భాగవత మహా పురాణము
7 - ఇంద్రునిచే అవమానించబడి బృహస్పతి దేవతలను విడిచి పెట్టుట
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- ఓ పూజనీయా! దేవగురు వగు బృహస్పతి తన శిష్యులగు దేవతలను విడిచి పెట్టుటకు కారణమేమి? శిష్యులగు దేవతలు గురువు విషయములో చేసిన అపరాధమేమి? ఈ విషయమును చెప్పుడు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షి న్మహారాజా! ఇంద్రునకు ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వము కలిగి సన్మా ర్గమునుల్లంఘించేను. యజ్ఞకర్తయగు ఆ ఇంద్రునకు రెండు వైపులా అశ్వినీ కుమారులు నిలిచియుండిరి. మరుద్గణములు, వస్తువులు, రుద్రులు, ఆది త్యులు, ఋభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, వేదవేత్తలగు మహర్షులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరు లు, పక్షులు, నాగములు కూడ ఆయనను సేవించి స్తుతించుచుండిరి.
దేవసభలో ఉన్నతమగు ఆసనమునందు కూర్చుండియున్న ఇంద్రుని గంధర్వాదులు సుందరముగా కీర్తించుచుండిరి. చంద్రమండలము వలె అందమైన తెల్లని గొడుగు, వింజామరలు మొదలగు మహారాజ చిహ్న ములు గల ఇంద్రుడు అర్ధాసనమునందున్న శచీదేవితో గూడి మిక్కిలి ప్రకా శించుచుండెను.
బృహస్పతి దేవతలకు తనకు కూడ గొప్ప ఆచార్యుడు. ఆ మహర్షి సభకు వచ్చినప్పుడు ఇంద్రుడు ఎదురేగి ఆసనమునిచ్చి సత్కరిం చలేదు. పైగా, దేవతలచే మరియు రాక్షసులచే నమస్కరించబడే ఆయ నను చూచి కూడ ఇంద్రుడు తన ఆసనమునుండి కదలలేదు. అంగిరసుని పుత్రుడగు బృహస్పతి జ్ఞాని, సర్వసమర్థుడు. సంపద వలన గర్వము పుట్టి దానిచే వ్యక్తిలో వచ్చే వికారములు బృహస్పతికి తెలియును. కావుననే, అప్పుడు ఆయన వెంటనే అచటనుండి బయటకు వచ్చి, మౌనముగా తన ఇంటిని చేరుకొనెను.
అదే సమయములో ఇంద్రుడు తాను గురువును అవమానించినా నని తెలుసుకొనేను. సభలో ఆతడు స్వయముగా తనను తానే నిందించుకో నేను.
అయ్యో! చాల కష్టము వచ్చినది! అల్పబుద్ది గల నేను ఐశ్వర్య ముచే గర్వించి, సభలో గురువును తిరస్కరించి, నిశ్చయముగా తప్పు పనిని చేసితిని.
ఓ మహర్షీ! యోగ్యమగు ప్రయోజనము ఉన్నప్పుడు, చిన్నవాని పాదములకు నమస్కరించుటను పెద్దలు తప్పు పట్టరు. వేదజ్ఞానమును బట్టి పెద్దరికమును నిర్ణయించవలెనే గాని, కేవలము వయస్సును బట్టి నిర్ణయించుట సరిగాదు.
ఋషిరువాచ ।
శ్రీ శుకమహర్షి ఇట్లు పలికెను -- దేవగణములు ఇట్లు తమకు పురోహితుడవు కమ్మని కోరగా, గొప్ప తపశ్శాలియగు ఆ విశ్వరూపుడు ప్రసన్నుడై, మృదుమధురమగు వాక్కుతో వారితో నిట్లనెను.
విశ్వరూప ఉవాచ ।
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవతలు త్వష్టయొక్క పుత్రుడగు విశ్వరూపుని పురోహితునిగా వరించిన తరువాత, ఇంద్రుడు అడుగగా ఆయన నారాయణ కవచమును చెప్పెను. దానిని నీవు ఇప్పుడు ఏకాగ్రమగు మనస్సుతో వినుము.
విశ్వరూప ఉవాచ ।
అయిననూ, మీ కోరికను నేను తిరస్కరించుట లేదు. మీరు కోరినది అల్పమే. మీరు కోరినదానిని నేను పూర్తిగా నా ప్రాణములనొడ్డి, నా తపస్సు ఖర్చు చేసి అయినా, సాధించి పెట్టెదను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గొప్ప తపశ్శాలియగు విశ్వరూపుని వారీ విధముగా పురోహితునిగా వరించిరి. అపుడాయన ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి, గొప్ప ఏకాగ్రతతో పౌరోహిత్యమును నిర్వర్తించెను.
