శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము

10 - శివ భగవానుడు మార్కండేయ మహర్షికి వరములనిచ్చుట

సూత మహర్షి యిట్లు పలికెను -- ఆ మార్కండేయ మహర్షి ఈ ధముగా నారాయణునిచే రచించబడిన త్రిగుణాత్మికయగు నాయయొక్క ఈ వైభవముననుభవించి, ఆయననే శరణు వేడెను.

మార్కండేయ మహర్షి యిట్లు పలి కెన్లు ... ఓ శ్రీహరీ! శరణు కొచ్చినవారి భయమును నీవు పోగొట్టెదవు. నేను నీ పాదముల మూలమును శరణు జొచ్చుచున్నాను. జ్ఞానము వలె ప్రకాశించే నీ మాయచే దేవతలు కూడ మోహమును పొందుచున్నారు..

సూత మహర్షి ఇట్లు పలి కెను --- పార్వతీ దేవి మరియు తన గణములు చుట్టువారి రాగా, రుద్ర భగవానుడు . ద్యులోకమునందు పర్యటించుచుండెను. ఈ విధముగా ఏకాగ్రమైన చిత్తము గల ఆ మార్కండేయ మహర్షిని ఆయన చూచెను.

అప్పుడు పార్వతీదేవి ఆ మహర్షిని చూచి కైలాసవాసియగు శివునితో నిట్లనెను - ఓ భగవానుడా! దేహమును, ఇంద్రియములను, మనస్సును ఏకాగ్రము చేసిన ఈ మహర్షిని చూడుము. ఈయన గాలి వీచుట ఆగిపోయినప్పుడు నిశ్చలమైన నీరు, చేపలు గల సముద్రమును పోలిఉన్నాడు.

ఈయనను తపస్సునకు ప్రత్యక్షఫలమునిచ్చి కృతార్థుని చేయుడు. సిద్ధిని ఇచ్చువాడవు నీవే.

శ్రీరుద్ర భగవానుడిట్లు పలికెను -- మార్కండేయుడు బ్రహ్మర్షి. ఆయన కామనలను కోరడు. మోక్షమును కూడ కోరడు. పూజనీయుడగు నిర్వికార పూర్ణ బ్రహ్మయందు ఈతడు సర్వాతిశాయియగు భక్తిని పొందినాడు.

ఓ పార్వతీ! అయినప్పటికీ సత్పురుషుడగు ఈయనతో సంభాషించెదము. ఎందుకంటే, మానవులకు సత్పురుషులతోడి సమాగమము సర్వోత్కృష్టమైన లాభము (ఇది జనులకు సత్సంగమహిమను ప్రకటించుటకై శివుని లీల),

సూత మహర్షి ఇట్లు పలికెను --- సత్పురుషులకు శరణమగు రుద్ర భగవానుడు సకలవిద్యలకు అధీశ్వరుడు, సకలప్రాణులలో అంతర్యామి. ఆయన ఇట్లు పలికి ఆ మహర్షి దగ్గరకు వెళ్లాను.

మనోవృత్తులను నిరోధించి సమాధిలోనున్న ఆ మహర్షికి తన స్పృహ గాని, జగత్తుయొక్క స్పృహ గాని , లేదు. సాక్షాత్తు జగత్తుయొక్క అంతర్యాములైన భగవతీభగవానుల రాకను ఆయన యెరుగడు.

కైలాసాధిపతి, అంతర్యామి అగు రుద్రభగవానుడా విషయమును త్రిగుణాత్మికయగు మాయాశక్తిచే గుర్తు పట్టెను. ఆయన ఆ మహర్షియొక్క బుద్ధి అనే గుహయందలి చిదాకాశమును, వాయువు రంధ్రమును వలే, ప్రవేశించేను.

మెరుపు వలే పచ్చని జటలను దాల్చిన ముక్కంటి పది చేతులతో పొడవుగా ఉదయిస్తున్న సూర్యునివలె నుండెను. ఆయన పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించి శూలము, మంచపు కోడువంటి గుదియ, డాలు, జపమాల, డమరువు, పుర్రె, కత్తి, ధనుస్సులను ధరించెను. బయట మాత్రమే కాకుండా అకస్మాత్తుగా తన లోపల కనబడిన ఆ శివుని చూచి - మార్కండేయ మహర్షి హృదయములో ఆశ్చర్యమును పొందెను.

ఇది యేమి? ఈ దృశ్యము ఎక్కడనుండి వచ్చినది? అని కంగారు పడి ఆ మహర్షి సమాధిని విరమించెను.

ముల్లోకములకు ఒకే ఒక తండ్రియగు శివుడు గణములతో, పార్వతీదేవితో గూడి విచ్చే సెను. ఆ మహర్షి కళ్లను తెరచి ఆయనను చూచి తల వంచి నమస్కరించెను.

ఆ మహర్షి ఆ శివునికి, పార్వతీదేవికి, గణములకు ఆవాహనము, సనము, పాద్యము, అర్ఘ్యము, గంధము, పుష్పమాలలు, ధూపము, పములతో పూజను చేసెను.

