భాగవత మహా పురాణము
7 - సప్తమోఽధ్యాయః
శౌనక ఉవాచ ।
శౌనకుడు ఇట్లు పలికెను: ఓ సూతా! నారదుడు నిష్క్రమించిన తరువాత, సర్వసమర్థుడు మరియు పూజ్యుడు అగు వ్యాసమహర్షి ఆయన అభీష్టమును విన్నవాడై ఏమి చేసెను?
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికెను: బ్రహ్మ అధిష్టానదేవతగా గల సరస్వతీనది యొక్క పడమటి తీరమునందు శమ్యాప్రాస అనబడే ఆశ్రమము గలదు. అచట ఋషులు వేదోక్తకర్మలను నిరంతరముగా చేయుచుందురు.
వ్యాసమహర్షి అచట బదరీవృక్షముల గుంపులతో శోభిల్లే తన ఆశ్ర మమునందు కూర్చుండి ఆచమనము చేసి, మనస్సును ఏకాగ్రము చేసేను.
భక్తియోగముచే నిర్మలము మరియు ఏకాగ్రము అగు మనస్సు నందు వ్యాసమహర్షి ఆదిపురుషుడగు పరమేశ్వరుని మరియు ఆయనను ఆశ్రయించుకొని యున్న మాయాశక్తిని చూచెను.
జీవుడు స్వయముగా పరబ్రహ్మస్వరూపుడే అయిననూ, ఆ మాయచే పూర్తిగా మోహమును పొందినవాడై, తనను సత్త్వరజస్తమోగుణ స్వరూపునిగా భావించి, ఆ విధమగు అభిమానము వలన సంప్రాప్తమైన సంసారమనే అనర్థమును అనుభవించు చున్నాడు.
సంసారమనే ఈ అనర్థమును తొలగించే సాక్షాత్సాధనము శ్రీహరి యందు ప్రయోగించబడిన భక్తియోగమని జ్ఞానియగు వ్యాసమహర్షి తెలు సుకొని, అజ్ఞానులగు మానవుల కొరకై శ్రీమద్భాగవతసంహితను రచించేను.
భాగవతమును వింటూ ఉండగానే మానవునకు పురుషోత్తముడగు శ్రీకృష్ణునియందు, భూతకాలసంబంధియగు శోకము, వర్తమానకాలీనమగు మోహము మరియు భవిష్యత్తును గురించిన భయములను పటాపం చలు చేసే భక్తి ఉదయించును.
ఆ వ్యాసమహర్షి శ్రీమద్భాగవతసంహితను రచించి, మరల ఒక సారి దానిని పరిశీలించి, తరువాత తన పుత్రుడు, ఆత్మజ్ఞాననిష్ఠుడు అగు శుకమహర్షిచేత దానిని పఠింప జేసెను.
శౌనక ఉవాచ ।
శౌనకమహర్షి ఇట్లు పలికేను: ఖచ్చితముగా నివృత్తిధర్మమునందు పరాయణుడు, సర్వమునందు అపేక్ష లేనివాడు, ఆత్మస్వరూపనిరతుడు నగు ఆ శుకమహర్షి ఏ ప్రయోజనమున పేక్షించి ఇంతటి పెద్ద గ్రంథమును అభ్యసించినాడు?
సూత ఉవాచ ।
సూతుడు ఇట్లు పలికెను: ఆత్మస్వరూపనిరతులగు మహర్షులు కూడా గ్రంథపఠనమునకు అతీతులే అయిననూ (అవిద్యారూపమగు హృదయగ్రంథులు నశించినవారే అయిననూ, లేదా అహంకారగ్రంథి లేనివారే అయిననూ) వామనరూపమును దాల్చి పెద్ద పెద్ద అడుగులతో బ్రహ్మాండమును కొలిచిన శ్రీహరియందు కారణరహితమగు భక్తిని చేసెదరు. శ్రీహరి గుణములయందు ఇట్టి సర్వాకర్షకమగు మాధుర్యము గలదు.
విష్ణుభక్తులయందు ప్రీతిగలవాడు, పూజ్యుడు, వ్యాసుని పుత్రుడు అగు శుకమహర్షి శ్రీహరియొక్క గుణములచే ఆకర్షించబడిన హృదయము గలవాడై ప్రతిదినము ఈ గొప్ప విశాలమగు భాగవతమును అధ్యయనము చేసెను.