పండితుడైనవాడు ఎవడు స్వర్గాధిపతి ఐశ్వర్యమునకైననూ ఆశప డును? (పండితుడెవ్వడూ ఆశపడడు). ఏలయనగా, ఈ సంపద దేవప్రభు డనగు నాకీనాడు అసురలక్షణమగు అహంకారమును కలిగించినది.
చక్రవర్తి స్థానములోనున్న వ్యక్తి ఎవరు వచ్చినా లేచి నిలబడి ఎదు రేగనక్కర లేదని చెప్పే వారికి సర్వోత్తమమగు ధర్మము తెలియదు.
ఆ విధముగా చెడు మార్గము నుపదేశించే వ్యక్తులు నరకములో అధఃపతితులగుదురు. వారి మాటయందు శ్రద్దను చూపువారు రాళ్ల పడ వలు వలే మునిగి పోయెదరు.
దేవగురువగు బృహస్పతి అగాధమగు జ్ఞానము గల వేదవేత్త. కావున, నేను మోసబుద్ది లేకుండా ఆయన పాదములకు తలను ఆన్చి, ఆయనను ప్రసన్నునిగా చేసుకొనేదను.
ఇంద్రుడు ఈ విధముగా ఆలోచించుచుండగనే, పూజనీయుడగు బృహస్పతి తన గొప్ప యోగశక్తిచే ఇంటినుండి అంతర్ధానమాయెను.
పూజనీయుడు, స్వర్గలోకాధిపతి అగు ఇంద్రుడు అంతటా వెదికే ను. అయిననూ, బృహస్పతి జాడ తెలియలేదు. దేవతలతో గూడి స్వర్గ ముయొక్క క్షేమమును గురించి మంత్రాలోచన చేసిననూ ప్రయోజనము లేకపోవుటచే, ఇంద్రుని మనస్సునకు శాంతి కలుగలేదు.
మిక్కిలి మదించియున్న ఆ రాక్షసులందరు ఆ సంగతిని విని, శుక్రాచార్యుని అభిప్రాయమును స్వీకరించి, శస్త్రములను ధరించి, దేవతలపై యుద్ధమునకు ఉద్యుక్తులైరి.
రాక్షసులు ప్రయోగించిన బాణములచే దేవతల తలలు, తొడలు, చేతులు తెగి పడుచుండెను. దేవతలు ఇంద్రునితో గూడి సిగ్గుతో తలలను వంచుకొని, బ్రహ్మగారిని శరణు వేడిరి.
పూజనీయుడు, స్వయంభువుడు, పుట్టుక లేనివాడు అగు బ్రహ్మ దేవునకు, ఆ విధముగా పీడించబడియున్న దేవతలను చూచి, గొప్ప దయ కలిగెను. ఆయన వారిని ఓదారుస్తూ, ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ।
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- అయ్యో! కష్టము వచ్చినది! ఓ దేవనాయకులారా! మీరు పెద్ద అమంగళకరమగు పనిని చేసితిరి. బృహ స్పతి బ్రహ్మజ్ఞాని, జితేంద్రియుడగు బ్రాహ్మణుడు. మీరు ఐశ్వర్యగర్వము వలన ఆయనను సత్కరించలేదు.
ఓ దేవతలారా! మీరు చేసిన ఆ తప్పు పనికి ఇది ఫలితము. మీరు సమృద్ధిశాలురై యుండిరి. మీ శత్రువులు మీ చేతిలో ఓడి క్షీణించి యుండిరి. అయిననూ, వారు మిమ్ములను పరాభవించినారు.
ఓ ఇంద్రా! చూడుము. నీ శత్రువులగు రాక్షసులు ఒకప్పుడు గురు వగు శుక్రాచార్యుని తిరస్కరించి బాగా క్షీణించి పోయిరి. కాని, వారు మరల శుక్రుని భక్తితో ఆరాధించి ఇప్పుడు బలమును పొందినారు. వారికి శుక్రాచార్యుడే దైవము. వారు నా లోకమును కూడ ఆక్రమించెదరు.
రాక్షసులు భృగువంశీయులవద్ద అర్థశాస్త్రమును నేర్చుకొనినారు. వారి యుద్ధనీతిని పసిగట్టుట సంభవము కాదు. వారు స్వర్గమును సరకు చేసెదరా? చేయరు. వేదవేత్తలు, గోవిందుడు, గోవులను దైవముగా ఆరా ధించే చక్రవర్తులకు అమంగళములు దరి జేరవు.
