శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
11 - శ్రీహరి అంగోపాంగములు - ద్వాదశాదిత్యులు
శౌనక మహర్షి పలికెను - భగవద్బక్తుడవగు సూత మహరీ! చాల సినవారిలో నీవు శ్రేష్ఠుడవు. నీవు సకలశాస్త్రసిద్దాంతముల రహస్యము సినవాడవు. కావున, ఈ విషయము గురించి నిన్ను ప్రశ్నిస్తున్నాము.
కేవలము శ్రీపతియగు శ్రీహరిని తంత్రప్రోక్త మైన పద్దతితో ఉపాసించే వారు పాదములు మొదలైన అంగములను, గరుడుడు మొదలైన ఉపాంగ ములను, సుదర్శనము మొదలైన ఆయుధములను, కౌస్తుభము మొదలైన అలంకారములను ఏ తత్త్వములతో ఏ ప్రకారముగా భావన చేసెదరు? క్రియాయోగము (ఈశ్వరుని ఆరాధించే పద్ధతి) ను తెలియగోరే మాకీ విష యమును వివరించి చెప్పుము. నీకు మంగళమగు గాక! మరణశీలుడగు మానవుడీ క్రియాయోగముచే అమృతత్వము (మోక్షము) ను పొందును.
సూత మహర్షి ఇట్లు పలికెను --- వేదములయందు, తంత్రములయందు పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు, నారదుడు మొదలగు ఆచార్యులు విష్ణువు యొక్క విరాడ్-విగ్రహము మొదలైన విభూతులను చెప్పిరి. నేను గురువులకు నమస్కరించి వాటినే చెప్పెదను.
ఆ ప్రసిద్దమైన విరాట్టు మాయాశక్తి, మహత్తత్త్వము, సూత్రాత్మ, కారము, పంచతన్మాత్రలు అనే తొమ్మిది తత్త్వములతో మంచబడినది. దానియందు ఐదు కర్మేంద్రియములు, ఐదు సేంద్రియములు, మనస్సు, పంచ స్థూలభూతములు అనే పదునారు రములు నిండియున్నవి. చైతన్యముతో కూడిన ఆ విరాట్టునందు ల్లోకములు కానవచ్చుచున్నవి.
ఇది విరాట్ పురుషుని రూపము. ఆ ప్రభువునకు భూమి పాదములు, లోకము తల, ఆకాశము నాభి, సూర్యుడు కన్నులు, వాయువు ముక్కు ములు, దిక్కులు చెవులు.
ఈశ్వరునకు ప్రజాపతి జననేంద్రియము, మృత్యుదేవత విసర్జనేంద్రియము, లోకపాలకులు చేతులు, చంద్రుడు మనస్సు, ముడు కనుబొమలు.
సర్వవ్యాపకుడగు విరాట్ పురుషునకు లజ్జ పై పెదవి, లోభము క్రింది. పెదవి, వెన్నెల దంతములు, భ్రమ పెట్టే మాయాశక్తి చిరునవ్వు, చెట్లు రోమములు, మేఘములు కేశములు.
ఈ మనిషి ఏయే అవయవముల రచనచే ఎట్టి పరిమాణమును కలిగి యున్నాడో, ఆ విరాట్ పురుషుడు కూడ లోకముల సన్నివేశమును బట్టి అట్టి అవయవముల మేళవింపును కలిగియున్నాడు. (మనిషి ఇంచు మించు ఏడు అడుగులు ఉండగా, విరాట్ నందు ఏడు లోకములు గలవు).
పుట్టుక లేని శ్రీహరి సర్వవ్యాపకుడు. ఆయన కౌస్తుభమాణిక్యమనే తో తన ఆత్మజ్యోతినే ధరించినాడు. ఆయన వక్షఃస్థలము పై ధరించిన నే పుట్టు మచ్చ సాక్షాత్తు దాని ప్రకాశమే.
శ్రీహరి సత్త్వరజస్తమోగుణాత్మకమైన మాయాశక్తినే అనేకములైన లు గల వనమాలగా, వేదమునే పీతాంబరముగా, అ-ఉ-మ అనే గముల సంయోగమైన ఓంకారమునే ముప్పేటల యజ్ఞోపవీతముగా చును.
జ్ఞానయోగ కర్మయోగములే శ్రీహరి దేవుని మకరాకారపు డలములు. సకలప్రాణులకు అభయమునిచ్చే బ్రహ్మదేవుని లోకమునే ఎన కిరీటమునుగా ధరించుచున్నాడు.
మూలప్రకృతియే శ్రీహరి అధిష్ఠించిన అనంతమనే ఆసనము, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు విభూతులతో గూడిన సత్త్వగుణమే ఈ ఆసనమునందలి పద్మము (నాభికమలము).
