భాగవత మహా పురాణము
13 - పురాణముల శ్లోకసంఖ్య - శ్రీమద్భాగవత మహిమ
సూత ఉవాచ ।
యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః వేదైస్సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ।
ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః ॥
శ్రీసూత మహర్షి ఇట్లు పలికెను --- ఆ పరమాత్మను బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రులు, మరుద్గణములు దివ్యములైన స్తోత్రములతో స్తుతించుచున్నారు. సామవేద విద్వాంసులు అంగములు, పదము, క్రమము, ఉపనిషత్తులతో కూడిన వేదములతో ఆ పరమాత్మను కీర్తించుచున్నారు. యోగులు ధ్యానముచే మనస్సును నిశ్చలముగా తల్లీనము చేసి ఆ పరమాత్మను ధ్యానించుచున్నారు. దేవతల మరియు ల గణములకు ఆ పరమాత్మయొక్క పూర్ఖతత్త్వము తెలియదు. ఆ ప్రకాశపరమాత్మకు నమస్కారము.
సృష్ఠే భ్రామ్యదమందమందరగిరిగ్రావాఽగ్రకండూయనాత్
నిద్రలోః కమఠాకృతేర్భగవతశ్శ్వాసానిలాః పాంతు వః ।
యత్సంస్కారకలాఽనువర్తనవశాద్వేలానిభేనాంభసాం
యాతాయాతమతంద్రితం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతి ॥
శ్రీహరి తాబేలై బరువైన మందరపర్వతమును వీపుపై మోయు డు దాని బండరాళ్ల కోనల రాపిడిచే దురద తీరి నిద్ర వచ్చెను. ఆయన శ్వాస గాలుల తాకిడి సముద్రజలములయందు ఈ సంస్కారరూపముగా మిగిలియే యున్నది. కావుననే, సముద్రము క్షోభ అనే మిషతో అలుపునేరుగకుండా ఆటుపోటులు వచ్చుచునే నవి. అట్టి భగవానుని శ్వాసవాయువులు మిమ్ములను రక్షించు గాక!
పురాణసంఖ్యాసంభూతిమస్య వాచ్యప్రయోజనే ।
దానం దానస్య మాహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత ॥
పురాణముల శ్లోకసంఖ్యను, వాటి మొత్తమును, ఈ పురాణముయొక్క విషయప్రయోజనములను, దానమును, దానమహిమను, పాఠము మొదలగువాటి మహిమను గురించి తెలియుడు.
బ్రాహ్మం దశ సహస్రాణి పాద్మం పంచోనషష్టి చ ।
శ్రీవైష్ణవం త్రయోవింశచ్చతుర్వింశతి శైవకమ్ ॥
బ్రహ్మపురాణములో పదివేలు, పద్మపురాణములో ఏభై అయిదు వేలు, శోభాయుక్త మైన విష్ణుపురాణములో ఇరవై మూడు వేలు, శివపురాణములో ఇరవై నాలుగు వేలు శ్లోకములు గలవు.
దశాష్టౌ శ్రీభాగవతం నారదం పంచవింశతిః ।
మార్కండం నవ వాహ్నం చ దశ పంచ చతుశ్శతమ్ ॥
శోభాయుక్తమైన భాగవతములో పద్దెనిమిది వేలు, నారదపురాణములో ఇరవై అయిదు వేలు, మార్కండేయ పురాణములో తొమ్మిది వేలు, అగ్ని పురాణములో పది హేను వేల నాలుగు వందల శ్లోకములు గలవు.
చతుర్దశ భవిష్యం స్యాత్తథా పంచశతాని తు ।
దశాష్టౌ బ్రహ్మ వైవర్తం లింగమేకాద శైవ తు ॥
భవిష్యపురాణములో పధ్నాలుగు వేల ఐదువందలు,వైవర్తపురాణములో పద్దెనిమిది వేలు, లింగపురాణములో పదకొండు శ్లోకములు గలవు. –
చతుర్వింశతి వారాహమేకాశీతీసహస్రకమ్ ।
స్కాందం శతం తథా చైకం వామనం దశ కీర్తితమ్ ॥
వరాహపురాణములో ఇరవై నాలుగు వేలు, స్కందపురాణములో ఎనభై
వేల ఒక వంద, వామనపురాణములో పది వేల శ్లోకములు గలవు.
