శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
12 - శ్రీమద్భాగవత సంక్షిప్త విషయ సూచి
సూత మహర్షి పలికెను --- ధర్మము గొప్పది. దానికి నమస్కారము. జగద్విధాతయగు శ్రీకృష్ణుని కొరకు నమస్కారము. నేను వేద వేత్తలకు నమస్కరించి, సనాతనములగు ధర్మములను గురించి చెప్పెదను.
ఓ మహర్షులారా! ఈ అద్భుతమైన విష్ణుగాథను నేను మీకు చెప్పితిని. దీనిని గురించియే మీరు నన్ను ప్రశ్నించితిరి. జీవులకు మానవజీవితములో శ్రవణము చేయదగినది ఇదియే.
ఈ పురాణము సాక్షాత్తు సకలపాపములను పోగొట్టే శ్రీహరి భగవానుని గా కీర్తించినది. ఆయన సకలప్రాణుల హృదయములో విరాజిల్లుతూ, యాంతర్యామియై, సత్త్వగుణప్రధానులగు భక్తులను చున్నాడు (ఉపాసనాకాండ).
ఈ జగత్తు ప్రకృతికి అతీతమైన బ్రహ్మనుండి పుట్టి దానియందే రమగును. ఉపనిషత్తులీ బ్రహ్మను ప్రతిపాదించుచున్నవి. అట్టి జ్ఞానమను, ఆత్మజ్ఞానమును, అపరోక్షానుభవమును, దానిని ప్రకాశింపజేసే నమును ఈ పురాణము వర్ణించినది (జ్ఞానకాండ).
భక్తియోగము, అది ఆశ్రయముగా గల వైరాగ్యము, పరీక్షిత్తు వృత్తాంతము, నారదచరితము అనునవి బాగుగా వివరించబడినవి.
బ్రాహ్మణుని శాపము వలన రాజర్షియగు పరీక్షిత్తు ప్రాయోపవేశము చేయుట, ఆ పరీక్షిత్తునకు మహర్షులలో శ్రేష్ఠుడగు శుకునితో సంవాదము వర్ణించబడినవి (ప్రథమస్కంధము).
యోగధారణచే దేహమును విడిచి పెట్టుట, నారదబ్రహ్మదేవుల సంవాద ము, అవతారముల సంక్షిప్తచర్చ, సృష్టికి ముందు ప్రధానమునుండి మహత్తు మొదలగు తత్త్వముల సృష్టి చెప్పబడినవి (ద్వితీయస్కంధము).
విదురునకు ఉద్దవునితో సంవాదము, తరువాత విదురునకు యునితో సంవాదము, పురాణసంహితను గురించి ప్రశ్న, ప్రళయము పురుషోత్తముని నిశ్చలస్థితి వర్ణించబడినవి (తృతీయ స్కంధము).
తరువాత ప్రకృతియందు గుణముల క్షోభ అనే సృష్టి, దానినుండి తత్త్వము, అహంకారము, పంచ తన్మాత్రలు అనే ఏడు వికృతుల సృష్టి, పొటినుండి బ్రహ్మాండము ఉత్పన్నమగుట, యందు విరాట్ పురుషుని స్థితి వర్ణించబడినవి.
స్థూలసూక్ష్మములైన కాలముయొక్క స్వరూపము, లోకములనే ము పుట్టుట, భూమిని సముద్రమునుండి పైకి తీయునప్పుడు బ్యాక్షుని శ్రీహరి వధించిన విధానము వర్ణించబడినవి.
దేవతలు, పశుపక్ష్యాదులు, మానవుల సృష్టి, రుద్రుల సృష్టి వర్ణించబడినవి. సగము స్త్రీ, సగము పురుషుడైన బ్రహ్మదేవుని (హిరణ్యగర్బుని వర్ణనము, ఆ దేవునినుండి స్వాయంభువ మనువు, శతరూప పుట్టుట వర్ణించబడినవి. ఉత్తమురాలగు శతరూప స్త్రీలలో మొట్టమొదటిది. ప్రాణిసృష్టికి ఆమెయే మూలకారణము.