శ్రీహరి మనోబలము, ఇంద్రియపాటవము, దేహశక్తులతో కూడిన ముఖ్యప్రాణతత్త్వమును గదగా, జలతత్త్వమును గొప్ప శంఖమునుగా, అగ్నితత్త్వమును సుదర్శన చక్రమును ధరించుచున్నాడు.
ఆకాశతత్త్వమును ఆకాశము వలె స్వచ్చమైన కత్తిగా, రాగుణప్రధానమగు అజ్ఞానమును డాలుగా, కాలతత్త్వమును కొమ్ముతోన ధనుస్సుగా, కర్మను అంబుల పొదిగా ధరించెను.
ఇంద్రియములే ఈ శ్రీహరియొక్క బాణములు. క్రియాశక్తితో కూడిన నస్సే రథము. శబ్దాది తన్మాత్రలు ఆ రథముయొక్క బాహ్యరూపము. ములనిచ్చుట, అభయమునిచ్చుట మొదలైన ప్రయోజనవంతమగు కరూపమే భగవానుని ముద్రయని మహాత్ములు చెప్పుచున్నారు. .
దేవుని పూజాస్థానమే సూర్యమండలమని, అంతఃకరణశుద్ధియే మంత్ర యని, తన పాపముల వినాశమే ఈశ్వరపూజయని భావించవలేను.
భగశబ్దమునకు సమగ్రమైన ఐశ్వర్యము, వీర్యము, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు అర్థము. అట్టి భగమే శ్రీహరి భగవానుడు లీల కొరకై పట్టుకున్న కమలము. ధర్మము, యశస్సు వింజామరలై ఆ భగవానుని సేవించినవి.
ఓ మహర్షులారా! దేనివలనైననూ భయము లేని వైకుంఠధామమే శ్వేతచ్చత్రము. ఋగ్యజుస్సామలు అనే మూడు రూపములు గల వేదమే గరుడుడు. ఆ వేదము యజ్ఞరూపుడైన పురుషోత్తముని వహించుచున్నది.
శ్రీహరికి సాక్షాత్తుగా తనదైన వియోగము లేని శక్తియే లక్ష్మీ భగవతి. రి అనుచరులకు నాయకుడైన విష్వక్సేనుడు తంత్రరూపుడు. ఎడు, సునందుడు మొదలైన ఎనమండుగురు ద్వారపాలకులు రియొక్క అణిమ, మహిమ మొదలైన అష్ట సిద్ధులే.
శౌనక మహరీ! పరమాత్మయే స్వయముగా వాసుదేవుడు, ర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే రూపములతో qభేదముచే ఉపాసించబడుచున్నాడని మహాత్ములు చెప్పుచున్నారు.
శ్రీహరి భగవానుడు జాగ్రదావస్థయందు బాహ్యవిషయములను సుకుంటూ విశ్వుడని, స్వప్నములో మనస్సు సృష్టించిన చమును ప్రకాశింపజేస్తూ తైజసుడని, నిద్రయందు అజ్ఞానసాక్షి యై ప్రాజ్ఞుడని, స్వరూపమునందు వీటికి అతీతమైన శుద్ధచైతన్యముగా తురీయుడు (నాల్గవది) అని తెలియబడుచున్నాడు.
అంగములు, ఉపాంగములు, ఆయుధములు, అలంకారములతో కూడిన శ్రీహరి భగవానుడే నాలుగు (వాసుదేవాది) మూర్తులు గలవాడై ఆ విశ్వుడు మొదలైన నాలుగింటిని నిలబెట్టుచున్నాడు. ఆ భగవానుడు సర్వమునకు అంతర్యామియై ఉన్నాడు.
శౌనక మహర్షీ! అట్టి ఈ స్వయంప్రకాశస్వరూపుడగు శ్రీహరి వేదము మూలకారణము. తన మహిమచే పరిపూర్ణుడైన ఆయన తన మాయా బ్రహ్మదేవుడు మొదలైన నామరూపములచే ఈ జగత్తును సృష్టించి, ఉపసంహరించుచున్నాడు. ఈ నామరూపములు ఆయన న్యస్వరూపమును కప్పివేయలేవు, సంకుచితము చేయలేవు. అయినా, క్మదులు వేర్వేరా యన్నట్లు వర్ణించబడును. ఆయనయే పరమలక్ష్యగా గలవారు ఆయనను తమయందు ఆత్మరూపముగా పొందెదరు.
ఓ శ్రీకృష్ణా! నీవు అర్జునునకు మిత్రుడవు. యదువంశ శ్రేష్ఠుడవు. లోకమునకు చేటును తలపెట్టే రాజుల వంశములను నశింపజేసే నీ "వము అనంతమైనది. ఓ గోవిందా! గోపికలు, భక్తులు గుంపులుగా నీ నమైన కీర్తిని గానము చేయుదురు. నిన్ను గురించి వింటే gణములు కలుగును. నీవు భక్తులను రక్షించుము.
