శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

6 - షష్ఠోధ్యాయః

బ్రహ్మ ఇట్లు పలికెను: వాగింద్రియము, దాని అధిష్టాన దేవత యగు అగ్ని విరాట్ పురుషుని నోటినుండి ప్రకటమయ్యెను. గాయత్రి అను ష్టుప్ ఉషైక్ త్రిష్టుప్ జగతీ పంక్తి మరియు బృహతి అనే ఛందస్సులు త్వక్ చర్మము మాంసము రుధిరము మేదస్సు (క్రొవ్వు) మరియు మజ్జ అనే ఏడు ధాతువులనుండి పుట్టెను. దేవతలు భుజించే హవ్యము, పితరులు భుజించే కవ్యము మరియు మనుష్యుల భోజనము అనే మూడు విధముల అమృతమయమగు ఆహారము, మరియు తీపి కారము చేదు వగరు పులుపు మరియు ఉప్పదనము అనే ఆరు రుచులు ఆయన నాలుకనుం డియు పుట్టినవి.

విరాట్ పురుషుని ముక్కు రంధ్రములనుండి ప్రాణ-అపాన-వ్యాన -ఉదాన-సమానములనే ప్రాణవృత్తులు మరియు వాయువు జన్మించగా, ఆయన ఘాణేంద్రియమునుండి అశ్వినీ దేవతలు, ఓషధులు, సామాన్య ముగా ఉల్లాసమును కలిగించే పరిమళము మరియు విశేషమగు సుఖము నిచ్చే సుగంధము ఉత్పన్నమైనవి.

రూపములు, తేజస్సు విరాట్పురుషుని చక్షురింద్రియమునుండి, ద్యులోకము మరియు సూర్యుడు కన్నులనుండి, దిక్కులు మరియు తీర్థ ములు చెవులనుండి, ఆకాశము మరియు శబ్దము శ్రోత్రేంద్రియమునుండి పుట్టినవి.

ఆ విరాట్ పురుషుని దేహము సకలపదార్థముల సారాంశములకు మరియు సౌందర్యమునకు నిధానము. ఆయన త్వగింద్రియమునుండి స్పర్శ, వాయువు మరియు సకలయజ్ఞములు పుట్టినవి.

విరాట్ పురుషుని రోమములనుండి వృక్షములు ఉదయించినవి. అవి యజ్ఞమును చక్కగా నిర్వర్తించుటకు సహకరించును. ఆయన శిరోజ ములనుండి మేఘములు, మీసములు గెడ్డమునుండి మెరుపులు, చేతుల గోళ్లనుండి రాళ్లు, పాదముల గోళ్లనుండి లోహములు ఉదయించినవి.

ప్రధానముగా ప్రజాపాలనము అనే పనిని చేసే లోకపాలకులు ఆయన బాహువులనుండి పుట్టినారు. భూర్బువస్సువర్లోకములు ఆయన పాదన్యాసమునుండి పుట్టినవి. ఆయన పాదన్యాసము భక్తులకు ఉన్న సంప త్తిని రక్షించి, భయమునుండి కాపాడును.

ఓ నారదా! విరాట్ పురుషరూపములోనున్న శ్రీహరియొక్క పాద -ములు కోరికలనన్నింటినీ ఈడేర్చును. ఆ విరాట్ పురుషుని శిశ్నము జలములకు, ప్రజననశక్తికి, సృష్టికి, మేఘమునకు, ప్రజాపతికి ఆస్పదము. ఆయన ఉప ఛేంద్రీయము సంభోగము వలన జనించే ఆనందమునకు, తాపశాంతికి ఆస్పదము. విసర్జనేంద్రియము యమమిత్రులకు మరియు విసర్జనమునకు ఆస్పదము.

హింస, నిరృతి దేవత, మృత్యువు, నరకము విసర్జనేంద్రియము నుండియు, పరాజయము, అధర్మము మరియు అజ్ఞానము వెనుక భాగ మునుండియు, నదీ (తూర్పు వైపునకు ప్రవహించునవి) నదములు (పశ్చి మము వైపునకు ప్రవహించునవి) విరాట్ పురుషుని నాడులనుండియు, పర్వతములు అస్థిపంజరమునుండియు పుట్టినవని మహర్షులు చెప్పెదరు.