కర్దమ ప్రజాపతియొక్క సంతానమైన అమ్మాయిలు మహర్షులకు ధర్మపత్నులగుట, మహాత్ముడగు కపిల భగవానుని అవతారము, బుద్ధిశాలియగు కపిలునితో దేవహూతి సంవాదము వర్ణించబడినవి.(ఇక్కడితో మూడవ స్కంధము సమాప్తము).
ఓ మహర్షులారా! మరీచి మొదలగు తొమ్మండుగురు ప్రజాపతుల సంతా , దక్షయజ్ఞధ్వంసము, ధ్రువచరితము, పృథుచరితము, ప్రాచీనబర్షి ఏ నారదునితో సంవాదము వర్ణించబడినవి (ఇంతవరకు చతుర్థస్కం ). తరువాత ప్రియవ్రతచరితము చెప్పబడినది (పంచమస్కంధము).
తరువాత నాభి, ఋషభ దేవుడు, భరతుడు అనువారల తములు గలవు. ద్వీపములు, దేశములు, సముద్రములు, కములు, నదుల వర్ణనము, జ్యోతిర్మండలముయొక్క సన్నివేశము, ళనరకముల స్థానము . వర్ణించబడినవి (ఇంతవరకు మస్కంధము).
ప్రచేతసులనుండి దక్షుని పుట్టుక, ఆతని పుత్రికల సంతానముగా దేవతలు, రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు, పర్వతములు, పక్షులు జన్మించుట వర్ణించబడినవి (షష్ఠ స్కంధము).
ఓ మహర్షులారా! త్వష్ఠకు వృత్రాసురుడు పుట్టుట, ఆతని మరణము (ఇంతవరకు షష్ఠ స్కంధము), దితికి ఇద్దరు పుత్రులు - (హిరణ్యాక్ష హిరణ్యకశిపులు) పుట్టుట, రాక్షసరాజగు హిరణ్యకశిపుని చరితము, మహాత్ముడగు ప్రహ్లాదుని చరితము వర్ణించబడినవి (సప్తమ స్కంధము).
మన్వంతరములు, గజేంద్రుని విముక్తి, మన్వంతరములలో హయగ్రీవుడు, అజితుడు మొదలైన విష్ణువు యొక్క అవతారములు వబడినవి (అష్ఠమస్కంధము).
జగన్నాథుడగు శ్రీహరి తాబేలుగా, ధన్వంతరీగా, చేపగా, నుడుగా అవతరించుట, స్వర్గవాసులు అమృతము కొరకై పొల ద్రమును మథించుట వర్ణించబడినవి.
దేవతలకు, రాక్షసులకు పెద్ద యుద్దము (ఇంతవరకు స్కంధము), రాజుల వంశముల వర్ణనము, ఇక్ష్వాకుని పుట్టుక, త్ముడగు సుద్యుమ్నుని గాథ వర్ణించబడినవి (నవమ స్కంధము),
ఈ నవమస్కంధమునందు ఇలాదేవి, తారాదేవి అనువారి గాథలు, సూర్యవంశము, శశాదుడు, నృగుడు, కవి మొదలగు రాజుల గాథలు చెప్పబడినవి.
సుకన్యయొక్క చరితము, తరువాత శర్యాతి, బుద్ధిశాలియగు కకుత్. స్థుడు, ఖట్వాంగుడు, మాంధాత, సౌభరి, సగరుల చరితములు గలవు.
పాపములను పోగొట్టే కోసలదేశప్రభుడగు శ్రీరాముని చరితము, నిమి మహారాజు దేహమును వీడుట, జనకుల పుట్టుక వర్ణించబడినవి.
భృగువంశీయులకు నాయకుడగు పరశురాముడు భూమిపై యులు లేకుండా చేయుట వర్ణించబడినది. చంద్రవంశమూల షుడగు ఐలుడు, యయాతి, నహుషుల గాథలు చెప్పబడినవి.
