముల ఛేదించు రాజైన వసువు వచ్చెను కావున బహుజ్ఞానియైనను ఒక్కడు సంశయము చెప్పరాదు. అనేకములగును ద్వారములు గల ధర్మము సూక్ష్మమయినందున దానిని దగ్గరగా వెలసికొనుట యలవికానిది కావున దేవతలను ఋషులను దగ్గర జేర్చుకొని, స్వాయంభువ మనువు దక్క తక్కి వారికి ధర్మము నిశ్చయముగ జెప్ప సాధ్యముగానిది కావున అహింస ధర్మమునకు ద్వారముగా మహర్షులు చెప్పిరి. కోటి సహస్ర ఋషులు తమ (అహింసా) కర్మ చేత స్వర్గమునకు వెళ్ళిరి. కావున మహర్షులు దానమునుగాని యజ్ఞమును గాని ప్రశంసింపరు. తపోధనులు స్వల్పముగా తమ వైభవముననుసరించి కందమూలమును, ఫలమును, శాకమును, జలపాత్రమును ఈ విధముగ (హింసలేక) దానముజేసి స్వర్గలోకమున సుప్రతిష్ఠితులగుదురు, ద్రోహముచేయకుండుట, లోభములేమి, ఇంద్రియ నిగ్రహము, ప్రాణులయెడ దయాభావము, తపము, బ్రహ్మచర్యము, సత్యము, కనికరము, క్షమ, ధైర్యము ఇవి సనాతన ధర్మము నకు మూలము. ఇది సామాన్యముగా నబ్బదు. ధర్మముమంత్రాత్మకమైనది యజ్ఞము భుజింపకుండుట తపము యజ్ఞముతో దేవతల జేరును. మరి, తపముతో వైరాగ్యమును జెందును. కర్మసన్యాసమున బ్రాహ్మణ్యమునందును వైరాగ్యమున లయమును జూచును. జ్ఞానము వలన కైవల్యమును (పరమేశ్వరైక్యమును) బొందును. ఈ యైదును గతులనబడినవి. ఈ విధముగ పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఋషులకును దేవతలకును యజ్ఞమును బ్రవర్తిల్లజేయుటలో గొప్ప వివాదము జరిగినది. తరువాత నా ఋషులు అద్భుతమైన మార్గమును జూచి, ఆ బలముతో వసువు (రాజు) యొక్క మాటను తిరస్కరించి వచ్చిన దారిన వెడలిరి. దేవ సంఘములు పోవగనే దేవతలు యజ్ఞమును బొందుదురు. బ్రహ్మనక్షత్రమయులైన రాజులు తపః సిద్దులుగా జెప్పబడినారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మేధాతి, వసువు, సుమేధనుడు, విరజుడు, శంఖపాదుడు, రజుడు, ప్రాచీనబర్హి, పర్జన్యుడు, హర్ధానుడు మొదలగువారు రాజులు . వీరును, మరికొందరును నైనయనేకులు రాజులు సిద్దులై స్వర్గమునకేగిరి. రాజర్షులు మహాత్యులునైన వీరి కీర్తి సుప్రతిష్ఠితమైనది కావున యజ్ఞమునకంటే తపము అన్నింటిలో బహుకారణములచే విశిష్టమైనది. పూర్వము బ్రహ్మచేత తపముచేత నీగమన శీలమైన విశ్వము సృష్టించబడినది. కావున నా యజ్ఞము అతీశయింపదు. ఇది తపోమూలకమనబడినది. అందువలన స్వామంభువ మన్వంతరమున యజ్ఞ ప్రవర్తనమీవిధముగ డెడిది. అప్పటి నుండి ఈ యజ్ఞము యుగములతోబాటుప్రవర్తిల్లెను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున యజ్ఞ ప్రవర్తనమను నేబదియేడవ యధ్యాయము.