ఈ పైన రాజర్షియగు పరీక్షిత్తుయొక్క పుట్టుక, ఆయనచేసిన ఘన కార్యములు, మరియు ఆయన ముక్తి లేక మృత్యువు అను విషయముల ను, పాండవుల స్వర్గారోహణమును గురించి శ్రీకృష్ణగాథ కలిసి వచ్చే విధ ముగా చెప్పెదను.
కౌరవుల మరియు ధృష్టద్యుమ్నుడు సేనానాయకుడుగా గల పాండవుల సేనల వీరులు వీరస్వర్గమును పొందిరి. భీముని గదాఘాత ముచే తొడలు విరిగి దుర్యోధనుడు పడియుండెను. ఆ సమయములో ఇట్లు చేసినచో నా ప్రభువగు దుర్యోధనునకు ప్రియమగునని ఊహించిన అశ్వత్థామ నిద్రించుచున్న ద్రౌపదీపుత్రుల తలలను నరికి ఆతనికి బహూక రించెను. కాని, ఆ పని వలన దుర్యోధనుడు సంతోషపడనే లేదు. అట్టి నీచ మగు పనిని సర్వులు నిందించెదరు గదా!
తన పుత్రుల ఘోరమగు మృతిని గురించి విని ద్రౌపది కన్నుల వెంబడి నీటిని గారుస్తూ పరితపించుచుండగా, ఆమెను ఓదారుస్తూ అర్జున డిట్లు పలికెను.
ఓ కల్యాణీ! హంతకుడు, బ్రాహ్మణాధముడు అగు అశ్వత్థామ యొక్క తలను నా గాండీవమునుండి విడువబడిన వాడి బాణములతో నరికి నీకు బహూకరించి, కన్నీటిని తుడిచెదను. ఈ నీ పుత్రుల శవములను దహించిన తరువాత నీవు దానిని కాలితో తొక్కి స్నానమును చేయగలవు.
ఈ విధముగా, శ్రీకృష్ణుడే మిత్రుడు మరియు సూతుడు అయిన వాడు, భయంకరమగు ధనస్సు గలవాడు, ధ్వజమునందు హనుమంతుడు చిహ్నముగా గలవాడు అగు ఆ అర్జునుడు రమ్యములగు విచిత్రవచనములతో ప్రియురాలగు ద్రౌపదిని ఓదార్చి, కవచమును ధరించి రథము పై ద్రోణపుత్రుడగు అశ్వత్థామను తరుముకుంటూ వెళ్లాను.
ద్రౌపదీపుత్రులను హతమార్చిన ఆ అశ్వత్థామ రథముపై వేగ ముగా తరుముకొని వచ్చుచున్న ఆ అర్జునుని దూరమునుండియే చూచి భయముతో వణకుచున్న హృదయము గలవాడై, ప్రాణములను కాపాడుకో నగోరి భూమిపై ఎంతవరకు పరుగెత్తగలడో అంతవరకు, రుద్రునకు భయ పడిన బ్రహ్మ (సూర్యుని) వలె పారిపోజొచ్చెను.
ద్రోణపుత్రుడగు అశ్వత్థామయొక్క గుర్రములు అలసిపోయేను. ఆతనికి తనను రక్షించువారు ఎవ్వరూ కానరాలేదు. అపుడు ఆతడు బ్రహ్మా స్త్రము తనను రక్షించగలదని భావించెను.
తరువాత ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రముయొక్క ఉపసంహారము తెలియక పోయిననూ, ప్రాణసంకటము వచ్చి పడినదని భావించి, ఆచమ నము చేసి ధ్యానమునందు ఆ అస్త్రమును సంధానము చేసెను.
తరువాత ప్రాణాంతకమైన ఆ భయంకరమగు అస్తతేజస్సు దిక్కులన్నింటినీ వ్యాపిస్తూ ప్రకటము కాగా, అర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లనెను.
అర్జున ఉవాచ।
అర్జునుడు ఇట్లు పలికెను: ఓ శ్రీకృష్ణా! మహాత్మా! సంసారములో బడి తపించు జనులకు ఆ సంసారమును నశింపజేయువాడవు నీవు ఒక్క డివే గలవు.