దుష్యంతుని పుత్రుడగు భరతుడు, శంతనుడు, ఆయన పుత్రుడగు భీష్ముడు, యయాతి, ఆయన పెద్ద కొడుకగు యదువు అనువారల శములు కీర్తించబడినవి.(ఇంతవరకు నవమ స్కంధము).
ఆ యదువు వంశమునందు జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు శ్రీకృష్ణుడనే పేరుతో అవతరించెను. ఆయన వసుదేవుని గృహములో జన్మించి, నందుని గోకులములో పెరిగెను.(దశమ స్కంధము). .
రాక్షససంహారకుడగు ఆ శ్రీకృష్ణుని అసంఖ్యాకములగు లీలలు -- పిల్ల వాడుగా ఉండగనే పూతనయొక్క పాలను ప్రాణములతో బాటుగా త్రాగి వేయుట, బండిని తల్లక్రిందులు చేయుట ఇత్యాదులు -- వర్ణించబడినవి.
తృణావర్తుని పిండిగా చేయుట, బక-వత్సాసురులను, ధేనుకాసురుని, వాని పరివారమును, ప్రలంబాసురుని సంహరించుట వర్ణించబడినవి.
చుట్టూ వ్యాపిస్తున్న కార్చిచ్చునుండి గోపాలకులను రక్షించుట, యనాగును శిక్షించుట, నందుని కొండచిలువనుండి విడిపించుట.
గోపకన్యకలు వ్రతమును చేయుట, శ్రీకృష్ణ భగవానుడు వారి ప్రత ఎమములచే సంతోషమును పొందుట, సోమిదేవమ్మలనను అంచుట, వేదవేత్తలు పశ్చాత్తాపపడుట వర్ణించబడినవి.
శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతమును పైకెత్తుట, ఇంద్రుడు మరియు సురభి
నను పూజించి అభిషేకించుట, రాత్రులయందు - గోపికలతో కరము వర్ణించబడినవి.
దుర్బుద్ధియగు శంఖచూడుని, అరిష్టుని, కేశిని శ్రీకృష్ణుడు వధించుట, అక్రూరుని రాక, తరువాత బలరామశ్రీకృష్ణుల ప్రయాణము వర్ణించబడెను.
గోపీకలు విలపించుట, తరువాత శ్రీకృష్ణుడు మథురానగరమునంతనూ చూచుట వర్ణించబడెను. కువలయాపీడమనే ఏనుగు, ముష్టికుడు, చాణూ రుడు, కంసుడు, వాని సోదరులు మొదలగువారి వధ వర్ణించబడెను.
ఓ మహర్షులారా! శ్రీకృష్ణుడు గురువైన సాందీపనియొక్క మరణించిన పుత్రుని మరల తీసుకొనివచ్చెను. ఆయన ఉద్ధవబలరాములతో గూడి మథురలో నివసిస్తూ, యాదవసముదాయమునకు అభీష్టమైన సర్వమును కూర్చెను. ఇది అంతా వర్ణించబడినది.
అనేకపర్యాయములు జరాసంధుడు తీసుకువచ్చిన సైన్యమును వధిం , యవనరాజగు కాలయవనుని వధించుట, ద్వారకను నిర్మించుట.
శ్రీకృష్ణుడు దేవతల నివాసమైన స్వర్గమునుండి పారిజాతవృక్షమును, ర్మ అనే సభను తీసుకువచ్చేను. యుద్దములో శత్రువులను మర్ధించి 0న రుక్మిణిని అపహరించెను. ఈ వివరములు వర్ణించబడినవి.
యుద్ధములో శ్రీకృష్ణుడు వేసిన బాణమునకు శివుడు ఆవులించుట, బాణాసురుని భుజములను నరుకుట, ప్రార్ణ్యోతిషపురాధిపతియగు నరకాసురుని సంహరించి కన్యలను తీసుకువచ్చుట వర్ణించబడినవి.
