శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము
4 - చతుర్థోధ్యాయః
సూత మహర్షి ఇట్లు పలికెను: వ్యాసపుత్రుడగు శుకమహర్షి ఆత్మ స్వరూపమును నిశ్చయించే వచనములను ఈ విధముగా బోధించేను. ఆయన బోధను అవగాహన చేసుకున్న ఉత్తరాకుమారుడగు పరీక్షిత్తు శుద్ధమగు తన అంతఃకరణమును శ్రీకృష్ణునిపై లగ్నము చేసెను.
దేహము భార్య, కొడుకులు, ఇళ్లు వాకిళ్లు , ఏనుగులు గుర్రములు మొదలగు పశుసంపద, ధనము, బంధువర్గము మరియు ఉపద్రవములు లేని రాజ్యాధికారము అను వాటియందు సర్వకాలములలో గట్టిగా నాటుకొనియుండే మమకారమును ఆ మహారాజు విడిచి పెట్టెను.
ఓ మహాత్ములారా! ఉదారశీలుడగు పరీక్షిన్మహారాజునకు శ్రీకృష్ణ భగవానుని మహిమను గురించి వినుటయందు శ్రద్ద గలదు, ఆయన వాసు దేవభగవానునియందు పరమప్రేమ రూపమగు దృఢభక్తి గలవాడు. ఆయన తనకు మృత్యువు సమీపించినదని తెలుసుకొని, ధర్మ-అర్థ-కామ ములు అనే త్రివర్గమునకు సంబంధించిన (ఇహపరలోకసుఖములకు సంబంధించిన) కర్మలను పరిత్యజించి, శుకమహర్షిని మీరు నన్ను ప్రశ్నిం చిన విధముగనే ప్రశ్నించినాడు.
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను: ఓ పవిత్రమూర్తీ! శుకమహర్షీ! సర్వజ్ఞుడవగు నీ వచనములు చాల బాగున్నవి. నీవు శ్రీహరియొక్క గాథ లను చెప్పుచుండగా, నా అజ్ఞానము పటాపంచలగు చున్నది.
సర్వవ్యాపకుడగు భగవానుడు తన మాయాశక్తిచే లోకపాలకుల ఊహలకైననూ అందని ఈ విశాలవిశ్వమును ఏ విధముగా సృష్టించి, పొలీంచి పోషించి, మరల ఉపసంహరించుచున్నాడు? పలువిధముల శక్తితో కూడియున్న ఆ పరమపురుషుడు తనను బ్రహ్మ మొదలగు రూప ములలో ప్రకటించుకొని క్రీడిస్తూ, వారిచే క్రీడింప జేయుచూ వివిధచేష్టలను చేయుచున్నాడు. ఏయే శక్తులను ఉపాధిగా చేసుకొని ఆయన ఇట్లు చేయు చున్నాడు? ఈ వివరములను నేను మరల విస్తారముగా తెలియ గోరుచు న్నాను.
ఓ మహర్షీ! అద్భుతమగు లీలలు గల శ్రీహరిభగవానుని చేష్ట లను విద్వాంసులైననూ ఈహించలేరని నాకు తోచుచున్నది. ఇది నా నిశ్చ యము.
అద్వయపరబ్రహ్మము మాయాశక్తియొక్క మూడు గుణములను ఏకకాలములో గ్రహించి గాని, లేదా వాటిని క్రమముగా స్వీకరించి గాని, బ్రహ్మ మొదలగు అనేక రూపములను దాల్చి, లేదా వివిధములగు అవతా రములను దాల్చి, అనేకకర్మలను చేయుచున్నాడు. ఈ విధముగా త్రిగుణా త్మకమగు ప్రకృతియొక్క ఉపాధిని పరమపురుషుడగు శ్రీహరి స్వీకరించే విధానమెట్టిది?
నాకు ఈ విషయములలో సందేహము గలదు. కావున, పూజ్యులగు మీరు నా ఈ సందేహములను తీర్చుడు. మీరు శబ్దరూపములోనున్న పరమేశ్వరుడు, అనగా వేదమునందు విద్వాంసులగుట మాత్రమే గాక, బ్రహ్మజ్ఞానులు కూడా. కావున, నా సంశయములను నివారించ గలరు.