ఎవడైతే ఉదయమే లేచి శుచియై భగవానునిపై చిత్తమును నిలిపి, విరాట్ పురుషుని ఈ అంగాది వర్ణనను పఠించునో, అట్టివాడు బుద్దిగుహ యందు ఆత్మరూపముగా ప్రకాశించే పరబ్రహ్మను సాక్షాత్కరించుకొనును.
శౌనక మహర్షి ఇట్లు పలికెను --- సూర్యునకు సంబంధించిన ఒక ఏడు అంశముల గణము ఉండును. భిన్నభిన్ననామములు గల ఆ గణము. ప్రతి నేల మారుతూ ఉండును. ఈ విషయమును పూజనీయుడగు శుక మహర్షి శ్రవణము చేయుచున్న పరీక్షిత్తునకు చెప్పెను (పంచమ స్కంధము).
అధీశ్వరులైన ఆదిత్యులతో కూడియున్న ఆ ఏడు అంశముల పేర్లను, లను, సూర్యరూపుడైన శ్రీహరియొక్క గణమును చెప్పడు. మేము తో వినుచున్నాము.
సూత మహర్షి ఇట్లు పలికెను --- సకలప్రాణులలో ఆత్మరూపుడైన రియొక్క అసాదియగు మాయాశక్తి ఈ సూర్యమండలమును చినది. ఈ మండలము లోకములయందు చుట్టూ తిరుగుతూ, యాత్రను నిర్వహించుచున్నది.
ప్రాణులలోని ప్రత్యగాత్మ (అంతరతమమగు స్వరూపము), స్రకర్తయగు శ్రీహరి మరియు సూర్యుడు నిశ్చయముగా ఒక్కటియే. మహర్షులు ఆయనను పలు ప్రకారములుగా వర్ణించిరి. ఆయనయే వైదికకర్మలకు మూలము.
ఓ శౌనక మహర్షీ! శ్రీహరి (ఒక్కడే అయిననూ) అనాదియగు మాయచే ఉదయము మొదలైన కాలము, దేశము, యజ్ఞము మొదలైన క్రియ, కర్త, స్రువము మొదలైన ఉపకరణము, యాగము మొదలైన కర్మ, వేద మంత్రము, ధాన్యము మొదలైన ద్రవ్యము, స్వర్గము మొదలైన ఫలము అని తొమ్మిది రూపములుగా చేయబడినాడని మహాత్ములు చెప్పెదరు.
కాలరూపమును దాల్చిన సూర్యభగవానుడు లోకయాత్రను నిర్వహించుటకై చైత్రము, వైశాఖము మొదలైన పన్నెండు మాసములలో వేరుగా పన్నెండు గణములతో గూడి సంచరించుచున్నాడు.
ఓ శౌనకమహర్షీ! ధాత అనే సూర్యుడు, కృతస్థలి అనే అప్సరస, హేతి రాక్షసుడు, వాసుకి అనే సర్పము, రథకృత్తు అనే యక్షుడు, పులస్త్యుడు అనే మహర్షి, తుంబురుడు అనే గంధర్వుడు అనే ఈ బరు చైత్రమాసమును సంపన్నము చేయుచున్నారు.
అర్యముడనే సూర్యుడు, పులహుడనే మహర్షి, అథెజసుడనే డు, ప్రతి అనే రాక్షసుడు, పుంజికస్థలి అనే అప్సరస, నారదుడనే ర్వుడు, కచ్ఛనీరుడనే సర్పము - వీరు వైశాఖమాసమును నడి పెదరు.
మిత్రుడనే సూర్యుడు, అత్రిమహర్షి, పౌరుషేయుడనే రాక్షసుడు, డనే సర్పము, మేనక అనే అప్సరస, హాహా అనే గంధర్వుడు, జనుడనే యక్షుడు అనే ఈ ఏడుగురు జ్యేష్ఠమాసమును నడి పెదరు.
వసిష్ఠ మహర్షి, వరుణుడనే సూర్యుడు, రంభ అనే అప్సరస, సహజన్యుడనే యక్షుడు, హుహూ అనే గంధర్వుడు, శుక్రుడనే సర్పము, చిత్రస్వనుడనే రాక్షసుడు ఆషాఢమాసమును నడిపించుచున్నారు.
ఇంద్రుడనే సూర్యుడు, విశ్వావసువు అనే గంధర్వుడు, శ్రోత అనే యక్షుడు, ఏలాపత్రుడనే సర్పము, అంగిరసుడనే మహర్షి, ప్రహ్లిచ అనే అప్సరస, వర్యుడనే రాక్షసుడు అనే వీరు శ్రావణమాసమును నడి పెదరు.
