భాగవత మహా పురాణము
12 - శ్రీమద్భాగవత సంక్షిప్త విషయ సూచి
సూత ఉవాచ ।
నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే ।
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యే సనాతనాన్ ॥
సూత మహర్షి పలికెను --- ధర్మము గొప్పది. దానికి నమస్కారము. జగద్విధాతయగు శ్రీకృష్ణుని కొరకు నమస్కారము. నేను వేద వేత్తలకు నమస్కరించి, సనాతనములగు ధర్మములను గురించి చెప్పెదను.
ఏతద్వః కథితం విప్రా విష్ణోశ్చరితముద్భుతమ్ ।
భవద్భిర్యదహం పృష్ణో నరాణాం పురుషోచితమ్ ॥
ఓ మహర్షులారా! ఈ అద్భుతమైన విష్ణుగాథను నేను మీకు చెప్పితిని. దీనిని గురించియే మీరు నన్ను ప్రశ్నించితిరి. జీవులకు మానవజీవితములో శ్రవణము చేయదగినది ఇదియే.
అత్ర సంకీర్తితస్సాక్షాత్సర్వపాపహరో హరిః ।
నారాయణో హృషీ కేశో భగవాన్ సాత్వతాం పతిః ॥
ఈ పురాణము సాక్షాత్తు సకలపాపములను పోగొట్టే శ్రీహరి భగవానుని గా కీర్తించినది. ఆయన సకలప్రాణుల హృదయములో విరాజిల్లుతూ, యాంతర్యామియై, సత్త్వగుణప్రధానులగు భక్తులను చున్నాడు (ఉపాసనాకాండ).
అత్ర బ్రహ్మ పరం గుహ్యం జగతః ప్రభవాప్యయమ్ ।
జ్ఞానం చ తదుపాఖ్యానం ప్రోక్తం విజ్ఞానసంయుతమ్ ॥
ఈ జగత్తు ప్రకృతికి అతీతమైన బ్రహ్మనుండి పుట్టి దానియందే రమగును. ఉపనిషత్తులీ బ్రహ్మను ప్రతిపాదించుచున్నవి. అట్టి జ్ఞానమను, ఆత్మజ్ఞానమును, అపరోక్షానుభవమును, దానిని ప్రకాశింపజేసే నమును ఈ పురాణము వర్ణించినది (జ్ఞానకాండ).
భక్తియోగస్సమాఖ్యాతో వైరాగ్యం చ తదాశ్రయమ్ ।
పారీక్షితముపాఖ్యానం నారదాఖ్యానమేవ చ ।
భక్తియోగము, అది ఆశ్రయముగా గల వైరాగ్యము, పరీక్షిత్తు వృత్తాంతము, నారదచరితము అనునవి బాగుగా వివరించబడినవి.
ప్రాయోపవేశో రాజర్షేర్విప్రశాపాత్పరీక్షితః ।
శుకస్య బ్రహ్మర్షభస్య సంవాదశ్చ పరీక్షితః ॥
బ్రాహ్మణుని శాపము వలన రాజర్షియగు పరీక్షిత్తు ప్రాయోపవేశము చేయుట, ఆ పరీక్షిత్తునకు మహర్షులలో శ్రేష్ఠుడగు శుకునితో సంవాదము వర్ణించబడినవి (ప్రథమస్కంధము).
యోగధారణయోత్క్రాంతిస్సంవాదో నారదాజయోః ।
అవతారానుగీతం చ సర్గః ప్రాధానికోఽగ్రతః ॥
యోగధారణచే దేహమును విడిచి పెట్టుట, నారదబ్రహ్మదేవుల సంవాద ము, అవతారముల సంక్షిప్తచర్చ, సృష్టికి ముందు ప్రధానమునుండి మహత్తు మొదలగు తత్త్వముల సృష్టి చెప్పబడినవి (ద్వితీయస్కంధము).
విదురోద్ధవసంవాదః క్షత్త్రమైత్రేయయోస్తతః ।
పురాణసంహితాప్రశ్నో మహాపురుష సంస్థితిః ॥
విదురునకు ఉద్దవునితో సంవాదము, తరువాత విదురునకు యునితో సంవాదము, పురాణసంహితను గురించి ప్రశ్న, ప్రళయము పురుషోత్తముని నిశ్చలస్థితి వర్ణించబడినవి (తృతీయ స్కంధము).
తతః ప్రాకృతికస్సర్గస్సప్త వైకృతికాశ్చ యే ।
తతో బ్రహ్మాండసంభూతిర్వైరాజః పురుషో యతః ॥
తరువాత ప్రకృతియందు గుణముల క్షోభ అనే సృష్టి, దానినుండి తత్త్వము, అహంకారము, పంచ తన్మాత్రలు అనే ఏడు వికృతుల సృష్టి, పొటినుండి బ్రహ్మాండము ఉత్పన్నమగుట, యందు విరాట్ పురుషుని స్థితి వర్ణించబడినవి.
