శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
9 - మార్కండేయ మహర్షి మాయాశక్తిని దర్శించుట
సూత మహర్షి ఇట్లు పలికెను --- బుద్ధిశాలియగు మార్కండేయ మహర్షి ఈ విధముగా నరుని (జీవుని మిత్రుడగు నారాయణ భగవానుని బాగుగా స్తుతించెను. అప్పుడాయన ప్రీతుడై భృగువంశశ్రేష్ఠుడగు మార్కండేయునితో నిట్లనెను.
శ్రీ నారాయణ భగవానుడిట్లు పలి కెను --- ఓయీ! నీవు బ్రహ్మర్షులలో, శ్రేష్ఠుడవు. చిత్తకాగ్రత, నాయందు - తొలగిపోని భక్తి, తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియసంయమములచే నీవు సంసిద్ధుడవైనావు.
నీవు అనుష్టించిన సుదీర్ఘమగు నైష్ఠికబ్రహ్మచర్యవ్రతముచే మేము నీ యెడల చాల ప్రసన్నులమైతిమి. వరములనిచ్చువారిలో శ్రేష్ఠుడనగు నా నుండి నీవు అభీష్టమగు వరమును కోరుకొనుము. నీకు మంగళమగు గాక!
మార్కండేయ మహర్షి ఇట్లు పలికెను -- దేవనాయకులగు బ్రహ్మాదులను శాసించే ఓ శ్రీహరీ! నీవు శరణు జొచ్చినవారి పీడను పోగొట్టెదవు. నీకు సర్వోత్కర్ష యగుగాక! నేను నిన్ను చక్కగా దర్శించితిని. ఈ వరము నాకు చాలును.
బ్రహ్మదేవుడు మొదలగువారు యోగముచే పరిపక్వమైన మనస్సుతో శోభాయుక్తమైన పద్మములవంటి నీ పాదములను దర్శించి కృతార్థులైరి. అట్టి నీవు నా కన్నులకు కనబడినావు.
పద్మపత్రములవంటి కన్నులు గల దేవా! పావనమైన కీర్తి గలవారిలో నీవు అగ్రేసరుడవు. నీ దర్శనము చేతనే కృతార్థత. ఐనప్పటికీ, నేను మాయను చూడగోరుచున్నాను. లోకపాలకులతో సహా లోకము ఆ మాయ చే సదనమగు బ్రహ్మయందు భేదమును తెలియుచున్నది.
సూత మహర్షి ఇట్లు పలి కెను --- ఓ శౌనక మహర్షీ! మార్కండేయ మహర్షి ఈ విధముగా తన కోరిక తీరే విధముగా అంతర్యామియగు ఆ నారాయణ భగవానుని స్తుతించి పూజించెను. ఆయన చిరునవ్వుతో సరేనని పలికీ, బదరికాశ్రమమునకు వెళ్లాను.
ఆ మహర్షి మాయను దర్శించుట అనే ఆ విషయమునే తలపోస్తూ న ఆశ్రమములోనే నివసించెను. ఆయన అగ్ని, సూర్యుడు, చంద్రుడు, లములు, భూమి, వాయువు, ఆకాశము, ఆత్మలయందు అంతటా కూడ హరిని ధ్యానిస్తూ, భావన కల్పించబడిన ద్రవ్యములతో (మానస) జను చేసెను. ఒకప్పుడు ఆయన ప్రేమయొక్క ప్రవాహముచే బంచెత్తబడినవాడై పూజను విస్మరించెను.
భృగువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ శౌనక మహర్షి! ఒకనాడు ఆ మహర్షి పుష్పభద్రా నది ఒడ్డున సంధ్యాసమయములో ఈశ్వరుని ఉపాసించుచుండగా, పెద్ద గాలి వీచెను.
భయంకరమగు ధ్వనిని గట్టిగా చేయుచున్న ఆ గాలి వెంట భయమును గొల్పే మేఘములు బయలు దేరినవి. అవి మెరుపులతో బిగ్గరగా గర్జిస్తూ, బండి ఇరుసువలె దొడ్డు అయిన వర్షధారలను చుట్టూ విడిచి పెట్టినవి.
ఆ పెద్ద వర్షము తరువాత నాలుగు సముద్రములు గాలియొక్క వేగముచే కేరటములతో భూతలమును అన్ని వైపులనుండి అంతటా ముంచెత్తుచున్నట్లు కనబడెను. క్రూరమైన మొసళ్లు, భయమును గొల్పే సుడిగుండములు గల ఆ సముద్రములనుండీ గంభీరనాదము పుట్టేను.