నీవు సర్వజగత్కారణమగు చేతనపరబ్రహ్మవు. ప్రకృతికి అతీతుడగు ఈశ్వరుడవు నీవే. నీవు చైతన్యశక్తిచే మాయను తిరస్కరించి అద్వితీయమగు స్వరూపమునందు స్థిరముగ నుండెదవు.
అట్టి మాయాతీతుడవగు నీవు మాయచే మోహింప చేయబడిన జీవసమూహమునకు నీ ప్రభావముచే ధర్మము మొదలైన శ్రేయస్సాధనములను విధించుచున్నావు (ధర్మము, సంపద, విముక్తి మొదలగు కల్యాణ ములను అనుగ్రహించు చున్నావు).
ఈ నీ అవతారము భూభారమును పోగొట్టుట కొరకు మరియు అన్యమునెరుంగని నీ ఏకాంతభక్తుల ధ్యానము కొరకు ఉద్దేశించ బడినది.
ఓ దేవదేవా! ఇది ఏమై ఉండును? ఎక్కడనుండి వచ్చుచున్నది? నాకేమియు తెలియకున్నది. మిక్కిలి భయంకరమగు తేజస్సు అన్ని వైపు లనుండియు చుట్టు ముట్టు చున్నది.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఇది ప్రాణసంకటము రాగా ద్రోణపుత్రుడగు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము. ఆతనికి దీని ఉప సంహారము తెలియనే తెలియదు.
దీనిని నివర్తింపజేసే మరియొక అస్త్రమేదియు లేదు. నీవు అస్త్రవేత్త వు. ఉత్కటమగు ఈ అస్త్రముయొక్క తేజస్సును బ్రహ్మాస్త్రతేజస్సుతో మాత్రమే శాంతింప జేయుము.
సూత ఉవాచ ।
సూతుడు ఇట్లు పలికేను: శ్రీకృష్ణభగవానుని ఈ మాటను విని, శత్రువీరసంహారకుడగు అర్జునుడు ఆచమనము చేసి, ఆయనకు ప్రదక్షి ఇము చేసి, బ్రహ్మాస్త్రమును నివర్తింప జేయుటకై బ్రహ్మాస్త్రమును సంధానము చేసెను.
బాణములచే చుట్టువారబడియున్న ఆ రెండు అస్తముల తేజ స్సులు ఒకదానితో మరియొకటి ఢీకొట్టి, సూర్యుడు మరియు అగ్నివలె భూమిని, అంతరిక్షమును మరియు ద్యులోకమును వ్యాపించి వర్ధిల్లినవి.
ఆ అశ్వత్థామార్జునుల రెండు అస్త్రముల మహాతేజస్సు మూడు లోకములను తపింపజేయుచుండెను. వాటిచే తపింపజేయబడుచున్న జసులు ఆ తేజస్సులను చూచి ప్రలయకాలాగ్ని యని తలపోసిరి.
ఆ ప్రజావినోశమును, లోకోపద్రవమును చూచి, శ్రీకృష్ణభగవో సుని అభిమతమును గమనించి, అర్జునుడు ఆ రెండు అస్త్రములను ఉప సంహరించెను.
తరువాత కోపముతో ఎరుపెక్కిన కన్నులు గల అర్జునుడు క్రూరు డగు కృపింయొక్క పుత్రుడైన అశ్వత్థామను వేగముగా పట్టుకొని, త్రాటితో పశువును నలె కట్టివేసెను.
శత్రువగు అశ్వత్థామను త్రాటితో గట్టిగా కట్టి శిబిరము వద్దకు తీసు కొని వెళ్ల గోరుచున్న అర్జునుని ఉద్దేశించి పద్మములపంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి కోపించినవాడై ఇట్లు పలికెను.
ఓ అర్జునా! వీనిని ప్రాణములతో విడువ దగదు. ఈ బ్రాహ్మణాధముని సంహరించుము. ఈతడు రాత్రియందు నిద్రించుచున్న నిరపరాధులగు పిల్లలను సంహరించినాడు.
నిషాలోనున్నవాడు, అజాగ్రత్తగా నున్నవాడు, పిచ్చి పట్టినవాడు, నించుచున్నవాడు, పిల్లవాడు, స్త్రీ, తనను రక్షించుకునే ఉద్యమమును చేపట్టని వాడు, శరణు జొచ్చినవాడు, రథము లేనివాడు, భయపడుతున్న వాడు 25గు శత్రువును ధర్మమునెరింగిన వీరుడు చంపడు.