కాలస్య స్థూలసూక్ష్మస్య గతిః పద్మసముద్భవః ।
భువ ఉద్ధరణేఽoభోధేర్షిరణ్యాక్షవధో యథా ॥
స్థూలసూక్ష్మములైన కాలముయొక్క స్వరూపము, లోకములనే ము పుట్టుట, భూమిని సముద్రమునుండి పైకి తీయునప్పుడు బ్యాక్షుని శ్రీహరి వధించిన విధానము వర్ణించబడినవి.
ఊర్ధ్వతిర్యగవాక్సర్గో రుద్రసర్గస్తథైవ చ ।
అర్ధనారీనరస్యాథ యతస్స్వాయంభువో మనుః ॥
శతరూపా చ యా స్త్రీణామాద్యా ప్రకృతిరుత్తమా ।
దేవతలు, పశుపక్ష్యాదులు, మానవుల సృష్టి, రుద్రుల సృష్టి వర్ణించబడినవి. సగము స్త్రీ, సగము పురుషుడైన బ్రహ్మదేవుని (హిరణ్యగర్బుని వర్ణనము, ఆ దేవునినుండి స్వాయంభువ మనువు, శతరూప పుట్టుట వర్ణించబడినవి. ఉత్తమురాలగు శతరూప స్త్రీలలో మొట్టమొదటిది. ప్రాణిసృష్టికి ఆమెయే మూలకారణము.
సంతానో ధర్మపత్నీనాం కర్దమస్య ప్రజాపతేః ॥
అవతారో భగవతః కపిలస్య మహాత్మనః ।
దేవహూత్యాశ్చ సంవాదః కపిలేన చ ధీమతా ॥
కర్దమ ప్రజాపతియొక్క సంతానమైన అమ్మాయిలు మహర్షులకు ధర్మపత్నులగుట, మహాత్ముడగు కపిల భగవానుని అవతారము, బుద్ధిశాలియగు కపిలునితో దేవహూతి సంవాదము వర్ణించబడినవి.(ఇక్కడితో మూడవ స్కంధము సమాప్తము).
నవబ్రహ్మసముత్పత్తిర్ధక్షయజ్ఞవినాశనమ్ ।
ధువస్య చరితం పశ్చాత్పృథోః ప్రాచీనబర్హిషః ॥
నారదస్య చ సంవాదస్తతః ప్రైయవ్రతం ద్విజాః ।
ఓ మహర్షులారా! మరీచి మొదలగు తొమ్మండుగురు ప్రజాపతుల సంతా , దక్షయజ్ఞధ్వంసము, ధ్రువచరితము, పృథుచరితము, ప్రాచీనబర్షి ఏ నారదునితో సంవాదము వర్ణించబడినవి (ఇంతవరకు చతుర్థస్కం ). తరువాత ప్రియవ్రతచరితము చెప్పబడినది (పంచమస్కంధము).
నాభోస్తతోఽనుచరితమృషభస్య భరతస్య చ ॥
ద్వీపవరసముద్రాణాం గిరినద్యుపవర్ణనమ్ ।
జ్యోతిశ్చక్రస్య సంస్థానం పాతాలనరకస్థితిః ॥
తరువాత నాభి, ఋషభ దేవుడు, భరతుడు అనువారల తములు గలవు. ద్వీపములు, దేశములు, సముద్రములు, కములు, నదుల వర్ణనము, జ్యోతిర్మండలముయొక్క సన్నివేశము, ళనరకముల స్థానము . వర్ణించబడినవి (ఇంతవరకు మస్కంధము).
దక్షజన్మ ప్రచేతోభ్యస్తత్పుత్రీణాం చ సంతతిః ।
యతో దేవాసురనరాస్తిర్యఙ్నగఖగాదయః ॥
ప్రచేతసులనుండి దక్షుని పుట్టుక, ఆతని పుత్రికల సంతానముగా దేవతలు, రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు, పర్వతములు, పక్షులు జన్మించుట వర్ణించబడినవి (షష్ఠ స్కంధము).
త్వాష్ట్రస్య జన్మ నిధనం పుత్రయోశ్చ దితేర్ద్విజాః ।
దైత్యేశ్వరస్య చరితం ప్రహ్లాదస్య మహాత్మనః ॥
ఓ మహర్షులారా! త్వష్ఠకు వృత్రాసురుడు పుట్టుట, ఆతని మరణము (ఇంతవరకు షష్ఠ స్కంధము), దితికి ఇద్దరు పుత్రులు - (హిరణ్యాక్ష హిరణ్యకశిపులు) పుట్టుట, రాక్షసరాజగు హిరణ్యకశిపుని చరితము, మహాత్ముడగు ప్రహ్లాదుని చరితము వర్ణించబడినవి (సప్తమ స్కంధము).
మన్వంతరానుకథనం గజేంద్రస్య విమోక్షణమ్ ।
మన్వంతరావతారాశ్చ విష్ణోర్హయశిరాదయః ॥
మన్వంతరములు, గజేంద్రుని విముక్తి, మన్వంతరములలో హయగ్రీవుడు, అజితుడు మొదలైన విష్ణువు యొక్క అవతారములు వబడినవి (అష్ఠమస్కంధము).