వివస్వంతుడనే సూర్యుడు, ఉగ్రసేనుడనే గంధర్వుడు, వ్యాఘ్రుడనే రాక్షసుడు, ఆసారణుడనే యక్షుడు, భృగువనే మహర్షి, అనుప్లెచ అనే అప్సరస, శంఖపాలుడనే సర్పము అనే వీరు భాద్రపదమాసమును నడిపించు చున్నారు.
పూష అనే సూర్యుడు, ధనంజయుడనే సర్పము, వాతుడనే రాక్ష , సుషేణుడనే గంధర్వుడు, సురుచి అనే యక్షుడు, ఘృతాచి అనే రస, గౌతముడనే మహర్షి అనే వీరు మాఘమాసమును నడి పెదరు.
క్రతువనే యక్షుడు, వర్చసుడనే రాక్షసుడు, భరద్వాజుడనే మహర్షి,యడనే సూర్యుడు, సేనజిత్తనే అప్సరస, విశ్వుడనే గంధర్వుడు, వతమనే సర్పము అనే వీరు ఫాల్గునమాసమును నడిపించుచున్నారు.
ఆంశుడనే సూర్యుడు, కశ్యపుడనే మహర్షి, తార్క్ష్యుడనే యక్షుడు, తసేనుడనే గంధర్వుడు, ఊర్వశి అనే అప్సరస, విద్యుచ్చత్రుడనే రాక్ష ), మహాశంఖుడనే సర్పము అనే వీరు మార్గశీర్షమాసమును పించుచున్నారు.
భగుడనే సూర్యుడు, స్పూర్జుడనే రాక్షసుడు, అరిష్టనేమి అనే గంధర్వుడు, ఊర్ణుడనే యక్షుడు, వరుసలో ఐదవ వాడైన ఆయువు అనే మహర్షి, కర్కోటకుడనే సర్పము, పూర్వచిత్తి అనే అప్సరస అనే వీరు పుష్యమాసమును నడిపించుచున్నారు.
త్వష్ట అనే సూర్యుడు, ఋచీకుని పుత్రుడగు జమదగ్ని మహర్షి, కంబలుడనే సర్పము, తిలోత్తమ అనే అప్సరస, బ్రహ్మా పేతుడనే రాక్షసుడు, శతజిత్తు అనే యక్షుడు, ధృతరాష్ట్రుడనే గంధర్వుడు ఆశ్వయుజ మాసమును నడిపించుచున్నారు.
విష్ణువనే సూర్యుడు, అశ్వతరుడనే సర్పము, రంభయనే అప్సరస, వర్చసుడనే గంధర్వుడు, సత్యజిత్తు అనే యక్షుడు, విశ్వామిత్రుడనే ర్షి, మఖా పేతుడనే రాక్షసుడు -- వీరు కార్తీకమాసమును నడి పెదరు.
ఇవి సూర్యరూపుడైన విష్ణుభగవానుని విభూతులు. వీటిని ప్రతిదినము ) సంధ్యలయందు స్మరించు మానవుల పాపములు తొలగిపోవును.
ఈ సూర్యదేవుడు పన్నెండు మాసములయందు కూడ గంధర్వాదులు గురితో కూడి అంతటా సంచరించును. ఆయన ఈ మానవునకు కర్మకు ప్రేరణనిచ్చుట ద్వారా) ఇహపరలోకముల విషయమై ఎద్ధిని విస్తరింపజేయుచున్నాడు.
మహర్షులు సూర్యుని వర్ణించే ఋగ్వేద-యజుర్వేద-సామవేద మంత్రములతో ఈ సూర్యదేవుని స్తుతించుచున్నారు. గంధర్వులీ దేవుని గొప్పగా కీర్తించుచుండగా, అప్సరసలు ఎదుట నాట్యము చేయుచున్నారు.
సర్పములు త్రాళ్లవలె రథములోని వివిధభాగములను కట్టి ఉంచగా, యక్షులు రథమును సర్ది ప్రయాణమునకు సిద్ధము చేయుదురు. బలశాలురగు రాక్షసులు రథమును వెనుకనుండి త్రోయుచుందురు..
లఖిల్యులనే అరవై వేల నిష్కల్మషులైన బ్రహ్మర్షులు రథమునకు ట సూర్యునకు అభిముఖముగా వెళ్తూ, గొప్పగా ప్రకాశించే ఆ దేవుని స్తోత్రములతో స్తుతించెదరు.
శ్రీహరి భగవానుడు ఆది-అంతములు లేని అంతర్యామి. ఆయనకు లేదు. ఆయన ఈ విధముగా తన రూపమును పన్నెండుగా కించి, లోకములను నిశ్చయముగా రక్షించుచున్నాడు.
శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో శ్రీహరియొక్క అంగోపాంగములను, ద్వాదశాదిత్యులను వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది.