దయావిహీనుడగు ఏ దుష్టపురుషుడు తన ప్రాణములను ఇత రుల ప్రాణములతో పోషించుకొనునో, అట్టి వానిని సంహరించుట వానికే హితకరమగును. ఏలయనగా, వాడు జీవించినచో ఆ దోషము కొనసాగుట వలన మరింత అధోగతిని పొందును.
ఓ అభిమానవతీ! నీ పుత్రులను చంపిన వాని తలను తెచ్చెదనని నీవు నేను వినుచుండగా ద్రౌపదితో ప్రతిజ్ఞను కూడ చేసితివి.
ఓ వీరా! పాపాత్ముడు, నీ పుత్రులను చంపిన హంతకుడు, వంశ మునకు చేటు అగు ఈ అశ్వత్థామను సంహరించుము. వీడు తన ప్రభు వగు దుర్యోధనునకు కూడ విశేషమగు అప్రియమునాచరించినాడు.
సూత ఉవాచ ।
సూతుడు ఇట్లు పలికెను: శ్రీకృష్ణుడు అర్జునుని ధర్మబుద్ధిని పరీక్షించగోరి ఈ విధముగా ప్రేరేపించిననూ మహానుభావుడగు అర్జునుడు, తన పుత్రులను సంహరించినవాడే అయిననూ గురుపుత్రుడగు అశ్వత్థామను సంహరించుటకు ఇష్టపడలేదు.
తరువాత గోవిందుడే ప్రియమిత్రుడు మరియు సారథిగా గల అర్జు నుడు తన శిబిరమును చేరుకొని, అచట చంపబడిన తన పుత్రులనుగురించి శోకించుచున్న ప్రియురాలగు ద్రౌపదికి ఆ అశ్వత్థామను అప్పజెప్పెను.
సుందరమగు స్వభావము గల ద్రౌపది ఆ విధముగా పశువు వలె త్రాటితో కట్టివేసి తీసుకు రాబడినవాడై, తాను చేసిన పనియందలి ఏహ్యభా వముచే తలను దించుకొని ఉన్న అపకారియైన గురుపుత్రుడగు అశ్వత్థా మను దయాదృష్టితో చూచి నమస్కరించెను.
అశ్వత్థామను కట్టివేసి తీసుకొని వచ్చుటను పతివ్రతయగు ద్రౌపది ! చూచి సహించలేక పోయెను. బ్రాహ్మణుడు, మిక్కిలి పూజనీయుడు అగు ) నీతనిని విడువుడు, విడువుడు అని ఆమె పలికెను.
రహస్యములను మంత్రములతో కూడిన ధనుర్వేదమును మరియు ప్రయోగ- ఉపసంహారములతో సహా అస్త్రముల సమూహమును నీవు ఏ ద్రోణాచార్యుని అనుగ్రహముచే నేర్చుకుంటివో, ఆ ద్రోణుడే తన సంతానమగు అశ్వత్థామ రూపములో మన ముందు ఉన్నాడు. ఆ ద్రోణుని అర్దాంగియగు కృపి వీరుడగు పుత్రుని కన్నదై ఇంకనూ జీవించి యున్నదే గాని, ద్రోణునితో బాటు మరణించ లేదు గదా!
గొప్ప భాగ్యము గలవాడా! నీవు ధర్మము తెలిసిన వాడవు. కావు న, గురువు యొక్క వంశమును మీరు నిత్యము నమస్కరించి పూజించవ లేనే గాని, దుఃఖమును కలిగించుట తగదు.
నా పుత్రులు మరణించుటచే ఆ దుఃఖమును సహించలేక నేను కన్నులవెంబడి నీరు ప్రవహించుచుండగా నిరంతరముగా దుఃఖించుచు న్నొను. అదే విధముగా ఈతని తల్లి, పతివ్రతయగు కృపి కూడ దుఃఖించ కుండు గాక!
మనోనిగ్రహము లేని రాజులు ఒక బ్రాహ్మణకులమునకు కోపమును తెప్పించినచో, దాని వలన వారి కులము దుఃఖముచే ఆవరింపబడి సపరివారముగా శీఘ్రమే వినాశమును పొందును.