కౌర్మం ధన్వంతరం మాత్స్యం వామనం చ జగత్పతేః ।
క్షీరోదమథనం తద్వదమృతార్థ దివౌకసామ్ ॥
జగన్నాథుడగు శ్రీహరి తాబేలుగా, ధన్వంతరీగా, చేపగా, నుడుగా అవతరించుట, స్వర్గవాసులు అమృతము కొరకై పొల ద్రమును మథించుట వర్ణించబడినవి.
దేవాసురమహాయుద్దం రాజవంశానుకీర్తనమ్ ।
ఇక్ష్వాకుజన్మ తద్వంశస్సుద్యుమ్నస్య మహాత్మనః ॥
దేవతలకు, రాక్షసులకు పెద్ద యుద్దము (ఇంతవరకు స్కంధము), రాజుల వంశముల వర్ణనము, ఇక్ష్వాకుని పుట్టుక, త్ముడగు సుద్యుమ్నుని గాథ వర్ణించబడినవి (నవమ స్కంధము),
ఇలోపాఖ్యానమత్రోక్తం తారోపాఖ్యానమేవ చ ।
సూర్యవంశానుకథనం శశాదిద్యా నృగాదయః ॥
ఈ నవమస్కంధమునందు ఇలాదేవి, తారాదేవి అనువారి గాథలు, సూర్యవంశము, శశాదుడు, నృగుడు, కవి మొదలగు రాజుల గాథలు చెప్పబడినవి.
సౌకన్యం చాథ శర్యాతేః కకుత్ స్థస్య చ ధీమతః ।
ఖట్వాంగస్య చ మాంధాతుస్సౌభరేస్సగరస్య చ ॥
సుకన్యయొక్క చరితము, తరువాత శర్యాతి, బుద్ధిశాలియగు కకుత్. స్థుడు, ఖట్వాంగుడు, మాంధాత, సౌభరి, సగరుల చరితములు గలవు.
రామస్య కోసలేంద్రస్య చరితం కిల్బిషాపహమ్ ।
నిమేరంగపరిత్యాగో జనకానాం చ సంభవః ॥
పాపములను పోగొట్టే కోసలదేశప్రభుడగు శ్రీరాముని చరితము, నిమి మహారాజు దేహమును వీడుట, జనకుల పుట్టుక వర్ణించబడినవి.
రామస్య భార్గవేంద్రస్య నిఃక్షత్రకరణం భువః ।
ఐలస్య సోమవంశస్య యయాతేర్నహుషస్య చ ॥
భృగువంశీయులకు నాయకుడగు పరశురాముడు భూమిపై యులు లేకుండా చేయుట వర్ణించబడినది. చంద్రవంశమూల షుడగు ఐలుడు, యయాతి, నహుషుల గాథలు చెప్పబడినవి.
దౌష్యంతేర్భరతస్యాపీ శంతనోస్తత్సుతస్య చ ।
యయాతేర్జ్యష్ఠపుత్రస్య యదోర్వంశోఽనుకీర్తితః ॥
దుష్యంతుని పుత్రుడగు భరతుడు, శంతనుడు, ఆయన పుత్రుడగు భీష్ముడు, యయాతి, ఆయన పెద్ద కొడుకగు యదువు అనువారల శములు కీర్తించబడినవి.(ఇంతవరకు నవమ స్కంధము).
యత్రావతీర్ణో భగవాన్ కృష్ణాఖ్యో జగదీశ్వరః ।
వసుదేవగృహే జన్మ తతో వృద్ధిశ్చ గోకులే ॥
ఆ యదువు వంశమునందు జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు శ్రీకృష్ణుడనే పేరుతో అవతరించెను. ఆయన వసుదేవుని గృహములో జన్మించి, నందుని గోకులములో పెరిగెను.(దశమ స్కంధము). .
తస్య కర్మాణ్యపారాణి కీర్తితాన్యసురద్విషః ।
పూతనాఽసుపయఃపానం శకటోచ్చాటనం శిశోః ॥
రాక్షససంహారకుడగు ఆ శ్రీకృష్ణుని అసంఖ్యాకములగు లీలలు -- పిల్ల వాడుగా ఉండగనే పూతనయొక్క పాలను ప్రాణములతో బాటుగా త్రాగి వేయుట, బండిని తల్లక్రిందులు చేయుట ఇత్యాదులు -- వర్ణించబడినవి.
తృణావర్తస్య నిష్పేషస్తథైవ బకవత్సయోః ।
ధేనుకస్య సహభ్రాతుః ప్రలంబస్య చ సంక్షయః ॥
తృణావర్తుని పిండిగా చేయుట, బక-వత్సాసురులను, ధేనుకాసురుని, వాని పరివారమును, ప్రలంబాసురుని సంహరించుట వర్ణించబడినవి.
