శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

8 - అష్టమోధ్యాయః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను: ఓ శుకమహర్షీ! నారదుడు భక్తు లకు భగవద్దర్శనమును కలిగించే, భగవంతునితో సమానమగు జ్ఞానము గల దేవర్షి. ఆయనను బ్రహ్మగారు గుణాతీతుడగు పరమేశ్వరుని గుణగణ ములను వర్ణించుమని ప్రోత్సహించెను గదా! ఆయన ఎవరెవరికి భగవద్దు ణములను ఏ విధముగా వర్ణించి చెప్పెను? .

వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ శుకమహర్షీ! ఈ భగవత్స్వరూప మును నేను తెలియగోరుచున్నాను. అద్భుతమగు పరాక్రమము గల శ్రీహా రియొక్క గాథలు మానవులకు చక్కని మంగళములను కలిగించును.

ఓ మహాత్మా! నేను ప్రాపంచకములగు ఆసక్తులను పరిత్యజించి, సర్వజగద్రూపముగా ప్రకటమై సర్వమునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఆత్మరూపుడై యున్న శ్రీకృష్ణునిపై మనస్సును తన్మయము చేసి ప్రాణములను విడువ గోరుచున్నాను. దానికి ఉపాయమును నీవు నాకు బోధించుము.

ఎవడైతే ప్రతిదినము శ్రద్ధతో భగవానుని లీలలను వర్ణించునో, మరియు వినునో, వాని హృదయములో భగవానుడు తొందరలోనే ప్రకట మగును.

శ్రీకృష్ణుడు భక్తుల హృదయపద్మమునందు చెవి రంధ్రముల గుండా, అనగా శ్రవణము ద్వారా ప్రవేశించును. శరదృతువు రాగానే జలాశ యములలోని మురికి తొలగి పోయి జలములు స్వచ్చమగును, అదే విధ ముగా, శ్రీకృష్ణుడు ప్రవేశించగానే, హృదయములోని పాపములన్నియు తొలగిపోయి హృదయము తేటపడును.

దేశమంతా తిరిగి అలసి ఇంటికి చేరిన బాటసారి తన ఇంటిని విడిచి పెట్టడు. అదే విధముగా, శుద్ధము చేయబడిన అంతఃకరణము గల పురుషుడు రాగద్వేషములు మొదలగు చిత్త క్లేశములనుండి విడుదలను పొందినవాడై, శ్రీకృష్ణుని పాదపద్మముల సన్నిధిని విడువడు.

ఓ మహర్షీ! జీవునకు పంచభూతములతో పోస్తవమగు సంబం ధము లేదు. అయిననూ, అవి జీవుని కొరకై దేహమును నిర్మించుచున్నవి. దీనికి కారణమేదేని గలదా? లేక, ఇది నిమిత్తము లేకుండగనే ఘటిల్లుచున్నదా? ఈ విషయమును తమరు ఉన్నది ఉన్నట్లుగా తెలియగల్గుదురు.

పదునాలుగు లోకముల రచనయే స్వరూపముగా గల పద్మము శ్రీహరియొక్క నాభినుండి ఉదయించినదని తమరు చెప్పినారు. లౌకిక మానవుడు ఏ విధముగా కొన్ని పరిచ్చిన్నములగు అవయవములను కలిగి యున్నాడో, అదే విధముగా ఈశ్వరుడు కూడ పరిమితములైన అన్ని అవ యమములను మాత్రమే కలిగి వేరుగానున్నాడా? ఆ ఈశ్వరునకు ఒక విశి ష్టమగు అవయవ రచన మరియు కొన్ని అవయవములు గలవా యన్నట్లు తమరు చెప్పినారు.

బ్రహ్మ ఈశ్వరుని అనుగ్రహముచే ప్రాణులను సృష్టించి, సకలప్రా ణిసమష్టిస్వరూపుడై వాటిని నియంత్రించుచున్నాడు. ఆయన ఈశ్వరుని నాభియందు ఆవిర్భవించినవాడే అయిననూ, ఈశ్వరుని అనుగ్రహముచే మాత్రమే ఆయన రూపమును దర్శించినాడు.

జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు అధిష్టానమైనవాడు, మాయను వశము చేసుకున్నవాడు, సర్వప్రాణులలో అంతర్యామి రూప ముగా నున్నవాడు అగు ఆ పరమపురుషుడు తన మాయోపాధిని విడిచి పెట్టి, దేనియందు శయనించుచున్నాడు? అనగా, ఏ స్వరూపముతో నున్నాడు?

            పరమపురుషుడగు శ్రీహరియొక్క అవయవములచే లోకములు మరియు లోకపాలకులు కల్పించబడినారని మీరు ముందులో చేప్పియుంటిరి. కాని, లోకపాలకులతో గూడిన లోకములే ఆ విరాట్ పురుషుని అవయ వములని కూడ వినియున్నాము. ఈ విషయమును వివరించుడు.

మహాకల్పము, అవాంతరకల్పముల పరిమాణము ఎంత? భూత విష్యద్వర్తమానకాలములను అంచనా వేసే పద్దతి యేమి? కార్యరూప ములగు ఈ దేవాది దేహముల ఆయుఃప్రమాణము ఎంత?

ఓ మహర్షీ! కాలముయొక్క ప్రవృత్తి క్షణము ఇత్యాదులలో అతి స్వల్పముగను, సంవత్సరము ఇత్యాదులలో అతిదీర్ఘముగను కూడ కానవ చ్చుచున్నది. కర్మఫలరూపముగా జీవులు పొందే స్థానములు ఎన్ని? వాటి స్వరూపమెట్టిది?

సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతికి వశులై ఉండే జీవులు ఆ గుణముల సమ్మేళనములో వచ్చే మార్పుల కారణముగా దేవతలు మాన వులు మొదలగు యోనులలో జన్మించుచుందురు. అట్టి జీవులలో ఉత్కృ ష్టమగు దేవాది దేహములను కోరుటకు అధికారి యెవరు? అట్టి అధికారి అనుష్ఠించదగిన కర్మసముదాయము ఎట్టిది? ఆ కర్మసముదాయమును ఏ విధముగా అనుష్ఠించ వలెను? ఏయే జీవులు ఏయే పుణ్యపాపకర్మలను ఏ విధముగా అనుష్ఠించి ఏయే గతులను పొందెదరు?)

భూమి, పాతాళము, దిక్కులు, ఆకాశము, గ్రహములు, నక్షత్రము లు, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, వాటియందు నివసించే ప్రాణిజాతము --- వీటియొక్క ఉత్పత్తిని గురించి చెప్పడు.

విరాడ్ దేహమగు బ్రహ్మాండమునకు లోపల, బయట పరిమా ణము, మహాత్ముల చరిత్ర, వర్ణాశ్రమములను నిర్ధారించుట అను విషయములను వివరించుడు,

గొప్ప ఆశ్చర్యమును కలిగించే శ్రీహరియొక్క అవతారముల చరి త్ర, యుగములు, యుగములలోని సంవత్సరముల లెక్క, మరియు ప్రతి యుగమునందలి ధర్మములు అను విషయములను చెప్పడు.

మానవుల సాధారణ ధర్మము ఏది? మానవులకు విశిష్టపరిస్థితు లలో అన్వయించే ధర్మములు ఏవి? ఆయా వృత్తులతో జీవించువారి ధర్మ ములు, పుణ్యాత్ములగు మహారాజుల ధర్మములు, కష్టకాలములో మాన వులు ఆచరించదగిన ధర్మములు ఎట్టివి?

ప్రకృతితో మొదలయ్యే తత్త్వముల లెక్క, వాటి స్వరూపము, అవి వాటి కార్యములకు కారణములు అయ్యే లక్షణము, పరమపురుషుడగు శ్రీహరిని పూజించే విధానము, అష్టాంగయోగముయొక్క విధానము మరియు ఆత్మజ్ఞానము అను వాటిని గురించి చెప్పడు.