ద్యులోకమును దాటివేసిన కెరటములు, సహించ శక్యము కాని లులు, మెరుపులు ఆ మహర్షిని, నాలుగు రకముల జరాయుజ-అండజ- స్వేదజ-ఉద్భిజ్జ) ప్రాణులు గల జగత్తును లోపల యట కూడ తపింపజేయుటను ఆ మహర్షి చూచెను. నీటిచే ముంచెత్త డిన భూమిని చూచి ఆ మహర్షి మనస్సు చెడి చాల భయపడెను.
మహాసముద్రము కేరటములతో భయంకరముగా నుండెను. బడిగాలిచే నీరు గిర గిర తిరుగుచుండెను. వర్షిస్తున్న మేఘములు ముద్రమును నింపుచుండెను. మహర్షి పైకి చూచుచుండగనే ఆ సముద్రము ద్వీపములు, దేశములు, పర్వతములతో సహా భూమండలమును కూడ ముంచెత్తాను.
భూలోకము, అంతరిక్షము, ద్యులోకము, గ్రహనక్షత్రాది జ్యోతిర్మండలములు, దిక్కులు అనువాటితో కూడిన ముల్లోకములు మునిగిపోయెను. ఆ మహర్షి ఒక్కడే మిగిలెను. ఆయన జడుడు వలె, గ్రుడ్డివాడు వలె, జటలను విరబోసుకొని తిరుగాడెను.
ఆకలి దప్పికలతో వ్యాకులుడైన ఆ మహర్షికి మొసళ్లు, తిమింగిలములు ఉపద్రవమును కలిగించగా, తరంగములు, గాలి విసిరికొట్టెను. ఆయన అంతము లేని చీకటిలో దిక్కులయందు పరిభ్రమించుచుండెను. శరీరమంతా అలసట వ్యాపించెను. భూమి, కాశములు కూడ ఆయనకు తెలియకుండెను.
ఆయన ఒకచోట పెద్ద సుడిగుండమునందు పడెను. ఒకచోట కెరటము అయనను విసిరి కొట్టెను. ఇంకో చోట ఈయనను తినుటకై పరస్పరము "ట్లాడుతున్న జలజంతువులు ఆయనను తినివేయుచుండెను.
ఆయన ఒకప్పుడు శోకమును, మరియొకప్పుడు మోహమును, ఇంకో మయములో దుఃఖమును, అప్పుడప్పుడు సుఖమును కూడ, మరియు యమును అనుభవించెను. ఆయన వ్యాధి-మనోవ్యాధి మొదలగువాటిచే డించబడి మరణించుటకు సిద్ధముగా నుండెను.
ఆ మహర్షి విష్ణుమాయ చే కప్పివేయబడిన స్వరూపము గలవాడై ఆ సముద్రములో పరిభ్రమించుచుండగా, పదుల వందల వేల కోట్ల సంవత్సరములు గడిచిపోయెను.
ఆ ప్రళయములో తిరుగుచున్న ఆ మహర్షి ఒకనాడు భూమియొక్క ఎత్తైన చోట చిగుళ్లతో, పళ్లతో శోభిల్లే ఒక మర్రి మొక్కను చూచెను.
ఆ చెట్టు ఈశాన్యపు కొమ్మ పై ఆకు దొన్నెలో పరున్న ఒక పిల్లవాడు కూడ కనబడెను. ఆ పిల్లవాడు కాంతితో చీకటిని మ్రింగివేయుచుండెను.
గొప్ప మరకత మాణిక్యము వలె నీలవర్ణము గల ఆ బాలకునకు శోభా ముక్త మైన పద్మమువంటి ముఖము, శంఖము వంటి కంఠము, విశాలమైన
క్షఃస్థలము, అందమైన ముక్కు, సుందరమైన కనుబొమలు ఉండెను.
ఆ పిల్లవాని ముఖముపై ముంగురులు శ్వాసచే కదులుతూ 'కాశించేను, శంఖము లోపలి భాగము వలె శోభిల్లే చెవులకు దానిమ్మ రాలను పోలిన ఆభరణములు శోభిల్లెను. పగడమును పోలిన క్రింది పెదవి తిచే తెల్లని అమృతతుల్యమైన చిరునవ్వు కొంచెము ఎర్రనయ్యెను.
ఆ శిశువుయొక్క కనుకొలకులు పద్మపు పొట్ట వలె కొంచెము ఎర్రగా నుండెను. ఆ పిల్లవాని చూపులు చిరునవ్వుతో మనోహరముగా నుండెను. పొట్ట మీది ముడుతలు శ్వాసచే కదలగా, వాటిని బట్టి లోతైన బొడ్డు కూడ కదులుచుండెను. పొట్ట రావియాకును పోలియుండెను.