ఆ మహర్షి ఇట్లు పలికెను --- సర్వసమర్థుడవగు ఓ 'ఈశ్వరా! ్వరూపానుభవముచే పూర్ణ మైన కామనలు గల నీకు మేము ఏమి చేయ లము? (ఏమీ చేయలేము), నీవు జగత్తును ఆనందింప జేయువాడవు.

నీవు నిర్గుణుడవైన శివుడవు. సత్త్వగుణోపాధిచే శాంతుడవై అధికముగా ఆనందింపజేసెదవు. రజోగుణోపాధి కలవాడవే అయిననూ, క్రూరుడవు కావు. తమోగుణోపాధి కలవాడవే అయిననూ మోహము గలవాడవు కావు. నీకు నమస్కారము.

సూత మహర్షి ఇట్లు పలికెను --- జగత్కారణమగు శివభగవానుడు చైతన్యస్వరూపుడు. మార్కండేయ మహర్షి ఈ విధముగా స్తుతించగా, సత్పురుషులకు శరణము అగు ఆయన చాల సంతోషించెను. ప్రసన్నమగు అంతఃకరణము గల ఆ దేవుడు ఆ మహర్షితోనిట్లనెను.

శ్రీశివ భగవానుడిట్లు పలికెను -- యథేచ్చగా వరమును కోరుకొనుము. మేము ముగ్గురము వరములనిచ్చే ప్రభువులము. మా దర్శనము వ్యర్థము కాదు. మానవుడు మానుండి అమృతత్వము (మోక్షము) ను పొందును.

బ్రహ్మవేత్తలు పరోపకారశీలురై శాంతస్వభావులై ఉండెదరు. వారు సంసారాసక్తి లేకుండా ప్రాణులపై ప్రేమను కలిగియుందురు. మాయందు ఇతరమునేరుగని భక్తి గల బ్రహ్మవేత్తలకు వైరభావము ఉండదు. వారు సర్వమునందు సమముగా వ్యాపించియున్న ఈశ్వరుని దర్శించెదరు.

లోకములోని జనులు, లోకపాలకులు, నేను, పూజనీయుడగు బ్రహ్మదేవుడు, స్వయముగా అంతర్యామియగు శ్రీహరి కూడ ఆ బ్రహ్మవేత్తలను నమస్కరించి, పూజించి, ఉపాసించుచున్నారు.

ఆ బ్రహ్మవేత్తలు నేను-శ్రీహరి-బ్రహ్మదేవుడు అనే ముగ్గురియందు గాని, తమకు ఇతరజనులకు గాని, లేశమైననూ భేదమును భావించరు. కావుననే, మేము మిమ్ములను సేవించుచున్నాము.

ఎందుకంటే, కేవలము జలములు మాత్రమే తీర్థములు కావు. కేవలము ప్రాణము లేని రాళ్లే దేవతలు కావు. అవి చాల కాలమునకు పావనము చేస్తే, మీరు దర్శనమాత్రముచే పావనము చేయుదురు.

బ్రహ్మవేత్తలు మూడు వేదముల రూపములోనున్న మా తత్త్వమును చిత్తసమాధానము, తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహములచే నిలబెట్టెదరు. అట్టి బ్రహ్మవేత్తలకు మేము నమస్కరించుచున్నాము.

మీ మాటలను వినుట వలన, లేదా మిమ్ములను దర్శించుట వలన హాపాపులు కూడ శుద్ధి పొందెదరు. పశుహింసకులు కూడ శుద్ధి పొందెదరు. మీతో సంభాషించుట, నమస్కరించుట మొదలగువాటి వలన శుద్ధి పొందెదరని వేరుగా చెప్పవలయునా?

సూత మహర్షి ఇట్లు పలికెను ... చంద్రశేఖరుడగు శివుడీ విధముగా ర్మరహస్యములతో నిండియున్న పలుకులను పలికెను. చెవులకు(తో) మృతముయొక్క నిధానమగు ఆ పలుకులను ప్రేమతో వినుచున్న నార్కండేయ మహర్షికి తృప్తి కలుగలేదు.

విష్ణుమాయ మార్కండేయుని చాల సేపు భ్రమింపజేసి త్రిప్పి కృశించునట్లు చేసెను. శివుని వాక్కు అనే అమృతము ఆయన క్లేశములనన్నింటినీ పారద్రోలేను. ఆయన శివునితో నిట్లనెను.

మార్కండేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆహా! ఇదీ ఈశ్వరుని లీల. దీనిని దేహధారులు ఊహ కూడ చేయలేరు. ఏదనగా, జగన్నాథులు శాసించదగిన జీవులను స్తుతించి నమస్కరించుచున్నారు.

ప్రాణులకు ధర్మమును బోధించే మహాత్ములు ధర్మమును స్వీకరింపజేయుటకై తరుచుగా దానిని తాము ఆచరించెదరు. ఇతరులు ఆచరించుచుండగా ప్రోత్సహించి, పైగా స్తుతించెదరు.