కౌర్మం సప్తదశాఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్ధశ ।
ఏకోనవింశత్సౌపర్ణం బ్రహ్మాండం ద్వాదశైవ తు ॥
కూర్మపురాణములో పది హేడు వేలు, మత్స్యపురాణములో పద్నాలుగు వేలు, గరుడపురాణములో పందొమ్మిది వేలు, మండపురాణములో పన్నెండు వేల శ్లోకములు గలవు.
ఏవం పురాణసందోహశ్చతుర్లక్ష ఉదాహృతః ।
తత్రాష్టాదశసాహస్రం శ్రీభాగవతమిష్యతే ॥
ఈ విధముగా పురాణముల మొత్తము శ్లోకసంఖ్య నాలుగు లక్షలు. వాటిలో శ్రీమద్భాగవతములో పద్దెనిమిది వేల శ్లోకములు గలవు.
ఇదం భగవతా పూర్వం బ్రహ్మణే నాభిపంకజే ।
స్థితాయ భవభీతాయ కారుణ్యాత్సంప్రకాశితమ్ ॥
పూర్వము నాభియందలి పద్మములో ఉండి సంసారము వలన భయపడిన బ్రహ్మదేవునకు శ్రీహరి భగవానుడు ఈ పురాణమును చక్కగా ప్రకాశింప జేసెను.
ఆదిమధ్యావసానేషు వైరాగ్యాఖ్యానసంయుతమ్ । హరిలీలాకథావ్రాతామృతానందితసత్సురమ్ ॥
భాగవతములో ఆరంభము, మధ్య, అంతములయందు వైరాగ్యమును కలిగించే గాథలు గలవు. దీనియందలి శ్రీహరి లీలల గాథల సముదాయ మనే అమృతము సత్పురుషులనే దేవతలకు ఆనందమును కలిగించును.
సర్వవేదాంతసారం యద్బ్రహ్మాత్మైకత్వలక్షణమ్ ।
స్త్వద్వితీయం తన్ని కైవల్యైకప్రయోజనమ్ ॥
లోపనిషత్తులు బ్రహ్మ మరియు ప్రత్యగాత్మల ఐక్యమునే సారతత్త్వ ప్రతిపాదించుచున్నవి. అట్టి ఐక్యమే అసాధారణధర్మముగా గల ది లేని పరమార్థతత్త్వమేది గలదో, దానియందు భాగవతము తమైనది. భాగవతమునకు ఏకైకప్రయోజనము మోక్షము మాత్రమే.
సౌష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహసమన్వితమ్ ।
సదాతి యో భాగవతం స యాతి పరమాం గతిమ్ ॥
భాద్రపదపూర్ణిమనాడు భాగవతమును బంగరు సింహాసనములో పెట్టి చేయువాడు సర్వోత్కృష్టమైన గతి (మోక్షము) ను పొందును.
రాజంతే తవదన్యాని పురాణాని సతాం గణే ।
మావన్న దృశ్యతే సాక్షాచ్ఛ్రీమద్భాగవతం పరమ్ ॥
సత్పురుషుల సమాజములో ఎంతవరకైతే సాక్షాత్తు శ్రీమద్భాగవతము కానరాదో, అంతవరకు మాత్రమే ఇతరపురాణములు ప్రకాశించును.
సర్వవేదాంతసారం హి శ్రీభాగవతమిష్యతే ।
తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్ ॥
ఏలయనగా, శ్రీమద్భాగవతము సకలోపనిషత్తుల సారము. దానిని పఠించుటచే రసానుభవము కలిగి, అమృతమువంటి ఆ రసముచే సంతృప్తి జెందినవానికి ఇతరపురాణముల పై ప్రీతి కలుగదు.
నిమ్నగానాం యథా గంగా దేవానామచ్యుతో యథా ।
వైష్ణవానాం యథా శంభుః పురాణానామిదం తథా ॥
నదులలో గంగ యెటులనో, దేవతలలో శ్రీహరి భగవానుడు యెటులనో, విష్ణుభక్తులలో శివుడు యెటులనో, పురాణములలో ఈ శ్రీమద్భాగవతమట్టిది.
క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ హ్యనుత్తమా ।
తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః ॥
మహర్షులారా! సకల క్షేత్రములలో నిశ్చయముగా కాశీ ఎటులనో, నే పురాణములన్నింటిలో శ్రీమద్భాగవతము సర్వశ్రేష్ఠము.
శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం
యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే ।
తత్ర జ్ఞానవిరాగభక్తిసహితం నైష్కర్మ్యమావిష్కృతం
తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః ॥
శ్రీమద్భాగవతము నిర్దుష్టమైన పురాణము. ఇది విష్ణుభక్తులకు రము. దీనియందు పరమహంసలకు హితము, అద్వితీయము, చైతన్యస్వరూపము అగు పరబ్రహ్మ గానము చేయబడును. రుందు ఆత్మజ్ఞానము, వైరాగ్యము, భక్తి అనువాటితో కూడిన ంతిక-కర్మనివృత్తి ఆవిష్కరించబడినది. దీనిని భక్తితో శ్రవణము చేసి, యణ చేసి, నిష్ఠగా మననము చేయువాడు విముక్తుడగును.
కస్మై యేన విభాసితోఽయమతులో జ్ఞానప్రదీపః పురా
తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపీణా ।
యోగీంద్రాయ తదాత్మనాఽథ భగవద్రాతాయ కారుణ్యతః
తచ్చుద్దం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి ॥
ఈ భాగవతము సాటి లేని జ్ఞానమనే గొప్ప దీపము. దీనిని ఆ పరమాత్మ పూర్వము సృష్ట్యాదియందు బ్రహ్మదేవుని కొరకు, ఆ బ్రహ్మ దేవుని రూపముతో నారద మహర్షి కొరకు, నారద మహర్షి రూపముతో కృష్ణ ద్వైపాయన మహర్షి కొరకు, ఆ వ్యాస మహర్షి రూపముతో యోగివర్యుడగు శుకమహర్షి కొరకు, ఆ శుక మహర్షి రూపముతో దయచే భగవంతునియందు ప్రీతి గల పరీక్షిత్తు కొరకు ప్రకాశింప జేసెను. అట్టి పరమాత్మ శుద్దము, ప్రాకృతదోషములు లేని పరమార్థము. శోకము మరియు వినాశము లేని అట్టి పరబ్రహ్మను ధ్యానించుచున్నాము.
నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే ।
య ఇదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే ॥
ఆసాక్షియగు ఆ వాసుదేవ భగవానుని కొరకు నమస్కారము. ఆ ముడు మోక్షకామియగు బ్రహ్మదేవుని కొరకు దయతో ఈ కమును వివరించి చెప్పెను.
యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే ।
సంసారసర్పదష్టం యో విష్ణురాతమమూముచత్ ॥
యోగులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నమస్కారము. ఆయన సంసారమనే సర్పముచే కరువబడిన ్మహారాజును సంసారబంధమునుండి విముక్తుని చేసెను.
భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే ।
తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో ॥
దేవుడవగు ఓ ప్రభూ! నీవే మాకు నాథుడవు. కాబట్టి, మాకు న్మలయందు నీ పాదములపై భక్తి కలుగునట్లు చేయుము. .
నామసంకీర్తనం యస్య సర్వపాపప్రణాశనమ్ ।
వణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే త్రయోదశోఽధ్యాయః ॥
॥ ఏకాదశ స్కంధస్సమాప్తః ॥
॥ శ్రీమద్భాగవత మహాపురాణం సమాప్తమ్ ॥
శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో పురాణముల శ్లోకసంఖ్యను, శ్రీమద్భాగవత మహిమను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .
ద్వాదశ స్కంధము ముగిసినది.
శ్రీమద్భాగవత మహాపురాణము సమాప్తము.
శ్రీ గురుభ్యో నమః, హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
శ్రీవేంకటేశ్వరార్పణమస్తు.
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
The final chapter brings the *Śrīmad Bhāgavata Mahāpurāṇam* to a transcendent close, declaring its total verse count to be precisely **eighteen thousand verses** (*Ashṭādaśa-sahasra*) across **twelve cantos**. It is glorified as the essence of all Vedāntic philosophy (*Sarva-vedānta-sāram*), the mature fruit of the Vaidika desire tree, and the literary incarnation of Svayam Bhagavān Śrī Kṛshṇa. Sūta Gosvāmī concludes with the celebrated, immortal benediction: > *"Nāma-saṅkīrtanaṁ yasya sarva-pāpa-praṇāśanam |* > *Praṇāmo duḥkha-śamanas taṁ namāmi hariṁ param ||"* He declares that the congregational chanting of the holy names of Bhagavān Hari destroys all sins and relieves all suffering, granting eternal spiritual shelter at the lotus feet of Svayam Bhagavān Śrī Kṛshṇa.