గోపానాం చ పరిత్రాణం దావాగ్నేః పరిసర్వతః ।
దమనం కాలియస్యా హేర్మహాఽ హేర్నందమోక్షణమ్ ॥
చుట్టూ వ్యాపిస్తున్న కార్చిచ్చునుండి గోపాలకులను రక్షించుట, యనాగును శిక్షించుట, నందుని కొండచిలువనుండి విడిపించుట.
వ్రతచర్యా తు కన్యానాం యత్ర తుష్టోఽచ్యుతో వ్రతైః ।
ప్రసాదో యజ్ఞపత్నీభ్యో విప్రాణాం చానుతాపనమ్ ॥
గోపకన్యకలు వ్రతమును చేయుట, శ్రీకృష్ణ భగవానుడు వారి ప్రత ఎమములచే సంతోషమును పొందుట, సోమిదేవమ్మలనను అంచుట, వేదవేత్తలు పశ్చాత్తాపపడుట వర్ణించబడినవి.
గోవర్ధనోద్దారణం చ శక్రస్య సురభేరథ ।
యజ్ఞాభి షేకం కృష్ణస్య స్త్రీభిః క్రీడా చ రాత్రిషు ॥
శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతమును పైకెత్తుట, ఇంద్రుడు మరియు సురభి
నను పూజించి అభిషేకించుట, రాత్రులయందు - గోపికలతో కరము వర్ణించబడినవి.
శంఖచూడస్య దుర్బుద్ధేర్వధోఽరిష్టస్య కేశినః ।
అక్రూరాగమనం పశ్చాత్ప్రస్థానం రామకృష్ణ యోః ॥
దుర్బుద్ధియగు శంఖచూడుని, అరిష్టుని, కేశిని శ్రీకృష్ణుడు వధించుట, అక్రూరుని రాక, తరువాత బలరామశ్రీకృష్ణుల ప్రయాణము వర్ణించబడెను.
వ్రజస్త్రీణాం విలాపశ్చ మథురాఽఽలోకనం తతః ।
గజముష్టికచాణూరకంసాదీనాం చ యో వధః ॥
గోపీకలు విలపించుట, తరువాత శ్రీకృష్ణుడు మథురానగరమునంతనూ చూచుట వర్ణించబడెను. కువలయాపీడమనే ఏనుగు, ముష్టికుడు, చాణూ రుడు, కంసుడు, వాని సోదరులు మొదలగువారి వధ వర్ణించబడెను.
మృతస్యానయనం సూనోః పునస్సాందీపనేర్గురోః ।
మథురాయాం నివసతా యదుచక్రస్య యత్ప్రియమ్ ।
కృతయుద్ధవరామాభ్యాం యుతేన హరిణా ద్విజాః ॥
ఓ మహర్షులారా! శ్రీకృష్ణుడు గురువైన సాందీపనియొక్క మరణించిన పుత్రుని మరల తీసుకొనివచ్చెను. ఆయన ఉద్ధవబలరాములతో గూడి మథురలో నివసిస్తూ, యాదవసముదాయమునకు అభీష్టమైన సర్వమును కూర్చెను. ఇది అంతా వర్ణించబడినది.
జరాసంధసమానీత సైన్యస్య బహుశో వధః ।
ఘాతనం యవనేంద్రస్య కుశస్థల్యా నివేశనమ్ ॥
అనేకపర్యాయములు జరాసంధుడు తీసుకువచ్చిన సైన్యమును వధిం , యవనరాజగు కాలయవనుని వధించుట, ద్వారకను నిర్మించుట.
ఆదానం పారిజాతస్య సుధర్మాయాస్సురాలయాత్ ।
రుక్మిణ్యా హరణం యుద్ధే ప్రమథ్య ద్విషతో హరేః ॥
శ్రీకృష్ణుడు దేవతల నివాసమైన స్వర్గమునుండి పారిజాతవృక్షమును, ర్మ అనే సభను తీసుకువచ్చేను. యుద్దములో శత్రువులను మర్ధించి 0న రుక్మిణిని అపహరించెను. ఈ వివరములు వర్ణించబడినవి.
హరస్య జృంభణం యుద్దే బాణస్య భుజకృంతనమ్ ।
ప్రాగ్జ్యోతిషపతిం హత్వా కన్యానాం హరణం చ యత్ ॥
యుద్ధములో శ్రీకృష్ణుడు వేసిన బాణమునకు శివుడు ఆవులించుట, బాణాసురుని భుజములను నరుకుట, ప్రార్ణ్యోతిషపురాధిపతియగు నరకాసురుని సంహరించి కన్యలను తీసుకువచ్చుట వర్ణించబడినవి.