మూలప్రకృతి, రసధాతువు (అన్నసారము), సముద్రములకు విరాట్ పురుషుని ఉదరము, సకలప్రాణుల సూక్ష్మశరీరములకు ఆయన హృదయము ఉత్పత్తిస్థానములని మహర్షులు చెప్పుచున్నారు.

ధర్మము, నేను, నీవు, సనక సనందనాదులు, శంకరుడు, విజ్ఞానము మరియు ప్రాణుల అంతఃకరణము ఆ హిరణ్యగర్భుని చిత్తమునానాస్ర యించి  ఉండును. 

నేను, నీవు, శంకరుడు, నీ అన్నలగు సనక సనందనాది మహర్డు లు, దేవతలు, అసురులు, మనుష్యులు. సోగులు, పక్షులు, మృగములు, సరీసృపములు (తేళ్లు, మొసళ్లు మొదభాగు జంతువులు), గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతప్రేతములు, సర్పములు, పశువు లు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, చెట్లు, నీటిలో నేలపై మరియు ఆకాశములో నివసించే ఇతరములగు అనేకరకముల ప్రాణులు, గ్రహములు, నక్షత్రములు, తోకచుక్కలు, నక్షత్రమండలములు (రాశులు), మెరుపులు, గర్జించే మేఘములు ఇత్యాది ఈ సర్వము ఆ విరాట్ పురుషుడు మాత్రమే. ఈ జగత్తులో తభవిష్యద్వర్తమానకాల ములలో ఉన్న సర్వము ఆ పరమేశ్వరునిచే వ్యాప్తమై యున్నది. అట్టి ఈ జగత్తు ఆయనయందు పది అంగుళముల మేరను మాత్రమే ఆశ్రయించు కొని యున్నది.

సూర్యుడు తన మండలముతో బాటు బాహ్యమును కూడ ప్రకా శింప జేయు విధముగానే, పరమపురుషుడు, స్వయంప్రకాశస్వరూపుడు అగు శ్రీహరి విరాడ్ధేహమును లోపల బయట కూడ ప్రకాశింప జేయుచు న్నాడు.

ఓ మహర్షీ! ఆ శ్రీహరి అవినాశీ, అభయస్థానము అగు మోక్ష సు ఇచ్చే ప్రభుడు. మోక్షము స్వరూపముగా గల ఆయన వినాశశీల: ఏ కర్మఫలమునకు అతీతమైనవాడు (లేదా, మోక్షము కర్మఫలమునకు (తమైనది). కావున, ఆ పరమేశ్వరుని మహిమ అపారము.

సమస్తలోకములు పరమేశ్వరుని ఒక పాదము మాత్రమే. సకలప్రా ణులు పరమేశ్వరుని అంగములగు లోకములలో నివసించు చున్నవి. భూర్బువస్సువర్లోకములకు పైన మహర్లోకము గలదు. దానిపై గల జనతత్యలోకములలో క్రమముగా వినాశము లేనిది, రోగాది పీడలు లేనిది సు భయము లేనిది అగు సుఖము నిక్షేపించబడి యున్నది.

నైష్ఠికబ్రహ్మచారులు, వానప్రస్థులు మరియు యతులకు పునర్జన్మ లేదు. వారు ముల్లోకములకు పైన ఉండే జనతపస్సత్యలోకములు పొందెదరు. గృహస్థాశ్రమములో మిగిలిన మూడు ఆశ్రమములకంటే ప్రత యమములు తక్కువగా నుండుటచే, వారు ముల్లోకములలో అంతర్గతమై ఉండే గతిని పొందెదరు.

అవిద్య (కర్మ), విద్య (ఉపాసన) అనే రెండు ఉపాయములను శాస్త్రము బోధించుచున్నది. మానవుడు కర్మ మరియు ఉపాసన అనే రెండు విధముల సాధనలయందు నిష్ఠను కలిగియుండును. కావున, లోకాంతరములను పొందే జీవుడు కర్మఫలభోగమును ఇచ్చే దక్షిణమార్గ మును గాని, క్రమముక్తికి హేతువు అగు ఉత్తరమార్గమును గాని పొందును

ఈ రెండు మార్గములు కర్మఫలదాతయగు ఆ ఈశ్వరుని అధీనములో నుండును.