చేదిరాజగు శిశుపాలుడు, పౌండ్రకుడు, శాల్వుడు, దుర్బుద్ధియగు దంతవక్తుడు, శంబరుడు, ద్వివిదుడు, పీఠుడు (నరకాసురుని సేనాపతి), మురుడు, పంచజనుడు, వాని పుత్రుడు మొదలగువారి పరాక్రమము, వారి సంహారము, వారాణసీనగరము దహించబడుట, పాండవులను నిమిత్తముగా చేసుకొని భూభారమును తగ్గించుట వర్ణించబడినవి (పదవ స్కంధము సమాప్తము).
బ్రాహ్మణుల శాపము అనే సాకుతో శ్రీకృష్ణుడు తన వంశమును కూడ గారింపజేయుట, ఉద్ధవునకు శ్రీకృష్ణునితో అద్భుతమైన సంవాదము.
ఆ సంవాదమునందు నిశ్చయముగా సకలమైన ఆత్మవిద్య, ముయొక్క నిశ్చయము నిరూపించబడినది. తరువాత శ్రీకృష్ణుడు మాయాశక్తియొక్క ప్రభావముచే మానవావతారమును చాలించి లోకమును విడిచి పెట్టుట వర్ణించబడినది.(ఏకాదశస్కంధము పూర్తి).
యుగముల లక్షణములు, వాటికి తగ్గట్లుగా మానవుల ప్రవృత్తులు, యుగములో మానవులకు కలిగే ఉపద్రవములు, నాలుగు రకములు యములు వర్ణించబడినవి. ఉత్పత్తి కూడ మూడు విధములు. కృతికీ - ప్రకృతినుండి మహత్తత్త్వము మొదలగునవి ప్రకటమగుట. ఎత్తికీ - పుణ్యపాపములను బట్టి లభించే జన్మ. నిత్యా - ప్రతిక్షణము "ము నశించి పుట్టుచునే యున్నది.(ద్వాదశ స్కంధము).
రాజర్షి, బుద్ధిశాలి అగు పరీక్షిత్తు దేహమును విడిచి పెట్టుట, వేదశాఖల విభాగము, మార్కండేయ మహర్షి యొక్క పవిత్రగాథ, విరాట్ పురుషునియొక్క అంగోపాంగముల స్వరూపము, ప్రాణులలో అంతర్యామియగు సూర్యదేవుని గణములు వర్ణించబడినవి.
ఓ గొప్ప మహర్షులారా! ఈ విధముగా మీరు ఇక్కడ నన్ను ప్రశ్నించిన విషయమునీ విధముగా మీకు చెప్పితిని. ఈ సందర్భములో భగవానుడు లీలకై స్వీకరించిన అవతారములు, చేసిన లీలలు కూలంకషముగా వర్ణించబడినవి.
మనిషి పడిపోయినప్పుడు, జారినప్పుడు, పీడను పొందినప్పుడు,
తుమ్ము వచ్చి వివశుడైనప్పుడు, హరయే నమః (శ్రీహరి కొరకు స్కారము) అని బిగ్గరగా ఉచ్చరించవలెను. అట్లు చేయువాడు పాపములనుండి విముక్తుడగును.
ఎందుకంటే, అవినాశియగు శ్రీహరిని కీర్తించినా, ఆయన మహిమను ణము చేసినా, ఆయన చిత్తములో ప్రవేశించి మానవుల ఆపదను -- ర్యుడు చీకటిని, పెద్ద గాలి మేఘమును వలె -- నిశ్శేషముగా నశింప మను.
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని శ్రీహరి భగవానుని వర్ణించకుండా, మిథ్యాభూతములైన విషయభోగముల వర్ణన గల ఆ మాటలు నిశ్చయముగా వ్యర్థములు మరియు అసత్యములు. ఏ పలుకులయందు భగవానుని గుణముల ప్రకాశము గలదో, ఆహా! అవియే సత్యములు, అవియే కల్యాణకరములు, అవియే పావనములు.