మహాయోగులు పొందే అణిమాదీ సిద్దులు, వారు పొందే పుణ్యగతులు, వారీ సూక్ష్మశరీరము వీలయమగుట, వేదములు ఉపవేదములు ధర్మశాస్త్రములు ఇతిహాసములు మరియు పురాణములు అను వాటి స్వరూపము అనే ఈ విషయములను బోధించుడు.

సకలప్రాణుల ఉత్పత్తిస్థితిలయములను గురించి చెప్పడు. అగ్ని హోత్రము మొదలగు వైదికకర్మలు, నూతులను చెరువులను త్రవ్వించుట దేవాలయములను కట్టించుట మొదలగు పూర్తకర్మలు, వివిధకామనల పరి పూర్తికొరకై చేసే కామ్యకర్మలు అనే వివిధకర్మల విధానమును వివరించు డు. మరియు, ధర్మము, అర్థము, కామము అనే మూడు పురుషార్థముల స్వరూపమును వివరించుడు.

ప్రళయములో ప్రకృతియందు లీనమైయున్న జీవులు ఏ విధ ముగా సృష్టించబడెదరు? వేదవిరుద్ధమగు మార్గము ఏ విధముగా పుట్టి సది? జీవుని బంధమోక్షముల స్వరూపమెట్టిది? జీపు సక్తిని పొందిన వాడే కేవలమగు ఆత్మస్వరూపమునందు నిష్ణను కలిగియుండు విధమే

స్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు అగు భగవానుడు తన మాయాశ క్తిచే ఏ విధముగా విశేషమగు లీలలను ప్రకటించుచున్నాడు? ప్రళయము నందు ఆయన మాయోపాధిని విడిచి పెట్టి, సాక్షిస్వరూపముతో ఉదాసీనుడై ఉండే విధమెట్టిది?

ఓ పూజ్యా! శుకమహర్షీ! నేను నిన్ను శరణు వేడి ప్రశ్నించుచున్నా ను. నా ఈ ప్రశ్నలకు సమాధానమును మీరు ఒక క్రమములో యథాతథముగా చెప్ప దగును.

స్వయంభువుడు మరియు దేవోత్తముడు అగు బ్రహ్మగారితో సమానుడవైన నీవు ఈ విషయములన్నింటినీ చక్కగా యెరుగుదువు. ఈ సభలోని ఇతరులగు పెద్దలు కేవలము తమ పూర్వజులు చేసిన సాధన లను గురించి విని, వాటిని అనుష్ఠించు వారు మాత్రమే.

ఓ మహర్షీ! కోపించిన బ్రాహ్మణబాలకుని శాపము కారణముగా నా ప్రాణములకు పొంచియున్న మృత్యువును మినహాయిస్తే, ఈ ఉపవా సము వలన అవి వ్యాకులమగుట లేదు. కావున, మీరా విషయములో చింతిల్లవద్దు. ఏలయనగా, నేను వినాశరహితుడగు శ్రీహరియొక్క కథా మృతమును గ్రోలుచున్నాను గదా!

సూతమహర్షి ఇట్లు పలికెను: ఈ విధముగా పరీక్షిన్మహారాజు సభా ముఖముగా  శుకదేవుని సత్పురుషులను రక్షించువాడు, సద్రూపుడు మరియు సర్వజగన్నాథుడు అగు శ్రీహరియొక్క గాథలను చెప్పమని కోరగా, ఆయన చాల సంతోషించి భాగవతపురాణమును చెప్పెను. వేద ముతో సమానమగు ఈ పురాణమును సృష్టియొక్క ఆరంభములోని మొట్ట మొదటి కల్పమునందు శ్రీహరి బ్రహ్మగారికి బోధించి యుండెను.

పాండువంశీయులలో శ్రేష్టుడగు పరీక్షిన్మహారాజు ఏయే విషయ ములను ప్రశ్నించినాడో, శుకమహర్షి వాటిని ప్రస్తావక్రమముననుసరించి బోధించుటకు ఆరంభించేను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.