ఈ బ్రహ్మాండము మరియు దానియందు అభిమానము గల విరాట్ పురుషుడు ఆ పరమేశ్వరునినుండియే ప్రకటమైనారు. సూర్యుడు తన మండలముతో బాటు బాహ్యమును కూడ ప్రకాశింప జేసే విధముగా, ఆ పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండమును దాని అభిమానియగు విరాట్ పురు షుని అతిక్రమించిన వ్యాప్తిని కలిగియున్నాడు.

నేను నిరతిశయమగు మహత్త్వము గల విరాట్పురుషాంతర్యామి యగు శ్రీహరియొక్క నాభికమలమునుండి ప్రకటమైనప్పుడు, ఆ పురుషుని అవయవములను మినహాయించి, యజ్ఞమునకు కావలసిన సంభార ములేమియు నాకు కానరాలేదు.

ఓ మహాత్మా! నారదా! పశువులు, యాపస్తంభములు, సమిధలు, దర్భలు, ఈ యజ్ఞభూమి (ఆర్యావర్తము), వసంతము మొదలగు గొప్ప ఋతుధర్మములతో కూడియున్న యజ్ఞకాలము, యజ్ఞపాత్రలు మొదలగు వస్తువులు, గోధుమలు మొదలగు ధాన్యములు, నెయ్యి మొదలగు నూనే పదార్థములు, తీపి మొదలగు రసములతో కూడియున్న ఆహారపదార్థము లు, బంగారము మొదలగు లోహములు, కపాలములు (చిల్ల పెంకులు) మొదలగు వాటికి ఉపకరించే మట్టి, నీరు, ఋగ్రూపములోనున్న మంత్ర ములు, గద్యరూపములోనున్న మంత్రములు, గానము చేయబడే మంత్రములు, హోత్రము ఔద్దాత్రము ఆధ్వర్యవము మరియు బ్రాహ్మము అనే నాలుగు రకముల ఋత్విక్కర్మలు, అగ్నిష్టోమము మొదలగు కర్మనా మధేయములు, స్వాహాకారము మొదలగు ఆహుతిమంత్రములు, గోవులు మొదలగు దక్షిణలు, పయోవ్రతము మొదలగు వ్రతములు, ఒక వరుసలో చెప్పబడే దేవతల పేర్లు, యజ్ఞమును చేసే పద్ధతిని బోధించే కల్పసూత్ర ములు, యజ్ఞమును మొదలు పెట్టుచున్నాను అనే సంకల్పము, యజ్ఞకర్మ యొక్క విస్తారము (కర్మను చేసే ప్రకారము), యజ్ఞములో అగ్నుల మధ్య నడిచే నడకలు (విష్ణుక్రమములు), ఉద్దీథోపాసనము మొదలగు ధ్యానము లు, ప్రాయశ్చిత్తములు, కర్మను పరమేశ్వరునకు సమర్పించుట అనే ఈ యజ్ఞసంభారములను నేను ఆ విరాట్ పురుషుని అవయవములతో మాత్రమే సమకూర్చు కొంటిని.

ఈ విధముగా విరాట్ పురుషుని అవయవములతో సమకూర్చుకో నబడిన యజ్ఞసంభారములు గల నేను యజ్ఞపురుషరూపములోనున్న ఆ పరమేశ్వరుని ఆ యజ్ఞముతోనే ఆరాధించితిని.

తరువాత నీ సోదరులగు మరీచి మొదలైన తొమ్మండుగురు ప్రజా పతులు దేవతల రూపములో వ్యక్తమైన ఆ శ్రీహరిని యజ్ఞములచే ఆరా .. ధించిరి. ఆయన వ్యక్తమై యున్ననూ స్వరూపమునందు వికారములు లేని శుద్ధచేతనుడు.

తరువాత ఆయా కాలములలో మనువులు, మహర్షులు, పితృదేవ తలు, దేవతలు, రాక్షసులు, మానవులు జగన్నాథుడగు ఆ శ్రీహరిని క్రతు వులతో ఆరాధించిరి.