ఏ వచనము ద్వారా ఉత్తమమగు కీర్తి గల భగవానుని కీర్తి నిరంతరము గానము చేయబడుచున్నదో, ఆ వచనమే నిత్యనూతనముగా రమ్యము, ప్రీతికరము. అదియే నిత్యము మనస్సునకు గొప్ప ఉత్సవము. ఆ వచనముచేతనే మానవులయొక్క శోకమనే సముద్రము ఎండిపోవును (మానవుడు జీవన్ముక్తుడగును).
వాక్కు రకరకముల అలంకారాది గుణములు గలదియే అయిననూ, త్తును పావనము చేసే శ్రీహరియొక్క కీర్తిని నుడువనిచో, అది తీర్థమే యగును. కాకులకు ఉచ్ఛిష్ఠము వేసే తీర్థమును హంసలు . భోగపరాయణులు సేవించే స్థానమును జ్ఞానులు తలయెత్తి 'డరు. ఎక్కడనైతే శ్రీహరి భగవానుడు కీర్తించబడునో, మలహృదయులగు సత్పురుషులు అక్కడ మాత్రమే ఉండెదరు.
ప్రతీశ్లోకమునందు అనంతుడగు శ్రీహరి భగవానుని కీర్తిని సూచించే నామములు గల వాక్కుయొక్క ప్రయోగము -- ఒకచో అపభ్రంశపదములు ఉన్నా, ఛందస్సు సరిగా లేకున్నా పరవాలేదు -- జనసముదాయముయొక్క పాపములను నశింపజేయును. ఎందుకంటే, సత్పురుషులు అట్టి వాక్కును మాత్రమే శ్రవణము చేయుదురు. వారు ఆ నామములను మాత్రమే గానము చేయుదురు, కీర్తించెదరు.
పరమాత్మకు క్రియాసంబంధము లేదు. పరమాత్మయందు సుఖదుఃఖాదిద్వంద్వమలములు లేవు. అట్టి పరమాత్మయొక్క జ్ఞానమైన ప్పటికీ, శ్రీహరి భగవానుని భక్తి లేనిదైనచో, అధికముగా శోభిల్లదు. కర్మ సాధనసాధ్యకాలములు రెండింటియందు దుఃఖ హేతువు. . అట్టి కర్మ, సర్వోత్తమమే అయినా, ఈశ్వరునికి సమర్పించకున్నచో, శోభిల్లుటకు హేతువు ఏమి గలదు?(లేదు.కావున, శోభిల్లదని వేరే చెప్పవలెనా?)
వర్ణాశ్రమములకు చెందిన ఆచరణలు, తపస్సు, అధ్యయనము మొదలగువాటియందు పరిశ్రమ చాల పెద్దది. దాని వలన కీర్తి, పద మాత్రమే లభించును. కాని, శ్రీహరియొక్క గుణములను చుట, శ్రవణము చేయుట, స్మరించుట మొదలగువాటిచే పతియొక్క పద్మములవంటి పాదములు విస్మృతికి రాకుండును.
శ్రీకృష్ణుని పద్మములవంటి పాదములను మరువకుండుటచే అమంగళములు నశించి, శాంతి, అంతఃకరణశుద్ధి, పరమాత్మయందు భక్తి, గ్యము, ఆత్మజ్ఞానము, అపరోక్షానుభవము కూడ విస్తరిల్లును.
ఆహా! ఓ మహర్షివర్యులారా! నిరంతరమగు భక్తి గల మీరు గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే, మీరు సకలప్రాణులయందు అంతర్యామి, జగన్నాథుడు అగు నారాయణదేవుని చిత్తములో ప్రవేశ పెట్టి భజించుచున్నారు. ఆయనపై మరియొక దైవము లేదు.
పూర్వము పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశము చేసిన సభలో మహర్షులు కూడ వినుచుండగా, నేను శుకమహర్షి ముఖమునుండి ఆత్మ తత్త్వమును శ్రవణము చేసితిని. దానిని మీరు మరల గుర్తుకు తెచ్చిరి.
ఓ మహర్షులారా! శ్రీకృష్ణ భగవానుని గొప్ప లీలలు వర్ణించదగినవి. ఆయన మహిమ విన్నవారి సకలములైన అశుభములను పోగొట్టును. నేను దీనిని మీకు చెప్పితిని.