చైద్యపౌండ్రకశాల్వానాం దంతవక్త్రస్య దుర్మతేః ।
శంబరో ద్వివిదః పీఠో మురః పంచజనాదయః ॥
మాహాత్మ్యం చ వధ స్తేషాం వారాణస్యాశ్చ దాహనమ్ ।
భారావతరణం భూమేర్నిమిత్తీకృత్య పాండవాన్ ॥
చేదిరాజగు శిశుపాలుడు, పౌండ్రకుడు, శాల్వుడు, దుర్బుద్ధియగు దంతవక్తుడు, శంబరుడు, ద్వివిదుడు, పీఠుడు (నరకాసురుని సేనాపతి), మురుడు, పంచజనుడు, వాని పుత్రుడు మొదలగువారి పరాక్రమము, వారి సంహారము, వారాణసీనగరము దహించబడుట, పాండవులను నిమిత్తముగా చేసుకొని భూభారమును తగ్గించుట వర్ణించబడినవి (పదవ స్కంధము సమాప్తము).
విప్రశాపాపదేశేన సంహారస్స్వకులస్య చ ।
ఉద్ధవస్య చ సంవాదో వాసుదేవస్య చాద్భుతః ॥
బ్రాహ్మణుల శాపము అనే సాకుతో శ్రీకృష్ణుడు తన వంశమును కూడ గారింపజేయుట, ఉద్ధవునకు శ్రీకృష్ణునితో అద్భుతమైన సంవాదము.
యత్రాత్మవిద్యా హ్యఖిలా ప్రోక్తా ధర్మవినిర్ణయః ।
తతో మర్త్యపరిత్యాగ ఆత్మయోగానుభావతః ॥
ఆ సంవాదమునందు నిశ్చయముగా సకలమైన ఆత్మవిద్య, ముయొక్క నిశ్చయము నిరూపించబడినది. తరువాత శ్రీకృష్ణుడు మాయాశక్తియొక్క ప్రభావముచే మానవావతారమును చాలించి లోకమును విడిచి పెట్టుట వర్ణించబడినది.(ఏకాదశస్కంధము పూర్తి).
యుగలక్షణవృత్తిశ్చ కలౌ నౄణాముపప్లవః ।
చతుర్విధశ్చ ప్రలయ ఉత్పత్తిస్త్రీవిధా తథా ॥
యుగముల లక్షణములు, వాటికి తగ్గట్లుగా మానవుల ప్రవృత్తులు, యుగములో మానవులకు కలిగే ఉపద్రవములు, నాలుగు రకములు యములు వర్ణించబడినవి. ఉత్పత్తి కూడ మూడు విధములు. కృతికీ - ప్రకృతినుండి మహత్తత్త్వము మొదలగునవి ప్రకటమగుట. ఎత్తికీ - పుణ్యపాపములను బట్టి లభించే జన్మ. నిత్యా - ప్రతిక్షణము "ము నశించి పుట్టుచునే యున్నది.(ద్వాదశ స్కంధము).
దేహత్యాగశ్చ రాజర్హేర్వష్ణురాతస్య ధీమతః ।
శాఖాప్రణయనమృ షేర్మార్కండేయస్య సత్కథా ।
మహాపురుషవిన్యాసస్సూర్యస్య జగదాత్మనః ॥
రాజర్షి, బుద్ధిశాలి అగు పరీక్షిత్తు దేహమును విడిచి పెట్టుట, వేదశాఖల విభాగము, మార్కండేయ మహర్షి యొక్క పవిత్రగాథ, విరాట్ పురుషునియొక్క అంగోపాంగముల స్వరూపము, ప్రాణులలో అంతర్యామియగు సూర్యదేవుని గణములు వర్ణించబడినవి.
ఇతి చోక్తం ద్విజశ్రేష్ఠా యత్పృష్టోఽహమిహాస్మి వః ।
లీలాఽవతారకర్మాణి కీర్తితానీహ సర్వశః ॥
ఓ గొప్ప మహర్షులారా! ఈ విధముగా మీరు ఇక్కడ నన్ను ప్రశ్నించిన విషయమునీ విధముగా మీకు చెప్పితిని. ఈ సందర్భములో భగవానుడు లీలకై స్వీకరించిన అవతారములు, చేసిన లీలలు కూలంకషముగా వర్ణించబడినవి.
పతితః స్ఖలీతశ్చార్తః క్షుత్త్వా వా వివశో బ్రువన్ ।
హరయే నమ ఇత్యుచ్చైర్ముచ్యతే సర్వపాతకాత్ ॥
మనిషి పడిపోయినప్పుడు, జారినప్పుడు, పీడను పొందినప్పుడు,
తుమ్ము వచ్చి వివశుడైనప్పుడు, హరయే నమః (శ్రీహరి కొరకు స్కారము) అని బిగ్గరగా ఉచ్చరించవలెను. అట్లు చేయువాడు పాపములనుండి విముక్తుడగును.
కీర్త్యమానో భగవాననంతశ్శ్రుతానుభావో వ్యసనం హి పుంసామ్ ।
ప్రవిశ్య చిత్తం విధునోత్యశేషం యథా తమోఽర్కోఽభ్రమివాతివాతః ॥
ఎందుకంటే, అవినాశియగు శ్రీహరిని కీర్తించినా, ఆయన మహిమను ణము చేసినా, ఆయన చిత్తములో ప్రవేశించి మానవుల ఆపదను -- ర్యుడు చీకటిని, పెద్ద గాలి మేఘమును వలె -- నిశ్శేషముగా నశింప మను.