ఆ పిల్లవాడు అందమైన ప్రేళ్లు గల చేతులు రెండింటితో పద్మమువంటి పాదమును పైకి లాగి నోటిలో పెట్టి చప్పరించుచుండగా చూచి, మార్కండేయ మహర్షి ఆశ్చర్యమును పొందెను.
ఆ పిల్లవానిని చూచుటచే మహర్షి అలసట తొలగిపోయి, ఆనందముతో పద్మమువంటి హృదయము మరియు పద్మములవంటి కన్నులు బాగా వికసించెను. ఆయనకు గగుర్పాటు కలిగెను. పైగా, ఆ అద్భుతరూపమును చూచి ఆయనకు శంక కూడ కలిగెను. ఆ పిల్లవానిని సశ్నించుటకై ఆయన ఎదురుగా దగ్గరకు వెళ్లాను.
అంతలో పిల్లవాని శ్వాసచే భృగువంశీయుడగు ఆ మహర్షి దోమ వలె రీరము లోపలకు వెళ్లిపోయెను. ఆ గర్భమునందు కూడ ఆయనకు ఈ గత్తు పూర్తిగా ప్రళయమునకు ముందువలే ఉంచబడి కనబడెను. ఆయన నానిని చూచి మోహమును, అత్యాశ్చర్యమును పొందెను.
ఆకాశము, పృథివి, ద్యులోకము, నక్షత్రమండలములు, పర్వతములు, సముద్రములు, ద్వీపములు, ప్రాంతములు, దిక్కులు, దేవతలు, రాక్షసులు, అడవులు, దేశములు, నదులు, నగరములు, గనులు, కృషీవలుల పల్లెలు, గొల్లపల్లెలు, ఆశ్రమములు, వర్ణములు, వారి ఆచారవ్యవహారములు ఆయనకు అక్కడ కనబడెను.
ఈ మహర్షి అచట పంచమహాభూతములను, పోటీ చే నిర్మితమైన ప్రాణుల దేహములను, అనేకయుగములు-కల్పములచే కల్పించబడే కాలమును కూడ చూచెను. లోకవ్యవహారమునకు హేతువులైన దేశకాలవస్తువులేవి గలవో ఆ సర్వమును, ఈశ్వరునిచే ప్రకాశింప జేయబడిన జగత్తును, ఇది పరమార్థమా యన్నట్లు, ఆయన చూచెను.
ఆయన హిమవత్పర్వతమును, దానిపై ఆ పుష్పభద్రా నదిని, తన శ్రమమును, మహరులను కూడ చూచెను. ఆయన జగత్తును చూస్తూ నుండగానే, పిల్లవాని శ్వాసనుండి బయటకు విసిరివేయబడి, ప్రళయసముద్రములో క్రింద బడెను.
ఆ మహర్షి భూమియొక్క ఆ ఎత్తైన ప్రదేశమునందు ఆవిర్భవించిన ఎర్రి చెట్టును, దాని ఆకు దొన్నెయందు పరుండిన పిల్లవానిని చూచెను. ఆ పిల్లవాడు ప్రేమతో, అమృతమువంటి చిరునవ్వుతో కడగంటి చూపును ఆయనపై బరపెను.
ఆ మహర్షి ఆ పిల్లవానిని కన్నులతో తన హృదయమునందు స్థాపించు • కొనెను. ఆయన ప్రమాణగోచరుడు కాని శ్రీహరిని ఆ పిల్లవాని రూపములో చూచి, కౌగిలించుకొనుటకై చాల ఆయాసపడుతూ ఎదురుగా వెళ్లాను.
ఆ పిల్లవాడు సాక్షాత్తు యోగులకు అధీశ్వరుడు, బుద్దిగుహయందు ఉండువాడు అగు శ్రీహరి భగవానుడే. ఆ మహర్షి కౌగిలించే లోపులోనే ఆయన, అసమర్థుని ఇచ్ఛ వలే, వెంటనే అంతర్ధానమయ్యెను.
ఓ మహర్షీ! తరువాత ఆ పిల్లవాని వెంట మర్రి, నీరు, లోకముల ప్రళయము ఈ మహర్షికి కనబడకుండా పోయెను. ఆయన తన ఆశ్రమమునందు పూర్వములో వలెనే నిలిచియుండెను.
శ్రీమద్భాగవతము పన్నెండవ స్కంధములో మార్కండేయుని మాయా దర్శనమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