భక్తుని స్తుతించుట ఇత్యాదులు భగవానుని తన మాయామయమైన నములు ఇంద్రజాలము చేయువాని కపటప్రదర్శనములు వంటివి. అట్టి ర్శనలచే ఐంద్రజాలికుని ప్రభావము దూషితము కాదు. అదే ముగా, లోకసంగ్రహము కొరకైన ఇట్టి వర్తనములచే భగవానుని మ దూషితము కాదు.

కలను చూచువాడు ఆ ప్రపంచమును తన మనస్సునుండియే సించును. అదే విధముగా, భగవానుడు తన మనస్సు చేతనే ఈ త్తును సృష్టించి దానిలో చైతన్యరూపముగా ప్రవేశించినాడు. స్వవరజస్తమోగుణములు (గుణకార్యములగు దేహాదులు) కర్మలను

చుండగా, పరమాత్మయే కర్తయా యన్నట్లు కన్పట్టుచున్నాడు.

భగవానుడు మూడు గుణములను కలిగియున్ననూ, వాటికి అతీతమైన కేవల-అద్వితీయ చైతన్యమే స్వరూపముగా గలవాడు. గురువు, వేదము భగవానుని రూపములే. ఆ భగవానుని కొరకు నమస్కారము.

ఓ పరబ్రహ్మా! నీ దర్శనమే వరము. అట్టి నీనుండి నేను మరియొక వరమును దేనిని కోరవలెను? నీ దర్శనముచే మానవుని కామనలు పూర్ణమై, సంకల్పములు సత్యములగును.

అయినప్పటికీ, ఒక వరమును కోరెదను. నీవు కామనలను వర్షించే కార్డుడవు. నాకు శ్రీహరి భగవానునియందు, ఆయన కాంతభక్తులయందు, మరియు నీయందు ఉజ్వలమైన భక్తి కలుగుగాక!

సూత మహర్షి పలికెను --- ఈ విధముగా మార్కండేయ మహర్షి శివ 'గవానుని పూజించి, మధురమైన వాక్కుతో స్తుతించెను. పార్వతీ దేవి నాడ ఆయనను అభినందించెను. అప్పుడాయన ఆ మహర్షితో నిట్లనెను.

ఓ మహర్షీ! నీ ఈ సకలకామనలు పూర్ణమగును. నీవు త్యక్షాదిప్రమాణగోచరుడు కొని శ్రీహరియందు భక్తి గలవాడవు. నీకు ల్పము అంతమయ్యేవరకు పవిత్రము చేసే కీర్తి లభించును. నీకు అసలిదనము, మరణము ఉండవు.

ఓ మహర్షీ! వేదాధ్యయనముచే ఒక విలక్షణకాంతితో ప్రకాశించే నీకు మూడు కాలముల జ్ఞానము, అపరోక్షానుభవము, వైరాగ్యము, పురాణముల ఆచార్యత్వము కలుగుగాక!

సూత మహర్షి. ఇట్లు పలికెను --- జగన్నాథుడగు ఆ ముక్కంటి దేవుడు ఈ విధముగా మార్కండేయ మహర్షికి వరములనిచ్చి వెళ్లాను. దారిలో పార్వతీదేవికి ఆ మహర్షి చేసిన తపస్సును గురించి, ఆ మహర్షికి కలిగిన మాయాశక్తి యొక్క అనుభవమును గురించి చెప్పెను.

భృగువంశీయులలో శ్రేష్ఠుడగు ఆ మార్కండేయ మహర్షి గొప్ప గము యొక్క మహిమ (అణిమాది సిద్ధి) ను, శ్రీహరియందు అనన్య క్తిని పొందెను. ఆయన ఇప్పటికీ యథేచ్ఛగా సంచరించుచున్నాడు.

బుద్ధిశాలియగు మార్కండేయ మహర్షి భగవానుని అద్భుతమైన రాయాశక్తియొక్క వైభవమునీ విధముగా సాక్షాత్కరించుకొనెను. దీనిని  వివరముగా చెప్పితిని.

మార్కండేయుని ఈ అనుభవము (ప్రళయసముద్రము, శిశువైన శ్రీ రి ఉదరములో ప్రవేశించుట) అప్పుడు మాత్రమే భాసించినది. ఈ విష నుము తెలియని కొందరు మార్కండేయుని అనుభవము యథార్థమేనని, lయన అనేకకల్పములు జీవించినాడనియు చెప్పెదరు. మానవులు అనుభవించే జననమరణప్రవాహము పరమాత్మయొక్క మాయ మాత్రమే. రు

భృగువంశశ్రేష్ఠుడవగు ఓ శౌనకమహర్షి! కాలచక్రమే ఆయుధముగా గల శ్రీహరియొక్క మహిమతో కూడిన ఈ వర్ణనను ఈ విధముగా ఎవడైతే శ్రద్ధతో వినిపించునో, లేదా వినునో వారిద్దరు, ఆహా!, కర్మవాసనల వలన కలిగే సంసారము (జననమరణప్రవాహము) నుండి విముక్తులగుదురు.

శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో మార్కండేయ మహర్షికి శివభగవానుని వరదానమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.