మృషా గీరస్తా హ్యసతీరసత్కథా న కథ్యతే యద్భగవానధోక్షజః ।
తదేవ సత్యం తదు హైవ మంగలం
తదేవ పుణ్యం భగవద్గుణోదయమ్ ॥
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని శ్రీహరి భగవానుని వర్ణించకుండా, మిథ్యాభూతములైన విషయభోగముల వర్ణన గల ఆ మాటలు నిశ్చయముగా వ్యర్థములు మరియు అసత్యములు. ఏ పలుకులయందు భగవానుని గుణముల ప్రకాశము గలదో, ఆహా! అవియే సత్యములు, అవియే కల్యాణకరములు, అవియే పావనములు.
తదేవ రమ్యం రుచిరం నవం నవం.
తదేవ శశ్వన్మనసో మహోత్సవమ్ ।
తదేవ శోకార్ణవశోషణం నృణాం యదుత్తమశ్లోకయశోఽనుగీయతే ॥
ఏ వచనము ద్వారా ఉత్తమమగు కీర్తి గల భగవానుని కీర్తి నిరంతరము గానము చేయబడుచున్నదో, ఆ వచనమే నిత్యనూతనముగా రమ్యము, ప్రీతికరము. అదియే నిత్యము మనస్సునకు గొప్ప ఉత్సవము. ఆ వచనముచేతనే మానవులయొక్క శోకమనే సముద్రము ఎండిపోవును (మానవుడు జీవన్ముక్తుడగును).
తద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ ।
ధ్వాం క్షతీర్థం న తు హంస సేవితం
యత్రాచ్యుతస్తత్ర హి సాధవోఽమలాః ॥
వాక్కు రకరకముల అలంకారాది గుణములు గలదియే అయిననూ, త్తును పావనము చేసే శ్రీహరియొక్క కీర్తిని నుడువనిచో, అది తీర్థమే యగును. కాకులకు ఉచ్ఛిష్ఠము వేసే తీర్థమును హంసలు . భోగపరాయణులు సేవించే స్థానమును జ్ఞానులు తలయెత్తి 'డరు. ఎక్కడనైతే శ్రీహరి భగవానుడు కీర్తించబడునో, మలహృదయులగు సత్పురుషులు అక్కడ మాత్రమే ఉండెదరు.
స వాగ్విసర్గో జనతాఽఘసంప్లవో యస్మిన్ర్పతిశ్లోకమబద్ధవత్యపి ।
నామాన్యనంతస్య యశోఽoకితాని యత్
శృణ్వంతీ గాయంతీ గృణంతి సాధవః ॥
ప్రతీశ్లోకమునందు అనంతుడగు శ్రీహరి భగవానుని కీర్తిని సూచించే నామములు గల వాక్కుయొక్క ప్రయోగము -- ఒకచో అపభ్రంశపదములు ఉన్నా, ఛందస్సు సరిగా లేకున్నా పరవాలేదు -- జనసముదాయముయొక్క పాపములను నశింపజేయును. ఎందుకంటే, సత్పురుషులు అట్టి వాక్కును మాత్రమే శ్రవణము చేయుదురు. వారు ఆ నామములను మాత్రమే గానము చేయుదురు, కీర్తించెదరు.
నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనమ్,
కుతః పునశ్శశ్వదభద్రమీశ్వరే న హ్యర్పితం కర్మ యదప్యనుత్తమమ్.
పరమాత్మకు క్రియాసంబంధము లేదు. పరమాత్మయందు సుఖదుఃఖాదిద్వంద్వమలములు లేవు. అట్టి పరమాత్మయొక్క జ్ఞానమైన ప్పటికీ, శ్రీహరి భగవానుని భక్తి లేనిదైనచో, అధికముగా శోభిల్లదు. కర్మ సాధనసాధ్యకాలములు రెండింటియందు దుఃఖ హేతువు. . అట్టి కర్మ, సర్వోత్తమమే అయినా, ఈశ్వరునికి సమర్పించకున్నచో, శోభిల్లుటకు హేతువు ఏమి గలదు?(లేదు.కావున, శోభిల్లదని వేరే చెప్పవలెనా?)
యశశ్శ్రియామేవ పరిశ్రమః పరో వర్ణాశ్రమాచారతపశ్శ్రుతాదిషు । అవిస్మృతిశ్శ్రీధరపాదపద్మయోర్గుణానువాదశ్రవణాదిభిర్హరేః ॥
వర్ణాశ్రమములకు చెందిన ఆచరణలు, తపస్సు, అధ్యయనము మొదలగువాటియందు పరిశ్రమ చాల పెద్దది. దాని వలన కీర్తి, పద మాత్రమే లభించును. కాని, శ్రీహరియొక్క గుణములను చుట, శ్రవణము చేయుట, స్మరించుట మొదలగువాటిచే పతియొక్క పద్మములవంటి పాదములు విస్మృతికి రాకుండును.