నారాయణ భగవానుడు స్వరూపముచే నిర్గుణుడే అయిననూ, సృష్టి మొదలగు కార్యములయందు మాయోపాధిని స్వీకరించి, మాయ యొక్క అనేకములగు గుణములను స్వీకరించును. ఆయనచే సృష్టించబ డిన ఈ జగత్తు ఆయనయందు మాత్రమే అధిష్ఠితమై (ఆయనయొక్క ఉని కియే ఉనికిగా గలదై) ఉన్నది.

ఆ భగవానునిచే నియోగించబడిన నేను ఈ జగత్తును సృష్టించ గా, ఆయనకు వశుడై యుండే రుద్రుడు దానిని ఉపసంహరించును. త్రిగు జాత్మికయగు మాయయే ఉపాధిగా గల ఆ పరమేశ్వరుడు విష్ణురూప ములో ఈ జగత్తును పాలించి పోషించును.

ఓ కుమారా! నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ తగిన సమాధానమును నేను నీకు చెప్పితిని. ఈ విశ్వములో కార్యకారణాత్మకమగు సృష్టించబడే పదార్థము ఏదైనా భగవానుని కంటే భిన్నముగా లేదు.

ఓ నారదా! నా వాక్కు ఎన్నటికీ అసత్యము కాదు. నా సంక ల్పము ఏ విషయములో నైననూ అసత్యము కానే కాదు. నా ఇంద్రియ ములు ఏ నాడైననూ తప్పు త్రోవలో ప్రసరించవు. దీనికి కారణమేమనగా, నేను భక్తియొక్క ఉద్రేకముతో కూడిన హృదయముతో శ్రీహరిని ధ్యానించే దను.

వేదస్వరూపుడను, నిరంతరతపోనిష్ఠుడను అగు నేను ప్రజాపతు లకు కూడ ప్రభువును. నన్ను సర్వులు నమస్కరించెదరు. అట్టి నేను ఏకా గ్రమగు చిత్తముతో సర్వాంగములతో కూడిన యోగముననుష్ఠించి కూడా, ఎవనినుండి నేను ఉద్భవించితినో, అట్టి పరమేశ్వరుని తెలియ లేక పోతిని.

            శ్రీహరియొక్క పాదములు శరణు జొచ్చినవారి సంసారమును తొలగించి కల్యాణములను ఇచ్చి పుణ్యమును కలిగించును. అట్టి పాదము లకు నేను నమస్కరించుచున్నాను. ఆకాశమునకు తన అంతము తెలియ దు. అదే విధముగా, ఆ శ్రీహరికి కూడ తెలియనంతటి విస్తారము ఆయన మాయకు గలదు. ఇట్టి స్థితిలో ఇతరులు ఆ మాయయొక్క అంతమును తెలియలేరని వేరుగా చెప్పవలయునా?

            ఆ పరమేశ్వరుని యథార్థస్వరూపమును నేను గాని, మీరు (నార దుడు, సనకాదులు) గాని, రుద్రుడు గాని తెలియ లేకున్నారు. ఇక ఇతరదే వతలు తెలియజాలరని వేరుగా చెప్పవలయునా? ఆ పరమేశ్వరుని మాయచే మోహింపజేయబడిన అంతఃకరణములు గల మనము ఆయనచే నిర్మించబడిన ఈ జగత్తును మన అంతఃకరణమునకు తగ్గట్లుగానే (భేదబుద్ధితో ఈశ్వరభిన్నముగా) దర్శించుచున్నాము.

మనవంటి వారలము ఆ శ్రీహరి తన అవతారములలో ప్రకటించిన లీలలను గానము చేయుచున్నాము. కాని, ఆయనయొక్క యథార్థస్వరూ పము మనకు అంతుబట్టుట లేదు. అట్టి భగవానునకు నమస్కారము.

పుట్టుక లేనివాడు, సర్వకారణకారణుడు, ఆత్మరూపుడు అగు అట్టి ఈ భగవానుడు ప్రతికల్పమునందు విరాట్ పురుషరూపమును దాల్చి, తన స్వరూపమునందు వికారములు లేకుండగనే, తనను తాను జగద్రూప ముగా ప్రకటించుకొని, తన రూపమగు జగత్తును పాలించి, పోషించి కల్పాంతమునందు ఉపసంహరించు చున్నాడు.