సూతమహర్షి ఇట్లు పలికెను: ఈ విధముగా శ్రీహరియొక్క గుణ ములను వర్ణించి చెప్పడని పరీక్షిన్మహారాజు ప్రార్థించగా, శుకమహర్షి ఇంద్రియాధిపతియగు పరమేశ్వరుని స్మరించి, చెప్పుటకు మొదలిడెను.
అనంతమహిమాన్వితుడు, జగత్తును సృష్టించి పాలించి ఉపసం హరించుట అనే లీల కొరకై క్రమముగా రజస్సు, సత్త్వము, తమస్సు అనే మాయాశక్తిగుణములను ఉపాధిగా స్వీకరించువాడు, సకలప్రాణులయందు అంతర్యామియై ఉండువాడు, ఇంద్రియములకు గోచరము కాని స్వరూపము గలవాడు, ప్రకృతికి అతీతమైన చేతనస్వరూపుడు అగు శ్రీహరికి నమస్కారము.
సత్పురుషుల దుఃఖమును పోగొట్టువాడు, దుష్టుల ప్రాపంచికాభి వృద్ధిని అరికట్టి వారిని సంహరించి మోక్షమునిచ్చువాడు, సకలప్రాణుల రూపములోనున్నవాడు, సర్వకర్మసన్న్యాసపూర్వకమగు ఆత్మజ్ఞాననిష్ఠ యందు నెలకొనియున్న సన్న్యాసులకు వారు నిత్యము వేదికే పరమాత్మ సాక్షాత్కారముననుగ్రహించువాడు అగు శ్రీహరికి మరల నమస్కారము.
యాదవులలో శ్రేష్ఠుడగు (భక్తులకు కౌనవ్రతమునిచ్చే) శ్రీకృష్ణ భగవానునకు నమస్కరము గాక! భక్తిహీనులకు నీ కాలమునందైననూ ఆయన నీడ కూడ దగ్గరకు రాదు. ఆయనతో సమానము గాని, అధికము గాని అగు తేజస్సు (ఈశ్వరభావము) లేదు. తన పరబ్రహ్మ స్వరూప మునందు రమించే ఆ శ్రీహరికి పలుమార్లు నమస్కారము అగుగాక!
శ్రీహరిని కీర్తించుట, స్మరించుట, దర్శించుట, నమస్కరించుట, ఆయన గురించి వినుట, ఆయనను పూజించుట వలన మానవుని పాపములు వెనువెంటనే నశించును. పరమమంగళకరమగు కీర్తి గల అట్టి శ్రీహ రికి అనేక నమస్కారములు.
వివేకవంతులు శ్రీహరియొక్క పాదపద్మములను సేవించి, తద్ద్వారా మనస్సునకు ఇహపరలోకముల భోగములయందు గల ఆసక్తిని అతిక్రమించి, ప్రయాస లేకుండగనే బ్రహ్మీభూతులగుదురు. అట్టి పరము మంగళకరమగు కీర్తిగల శ్రీహరికి అనేక నమస్కారములు.
తపశ్శాలురు గానీ, దానశీలురు గాని, ప్రజాహీతకార్యములను చేసి కీర్తిని సంపాదించిన వారు గాని, మనోనిగ్రహము గల యోగులు గానీ, మంత్రవేత్తలు గాని, ఇతరులగు సదాచారపరులు గానీ, తమ తమ తపస్సు మొదలగు సాధనలను శ్రీహరికి సమర్పించనిదే, వాటి పరమఫలమును పొందజాలరు. అట్టి పరమమంగళకరమగు కీర్తి గల శ్రీహరికి అనేకనమ స్కారములు.
కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కసులు, ఆభీ రులు, కంకులు, యవనులు, ఖసులు మొదలగు సర్వదేశముల జనులు మాత్రమే గాక, పాపాత్ములగు జనులు కూడ శ్రీహరియొక్క భక్తులను ఆశ్ర యించి పరిశుద్ధులగుచున్నారు. అట్టి సర్వశక్తిమంతుడగు శ్రీహరికి అనేక నమస్కారములు.