సూత ఉవాచ ।
సూతుడు ఇట్లు పలికెను: ఓ మహర్షులారా! మహారాణియగు ద్రౌపది ధర్మమును న్యాయమును అతిక్రమించనిది, దయతో కూడినది, కపటము లేనిది, సమబుద్ధి గలది అగు గొప్ప మాటను పలుకగా, యమధ ర్మరాజుయొక్క అంశతో జన్మించిన ధర్మరాజు కూడ దానిని అనుమోదించి అభినందించెను.
నకులసహదేవులు, సాత్యకి, అర్జునుడు, దేవకీనందనుడగు శ్రీకృ ష్ణభగవానుడు మాత్రమే గాక అక్కడనున్న ఇతరజనులు స్త్రీలతో సహా అందరు ఆమె వచనమును అభినందించిరి.
అప్పుడు కోపమును పొందియున్న భీముడు ఇట్లు పలికెను: ఈ అశ్వత్థామ వ్యర్థముగా నిద్రిస్తున్న పిల్లలను చంపినాడు. ఈతడు చేసిన పని వలన ఈతనికి గాని, ఈతని ప్రభువగు దుర్యోధనునకు గాని ప్రయోజనము లేశమైననూ లేదు. ఇట్టివానికి వధించుటయే శ్రేయస్కరమగునని పెద్దలు చెప్పుచున్నారు.
శ్రీకృష్ణుడు ద్రౌపదీభీముల వచనములను విని, మిత్రుడగు అర్జు నుని ముఖము కేసి చూచి, చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఈ విధ ముగా పలికెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను: బ్రాహ్మణుడు అధముడే అయి ననూ వానిని వధించరాదనియు, ఆతతాయి (ఇంటికి నిప్పు పెట్టినవాడు, విషమునిచ్చిన వాడు, హంతకుడు మొదలగువారు) వధకు అర్హుడనియు, ఈ రెండు వచనములను శాస్త్రకర్తనగు నేనే చెప్పితిని. నీవు నా ఉపదేశ ములను పాటించుము.
ప్రియురాలగు ద్రౌపదిని ఓదారుస్తూ నీవు చేసిన ప్రతిజ్ఞను సత్యము చేయుము. అదే సమయములో భీమసేనునకు, ద్రౌపదికి మరియు నాకు కూడ ప్రీతిని కలిగించుము.
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికేను: అర్జునుడు వెంటనే శ్రీకృష్ణభగవానుని హృదయములోని భావమునెరింగి, ఆ బ్రాహ్మణుని శిరస్సు పైనుండే మణిని కేశములతో సహా కత్తితో ఊడబెరి కెను.
అశ్వత్థామయొక్క బ్రహ్మవర్చస్సు పిల్లలను హత్య చేయుటచే ముందే నశించినది. ఇప్పుడు మణియొక్క తేజస్సు కూడ లేకుండా పోయినది. త్రాటితో కట్టివేయబడియున్న అట్టి అశ్వత్థామను అర్జునుడు కట్లు విడిపించి శిబిరము బయటకు గెంటి వేసేను.
బ్రాహ్మణాధముని ఉరి తీయరాదు. ముండనము, సంపదను లాగుకొనుట, ఉన్న స్థానమునుండి గెంటి వేయుట అనునవి మాత్రమేబ్రాహ్మణాధమునకు మరణశిక్షతో సమానము.
పాండవులందరు ద్రౌపదితో సహా పుత్రశోకముతో పీడింపబడు చున్నవారై, మరణించిన తమ పుత్రులకు దహనసంస్కారము మొదలగు కర్మలను చేసిరి.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో ఏడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the instructions of Nārada, Vyāsadeva sat in deep meditation on the banks of the Sarasvatī River and beheld the Supreme Personality of Godhead along with His external energy, subsequently compiling Śrīmad-Bhāgavatam to alleviate the suffering of conditioned souls. The narrative then transitions to the aftermath of the Kurukshetra war, describing how Aśvatthāmā committed the atrocious act of slaying the sleeping sons of Draupadī, leading Arjuna to capture the perpetrator and bring him before Draupadī, who mercifully forgave him, resulting in Aśvatthāmā being humiliated rather than executed.