216 - బలివైశ్వదేవ నిరూపణం

ఇపుడు వైశ్యదేవహామవిధిని బోధిస్తాను. ముందు అగ్నిని రగిల్చి ఓం కవ్యాదమగ్ని.... ఇత్యాది మంత్రాలతో హవ్యాంశాలను కొన్నిటిని అగ్నిలో వ్రేల్చాలి. తరువాత ఓం పావకవైశ్వానర... అనే మంత్రంతో అగ్నిని ఆవాహన చేసి ఈ క్రింది మంత్రాలతో ఆహుతులనివ్వాలి.

ఓం ప్రజాపతయే స్వాహా                     ఓం ఓషధివనస్పతిభ్యః స్వాహా  ।             ఓం సోమాయ స్వాహా  ।                       ఓం గృహ్యాయ స్వాహా  ।                    ఓం బృహస్పతయే స్వాహా  ।                           ఓం దేవదేవతా భ్యః స్వాహా                  ఓం అగ్నిహోమాభ్యాం స్వాహా  ।                   ఓం ఇంద్రాయ స్వాహా  ।                       ఓం ఇంద్రాగ్ని భ్యాం స్వాహా                 ఓం ఇంద్ర పురుషేభ్యః స్వాహా  ।                  ఓం ద్యావా పృథివీభ్యాం స్వాహా             ఓం యమాయ స్వాహా  ।                      ఓం ఇంద్రాయ స్వాహా  ।                        ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా                ఓం యమపురుషాయ స్వాహా  ।    ఓం సర్వేభ్యో భూతేభ్యో దివాచారిభ్యః స్వాహా

ఓం బ్రహ్మణే స్వాహా  ।                                   ఓం అద్ భ్యఃస్వాహా                                    ఓం వసుధా పితృభ్యః స్వాహా  ।

తరువాత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దాని ద్వారా బలి, పుష్టిలను కోరుతూ ప్రార్థించాలి.

ఓం యే భూతాః ప్రచరంతి దీనాశ్చ

నిమిహంతో భువనస్య మధ్యే  ।

తేభ్యో బలిం పుష్టి కామో

దదామీమయి పుష్టిం పుష్టి పతిర్దధాతు  ॥

చివరగా ఓం ఆచాండాల పతిత వాయ సేభ్యోనమః అనే మంత్రం ద్వారా కూడా కాకి మున్నగు వాటికి బదులివ్వాలి.