ఆ పరబ్రహ్మ స్వరూపము కర్తృత్వభోక్తృత్వలేశముయొక్క సంప ర్కము కూడ లేని చిదనము. దానియందు జగత్తుయొక్క స్థితి భాసించు టయే గాని, వాస్తవము కాదు. ఆ పరబ్రహ్మ సకలజీవులలో ప్రత్యగాత్మరూ పముగా చిదేకరసస్వరూపమై సదనమై భాసించుచున్నది. సర్వమును తన సత్తాస్పూర్తులచే పూరింపజేసే ఆ పరబ్రహ్మయందు దేశకాలవస్తుపరిచ్చేద ములు లేవు. గుణాతీతమగు ఆ పరబ్రహ్మయందు గుణములు భాసించు టయే గాని, యథార్థముగా స్వరూపములో భాగములు కావు. ఆ పరబ్రహ్మ కంటే భిన్నముగా రెండవ వస్తువు ఏదీ లేదు.

ఓ నారద మహర్షీ! ప్రసన్నమగు దేహేంద్రియములు మరియు మనస్సు గల మునులు ఆ పరమాత్మతత్త్వమును తెలియుచున్నారు. కాని, అది ఎప్పుడు శ్రుతివిరుద్ధములగు తర్కములచే వ్యాప్తమగునో, అప్పుడు కనబడకుండా పోవును.

హిరణ్యగర్భుడు పరబ్రహ్మయొక్క మొట్టమొదటి అవతారము. కాలము, మాయ, కార్యము, కారణము, మహత్తత్త్వము, అహంకారము, పంచభూతములు, సత్త్వరజస్తమోగుణములు, ఇంద్రియములు, బ్రహ్మాండ దేహము, దాని అభిమాని, కదలని ప్రాణులు మరియు కదిలే ప్రాణులు కూడ పరబ్రహ్మయొక్క రూపములే.

బ్రహ్మవిష్ణురుద్రులనే త్రిమూర్తులు, దక్షుడు మొదలగు ప్రజాపతు లు, నారద సనకాది దేవర్షులు, ఇంద్రుడు మొదలగు స్వర్గలోక రక్షకులు, గరుడుడు మొదలగు పక్షిలోకాధిపతులు, భూలోకములోని రాజులు, పాతాల లోకాధీశ్వరులు కూడ పరబ్రహ్మయొక్క రూపములే.

గంధర్వనాయకులు, విద్యాధరాధీశులు, చారణప్రభువులు, యక్ష నాథులు, రాక్షసశ్రేష్ఠులు, సర్వాధీశ్వరులు, నాగప్రభువులు, మహర్షులు, పితృదేవతల అధిపతులు, దైత్యవీరులు, సిద్దాగ్రగణ్యులు, దానవేంద్రులు, ప్రేతములకు పిశాచములకు భూతములకు కూష్మాండములకు జలజంతు వులకు మృగములకు పక్షులకు అధిపతులు అనే వీరందరు పరబ్రహ్మ యొక్క రూపములే.

            ఈ లోకములో ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపద జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములతో కూడినది, తేజస్సు గలది, ఇంద్రియశక్తి గలది, మనోబలము గలది, శరీరబలము గలది, సహనశక్తి గల ది, శోభాయుక్తము, వినయము గలది, సంపన్నము, బుద్ధిశక్తి గలది, ఆశ్చ ర్యమును కలిగించే రంగు గలది (మెరుపు మొదలైనవి) అగు వస్తువు కంటికి కానవచ్చే రూపము గలది గాని, అట్టి రూపము లేనిది గాని ఏదైనా ఆ పరబ్రహ్మయొక్క రూపమేనని తెలియవలెను.

నారదమహర్షీ! ఆ పరమేశ్వరుడు అనేకములగు అవతారముల నెత్తి తన లీలలను ప్రకటించి యున్నాడు. విద్వాంసులు వాటిలో ప్రముఖ ములగు అవతారములను గురించి, వినువారల చేవుల తుప్పు పదిలీ షోయే విధముగా వర్ణించి చెప్పుచున్నారు. అట్టి ఈ సుందరములగు అవ తారములను నేను నీకు వరుసగా చెప్పెదను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో ఆరవ అధ్యాయము ముగిసినది(6).