ఆత్మజ్ఞానులు శ్రీహరినీ ఆత్మరూపముగా, వైదికులు వేదరూప మునిగా, ఛార్మికులు ధర్మరూపముగా, తపశ్శాలురు తపోమూర్తిగా ఆరాధించెదరు. సర్వజగన్నాథుడు ఆ శ్రీ హరియొక్క స్వరూపమును శుద్ధమగు అంతఃకరణములతో బ్రహ్మరుద్రాది దేవతలు కూడ ఆశ్చర్యచకితులై దర్శిం చేదరు. అట్టి శ్రీహరీ భగవానుడు మాపై ప్రసన్నుడగు గాక!
లక్ష్మీపతి, సమస్త సంపదలకు అధిపతి, యజ్ఞములకు ప్రభువు (ఫ లదాత), సృష్టికర్త (ప్రజలను పాలించువాడు), బుద్దివృత్తులను అంతర్యామి రూపముగా ప్రేరేపించు వాడు, ముల్లోకములకు నాథుడు, భూదేవికి భర్త (భూలోకమును రక్షించువాడు), అంధకులు వృష్ణులు మరియు యాద వులు అనే తెగల జనసముదాయములను పాలించి రక్షించువాడు, సత్పు రుషులకు రక్షకుడు అగు శ్రీహరి భగవానుడు నాపై ప్రసన్నుడగు గాక!
విద్వాంసులు ఆ పరమేశ్వరుని పాదపద్మములపై మనస్సును లగ్నము చేసి ధ్యానించి, తద్ద్వారా తమ అంతఃకరణమును శుద్దము చేసు కొని, దానియందు ఆత్మస్వరూపుడగు ఆ భగవానుని తత్త్వమును దర్శిం చి, తరువాత దానిని తమ తమ అభిరుచులకు అనురూపముగా నిర్గుణసగు ణభేదములతో నిరూపించుచుందురు. మోక్ష ప్రదాతయగు అట్టి శ్రీహరి భగవానుడు నాపై ప్రసన్నుడగు గాక!
పూర్వము కల్పముయొక్క ఆరంభములో శ్రీహరి బ్రహ్మయొక్క బుద్ధియందు పూర్వకల్పమునకు సంబంధించిన సృష్టివిషయమైన చక్కని స్మృతిని కలిగించగా, అపుడాయన ముఖమునుండి శిక్ష మొదలగు అంగ ములతో కూడియున్న వేదమాత ఆవిర్భవించెను. ఈ విధముగా జ్ఞానదాత లలో అగ్రేసరుడగు శ్రీహరి నాపై ప్రసన్నుడగు గాక!
సర్వశక్తిమంతుడు, పూర్ణుడు అగు పరమేశ్వరుడు పృథివి, జల ము, అగ్ని, వాయువు, ఆకాశము అనే అయిదు మహాభూతములతో ఈ దేహములను నిర్మించి, వాటియందు అంతర్యామి రూపుడై నివసించుచు న్నాడు. అట్టి ప్రత్యగాత్మరూపుడగు భగవానుడు అయిదు జ్ఞానేంద్రియ ములు (ముక్కు, నాలుక, కన్ను, చర్మము, చెవి), అయిదు కర్మేంద్రియ ములు (వాక్-పాణి-పాద-పాయు-ఉపస్థ), అంతఃకరణము, అయిదు ప్రాణ వృత్తులు (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన) వెరసి పదునారు కళలతో కూడినవాడై వాటికి సంబంధించిన పదునారు విషయములను భోగించుచు న్నాడు. అట్టి భగవానుడు నా వాక్కులకు మాధుర్యము మొదలగు గుణ ములను కలిగించి అలంకరించు గాక!
భక్తులు వ్యాసభగవానుని ముఖపద్మమునుండి లభించిన జ్ఞానా మృతమును గ్రోలుచున్నారు. ఆయన అపరిమితమగు తేజస్సు గలవాడు. పూజ్యుడగు అట్టి వ్యాసమహర్షికి నమస్కారము.
ఓ మహారాజా! పుట్టుక తోడనే వేదముల జ్ఞానమును పొందిన (వేదములకు నిధానమగు) బ్రహ్మగారికి దీనిని సాక్షాత్తుగా శ్రీహరి బోధించే ను. అపుడాయన ఆ జ్ఞానమును తనను ప్రశ్నించిన నారదునకు చెప్పెను. దానినే నేను నీకు చెప్పుచున్నాను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో నాల్గవ అధ్యాయము ముగిసినది.