కావున, మీరు త్వష్టయొక్క పుత్రుడగు విశ్వరూపుని వెంటనే సేవించుడు. ఆయన తపశ్శాలి, జితేంద్రియుడు అగు వేదవేత్త. మీరు ఆయనను సత్కరించుట మాత్రమే గాక, తరువాత ఆయనయొక్క రాక్షసప క్షపాతముతో కూడిన వ్యవహారమును కూడ సహించ గల్గినచో, ఆయన మీ మనోరథములను సంపాదించి పెట్టగలడు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మ గారు ఈ విధముగా చెప్పగనే వారి సంతాపము తొలగిపోయేను. వారు త్వష్ఠయొక్క పుత్రుడగు విశ్వరూప మహర్షి వద్దకు వెళ్లి, ఆయనను కౌగి లించుకొని, ఇట్లు పలికిరి.
దేవా ఊచుః ।
దేవతలిట్లు పలికిరి --- వత్సా! మేము నీ ఆశ్రమమునకు అతిథులమై వచ్చితిమి. నీకు మంగళమగు గాక! మేము నీకు తండ్రుల వంటి వార ము. మాకీ సమయములో ఒక కోరిక గలదు. దానిని నీవు నెరవేర్చుము.
మానవులు తమకు భార్య పిల్లలు ఉన్ననూ, తమ తల్లిదండ్రులను సేవించవలెను. ఇది గొప్ప ధర్మము. ఇక బ్రహ్మచారులు తల్లిదండ్రులను సేవించుట ధర్మమని వేరుగా చెప్పవలయునా?
మూర్తీభవించిన వేదమే గురువు. తండ్రి బ్రహ్మగారి మూర్తి. అన్న గారు ఇంద్రుని మూర్తి. తల్లి సాక్షాత్తుగా తనువు దాల్చిన భూదేవియే.
సోదరి దయామూర్తి. అతిథి (పరిచయము లేనివాడు) స్వయ ముగా మూర్తి గట్టిన ధర్మదేవతయే. అభ్యాగతుడు (పరిచయము గలవా డు) అగ్నిదేవుని మూర్తి. సకలప్రాణులు ఆత్మస్వరూపులే.
ఓ వత్సా! మేము శత్రువులచే పరాభవించబడి దుఃఖించుచున్నా ము. మా దుఃఖమును నీవు నీ తపస్సుచే తొలగించుము. మా ఆదేశమును పాలించుట నీకు సముచితముగా నుండును.
నీవు బ్రహ్మజ్ఞానివి, వేదవేత్తవు, గురుడవు. నీ తేజస్సుచే మేము శత్రువులను తేలికగా జయించగలము. కావున, మేము నిన్ను ఆచార్యునిగా వరించుచున్నాము.
విశ్వరూపుడిట్లు పలికెను --- ఓ తండ్రులారా! పౌరోహిత్యమును ధర్మాత్ములు విశేషముగా నిందించినారు. అది బ్రహ్మవర్చస్సును క్షీణింప జేయును. అయిననూ, లోకపాలకులగు మీరు నన్ను కోరుచున్నారు. మీ శిష్యుడగు నావంటి వాడు మీ కోరికను ఎట్లు తిరస్కరించ గలడు? మీ కోరికను నెరవేర్చుటయే నాకు పురుషార్థమగునని నేను చెప్పుచున్నాను.
ఓ గొప్ప ప్రభువులారా! దరిద్రులు కోత కోసిన మళ్లలోని వెన్ను లను తెంపుకొని గాని, బియ్యపు మరల వద్ద మరియు పొలములలో పడిన గింజలను ఏరుకొని గాని జీవనయాత్రను సాగించవచ్చును. నేను ఆ విధశుక్రాచార్యుడు తన నీతిబలముతో సురవిద్వేషులగు రాక్షసుల సంపదను దాచి పెట్టెను. సర్వసమర్థుడగు విశ్వరూపుడు నారాయణ కవచ మనే వైష్ణవోపాసనయొక్క బలముచే దానిని తీసుకువచ్చి, మహేంద్రునకు ఇచ్చెను.
ఉదారమగు శీలము గల ఆ విశ్వరూపుడు ఆ విద్యను మ హేంద్రు నకు బోధించేను. ఆ విద్యచే రక్షించబడి సామర్థ్యమును పొందిన వేయి కన్నుల వేల్పు రాక్షస సైన్యములను జయించెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో ఇంద్రునిచే అవమానించబడి బృహస్పతి దేవతలను విడిచిపెట్టుటను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
During a grand royal assembly in Svargaloka, King Indra, intoxicated by celestial opulence and sovereign authority, fails to stand up and offer proper honor to his spiritual preceptor Bṛhaspati as he enters the hall. Disgusted by Indra's false pride and spiritual blindness (*Guru-aparādha*), Bṛhaspati silently vanishes from the scene. Stripped of their spiritual potency due to disrespecting their guru, the devatās are swiftly defeated in battle by the empowered asuras, forcing Indra and the celestials to flee and seek shelter of Lord Brahmā.