స్మృతిః కృష్ణ పదారవిందయోః క్షిణోత్యభద్రాణి శమం తనోతి చ ।
సత్త్వస్య శుద్ధిం పరమాత్మభక్తిం జ్ఞానం చ విజ్ఞానవిరాగయుక్తమ్ ॥
శ్రీకృష్ణుని పద్మములవంటి పాదములను మరువకుండుటచే అమంగళములు నశించి, శాంతి, అంతఃకరణశుద్ధి, పరమాత్మయందు భక్తి, గ్యము, ఆత్మజ్ఞానము, అపరోక్షానుభవము కూడ విస్తరిల్లును.
యూయం ద్విజాగ్ర్యా బత భూరిభాగా
యచ్ఛశ్వదాత్మన్యఖిలాత్మభూతమ్ ।
నారాయణం దేవమదేవమీశమజస్రభావా భజతావివేశ్య ॥
ఆహా! ఓ మహర్షివర్యులారా! నిరంతరమగు భక్తి గల మీరు గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే, మీరు సకలప్రాణులయందు అంతర్యామి, జగన్నాథుడు అగు నారాయణదేవుని చిత్తములో ప్రవేశ పెట్టి భజించుచున్నారు. ఆయనపై మరియొక దైవము లేదు.
అహం చ సంస్మార్త ఆత్మతత్త్వం శ్రుతం పురా మే పరమర్షివక్త్రాత్ ।
ప్రాయోపవేశే నృపతేః పరీక్షితః
సదస్యృషీణాం మహతాం చ శృణ్వతామ్ ॥
పూర్వము పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశము చేసిన సభలో మహర్షులు కూడ వినుచుండగా, నేను శుకమహర్షి ముఖమునుండి ఆత్మ తత్త్వమును శ్రవణము చేసితిని. దానిని మీరు మరల గుర్తుకు తెచ్చిరి.
ఏతద్వః కథితం విప్రాః కథనీయోరుకర్మణః ।
మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభవినాశనమ్ ॥
ఓ మహర్షులారా! శ్రీకృష్ణ భగవానుని గొప్ప లీలలు వర్ణించదగినవి. ఆయన మహిమ విన్నవారి సకలములైన అశుభములను పోగొట్టును. నేను దీనిని మీకు చెప్పితిని.
య ఏవం శ్రావయేన్నిత్యం యామక్షణమనన్యధీః ।
శ్రద్ధావాన్ యోఽనుశృణుయాత్పునిత్యాత్మానమేవ సః ॥
ఎవడైతే ప్రతిదినము జాము గాని, క్షణము గాని ఈ విధముగా పించునో, ఎవడైతే శ్రద్ధతో వినునో, అట్టివాడు తనను(అంతఃకరణమును) తాను నిశ్చయముగా పవిత్రము చేసుకొనును.
ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్ భవేత్ ।
పఠత్యనశ్నన్ ప్రయతస్తతో భవత్యపాతకీ ॥
ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని శ్రవణము చేయువాడు సుష్మంతుడగును. ఉపవసించి సావధానుడై పఠించువాడు, ఆ రాయణ వలన పాపములు లేనివాడగును.
పుష్కరే మథురాయాం చ ద్వారవత్యాం యతాత్మవాన్ ।
ఉపోష్య సంహితామేతాం పఠిత్వా ముచ్యతే భయాత్ ॥
పుష్కరము, మథుర, ద్వారకలయందు మనస్సును నిగ్రహించి ఉపవసించి ఈ భాగవతసంహితను పఠించువాడు (సంసార) భయమునుండి విముక్తుడగును.
దేవతా మునయస్సిద్ధాః పితరో మనవో నృపాః ।
యచ్చంతి కామాన్ గృణతశ్శృణ్వతో యస్య కీర్తనాత్ ॥
భాగవతమును కీర్తించి వినుట వలన దేవతలు, మహర్షులు, సిద్దులు, పితృదేవతలు, మనువులు, రాజులు కీర్తించువానికి, విన్నవానికి అభీష్టములను నెరవేర్చెదరు.
ఋచో యజూంషి సామాని ద్విజోఽధీత్యానువిందతే ।
మధుకుల్యా ఘృతకుల్యాః పయఃకుల్యాశ్చ తత్ఫలమ్ ॥
బ్రాహ్మణుడు ఋగ్వేద-యజుర్వేద-సామవేదములను అధ్యయనము చేసి తేనె, నెయ్యి, పాల నదులను పొందును. అనగా, సకలసమృద్దులను పొందును. భాగవతమును అధ్యయనము చేయుటచే కూడ అటులనే పొందును.
పురాణసంహితాయేతామధీత్య ప్రయతో ద్విజః ।
ప్రోక్తం భగవతా యత్తు తత్పదం పరమం వ్రజేత్ ॥
బ్రాహ్మణుడు సావధానుడై ఈ పురాణసంహితను అధ్యయనము చేసి, వానునిచే చెప్పబడిన ఆ పరమపదము (మోక్షము) ను పొందును.
విప్రోఽధీత్యాప్నుయాత్ప్రజ్ఞాం రాజన్యోదధిమేఖలామ్ ।
వైశ్యో నిధిపతిత్వం చ శూద్రశ్శుద్ధ్యేత పాతకాత్ ॥
దీని అధ్యయనముచే బ్రాహ్మణుడు. తత్త్వజ్ఞానమును పొందుటకు న ప్రజ్ఞను, క్షత్రియుడు సముద్రపర్యంతము సామ్రాజ్యమును, నిధుల ఆధిపత్యమును పొందును. శూద్రుడు పాపమునుండి మడగును.
మలసంహతికాలనోఽఖిలేశో హరిరతరత్ర న గీయతే హ్యభీక్ ష్ణమ్ ।
గా తు పునర్బగవానశేషమూర్తిః పరిపఠితోఽనుపదం కథాప్రసంగైః॥
సకలజగన్నాథుడగు శ్రీహరి కలిదోషముల సమూహమును నశింపజేయును. ఇతరగ్రంథములలో ఆయన నిరంతరముగా కీర్తించబడుట లేదు. ఇది నిశ్చయము. కాని, ఈ భాగవతము మాత్రము సకలజగద్రూపుడగు శ్రీహరి భగవానుని ప్రతి పదమునందు గాథల ప్రసంగములద్వారా అంతటా వర్ణించుచున్నది.
తమహమజమనంతమాత్మతత్త్వం జగదుదయస్థితిసంయమాత్మశక్తిమ్ । ద్యుపతిభిరజశక్రశంకరాద్యైర్ధురవసితస్తవమచ్యుతం నతోఽస్మి ॥
ఆద్యంతములు లేని ఆత్మస్వరూపుడైన శ్రీహరి భగవానుని నేను నమస్కరించుచున్నాను. ఆయన తన శక్తులైన రజస్సత్త్వతమోగుణములచే ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. ద్యులోకాధిపతులగు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శంకరుడు ఆయనను ఎట్లు స్తుతించవలెనో తెలియకున్నారు.
ఉపచితనవశక్తిభిస్స్వ ఆత్మన్యుపరచితస్థిరజంగమాలయాయ ।
భగవత ఉపలబ్దిమాత్రధామ్నే సురఋషభాయ నమస్సనాతనాయ ॥
సనాతనుడగు శ్రీహరి భగవానుడు ప్రకృతి, మహత్తత్త్వము, సూత్రాత్మ, రకారము, పంచ తన్మాత్రలు అనే వర్ధిల్లిన తొమ్మిది శక్తులతో తన రూపమునందే చరాచరజగత్తును సృష్టించి ప్రకటించేను. ఆత్మాను మాత్రమే స్వరూపముగా గల ఆ దేవదేవునికి నమస్కారము.
స్వసుఖనిభృతచేతాస్త ద్వ్యుదస్తాన్యభావోఽ-
ప్యజితరుచిరలీలాఽఽకృష్ణ సారస్తదీయమ్ ।
వ్యతనుత కృపయా యస్తత్త్వదీపం పురాణం
తమఖిలవృజినఘ్నం వ్యాససూనుం నతోఽస్మి ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే ద్వాదశోఽధ్యాయః ॥
ఏకమహర్షి ఆత్మానందముతో నిండిన మనస్సు కలిగి భేదదృష్టిని కరించినవాడు. అయినా, ఆయన వ్యక్తిత్వము శ్రీహరియొక్క మధుర "చే ఆకర్షించబడెను. ఆయన దయతో ఆత్మతత్త్వమును ప్రకాశింప సకలదుఃఖములను పోగొట్టే భాగవతపురాణమును విస్తరింప జేసెను. సుని పుత్రుడగు అట్టి శుకమహర్షిని నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్భాగవతము పన్నెండవ స్కంధములో సంక్షిప్తవిషయసూచిని
వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Sūta Gosvāmī presents a grand, comprehensive summary of the entire *Śrīmad-Bhāgavatam*, reviewing the major historical narratives, philosophical discourses, and divine descents presented across all twelve cantos. He summarizes the cosmic creation in the First and Second Cantos, the pastimes of Varāha, Kapila, and Dhruva in the Third and Fourth Cantos, the cosmology and history of Bharata in the Fifth and Sixth Cantos, the devotion of Prahlāda and Nṛsiṁhadeva in the Seventh Canto, the ocean churning and Vāmanadeva in the Eighth Canto, the Solar and Lunar dynasties in the Ninth Canto, the sweet pastimes of Svayam Bhagavān Śrī Kṛshṇa in the Tenth Canto, the Uddhava-gītā in the Eleventh Canto, and the Kali-yuga prophecies in the Twelfth Canto.