ఎవడైతే ప్రతిదినము జాము గాని, క్షణము గాని ఈ విధముగా పించునో, ఎవడైతే శ్రద్ధతో వినునో, అట్టివాడు తనను(అంతఃకరణమును) తాను నిశ్చయముగా పవిత్రము చేసుకొనును.
ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని శ్రవణము చేయువాడు సుష్మంతుడగును. ఉపవసించి సావధానుడై పఠించువాడు, ఆ రాయణ వలన పాపములు లేనివాడగును.
పుష్కరము, మథుర, ద్వారకలయందు మనస్సును నిగ్రహించి ఉపవసించి ఈ భాగవతసంహితను పఠించువాడు (సంసార) భయమునుండి విముక్తుడగును.
భాగవతమును కీర్తించి వినుట వలన దేవతలు, మహర్షులు, సిద్దులు, పితృదేవతలు, మనువులు, రాజులు కీర్తించువానికి, విన్నవానికి అభీష్టములను నెరవేర్చెదరు.
బ్రాహ్మణుడు ఋగ్వేద-యజుర్వేద-సామవేదములను అధ్యయనము చేసి తేనె, నెయ్యి, పాల నదులను పొందును. అనగా, సకలసమృద్దులను పొందును. భాగవతమును అధ్యయనము చేయుటచే కూడ అటులనే పొందును.
బ్రాహ్మణుడు సావధానుడై ఈ పురాణసంహితను అధ్యయనము చేసి, వానునిచే చెప్పబడిన ఆ పరమపదము (మోక్షము) ను పొందును.
దీని అధ్యయనముచే బ్రాహ్మణుడు. తత్త్వజ్ఞానమును పొందుటకు న ప్రజ్ఞను, క్షత్రియుడు సముద్రపర్యంతము సామ్రాజ్యమును, నిధుల ఆధిపత్యమును పొందును. శూద్రుడు పాపమునుండి మడగును.
సకలజగన్నాథుడగు శ్రీహరి కలిదోషముల సమూహమును నశింపజేయును. ఇతరగ్రంథములలో ఆయన నిరంతరముగా కీర్తించబడుట లేదు. ఇది నిశ్చయము. కాని, ఈ భాగవతము మాత్రము సకలజగద్రూపుడగు శ్రీహరి భగవానుని ప్రతి పదమునందు గాథల ప్రసంగములద్వారా అంతటా వర్ణించుచున్నది.
ఆద్యంతములు లేని ఆత్మస్వరూపుడైన శ్రీహరి భగవానుని నేను నమస్కరించుచున్నాను. ఆయన తన శక్తులైన రజస్సత్త్వతమోగుణములచే ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. ద్యులోకాధిపతులగు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శంకరుడు ఆయనను ఎట్లు స్తుతించవలెనో తెలియకున్నారు.
సనాతనుడగు శ్రీహరి భగవానుడు ప్రకృతి, మహత్తత్త్వము, సూత్రాత్మ, రకారము, పంచ తన్మాత్రలు అనే వర్ధిల్లిన తొమ్మిది శక్తులతో తన రూపమునందే చరాచరజగత్తును సృష్టించి ప్రకటించేను. ఆత్మాను మాత్రమే స్వరూపముగా గల ఆ దేవదేవునికి నమస్కారము.
ఏకమహర్షి ఆత్మానందముతో నిండిన మనస్సు కలిగి భేదదృష్టిని కరించినవాడు. అయినా, ఆయన వ్యక్తిత్వము శ్రీహరియొక్క మధుర "చే ఆకర్షించబడెను. ఆయన దయతో ఆత్మతత్త్వమును ప్రకాశింప సకలదుఃఖములను పోగొట్టే భాగవతపురాణమును విస్తరింప జేసెను. సుని పుత్రుడగు అట్టి శుకమహర్షిని నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్భాగవతము పన్నెండవ స్కంధములో సంక్షిప్తవిషయసూచిని
వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది .
