శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము
5 - పంచమోధ్యాయః
నారద మహర్షి ఇట్లు పలికెను: ఓ తండ్రీ! నిన్ను సకల దేవతలు పూజించెదరు. సకలప్రాణులను సృష్టించిన నీవు పరమేశ్వరునినుండి మొట్ట మొదటగా జన్మించితివి. నీకు నమస్కారమగుగాక! ఆత్మస్వరూపసాక్షా త్కారమును కలిగించే జ్ఞానము నీ వద్ద గలదు. దానిని నాకు చెప్పుము.
ఓ తండ్రీ! ఈ జగత్తుయొక్క లక్షణమేమి? ఇది ఎవనిచే ప్రకాశింప చేయబడు చున్నది? దీని ఉనికి ఏ అధిష్ఠానముపై ఆధారపడి యున్నది? ఇది దేనినుండి ఎవని వలన సృష్టించ బడినది? ఇది దేనియందు విలీనమ గును? ఇది దేని (ఎవని) అధీనములో నున్నది? దీని స్వరూపమెట్టిది? ఈ జగత్తుయొక్క తత్త్వమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము.
భూతభవిష్యద్వర్తమానకాలములలోని సకలపదార్థజాతమునకు ప్రభుడవగు నీకు ఈ సర్వము విదితమే. జగత్తు అంతయు నీకు చేతియం దలి ఉసిరికి వలె సుస్పష్టముగా తెలిసినదే.
నీవు అసహాయుడవై నీ మాయతో పంచభూతములనుండి సకల ప్రాణులను సృష్టించుచున్నావు. నీకీ విజ్ఞానము ఎక్కడనుండి లభించినది? నీకు ఆశ్రయమెవరు? నీవు ఎవని అధీనములో నున్నాడవు? నీ స్వరూపమే ట్టిది?
సాలె పురుగు తన శరీరమునుండి స్రవించే ద్రవముతో గూడును అల్లిన విధముగా, నీవు ఇతరమగు ఉపాదానముయొక్క అపేక్ష లేకుండగా, స్వీయమగు శక్తిని మాత్రమే ఆశ్రయముగా చేసుకొని, స్వయముగా వికార ములను పొందకుండగా, అనాయాసముగా నీయందు నిలిచియున్న ఆ ప్రాణులను సృష్టించి పాలించు చున్నావు.
ఓ ప్రభూ! ఈ జగత్తులో ఇంద్రుడు మొదలగు నామములచే గాని, నాలుగు పాదములు గలది, మొదలగు రూపములచే గాని, తెల్లనిది మొద లగు గుణములచే గాని తెలియబడే చరాచరప్రాణిజాతములో స్థూలము గాని, సూక్ష్మము గాని, ఉత్తమమైనది గాని, మధ్యమమైనది గాని, అధమము గాని ఏదైనా, నీకంటే భిన్నమైన ప్రకృతినుండి ఉదయించుటను నేను యెరుంగను.
అట్టి నీవు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో తీవ్రమగు తపస్సు చేయుట మాకు మోహమును కలిగించుచున్నది. మరియు, దానిని బట్టి నీకంటే ఉత్తముడగు ఈశ్వరుడు గలడనే ఆశంక మాకు కలుగుచున్నది.
సర్వమును తెలిసిన ఓ తండ్రీ! నీవు సర్వజగన్నాథుడవు. నేను నిన్ను ప్రశ్నించుచున్నాను. నాకీ విషయమునంతను వివరముగా బోధించు ము. నీవు బోధించినచో, నాకు తప్పక తెలియగలదు.
బ్రహ్మ ఇట్లు పలికెను: కుమారా! నీకు జీవులయందు గల ప్రేమ చాల గొప్పది. అందువలననే, నీవీ ప్రశ్నను వేసితివి. నీ ఈ సందేహము చాల బాగున్నది. ఏలయనగా, ప్రసన్నమగు మనస్సు గల నీవు వేసిన ప్రశ్న మూలకముగా నాకు పరమేశ్వరుని స్వరూపమును నిరూపించే ప్రేరణ లభించినది.
కుమారా! నాకంటే ఉత్కృష్టమగు తత్త్వమును గురించి తెలియని నీవు నన్ను సర్వభూతేశ్వరునిగా వర్ణించి చెప్పిన వచనములు పూర్తిగా అస త్యములు కావు. ఏలయనగా, నాలో అంతటి సామర్థ్యము నిశ్చయముగా ఉన్నది సుమా!
ఏ విధముగానైతే సూర్యచంద్రులు, అగ్ని, నక్షత్రములు, గ్రహము లు, పారామండలములు (రాశులు) స్వయంప్రకాశస్వరూపుడగు ఆ పరమే శ్వరుని ప్రకాశముచే మాత్రమే ప్రకాశించుచున్నవో, అదే విధముగా నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింప జేయబడిన జగత్తును మాత్రమే ప్రక టింప జేయుచున్నాను.
జయింప శక్యము కాని ఆ పరమేశ్వరుని మాయచే మోహితులైన నీవంటి వారు నేను జగత్తునకు తండ్రినని పొరపడుచున్నారు. సర్వజగత్తు ప్రకాశస్వరూపుడగు ఆయనయందు మాత్రమే ఉనికిని కలిగి యున్నది (వాసుదేవుడు). ఈశ్వరభావము, రక్షించే సామర్థ్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు ఆయనయందు పూర్ణముగా నున్నవి (భగవానుడు), అట్టి పరమేశ్వరుని మేము నమస్కరించి ధ్యానించుచున్నాము.
ఈ మాయాదేవి భగవానుని కన్నుల యెదుట నిలబడుటకైననూ సిగ్గు పడును. అనగా, మాయాదేవి ఆయనను సుతరాము మోహింప జేయలేదు. కాని, ఆమెచే మోహింప జేయబడిన జనులు అజ్ఞానముచే కప్పబడిన బుద్ధి గలవారై, ఇది నాది, ఇది నేను అని బడాయిలు పలుకు చుందురు.
ఓ మహర్షీ! ద్రవ్యము గాని, కాలము గాని, క్రియ గాని, అవిద్య గాని, జీవుడు గాని వాసుదేవుని కంటే భిన్నముగా మరియొక వస్తువు ఏదీ యథార్థముగా లేదు.
వేదములు నారాయణుని మాత్రమే ప్రతిపాదించుచున్నవి. దేవతలు నారాయణుని విరాడ్రూపములో అంగములై యున్నారు. లోకములు నారయణుని యందు మాత్రమే ఉనికిని కలిగి యున్నవి. యజ్ఞములలో ఆరాధింపబడేది నారాయణుడే.
సాష్టాంగయోగముయొక్క చరమలక్ష్యము నారాయణుడే. తపస్సు నకు ప్రయోజనము నారాయణుని అనుగ్రహమే. బ్రహ్మజ్ఞానముచే తేలి తత్త్వము నారాయణుడే. సమస్తములగు సాధనసాధ్యములు నారాయణునియందు మాత్రమే పర్యవసానమును చెందుచున్నవి.
నన్ను సృష్టించినది ఆ శ్రీహరియే. ఆయన సకలప్రాణులలో ద్రష్ఠ రూపముగా నుండియు సకలజగన్నాథుడు. ఆయన నిర్వికారుడే అయిన, సకలమునకు ఆత్మరూపుడు. ఈ సకలసృష్టి ఆయనకు సంబంధించిన దియే. ఆయనయొక్క సంకల్పమాత్రముచే ప్రేరితుడనైన నేను దీనిని సృష్టించుచున్నాను.
గుణాతీతుడు, సర్వశక్తిమంతుడు అగు పరమేశ్వరుడు మాయ ఉపాధిగా గలవాడై, రజస్సు, సత్త్వము మరియు తమస్సు అనే మూడు గుణములను స్వేచ్ఛగా స్వీకరించి, క్రమముగా జగత్తుయొక్క సృష్టి, పాల నము మరియు ఉపసంహారము అనే కార్యములను నెరవేర్చును.
ఈ లోకములో వివిధపదార్థములు గలవు. వాటికి మూలము ప్రకృ తియొక్క తమోగుణము. ఆ పదార్థములయందు వచ్చే కదలికలు (క్రియలు) రజోగుణపరిణామములు. వాటి జ్ఞానమునకు ఆధారము సత్త్వగుణ ము. అవిద్యకు వశుడై నిత్యముక్తుడే అయిననూ బద్దుని వలె భాసించే చేత నపురుషుని (జీవుని) ఈ మూడు గుణములు దేహేంద్రియసంఘాతము నకు మరియు కర్తృత్వాభిమానముతో నిండియున్న బుద్ధికి కట్టి వేయుచున్నవి.
ఓ మహర్షీ! ఈ మూడు గుణముల ఉపాధులు ఆ పరమేశ్వరుని శుద్ధచైతన్యస్వరూపమును కప్పివేయును. కావుననే, ఆయన స్వరూపము తేలికగా తెలియబడుట లేదు. కేవలము జితేంద్రియులైన ఆయన భక్తులు మాత్రమే ఆ స్వరూపమును సాక్షాత్కరించు కొనుచున్నారు. అట్టి ఆ శ్రీహరి భగవానుడే నాతో సహా అందరికీ ప్రభుడు.
మాయను వశము చేసుకొని యున్న పరమేశ్వరుడు తన మాయ ద్వారా వివిధరూపములలో ప్రకటము కాగోరి, తనయందు తన ఇచ్చచే లీనమై యున్న కాలమును, వివిధజీవుల కర్మాశయములను, వారి వారి స్వభాపము (అవిద్య) ను సృష్టి హేతువులుగా గైకొనెను.
దేశకాలాది పరిచ్చేదములు లేని పరబ్రహ్మ చైతన్యము అధిష్టాన ముగా గల కాలము ప్రకృతియందలి సత్త్వరజస్తమోగుణముల సామ్యావస్థ యందు వైషమ్యమును కలిగించగా, చైతన్యాధిష్ఠితమగు ఆ ప్రకృతియందు రూపాంతర పరివర్తనము ఆరంభమై, సకలప్రాణిని ధారణమగు కర్మాశయమునుండి మహత్తత్త్వము ప్రకటమయ్యెను.
సత్త్వరజోగుణములు ప్రధానముగా కలిగి వాటిచే వర్ధిల్లజేయబడి వికారమును పొందుతున్న మహత్తత్త్వమునుండి తమోగుణప్రధానమగు తత్త్వము ప్రకటమయ్యెను. అది మరల ద్రవ్య-జ్ఞాన-క్రియారూపములుగా వికారమును పొందెను.
తెలుసుకునే సామర్థ్యము గల ఓ నారదా! ఆ అహంకారములో వివిధరూపములుగా పరిణమించే శక్తులు గల సాత్త్విక, రాజస, తామస ములు అనే మూడు భేదములు గలవు. వాటిలో మొదటిది అంతఃకరణరూ పముగను, రెండవది కర్మేంద్రియరూపముగను, మూడవది పంచమహాభుతముల రూపములోనికి పరిణమించినవి.
తామసాహంకారము వికారమును చెంది ఆకాశము ప్రకటమయ్యెను శబ్దము మరియు గుణము అగుచున్నది. అదిగో ఏనుగు అని పలికినప్పుడు ఈ శబ్దము ఆ వ్యక్తి బుచిన దృశ్యపును మాత్రమే గాక, స్వరము ద్వారా ఆ వ్యక్తిని కూడ గుర్తు పట్టు టకు హేతువు అగుచుండును.
తరువాత ఆకాశము వికారమును చెంది స్పర్శగుణము గల వాయుపు ప్రకటమయ్యెను. వాయువు లోనికి దాని కారణమగు ఆకాశము కూడ అనువృత్తమగుటచే, దానియందు శబ్దగుణము కూడ గలదు. ప్రాణుల దేహధారణము, ఇంద్రియశక్తి, అంతఃకరణసామర్థ్యము మరియు శరీరబ లము పోయుమూలకములే.
పైన చెప్పిన విధముగా కొలకర్మస్వభావములకు లోబడి వికార మును పొందిన వాయువునుండి రూపస్పర్శ శబ్దగుణములు గల అగ్ని ప్రకటమయ్యెను.
అన్నీ వికారమును పొంది నీరు ప్రకటమయ్యెను. దానియందు కారణములగు ఆకోశ-వాయు-అగ్నులు అనువృత్తములగుటచే సంక్రమిం చిన శబ్దస్పర్శరూపములతో బాటు స్వీయమగు రసము అనే గుణము కూడ ఉన్నది.
నీరు ఏకారమును పొంది భూమి ప్రకటమయ్యెను. దానియందు రకములను ఆక్రోశ-పోయు-అగ్ని-జలముల గుణములగు శబ్దస్పర్శరూ పనసములతో బాటు స్వీయమగు గంధము కూడ గలదు.
సాత్త్వికాహంకారమునుండి చంద్రుడు (మనస్సునకు అధిష్ఠాన దేవత), దిగ్గేవత (శ్రోత్రము), వాయువు (త్వక్), సూర్యుడు (కన్ను), వరు ణుడు (జిహ్వ), అశ్వినీ దేవతలు (ప్రాణములు), అగ్ని (వాక్కు), ఇంద్రుడు (చేతులు), విష్ణువు (పాదములు), మిత్రుడు (విసర్జనేంద్రియము) మరియు ప్రజాపతి (జననేంద్రియము) అనే దేవతలు ప్రకటమైనారు.
తెలుసుకునే సామర్థ్యము గల బుద్ది, పనిని చేసే సామర్థ్యము గల ప్రాణము కూడ తైజసాహంకారముయొక్క కార్యములే. కావుననే, ఆ తైజ సాహంకారము వికారమును చెంది చెవి, చర్మము, ముక్కు, కన్ను మరియు నాలుక అనే అయిదు జ్ఞానేంద్రియములు, వాక్కు, చేతులు, జననేంద్రియము, కాళ్లు మరియు విసర్జనేంద్రియము అనే అయిదు కర్మేంద్రి యములు ప్రకటమైనవి.
బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడవగు ఓ నారదా! త్రిగుణాత్మికయగు ప్రకృ తినుండి పుట్టిన పంచభూతములు ఇంద్రియములు మరియు మనస్సు అనే పదార్థములు ఒక దానితో మరియొకటి కలియక పోవుటచే సమష్టి మరియు వ్యష్టి శరీరములను నిర్మించుటలో విఫలమైనవి. అపుడు అవి భగవంతుని శక్తిచే ప్రేరితములై ఒకదానితో మరియొకటి కలిసి, గుణప్రధానభావము (పంచభూతములలో ఒకటి ప్రధానమగు అంశము కాగా మిగిలినవి తక్కువ పాళ్లలోనుండుట) ను, కార్యకారణభావమును పొందినవై సమష్టి (విరాట్ పురుషుని బ్రహ్మాండదేహము) వ్యష్టి (జీవుల దేహములు) రూపమగు సృష్టిని చేసినవి.
ఆ బ్రహ్మాండము నిర్జీవముగా నీటిలో పడియుండెను. 12 సంవత్సరముల తరువాత, పరమేశ్వరుడు కాలము, ప్రాణుల మరియు స్వభావము అను వాటిని స్వీకరించిన వాడై దానిని ప్రాణము గల దానినిగా చేసెను.
విరాట్ పురుషురూపుడగు ఆ భగవానుడే ఆ బ్రహ్మ రథమును పగుల గొట్టుకొని, అనంతములగు తొడలు పాదములు నోళ్లు మరియు తలలు గలవాడై బయటకు వచ్చెను.
ఆ పరమేశ్వరునకు ఏడు క్రింది లోకములు మొలతో మొదలిడి క్రింది అవయవములనియు, పొత్తి కడుపుతో మొదలిడి ఏడు పై లోక ములు పై అవయవములనియు విద్వాంసులు ఉపాసించెదరు.
వేదాధ్యయనమును చేసే బ్రాహ్మణుడు పూర్ణుడగు ఈ పరమేశ్వ రుని ముఖము; ప్రజలను కాపాడే క్షత్రియులు బాహువులు; వణిజులు ఊరువులు; శూద్రులు పాదములు అని విద్వాంసులు ఉపాసించెదరు.
విరాడ్రూపుడగు ఈ పరమేశ్వరునియొక్క పాదములయందు భూలోకమును, నాభియందు అంతరిక్షమును, హృదయమునందు స్వర్గలో కమును, పక్షఃస్థలమునందు మహర్లోకమును ఉపాసించేదరు.
పరమేశ్వరుని కంఠమునందు జనలోకమును, స్తనద్వయము నందు తపోలోకమును, శిరస్సునందు సత్యలోకమును ఉపాసించెదరు. శాశ్వతమగు సత్యలోకము హిరణ్యగర్భుని (సృష్టికర్త) నివాసస్థానము.
ఆ పరమేశ్వరుని కటియందు అతలమును, ఊరువులయందు విత లమును, మోకాళ్లయందు బలియొక్క నివాసముచే పవిత్రమైన సుతలము ను, పిక్కలయందు తలాతలమును భావన చేయవలెను.
చీలమండలయందు మహాతలమును, ముంగాళ్లయందు రసాతల మును, అరికాలియందు పాతాళమును భావన చేయవలెను. ఈ విధముగా ఆ విరాట్పురుషుడు లోకములే దేహముగా గలవాడు.
విరాట్పురుషుని మరియొక విధముగా ఉపాసన చేయవచ్చును. ఆయన పాదములు భూలోకము, నాభి భువర్లోకము కాగా, శిరస్సు స్వర్గలోకము అగును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో అయిదవ అధ్యాయము ముగిసినది.
